భారత్‌లో ఆన్‌లైన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కోవిడ్ కారణంగా ఆన్‌లైన్‌లో ఒక్క క్లిక్‌తో అన్నీ ఇంటికి తెచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ కామర్స్ కంపెనీలకు వరంగా మారి.. భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా అవతరించింది. ఇటీవల లండన్ అండ్ పార్ట్‌నర్స్ అనాలసిస్ ఆఫ్ డీల్‌రూం.కో ఇన్వెస్ట్‌మెంట్ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. దేశంలో ఆన్‌లైన్ షాపింగ్ 175శాతం పెరిగి 2020లో 8 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్ 2021లో 22 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపింది.
గతేడాది వరల్డ్ వైడ్‌గా డిజిటల్ షాపింగ్‌లో అమెరికా తర్వాత భారత్ గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా పేరు సంపాదించింది. 51 బిలియన్ డాలర్లతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, భారత్ 22 బిలియన్ డాలర్లు, చైనా 14 బిలియన్ డాలర్లు , బ్రిటన్ 7 బిలియన్ డాలర్లతో వరుస స్థానాల్ని దక్కించుకున్నాయి.
ఇక దేశీయంగా 14 బిలియన్ డాలర్ల వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా బెంగళూరు, 7వ స్థానంలో గురుగ్రామ్, 10వ స్థానంలో ముంబై నిలిచాయి. గురుగ్రామ్ 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను, ముంబై 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పొందాయి. వరల్డ్ వైడ్‌గా టాప్-5లో బెంగళూరు తర్వాత న్యూయార్క్ సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కో, లండన్, బెర్లిన్ నగరాలున్నాయి.
చదవండి: ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.50 వేల యాపిల్ ఐఫోన్ రూ.10 వేలకే..!
Comments
Please login to add a commentAdd a comment