న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో కొనుగోళ్లను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మారుస్తామని కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తెలిపారు. వినియోగదారులకు ఆన్‌లైన్ షాపింగ్ పరంగా ఎదురవుతున్న సమస్యల విషయమై ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్లమెంటులో వినియోగదారుల పరిరక్షణ బిల్లు ఆమోదం అనంతరం ఈ కామర్స్ నియంత్రణకు సమగ్రమైన నిబంధనలను తీసుకొస్తామని ఆయన చెప్పారు.
‘‘సాధారణ షాపింగ్ పరంగా లేని సమస్యలు ఆన్‌లైన్ వినియోగదారులకు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అంశం’’ అని రామ్‌విలాస్ పాశ్వాన్ అన్నారు. డిజిటల్ చెల్లింపులు, తదితర అంశాల పట్ల వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ, టెక్నాలజీ శాఖలు ఉమ్మడిగా కృషి చేస్తున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment