Ramvilas Paswan
-
నా గుండె చీల్చి చూడండి: చిరాగ్ పాశ్వాన్
పట్నా: బీజేపీతో కలిసి బిహార్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయటమే తనకున్న ఏకైక లక్ష్యమని లోక్‌జనశక్తి (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఆ పార్టీ నాయకుల మాటలు తనను బాధిస్తున్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోయినా ఎన్నికల్లో విజయం సాధించగల సత్తా తమకు ఉందని పేర్కొన్నారు. మోదీ రాముడైతే, తాను హనుమంతుడి లాంటివాడినని, ఆయన ఆశీసులు తనకు ఎప్పుడూ ఉంటాయంటూ అభిమానం చాటుకున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, దివంగత కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీతో స్నేహం కొనసాగిస్తూనే, జేడీ(యూ) అభ్యర్థులపై ఎల్జేపీని బరిలోకి దింపి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ఢీకొట్టేందుకు ఈ యువనేత సిద్ధమయ్యారు. (చదవండి: పాశ్వాన్ మృతి: కుమారుడికి కష్టాలు..!) తప్పుదోవ పట్టించొద్దు ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్‌కు చెక్ పెట్టేందుకే, బీజేపీ అతడిని అస్త్రంగా వాడుకుంటోందన్న సందేహాలు తలెత్తాయి. దీంతో జేడీయూ నేతల నుంచి ఇదే తరహా అనుమానాలు వ్యక్తం కావడం సహా, సీఎంపై చిరాగ్ తీవ్ర విమర్శల నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, బీజేపీ నేత భూపీందర్ యాదవ్ తదితరులు శుక్రవారం ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఆయన ఓ ప్రత్యేక దారిని ఎంచుకున్నారు. అంతేకాదు బీజేపీ సీనియర్ లీడర్ల పేర్లను ప్రస్తావిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మాకు బీ, సీ వంటి టీంలు ఏమీలేవు. ఎన్డీయేకు నాలుగింట మూడు వంతుల మెజారిటీ సాధిస్తుంది. చిరాగ్ పార్టీ కేవలం ఓట్లు చీల్చే పార్టీగానే మిగిలిపోతుంది’’అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫొటో వాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.(ఇది నాన్న చిరకాల కోరిక: చిరాగ్ పాశ్వన్) నా గుండెను చీల్చి చూడండి ఈ విషయంపై స్పందించిన చిరాగ్..‘‘నాకు ప్రధాని మోదీ ఫొటోలు అక్కర్లేదు. ఆయన నా గుండెల్లో ఉన్నారు. రాముడికి హనుమంతుడు ఎలాగో, ఆయనకు నేనూ.. అలాగే. మీరు గుండెను చీల్చి చేస్తూ అందులో మోదీజీ కనబడతారు’’అని చెప్పుకొచ్చారు. సీఎం నితీశ్ జీకే ఆయన ఫొటోల అవసరం ఎక్కువగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఇక తన తండ్రి మరణం తర్వాత జరిగిన పరిణామాల గురించి చిరాగ్ మాట్లాడుతూ.. ‘‘ నాన్న భౌతిక కాయాన్ని ఢిల్లీ నుంచి పట్నాకు తీసుకువచ్చిన సమయంలో నితీశ్ కుమార్, ఎయిర్‌పోర్టుకు వచ్చి నివాళులు అర్పించారు. అప్పుడు నేను ఆయన పాదాలకు నమస్కరించాను. కానీ ఆయన నన్ను పట్టించుకోలేదు. అక్కడున్న వాళ్లంతా ఈ విషయాన్ని గమనించారు. అంతేకాదు మా అమ్మనుగానీ, నన్ను గానీ కనీసం పరామర్శించలేదు. రాజకీయ విభేదాలు ఉన్నంత మాత్రాన ఇలా ప్రవర్తిస్తారా? ఆయన ప్రవర్తకు నన్ను షాక్‌కు గురిచేసింది. కానీ ప్రధాని మోదీ అలా కాదు. నాన్న చనిపోయిన తర్వాత నన్ను పరామర్శించారు. నా భుజం తట్టి, మేమంతా ఉన్నామనే భరోసా ఇచ్చారు’’అని పేర్కొన్నారు. -
బారులు తీరిన పౌరులు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇచ్చిన మూడు వారాల దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటన కొన్నిచోట్ల ప్రజలు కిరాణా కొట్ల ముందు బారులు తీరేలా చేసింది. దేశం మొత్తమ్మీద కోవిడ్ బాధితుల సంఖ్య బుధవారానికి 612 దాటిపోగా, పది మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 40 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో మరో వ్యక్తి కోవిడ్‌కు బలికాగా, తమిళనాడులో బుధవారం తొలి కరోనా మరణం నమోదైంది. మంగళవారం ఢిల్లీలో ఒక వ్యక్తి ఇతర కారణాల వల్ల మరణించినా కోవిడ్ మరణాల జాబితాలో చేర్చారు. తాజాగా ఈ తప్పును సవరించడంతో మొత్తం మరణాల సంఖ్య పది అయ్యింది. లాక్డౌన్ సమయంలో నిత్యావసరాల కొరత లేకుండా చూసేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పష్టం చేయగా.. మందులు, నిత్యావసరాలను అమ్మే దుకాణాలు లాక్డౌన్ సమయంలోనూ తెరిచే ఉంటాయని మంత్రి జవడేకర్ తెలిపారు. మిలటరీ ఆసుపత్రులు సిద్ధం ఆర్మీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీతోపాటు కేంద్ర పారామిలటరీ దళాలకు చెందిన 32 ఆసుపత్రులను కోవిడ్ చికిత్స కోసం కేంద్రం సిద్ధంచేస్తోంది. వీటిద్వారా సుమారు 2000 వరకూ పడకలు అందుబాటులోకి రానుండగా హిమాచల్ ప్రదేశ్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రెండు వేల గదులను ఐసోలేషన్ కేంద్రంగా మార్చేందుకు హమీర్పూర్ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేపట్టిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆసుపత్రులు గ్రేటర్ నోయిడా, హైదరాబాద్, గువాహటి, జమ్మూ, గ్వాలియర్‌లోని టేకన్పూర్, డిమాపూర్, ఇంఫాల్, నాగ్‌పూర్, సిల్చార్, భోపాల్, అవడి, జోధ్‌పూర్, కోల్‌కతా, పుణె, బెంగళూరులతోపాటు కొన్ని ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇతర రోగాలతో వచ్చే రోగులను చేర్చుకోవడాన్ని నిలిపివేయగా పరిస్థితి చక్కబడ్డ వారిని డిశ్చార్జ్ చేస్తూ ఐసోలేషన్ కేంద్రం కోసం వీలైనన్ని పడకలను అందుబాటులోకి తెస్తున్నారు. మందులు నిత్యావసర దుకాణాలు తెరిచే ఉంటాయి : జవదేకర్ మూడు వారాల లాక్డౌన్ సమయంలోనూ దేశం మొత్తమ్మీద నిత్యావసర, మందుల దుకాణాలు తెరిచే ఉంటాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని, బ్లాక్‌మార్కెటింగ్ చేసేవారిపై, అక్రమంగా నిల్వ చేసే వారిని కట్టడి చేసేందుకు తగిన చట్టాలు ఉన్నాయని అన్నారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేకరులకు వివరించారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా, ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు కేంద్రం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. హౌసింగ్ సొసైటీలు కొన్ని వైద్యులను, జర్నలిస్టులను ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా చెప్పడం ఏమాత్రం సరికాదని మంత్రి స్పష్టం చేశారు. సమాజం పరిస్థితులను అర్థం చేసుకోవాలని అన్నారు. స్వస్థత చేకూరిన వారికి స్వాగతం పుణేలో బుధవారం ఒక హృద్యమైన సంఘటన చోటు చేసుకుంది. కోవిడ్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స తరువాత స్వస్థత చేకూరిన దంపతులను వారు నివాసముండే హౌసింగ్ సొసైటీ సాదరంగా స్వాగతం పలికింది. సిన్హ్గఢ్ రోడ్డులో ఉండే ఈ సొసైటీలోని కుటుంబాలన్నీ బాల్కనీల్లో నుంచుని చప్పట్లతో ప్లేట్లతో శబ్దాలు చేస్తూ 51 ఏళ్ల పురుషుడు, 43 ఏళ్ల మహిళకు స్వాగతం పలికారు. కోవిడ్ పరిస్థితి స్థూలంగా.. దేశం మొత్తమ్మీద బుధవారం ఉదయం నాటికి మొత్తం 612 కోవిడ్ కేసులు ఉన్నాయి. కేరళలో అత్యధికంగా 109 కేసులు ఉండగా ఇందులో ఎనిమిది మంది విదేశీయులు ఉన్నారు. మహారాష్ట్రలో ముగ్గురు విదేశీయులు సహా 116 కేసులు ఉన్నాయి. కర్ణాటకలో 41 మంది కోవిడ్ బాధితులు ఉంటే. తెలంగాణలో ఈ సంఖ్య 35 (10 మంది విదేశీయులు)గా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 35 మంది కరోనా బారిన పడ్డారు. ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 31 కాగా. తమిళనాడులో 18, బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది మంది చొప్పున కోవిడ్ బారిన పడ్డారు. -
పసిడి నగలకు ‘హాల్‌మార్క్’
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ఆభరణాలు, బంగారంతో చేసిన కళాకృతులకు హాల్ మార్కింగ్ ధ్రువీకరణను 2021 జనవరి 15 నుంచి తప్పనిసరి చేయనున్నట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ శుక్రవారం ప్రకటించారు. ‘‘ఇందుకు సంబంధించి రాబోయే జనవరి 15న నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఆభరణాల వ్యాపారులు తమ వద్దనున్న హాల్‌మార్క్‌లేని ఆభరణాలను పూర్తిగా ఖాళీ చేసుకునేందుకు ఏడాది పాటు సమయం ఉంటుంది’’ అని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో నగల వర్తకులు భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) వద్ద తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుని, హాల్‌మార్క్‌తో కూడిన ఆభరణాలనే విక్రయించాల్సి ఉంటుందన్నారు. ‘‘విలువైన పసిడి విషయంలో స్వచ్ఛతకు హామీనివ్వడమే మా లక్ష్యం. చిన్న పట్టణాలు, గ్రామాల్లోని వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం’’ అని వివరించారు. 2000 ఏప్రిల్ నుంచి బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్‌ను ధ్రువీకరించే పథకాన్ని బీఐఎస్ ఆచరణలోకి తీసుకొచ్చింది. కాకపోతే తప్పనిసరి చేయలేదు. దీంతో ప్రస్తుత ఆభరణాల్లో 40 శాతమే హాల్‌మార్క్‌వి ఉంటున్నాయి. ఇప్పటికే వినియోగంలో ఉన్న ఆభరణాల జోలికి తాము వెళ్లబోమని మంత్రి పాశ్వాన్ స్పష్టం చేశారు. హాల్‌మార్కింగ్ తప్పనిసరికి సంబంధించిన ముసాయిదా ఆదేశాలను అభిప్రాయాల కోసం ప్రపంచ వాణిజ్య మండలి (డబ్ల్యూటీవో) వెబ్సైట్లో అక్టోబర్ 10న ఉంచామని చెప్పారు. అభిప్రాయాలు తెలియజేసేందుకు 60 రోజుల గడువు ఉంటుందన్నారు. హాల్‌మార్కింగ్ మూడు రకాలు.. ఆభరణాల హాల్‌మార్కింగ్‌ను బీఎస్ఐ మూడు రకాలుగా వర్గీకరించింది. 14 కేరట్, 18 కేరట్, 22 కేరట్ ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. ఈ మూడు విభాగాల ధరలను ఆభరణాల విక్రేతలు తమ దుకాణాల్లో ప్రదర్శించడాన్ని కూడా తప్పనిసరి చేయనున్నట్టు పాశ్వాన్ తెలిపారు. బీఐఎస్ వద్ద నమోదైన ఆభరణాల వర్తకులు బీఐఎస్ లైసెన్స్ పొందిన అస్సేయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ కేంద్రాల నుంచి హాల్‌మార్క్ సర్టిఫికేషన్‌ను పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 234 జిల్లాల పరిధిలో 877 హాల్‌మార్కింగ్ కేంద్రాలు నడుస్తున్నాయి. 26,019 మంది జ్యువెలర్లు బీఐఎస్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కనీసం రూ.లక్ష నుంచి ఆభరణాల విలువకు గరిష్టంగా ఐదు రెట్ల వరకు జరిమానాతోపాటు, బీఐఎస్ చట్టం కింద ఏడాది వరకు జైలుశిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని బీఐఎస్ అధికారి ఒకరు తెలిపారు. అన్ని జిల్లాల్లో హాల్ మార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా వర్తకుల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తామని చెప్పారు. -
ఇద్దరు కూతుళ్లు.. తప్పు నాన్నా
తండ్రి పేరు రొనాల్డ్ ఫెంటీ. కూతురి పేరు రాబిన్ రిహానా ఫెంటీ. తండ్రికి ఎంటర్టైన్మెంట్ బిజినెస్ ఉంది. ‘ఫెంటీ ఎంటర్టైన్మెంట్’. కూతురికి బ్యూటీ బిజినెస్ ఉంది. ‘ఫెంటీ బ్యూటీ’. ఈ పేర్లు, బిజినెస్ పేర్లు అలా ఉంచితే.. రిహానాకు గాయనిగా, బిజినెస్ ఉమన్‌గా, దౌత్యవేత్తగా, డాన్సర్‌గా, పాటల రచయిత్రిగా మంచి పేరుంది. ఆ పేరు ఆమె ఫెంటీ బిజినెస్ బ్రాండ్ వాల్యూని అమాంతం పెంచేసింది. ఫెంటీ లిప్‌స్టిక్‌లు, ఫెంటీ లోదుస్తులు అంటే అమ్మాయిలకు పిచ్చి. ఫెంటీ అనే ఇంటి పేరు ఈ కూతురికి ఆ తండ్రి ఇచ్చిందే అయినా, తన ‘ఫెంటీ’ బ్రాండ్ పేరును తండ్రి అతడి ఎంటర్టైన్మెంట్ బిజినెస్‌కి వాడుకోవడం రిహానాకు నచ్చలేదు. ఆమెకు మాటైనా చెప్పకుండా, ఆమె పేరు చెప్పి కోటీ యాభై లక్షల డాలర్ల ‘టాలెంట్ హంట్’ టూర్ డీల్ కుదుర్చుకున్నాడు. ‘మా అమ్మాయి వచ్చి పెర్ఫార్మ్ చేస్తుంది’ అని మాట కూడా ఇచ్చేశాడు. ‘‘అదేంటి డాడీ..’’ అంటే, ‘‘రెండు బిజినెస్‌లూ మనవే కదమ్మా’’ అన్నాడు. రిహానాకు తండ్రి తీరు నచ్చలేదు. ‘‘ఇంటి పేరు మీరిచ్చిందే కావచ్చు. బ్రాండ్ పేరు నేను సంపాదించుకున్నది నాన్నా’’ అంది. అని ఊరుకుంటుందనే అనుకున్నాడు ఆ తండ్రి. కానీ ఆ కూతురు కోర్టుకు వెళ్లింది. తన తండ్రి తన బ్రాండ్ నేమ్‌ను వాడకుండా నిరోధించాలని రిహానా కేస్ ఫైల్ చేసింది. ఈ బార్బడోస్ గాయని ఆస్తుల ప్రస్తుత విలువ 26 కోట్ల డాలర్లు. ఆస్తుల విలువ ఎంతని కాదు, మనిషిగా మన విలువ ఎంతో అది ముఖ్యం అంటోంది రిహానా! ఇంకో అమ్మాయి పేరు ఆశ. ఆ అమ్మాయి తండ్రి పేరు రామ్ విలాస్ పాశ్వాన్. కేంద్ర మంత్రి. లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు. ఆ తండ్రికి వ్యతిరేకంగా ఈ కూతురు బిహార్ రాజధాని పాట్నాలో ధర్నాకు కూర్చుంది. ‘‘పాశ్వాన్ తక్షణం క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేసింది. నాన్న కదా అనుకోలేదు. ‘పాశ్వాన్’ అనే అనింది! ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు కొందరు మహిళలతో కలిసి వచ్చి లోక్ జనశక్తి పార్టీ ఆఫీసు బయట ఆశా బైఠాయించింది. ‘‘పాశ్వాన్.. క్షమాపణ చెప్పండి’’ అనే ప్లకార్డ్ ఆమె చేతిలో ఉంది. ఆర్జేడీ నాయకురాలు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని ‘అంగూఠా ఛాప్’ అని కామెంట్ చేశారు పాశ్వాన్. చదువులేని మనిషి అని అర్థం ఆ మాటకు. ఆ మాట నచ్చలేదు ఆశాకు. తండ్రి అనడం అసలే నచ్చలేదు. ‘‘ఇది ఒక మాజీ ముఖ్యమంత్రిని మాత్రమే అవమానించడం కాదు, నాతో సహా రాష్ట్రంలోని మహిళలందర్నీ అవమానించడమే’’ అని ఆశా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్ ఇస్తూ ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఆర్జేడీ పార్టీ వ్యతిరేకించింది. ‘‘వాళ్లకు నినాదాలివ్వడం, చదువురాని వాళ్లను ముఖ్యమంత్రిని చెయ్యడం మత్రమే తెలుసు’’ అని ఎవర్నీ పేరు పెట్టి అనకుండా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాశ్వాన్ విమర్శించారు. ‘‘ఇలా అనడం తప్పు. రబ్రీదేవికి పాశ్వాన్ క్షమాపణ చెప్పాలి’’ అన్నది ఆశా డిమాండ్. కూతురు డిమాండ్ చేసింది కదా అని పాశ్వానేమీ రబ్రీదేవికి అపాలజీ చెప్పలేదు. బహుశా ఆ వివాదం పార్టీ ఆఫీసు నుంచి పాశ్వాన్ ఇంటికి మరలి ఉండాలి. పాశ్వాన్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు. ఉష, ఆశ ఆయన మొదటి భార్య రాజ్‌కుమారి కూతుళ్లు. ఇంకో కూతురు ఈష, కొడుకు చిరాగ్ రెండో భార్య రీనా సంతానం. ఆశా భర్త అనిల్ సాధు. 2015లో బిహార్‌లోని బొచ్ఛాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లోక్ జన శక్తి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కొన్ని నెలలకు ఆర్జేడీలో చేరి, ఆ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అయ్యారు. లాలూ ప్రసాద్ అడిగితే కనుక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తన తండ్రిపై పోటీగా హాజీపూర్ బరిలో నిలిచేందుకు ఆశ సిద్ధంగా ఉన్నారు. గట్టి అమ్మాయే. -
‘న్యూటన్’ కంటే ముందే.. ఓ హీరో!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న బస్తర్ ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియ ఎలా జరిగిందనే అంశంపై తీసిన ‘న్యూటన్’ సినిమా గుర్తుంది కదా.. ఎన్ని కష్టాలొచ్చినా, చివరకు మావోయిస్టులు ఎదురైనా.. హీరో రాజ్ కుమార్ రావ్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా ఎన్నికలు నిర్వహించిన తీరుతో ఈ చిత్రం 2018 సంత్సరానికి భారత్ నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఇప్పుడెందుకు ఈ సంగతి అనేగా మీ అనుమానం.. సరిగ్గా ఇలాంటి ప్రయత్నమే 2013 ఎన్నికల సమయంలో దంతేవాడ జిల్లాలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన 24ఏళ్ల యువకుడు మంగల్ కుంజం కూడా ఇలాంటి ప్రయత్నమే చేశాడు. కానీ మవోయిస్టులు తీవ్రంగా హెచ్చరించి వదిలేయడంతో.. చావుతప్పి కన్నులొట్టబోయి సైలెంటయ్యాడు. 2013లోనూ ఇప్పటిలాగే మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అయితే కుంజం మాత్రం ఈ హెచ్చరికలను బేఖాతను చేస్తూ.. ఘమియాపల్ పంచాయతీ (20 తండాలు)లో ఊరూరా తిరిగి ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేశాడు. పోలీసులు రక్షణ కల్పిస్తామన్నా ఎవరూ ఓటేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ ప్రాతంలోని 68% నియోజకవర్గాల్లో ఒక్క ఓటు కూడా నమోదవలేదు. మిగిలిన చోట్ల 20 ఓట్ల కన్నా ఎక్కువ రాలేదు. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత కుంజంను స్థానిక దళ కమాండర్ పిలిపించి బెదిరించాడు. మరోసారి ఈ తప్పుచేయనని కుంజం బతిమాలుకోవడంతో.. తీవ్రంగా హెచ్చరించి వదిలిపెట్టాడు. నాటి ఘటనను కుంజం గుర్తుచేసుకుంటూ.. ‘పోలీసులు ఎన్నికల వరకే ఉంటారు. ఆ తర్వాత మా పరిస్థితేం కావాలి. అందుకే మావోయిస్టులు చెప్పినట్లుగా ఈసారి మేమెవరమూ ఓటేయబోం’ అని ఆవేదనగా చెప్పాడు. అక్కడ మాత్రమే బీజేపీతో దోస్తీ ! కేంద్రంలోని ఎన్డీయేలో లోక్ జన్‌శక్తి పార్టీ (ఎల్జేపీ) భాగస్వామిగా ఉంది. ఈ పార్టీ చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్ కీలకమైన వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ వ్యవస్థ వ్యవహారాలు చూస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల కోసం బిహార్‌లో కుదిరిన పొత్తుల్లోనూ ఈ పార్టీకి తగిన∙గౌరవం ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. అయితే అదంతా అక్కడి లెక్కేనని.. రాజస్తాన్‌లో మాత్రం తమ దారివేరని ఎల్జేపీ తేల్చేసింది. బీజేపీతో పొత్తుల విషయం తేలకపోవడంతో మొత్తం 200 సీట్లలో పోటీ చేస్తామని స్పష్టంచేసింది. బిహార్‌లో దళితులు, వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉన్న మూడు జిల్లాల్లో ఎల్జేపీకి మంచి పట్టుంది. అయితే ఈ దళితుల ఓట్లపైనే ఆధారపడి రాజస్తాన్‌లో పోటీచేయాలనేది ఈ పార్టీ ఆలోచన. అయితే.. దళితుల ఓట్లను చీల్చి బీజేపీకి మేలుచేయడమే పాశ్వాన్ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఆన్లైన్ కొనుగోళ్లను పారదర్శకం చేస్తాం
న్యూఢిల్లీ: ఆన్లైన్లో కొనుగోళ్లను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మారుస్తామని కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తెలిపారు. వినియోగదారులకు ఆన్లైన్ షాపింగ్ పరంగా ఎదురవుతున్న సమస్యల విషయమై ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్లమెంటులో వినియోగదారుల పరిరక్షణ బిల్లు ఆమోదం అనంతరం ఈ కామర్స్ నియంత్రణకు సమగ్రమైన నిబంధనలను తీసుకొస్తామని ఆయన చెప్పారు. ‘‘సాధారణ షాపింగ్ పరంగా లేని సమస్యలు ఆన్లైన్ వినియోగదారులకు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అంశం’’ అని రామ్‌విలాస్ పాశ్వాన్ అన్నారు. డిజిటల్ చెల్లింపులు, తదితర అంశాల పట్ల వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ, టెక్నాలజీ శాఖలు ఉమ్మడిగా కృషి చేస్తున్నాయని చెప్పారు. -
రాష్ట్రాల నుంచి ధాన్యం కొనుగోలు కొనసాగింపు
చండీగఢ్: భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) పంజాబ్, హరియాణాలతోపాటు అన్ని రాష్ట్రాల నుంచి ఆహార ధాన్యం కొనుగోలును కొనసాగిస్తుందని కేంద్ర ఆహార మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మంగళవారమిక్కడ చెప్పారు. అభివృద్ధి చెందిన పంజాబ్, హరియాణా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరణ ఆపాలని శాంతకుమార్ కమిటీ ఇదివరకు సిఫార్సు చేసింది. దీంతో హరియాణా, పంజాబ్ ల నుంచి ధాన్యం కొనొద్దని కేంద్రం ఎఫ్‌సీఐని ఇటీవల ఆదేశించింది. దీన్ని అమలు చేయొద్దని పంజాబ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో పాశ్వాన్ హామీ ప్రాధాన్యం సంతరించుకుంది -
కాంగ్రెస్ కోసమే ‘మూడు’: నరేంద్ర మోడీ
నరేంద్ర మోడీ ధ్వజం మూడో కూటమితో దేశానికి మేలు జరగదు నేను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం ముజఫర్‌పూర్(బీహార్): కాంగ్రెస్ ప్రయోజనాలను కాపాడ్డమే మూడో కూటమి లక్ష్యమని, దాని వల్ల దేశానికి ఒరిగేదేమీ లేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. బీజేపీ దృష్టిలో లౌకికవాదమంటే అన్ని కులాలు, వర్గాల ప్రయోజనాలను పెంపొందించి, దేశాన్ని ప్రగతి బాట పట్టించడమని, కాంగ్రెస్, ఇతర పార్టీలకు మాత్రం తాను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమని ధ్వజమెత్తారు. మూడో కూటమిని బలంగా ముందుకు తెస్తున్న జేడీయూ నేత నితీశ్‌కుమార్ బీహార్ అభివృద్ధిపై చెబుతున్నవన్నీ అబద్ధాలేనన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే ఉగ్రవాదులకు బీహార్ అడ్డాగా మారిందని విమర్శించారు. మోడీ సోమవారమిక్కడ బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఇటీవలే బీజేపీతో జట్టుకట్టిన ఎల్జేపీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్, ఆయన కుమారుడు చిరాగ్, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహా హాజరైన ఈ సభలో మోడీ ఏమన్నారంటే.. ఆరు నెలలు, ఏడాది కిందట మూడో కూటమి ఊసు విన్నా రా? అది ఎన్నికల సమయంలోనే వచ్చింది. అది ఎన్నికలను చెడగొట్టొచ్చు కానీ దేశానికి ఎలాంటి మేలూ చేయదు. ఇదివరకు ప్రతిదాన్నీ ఉగ్రవాదానికి, ఐఎస్ఐకి ఆపాదించేవారు. ఇప్పుడు ప్రతిదానికి .. ధరల పెరుగుదలకు, అవినీతి నిరోధానికి లౌకికవాదమే సంజీవనిగా మారిపోయింది. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయంటే వారు లౌకికవాదం ప్రమాదంలో ఉందంటారు. దేశ రాజకీయాలు రెండు వర్గాలుగా విడిపోయాయి. పేదరిక నిర్మూలన, ధరల నియంత్రణ, బలహీలన వర్గాల అభివృద్ధిని కాంక్షించే బీజేపీగా, నన్ను అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా ఉన్న పార్టీల ముఠాగా. నన్ను వ్యతిరేకించే వారి ఎజెండా దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడం కాదు, నన్ను అడ్డుకోవడ మే. లౌకికవాదం పేరిట దేశాన్ని మోసం చేసే ప్రయత్నాలతో జనానికి మేలు జరగదు (కాంగ్రెస్, నితీశ్‌లను ఉద్దేశించి). ఏన్డీఏ కూటమి బలం పుంజుకుంటోంది. ఎల్జేపీ చేరిక తర్వాత మరిన్ని పార్టీలు చేరనున్నాయి. ఎన్డీఏ కేవలం జాతీయ ప్రజాస్వామ్య కూటమి మాత్రమే కాదు, జాతీయ అభివృద్ధి కూటమి కూడా. వచ్చే దశాబ్ది ఎస్సీలు, ఎస్టీలు, బడుగులదే. సభలో ఎల్జేపీ చీఫ్ పాశ్వాన్ మాట్లాడుతూ, దేశంలో మోడీ గాలి వీస్తోందని, ఆయనే ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. -
ఎన్డిఏతో జతకట్టనున్న లోక్‌జనశక్తి