చండీగఢ్: భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) పంజాబ్, హరియాణాలతోపాటు అన్ని రాష్ట్రాల నుంచి ఆహార ధాన్యం కొనుగోలును కొనసాగిస్తుందని కేంద్ర ఆహార మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మంగళవారమిక్కడ చెప్పారు. అభివృద్ధి చెందిన పంజాబ్, హరియాణా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరణ ఆపాలని శాంతకుమార్ కమిటీ ఇదివరకు సిఫార్సు చేసింది. దీంతో హరియాణా, పంజాబ్ ల నుంచి ధాన్యం కొనొద్దని కేంద్రం ఎఫ్‌సీఐని ఇటీవల ఆదేశించింది. దీన్ని అమలు చేయొద్దని పంజాబ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో పాశ్వాన్ హామీ ప్రాధాన్యం సంతరించుకుంది