fci
-
మనకు భారత్ రైస్ భాగ్యం లేదా?
సాక్షి, హైదరాబాద్: బియ్యం ధరలు ఆకాశన్నంటుతున్న నేపథ్యంలో సబ్సిడీ ధరతో దేశవ్యాప్తంగా అవసరమైన వారందరికీ నాణ్యమైన బియ్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బృహత్తర పథకం రాష్ట్రంలో మాత్రం అమలు కావడం లేదు. బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించినప్పటికీ ధరలు అదుపులోకి రాకపోవడంతో ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని రూ.29కే విక్రయించాలని నిర్ణయించింది. భారత్ రైస్ పేరుతో ఈ బియ్యం అమ్మకాలను ఫిబ్రవరి 6వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేషనల్ అగ్రికల్చర్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కో ఆపరేటివ్ కన్సూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్సీసీఎఫ్), కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాలతో పాటు మొబైల్ అవుట్లెట్లలో కూడా భారత్ రైస్ విక్రయాలను ప్రారంభించారు. ఆమెజాన్, జియో మార్ట్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్స్ ద్వారా కూడా 5 కిలోలు, 10 కిలోల భారత్ రైస్ బ్యాగులను అందుబాటులోకి తెచ్చారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో రూ.29 కిలోల బియ్యం బ్యాగులు విక్రయిస్తున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం భారత్ రైస్ భాగ్యం సామాన్యులకు దక్కడం లేదు. కేటాయింపులు జరిపినప్పటికీ... ఫిబ్రవరి 6వ తేదీ నాటికే రాష్ట్రంలో కూడా అమ్మకాలు జరపాలని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ భావించింది. ఈ మేరకు నాఫెడ్ ప్రాంతీయ కార్యాలయానికి సమాచారం అందించింది. ఎఫ్‌సీఐ ద్వారా బియ్యం సేకరించి 5 కిలోలు, 10 కిలోల బ్యాగులలో నింపి విక్రయించే ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తొలి విడతగా నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్‌కు ఒక్కో సంస్థకు 2 వేల టన్నుల చొప్పున బియ్యం కేటాయించింది. అయితే ఇప్పటివరకు బియ్యం బ్యాగ్‌లు రిటైల్ అవుట్లెట్లకు చేరలేదు. డిపోలలోని బియ్యం ఇతర రాష్ట్రాలకే! భారత్ రైస్ బ్యాగ్‌లకు అవసరమైన బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) నాఫెడ్‌కు సరఫరా చేయాలి. అయితే రాష్ట్రంలో నాఫెడ్‌కు అవసరమైన మేర బియ్యాన్ని ఎఫ్‌సీఐ పంపించలేదని సమాచారం. రాష్ట్రంలోని 52 ఎఫ్‌సీఐ డిపోలలో సుమారు 5లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ, ఆ బియ్యం మొత్తం సెంట్రల్ పూల్ కింద ఇతర రాష్ట్రాలకు పంపించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో భారత్ రైస్ కోసం నాఫెడ్‌కు ఎఫ్‌సీఐ ప్రత్యేకంగా బియ్యాన్ని కేటాయించలేని పరిస్థితి నెలకొంది. దీనిపై కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖనే నిర్ణయం తీసుకోవాలని ఎఫ్‌సీఐ వర్గాలు చెపుతున్నాయి. బియ్యం రాలేదు రిటైల్ అమ్మకాల కోసం రైస్ బ్యాగులు మా దగ్గరికి రాలేదు. భారత్ రైస్ బ్యాగులకు ప్రజల నుంచి డిమాండ్ ఉంది. రోజూ ఎంక్వైరీలు వస్తున్నాయి. నాఫెడ్ ద్వారా ఈ బ్యాగులు రావలసి ఉంది. ఎప్పుడు పంపించినా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్ ఆటా పేరుతో పంపిన గోధుమ పిండి బ్యాగులు మాత్రం విక్రయించాం.- రమణమూర్తి, ఆర్.ఎం,కేంద్రీయ భండార్ -
నేటితో ముగియనున్న సీఎంఆర్ గడువు
సాక్షి, హైదరాబాద్: గతేడాది ఖరీఫ్‌నకు సంబంధించిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీ బుధవారంతో ముగియనుంది. ఆ సీజన్లో మిల్లర్లు ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన బియ్యం బకాయిలు ఇంకా పూర్తి కాలేదు. అయితే ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన నేపథ్యంలో కేంద్రాన్ని గడువు కోరవద్దని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మిల్లర్లు, అధికారులపై ఒత్తిడి తెచ్చి 50 రోజుల్లో 20 ఎల్ఎంటీ మేర బియ్యం సేకరించింది. ఇంకా 2022–23 సీజన్‌కు సంబంధించి మరో 4.80 ఎల్ఎంటీ ఎఫ్‌సీఐకి రావాల్సి ఉన్నా, రైస్‌మిల్లర్లు డెలివరీ చేయడంలో విఫలమయ్యారు. కాగా సీఎంఆర్ డెలివరీ గాడిన పడుతున్న నేపథ్యంలో మరో నెలరోజుల గడువు పొడిగించాలని మిల్లర్లు కోరుతున్నారు. నెల రోజుల్లో పూర్తిస్థాయిలో బియ్యం ఎఫ్‌సీఐకి ఇస్తామని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులుగా అక్కడే ఉన్న సీఎంఆర్ గడువు పొడిగింపునకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కనీసం నెల రోజుల టైమ్ ఇస్తే.. గతేడాది ఖరీఫ్ సీఎంఆర్ బకాయిలు పూర్తిచేసే అవకాశం ఉంటుంది. లేకపోతే 4.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల వద్దనే ఉండిపోతుంది. దీని విలువ కనీసం రూ.1,872 కోట్లు ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత రికవరీ చేయటం కూడా కష్టంగా ఉంటుంది. ఎఫ్‌సీఐకి బదులుగా సివిల్ సప్లయీస్ కోటా కింద తీసుకోవాల్సి వస్తుంది. కానీ సివిల్ సప్లయ్ తీసుకునేది లేదని చెప్పిన నేపథ్యంలో నెల రోజుల గడువు పెంచాలని భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. గత ఏడాది రబీ ధాన్యం వేలానికి... కాగా నిరుడు యాసంగి సీజన్‌కు సంబంధించిన బియ్యం బకాయిలు 32.74 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి. అంటే 50 ఎల్ఎంటీ ధాన్యం గోడౌన్లలో ఉంది. ఇందులో 35 ఎల్ఎంటీ ధాన్యాన్ని వేలం వేయాలని ప్రభు త్వం నియమించిన కమిటీ నిర్ణయించింది టెండర్లు కూడా ఆహ్వానించింది. కాగా ధాన్యం టెండర్లకు సంబంధించిన ప్రీ బిడ్డింగ్ సమావేశం బుధవారం పౌరసరఫరాలభవన్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కమిషనర్ డీఎస్.చౌహాన్ హాజరయ్యే అవకాశాలున్నాయి. -
ఎఫ్‌సీఐకి బియ్యం పంపిణీని వేగవంతం చేయండి..
సాక్షి, హైదరాబాద్: భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు ఇవ్వాల్సిన బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. కస్టమ్ మిల్లింగ్‌పై దృష్టి సారించాలని, రైస్ మిల్లర్ల ద్వారా బియ్యం ఎఫ్‌సీఐకి అందజేయాలని స్పష్టం చేశారు. తాను ఇటీవల ఢిల్లీ పర్యటించినప్పుడు కేంద్ర అధికారులు పెద్ద మొత్తంలో బియ్యం కేటాయింపులు అడిగారని, ఆశించిన స్థాయిలో బియ్యం నిల్వలు రావడం లేదని వారు ఫిర్యాదు చేశారని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో జనవరి 31వ తేదీలోపు బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ ఇతర అధికారులతో కలిసి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి కలెక్టర్లు, పౌర సరఫరాల సంస్థ, ఎఫ్‌సీఐ అధికారులతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 42 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం డెలివరీ చేయాలి.. ఈనెలాఖరు నాటికి 7.83 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, యాసంగి సీజన్‌కు 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరాలో ఆలస్యం జరగకూడ దని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. మిల్లర్లంతా రాబోయే రోజులలో దాదాపు 42 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డెలివరీ చేయాల్సి ఉంటుందన్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు అందించేందుకు పౌరసరఫరాల సంస్థ రుణాలు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ పెట్టుబడిని తిరిగి పొందడం అనేది మిల్లర్లు ఎఫ్‌సీఐకి బియ్యం పంపిణీ చేయడంపైనే ఆధారపడి ఉంటుందని, జాప్యం జరిగితే కార్పొరేష న్కు పెద్ద ఎత్తున నష్టం కలుగుతుందన్నారు. గత పదేళ్లలో రూ.58,000 కోట్ల అప్పులు, రూ. 11,000 కోట్ల నష్టాల వల్ల పౌరసరఫరాలపై భారం పడింద ని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు రూ.3,000 కోట్ల వార్షిక వడ్డీ భారం పడుతోందన్నారు. బియ్యం సరఫరాలో జాప్యంతో రాష్ట్ర కేటాయింపులపై ప్రభావం సకాలంలో బియ్యం పంపిణీ చేయకుండా మిల్లర్లు పెద్దఎత్తున నిల్వలు ఉంచుకోవడం వల్ల లాభం లేదని ఉత్తమ్ కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరాలో జాప్యం వల్ల భవిష్యత్తులో తెలంగాణకు కేటాయింపులపై తీవ్ర పరిణామాలు వస్తాయని మంత్రి హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల కార్పొరేషన్ భవిష్యత్తు కోసం బియ్యం పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను కోరారు. పీడీఎస్ బియ్యం నాణ్యత లోపించడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పీడీఎస్ బియ్యాన్ని పాలిష్‌చేసి రీసైక్లింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్కో బియ్యం బస్తాకు 45 కిలోల కంటే తక్కువ బియ్యం అందుతున్నట్లు రేషన్ షాపు యజమానుల నుంచి వచ్చిన ఫిర్యాదును కూడా మంత్రి ప్రస్తావించారు. కొందరి నిర్లక్ష్యం వల్ల రేషన్‌షాపుల యజమానులు ఎందుకు నష్టపోవాలనీ, దీనిపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ కలెక్టర్లపై చర్యలు తీసుకుంటాంః సీఎస్ సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ఎఫ్‌సీఐకి పంపిణీ చేయాల్సిన బియ్యం లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల డాటా ఎంట్రీని ఆధార్, రేషన్ కార్డుల్లోని సమాచారం ఆధారంగా నమోదు చేయడంలో జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. -
వచ్చే నెల నుంచి కందిపప్పు పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు కందిపప్పు పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెల (నవంబర్) నుంచి క్రమం తప్పకుండా లబ్దిదారులకు కిలో చొప్పున అందించనుంది. తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ 10 వేల టన్నుల కందిపప్పు కొనుగోలుకు హైదరాబాద్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా)కు ఆర్డర్ ఇచ్చింది. అయితే హాకా వద్ద కూడా తగినంత నిల్వలు లేకపోవడంతో 7,200 టన్నుల సరఫరాకు అంగీకరించింది. ఇందులో భాగంగా తొలి దశలో 3,660 టన్నులు, రెండో దశలో 3,540 టన్నులు అందించనుంది. ఇప్పటికిప్పుడు అంటే వచ్చే నెల అవసరాలకు గాను 2,300 టన్నుల సరఫరాకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయంగా పప్పుధాన్యాల కొరతతో రేట్లు ఆకాశాన్నంటాయి. దేశవ్యాప్తంగా పంట ఉత్పత్తులు బహిరంగ మార్కెట్‌కు వెళ్లిపోవడంతో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)వద్ద కూడా నిల్వలు కరువయ్యాయి. ఫలితంగా కందిపప్పు పంపిణీకి అవాంతరాలు ఏర్పడ్డాయి. ఈ నెలాఖరుకు సరుకు తరలింపు ప్రస్తుతం మార్కెట్లో కిలో కందిపప్పు రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.180 వరకు ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హాకా నుంచి మద్దతు ధర ప్రాతిపదికనే కందులు సేకరించినప్పటికీ.. వాటికి అదనంగా ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు అవ్వనున్నాయి. ఈ మొత్తంలో రూ.67కు మాత్రమే కిలో కందిపప్పును ప్రభుత్వం లబ్దిదారులకు ఇవ్వనుంది. అంటే దాదాపు సబ్సిడీ రూపేణా ప్రభుత్వం రూ.70పైగానే భరిస్తున్నట్టు సమాచారం. ఈ నెలాఖరు నాటికి చౌక ధరల దుకాణాల వద్దకు అందుబాటులో ఉన్న నిల్వల ప్రకారం సరుకును తరలించనుంది. డిసెంబర్, జనవరిల్లో పూర్తి స్థాయిలో కార్డుదారులకు సబ్సిడీ కందిపప్పును ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మార్కెట్ రేటుకే కందుల కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు వీలుగా 50 వేల టన్నుల కందిపప్పును కేటాయించాలని కేంద్రానికి పదేపదే విజ్ఞప్తి చేసింది. తొలుత కర్ణాటకలోని బఫర్ స్టాక్ నుంచి 9,764 టన్నులు కందులు కేటాయించగా వాటిలో నాణ్యత లోపించింది. ఆ తర్వాత రెండుసార్లు జూన్, సెపె్టంబర్‌ల్లో కేటాయింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కానీ, కేంద్రం నుంచి స్పందన రాలేదు. మండల స్టాక్ సెంటర్ (ఎంఎల్ఎస్)ల్లోని స్టాక్ మొత్తాన్ని పంపిణీకి విడుదల చేయడంతో నిల్వలు నిండుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం హాకా నుంచి కందిపప్పును తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో వచ్చే మూడు నెలలకు హాకా సరఫరా చేసే కందిపప్పును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించనుంది. భవిష్యత్తులో అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు జనవరి నుంచి పౌరసరఫరాల సంస్థ ద్వారా నేరుగా రైతుల నుంచి మార్కెట్ ధరకు ప్రభుత్వం కందులు సేకరించనుంది. తొలుత ఈ ఖరీఫ్‌లో 30 వేల టన్నులు సేకరించాలనే యోచనలో ఉన్నారు. వాటిని స్వయంగా మరాడించి ప్యాకింగ్ చేయించి సబ్సిడీపై కార్డుదారులకు అందించేలా ప్రణాళిక రూపొందించారు. బాబుగారి ‘పప్పు’ డ్రామా అంతర్జాతీయంగా మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి డిమాండ్, సప్లై ఆధారంగా నిత్యావసరాల రేట్లు మారుతుంటాయి. చంద్రబాబు హయాంలో రేట్లు ఎంత పెరిగినా ఇచ్చే సబ్సిడీ మాత్రం పెరిగేది కాదు. పైగా ఆయన పాలన చేపట్టిన తర్వాత సెపె్టంబర్ 2014–జూలై 2015 వరకు కందిపప్పు ఊసే లేదు. ఆగస్టు 2015 నుంచి ఫిబ్రవరి 2017 వరకు కార్డుకు కిలో చొప్పున రూ.50 నుంచి రూ.120 మధ్యన రేట్లు పెంచి విక్రయించారు. 2015 డిసెంబర్లో ఏకంగా రూ.90కి పెంచారు. 2016 జూలై నుంచి 2017 ఫిబ్రవరి మధ్య రూ.120 చేశారు. 2018లో కందిపప్పు బహిరంగ మార్కెట్లో కిలో రూ.63 ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.23 రాయితీ ఇచ్చింది. చివరి ఏడాది మాత్రం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు కిలోల కందిపప్పు డ్రామా ఆడారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మొత్తం పంపిణీ చేసింది కేవలం 93 వేల టన్నులు మాత్రమే. ఇందు కోసం రూ.1605 కోట్లు ఖర్చు చేసింది. కానీ, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు 3.15 లక్షల టన్నుల కందిపప్పు పంపిణీకి రూ.3,084 కోట్లు ఖర్చు చేసింది. కరోనా సమయంలో నిత్యావసరాలను పూర్తి ఉచితంగా అందించింది. కార్డుదారులకు నిరంతరాయంగా పంపిణీ చేసేలా చర్యలు కార్డుదారులకు ప్రతి నెలా నిరంతరాయంగా కందిపప్పు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాం. హాకా ద్వారా కందిపప్పును సేకరిస్తున్నాం. ఇప్పటికే నాణ్యత ప్రమాణాలను పరిశీలించాం. ఈ నెలాఖరు నాటికి ఎఫ్పీ దుకాణాలకు సరుకు చేర్చేలా ఆదేశాలు జారీ చేశాం. డిసెంబర్, జనవరిల్లో వంద శాతం కార్డులకు పంపిణీ చేస్తాం. ఈ ఖరీఫ్‌లో రైతుల నుంచి కందులు కొనుగోలు చేయనున్నాం. ఇప్పటికే అన్ని జిల్లాల్లోని కలెక్టర్లకు కందుల కొనుగోలుపై ప్రచారం కల్పించాలని ఆదేశించాం. మన రైతుల నుంచి మార్కెట్ ధరకు కందులు కొనుగోలు చేసి వాటిని రాష్ట్ర వినియోగానికి వాడుకుంటే.. రైతులకు, లబ్దిదారులకు ఎంతో మేలు జరుగుతుంది. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
ఎఫ్‌సీఐ వల్లే సీఎంఆర్ ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: ఎఫ్‌సీఐ వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో మిల్లింగ్ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటోందని రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. సీఎంఆర్ విషయంలో మిల్లర్లను వేధించడ మే లక్ష్యంగా ఎఫ్‌సీఐ అధికారులు నిబంధన లకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గంప నాగేందర్ గుప్తా ఆరోపించారు. మంగళవారం నగరంలోని టూరిస్ట్ ప్లాజాలో మిల్లర్ల సంఘం సమావే శం జరిగింది. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. మిల్లర్లు మిల్లింగ్ చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్ల నుంచి తరలించాల్సిన ఎఫ్‌సీఐ నాలుగైదు నెలలైనా రైల్వే వ్యాగన్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపడం లేదని, తద్వారా గోడౌన్లు నిండి పోయి మిల్లింగ్ జరగని పరిస్థితి నెలకొందని వివరించారు. ఒక్కో ఎఫ్‌సీఐ గోడౌన్‌కు వందలాది మిల్లుల నుంచి వచ్చిన బియ్యాన్ని కేటాయిస్తుండడంతో వారం రోజులైనా బియ్యం లారీలు అన్లోడింగ్ కావడం లేదన్నారు. దీంతో సమయానికి సీఎంఆర్ ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాగైతే మిల్లింగ్ ఎలా? ప్రస్తుతం రాష్ట్రంలోని మిల్లర్ల వద్ద కోటి మె ట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయని, ఎఫ్‌సీఐ ఇలాగే వ్యవహరిస్తే ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం అసాధ్యమని గుప్త స్పష్టం చేశారు. ఎఫ్‌సీఐ కారణంగా 70 లక్షల మెట్రి క్ టన్నుల ధాన్యం మిల్లింగ్ చేయడానికి 24 నెలల కాలం పడుతుందన్నారు. మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.700 కోట్లు, ఎఫ్‌సీఐ నుంచి రవాణా చార్జీలు రూ.700 కోట్లు రావలసి ఉందని, వాటిని వెంటనే చె ల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం పంపించే బలవర్ధక బియ్యం కెర్నల్స్ (ఎఫ్ ఆర్కే)లో నాణ్యత లేదని మిల్లులను ఎఫ్‌సీఐ డిఫాల్టర్లుగా ప్రకటించడం శోచనీయమన్నారు. సమావేశంలో సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రభాకర్ రావు పాల్గొన్నారు. -
అదనపు ధాన్యమంతా ఎగుమతులకే
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన ధాన్యాన్ని, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని సేకరించకుండా ఎఫ్‌సీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటీ పది లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం, నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లుల్లో ఉందని, ఎఫ్‌సీఐ చర్యలతో ఆహారధాన్యాలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని అధికారులు సీఎం దృష్టికి తేవడంతో కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. రానున్న రోజుల్లో అదనంగా వరి దిగుబడి కానున్న పరిస్థితుల్లో రైతు పండించిన వరి పంటను పలు రకాల ఆహార ఉత్పత్తులుగా మలిచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తద్వారా రైతులకు మరింత లాభం చేకూరేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి, సీఎంఆర్ అప్పగింత, బియ్యం తిరస్కరణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కొత్త మిల్లుల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ శుక్రవారం పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. అదనంగా పండే పంట కోసమే కొత్త మిల్లులు... ‘‘రైతుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వరి ధాన్యం ఉత్పత్తులు ఎగుమతయ్యేలా చూడాలి. అప్పడు తెలంగాణ వరికి గిరాకీ పెరిగి రైతులు లాభాలు గడిస్తారు. అదనంగా పండే పంటను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నూతనంగా అధునాతన మిల్లులు ఏర్పాటు చేయబోతున్నాం. ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి విధివిధానాలు ఖరారు చేసి కార్యాచరణ ప్రారంభించనున్నాం. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సటాకె వంటి కంపెనీలతో చర్చించాం. వారితో రేపట్నుంచే ఉన్నతస్థాయి కమిటీ చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశించాం’’అని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన గౌరవెల్లి, మల్కపేట, బస్వాపూర్ తదితర ప్రాజెక్టులతోపాటు మరికొద్ది రోజుల్లో పూర్తికానున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల వరిధాన్యం దిగుబడి ప్రస్తుతమున్న ఏటా 3 కోట్ల టన్నుల నుంచి 4 కోట్ల టన్నులకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ దామోదర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు వీరే... రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రైస్ మిల్లుల సామర్థ్యం కోటి టన్నుల వరకు ఉండగా మరో 2 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేసే దిశగా కొత్త మిల్లులను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి విధివిధానాల ఖరారు కోసం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సారథ్యంలో కమిటీని ప్రకటించారు. ఇందులో సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, టీఎస్ఐడీసీ ఎండీ నర్సింహారెడ్డి సభ్యులుగా ఉండనున్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మేద్దాం! రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో ఉన్న ధాన్యంలో 40 లక్షల మెట్రిక్ టన్నులను గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మిల్లర్లు సకాలంలో ధాన్యం మిల్లింగ్ చేయకపోవడంతో మిలు్లల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. నిర్దేశత సమయంలో సీఎంఆర్ ఇవ్వకపోవడంతో ఎఫ్‌సీఐ కొర్రీలు పెడుతోంది. దాదాపు 1.10 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం, 4 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లుల్లో నిల్వల నేపథ్యంలో ధాన్యం విక్రయానికి సీఎం ఆదేశించినట్లు తెలిసింది. -
ఎఫ్‌సీఐ ఇలా చేస్తే కష్టం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు పంపిణీ చేసే ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం) విషయంలో ఎఫ్‌సీఐ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రంలోని మిల్లర్లు మండిపడుతున్నారు. ఇటీవల 290 మిల్లుల నుంచి ఎఫ్‌సీఐకి పంపిన సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యాన్ని (సీఎంఆర్) నాణ్యత సరిగా లేదంటూ ఎఫ్‌సీఐ తిరస్కరించడంంతో పాటు మిల్లుల నుంచి 2022–23కు సంబంధించిన సీఎంఆర్‌ను తీసుకునేందుకు కూడా నిరాకరించింది. దీంతో మిల్లింగ్ అయిన బియ్యం మిల్లుల్లోనే ఉండిపోతోంది. గత సంవత్సరం వానకాలం, యాసంగి ధాన్యం ఇప్పటికే కోటి టన్నులకు పైగా మిల్లుల్లో నిల్వ ఉండగా, మర పట్టించిన మేరకు బియ్యాన్ని కూడా ఎఫ్‌సీఐ తీసుకోవడం లేదని మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మిల్లర్ల సంఘం నాయకులు సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌తో భేటీ అయ్యారు. ఎఫ్‌సీఐ ఘర్షణాత్మక వైఖరి: రాష్ట్రంలోని సుమారు 3 వేల మిల్లులు ధాన్యం, బియ్యంతో నిండిపోయి ఉన్నాయని, ధాన్యం నిల్వకు గోదాములు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంత్రికి మిల్లర్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో మిల్లర్లు పంపించిన బియ్యాన్ని నిరాకరిస్తూ, దాదాపు 290 మిల్లుల్ని బ్లాక్ లిస్టులో పెట్టి ఎఫ్‌సీఐ ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ నాఫెడ్ సరఫరా చేసిన ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (ఎఫ్ఆర్కే) నాణ్యత సరిగా లేదంటూ ఎఫ్‌సీఐ బియ్యాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో రైస్ మిల్లింగ్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని చెప్పారు. ఎఫ్‌సీఐ ఇలాగే వ్యవహరిస్తే సీఎంఆర్ నుంచి పూర్తిగా తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఎఫ్‌సీఐ గోదాములు సమకూర్చకపోవడం వల్ల సకాలంలో సీఎంఆర్ చేయలేకపోతున్నట్లు తెలిపారు. కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో.. గత వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు రైస్ మిల్లుల వద్ద పేరుకుపోయాయని మిల్లర్లు మంత్రి దృష్టికి తెచ్చారు. కోటీ పదమూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ చేయాల్సి ఉండగా, అందులో గత వానాకాలంలో తడిసిన ధాన్యం కూడా ఉందని తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ధాన్యం పాడయ్యే ప్రమాదం ఉందని, అప్పుడు సీఎంఆర్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. వానాకాలం ధాన్యం తడిసిపోయిన నేపథ్యంలో ఈ సీజన్‌కు సంబంధించిన 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్ చేసేందుకు ఆదేశాలివ్వాలని కోరారు. లేని పక్షంలో తమ దగ్గర ఉన్న ధాన్యాన్ని వెనక్కితీసుకోవాలని అన్నారు. ఎఫ్‌సీఐ కఠిన వైఖరి నేపథ్యంలో డిఫాల్ట్ పెట్టబోమని హామీ ఇస్తే ప్రభుత్వ ధాన్యానికి కస్టోడియన్‌గా ఉంటామని స్పష్టం చేశారు. సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి గంగుల మిల్లర్ల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి గంగుల హామీ ఇచ్చారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మద్దతు ధరతో ధాన్యం కొను గోలుకు సీఎం ఆదేశాలిచ్చారని, కేంద్రం కూడా దేశంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత నుంచి తప్పుకోకూడదని సూచించారు. తక్షణ మే ఎఫ్‌సీఐ స్టోరేజీ సౌకర్యం కల్పిస్తే నెలకు పదిలక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాగా అప్పటికప్పుడు ఎఫ్‌సీఐ ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి.. వీలైనంత త్వరగా స్టోరేజీని పెంచి బియ్యం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులతో పాటు మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గంపా నాగేందర్, జనరల్ సెక్రటరీలు వి.మోహన్ రెడ్డి, ఎ.సుధాకర్ రావ్, ట్రెజరర్ చంద్రపాల్, 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, మిల్లర్లు పాల్గొన్నారు. -
మిల్లర్ల బకాయిలు రూ. 2,072 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి రూ. వేల కోట్లలో బకాయి పడ్డారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ఇచ్చిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి ఇవ్వకుండా సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారు. దీంతో 2019 యాసంగి నుంచి 2022 యాసంగి వరకు పౌరసరఫరాల సంస్థకు రూ. 2,072 కోట్ల విలువైన 5.83 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం బకాయిపడ్డారు. ఈ మొత్తం బియ్యాన్ని లేదా అందుకు సమానమైన నగదును 25 శాతం జరిమానాతో డిఫాల్ట్ అయిన మిల్లుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి హోదాలో కమిషనర్ అనిల్ కుమార్ ఇప్పటివరకు నాలుగు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు ఆయా మిల్లులకు రికవరీ నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ బియ్యం విలువే రూ. 1,630 కోట్లు 2021–22 యాసంగికి సంబంధించి 2,37,310 మెట్రిక్ టన్నుల బియాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉండగా ఈ గడువు గత మే నెలాఖరుతో ముగిసింది. దీంతో ఈ బియ్యాన్ని 25 శాతం పెనాల్టితో రికవరీ చేయాలని లేదంటే బియ్యం విలువ రూ. 842.09 కోట్లను 25 శాతం పెనాల్టితో వసూలు చేయాలని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే గత నెల 23న 2021–22 వానాకాలానికి సంబంధించిన 2.22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 25 శాతం పెనాల్టితో 494 మిల్లుల నుంచి రికవరీ చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ బియ్యం విలువ రూ. 787.67 కోట్లు. ఈ రెండు సీజన్లలోనే రూ. 1,630 కోట్ల వరకు రావాల్సి ఉంది. 2019 యాసంగి బకాయి 48,762 మెట్రిక్ టన్నులు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2019 యాసంగి సీజన్‌కు సంబంధించి 118 మిల్లుల నుంచి సీఎంఆర్ కింద లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈ ఏడాది మార్చిలోనే పెనాల్టీతో 125 శాతం రికవరీ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఈ మిల్లులు గడువులోగా బియ్యం ఇవ్వకపోవడంతో నెలకోసారి గడువును పెంచుతూ వచ్చారు. ఎట్టకేలకు ఈ నెలలో 14 మిల్లులు 125 శాతం బియ్యం రికవరీ చేశాయి. మరో 89 మిల్లులు 100 శాతం రికవరీ కింద సర్కారుకు సీఎంఆర్ అప్పగించాయి. ఇంకా 15 మిల్లులు ఎలాంటి రికవరీ చేయలేదు. దీంతో ఇంకా 48,762 మెట్రిక్ టన్నుల బియ్యం ఆయా మిల్లుల నుంచి రావాల్సి ఉంది. ఇప్పటికీ ఈ మిల్లులకు పెండింగ్ సీఎంఆర్ రికవరీ చేసుకొనే అవకాశం ఇస్తూ ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 2020–21 సంవత్సరం యాసంగికి సంబంధించి మరో 73 మిల్లుల నుంచి 75,878 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉండగా ఈ మొత్తాన్ని కూడా పెనాల్టితో 125 శాతం రికవరీ చేయాలని సైతం ఈ నెల 19నే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు సంవత్సరాలకు సంబంధించిన బియ్యం 1.25 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఈ బియ్యం విలువనే రూ. 442 కోట్లు. 25 శాతం నగదు... 100 శాతం బియ్యం రికవరీ డిఫాల్ట్ మిల్లర్ల నుంచి 125 శాతం బియ్యాన్ని రికవరీ చేసే ప్రక్రియలో ముందుగా 25 శాతం బియ్యాన్ని లేదా అందుకు సమానమైన మొత్తాన్ని పెనాల్టీ రూపంలో ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేస్తేనే తరువాత సీజన్‌కు మళ్లీ సీఎంఆర్ ఇచ్చేందుకు వీలు కలుగుతుంది. అయితే 25 శాతం పెనాల్టిలో ఐదు శాతమే ఇప్పటికిప్పుడు ఇవ్వడం, మిగతా పెనాల్టీ మొత్తాన్ని 4 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉండటంతో మిల్లర్లు ఇదే అదనుగా వ్యాపారాన్ని య«థేచ్ఛగా సాగిస్తున్నారనే విమర్శలున్నాయి. -
డిఫాల్టర్లకు పెనాల్టీ
సాక్షి, హైదరాబాద్: నిర్ణీత గడువులోగా ఎఫ్‌సీఐకి కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఇవ్వని రైస్ మిల్లర్లపై ప్రభుత్వం కొరడా విదిల్చింది. 2021–22 వానా కాలం సీఎంఆర్ గడువు పలు వాయిదాల తరువాత ఏప్రిల్ 31తో ముగిసింది. అయినా రాష్ట్రంలోని 494 రైస్ మిల్లులు బియ్యం అప్పగించలేదు. వీటినుంచి 2.22 ఎల్ఎంటీ బియ్యం ఎఫ్‌సీఐకి చేరాల్సి ఉంది. ఈ బియ్యం రికవరీకి గడువు కోరినా ఎఫ్‌సీఐ అంగీకరించలేదు. దీంతో ఎఫ్‌సీఐ నుంచి సుమారు రూ. 700 కోట్లు రాలేదు. ఇప్పుడు మిల్లర్ల నుంచి బియ్యాన్ని రికవరీ చేసినా, నిబంధనల మేరకు ఎఫ్‌సీఐకి పంపకుండా రాష్ట్ర అవసరాలకే (స్టేట్ పూల్) వినియోగించుకోవాలి. దీంతో పౌర సరఫరాల శాఖ నష్ట నివారణకు చర్యలు చేపట్టింది. 494 రైస్ మిల్లులను డిఫాల్టర్లుగా ప్రకటించి, వారి నుంచి 25 శాతం పెనాల్టీతో 125 శాతం సీఎంఆర్‌ను రికవరీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి హోదాలో పౌరసరఫరాల సంస్థ కమిషనర్ వి.అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 25 శాతం నగదు.. 100 శాతం బియ్యం.. డిఫాల్టర్ల నుంచి 125 శాతం బియ్యాన్ని రికవరీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మిల్లర్ల గుండెల్లో పిడుగు పడినట్లయింది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ విలువ రూ. 700 కోట్లు అనుకుంటే... రూ. 175 కోట్లు(25 శాతం) పెనాల్టీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం వెంటనే చెల్లించాలి. అప్పుడే మిల్లర్ నుంచి బియ్యం రికవరీ ప్రారంభమ వుతుంది. మిల్లర్లు ఇప్పటికే బియ్యాన్ని విక్రయించినట్లు ఆరోపణల నేపథ్యంలో రికవరీకి రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేసి స్టేట్‌పూల్‌కు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. వంద శాతం రికవరీయే కష్టమవుతుంది కాబట్టి, 25 శాతం బియ్యాన్ని నగదు రూపంలో వసూలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పౌరసరఫరాల శాఖ, సంస్థ డీఎంలు, డీఎస్‌ఓలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. పెనాల్టీ నుంచి 5వ వంతు మిల్లర్ల నుంచి వసూలు చేసే పనిలో అధికార యంత్రాంగం ఉంది. ఓ వైపు సీఎంఆర్.. మరోవైపు ధాన్యం అన్లోడింగ్.. ఇప్పుడు డిఫాల్ట్ మిల్లుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఓవైపు సీఎంఆర్ అప్పగించేందుకు మిల్లులు నడుపుతూ ప్రస్తుత యాసంగి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకొనే విషయంలో సర్కార్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలున్నాయి. ధాన్యానికి కొర్రీలు పెడుతూ ప్రతి 40 కిలోల బస్తాపై 3 నుంచి 5 కిలోల అదనపు ధాన్యాన్ని రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
గోదాములు ఫుల్.. ఇక్కడ స్థలం లేక.. బీదర్‌కు మన బియ్యం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో ఉన్న ఎఫ్‌సీఐ గోదాముల్లో స్థలసమస్య తలెత్తింది. దీని ప్రభావం ఈ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై పడుతోంది. సంగారెడ్డితోపాటు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు ఇప్పటివరకు హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఎఫ్‌సీఐ గోదాములకు డెలివరీ చేసేవారు. అయితే ఈ గోదాముల్లో ఇప్పుడు స్థలం లేకపోవడంతో నిల్వలన్నీ పేరుకుపోయాయి. దీంతో కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న ఎఫ్‌సీఐ గోదాములకు తరలించాలని నిర్ణయించారు. అక్కడ కూడా స్థల సమస్య తలెత్తడంతో రాష్ట్రం నుంచి వెళ్లిన లారీలు అన్లోడ్ కావడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు బీదర్‌కు వెళ్లి అక్కడి ఎఫ్‌సీఐ అధికారులతో చర్చలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క సంగారెడ్డి జిల్లా నుంచే 1.02 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని బీదర్‌కు తరలించాలని ఎఫ్‌సీఐ నిర్ణయించింది. ఆ బియ్యం రవాణా అయితేనే... మిల్లుల్లో గత యాసంగి, వానాకాలం సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బియ్యం రవాణా అయితేనే స్థలం ఖాళీ అవుతుంది. అప్పుడే ఈ యాసంగి సీజన్లో కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకునేందుకు వీలవుతుంది. కానీ ఎఫ్‌సీఐ గోదాముల్లో స్థలాలు లేక గత యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించిన బియ్యమే మిల్లుల్లో ఉండిపోయింది. దీంతో ఈ యాసంగి సీజనులో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. మిల్లర్ల వద్ద స్థలం లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కారణంగానే చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలు తెరిచినా, ధాన్యం తూకాలు జరగడంలేదు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 77 కొనుగోలు కేంద్రాలు తెరిచారు. కానీ ఇప్పటివరకు 400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా ఆ కేంద్రాల నుంచి మిల్లులకు రవాణా చేయలేకపోయారు. -
డిఫాల్ట్ మిల్లర్లకు.. ధాన్యం బంద్
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని (కస్టమ్ మిల్లింగ్ రైస్ –సీఎంఆర్) ఎఫ్‌సీఐకి అప్పగించకుండా సతాయించే మిల్లులపై కొరడా ఝలిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు నెలల్లోగా ధాన్యం మిల్లింగ్ చేసి బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థ ద్వారా ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉన్నా.. కొందరు మిల్లర్లు ఏడాదిన్నర దాకా జాప్యం చేస్తున్నారు. అప్పటికీ కొన్ని మిల్లుల నుంచి సీఎంఆర్ బియ్యం పెండింగ్‌లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో సకాలంలో బియ్యం ఇవ్వకుండా పౌరసరఫరాల సంస్థకు నష్టం కలిగిస్తున్న మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల మూడో వారం నుంచి మొదలయ్యే యాసంగి సీజన్ నుంచే దీనిని అమలు చేయనుంది. సీఎంఆర్‌లో జాప్యం చేస్తున్న 300కుపైగా మిల్లులను డిఫాల్ట్ మిల్లులుగా అధికారులు ఇప్పటికే గుర్తించి, జాబితా సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ మిల్లులకు ధాన్యం కేటాయింపులను పూర్తిగా నిలిపేసి.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ అధికారులు మంత్రి గంగుల ద్వారా సీఎంకు ప్రతిపాదనలు అందజేసినట్టు సమాచారం. ఆరునెలల్లోగా ఇవ్వాల్సి ఉన్నా.. వచ్చేనెల నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు చేర్చాక రైతుల ఖాతాలో డబ్బులు జమవుతాయి. మిల్లర్లు ఆ ధాన్యాన్ని తీసుకున్నాక ఆరు నెలల్లోగా మరాడించి బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థ ద్వారా ఎఫ్‌సీఐకి అప్పగించాలి. కానీ మిల్లర్ల నుంచి తగిన సమయంలో సీఎంఆర్ రాకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐను గడువు పెంచాలని కోరడం ఏటా జరిగే తంతుగా మారింది. 2019–20 యాసంగి సీజన్‌కు సంబంధించి 118 మిల్లులు ఇప్పటివరకు సీఎంఆర్ ఇవ్వలేదు. మూడేళ్లుగా పెనాల్టీతో గడువు పెంచుతున్నా ఇప్పటికీ సీఎంఆర్ పెండింగ్‌లోనే ఉండటం గమనార్హం. గడువు ముగిసిన తరువాత ఎఫ్‌సీఐ బియ్యం తీసుకోకపోతే వాటిని రాష్ట్ర అవసరాలకు మళ్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేగాకుండా సీఎంఆర్ ఆలస్యంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. దీనితో ఇకపై మిల్లర్ల ఆగడాలను ఉపేక్షించొద్దని, ధాన్యం కేటాయింపుల్లో కోత విధించాలని.. 6 నెలల్లో సీఎంఆర్ పూర్తి చేసే కెపాసిటీలోనే కేటాయింపులు జరపాలని నిర్ణయించినట్టు తెలిసింది. మిల్లర్లకు కేటాయించగా మిగిలే ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ ద్వారానే మిడిల్ పాయింట్ స్టోరేజీ గోడౌన్లకు తరలించి.. ప్రైవేటు వ్యక్తులకు విక్రయించాలని కూడా యోచిస్తోంది. కొనుగోళ్ల బాధ్యతలు కలెక్టర్లకు.. రాష్ట్రంలో కొన్ని సీజన్లుగా ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ ప్రక్రియ అదనపు కలెక్టర్ల నేతృత్వంలో జరుగుతోంది. కొన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల సంస్థ అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వచ్చే యాసంగి సీజన్లో కొనుగోలు ప్రక్రియ పూర్తిగా కలెక్టర్ల నేతృత్వంలో జరపాలని నిర్ణయించారు. దీనిపై ఏప్రిల్ 10న మంత్రుల సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. సీఎంఆర్‌లో లేని మిల్లులకు ధాన్యం ఇప్పటివరకు సీఎంఆర్‌తో సంబంధం లేకుండా ప్రైవేటుగా ధాన్యం కొనుగోలు చేసి, బియ్యంగా మార్చి అమ్ముకునే మిల్లులను ఈసారి సీఎంఆర్ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. మిర్యాలగూడ, నిజామాబాద్, నల్లగొండ వంటి కొన్ని ప్రాంతాల్లో 100కుపైగా మిల్లులు పౌరసరఫరాల శాఖ, సీఎంఆర్‌తో సంబంధం లేకుండా పనిచేస్తున్నాయి. వాటిని గుర్తించి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. -
మిల్లర్ల నిర్లక్ష్యం..సర్కార్‌పై రూ.1,257 కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడితో రైతుల కన్నా అధికంగా లాభాలు ఆర్జిస్తున్న మిల్లర్లు సీఎంఆర్ లక్ష్యాన్ని మాత్రం చేరుకోవడం లేదు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావలసిన రూ.వేల కోట్ల బియ్యం సొమ్ము రాకుండాపోతోంది. ఇదే క్రమంలో 2021–22 వానాకాలం సీజన్‌కు సంబంధించి 3.93 లక్షల మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఫిబ్రవరి నెలాఖరులోగా ఎఫ్‌సీఐకి అప్పగించలేదు. రాష్ట్ర ప్రభుత్వం మరోనెల గడువు కోరినా కేంద్రం ససేమిరా అనడంతో ఈ బియ్యం భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడినట్లయింది. 47.04 ఎల్ఎంటీ బియ్యంలో ఇచ్చింది 43 ఎల్ఎంటీ.. 2021–22 వానకాలం సీజన్‌కు సంబంధించి 70.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి మిల్లర్లకు అప్పగించింది. ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 47.04 ఎల్ఎంటీ బియ్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్‌గా ఎఫ్‌సీఐకి డెలివరీ చేయాలని నిర్దేశించింది. అయితే ఏడాది గడిచినా కేవలం 43 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి అప్పగించారు. ఇంకా 3.93 లక్షల మెట్రిక్ టన్నులు పెండింగ్‌లో ఉన్నాయి. దీని విలువ రూ.1,257 కోట్లు. మిల్లర్ల నుంచి 3.93 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐ తీసుకోకపోతే, ఆ బియ్యాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తీసుకొని రాష్ట్ర అవసరాల కోసం స్టేట్ పూల్ కింద వినియోగించుకోవలసి ఉంటుంది. అయితే మిల్లర్లు రీసైక్లింగ్, ఇతర అక్రమ పద్ధతుల ద్వారా ఇచ్చే నాణ్యత లేని బియ్యాన్ని కార్పొరేషన్ అధికారులు ఎలాంటి తనిఖీలు లేకుండా తీసుకొని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తిరిగి రేషన్ దుకాణాలకు పంపించే అవకాశం ఉంది. 2021–22 యాసంగి సీఎంఆర్‌కు ఈనెలాఖరు వరకు గడువు గత 2021–22 యాసంగి సీజన్‌కు సంబంధించి ఈ నెల 31లోగా సీఎంఆర్ ప్రక్రియ పూర్తిచేయాలని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. భారత ప్రభుత్వ డిప్యూటీ కార్యదర్శి జై ప్రకాశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు యాసంగి సీఎంఆర్ గడువును మార్చి 31 వరకు పొడిగిస్తున్నామని, తరువాత గడువు పొడిగించబోమని స్పష్టం చేశారు. గత యాసంగికి సంబంధించి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. 34.06 ఎల్ఎంటీ బియ్యం ఎఫ్‌సీఐకి సీఎంఆర్ కింద ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 21.45 ఎల్ఎంటీ బియ్యం మాత్రమే ఇచ్చారు. ఇంకా 12.61 ఎల్ఎంటీ బియ్యం పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్రం ఈ నెలాఖరు వరకు గడువు ఇచి్చనప్పటికీ, రోజుకు 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లింగ్ చేస్తే తప్ప నెలాఖరుకు లక్ష్యం చేరుకోలేమని, అందుకు అనుగుణంగా మిల్లింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ శనివారం అధికారులను ఆదేశించారు. గత యాసంగికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మొత్తం సీఎంఆర్‌లో 14 ఎల్ఎంటీ మేర బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు కూడా కేంద్రం అనుమతి ఇచి్చనప్పటికీ, మిల్లర్లు ఇంకా 6.64 ఎల్ఎంటీ బాయిల్డ్ రైస్ పెండింగ్‌లో ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. సూర్యాపేట, వనపర్తి, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో సీఎంఆర్ పెండింగ్ అధికంగా ఉండటంపట్ల రవీందర్ సింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ధాన్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: వచ్చే యాసంగి సీజన్లో తెలంగాణలో పండే పంటలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జాతీయ అవసరాల కోసం సేకరించేందుకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. బుధవారం ఢిల్లీలో వివిధ రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ అధికారులు, మంత్రులతో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో వచ్చే రబీలో ఏయే రాష్ట్రం నుంచి ఎంత మేర ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయాలనే దానిపై స్పష్టత ఇచ్చారు. 80 ఎల్ఎంటీ ధాన్యాన్ని మిల్లింగ్ చేయగా వచ్చే 54 లక్షల మెట్రిక్ టన్నుల ముడిబియ్యాన్ని ఈ యాసంగి సీజన్లో కేంద్రం సెంట్రల్ పూల్ కింద ఎఫ్‌సీఐ ద్వారా సేకరించనుంది. దీనికి సంబంధించి రైతులకు మద్ధతుధరను కేంద్ర ప్రభుత్వం చెల్లించేందుకు అంగీకరించింది. 1.28 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడికి అవకాశం యాసంగిలో సాగైన పంట విస్తీర్ణం ఆధారంగా వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 1.28 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇందులో బహిరంగ మార్కెట్లో విక్రయాలు, మిల్లర్ల కొనుగోళ్లు , రైతుల సొంత అవసరాలు పోగా 80 నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానున్నట్లు పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. అందుకు అనుగుణంగానే కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు నివేదికలు పంపింది. ఇక ఈ ఏప్రిల్ నుంచి ప్రభుత్వ పథకాలన్నింటికీ బలవర్ధక బియ్యం (ఫోరి్టఫైడ్ రైస్) ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ముడి బియ్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ (ఎఫ్ఆర్కే)తో 1:100 నిష్పత్తిలో కలిపి పంపిణీ చేయనున్నారు. కాగా యాసంగిలో ముడిబియ్యంగా కాకుండా బాయిల్డ్ రైస్‌గా తెలంగాణ నుంచి సేకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. సమావేశంలో తెలంగాణ ప్రతినిధులుగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ బి.అనిల్‌కుమార్, పౌర సరఫరాల కార్పొరేషన్ జీఎం రాజిరెడ్డి హాజరయ్యారు. -
ముంచుకొస్తున్న సీఎంఆర్ గడువు
సాక్షి, హైదరాబాద్: అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా రాష్ట్రంలో మిల్లర్ల తీరు మారడం లేదని తెలుస్తోంది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ఎఫ్‌సీఐకి సకాలంలో అప్పగించాల్సిన మిల్లర్లు ఎన్నిసార్లు గడువు పెంచినా లక్ష్యాన్ని అందుకోవడం లేదు. 2020–21 యాసంగికి సంబంధించి 1.36 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అప్పగింత గడువు ముగియడంతో ఆ మొత్తాన్ని స్టేట్ పూల్ కింద రాష్ట్ర అవసరాలకు మళ్లించారు. 2021–22 వానాకాలం సీఎంఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈనెలాఖరు వరకు గడువు ఇచ్చినప్పటికీ అప్పగింత ఇంకా పూర్తికాలేదు. వానాకాలం సీఎంఆర్ కింద 47.04 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు పౌరసరఫరాల సంస్థకు అప్పగించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 36 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే లెవీ రూపంలో ఎఫ్‌సీఐకి చేరింది. అంటే ఇంకా 11 లక్షల మెట్రిక్ టన్నులు రావలసి ఉంది. నెల రోజులలో 9 ఎల్ఎంటీ సీఎంఆర్ అప్పగింత విషయంలో జాప్యంపై గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెల 24వ తేదీ నాటికి 27 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అప్పగించారు. లక్ష్యాన్ని పూర్తి చేయాలని అప్పట్లో మంత్రి గంగుల అధికారులతో సమావేశం అయి గట్టిగా చెప్పడంతో, కష్టంమీద నెలరోజుల్లో 9 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌ను అప్పగించారు. ఇక మిగిలింది 11 లక్షల మెట్రిక్ టన్నులు అయినా.. ఇంత బియ్యం మిల్లింగ్ చేసి అప్పగించడం అసాధ్యమేనని అర్థమవుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరో నెల గడువు కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేయడమో.. లేక స్టేట్ పూల్ కింద సొంతానికి వాడుకోవడమో చేయాల్సి ఉంటుందని చెపుతున్నారు. ముందుకు కదలని గత యాసంగి సీఎంఆర్ 2021–22 యాసంగికి సంబంధించిన సీఎంఆర్ కూడా ముందుకు సాగడం లేదని అధికారవర్గాలు చెపుతున్నాయి. యాసంగిలో 50.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు పంపగా, సీఎంఆర్ కింద 33.93 లక్షల మెట్రిక్ టన్నులను ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. అయితే గతనెల 24వ తేదీ నాటికి కేవలం 9.18 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే సీఎంఆర్ కింద ఇచ్చారు. అప్పటి నుంచి ఈ నెలరోజుల్లో కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అదనంగా మిల్లింగ్ చేసి పౌరసరఫరాల సంస్థ ద్వారా ఎఫ్‌సీఐకి అప్పగించారు. ఇంకా 20.06 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. దీనికోసం మరో మూడు నెలల వరకు గడువు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. 4,183 కొనుగోలు కేంద్రాలు మూసివేత 2022–23 వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 7,007 కొనుగోలు కేంద్రాలను తెరిచి రూ. 11,542 కోట్ల విలువైన 56.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన 4,183 కేంద్రాలను మూసివేశారు. రాష్ట్రంలో 9.95 లక్షల మంది రైతులకు సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు తెలిపారు. -
మిల్లుల్లోనే కోటి మెట్రిక్ టన్నులు!
సాక్షి, హైదరాబాద్: ఎప్పటికప్పుడు గడువు పెంచుతున్నప్పటికీ.. రాష్ట్రంలోని రైస్ మిల్లుల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఎఫ్‌సీఐ గోడౌన్లకు చేరడం ఆలస్యమవుతోంది. ప్రస్తుతం మిల్లర్ల వద్ద ఇప్పటికే ఏకంగా కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్టు పౌర సరఫరాల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో 2020–21 యాసంగి మొదలు 2021–22 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉంది. తాజాగా 2022–23 వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుల నుంచి సేకరించిన 40 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం కూడా మిల్లులకు చేరింది. దీంతో రాష్ట్రంలోని సుమారు 3 వేల రైస్‌మిల్లులు ధాన్యం నిల్వలతో నిండిపోయినట్లు తెలుస్తోంది. ఇలావుండగా జనవరి నెలాఖరులోగా మరో 50 ఎల్ఎంటీ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సజావుగా సాగని మిల్లింగ్.. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు పంపించేటప్పుడే 45 రోజుల్లోగా కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యం ఎఫ్‌సీఐకి అప్పగించాలని పౌరసరఫరాల శాఖ మిల్లర్లతో ఒప్పందం చేసుకుంటుంది. అయితే మిల్లర్లు ఏనాడూ 45 రోజుల్లో మిల్లింగ్ పూర్తి చేసిన దాఖలాల్లేవు. ఇక గత రెండు మూడేళ్లుగా రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరుగుతున్న నేపథ్యంలో మిల్లింగ్ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. ఎంతగా అంటే 2020–21 సంవత్సరపు యాసంగి ధాన్యం 2.03 ఎల్ఎంటీలను ఇక మిల్లింగ్ చేయలేమని మూడు నెలల క్రితం చేతులెత్తేసేంత వరకు. ప్రస్తుత వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతుండగా, 2021–22 వానాకాలం ధాన్యం 70.22 ఎల్‌ఎంటీల్లో 20.83 ఎల్ఎంటీలు మిల్లింగ్ చేయాల్సి ఉంది. ఇక అదే ఏడాది యాసంగికి సంబంధించిన 50.39 ఎల్ఎంటీల ధాన్యంలో ఇప్పటివరకు కేవలం 13 ఎల్ఎంటీలు మాత్రమే మిల్లింగ్ జరిగింది. ఇంకా 36.93 ఎల్ఎంటీల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. ఇలా గత మూడు సీజన్లకు సంబంధించి 59.79 ఎల్ఎంటీల ధాన్యం అంటే సుమారు 40 ఎల్ఎంటీల బియ్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. ఐదు నెలల్లో 34 ఎల్‌ఎంటీలే మిల్లింగ్! సీఎంఆర్ విషయంలో మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరు, సీఎంఆర్ అప్పగింతలో ఆలస్యంపై కేంద్రం గత జూలైలో సీరియస్ అయింది. సీఎంఆర్ తీసుకునేది లేదని రాష్ట్రానికి అల్టిమేటం ఇచ్చింది. అప్పటికి రాష్ట్రంలో మూడు సీజన్లకు సంబంధించి 93.76 ఎల్ఎంటీల ధాన్యం మిల్లర్ల వద్ద ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ లెక్కలు కట్టింది. మొత్తం మీద ఆగస్టు నుంచి తిరిగి సీఎంఆర్ తీసుకునేందుకు ఎఫ్‌సీఐ ముందుకు వచ్చింది. దీంతో మిల్లింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మిల్లింగ్ చేస్తున్నప్పటికీ.. ఐదు నెలల్లో లెవీ కింద ఎఫ్‌సీఐకి అప్పగించిన బియ్యం 34 ఎల్‌ఎంటీలే కావడం గమనార్హం. అంటే నెలకు 10 ఎల్ఎంటీల ధాన్యాన్ని కూడా మిల్లింగ్ చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ సీజన్లో 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడి నేపథ్యంలో ఈ సీజన్లో కొనుగోలు కేంద్రాలకు 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు 6.85 లక్షల మంది రైతుల నుంచి 40.06 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. వచ్చే జనవరి నాటికి మరో 50 ఎల్ఎంటీల ధాన్యం సేకరించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మిల్లుల్లోని ధాన్యాన్ని సీఎంఆర్ కింద ఎప్పటికప్పుడు గోడౌన్లకు తరలించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ దిశగా అధికార యంత్రాంగం మిల్లర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. -
రాష్ట్రంలో గోదాములు ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడూ బియ్యం బస్తాలతో నిండుగా కనిపించే గోదాములు స్టాక్ లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. వాటి ముందు ‘గోదాములు కిరాయికి ఇవ్వబడును’అనే బ్యానర్లు వెలుస్తున్నాయి. దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో.. ఎఫ్‌సీఐ రాష్ట్రంలోని గోడౌన్లలో ఉన్న బియ్యాన్ని అవసరమైన రాష్ట్రాలకు పంపుతోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎఫ్‌సీఐ గోదాములకు చేరాల్సిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం దాదాపు నాలుగు నెలలుగా సరిగా రావడం లేదు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన మిల్లర్లు.. వివిధ కారణాలతో మిల్లింగ్ ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో గోడౌన్లు ఖాళీగా ఉంటున్నాయి. వీటిని అవసరమైన వ్యాపారులు, సంస్థలకు అద్దెకు ఇచ్చేందుకు వేర్ హౌజింగ్ కార్పొరేషన్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. గోదాముల్లో స్టాక్ 43 శాతమే.. భారత ఆహార సంస్థ లెక్కల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌సీఐ, సీడబ్ల్య్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోడౌన్లతోపాటు ప్రైవేటు వ్యక్తులకు చెందిన గోదాములు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అందులో ఎఫ్‌సీఐ తన సొంత గోదాములతోపాటు రాష్ట్ర, కేంద్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ల పరిధిలోనివి, ప్రైవేటుకు చెందినవి కలిపి 43 ప్రాంతాల్లోని గోదాములను లీజుకు తీసుకొని నిర్వహిస్తోంది. ఎఫ్‌సీఐ లెక్కల ప్రకారం 13.58 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యమున్న ఈ గోదాములలో ప్రస్తుతం 5.83 లక్షల టన్నుల స్టాక్ మాత్రమే ఉంది. ఇది పూర్తి సామర్థ్యంలో 42.94 శాతం మాత్రమే. ఇవికాకుండా ప్రైవేటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కింద కొన్ని, ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే మరికొన్ని గోదాములు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. మిల్లుల నుంచి బియ్యం రాకపోవడంతో ఎఫ్‌సీఐ ఖాళీచేసిన గోదాములను ఇతర వ్యాపారులకు, సంస్థలకు అద్దెకు ఇచ్చేందుకు సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు పని లేకపోవడంతో ఈ గోదాముల్లోని హమాలీలు ఇబ్బందిపడుతున్నారు. ఇక్కడి గోదాములు బియ్యానికే పరిమితం రాష్ట్రంలో ఎఫ్‌సీఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన గోదాములన్నీ బియ్యం నిల్వ చేయడానికి ఉద్దేశించినవే. ఎఫ్‌సీఐ అప్పుడప్పుడూ గోధుమలను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి గోదాముల్లో నిల్వ చేస్తుంది. ప్రస్తుతం గోదాముల్లో ఉన్న నిల్వల్లో గోధుమలు, ఇతర ఆహార పదార్థాలు కలిపి అంతా 5 శాతంలోపేనని.. మిగతా 95 శాతం బియ్యమేనని ఎఫ్‌సీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ బియ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు సెంట్రల్ పూల్ కింద ఇతర రాష్ట్రాలకు పంపిస్తుండడంతో ఖాళీలు ఏర్పడుతున్నాయని వివరించారు. మిల్లుల్లోనే 65 లక్షల టన్నుల ధాన్యం రాష్ట్రంలో సుమారు ఆరు నెలలుగా కస్టమ్ మిల్లింగ్ సజావుగా సాగడం లేదని అధికారవర్గాలు చెప్తున్నాయి. మిల్లర్లు తమ సొంత అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారనే విమర్శలున్నాయి. ఎఫ్‌సీఐ చర్యలకు దిగినప్పుడు మాత్రమే సీఎంఆర్ అప్పగిస్తున్నట్టు హడావుడి చేస్తున్న మిల్లర్లు.. తర్వాత తమ సొంత అవసరాల మేరకే మిల్లింగ్ జరుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది వానాకాలం ధాన్యం ఇప్పటికీ 15 లక్షల టన్నుల వరకు మిల్లర్ల వద్ద ఉండగా.. గత యాసంగికి సంబంధించిన 50లక్షల టన్నులు టార్పాలిన్ల కింద మగ్గిపోతోంది. అంటే 65 లక్షల టన్నుల ధాన్యం ఇంకా మిల్లర్ల వద్దే ఉంది. దీన్ని మిల్లింగ్ చేస్తే 40 లక్షల టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి అందుతుంది. ఆ బియ్యాన్ని గోడౌన్లకు తరలించి నిల్వ చేయనున్నారు. -
గత వానాకాలం సీఎంఆర్ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: గత సంవత్సరం వానాకాలం (2021–22) సీజన్‌కు సంబంధించి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పెంచింది. సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసిన ఈ గడువును పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు పలుమార్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖను అభ్యర్థించినా స్పందించలేదు. దీంతో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని మిల్లులనుంచి వానాకాలం సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ తీసుకోవడం లేదు. గత వానాకాలం సీజన్లో 70.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, సీఎంఆర్ కింద 47.04 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సెంట్రల్ పూల్ ద్వారా ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. కానీ సెప్టెంబర్ నెలాఖరు నాటికి 30 ఎల్ఎంటీ బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి ఇచ్చారు. మరో 17 ఎల్ఎంటీ అప్పగించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ, ఎఫ్‌సీఐ అధికారులతో మాట్లాడిన ఆయన, నవంబర్ వరకు గడువు ఇస్తే పూర్తిస్థాయిలో సీఎంఆర్ అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అశోక్‌కుమార్ వర్మ నవంబర్ ఆఖరు వరకు గడువు పెంచుతూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. యాసంగి ఫోర్టిఫైడ్ రైస్.. మరో 4 ఎల్ఎంటీకి కేంద్రం అనుమతి గత యాసంగిలో ఉత్పత్తి అయిన ధాన్యం నుంచి సీఎంఆర్ కింద అదనంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ పారాబాయిల్డ్ రైస్‌ను సెంట్రల్‌పూల్‌కు తీసుకునేందుకు కూడా కేంద్రం ఒప్పుకున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గత జూలై నుంచి కురిసిన వర్షాలకు మిల్లుల్లోని ధాన్యం తడిసిపోగా, ముడి బియ్యంగా సీఎంఆర్ చేయడానికి పనికిరాని పరిస్థితి నెలకొందని తెలిపారు. అలాగే సాధారణ యాసంగి ధాన్యం సైతం ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకలు ఎక్కువ వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల 8 లక్షల మెట్రిక్ టన్నుల యాసంగి ధాన్యాన్ని ఫోర్టిఫైడ్ పారాబాయిల్డ్ బియ్యంగా తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. తాజా అనుమతితో కలిపి మొత్తం 12 ఎల్ఎంటీ పారాబాయిల్డ్ ఫోర్టిఫైడ్ రైస్‌ను సెంట్రల్‌పూల్‌కు ఇస్తామని చెప్పారు. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.180 కోట్లు ఆదా అవుతాయని మంత్రి గంగుల కమలాకర్ హర్షం వ్యక్తం చేశారు. -
FCI data: ఐదేళ్ల కనిష్టానికి ఆహార ధాన్యాల నిల్వలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఆహార ధాన్యం నిల్వలు ఏడాదిలో భారీగా తగ్గాయి. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సెంట్రల్ ఫూల్ కింద సేకరించి పెట్టిన గోధుమ, బియ్యం నిల్వలు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయినట్లు అక్టోబర్ గణాంకాలు చెబుతున్నాయి. ఐదేళ్ల క్రితం 2017లో బియ్యం, గోధుమల మొత్తం నిల్వలు 4.33 కోట్ల మెట్రిక్ టన్నుల కనిష్టానికి పడిపోగా, ప్రస్తుతం అదేరీతిన నిల్వలు 5.11 కోట్ల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. గత ఏడాది నిల్వలు 8.16 కోట్లతో పోల్చినా 37 శాతం నిల్వలు తగ్గడం, ఇందులో ముఖ్యంగా గోధుమల నిల్వలు ఏకంగా 14 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం కేంద్రానికి ఆందోళన కలిగిస్తోంది. ఉచితంతో బియ్యం.. దిగుబడి తగ్గి గోధుమలకు దెబ్బ.. దేశంలో కరోనా నేపథ్యంలో కేంద్రం 2020 ఏప్రిల్ నుంచి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద 81 కోట్ల జనాభాకు ఉచిత బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఇప్పటికే ఆరు విడతలుగా అమలు చేసిన బియ్యం పథకం కింద 11.21 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసింది. ప్రస్తుత అక్టోబర్ నుంచి మరో మూడు నెలలు ఉచిత బియ్యం పథకాన్ని కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం చేసింది. ఈ మూడు నెలల కాలానికి మరో 1.22 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరాలు ఉంటాయని అంచనా వేసింది. ఉచిత బియ్యం పథకం నేపథ్యంలో ఎన్నడూ లేనంతగా బియ్యం నిల్వలు కేంద్రం వద్ద తగ్గాయి. గత ఏడాది కేంద్రం వద్ద అక్టోబర్‌లో 3.47 కోట్ల బియ్యం నిల్వలు ఉండగా, అది ఈ ఏడాది 2.83 కోట్లకు పడిపోయింది. అయితే బియ్యం నిల్వలు తగ్గినంత మాత్రాన ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఏం లేదని, కేంద్ర పథకాల కొనసాగింపునకు ఇదేమీ అడ్డుకాదని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే ఖరీఫ్ పంటల కోతలు ఆరంభం అయినందున వీటితో మళ్లీ నిల్వలు పెంచుకునే అవకాశం ఉందని అంటోంది. అయితే గోధుమల పరిస్థితి మాత్రం కొంత భిన్నంగా ఉంది. గోధుమల నిల్వలు గతంతో పోల్చితే తీవ్రంగా తగ్గాయి. 2017లో గోధుమల నిల్వలు 2.58 కోట్ల టన్నులు, 2018లో 3.56 కోట్లు, 2019లో 3.93 కోట్లు, 2020లో 4.37 కోట్లు, 2021లో 4.68 కోట్ల టన్నుల మేర నిల్వలు ఉండగా, అవి ఈ ఏడాది ఏకంగా 2.27 కోట్ల టన్నులకు తగ్గాయి. కరోనా పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా కరువు పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇతర దేశాలకు భారత్ నుంచి ఎగుమతులు పెరిగాయి. ఎగుమతులు పెరగ్గా, దేశంలో అతివృష్టి కారణంగా పంటలు దారుణంగా దెబ్బ తినడంతో దిగుబడులు తగ్గాయి. దీంతో కేంద్రం వద్ద నిల్వలు తగ్గాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ ఏడాది మే నెలలో గోధుమల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. అయినప్పటికీ మే నుంచి అధిక ఉష్ణోగ్రతల కారణంగా గోధుమ పంట దిగుమతులు తగ్గాయి. దీంతో అనుకున్న స్థాయిలో కేంద్రం నిల్వలు సేకరించలేకపోయింది. డిమాండ్‌ను గుర్తించి వ్యాపారులు ముందస్తు నిల్వలు చేశారు. ఈ ప్రభావం స్టాక్‌లపై పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపారుల గోధుమ నిల్వలను బహిర్గతం చేయాలని ఆదేశాలివ్వడం, దేశీయ లభ్యతను పెంచడానికి స్టాక్ పరిమితులను విధించడం వంటి చర్యలను కేంద్రం పరిగణించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
మిల్లర్లకు ధాన్యం బంద్..!
సాక్షి, హైదరాబాద్: రైస్ మిల్లర్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. గత రెండు మూడు సీజన్లలో సకాలంలో సీఎంఆర్ ఇవ్వడంలో విఫలమైన 80% డిఫాల్టర్ మిల్లులకు భవిష్యత్తులో మిల్లింగ్ కోసం ధాన్యాన్ని ఇవ్వకూడదని నిర్ణయించింది. మిల్లర్లకు శ్రమ లేకుండా ఏటా లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వమే సేకరించి పంపుతున్నా, దాన్ని సకాలంలో కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) చేసి ఎఫ్‌సీఐకి అప్పగించడంలో వారు నిర్లక్ష్యంగా ఉంటున్నారని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే వానాకాలం సీజన్ ధాన్యాన్ని రాష్ట్రంలోని మిల్లులకు బదులు పొరుగు రాష్ట్రాల్లోని మిల్లులకు పంపాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఆదివారం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర అధికారులు సమావేశమై ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. మిల్లుల్లో 75 ఎల్ఎంటీల నిల్వలు ప్రస్తుతం రాష్ట్రంలోని సుమారు 3 వేల రైస్‌మిల్లుల్లో 75 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం నిల్వ ఉంది. గత వానాకాలం సీఎంఆర్ ఇప్పటివరకు 60 శాతం కూడా పూర్తి కాలేదు. 47 ఎల్ఎంటీ సీఎంఆర్‌కు గాను ఇప్పటివరకు 30 ఎల్ఎంటీ కూడా ఇవ్వలేదు. ఇంకా 25 ఎల్ఎంటీలకు పైగా ధాన్యం నిల్వలు మిల్లుల్లో ఉన్నాయి. అలాగే మొన్నటి యాసంగిలో సేకరించిన 50 ఎల్ఎంటీల ధాన్యం కూడా మిల్లుల్లోనే ఉంది. మరో రెండు నెలల్లో ఈ వానాకాలం ధాన్యం రాబోతోంది. ఈ సీజన్లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా సుమారు 1.30 కోట్ల టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా, ఇందులో కొనుగోలు కేంద్రాలకు సుమారు కోటి టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వచ్చే వానాకాలం ధాన్యాన్ని ప్రైవేట్ గోడౌన్లు వంటి మిడిల్ పాయింట్లలో నిల్వ ఉంచాలని నిర్ణయించింది. ఈ మిల్లుల నుంచి డిఫాల్టర్ మిల్లులకు ధాన్యం పంపకుండా నేరుగా ఇతర రాష్ట్రాలకు తరలించాలని నిర్ణయించింది. మిల్లర్ల తీరుకు తోడు కేంద్రం వైఖరితో.. రైతులకు మద్దతు ధర చెల్లిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ ధాన్యాన్ని మిల్లులకు అప్పగిస్తోంది. సెంట్రల్ పూల్ కింద ఎఫ్‌సీఐ నేరుగా మిల్లుల నుంచి బియ్యాన్ని (సీఎంఆర్) తీసుకుంటోంది. ఎఫ్‌సీఐకి బియ్యం వెళ్లిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి చెల్లించిన మద్దతు ధరను కేంద్రం రీయింబర్స్మెంట్ పద్ధతిలో తిరిగి చెల్లిస్తోంది. అయితే గత రెండేళ్లుగా పెరిగిన ధాన్యం దిగుబడి నేపథ్యంలో మిల్లర్లు సీఎంఆర్ విషయంలో మరింత ఆలస్యం చేస్తున్నారు. మరోవైపు గడువు ముగిసిన తర్వాత సీఎంఆర్‌ను తీసుకునేందుకు కేంద్రం అంగీకరించడం లేదు. గత వర్షాకాలం సీజన్ సీఎంఆర్‌కు ఈ నెలాఖరు వరకు గడువు కాగా, ఇప్పటివరకు ఎఫ్‌సీఐ గడువు పెంచలేదు. మిల్లర్ల ఆలస్యం కారణంగా 2019–20, 2020–21 యాసంగి సీజన్‌కు సంబంధించి సుమారు రూ. 700 కోట్ల భారం పౌరసరఫరాల శాఖపై పడింది. ఇలావుండగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ మొదలు బీజేపీ నేతలంతా రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ సకాలంలో ఇవ్వడం లేదని, మిల్లర్ల ఆగడాలకు సహకరిస్తోందని విమర్శిస్తూ జాతీయ స్థాయిలో అప్రదిష్టపాలు చేస్తున్నారు. ఇలా వివిధ కారణాలతో సీఎమ్మార్ అందించడంలో మిల్లర్లు ఆలస్యం చేయడం, కేంద్రం సీఎంఆర్ గడువు పెంచే విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రి సీరియస్ రాష్ట్రంలోని మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరు, తద్వారా ప్రభుత్వం అప్రదిష్ట మూటగట్టుకుంటున్న అంశంపై మంత్రి సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లోని మిల్లులకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని పంపించి, మిల్లింగ్ చేయించి ఎఫ్‌సీఐకి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ మేరకు ఎఫ్‌సీఐ నుంచి అనుమతి పొందినట్లు సమాచారం. సోమవారం జరిగే పౌరసరఫరాల శాఖ ఉన్నతస్థాయి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
మిల్లుల్లోని ధాన్యంపై ఎఫ్‌సీఐకి అధికారం ఎక్కడిది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. చిన్నచిన్న కారణాలతో ధాన్యం కొనుగోలు చేయబోమని ఎఫ్‌సీఐ లేఖ రాయడంతోనే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో తెలుస్తోందని పేర్కొన్నారు. మిల్లుల్లో అక్రమాలు జరిగినట్లు ఎఫ్‌సీఐ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని స్పష్టంచేశారు. బుధవారం ఆయన విలే కరులతో మాట్లాడుతూ ఎఫ్‌సీఐ తీరును తప్పు బట్టారు. మిల్లుల్లోని వడ్లు, బియ్యంపై ఎఫ్‌సీఐ కి ఏం అధికారముందని ప్రశ్నించారు. రాష్ట్రం లోని రైస్ మిల్లుల్లో వడ్లు, బియ్యం నిల్వలపై ఎఫ్‌సీ ఐకి ఎలాంటి అధికారం లేదని మంత్రి చెప్పారు. సీఎం ఆర్ కింద బియ్యం ఎఫ్‌సీఐకి ఇచ్చిన తరువాతే వారికి అధికారం వస్తుం దని పేర్కొన్నారు. తనిఖీ ల్లో తేడాలు వచ్చినా చర్యలు తీసుకో లేదని ఆరో పణలు చేస్తున్నారని, మార్చిలో ఆరు జిల్లాల్లోని 40 మిల్లులు తనిఖీ చేస్తే 4,53,896 బ్యాగులు లేవని చెప్పారని, రెండో మారు అవే మిల్లుల్లో తనిఖీ చేస్తే 10 మిల్లుల్లో మాత్రమే తేడా ఉందని అన్నారని పేర్కొన్నారు. ఒక్క గింజ తేడా వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఊరుకో దని, మూడు మిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమి నల్ కేసులు పెట్టిందని తెలిపారు. మరో రెండు మిల్లుల్లో మొత్తం ధాన్యాన్ని రికవరీ చేశామని, మిగతా ఐదు మిల్లులపై చర్యలు తీసుకోవా లని కలెక్టర్లకు లేఖలు రాశామని చెప్పారు. రెండో దశలో 63 మిల్లుల్లో తే డా.. అని ఎఫ్‌సీఐ అధికారులు జూన్ 4న లేఖ రాశారని, దాన్ని కలెక్టర్లకు పంపి పరిశీలించ మని ఆదేశించినట్లు వెల్లడించారు. జూన్ నుంచి నవంబర్ వరకు ఉచిత బియ్యం.. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యా న్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేయ డం లేదని ఎఫ్‌సీఐ చేసిన వ్యాఖ్యలు అర్థర హితమని మంత్రి గంగుల పేర్కొన్నారు. సాం కేతిక కార ణాల వల్ల 2 నెలలు ఉచిత బియ్యం సరఫరాలో ఆలస్యం అయిందని, ఈ జూన్ నుంచి యథాతథంగా సరఫరా చేస్తు న్నామని చెప్పారు. 2020 ఏప్రిల్ నుంచి కేంద్రంతో పాటు ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని ఇచ్చా మని, తద్వారా ప్రభుత్వంపై 8 నెలల పాటు రూ.980 కోట్ల భారం పడిందని తెలిపారు. ఇక 2021 జూన్ నుంచి ఏప్రిల్ 2022 వరకు కూడా ఉచితంగా బియ్యం ఇచ్చామని వివరించారు. 2022 మార్చిలో.. ఏప్రిల్ నుంచి ఆరు నెలల పాటు ఉచిత బియ్యం ఇవ్వాలని కేంద్రం లేఖ రాసిందని, తదనుగుణంగా మూడో దశ కూడా ఉచిత బియ్యం ఇవ్వాలని సీఎం నిర్ణయించిన ప్పటికీ సేకరణ, ఇతర కారణాల వల్ల పంపిణీ ఆలస్యం అయిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 90,46,000 కార్డుల్లో కేవలం 53 లక్షల కార్డుదారులకు మాత్రమే కేంద్రం ఉచిత బియ్యం ఇస్తోందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తొలివిడత అందరికీ ఉచితబియ్యం ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ జూన్ నుంచి తెల్ల రేషన్‌కార్డు దారులందరికీ రూ.436 కోట్ల భారాన్ని భరించి నవంబర్ వరకు ఆరు కిలోలకు అదనంగా మరో ఐదు కిలోలు కలిపి 11 కేజీల చొప్పున ఉచితబియ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, పెట్రోల్, డీజిల్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయిల్ కంపెనీలకు చెప్పామని, స్టాక్ ఉండి కూడా ప్రజలకు పెట్రోల్, డీజిల్ ఇవ్వకపోతే బంకులపై చర్యలు తీసుకొం టామని గంగుల హెచ్చరించారు. . -
రైస్ రాకెట్.. రైట్ రైట్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో ‘రైస్ మాఫియా’మరింతగా రెచ్చిపోతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి (సీఎంఆర్) బియ్యాన్ని భారత ఆహా ర సంస్థ (ఎఫ్‌సీఐ)కి పంపాల్సిన మిల్లర్లు.. అడ్డ గోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. రైతుల నుంచి వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, ఆ మంచి బియ్యాన్ని అధిక ధరలకు బయట అమ్ముకుంటున్నారు. ఆ స్థానంలో బయటకొన్న నాణ్యతలేని ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తూ, రేషన్ బి య్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ.. ఎఫ్‌సీఐకి అంటగడుతున్నారు. సివిల్ సప్లైస్, మార్కెటింగ్ అధికారులు, సిబ్బందికి ముడుపులు ఇస్తూ దందా నడిపిస్తున్నారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి ఇటీవల పోటెత్తిన ధాన్యం లారీలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. చెక్‌పోస్టులున్నా రవాణా కొనసాగుతుండటాన్ని బట్టి ఆయా శాఖల అధికారుల సహకారమున్నట్టు స్పష్టమవుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 2,200 రైస్ మిల్లులు ఉండగా.. అందులో వెయ్యి వరకు పారాబాయిల్డ్ మిల్లులు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జనవరి 24నాటికి రాష్ట్ర ప్రభుత్వం 69.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మిల్లర్లకు అప్పగించింది. దీనికి సంబంధించి మిల్లర్లు 46.28 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాలి. కానీ ఇప్పటివరకు 65శాతం మేర కూడా బియ్యాన్ని ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌తోపాటు పాలమూ రులో ఈ పరిస్థితి ఉంది. మిల్లర్లకు చేసిన కేటాయింపులకు, సీఎంఆర్ లెక్కలకు ప్రతి సీజన్లోనూ తేడాలు ఉండటం ఈ అక్రమాలకు నిదర్శనమని ఆరోపణలు వస్తున్నాయి. క్వింటాల్ రూ.1,400కే కొని.. రాష్ట్రంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్విం టాల్ ధాన్యం ఏ–గ్రేడ్ రకానికి రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 మద్దతు ధర పలుకుతోం ది. అదే కర్ణాటకలో క్వింటాల్‌కు రూ.1,400లే పలుకుతోంది. దీంతో కొందరు మిల్లర్లు ముఠాగా ఏర్పడ్డారు. నకిలీ వేబిల్లులతో కర్ణాటక నుంచి నాసిరకం ధాన్యాన్ని తీసుకొచ్చి, సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నారు. మరోవైపు రేషన్ డీలర్లు, వినియోగదారుల నుంచి రేషన్ బియ్యం కొని రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కోటాకు మళ్లిస్తున్నారు. చెక్‌పోస్టులను తప్పించుకుని.. కర్ణాటక సరిహద్దుల్లో తెలంగాణ పరిధిలోని నారాయణపేట జిల్లాలో, గద్వాల జిల్లాలో ఏడు చొప్పున చెక్‌పోస్టులు ఉన్నాయి. పలు చెక్‌పోస్టుల వద్ద రాత్రివేళ నిఘా అంతంత మాత్రంగానే ఉంటోందని.. సిబ్బంది ఒక్కో ధాన్యం లారీకి రూ.2 వేలు చొప్పున తీసుకుని వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఈ చెక్‌పోస్టులే గాకుండా ఇతర దారుల ద్వారా కూడా ధాన్యం లారీలు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. ఎన్ని లారీలు పట్టుబడ్డా.. ♦ఈ నెల 11న కర్ణాటక నుంచి హైదరాబాద్ లోని మిల్లులకు ధాన్యం తరలిస్తున్న 2 లారీల ను కాన్కుర్తిలోని చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు. ♦ఈ నెల 15న నారాయణపేట జిల్లా మక్తల్‌లో ధాన్యం లోడ్‌తో వస్తున్న 16 లారీలను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటకలోని సిర్పూర్, యాద్గిర్, మాన్విల నుంచి ఎలాంటి బిల్లులు లే కుండా హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లోని మి ల్లులకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ♦ఈ నెల 19న కర్ణాటకలోని మాన్వి నుంచి మిర్యాలగూడ, హైదరాబాద్‌లకు ధాన్యం లోడ్‌తో వస్తున్న నాలుగు లారీలను గద్వాల జిల్లా నందిన్నె చెక్‌పోస్టు వద్ద.. మరో రెండు లారీలను ఎర్రవెల్లి చౌరస్తా వద్ద పట్టుకున్నారు. -
రైస్ మిల్లుల్లో ఎఫ్‌సీఐ తనిఖీలు ఆపాలి: మంత్రి గంగుల
సాక్షి, కరీంనగర్: రైస్ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాల తీరుపై భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) చేస్తున్న దాడులపై తెలంగాణ పౌరసరఫరాలశాఖ మంత్రి గుంగుల కమలాకర్ స్పందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఎఫ్‌సీఐ తనిఖీల వెనుక కేంద్రం ముఖ్య ఉద్దేశ్యమేమిటని ప్రశ్నించారు. రైతుల సజావుగా ధాన్యం అమ్ముకోకుండా చేసే కుట్రలో భాగంగానే ఎఫ్‌సీఐ దాడులంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'తెలంగాణలో కొనుగోళ్లు ప్రారంభం కాగానే దాడులు చేస్తున్నారు. రైస్ మిల్లులలో ఉద్దేశ్య పూర్వకంగానే ఎఫ్‌సీఐ తనిఖీలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వంపై దాడి చేయాలని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొనుగోళ్లు సంజావుగా సాగకూడదని కేంద్రం భావిస్తోంది. రైతులు పండించిన పంట రైస్ మిల్లుల వరకూ చేరకూడదని డబ్బులు అందకుండా చేయాలని కేంద్రం ఉద్దేశ్య పూర్వకంగానే తనిఖీలు చేయిస్తోంది. దానివల్ల రైతులు ఇబ్బందులు పడుతారు. వడ్లు మాయం కావు.. కొనుగోళ్లు పూర్తి అయ్యాక ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని కేంద్రానికి విన్నవిస్తున్నాం. చదవండి: (అక్రమాలపై ఎఫ్‌సీ‘ఐ’) కొనుగోళ్లు పూర్తయ్యే వరకూ రైస్ మిల్లులలో ఎఫ్‌సీఐ ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించాలి. కేంద్రానికి అధికారం ఉంది.. మేము వ్యతిరేకించడం లేదు అయితే ఇప్పుడిప్పుడే కోతలు పూర్తయ్యి ధాన్యం వస్తోంది. కాబట్టి ఇది సమయం, సందర్భం కాదు. దీనివల్ల ధాన్యం సేకరణ ఆగిపోతుంది.. రైతులకు ఇబ్బందులు కలుగుతాయి. ధాన్యం సేకరణ పూర్తయ్యాక తనిఖీలు చేస్తే సహకరిస్తామని' తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. చదవండి: (4.54 లక్షల బస్తాలు మాయం) -
4.54 లక్షల బస్తాలు మాయం
సాక్షి, న్యూఢిల్లీ: ‘తెలంగాణలోని రైస్ మిల్లుల్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఉండాల్సిన ధాన్యం నిల్వలు ఉండట్లేదు. గత నెల 31న ఎఫ్‌సీఐ అధికారులు చేసిన తనిఖీల్లో 40 రైస్ మిల్లుల్లో 4,53,896 బస్తాల ధాన్యం కొరత ఉన్నట్టు తేలింది’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ‘మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యాన్ని ఎక్కడికి తరలించారు. ఎవరిని మోసం చేసేందుకు, ఎవరి బ్యాంక్ వడ్డీని తప్పించుకోవడం కోసం ప్రయత్నించారు. ఎఫ్‌సీ ఐకి అందించాల్సిన సమయంలో ధాన్యం ఎలా అం దిస్తారు?’ అని ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం అవకతవకల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రైస్ మిల్లుల్లో స్టాక్స్ పరిశీలనకు ఆకస్మిక తనిఖీలు చేయాలని ఎఫ్‌సీఐ అధికారులను కేంద్రం ఆదేశించిందన్నారు. కొన్ని మిల్లుల్లో ధాన్యం కొరత విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని కోరామని, రైస్ మిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం ఎం దుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. మిల్లు లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర సర్కారుకు కేంద్రం లేఖ రాయబోతోంద న్నారు. రైస్ మిల్లులు, కేంద్రానికి/ఎఫ్‌సీఐకి మధ్య ఎలాంటి ఒప్పందాలు ఉండని కారణంగా నేరుగా సీబీఐ దర్యాప్తు చేయించే అవకాశం కేంద్రానికి ఉండదన్నారు. బియ్యం కొనుగోలుకు అంగీకరించి ఏర్పాట్లు చేయరా? ప్రస్తుత యాసంగి సీజన్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇచ్చేందుకు ఈ నెల 13న తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు ఈ నెల 18న కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఏర్పాట్లు ప్రారంభించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులు, రైస్ మిల్లర్లకు స్పష్టత ఇవ్వలేదన్నారు. పైగా బియ్యం కొనుగోలుకు కేంద్రం అంగీకరించిన తర్వాత కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి గతంలో కేంద్రం అనేక సమావేశాలను నిర్వహిం చినా పచ్చి అబద్ధాలు, విష ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడంతో రాష్ట్రంలోని చాలా మంది రైతులు మద్దతు ధర కన్నా తక్కువకే ధాన్యం అమ్ముకున్నారని, దీనికి బాధ్యులెవరని ప్రశ్నించారు. రాజకీయ స్వలాభం కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడారని, రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని విమర్శించారు. 15 కోట్ల గోనె సంచులకు రాష్ట్రం దగ్గర కోటి కూడా లేవు గత రబీ, ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ టార్గెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి చేయలేదని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుత యాసంగి సీజన్ 60 ఎల్ఎంటీ ధాన్యం సేకరణకు కనీసం 15 కోట్ల గోనె సంచులు అవసరం కాగా తెలంగాణలో కోటి బస్తాలు కూడా లేవన్నారు. అన్ని రాష్ట్రాలూ జనవరి నుంచే గోనె సంచుల సేకరణ ప్రారంభించా యని, తెలంగాణలో మాత్రం ప్రారంభంకాలేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ రకంగా ధాన్యాన్ని సేకరించి రవాణా చేస్తారన్నారు. ‘తండ్రీకొడుకుల ప్రభుత్వం.. తట్టల్లో బియ్యం మోస్తుందా?’ అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలని, యుద్ధ ప్రాతిపదికన రైతుల నుంచి ధాన్యం కొనాలని, రైస్ మిల్లర్లపై అజమాయిషీ చేసి రైతులను ఆదుకునేందుకు ముందుకురావాలని అన్నారు. కమీషన్ల కోసం అప్పులు తెస్తున్నారు రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేసీఆర్ నష్ట పరిహారం ఇస్తే తమకేం ఇబ్బంది లేదని కిషన్‌రెడ్డి అన్నారు. అయితే రాష్ట్రంలో పేదలే లేనట్టు, రైతుల ఆత్మహత్యలు జరగనట్టు, నిరుద్యోగ యువకుల బలిదానాలు చేసుకోనట్టు చూపించే ప్రయత్నం చేయొద్దన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ రాజకీయలు, దుర్మా ర్గాలు, మాఫియా కారణంగా ఆత్మహత్యలు చేసు కుంటున్న కుటుంబాలను ముందు ఆదుకోవాల న్నారు. రాష్ట్రంలో చనిపోయిన రైతులు, అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలన్నారు. కమీషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెస్తోందని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం ఆలోచించే తమకు కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబీకుల సర్టిఫికెట్ అవసరంలేదన్నారు. లేఖలు రాస్తే పట్టించుకోరా? ‘వరి, గోధుమ ఎక్కువగా పండే ప్రాంతాల్లో జీవ ఇంధన అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేయాలని 2018లో అన్ని రాష్ట్రాలను కేంద్రం కోరింది. అదే సంవత్సరంలో అప్పటి పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్.. సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 2019లో తెలంగాణ సీఎస్‌కు మరోసారి లేఖ రాశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పాలసీని ఉపయోగించు కోలేదు. పైగా ఫోర్టిఫైడ్ రైస్ విషయంలోనూ రైస్‌మిల్లర్లను ప్రోత్సహించడంలో విఫలమైంది’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
అక్రమాలపై ఎఫ్‌సీ‘ఐ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ ద్వారా అప్పగించే క్రమంలో రైస్ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాల తీరుపై భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సీరియస్‌గా ఉంది. సేకరించిన ధాన్యాన్ని బియ్యం(సీఎంఆర్)గా ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన మిల్లర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారని.. సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యానికి బదులు పాత బియ్యం, రీసైక్లింగ్ చేసిన పీడీఎస్ (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) బియ్యం ఇస్తున్నారని భావిస్తోంది. దీంతో రాష్ట్రం లోని అన్ని మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ చేశాకే బియ్యం సేకరించాలని జిల్లాల వారీగా ఎఫ్‌సీఐ అధికారులకు ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులకు ఎఫ్‌సీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అశోక్‌కుమార్ బుధవారం లేఖ రాశారు. గత నెలలో భౌతిక తనిఖీల్లో మాయమైన ధాన్యం ఏమైందో తేల్చాలని కూడా రాష్ట్ర ఉన్నతాధికారులను ఎఫ్‌సీఐ ఆదేశించినట్లు సమాచారం. 18,156 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం 2020–21 యాసంగి, 2021–22 వానకాలం సీజన్లలో సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం తీసుకెళ్లిన రైస్ మిల్లులు.. ఆ బస్తాలను నిల్వ చేసి ఎప్పటికప్పుడు మర పట్టించి బియ్యంగా ఎఫ్‌సీఐకి ఇవ్వాలి. అయితే బియ్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించిన విషయం గత నెలలో వెలుగు చూసింది. దీంతో మార్చి 20 నుంచి 23వ తేదీ వరకు 425 మిల్లుల్లో 2020–21 యాసంగి ధాన్యం బస్తాలను, 533 మిల్లుల్లో మొన్నటి వానకాలం సీజన్ ధాన్యం బస్తాలను ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీ చేశారు. 2020–21 యాసంగి ధాన్యానికి సంబంధించి 19 మిల్లుల్లో 1.96 లక్షల ధాన్యం సంచులు, వానకాలం ధాన్యానికి సంబంధించి 21 మిల్లుల్లో 2.58 లక్షల ధాన్యం సంచులు.. మొత్తంగా 18,15 మెట్రిక్ టన్నుల (4.54 లక్షల బ్యాగులు) ధాన్యం మాయమైనట్టు గుర్తించారు. ఈ ధాన్యం బస్తాలకు సంబంధించిన వివరాలేవీ మిల్లర్లు వెల్లడించకపోవడంతో చర్యలు తీసుకోవాలని మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌సీఐ సమాచారమిచ్చింది. గతంలోనూ 20 మిల్లుల్లో జరిపిన భౌతిక తనిఖీల్లో 2020–21 యాసంగి ధాన్యానికి సంబంధించి 1.76 లక్షల బ్యాగులు మిస్సయ్యాయి. ఏమాత్రం తేడా ఉన్నా.. గత మార్చిలో 3,278 రైస్ మిల్లుల్లో భౌతిక తనిఖీలకు ఎఫ్‌సీఐ ఆదేశించింది. అయితే 958 మిల్లుల్లో జిల్లా స్థాయి ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు చేయగా 40 మిల్లుల్లో అవకతవకలు బయటపడ్డాయి. ఇంకో 2,320 మిల్లుల్లో తనిఖీలు చేయాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల ప్రక్రియ సాగలేదు. తాజాగా యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియ మొదలవుతున్నందున గత సంవత్సరం యాసంగి, వానాకాలం ధాన్యం నిల్వలపై తనిఖీలు జరపాలని సంస్థ నిర్ణయించిన ఎఫ్‌సీఐ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 27 కల్లా మిగిలిన 2,320 మిల్లుల్లో ధాన్యం బస్తాలను లెక్కించేందుకు వీలుగా ఉంచాలని ఆదేశించింది. 28న అన్ని మిల్లుల్లో పౌరసరఫరాల శాఖతో కలిసి ఎఫ్‌సీఐ ఫిజికల్ వెరిఫికేషన్ జరపనుంది. బస్తాల లెక్కతో పాటు ఇప్పటి వరకు మిల్లుల్లో సాగిన లావాదేవీలు, లెక్కలనూ అధికారులు తనిఖీ చేయనున్నారు. ధాన్యం బస్తాల నిల్వల్లో ఏమాత్రం తేడాలున్నా రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఎఫ్‌సీఐ నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. యాసంగి సీజన్లో ముడి బియ్యాన్ని సీఎంఆర్‌గా చేసివ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై ఇప్పటికే ఆందోళన చెందుతున్న మిల్లర్లకు ఇది అశనిపాతమే. పాతవో, కొత్తవో తేల్చేందుకు పరీక్షలు మిల్లర్లు ఎఫ్‌సీఐకి అప్పగించే బియ్యం విషయంలో ఇక కఠినంగా ఉండాలని ఎఫ్‌సీఐ నిర్ణయించింది. బియ్యం ఏ సీజన్లో పండిన ధాన్యానికి సంబంధించిందో తేల్చడంతో పాటు ముడి బియ్యమా, ఉప్పుడు బియ్యమా లేక స్టీమ్డ్ రైసా నిర్ధారించేందుకు శాస్త్రీయ పద్ధతితో లిట్మస్ టెస్టు నిర్వహించనుంది. థియో–బార్బిట్యూరిక్ యాసిడ్ (టీబీఏ)తో పరీక్షించడం ద్వారా బియ్యం నాణ్యత తెలుస్తుందని ఇప్పటికే తేలడంతో ఎఫ్‌సీఐ ఈ నిర్ణయం తీసుకుంది. -
మిల్లింగ్‌పై కొర్రీలు పెట్టొద్దు
సాక్షి, హైదరాబాద్: రైతుల శ్రేయస్సు దృష్ట్యా అదనపు ఆర్థికభారాన్ని భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం సేకరిస్తున్నందున మిల్లింగ్ విషయంలో ఎఫ్‌సీఐ అనవసర కొర్రీ లు పెట్టొద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. యాసంగి ధాన్యం సేకరణ నేపథ్యంలో ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో భేటీ అయ్యారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులతో కలసి ధాన్యం సేకరణ, సీఎంఆర్, గోడౌన్ సమస్యలపై చర్చించారు. యాసంగిలో తెలంగాణలో పండే ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూక శాతం ఎక్కువగా ఉం టుందనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. నూక శాతం పెరగడం వల్ల ఎదురయ్యే అదనపు భారాన్ని భరించి సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి ముడి బియ్యం ఇచ్చేందుకు తమ ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. నాణ్యతాప్రమాణాల మేరకు ముడిబియ్యం అందిస్తామని కేంద్రానికి, ఎఫ్‌సీఐకి లేఖలు రాసినట్లు చెప్పారు. గత యాసంగికి సంబంధించి ఎఫ్‌సీఐ సేకరించాల్సిన 5.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ‘ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్’రూపంలో తీసుకోవాలని సూచించారు. వానాకాలం సీజన్ కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని వేగంగా అందించేలా రైల్వే ర్యాకులు, అదనపు స్టోరేజీ కల్పించాలని కోరారు. ధాన్యం తక్కువ సేకరించే రాష్ట్రాలకు, అధి కంగా సేకరించే తెలంగాణకు సీఎంఆర్‌లో ఒకే గడువు ఇస్తున్నారని, ఈ అసమగ్ర విధానాన్ని పున:సమీక్షించాలని దీపక్ శర్మను కోరారు. ఈ యాసంగిలో దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించనున్నామని చెప్పారు. ఇందుకోసం 15 కోట్ల గన్నీ సంచులు అవసరమని, వీటి కోసం జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశామని చెప్పారు. యాసంగి ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడటానికి ఎఫ్‌సీఐ నుంచి డీజీఎం కమలాకర్, పౌర సరఫరాల సంస్థ జీఎం రాజిరెడ్డిని నోడల్ ఆఫీసర్లుగా నియమించనున్నట్లు చెప్పారు. పక్క రాష్ట్రాల ధాన్యాన్ని అడ్డుకోవాలి ఎఫ్‌సీఐ జీఎంతో సమావేశం అనంతరం ధాన్యం కొనుగోలు ప్రక్రియపై పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి కమలాకర్ సమీక్షించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. పక్క రాష్ట్రాల నుంచి ఒక్క వడ్ల గింజ కూడా కొనుగోలు కేంద్రాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం విజిలెన్స్ టీం పక్కా ప్రణాళికలతో ఈ రెండు నెలలు క్షేత్రస్థాయిలో నిరంత రం పర్యవేక్షించాలన్నారు. రీసైక్లింగ్ బియ్యం రాకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని, వస్తే కేసులు నమోదు చేయాలని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 34 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. అనంతరం ధాన్యం సేకరణలో ఉన్న ఆర్థికపరమైన అంశాలపై రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో బీఆర్కే భవన్లో భేటీ అయ్యారు. రుణాలపై రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ, గత బకాయిలు వంటి అంశాలను చర్చించారు. -
ఉప్పుడు బియ్యం బంద్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కోరిన విధంగా యాసంగిలో పండిన ధాన్యాన్ని ముడిబియ్యంగానే (రా రైస్) ఎఫ్‌సీఐకి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సుమారు రెండు దశాబ్దాలకు పైగా యాసంగిలో పండిన ధాన్యాన్ని లెవీ కింద ఉప్పుడు బియ్యంగా (పారాబాయిల్డ్ రైస్) ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నప్పటికీ, ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో దానికి ఫుల్స్టాప్ పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా, ఎన్ని లేఖలు రాసినా, ఆందోళనలు చేసినా ఉప్పుడు బియ్యాన్ని సేకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పడే భారాన్ని భరించి యాసంగిలో బాయిల్డ్ రైస్ స్థానంలో ముడిబియ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీంతో మిల్లర్లు ఉప్పుడు బియ్యానికి స్వస్తి చెప్పి, కేవలం ముడిబియ్యం మిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 2,470 ముడి బియ్యం మిల్లులు ఉండగా, 970 బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయి. అయితే బాయిల్డ్ రైస్ మిల్లుల్లో ముడిబియ్యం మిల్లింగ్ చేసే అవకాశం కూడా ఉంది. వానాకాలంలో అలా.. ఇప్పటివరకు ఉన్న పద్ధతి ప్రకారం.. వానాకాలం (ఖరీఫ్) సీజన్లో వచ్చే ధాన్యాన్ని రైతులు తమ ఆహార అవసరాలకు మినహాయించుకోగా మిగతా దానిని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయిస్తారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మిల్లింగ్‌కు పంపించి ముడిబియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగిస్తుంది. యాసంగిలో ఇప్పటివరకు.. యాసంగి (రబీ)లో వచ్చే ధాన్యంలో కూడా తన అవసరాలకు పోను 80 నుంచి 90 శాతం ధాన్యాన్ని రైతు కొనుగోలు కేంద్రాలకు విక్రయిస్తాడు. ఆ ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లులకు పంపించి, ఉప్పుడు బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగిస్తుంది. ముడిబియ్యంగా మారిస్తే అదనంగా 17 కిలోల నూకలు ప్రస్తుతం యాసంగి పంట కోతలకు వస్తుండటం, కేంద్రం ఉప్పుడు బియ్యం తీసుకోబోమనడం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎఫ్‌సీఐకి ముడి బియ్యాన్నే పంపించాలని స్పష్టం చేయడంతో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. యాసంగి ధాన్యాన్ని సాధారణ పద్ధతుల్లో మిల్లింగ్ చేసి ముడిబియ్యంగా మారిస్తే క్వింటాలుకు అదనంగా 17 కిలోల వరకు నూకలు వచ్చే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పెద్దమొత్తంలో నూక ఉన్న బియ్యాన్ని కేంద్రం తీసుకోదు. కాబట్టి ఆ మేరకు బియ్యాన్ని కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుంది. ఈ భారాన్ని ఎలా భరించాలనే విషయాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించనుంది. ఇప్పటివరకు ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారమే.. ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం.. క్వింటాలు ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే ఏ సీజన్లో అయినా 67 కిలోల బియ్యం రావాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి ఇచ్చే 67 కిలోల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక క్వింటాలు ధాన్యంగా పరిగణనలోకి తీసుకొని కనీస మద్దతు ధర కింద రూ.1,960 రాష్ట్రానికి చెల్లిస్తుంది. అయితే ఈ 67 కిలోల బియ్యంలో 17 కిలోల (25 శాతం) వరకు నూకలు ఉన్నా ఎఫ్‌సీఐ అంగీకరించి, క్వింటాలు ధాన్యంగానే లెక్క కట్టి డబ్బులు చెల్లిస్తుంది. ఇప్పటివరకు ఉప్పుడు బియ్యం ఎఫ్‌సీఐకి ఇచ్చిన నేపథ్యంలో ఎఫ్‌సీఐ నిబంధనల మేరకే అంతా సాగింది. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.2 వేల కోట్ల భారం! ప్రస్తుతం ఉప్పుడు బియ్యం బదులు ముడిబియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి రావడంతో ఈ లెక్కలు మారబోతున్నాయి. యాసంగిలో తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా బియ్యం మొదళ్లు విరిగి నూకల శాతం రెట్టింపు అవుతుంది. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటే, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో కొంత తక్కువగా ఉంటుంది. యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మార్చడం వల్ల క్వింటాలు ధాన్యంపై సగటున మరో 17 కిలోల వరకు నూకలు పెరుగుతాయని అంచనా వేస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2 వేల కోట్ల వరకు భారం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత యాసంగి ధాన్యాన్ని ప్రయోగాత్మకంగా మిల్లింగ్ చేసి, ఎంత మేరకు నూకలు వస్తాయో చూసి, ఎంత భారం పడుతుందో అంచనా వేయడంతో పాటు తక్కువ భారంతో గట్టెక్కేందుకు ఏం చేయాలో సీఎస్ కమిటీ నివేదించనుంది. ఎఫ్‌సీఐకి రెండు మార్గాల్లో.. క్వింటాల్ ధాన్యానికి 67 కిలోల ముడిబియ్యం ఇచ్చేలా రైస్‌మిల్లర్లతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని, అదనంగా సగటున 17 కిలోల వరకు వచ్చే నూకలకు సంబంధించిన మొత్తాన్ని మిల్లర్లకే ఇవ్వాలనేది ఒక ఆప్షన్. అప్పుడు నూకలతో సంబంధం లేకుండా మిల్లర్లు 67 కిలోల బియ్యం ఎఫ్‌సీఐకి అప్పగిస్తారు. ఇక రెండో ప్రత్యామ్నాయంలో క్వింటాల్ ధాన్యాన్ని మిల్లర్లకు ఇస్తే, 67 కిలోలకు బదులు ఎన్ని కిలోల బియ్యం, నూకలు కలిపి ప్రభుత్వానికి ఇస్తారనే దానిపై ఒప్పందం కుదుర్చుకోవలసి ఉంటుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగిస్తుంది. ఈ అంశంపై వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్పాయి. 43 ఎల్ఎంటీ బియ్యం అప్పగించాలి రాష్ట్రంలో ఈ యాసంగిలో 36 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా, 80 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో తిండిగింజలు, విత్తన ధాన్యం, ప్రైవేటుగా విక్రయించే ధాన్యం పోను 65 లక్షల మెట్రిక్ టన్నుల(ఎల్ఎంటీ) ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానుంది. దీన్ని మిల్లింగ్ చేస్తే వచ్చే 43 ఎల్ఎంటీ బియ్యం ఎఫ్‌సీఐకి సీఎంఆర్ కింద అప్పగించాల్సి ఉంటుంది. ఉప్పుడు బియ్యం అంటే... యాసంగి సీజన్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తెలంగాణలో పండిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసేటప్పుడు బియ్యం చివరన విరిగిపోతుంది. దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు దశాబ్దాల క్రితమే ఉప్పుడు బియ్యం విధానం అమలులోకి వచ్చింది. ధాన్యాన్ని నానబెట్టి, నిర్ణీత ఉష్ణోగ్రతలో ఉడకబెట్టి, ఆరబోసి ఆ తర్వాత మిల్లింగ్ చేస్తే వచ్చేది ఉప్పుడు బియ్యం. ఇందుకోసం ప్రత్యేకంగా యంత్రాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ముడి బియ్యం అంటే... పండిన పంటను సాధారణ పద్ధతుల్లో మిల్లింగ్ చేస్తే వచ్చే బియ్యమే ముడి బియ్యం. వానాకాలంలో పండే ధాన్యాన్ని సాధారణ పద్ధతుల్లోనే మిల్లింగ్ చేస్తారు. యాసంగి ధాన్యాన్ని సాధారణ పద్ధతుల్లో మిల్లింగ్ చేస్తే (ముడి బియ్యంగా మారిస్తే) నూకల శాతం ఎక్కువగా వస్తుంది. అందువల్లే రాష్ట్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యంగా మార్చి ఇస్తోంది. అయితే ఉప్పుడు బియ్యానికి డిమాండ్ లేకపోవడంతో ముడి బియ్యం మాత్రమే సేకరిస్తామని కేంద్రం చెబుతోంది. ఇదీ కొనుగోలు విధానం.. రైతు పంట కోసి తేమ 17 శాతానికి తగ్గేవరకు ఎండబెట్టి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తాడు. అక్కడ రైతు పట్టా పాసు పుస్తకంలో ఉన్న భూమి విస్తీర్ణం ఆధారంగా ఎకరాకు 28 క్వింటాళ్ల లోపు దిగుబడి కింద లెక్కలేసి కొనుగోలు చేస్తారు. రైతు విక్రయించిన ధాన్యం డబ్బులు వారం రోజుల్లో బ్యాంకు ఖాతాలో వేస్తారు. ఇక కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యాన్ని అధికారులు మిల్లులకు తరలిస్తారు. మిల్లర్లు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి క్వింటాల్‌కి 67 కిలోల బియ్యం (సీఎంఆర్) చొప్పున ఎఫ్‌సీఐ గోడౌన్లకు తరలిస్తారు. ఇందులో ప్రజాపంపిణీ వ్యవస్థకు అవసరమైన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టిపెట్టుకొని, మిగతా బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగిస్తుంది. -
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్.. కేంద్రంపై పోరుకు దిగారు. తెలంగాణ, దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘దేశమంతా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉంది. ధాన్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు. ఎంత అవసరమో అంతే తీసుకుంటాం.. ఎవరిపైనా వివక్ష లేదు. తెలంగాణలో గత ఐదేళ్లలో 7 రెట్ల ధాన్యం సేకరణ చేశాం. ధాన్యం సేకరణ, సంచుల అవసరంపై తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు. పంజాబ్ నుంచి పారా బాయిల్డ్ రైస్ తీసుకోలేదు’’ అని వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగానే ధాన్యం సేకరణలో వివాదం ఏమీ లేదని ఎఫ్‌సీఐ రిజనల్ మేనేజర్ దీపక్ శర్మ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పారా బాయిల్డ్ రైస్‌కి డిమాండ్ లేదన్నారు. రా రైస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం ఉత్పత్తి ఎంత అవుతుంది.? ఎంతమేర ఇస్తారనేది స్పష్టంగా చెప్పలేదన్నారు. ఈ క్రమంలోనే రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటాని క్లారిటీ ఇచ్చారు. -
ఎఫ్‌సీఐ స్పోర్ట్స్ మీట్: రన్నరప్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సౌత్‌జోన్ ఇంటర్ రీజినల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ (టీటీ) స్పోర్ట్స్ మీట్లో తెలంగాణ జట్టు రన్నరప్‌గా నిలిచింది. టీటీ మహిళల సింగిల్స్‌లో రత్న స్వప్న (తెలంగాణ) విజేతగా, పరిమళ కిశోరి (తెలంగాణ) రన్నరప్‌గా నిలిచారు. డబుల్స్‌లో రత్న స్వప్న–పరిమళ జంట టైటిల్ సొంతం చేసుకుంది. ఎఫ్‌సీఐ (రీజియన్) జనరల్ మేనేజర్ దీపక్ శర్మ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో వంశీ కుమార్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్) టైటిల్ గెలిచాడు. పురుషుల డబుల్స్‌లో వంశీ కుమార్ రెడ్డి–చైతన్య (ఆంధ్రప్రదేశ్) జోడీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. -
ధాన్యం కొనేలా ఎఫ్‌సీఐని ఆదేశించండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బియ్యం సేకరణ అంశాన్ని బుధవారం లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ జి.రంజిత్‌రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆహార ధాన్యాల సేకరణ, పీడీఎస్ ద్వారా సరఫరా, బఫర్‌స్టాక్ ఉంచడం కోసం ఎఫ్‌సీఐకి ఆదేశాలిచ్చినా.. లక్ష్యానికి అనుగుణంగా కొనుగోళ్లు చేయడం లేదని ఆరోపించారు. దీనిపై జోక్యం చేసుకుని ఎఫ్‌సీఐకి దిశానిర్దేశం చేయాలని ప్రధానిని కోరారు. బొగ్గు బ్లాక్‌ల వేలంపై..: తెలంగాణలోని కళ్యాణ్ఖని బ్లాక్–6, కోయగూడెం బ్లాక్–3, సత్తుపల్లి బ్లాక్–3, శ్రావణపల్లి బొగ్గు గనులను వేలానికి ఉంచినట్టు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దుచేసి వాటిని సింగరేణి కాలరీస్‌కు కేటాయించాలని అభ్యర్థించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణితో పాటు ఇతర సంస్థలు వేలంలో పాల్గొని, నిబంధనల ప్రకారం బొగ్గు బ్లాక్‌లను తీసుకోవచ్చని టీఆర్ఎస్ ఎంపీలు వెంకటేశ్ నేత, దయాకర్, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి బదులిచ్చారు. రాజ్యసభలో తెలంగాణ..: తెలంగాణకు 14, 15 ఆర్థిక కమిషన్ల కింద నిధులు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. 14వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు రూ.5,375.29 కోట్లు కేటాయించగా, రూ.5,059.97 కోట్లు విడుదల చేశామని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయమంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ బుధవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. 15వ ఆర్థిక సంఘం కింద రూ.9,048 కోట్లు కేటాయించగా రూ.2,529.50 విడుదల చేశామని వివరించారు. మిరప, ఇతర పంటలు తామర తెగు లు ముప్పును ఎదుర్కోవడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ మహమ్మారి కారణంగా ఏపీలో 80%, తెలంగాణలో 60%పైగా పంట నష్టం వాటిల్లిందన్నారు. -
ఉప్పుడు బియ్యం ఇవ్వకుండా తప్పుడు ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం అనుమతించిన మేర బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం)ను భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు అప్పగించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖా మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ధాన్యం సేకరణపై పదేపదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎఫ్‌సీఐ రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. బుధవారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధాన్యం సేకరణపై మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ఎంపీలు ఇక్కడ డ్రామాలు చేసి వాకౌట్ చేసి వెళ్లిపోయారన్నారు. ఎఫ్‌సీఐ ఆగస్టులో 40 లక్షల మెట్రిక టన్నుల బియ్యాన్ని తీసుకునేందుకు అంగీకరించినా, ఇప్పటివరకు సగం బియ్యాన్ని కూడా సేకరించలేదని, ఇందుకు కారణాలు ఏమిటని ప్రశ్నించారు. దీనిపై పీయూష్ గోయల్ సమాధానమిచ్చారు. ‘తెలంగాణలో ఎఫ్‌సీఐ నేరుగా «ధాన్యం సేకరించదు. తొలుత రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరించి దాన్ని బియ్యంగా మార్చి కేంద్రానికి ఇస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే నాలుగైదు సార్లు గడువు పొడిగింపు ఇచ్చాం. తీవ్ర ఆవేదనతో చెబుతున్నా. భారీగా బియ్యం తీసుకునేందుకు అనుమతించాక కూడా అంతమేర పారాబాయిల్డ్ రైస్‌ను ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు కూడా గడువు పొడిగించాం. తెలంగాణ ఎంత వేగంగా ఇస్తే అంత వేగంగా బియ్యాన్ని తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ధాన్యం కొనుగోలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది తప్ప కేంద్ర ప్రభుత్వం చేయదు..’అని స్పష్టం చేశారు. కేంద్ర జాప్యం లేదు తెలంగాణలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి జాప్యం జరగడం లేదని ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు. ప్రస్తుత సీజన్లో ధాన్యం సేకరణ విషయమై ఉత్తమ్‌కుమార్ రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణను సంప్రదించినప్పుడు అక్టోబర్ ఒకటి నుంచి జనవరి 31 వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపిందని, దానికి అనుగుణంగా సేకరణ జరుగుతోందని చెప్పారు. గత నెల 30 నాటికి రాష్ట్ర సేకరణ సంస్థలు 16.14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాయని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి 2016–17 ఏడాదిలో 53.67 లక్షల మెట్రిక్ టన్నులు, 2017–18లో 54 లక్షలు, 2018–19లో 77.46 లక్షలు, 2019–20లో 1.11 కోట్లు, 2020–21లో 1.41 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం తమ సేకరణ సంస్థల ద్వారా ధాన్యాన్ని సేకరించి, రాష్ట్ర అవసరాలకు మించి ఉన్న అధిక ధాన్యాన్ని మాత్రమే సెంట్రల్ పూల్ కింద ఎఫ్‌సీఐకి అందిస్తుందని వివరించారు. -
బియ్యం నిల్వకు గోదాములెక్కడ?
సాక్షి, హైదరాబాద్: రైతులు ధాన్యం పండిస్తారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేస్తుంది. రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి పండించిన ధాన్యాన్ని సేకరించి.. మిల్లింగ్ చేయించి.. ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐ సూచించిన గోడౌన్లకు రాష్ట్రం పంపిస్తుంది. ఎఫ్‌సీఐ సెంట్రల్‌పూల్ విధానం ద్వారా ఆ బియ్యాన్ని పీడీఎస్, ఇతర సంక్షేమ పథకాల(ఓడబ్లు్యఎస్) కింద మళ్లీ ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. సాధారణంగా ఇదీ ధాన్యం సేకరణ, బియ్యం పంపిణీ విధానం. కానీ, దేశవ్యా ప్తంగా ధాన్యం దిగుబడి పెరిగి, బియ్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రేషన్ విధానాన్ని అమలు చేస్తుంది. అవసరాల మేరకే కొనుగోలు.. ఎఫ్‌సీఐకి ఉన్న గోడౌన్లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ సంస్థల ఆధ్వర్యంలోని గోడౌన్లు, ప్రైవేటు గోడౌన్లను కేంద్రమే అద్దెకు తీసుకుని నిర్వహిస్తుంది. కేంద్రం బియ్యం కొనుగోలు చేస్తేనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే తెలంగాణ ప్రభుత్వానికి పెట్టుబడి తిరిగివస్తుంది. అయితే నిల్వసామర్థ్యం, మార్కెటింగ్‌ను బట్టే రాష్ట్రాలు పండించిన పంటలో తనకు అవసరమైన మేరకే బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తోంది. ముందుగానే ఆ సంవత్సరానికి కొనుగోలు చేసే కోటా ఎంతో నిర్ణయించి ఎఫ్‌సీఐ ద్వారా సేకరిస్తుంది. మొత్తం బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తే.. నిల్వకు గోడౌన్లు సరిపోవు. గిడ్డంగుల సామర్థ్యమే సమస్య.. 2019–20లో ఎఫ్‌సీఐకి 20.47 లక్షల మెట్రిక్ టన్నుల గిడ్డంగుల కెపాసిటీ ఉండగా, 2020–21 నాటికి 23 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి గిడ్డంగుల కెపాసిటీ పెరిగింది. అయితే రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న బియ్యం, గిడ్డంగుల కెపాసిటీకి మధ్య చాలా తేడా ఉంది. గత సంవత్సరం ఖరీఫ్, రబీలో కలిపి 1.41 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించి, సీఎంఆర్ కోసం మిల్లులకు పంపింది. దీని మిల్లింగ్ ద్వారా దాదాపు 95.66 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వచ్చింది. గత వానాకాలం బియ్యం సెంట్రల్ పూలింగ్ విధానంలో ఎఫ్‌సీఐ ద్వారా పీడీఎస్, ఇతర అవసరాలకు పంపిణీ కాగా మిగిలినది గోడౌన్లకు చేరింది. ఇక యాసంగిలో సీఎంఆర్ ద్వారా రావలసిన 62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని నిల్వ చేయాలి. ఇందులో ఇప్పటి వరకు దాదాపు 50% సీఎంఆర్ ద్వారా గోడౌన్లకు చేరింది. మిగతా బియ్యం మిల్లుల నుంచి రావలసి ఉంది. ఈ పరిస్థితుల్లో బియ్యం నిల్వ చేయడానికి గోడౌన్లు లేక వేరే రాష్ట్రాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. 8.13 కోట్ల మెట్రిక్ టన్నుల స్టోరేజీ.. ఎఫ్‌సీఐ, ఇతర గోడౌన్లు కలిపి దేశవ్యాప్తంగా 2,223 ఉన్నాయి. వీటి కెపాసిటీ 8.18 కోట్ల మెట్రిక్ టన్ను లు. ఈ గిడ్డంగుల్లో బియ్యంతో పాటు గోదుమలు, ఇతర ఆహార పదార్థాలను నిల్వ చేయాలి. దీంతో బియ్యం నిల్వలకు సమస్య ఎదురవుతోంది. ఏ రాష్ట్రంలో సీఎంఆర్ ద్వారా సేకరించిన బియ్యాన్ని దాదాపుగా అదే రాష్ట్రంలో నిల్వ చేస్తుండటంతో తెలంగాణలో సమస్య వస్తోంది. తెలంగాణలోని 72 గోడౌన్లలో 23 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ చేసే సామర్థ్యం ఉండగా, ఇప్పటికే 15 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. తాజాగా యాసంగి బియ్యం వస్తుండటంతో ఎఫ్‌సీఐ చేతులెత్తేసింది. ఇందులో భాగంగానే వానాకాలం పంటను మిల్లులకు పంపించకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు అడ్డుకుంటున్నారనే విమర్శలున్నాయి. బాసుమతికే ఎగుమతుల్లో డిమాండ్ అధిక బియ్యం సమస్యను పరిష్కరించాలంటే రెండే మార్గాలు. ఒకటి నిల్వ సామర్థ్యం పెంచుకోవడం. రెండోది విదేశాలకు ఎగుమతి. బాసుమతి బియ్యం, నాణ్యమైన సన్న బియ్యాన్ని మాత్రమే ఆ దేశాలు తీసుకుంటుండటంతో సమస్య వస్తోంది. నాలుగేళ్లకు సరిపడా ఉప్పుడు బియ్యం... రెండుమూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఉప్పు డు బియ్యం సుమారు 50 లక్షల టన్నుల వరకు రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ గోడౌన్లలో పేరుకుపోయినట్లు ఎఫ్‌సీఐ వర్గాల సమాచారం. అందు కే ఆ బియ్యం కొనబోమని కేంద్రం చెబుతోంది. ఉప్పుడు బియ్యం ఎగుమతులు తగ్గడం, దేశంలో ఈ బియ్యం తినే ప్రజలున్న రాష్ట్రాల్లోనూ బాయిల్డ్ మిల్లులు తెరవడంతో గోడౌన్లు ఖాళీ కావడం లేదు. ఈ విషయాన్ని ఇటీవల కేంద్రం చెప్పి, నిల్వ బియ్యం నాలుగేళ్లకు సరిపోతాయని పేర్కొంది. 6 కోట్ల మెట్రిక్ టన్నుల సేకరణ.. 2020–21 ఖరీఫ్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రం సెంట్రల్ పూల్‌కు సేకరించిన బియ్యం 6 కోట్ల మెట్రిక్ టన్నులు. ఇందులో నుంచి 1.20 కోట్ల మెట్రిక్ టన్నులను కరువు కాటకాలు, యుద్ధాలు వచ్చినప్పుడు ప్రజలు, సైనికులు, కార్మికుల కోసం నిల్వచేస్తారు. ప్రతి ఏటా ఈ నిల్వలను ఖాళీ చేసి కొత్త స్టాక్‌ను ఉంచుతారు. మరో 1.20 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అవుతుంది. మిగతా 3.6 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం ఆయా రాష్ట్రాలకు సరఫరా చేస్తారు. -
ప్రతీ గింజనూ కేంద్రం కొనాల్సిందే: మంత్రి గంగుల
కరీంనగర్: తెలంగాణ రైతులపై వివక్ష చూపకండని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ కేంద్రాన్ని కోరారు. ఇటీవల కేటీఆర్‌తో పాటు తాను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి పంట కొనుగోలు విషయాన్ని సామాజిక కోణంలో చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాల్లో అవసరానికి సరిపడా బియ్యం ఉంచుకొని మిగులు బియ్యం ఎఫ్‌సీఐకి పంపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎంఓయూ జరిగిందని గుర్తు చేశారు. కావున ఇదివరకే 19/20 యాసంగిలో 64 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 20/21లో లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొన్నామని , దాంతో 62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వచ్చిందన్నారు. ఇప్పుడు ఆ బియాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని అడిగితే అవి బాయిల్డ్ రైస్ అని అందులో కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులే తీసుకుంటామని తెలిపడం సమంజసం కాదన్నారు. మిగతా 37 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరూ కొంటారని కేంద్రమే చెప్పాలని ఆవేదని వ్యక్తం చేశారు. బాయిల్డ్ రైస్ తీసుకోకపోతే రైస్ మిల్లులో పేరుకుపోయి కొత్త ధాన్యం ఎక్కడ పెట్టాలని కనుక ఈ అంశంపై బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. ప్రతీ గింజనూ కేంద్రం తప్పకుండా కొనాలని, లేకపోతే నిలదీస్తామన్నారు. పంజాబ్‌లో బాయిల్డ్ రైస్ మొత్తం కొన్న కేంద్రం, తెలంగాణలో మాత్రం ఎందుకు కొనడంలేదని ప్రశ్నించారు. ఇలాంటి సంక్షోభం గతంలో కూడా వస్తే వాజ్‌పేయి ప్రభుత్వం పూర్తిగా ఏడు కోట్ల టన్నులు కొనుగోలు చేసిందని, ఇప్పుడు కూడా మోదీ ప్రభుత్వం పూర్తిగా బియ్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ అంటే వివక్ష ఉండకూడదని, రాష్ట్ర రైతాంగం భవిష్యత్తును నాశనం చేయొద్దని ఆయన కోరారు. చదవండి: రజనీకాంత్ స్టైల్లో డ్యాన్స్ చేసి అదరగొట్టిన మంత్రి హరీశ్‌రావు -
బియ్యంతో నిండిపోయిన గోదాములు
నల్లగొండ జిల్లాలో గోదాముల్లో 4,81,838 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉంది. అందులో ఎఫ్‌సీఐ గోదాములు బియ్యంతో ఇప్పటికే నిండిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి 8.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి జిల్లా మిల్లుల్లో పెట్టింది. గోదాములు ఖాళీ లేక బియ్యం సేకరణలో ఎఫ్‌సీఐ జాప్యం చేస్తోంది. రోజుకు ఒక వ్యాగన్ ద్వారా 3800 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అవసరమైన చోటికి పంపాల్సి ఉండగా, 4 రోజులకు ఒక వ్యాగన్ ద్వారానే బియ్యం సరఫరా చేస్తున్నారు. నిజామాబాద్‌లోనూ ఎఫ్‌సీఐతోపాటు చిన్నాచితక గోదాముల్లో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల స్టోరేజ్ కెపాసిటీ ఉంది. అక్కడ 12 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించి మిల్లులకు అప్పగించింది. అక్కడున్న గోదాములు 90 శాతం బియ్యంతో నిండి ఉన్నాయి. అక్కడినుంచి రోజుకు రెండు వ్యాగన్లలో బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు లేదా అవసరమైన ప్రాంతాలకు సరఫరా చేస్తేనే సేకరించిన ధాన్యాన్ని మిల్లులు బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం మూడు నాలుగు రోజులకు ఒకసారి ఒక వ్యాగన్ ద్వారా మాత్రమే బియ్యాన్ని ఎక్స్‌పోర్టు చేస్తుండటంతో మిల్లింగ్ కుంటుపడుతోంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) గోదాముల్లో బియ్యం నిల్వలు నిండిపోయాయి. ఇతర రాష్ట్రాలకు బియ్యం సరఫరా తగ్గడంతో గోదాముల్లో ఖాళీలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా మిల్లుల నుంచి బియ్యం సేకరణలో ఎఫ్‌సీఐ జాప్యం చేస్తోంది. దీనికితోడు తాజాగా కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కూడా రాష్ట్రం నుంచి బియ్యం తీసుకోబోమని పేర్కొనడంతో సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)గా మార్చి ఎఫ్‌సీఐ ఇచ్చే ప్రక్రియ స్తంభించిపోయింది. దీంతో మిల్లుల్లో పేరుకుపోయిన ధాన్యం వర్షాలకు తడిచి నష్టం వాటిల్లే ప్రమాదం నెలకొంది. కేంద్రం వద్దన్నా ముందుకొచ్చిన రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ నూతన చట్టం ప్రకారం రైతులు తాము పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. పంటను ప్రభుత్వం కొనుగోలు చేయొద్దని ఆ చట్టంలో పేర్కొంది. అయినప్పటికీ రైతులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. జిల్లాల్లో గోదాముల సామర్థ్యం తక్కువగా ఉన్నా అధికారులు చొరవ తీసుకొని ప్రభుత్వ మార్కెట్‌యార్డులు, ఫంక్షన్ హాళ్లను తీసుకొని మిల్లర్లకు ఇచ్చి అక్కడ ధాన్యం నిల్వ చేయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీనికితోడు ఎఫ్‌సీఐ గోదాముల్లోని బియ్యం అంతర్రాష్ట్ర సరఫరా మందగించింది. ఒక్కో జిల్లా నుంచి రోజుకు నాలుగైదు వ్యాగన్ల ద్వారా బియ్యం పంపించాల్సి ఉండగా, ప్రస్తుతం ఒకే వ్యాగన్ ద్వారా బియ్యం ఇతర రాష్ట్రాలకు వెళుతోంది. నల్లగొండ మండలంలోని ఓ రైస్‌మిల్ ఆవరణలో నిల్వ ఉంచిన ధాన్యం ప్రైవేటు గోదాములు ఉన్నా వాడుకోలేని పరిస్థితి.. ఎఫ్‌సీఐ గోదాములు నిండిపోయిన నేపథ్యంలో ప్రైవేటు గోదాములు ఉన్నా వాటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు గోదాములను టెండర్ ద్వారానే తీసుకోవాలని కేంద్రం నిబంధన విధించింది. ఆన్లైన్ టెండర్ జారీ చేసి, 15 రోజులు సమయం ఇవ్వాలని, తర్వాతే గోదాములను తీసుకోవాలని పేర్కొంది. ఇందుకు నెలరోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం తడిచిపోయే ప్రమాదం ఏర్పడింది. అందుకే వద్దంటున్న కేంద్రం 2019–20 రబీ సీజన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించింది. మిల్లర్లు ఆ ధాన్యాన్ని సీఎంఆర్‌గా మార్చి ఎఫ్‌సీఐ ఇస్తూ వచ్చారు. చివరలో దాదాపు 1.01 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి చేరలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. ఇక ఈ సీజన్లో బియ్యం ఎఫ్‌సీఐకి ఇచ్చేందుకు గడువు ఇవ్వాలని రాష్ట్రం... కేంద్రాన్ని కోరింది. అందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒప్పుకోలేదు. బియ్యం తీసుకోబోమని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గడిచిన సీజన్లలో మిల్లర్లు సకాలంలో బియ్యం ఇవ్వలేదని, అందుకే ఈ సారి ఇప్పటికే గడువు దాటినందున బియ్యం తీసుకోబోమని పేర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఎఫ్‌సీఐ బియ్యం తీసుకోకపోతే ప్రభుత్వం సేకరించిన ధాన్యం పరిస్థితి ఏంటన్నది గందరగోళంగా మారింది. -
బాయిల్డ్ రైస్ సేకరణకు ఎఫ్‌సీఐ మంగళం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్లో అధికంగా ఉత్పత్తి అయ్యే బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం)సేకరణకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) క్రమంగా మంగళం పాడనుంది. ఒక్కసారిగా కాకుండా క్రమంగా బాయిల్డ్ రైస్ తీసుకునే విధానానికి స్వస్తి పలికేలా ఎత్తులు వేస్తోంది. గతేడాది వరకు రాష్ట్రం నుంచి భారీగా బాయిల్డ్ రైస్ సేకరించి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసిన ఎఫ్‌సీఐ.. ఈ ఏడాది యాసంగికి సంబంధించి 50 శాతానికి మించి బాయిల్డ్ రైస్ తీసుకోలేమని రాష్ట్రానికి స్పష్టం చేసింది. అయితే ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో భారీగా సాగైన దొడ్డు రకాల ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తుతాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్రం దృష్టికి అంశాన్ని తీసుకెళ్లడంతో పాటు, ఎఫ్‌సీఐని ఒప్పించడంతో ఈ సీజన్లో 80 శాతం బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు అంగీకరించింది. సాధారణంగా యాసంగిలో బాయిల్డ్ రైస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, ఒడిశా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వీటికి అధికంగా డిమాండ్ ఉండటంతో ఈ బియ్యాన్ని రాష్ట్రం నుంచి సేకరించి ఆయా రాష్ట్రాలకు సరఫరా చేసేది. అయితే ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లోనే పంటల దిగుబడి పెరిగి బాయిల్డ్ రైస్ ఉత్పత్తి పెరిగింది. ఈ నేపథ్యంలో తమకున్న డిమాండ్ మేరకు రా రైస్ (ముడి బియ్యం) మాత్రమే కావాలని, బాయిల్డ్ రైస్ తీసుకోవద్దని నిర్ణయించింది. అయితే తర్వాత ఎఫ్‌సీఐ 50 శాతం మేర మాత్రమే తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ సీజన్లో మాత్రం 80 శాతం బాయిల్ రైస్, 20 శాతం రా రైస్ తీసుకోవడానికి అంగీకరించింది. కాగా, బాయిల్డ్ రైస్ సేకరణ నుంచి ఎఫ్‌సీఐ క్రమంగా తప్పుకొంటున్న నేపథ్యంలో దొడ్డు బియ్యం సాగు నుంచి రైతులు బయటకు రావాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్న రకం ధాన్యాల సాగుకు ముందుకు రావాలని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. గురువారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. సన్న వడ్లతో పాటు వేరు శనగ, ఆయిల్ సీడ్ పంటల సాగుకు మళ్లాలని పేర్కొన్నారు. 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు.. రాష్ట్రంలో ఈ ఏడాది 6,575 కేంద్రాల ద్వారా 80 నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణ చేయనున్నట్లు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 179 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు కావల్సిన రూ.20 వేల కోట్లను పౌరసరఫరాల సంస్థకు ముఖ్యమంత్రి సమకూర్చారని, 24 గంటల్లోనే రైతులకు తమ ఖాతాల్లో డబ్బులు పడేలా చూస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా తేమశాతం 17 లోపు ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యాసంగిలో 80 నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లను కలిపి 2020–21 ఏడాదిలో 1.28 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ ఉంటుందన్నారు. చదవండి: భారీగా పెరిగిన డీఏపీ ధరలు.. -
తెలంగాణలో నాణ్యమైన బియ్యానికి.. చెల్లిన 'నూకలు'
►కింద ఫొటోలో బియ్యం చెరుగుతున్న మహిళ పేరు కవిత. మెదక్ జిల్లా రేగోడ్ మండలం సంగమేశ్వర తండాకు చెందిన ఆమె కుటుంబానికి నెలకు 12 కిలోల రేషన్ బియ్యం వస్తాయి. ఈసారి కూడా ఎప్పట్లాగే డీలర్ వద్దకు వెళ్లి బియ్యం తెచ్చుకుంది. కానీ సంచి విప్పితే సగం దాకా నూకలే. జల్లెడ పట్టి చూస్తే.. 12 కిలోల బియ్యంలో నాలుగున్నర కిలోల నూకలు వచ్చాయి. ►ఇదే జిల్లా చిన్నశంకరం పేట మండలం రుద్రారానికి చెందిన శివలింగం లింగయ్య కుటుంబానికి ప్రతి నెలా 30 కిలోల రేషన్ వస్తుంది. ఈ నెల వచ్చిన బియ్యాన్ని జల్లెడ పడితే పది కిలోల దాకా నూకలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి. బియ్యంలో గరిష్టంగా 20–25 శాతం వరకు నూకలు ఉండొచ్చు. కానీ పేదలకు అందుతున్న రేషన్ బియ్యంలో ఏకంగా 40–45 శాతం వరకు నూకలు ఉంటున్నాయి. సాక్షి, మెదక్(ఆదిలాబాద్/మహబూబ్‌నగర్) : రూపాయికే కిలో బియ్యం.. నాణ్యమైన బియ్యం.. రాష్ట్రంలో నిరుపేదల కడుపు నింపేందుకు అమలవుతున్న ప్రతిష్టాత్మక పథకం. లక్ష్యం అదుర్స్! కానీ పథకం అమల్లోనే పందికొక్కులు చొరబడ్డాయి. ప్రజలకు చేరాల్సిన మేలు రకం (ఫైన్ వెరైటీ) బియ్యం దారితప్పి విదేశాలు, పక్క రాష్ట్రాలకు తరలుతుండగా.. నిరుపేదలకేమో 40–45 శాతం వరకు నూకలే ఉన్న బియ్యం సరఫరా అవుతున్నాయి. కొన్ని నెలలుగా ఇలా నూకల బియ్యం నిరుపేదలకు సరఫరా అవుతున్న వైనంపై ‘సాక్షి’పరిశోధన చేపట్టింది. మార్చి నెలలో రేషన్ షాపుల ద్వారా మెదక్, ఆదిలాబాద్, జోగులాంబ, నారాయణపేట జిల్లాల్లో సరఫరా చేసిన బియ్యాన్ని పరిశీలించింది. ఇటీవల పలువురు లబ్ధిదారులు రేషన్ షాపుల నుంచి తెచ్చుకున్న బియ్యాన్ని కొలత వేయించి, జల్లెడ పట్టించి.. నూకలను వేరుచేసి చూసింది. దాదాపు అన్నిచోట్ల కూడా ప్రభుత్వం గరిష్టంగా నిర్దేశించిన 25శాతం (కిలోకు పావు కిలో) కంటే మించి.. ఏకంగా నలభై, నలభై ఐదు శాతం వరకు నూకలు ఉన్నట్టు గుర్తించింది. దీనికి కారణమెవరు? కొందరు మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై నిరుపేదలకు నాణ్యతలేని, నూకల బియ్యం అంటగడుతున్నట్టు ‘సాక్షి’పరిశీలనలో వెల్లడైంది. వాస్తవానికి మిల్లర్లు ఎఫ్‌సీఐ/పౌర సరఫరాల శాఖ పంపిన ధాన్యాన్నే మిల్లింగ్ చేసి అలా వచ్చిన బియ్యాన్ని తిరిగి ఇవ్వాలి. కానీ కొందరు మిల్లర్లు మంచి ధాన్యాన్ని తాము వాడేసుకుంటున్నారు. తాము బయట నేరుగా తక్కువ ధరకు కొన్న తడిసిన, నాణ్యతలేని ధాన్యాన్ని మిల్లింగ్ చేసి పౌరసరఫరాల శాఖకు పంపుతున్నారు. అందుకే బియ్యంలో నాణ్యత తక్కువగా, నూకలు ఎక్కువగా ఉంటున్నట్టు వెల్లడైంది. అక్రమాలకు తోడ్పడుతున్నదెవరు? మిల్లర్లకు ధాన్యాన్ని పంపి.. తిరిగి బియ్యాన్ని తీసుకోవడాన్ని ‘కస్టమ్ మిల్లింగ్’అంటారు. ఇందుకు ప్రభుత్వం మిల్లర్లకు చార్జీలు చెల్లిస్తుంది. ఇలా ధాన్యాన్ని పంపి, మిల్లింగ్ అయ్యాక బియ్యాన్ని తిరిగి తీసుకునే క్రమంలో.. అధికారులు నాలుగు స్టేజీల్లో నాణ్యతను పరిశీలించాలి. కానీ కొందరు ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల అధికారులు డబ్బులకు కక్కుర్తిపడి మిల్లర్లకు సహకరిస్తున్నారు. ప్రతి స్టేజీలో ఓ రేటు మాట్లాడుకుని వదిలేస్తున్నారు. దీంతో నాణ్యత లేని బియ్యం గోదాములకు, అక్కడి నుంచి రేష¯Œ షాపులకు చేరుతున్నాయి. మంచి బియ్యం ఎక్కడికి పోతున్నాయి? నాణ్యతలేని, నూకల బియ్యాన్ని ప్రభుత్వానికి అంటగడుతున్న మిల్లర్లు.. ఎఫ్‌సీఐ నుంచి వచ్చిన మంచి ధాన్యాన్ని మిల్లింగ్ చేసి నాణ్యమైన బియ్యాన్ని ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని క్వింటాల్ రూ.2,500 నుంచి రూ.2,600 రేటుతో.. ఏపీలోని పెద్దాపురం, కాకినాడ కేంద్రంగా చైనా, వియత్నాం, దుబాయ్, థాయ్‌లాండ్, పలు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు తెలిసింది. ఈ సీజన్లో ఇప్పటికే పది లక్షల టన్నుల బియ్యం ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి అయినట్టు అంచనా. ఇందులో చాలావరకు కస్టమ్ మిల్లింగ్ కోసం ఎఫ్‌సీఐ పంపిన ధాన్యం నుంచి వచ్చిన బియ్యమే ఉండటం గమనార్హం. కాకినాడ పోర్టులో షిప్పులోకి బియ్యం లోడింగ్ (ఫైల్) కస్టమ్ మిల్లింగ్ ధాన్యం మాయం.. బియ్యం ఇవ్వలేదు.. శనివారం పెద్దపల్లి జిల్లాలోని ఒక రైస్‌మిల్లులో బియ్యం మిల్లింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఖరీఫ్, యాసంగి సీజన్లలో ఐకేపీ, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతుల నుంచి ధాన్యం కొంటుంది. ఆ ధాన్యాన్ని సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద మిల్లర్లకు ఇస్తుంది. మిల్లర్లు ధాన్యాన్ని మర ఆడించి.. ముడి బియ్యం అయితే 67 కిలోలు, బాయిల్డ్ రైస్ అయితే 68 కిలోల చొప్పున తిరిగి అందజేయాలి. ఇందుకు ప్రభుత్వం మిల్లర్లకు క్వింటాల్ బాయిల్డ్ రైస్‌కు రూ.50 చొప్పున, ముడి బియ్యానికి రూ.30 చొప్పున చార్జీలు చెల్లిస్తుంది. పారాబాయిల్డ్ బియ్యమైతే గరిష్టంగా నూకలు 16 శాతం, డిస్కలర్ (రంగుమారిన) 5 శాతం, డ్యామేజ్ 4 శాతంలోపు ఉండాలి. ముడి బియ్యమైతే గరిష్టంగా నూకలు 25 శాతం, డిస్కలర్ 5, డ్యామేజ్ 5 శాతంలోపు ఉండాలి. వానాకాలం ధాన్యాన్ని ఏటా మార్చి 31 లోపు.. యాసంగి ధాన్యాన్ని సెప్టెంబర్ 31లోపు మర ఆడించి బియ్యం తిరిగివ్వాలి. కానీ మిల్లర్లు ఓ సీజన్‌కు సంబంధించిన బియ్యాన్ని మరో సీజన్లో ఇస్తున్నారు. ఈ గ్యాప్‌లోనే అక్రమాలకు పాల్పడుతున్నారు. వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్, మిర్యాలగూడ, నిజామాబాద్ జిల్లాల్లో ఈ దందా భారీ స్థాయిలోనే నడుస్తోంది. ఇప్పుడు కూడా ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. పలు జిల్లాల్లో మిల్లర్లు గత వేసవిలో తీసుకున్న ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని ఇంకా సర్కారుకు ఇవ్వలేదు. అంటే ముడి ధాన్యంగానీ, బియ్యంగానీ రైస్ మిల్లులు, గోదాముల్లోనే ఉండాలి. కానీ ఆయా ప్రాంతాల్లోని రైస్ మిల్లులు, గోదాములను ‘సాక్షి’పరిశీలించగా.. ఎక్కడా సీఎంఆర్ ధాన్యంగానీ, బియ్యం నిల్వలు గానీ లేవు. అంటే మిల్లర్లు ఇప్పటికే అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్టు అర్థమవుతోంది. చాలా చోట్ల ఇదే తీరు.. ►జోగులాంబ గద్వాల జిల్లా రాజోలికి చెందిన రాములమ్మ కుటుంబానికి నెలకు 24 కిలోల రేషన్ బియ్యం వస్తుంది. ఇటీవల వచ్చిన బియ్యాన్ని జల్లెడ పడితే ఆరు కిలోలపైన నూకలు వచ్చాయి. ►ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలో నివసించే శాతల నాగమ్మ కుటుంబానికి ప్రతినెలా 35 కిలోల రేషన్ బియ్యం అందుతుంది. ఈ నెల తీసుకున్న బియ్యం చెరిగితే ఎనిమిది కిలోల దాకా నూకలు వచ్చాయి. ►మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణానికి చెందిన సర్గం మల్లమ్మ తనకు వచ్చిన 12 కిలోల బియ్యాన్ని చెరిగితే నాలుగు కిలోలకుపైగా నూకలు వచ్చాయి. ఇలాగైతే ఎలా అని ఆమె వాపోయింది. ►మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరుకు చెందిన పాలకుల లక్ష్మి రేషన్ బియ్యం తీరుపై మండిపడింది. ‘గత నెలలో వచ్చిన బియ్యం ముక్కవాసన వచ్చాయి. ఈసారి వచ్చిన బియ్యంలో నూకలే ఎక్కువగా ఉన్నాయి’అని వాపోయింది. సగం నూకలే.. అన్నం ముద్ద అవుతోంది రేషన్ షాపులో మంచి బియ్యం ఇస్తున్నారని సంతోషించినం. బియ్యం జల్లెడ పట్టి చూశాక ఉన్న సంతోషం పోయింది. సగం నూకలే ఉన్నాయి. వండిన అన్నం మెత్తగా ముద్దగా అవుతోంది. దొడ్డు బియ్యమే నయం అనిపిస్తున్నది. డీలర్‌ను అడిగితే గోదాం నుంచే బియ్యం అట్లా వస్తున్నయని చెప్తున్నడు. – స్వరూప, రేషన్ లబ్ధిదారు, చిలప్‌చెడ్, మెదక్ ఒక్కోసారి సగానికి సగం నూకలే.. 3 నెలల నుంచి బియ్యం ఒక్కో సంచిలో ఒక్కో రకం వస్తున్నాయి. ఒక్కోసారి సగానికి సగం నూకలు వస్తున్నాయి. ఈ మధ్య వస్తున్న బియ్యంలో మరీ ఎక్కువగా ఉంటున్నాయి. లబ్ధిదారులు గొడవ పడుతున్నారు. సముదాయించలేక తలపట్టుకోవాల్సి వస్తోంది. – నర్సింహులు, డీలర్, రుద్రారం, చిన్నశంకరంపేట, మెదక్ -
నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో మిల్లింగ్ బంద్
సాక్షి, కరీంనగర్: భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) కొర్రీలపై రైస్ మిల్లర్లు తిరుగుబావుటా ఎగురవేశారు. సీఎంఆర్ నాణ్యత విషయంలో పెడుతున్న కొర్రీలపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న మిల్లర్లు కఠిన నిబంధనలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వానాకాలం సన్నరకం ధాన్యం ప్రభుత్వం కేటాయించనుండడం, సీఎంఆర్ తగ్గే అవకాశం ఉండడం, ఎఫ్‌సీఐ నిబంధనలతో కోట్లల్లో నష్టం వస్తుండడంతో ధాన్యం మిల్లింగ్ సోమవారం నుంచి నిలిపివేయాలని నిర్ణయించారు. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉన్న బియ్యంపై ఆ సంస్థ పెడుతున్న ఆంక్షలు మిల్లర్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ విషయమై అధికారులకు పలుమార్లు చేసిన విజ్ఞప్తులు ఫలించకపోవడంతో సీఎంఆర్ నిలిపివేతవైపే మిల్లర్లు మొగ్గు చూపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి మిల్లింగ్ నిలిపివేయాలని నిర్ణయించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన ప్రస్తుత పరిస్థితిలో మిల్లింగ్ నిలిపివేస్తే కొనుగోళ్లపై ప్రభావం చూపనుంది. మిల్లర్లపై ఒత్తిళ్లు.. ప్రతీ సీజన్లో ధాన్యం తీసుకునే విషయంలో మిల్లర్లపై పౌరసరఫరాలశాఖ ఒత్తిళ్లు సాధారణంగా మారాయి. పంట కోతల సమయంలో వర్షం, తెగుళ్లు ఇతర సమస్యలతో ధాన్యం నాణ్యత తగ్గిపోతోంది. రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం కొనుగోళ్లలో సడలింపులు ఇస్తోంది. ఇవే సడలింపులతో గత వానాకాలంలో తెగుళ్లు సోకిన ధాన్యం కొనుగోలు చేసి, తమకు కట్టబెట్టడాన్ని మిల్లర్లు వ్యతిరేకించారు. అనంతరం దిగుమతి చేసుకున్నారు. సదరు ధాన్యం మరాడించగా.. వచ్చిన బియ్యాన్ని తీసుకోవడానికి ఎఫ్‌సీఐ ఇబ్బంది పెడుతోందని మిల్లర్లు పేర్కొంటున్నారు. దీంతో రెండునెలల క్రితం నాణ్యతతో కూడిన బియ్యం ఉత్పత్తిపై జిల్లా అధికారులు ఎఫ్‌సీఐ నాణ్యత నియంత్రణ అధికారులతో మిల్లర్లకు అవగాహన కల్పించారు. చివరికి బియ్యాన్ని తీసుకోవడానికి ఎఫ్‌సీఐ నిరాకరించడంతో ప్రభుత్వమే దిగి వచ్చి, పొడి బియ్యం బదులు బాయిల్డ్ బియ్యం తీసుకునే వెసులుబాటు కల్పించింది. తాజాగా యాసంగికి సంబంధించి సీఎంఆర్ బియ్యం తీసుకోవడానికి కూడా ఎఫ్‌సీఐ కొర్రీలు పెడుతోంది. ఈ క్రమంలో బియ్యంతోపాటు ప్యాకింగ్ చేసే సంచుల నాణ్యత కూడా సమస్యగా మారడంతో మిల్లర్లు సమ్మెకు దిగుతున్నారు. సన్నధాన్యం సేకరణపై ప్రభావం నియంత్రిత సాగుపై ప్రభుత్వ ప్రచారంతో ఈ సీజన్లో 60 నుంచి 70శాతం మంది రైతులు సన్నరకం ధాన్యం సాగుచేశారు. దీంతో సన్నాల దిగుబడి ఈ సారి ఇబ్బడిముబ్బడిగా వచ్చే అవకాశముంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ వానాకాలం సీజన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 18,78,958 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. సన్నధాన్యం సాధారణ రకం కిందకు రావడం, ఈ సీజన్లో పొడి బియ్యం సీఎంఆర్‌గా ఇవ్వాల్సి ఉండడం, తదితర కారణాలతో మిల్లర్లు ఎఫ్‌సీఐ తీరుకు వ్యతిరేకంగా ఉద్యమించాలని నిర్ణయించారు. ధాన్యాన్ని పొడి బియ్యంగా ఇవ్వాల్సి ఉండటం, ప్రభుత్వానికి పొడి బియ్యమే ఎక్కువగా అవసరం కావడంతో మిల్లర్లు సీజన్‌కు ముందే ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. సమస్యలు పరిష్కరిస్తేనే మిల్లింగ్.. చిన్నచిన్న సాకులతో సీఎంఆర్ సేకరణకు ఎఫ్‌సీఐ కొర్రీలు పెడుతోంది. గోదాములకు పంపిన బియ్యాన్ని తిప్పి పంపుతోంది. తిరిగి పాలిష్ చేసి పంపడానికి ఒక లారీకి అదనంగా రూ.7 వేల భారం పడుతోంది. ఈ సారి సన్న వడ్ల లెవీ తక్కువ వస్తుంది. నిబంధనల ప్రకారం సీఎంఆర్ ఇవ్వడం మిల్లర్లకు కష్టమే. రైస్ మిల్లర్లకు కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. న్యాయం చేయాలని మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్‌ను కలిసి వినతిపత్రాలు అందించాం. సమస్య పరిష్కారానికి సోమవారం నుంచి మిల్లింగ్ నిలిపివేస్తున్నాం. – నగునూరి అశోక్‌కుమార్, రైస్‌ఇండస్ట్రీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి -
29 నుంచి మూడో విడత ఉచిత సరుకులు
సాక్షి, అమరావతి: పేదలకు మూడవ విడత ఉచిత సరుకులు ఈ నెల 29 నుంచి మే నెల 10వ తేదీ వరకు పంపిణీ చేయనున్నారు. కరోనా విపత్తు సమయంలో ఉపాధిలేని పేదలకు ఆకలి బాధ ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు ఇప్పటికే రెండు విడతలుగా ఉచిత సరుకులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. మూడో విడత పంపిణీ సందర్భంగా రెవిన్యూ అధికారులకు, డీలర్లకు ప్రత్యేక జాగ్రత్తలు సూచిస్తూ పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు. ► కరోనా నేపథ్యంలో ఒక్కో దుకాణం పరిధిలో రోజుకు 30 మంది లబ్ధిదారులకు టైం స్లాట్ టోకన్లు ఇచ్చి పంపిణీ చేయాలి. ► మొదటి, రెండో విడతల్లో వీఆర్వో లేదా ఇతర అధికారుల బయో మెట్రిక్ ద్వారానే రేషన్ అందించగా ఈసారి మాత్రం లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోవాలి. ► అన్ని రేషన్ షాపుల వద్ద శానిటైజర్, మాస్కులు ఉంచాలి. ► ప్రతి లబ్ధిదారుడు బయోమెట్రిక్ ఉపయోగించే ముందు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునేలా డీలర్లు జాగ్రత్త వహించాలి. ఏడాదికి సరిపడా ఆహార నిల్వలు సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏడాదికి సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కరోనా వేళ ఆహార ధాన్యాల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వద్ద 16.89 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నందున సెప్టెంబర్ నాటికి మరో 12 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వచ్చే అవకాశం ఉందన్నారు. లాక్డౌన్ ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం మార్చి 29 నుంచి ఏప్రిల్ 29వ వరకు 1.47 కోట్ల తెల్ల రేషన్ కార్డుదారులకు మూడు విడతలుగా ఉచితంగా బియ్యంతో పాటు కిలో కందిపప్పు లేదా శనగలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఉచితంగా బియ్యం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో ఈనెల అదనంగా మరో 70 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఎఫ్‌సీఐ నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ► రాష్ట్రంలో ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) గొడౌన్ల నుంచి ఇటీవల కర్ణాటక, కేరళ, తమిళనాడుకు 1,93,330 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపారు. యానాంకు 189 మెట్రిక్ టన్నులు, అండమాన్ నికోబార్ దీవులకు 304.310 మెట్రిక్ టన్నులు పంపారు. ► వలస కార్మికుల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థల విజ్ఞప్తి మేరకు విశాఖపట్నానికి 10 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సబ్సిడీపై కేటాయించింది. ► ఎఫ్‌సీఐ వద్ద 7.35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 11,082 మెట్రిక్ టన్నుల గోధుమలు అందుబాటులో ఉన్నాయి. -
విత్తన పరిశ్రమ విరాళం రూ.9 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐఐ) సభ్య కంపెనీలు రూ.9 కోట్ల విరాళం ప్రకటించాయి. ఈ మొత్తంలో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.1.97 కోట్లు అందించాయి. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్స్‌కు రూ.2.44 కోట్లు విరాళం ఇచ్చాయి. పీపీఈ, ఆహార పంపిణీ, అవగాహన కార్యక్రమాలకు మిగిలిన మొత్తాన్ని వెచ్చిస్తున్నాయి. సభ్య కంపెనీలైన మహీకో, రాశి, సింజెంటా, క్రిస్టల్, కోర్టెవా కంపెనీలు ఒక్కొక్కటి రూ.1 కోటి ఖర్చు చేస్తున్నాయి. బీఏఎస్ఎఫ్, బేయర్, బయోసీడ్, ఎంజా జేడెన్, హెచ్ఎం క్లాస్, ఐఅండ్‌బీ, జేకే, కలాశ్, నిర్మల్, నోబుల్, ర్యాలీస్, రిజ్వాన్, సీడ్‌వర్క్స్, సవాన్నా, టకీ, టకీట కూడా సాయానికి ముందుకు వచ్చాయి. కాగా, మొత్తంగా బేయర్ ఇండియా రూ.7.2 కోట్లు, డీసీఎం శ్రీరామ్ రూ.10 కోట్లు, జేకే గ్రూప్ రూ.10 కోట్లు వెచ్చిస్తున్నాయి. -
18 నెలలకు సరిపడా ఆహార నిల్వలు
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద పంపిణీ చేసేందుకు 18 నెలలకు సరిపడే ఆహార ధాన్యాల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ప్రకటించింది. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అవసరమైన ఆహార ధాన్యాలను సిద్ధం చేశామని తెలిపింది. ఈ మేరకు ఎఫ్‌సీఐ తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ రీజియన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ విక్టర్ అమల్‌రాజ్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. లాక్డౌన్ సమయంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు ఆహారధాన్యాలను సరఫరా చేయడంతో తెలంగాణ రీజియన్ శాఖ విశేష కృషి చేస్తోందని వెల్లడించింది. దీంతోపాటే తెలంగాణ పీడీఎస్ అవసరాలకు బియ్యం సరఫరా చేస్తోందన్నారు. -
తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి రైళ్లు.. ఎందుకంటే!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశంలో 21 రోజుల లాక్డౌన్ ప్రకటించిన క్రమంలో పేదవారు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం వారికి ఆహారధాన్యాలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఆహారధాన్యాల కొరత ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) ప్రజా పంపిణీ ద్వారా రెండు రెట్లు అధిక ధాన్యాన్ని సరఫరా చేస్తోంది. గత రెండు రోజుల్లోనే 85 రైళ్ల ద్వారా అవసరమైన ధాన్యాన్ని ఆయా రాష్ట్రాలకు అందించింది. ఆహారధాన్యాలు అధికంగా లభిస్తున్న పంజాబ్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కొరత ఉన్న రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రం నుంచి అధికంగా 60 శాతం వరకు తరలించినట్లు అధికారులు తెలిపారు. లాక్డౌన్ విధించిన క్రమంలో ప్రస్తుతం ఇచ్చే 5 కేజీల ఆహారధాన్యాలకు అదనంగా మరో 5 కేజీలను ఉచితంగా అందిస్తానని మార్చి 24న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మిలియన్‌టన్నులు ఆహారధాన్యాలను కొరత ఉన్న ఆయా రాష్ట్రాలకు ఎఫ్‌సీఐ సరఫరా చేస్తోంది. ఏప్రిల్‌లో అందించేందుకు కావల్సిన ధాన్యాలను ఇప్పటికే ఎఫ్‌సీఐ సరఫరా చేసింది. ఏప్రిల్ నెలలో 5 మిలియన్ టన్నుల ధాన్యాన్ని తరలించనున్నామని ఎఫ్‌సీఐ చైర్మన్ డీవీ ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం అదనంగా ఇస్తానన్న ధాన్యంతో కలిసి అన్ని రాష్ట్రాలకు సరిపడ ఆహారధాన్యాలు ఎఫ్‌సీఐ దగ్గర ఉన్నాయని ఆయన తెలిపారు. సాధారణంగా నెలకు 5 కేజీల చొప్పున సరఫరా చేయడానికి అన్ని రాష్ట్రాల వద్ద 4నుంచి 6 నెలలకు సరిపడా రేషన్ ఉందని అయితే లాక్డౌన్ కారణంగా అదనంగా అందిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. దీంతో పాటు పంజాబ్, ఒడిశా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు మూడు నెలల రేషన్‌ను ఒకేసారి అందించనున్నట్లు ప్రకటించాయి. అదేవిధంగా వినియోగదారులు ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదనంగా 5 కేజీల ధాన్యాలు ఇవ్వడానికి అంగీకరించాయి. దీనితో ఆహారధాన్యాలను ఎక్కువగా సరఫరా చేయాల్సి వచ్చిందని తెలిపారు. దీనితో పాటు ఏప్రిల్ మధ్యలో నుంచి ఆహారధాన్యాల సేకరణ మొదలుపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పేదలకు ఆహారధాన్యాలు సమకూర్చడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. -
కేంద్రమంత్రిని కలిసిన మంత్రి కొడాలి నాని
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ఎఫ్‌సిఐ నుంచి రావాల్సిన నాలుగు వేల కోట్లు బకాయిలు త్వరితగతిన విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు.మంగళవారం ఢిల్లీలో ఆయన కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం 92 లక్షల కార్డులను మాత్రమే గుర్తించిందని.. మొత్తం 1.30 కోట్ల కార్డులను గుర్తించాలని కేంద్రమంత్రిని కోరామని వెల్లడించారు.ఎఫ్‌సిఐ గోడౌన్లలో ధాన్యం నిల్వలను ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని నిల్వ చేయడానికి గోడౌన్ల అవసరముందని చెప్పారు. ప్రస్తావించిన పలు సమస్యలపై కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ సానుకూలంగా స్పందించారని మంత్రి కొడాలి నాని వెల్లడించారు. మార్గదర్శకాలు సడలింపు.. రేషన్‌కార్డుల జారీకి గతంలో మార్గదర్శకాలను సడలించి మరింత ఎక్కువ మందికి వచ్చేలా నిబంధనలను సరళీకృతం చేశామని మంత్రి నాని చెప్పారు. ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ కార్డులు ఇవ్వడం వల్ల తమకు రేషన్ అవసరం లేదని స్వచ్ఛందంగా 9 లక్షల మంది కార్డులను వెనక్కి ఇచ్చేశారని పేర్కొన్నారు. ‘ఆరు లక్షల కార్డులపై ఎంక్వయిరీ జరుగుతోంది. వాటిపై తనిఖీ చేసి అర్హులందరికీ ఇస్తాం. ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండాలని లక్ష్యంతో నిబంధనలు సడలించాం. రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ’ అని పేర్కొన్నారు. చంద్రబాబుకు శిక్ష తప్పదు.. చంద్రబాబు అవినీతి బాగోతంపై మంత్రి నాని మాట్లాడుతూ.. రెండు వేల కోట్ల రూపాయల డబ్బును ఎవరు ఇంట్లో పెట్టుకుని కూర్చోరని, వేల కోట్ల అక్రమ సంపాదన చేశారు కాబట్టి.. వాటికి సంబంధించిన ఆస్తులు, నగదు, డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలు దొరికాయన్నారు. రెండు వేల కోట్లు దొరికాయని ఎవరు చెప్పలేదన్నారు. కోట్ల రూపాయలు పీఏ ఇంట్లో పెట్టుకోవడానికి చంద్రబాబు పిచ్చోడు కాదని.. ఆయన చెప్పిన మేరకు డబ్బులు ఇచ్చిన విషయాన్ని పీఏ శ్రీనివాస్ తన డైరీలో రాసుకున్నారన్నారు. చంద్రబాబు చేసిన అక్రమాలకు శిక్ష తప్పదని పేర్కొన్నారు.(అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అడ్డంగా దొరికారు..) శాసనమండలి అభివృద్ధికి అడ్డుపడుతోంది.. కేంద్రం, రాష్ట్రానికి మధ్య రాజ్యాంగ సంబంధాలు ఉన్నాయని.. తమకు మండలి వద్దని ఫార్వర్డ్ చేశామని మంత్రి నాని పేర్కొన్నారు. రెండు,మూడు నెలల లోపు కేంద్రం నిర్ణయం అమలవుతుందన్నారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన శాసనమండలి అభివృద్ధి అడ్డుపడుతుందని..రాజకీయాలకు వేదికగా మారుతోందని విమర్శించారు. అందుకే మండలిని రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు. -
తెరపైకి రికవరీ వివాదం
విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వం సేకరించే ధాన్యం మరపట్టే విషయంలో మరో చిక్కు వచ్చి పడింది. భారత ఆహార సంస్థ గతంలో అధికంగా చెల్లించిన బిల్లులు రికవరీ చేయాలని ఇప్పుడు అధికారులు చూస్తున్నారు. ఈ మేరకు కొందరు మిల్లర్లకు నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆయా మిల్లర్లు ఈ ఏడాది ధాన్యం మరపట్టేందుకు దూరంగా ఉండాలని యోస్తున్నారు. ఖరీ ఫ్ సీజన్‌కు సంబంధించి సేకరించిన ధాన్యం మరపట్టే విషయంలో మిల్లర్లు ఆది నుంచి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సార్టెక్స్ మిల్లులు పెట్టలేమని, ధాన్యం కొనుగోలు జీవో ఇవ్వలేదని, మర ఛార్జీలు నిర్ణయించలేదని, రవాణా టెండర్లు ఇంకా ఫైనల్ కాలేదని... ఇలా అనేక సమస్యలు తెరపైకి తెచ్చి బ్యాంకు గ్యారంటీలు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి గట్టి వాదన వినిపించింది. బ్యాంకు గ్యారంటీలు ఇస్తేనే ధాన్యం ఇస్తామని, లేకుంటే వేరే జిల్లాలకు పంపించి మర పట్టించుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. మెట్టు దిగిన మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ చెల్లిస్తున్న తరుణంలో ఎఫ్‌సీఐ నోటీసులు కలకలం సృష్టిస్తున్నాయి. తొమ్మిదేళ్లనాటి మొత్తాల రికవరీ 2010లో మిల్లర్లు బియ్యం ఎఫ్‌సీఐకి ఇచ్చినపుడు మండీ(నెట్) చార్జీలు చెల్లించారు. ఆ సందర్భంలో రూ. ఐదుకోట్లు ఎఫ్‌సీఐ అదనంగా చెల్లించేసింది. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటూ జిల్లాలోని 80మంది మిల్లర్లకు ఇప్పుడు నోటీసులు జారీ చేసింది. పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారుల ద్వారా జిల్లా అధికారులకు ఆ నోటీసులు పంపించి మిల్లర్లకు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అందుకు సివిల్సప్లయ్స్ అధికారులు అంగీకరించలేదు. అధిక చెల్లింపులు చేసింది ఎఫ్‌సీఐ కాబట్టి నేరుగా నోటీసులు జారీ చేసుకోవాలని చెప్పేశారు. మిల్లర్లలో రికవరీ భయం మిల్లర్లలో ఇప్పుడు రికవరీ భయం పట్టుకుంది. రాష్ట్రంలో నాణ్యమైన బియ్యం సరఫరాలో భాగంగా సార్టెక్స్ మిల్లుల్లో ఆడిన బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మిగతా మిల్లర్లు మరాడించిన బియ్యాన్ని ఎఫ్సీఐకు ఇవ్వాలి. జిల్లాలో 192మందికి 32మంది మాత్రమే సార్టెక్సుకు మారుతుండడంతో మిగతా మిల్లర్లంతా ఎఫ్‌సీఐకే బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఎలాగైనా తిరిగి చెల్లించాల్సిందేనని మిల్లర్లు అనుమాన పడుతున్నారు. ఒక్కో మిల్లరు రూ.10 నుంచి రూ.80లక్షల వరకు చెల్లించాల్సి ఉండడంతో వారిలో ఆందోళన నెలకొంది. ఇప్పుడు కొత్త ధాన్యం కోసం బ్యాంకు గ్యారంటీలు చెల్లించాల్సిన తరుణవంలో రికవరీ సొమ్ము ఎల్లా చెల్లించగలమని వారు ప్రశి్నస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మిల్లింగ్‌కు దూరంగా ఉండాలని వారంతా యోచస్తున్నట్టు తెలుస్తోంది. దృష్టిసారించిన అధికారులు, మంత్రి.. ఈ సమస్యపై అధికారులు దృష్టిసారించారు. మిల్లర్ల నుంచి రికవరీ వ్యవహారం ఎఫ్‌సీఐ, మిల్లర్ల మధ్య ఉన్న సమస్య. దీనివల్ల ప్రభుత్వానికి, రైతులకు వచ్చిన నష్టం లేదు. మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇవ్వకపోయినా ఇతర జిల్లాలకు ధాన్యం పంపాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇలా చేయడం వల్ల జిల్లా మిల్లర్లు నష్టపోయే ప్రమాదం ఉంది. పైగా ఇతర జిల్లాలకు రవాణా చేయడం వల్ల ప్రభుత్వంపై ఆరి్ధకభారం పడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికప్పుడు రికవరీ చేయకున్నా ధాన్యం కొనుగోలు సీజన్ పూర్తయిన తర్వాత రికవరీ గురించి ఆలోచన చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో అధికారులు ఉన్నారు. అంత వరకూ తాత్కాలికంగా వాయిదా వేయాలని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఇన్నేళ్లుగా మిన్నకున్న ఉన్నతాధికారులు ఇప్పుడు రికవరీ చేయాలనుకోవడం కేవలం మిల్లర్లను ఇబ్బంది పెట్టడానికేనన్న వాదన వినిపిస్తోంది. ఉన్నతాధికారులతో మాట్లాడాం రూ.5కోట్ల రికవరీకి 80మంది అధికారులకు నోటీసులు ఇవ్వడం వాస్తవం. దీనిపై మిల్లర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు గ్యారంటీలు ఇచ్చేందుకు సంశయిస్తున్నారు. వారితో మాట్లాడాం. ఉన్నతాధికారులతో కూడా మాట్లాడాం. ధాన్యం కొనుగోలు ముఖ్యం కాబట్టి రికవరీ గురించి తర్వాత దృష్టిసారించాలని చెప్పాం. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా దీనిపై మాట్లాడారు. ఎటువంటి సమస్య ఉండదు. – కె.వెంకటరమణారెడ్డి, సంయుక్త కలెక్టర్ -
ఎఫ్‌సీఐ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజాపేటలో ఉన్న ఎఫ్‌సీఐ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గోదాం పూర్తిగా దగ్ధమైపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే 2 గంటలు శ్రమించినప్పటికి ఫలితం దక్కలేదు. గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంతో ఆ చుట్టుపక్కల దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో భారీ నష్టం వాటిలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎఫ్‌సీఐ పేపర్ లీక్ : 50 మంది అరెస్ట్
సాక్షి, భోపాల్ : ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పోస్టుల భర్తీకి జరగాల్సిన పరీక్ష పత్రాలు లీక్ కావడం కలకలం రేపింది. సీబీఎస్ఈ ఎగ్జామ్ పేపర్ బహిర్గతం కావడం దేశవ్యాప్తంగా దుమారం రేపిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఆదివారం జరగాల్సిన ఎఫ్‌సీఐ పరీక్ష ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ అయింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు దళారులతో పాటు 48 మంది అభ్యర్థులను మధ్యప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు అరెస్టు చేశారు. ప్రశ్నాపత్రాన్ని ఇచ్చినందుకు ఒక్కో అభ్యర్థి నుంచి ఏజెంట్లు రూ 5 లక్షలు డిమాండ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. పోస్టుకు ఎంపికైన అనంతరం ఈ మొత్తాన్ని చెల్లించాలని తమను ఏజెంట్లు కోరారని అభ్యర్ధులు విచారణ సందర్భంగా చెప్పినట్టు సమాచారం. కాగా, అరెస్ట్ అయిన ఏజెంట్లను ఢిల్లీకి చెందిన అశుతోష్ కుమార్, హరీష్ కుమార్‌లుగా గుర్తించారు. నిందితుల నుంచి చేతిరాతతో కూడిన ప్రశ్నాపత్రం, ఆన్సర్ షీట్‌ను ఎస్టీఎఫ్ స్వాధీనం చేసుకుంది. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. -
గోడౌన్ల పునః ప్రారంభంతో ఉద్యోగాలు వస్తాయి
-
రూ. 35 వేల కోట్లు వృధా!
న్యూఢిల్లీ: ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరక్క దిక్కులేని స్థితిలో రైతులు రొడ్డెక్కుతున్న దేశంలో, కూలిలేక నాలిలేక పిడుచగట్టిన నాలికలతో మూడోవంతు జనాభా పస్తులుంటున్న భారత దేశంలో... ఒక్క గోధుమలే ఐదు లక్షల టన్నులు కుళ్లిపోవడం, 35,701 కోట్ల రూపాయల డబ్బు వృధా అవడం ఎంత కష్టం, ఎంత నష్టం? ఇవి ఎవరో చెప్పిన లెక్కలుగావు. సాక్షాత్తు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చూపిన లెక్కలు. 2011 సంవత్సరం నుంచి 2016 సంవత్సరం వరకు దేశంలోని కేంద్ర ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యం, నిస్సహాయం, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నిర్లిప్తత, నీతిబాహ్యానికి దేశం ఇంతటి మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చిందని కాగ్ శుక్రవారం విడుదల చేసిన తన నివేదికలో విమర్శించింది. దేశంలోని రైతుల నుంచి కనీస మద్దతు ధర కింద గోధుమలు, బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏటా భారత ఆహార సంస్థ ప్రతిపాదిస్తున్న నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 67 శాతం నిధులను మాత్రమే విడుదల చేస్తూ వస్తోంది. 2015–2016 ఆర్థిక సంవత్సరానికి 1.03 లక్షల కోట్ల రూపాయల నిధులను కోరగా కేంద్ర ప్రభుత్వం 67 శాతం నిధులను మాత్రమే విడుదల చేసింది. దేశంలోని రైతుల నుంచి గోధుమలు, బియ్యాన్ని కనీస మద్దతు ధరకు కొని పౌర పంపిణీ పథకం ద్వారా వాటిని పేద ప్రజలకు అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం 1964లో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ను ఏర్పాటు చేసింది. దేశంలో ఏటా గోధుమలు, బియ్యం దిగుబడిని దృష్టిలో పెట్టుకొని రైతుల నుంచి వీటి సేకరణకు ఎంత ఖర్చవుతుందో అంచనాలు వేసి ఆ మేరకు నిధులను మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలి. వాటిని పరిశీలించిన కేంద్రం తప్పనిసరిగా ప్రతిపాదనల్లో 95 శాతం నిధులను విడుదల చేయాలి. అయితే 2011–2012 నుంచి 2015–2016 ఆర్థిక సంవత్సరం వరకు ఎఫ్‌సీఐ ప్రతిపాదనల్లో 67 శాతం నిధులను మాత్రమే కేంద్రం విడుదల చేస్తూ వచ్చింది. ప్రభుత్వ గ్యారంటీపై ప్రభుత్వ బ్యాంకుల నుంచి వడ్డీలు తీసుకునేందుకు, బాండులు విడుదల చేసేందుకు కూడా కేంద్రం అనుమతించలేదు. కేంద్రానికి భారత ఆహార సంస్థ 11 లేఖలు రాయగా మొదటి పది లేఖలకు అసలు స్పందించలేదు. 11వ లేఖకు స్పందించినప్పటికీ విజ్ఞప్తులను నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చుతూ ప్రైవేటు వర్గాల నుంచి రుణాలు తీసుకోవాల్సిందిగా ఉచిత సలహా ఇచ్చి ఊరుకుంది. భారత ఆహార సంస్థ బ్యాంకుల ఆశ్రయించగా తక్కువ వడ్డీపై రుణాలిచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు రాలేదు. పర్యవసానంగా ఈ ఐదేళ్ల కాలానికి ఆహార సంస్థ 11 నుంచి 12 శాతం వడ్డీపై రుణాలు తీసుకొంది. ఆ రుణాల మొత్తంపై వడ్డీ 2016 ఆర్థిక సంవత్సరం నాటికి 35,701 కోట్ల రూపాయలకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించి ఉన్నట్లయితే కనీసం 1617 కోట్ల రూపాయలు కలసి వచ్చేవని కాగ్ కేంద్రంపై అక్షింతలు వేసింది. భారత ఆహార సంస్థ పనితీరు కూడా సవ్యంగా లేదని, గోధుమలు అధికంగా పండే పంజాబ్ రాష్ట్రంలో ఈ ఐదేళ్లకాలంలో ఐదు లక్షల టన్నుల గోధుమలు ఎందుకు పనికి రాకుండా కుళ్లిపోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఆహార సంస్థ చిట్టా పద్ధులు కూడా చిత్తు లెక్కల్లా ఉన్నాయని ఆక్షేపించింది. మార్గదర్శకాల ప్రకారం రైలు మార్గాలకు దగ్గరలో శీతల గిడ్డంగులను నిర్మించక పోవడం, వాటిని నిర్మాణాల్లో కూడా ఆలస్యం జరగడం, పూర్తయిన గిడ్డంగులను కూడా సకాలంలో స్వాధీనం చేసుకోక పోవడం పట్ల కూడా కాగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఆహార సంస్థ ప్రతిఏటా రైతుల నుంచి గోధమలు, బియ్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడంతోపాటు వాటిని నిల్వ ఉంచేందుకు శీతల గిడ్డంగులు ఏటేటా నిర్మిస్తూ పోవాలి. 2011–2012 సంవత్సరానికి 50 లక్షల టన్నుల ధాన్యాన్ని నిల్వచేసే సామర్థ్యంగల శీతల గిడ్డంగులను భారత ఆహార సంస్థ అదనంగా నిర్మించాల్సి ఉండగా, 43 లక్షల టన్నుల సామర్థ్యంగల గడ్డంగులను మాత్రమే నిర్మించగలిగింది. అదే సంవత్సరానికి 192 గిడ్డంగుల్లో 165 గిడ్డంగుల నిర్మాణం పూర్తయినప్పటికీ ఆ మరుసటి సంవత్సరానికిగాను వాటిని స్వాధీనం చేసుకోలేక పోయింది. పంజాబ్‌లో గోధమలను ఆరుబయట ఆరబోయటం వల్లనే ఐదు లక్షల టన్నులు కుళ్లిపోయాయి. -
మిల్లర్లకు బ్లాక్ స్పాట్
-ఎఫ్‌సీఐకి తరలిస్తున్న బియ్యంపై నల్లచుక్కలు -40 వేల టన్నులు తిరస్కరణ -ఘొల్లుమంటున్న రైస్ మిల్లర్లు తాడేపల్లిగూడెం : రైస్ మిల్లర్లకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ‘బ్లాక్ స్పాట్’ పేరిట కొర్రీ వేస్తోంది. బియ్యం గింజల మధ్యలో నల్లటి మచ్చ ల్లాంటివి ఉన్నాయంటూ గడచిన 20 రోజుల్లో సుమారు 40 వేల టన్నుల బియ్యాన్ని వెనక్కి పంపించింది. ఈ పరిస్థితితో మిల్లర్లు ఘొల్లుమంటున్నారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు ఇచ్చి కస్టమ్ మిల్లింగ్ పేరిట బియ్యం ఆడించింది. ధాన్యాన్ని మరాడించినందుకు క్వింటాల్‌కు రూ.15 చొప్పున మిల్లర్లకు ప్రభుత్వం చెల్లిస్తోంది. ధాన్యాన్ని ఆడగా వచ్చే ఊక, చిట్టు, తవుడు తదితరాలను మిల్లర్లకే ఇస్తోంది. క్వింటాల్ ధాన్యానికి బదులుగా 67 కిలోల చొప్పున బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఆ బియ్యాన్ని నేరుగా ఎఫ్‌సీఐకి అప్పగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆ బియ్యాన్ని జిల్లాలోని మిల్లర్లంతా ఎఫ్‌సీఐ డిపోలకు తరలించడం మొదలుపెట్టారు. టిప్ డ్యామేజీ ఉందంటూ.. మిల్లర్లు తీసుకొచ్చిన బియ్యాన్ని దిగుమతి చేసుకునే ముందు వాటి నాణ్యతను ఎఫ్‌సీఐ క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీ చేస్తుంటారు. అయితే, ఇటీవల మిల్లర్లు తీసుకొస్తున్న బియ్యంపై నల్లటి మచ్చలు (టిప్ డ్యామేజీ) ఉందని క్వాలిటీ కంట్రోల్ గుర్తించింది. అలాంటి బియ్యాన్ని దిగుమతి చేసుకునేది లేదంటూ ఎఫ్‌సీఐ అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. గడచిన 20 రోజుల్లో సుమారు 60 వేల టన్నుల బియ్యాన్ని జిల్లాలోని మిల్లర్లు ఎఫ్‌సీఐ డిపోలకు తరలించగా, టిప్ డ్యామేజీ పేరిట అందులో సుమారు 40 వేల టన్నుల బియ్యాన్ని అధికారులు తిరస్కరించారు. దీంతో ఏం చేయాలో తెలియక రైస్‌మిల్లర్లు బేలచూపులు చూస్తున్నారు. 1.85 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాలి ఐకేపీ కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా జిల్లావ్యాప్తంగా 10,65,436 టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఈ ధాన్యాన్ని మరాడించి 6,63,842 టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. ఇందులో 50 వేల టన్నులను రేషన్ బియ్యం నిమిత్తం ఇప్పటికే పౌర సరఫరాల శాఖకు ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఎఫ్‌సీఐకి బియ్యం తరలింపు ప్రారంభమైంది. ఈనెల 12వ తేదీ వరకు 4,79,137 టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐ డిపోలకు చేరవేశారు. ఇంకా 1,84,709 టన్నుల బియ్యాన్ని జిల్లాలోని మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. గత నెల వరకూ రోజుకు 3 వేల నుంచి 4 వేల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్‌సీఐకి చేరవేసేవారు. గడచిన 20 రోజులుగా రోజుకు కనీసం వెయ్యి టన్నులు కూడా ఎఫ్‌సీఐ స్వీకరించడం లేదు. టిప్ డ్యామేజీ పేరిట బియ్యాన్ని తిప్పిపంపుతున్నారని మిల్లర్లు చెబుతున్నారు. నాణ్యత గుర్తించేదిలా ఎఫ్‌సీఐకి తరలించే బియ్యంలో ఒక బస్తా నుంచి 10 గ్రాముల్ని క్వాలిటీ కంట్రోల్ అధికారులు బయటకు తీస్తారు. రంగు, పాలిష్, నూకల శాతం ఎలా ఉన్నాయనేది పరిశీలిస్తారు. 10 గ్రాముల్లో 0.03 గ్రాములకు మించి దెబ్బతిన్న (డ్యామేజీ) బియ్యం ఉండకూడదు. అందులో నూకల శాతం 25 వరకు ఉండవచ్చు. అంతకుమించితే చెల్లించే సొమ్ములో కోత విధించడం లేదా వెనక్కి పంపించడం చేస్తారు. ప్రస్తుతం ఇలాంటి కారణాలేమీ లేకపోయినా బియ్యంపై నల్లమచ్చలు ఉన్నాయంటూ బియ్యాన్ని వెనక్కి పంపిస్తున్నారు. 20 ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఇలాంటి సమస్య రాలేదని మిల్లర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన 1.85 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకుంటారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లారీ బియ్యాన్ని వెనక్కి తీసుకు రావాలంటే రూ.10 వేల వరకు ఖర్చవుతోందని మిల్లర్లు పేర్కొంటున్నారు. ఈ నష్టాన్ని ఎలా భరించాలని ప్రశ్నిస్తున్నారు. -
ఎఫ్‌సీఐలో సంబరాలు
జ్యోతినగర్: ప్రధాని నరేంద్రమోడీ గజ్వేల్‌లో మిషన్‌కాకతీయ పైలాన్, రామగుండం ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన చేయడంతో ఎఫ్‌సీఐ మాజీ ఉద్యోగులు, కాంట్రాక్టు క్యాజువల్ లేబర్, స్థానిక నిరుద్యోగ యువత, ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీనవర్గాల యువత బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ కమిటీ మాజీ అధ్యక్షుడు ఎం.సుందర్రాజు, డి.పోశంయాదవ్, బొడ్డుపల్లి నారాయణ మాట్లాడుతూ ఎరువుల కర్మాగారం గ్యాస్ ఆధారితంగా రోజుకు 3850 టన్నుల యూరియా, 200 టన్నుల అమ్మోనియా తయారు చేస్తుందన్నారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత్‌కుమార్, కేంద్ర సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కృషి చేశారని పేర్కొన్నారు. గతంలో పనిచేసిన మాజీ ఉద్యోగుల కుటుంబాల పిల్లలకు పర్మినెంట్ ఉపాధి కల్పించాలని, కాంట్రాక్టు క్యాజువల్ లేబర్ కుటుంబాల పిల్లలకు అర్హతలను బట్టి పర్మినెంట్, ఔట్సోర్సింగ్ పద్ధతిన ఉపాధి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆసిఫ్‌పాషా, రాంబాబు, ప్రతాప్, భూంరావు, మల్లేష్‌తో పాటు కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
అమ్మబోతే అడవేనా..!
అమలాపురం : ‘సమన్వయ లోపం’ అన్న మాటకు తిరుగులేని ఉదాహరణ చెప్పమంటే.. ఏ మాత్రం తడుముకోకుండా చూపుడువేలును ప్రభుత్వ శాఖల వైపు చూపొచ్చు. అనేక సందర్భాల్లో కళ్లకు కట్టిన వాస్తవమే ఇప్పుడు మరోసారి రబీ దిగుబడి, కొనుగోళ్లకు సంబంధించి రుజువు కానుంది. వ్యవసాయ శాఖ రబీ ధాన్యం దిగుబడి అంచనా 15 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, పౌరసరఫరాల శాఖ దానిలో 65 శాతం కొనుగోలే లక్ష్యంగా పెట్టుకుంది. మారిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) లెవీ నిబంధనల కారణంగా రైతులు పండించే ధాన్యం మొత్తాన్ని రాష్ర్ట ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కేంద్రాల ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే జిల్లా అధికార యంత్రాంగమే కొనుగోలు లక్ష్యానికి కోతపెట్టడంపై రైతుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో గోదావరి డెల్టాలో రబీ సాగు చివరి దశకు చేరుకుంది. నీటి ఎద్దడి వల్ల కొన్ని ప్రాంతాల్లో సాగు దెబ్బతిన్న విషయం తెలిసిందే. మిగిలిన చోట్ల అంచనాలకు మించి దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ చెబుతోంది. జిల్లావ్యాప్తంగా 3.75 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగగా, సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తుందని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. అనపర్తి, ఆలమూరు సబ్ డివిజన్లలో నీటి ఎద్డడి లేని ప్రాంతాల్లో ఎకరాకు 48 నుంచి 50 బస్తాలు, కొన్ని ప్రాంతాల్లో 53 బస్తా దిగుబడి ఉంటుందని ఆ శాఖ అంచనా వేస్తోంది. కోతలు మొదలయ్యే సమయం దగ్గర పడుతుండడంతో అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోలుపై దృష్టి సారించింది. గతంలో లాగే జిల్లాలో 284 కొ నుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు 9.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగో లు చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. అప్పట్లో తప్పుడు లెక్కలు! గత ఖరీఫ్‌లోనూ ప్రభుత్వం 284 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా సుమారు 12.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెబుతున్నారు. వాస్తవంగా రైతుల నుంచి కొనుగోలు చేసింది పదవ వంతు కూడా ఉండదు. పైగా ఖరీఫ్ దిగుబడి అప్పట్లో 12 లక్షల మెట్రిక్ టన్నులని అంచనా వేయగా వర్షాల వల్ల కోనసీమలో పెద్ద ఎత్తున పంట దెబ్బతిని దిగుబడి తక్కువగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే అంచనాలకు మించి కొనుగోలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా పండిన పంటలో సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు తమ అవసరాల కోసం నిల్వ చేసుకుంటారు. మెట్ట ప్రాంత రైతుల్లో కొందరు ఖరీఫ్‌లో పండిం చిన ధాన్యాన్ని ఇప్పటికీ అమ్మలేదు. అయినా పండినదానికన్నా అదనంగా కొనుగోలు చేసినట్టు అధికారులు చూపడం అనుమానాలకు తావిస్తోంది. మిల్లర్ల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేసిన కేంద్రాల నిర్వాహకులు అదంతా రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు చూపారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని అప్పట్లో సాక్షి రూ.‘100 కోట్ల దందా’ శీర్షికన వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అరుునకాడికే ఖరీఫ్ ధాన్యం అమ్మకం కొనుగోలులో మతలబుల వల్ల రైతులు నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోలుకు అడ్డగో లు నిబంధనలు పెడుతున్న ప్రభుత్వమే.. మి ల్లర్లు, ధాన్యం షావుకార్లు అడ్డదారిలో అమ్ముకోవడానికి మాత్రం గేట్లు బార్లా తెరిచింది. కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మే పరిస్థితి లేకపోవడం వల్ల రైతులు త మ ధాన్యాన్ని అయినకాడికి బయట అమ్ముకుంటున్నారు. గత ఖ రీఫ్లో తడిసిన ధాన్యం బస్తా (75 కేజీలు)ను రూ.600కు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. నాణ్యమైన ధాన్యాన్ని సైతం బస్తా రూ.800కి అమ్మాల్సి వచ్చి రైతులు నష్టాలు చవిచూశారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు లక్ష్యానికి కోత పెడితే ఇదే అదనుగా మిల్లర్లు, ధాన్యం షావుకార్లు తమను ముంచేస్తారని రైతులు ఆందోళన చెందుతున్నా రు. అధికారులు ఈసారై నా ప్రతి బస్తా కొనుగో లు చేస్తే లాభాలు కళ్లజూ స్తామంటున్నారు. లేకుం టే పంట పండినా మరోసారి దండగ తప్పదని కలవరపడుతున్నారు. -
జీపీఎస్‌తో ప్రతీ బియ్యం గింజకూ లెక్క!
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ పూర్తి పారదర్శకంగా జరిపేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. సరుకుల రవాణా, పంపిణీలో అక్రమాలు, దారి మళ్లింపులకు ఇకపై అడ్డుకట్ట వేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) వ్యవస్థను ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తెచ్చి ఎక్కడా అవకతవకలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోనుంది. కొత్త విధానం అమలు ద్వారా ప్రజాధనం సక్రమ నిర్వహణ సాధ్యమని పౌరసరఫరాల శాఖ స్పష్టంచేస్తోంది. ప్రతీ బియ్యం గింజా లబ్ధిదారునికి చేరేలా లెక్కతేలుతుందని చెప్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పీడీఎస్ వ్యవస్థ అంతా మ్యాన్యువల్‌గా జరుగుతుండటంతో కింది నుంచి పైస్థాయి వరకు అనేక అక్రమాలు జరుగుతున్నాయి. స్టాక్ పాయింట్ మొదలు, స్టాక్ రిజిస్టర్ల నిర్వహణ వరకు వివిధ స్థాయిల్లో అధికారులు, డీలర్లు చేతివాటం చూపడంతో రూ.కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం జరిగింది. దీనికి తోడు కేంద్ర ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నుంచి మండల్ లెవల్ స్టాక్ పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా అవుతున్న బియ్యం సహా ఇతర సరుకుల్లో అన్నీ అక్రమాలే జరుగుతున్నాయి. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్ల వరకు సరఫరా చేస్తున్న బియ్యంలో 10శాతం బియ్యం పక్కదారి పడుతుండగా, ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు రవాణా చేసే సమయంలో మరో 15శాతం అక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని నివారించేందుకు సరుకుల సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ అమర్చాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. దీని ద్వారా వాహనం ఎక్కడ ఉన్నది, ఏ దారిలో ప్రయాణిస్తున్నది అధికారులు తెలుసుకోవచ్చు. ఎక్కడైనా వాహనాన్ని ఆపినా ఆ వివరాలు తెలిసిపోతాయి. సరుకు రవాణా చేసే వాహన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎమ్మార్వో స్థాయి మొదలు కింది స్థాయి అధికారి, చివరికి డీలర్, గ్రామ ఆహార సంఘం సభ్యుడు వరకు చేరేలా ఎస్ఎంఎస్ వ్యవస్థను పటిష్టపరుస్తున్నారు. దీంతో జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల కార్యాలయాలకు ఎప్పటికప్పుడు సమాచారం పక్కాగా ఉండి అక్రమాలకు చెక్‌పడుతుంది. ఈ వ్యవస్థ అమలుకు వీలుగా రాష్ట్రంలోని 177 మండల స్థాయి స్టాక్ పాయింట్ల వద్ద ఉన్న కంప్యూటర్లకు, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. జిల్లాల అధికారులకు సైతం దీనిపై అవగాహన కల్పిస్తారు. -
ఎగుమతి బియ్యాన్నీ వదలని ‘ముడుపు’ దయ్యం
ఐదేళ్లుగా వ్యాట్ చెల్లించని మిల్లర్లు * రూ.1300 కోట్లకు పైగా బకాయిలు * బకాయిలు మాఫీ చేయించాలని ఇద్దరు మంత్రులకు మిల్లర్ల మొర! * రూ.200 కోట్లు ముడుపులిస్తేనే మాఫీ అంటూ చినబాబు షరతు * ‘డీల్’ కుదిర్చిన మంత్రులు సాక్షి, హైదరాబాద్: విభజన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, రాజధాని నిర్మాణానికి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి పది రూపాయలు చెల్లించాలంటూ ఉత్తర్వులు జారీచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోవైపు వ్యాట్ రూపంలో మిల్లర్లు బకాయిపడిన రూ.1300 కోట్లను మాఫీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో రూ.200 కోట్లకు పైగా ముడుపులు చేతులు మారినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారవర్గాలు చెబుతోండటం గమనార్హం. రాష్ట్రంలో ఉత్పత్తయిన బియ్యంపై ప్రభుత్వం వ్యాట్ రూపంలో ఐదు శాతం పన్నుగా వసూలు చేస్తోంది. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ), పౌర సరఫరాల సంస్థ(సివిల్ సప్లయిస్ కార్పొరేషన్)లకు సీఎమ్మార్(కస్టమ్ మిల్లింగ్ బియ్యం) రూపంలో అందించే బియ్యంపై కూడా ఐదు శాతం వ్యాట్‌ను వసూలు చేస్తోంది. కానీ.. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే బియ్యంపై (దిగుమతి చేసుకున్న వారి నుంచి సి-ఫారం తీసుకుని వాణిజ్య పన్నుల శాఖకు అందిస్తేనే) మాత్రం వ్యాట్ రూపంలో రెండు శాతం పన్నును వసూలు చేస్తున్నారు. ఏపీ వ్యాట్ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అంటే 2005 నుంచి ఇదే పన్నుల విధానం అమల్లో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2011 నుంచి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన మిల్లర్లు ఏటా భారీ ఎత్తున బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కానీ.. వ్యాట్‌ను చెల్లించడం లేదు. ‘సీ-ఫారం’లను వాణిజ్య పన్నుల శాఖకు సమర్పించడంలోనూ అదే వైఖరిని అనుసరిస్తున్నారు. దాంతో పన్ను బకాయిలు పేరుకుపోయాయి. 2011 నుంచి 2015 వరకూ రూ.1300 కోట్ల మేర వ్యాట్ రూపంలో మిల్లర్లు బకాయిపడ్డారు. కొరడా ఝుళిపించిన వాణిజ్యాధికారులు ఐదేళ్లుగా పేరుకుపోయిన బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మిల్లర్లకు ఆర్నెళ్ల క్రితం నోటీసులిచ్చారు. లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసిన బియ్యానికి సీ-ఫారంలు సమర్పించని నేపథ్యంలో.. ఆ బియ్యానికి కూడా ఐదు శాతం వ్యాట్‌ను చెల్లించాల్సిందేనన్నారు. దీంతో మిల్లర్లు గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు కీలక మంత్రులను ఆశ్రయించారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బియ్యంపై పన్నులు విధించడం లేదని ఇక్కడా వ్యాట్‌ను రద్దు చేయాలని కోరారు. పనిలో పనిగా రూ.1300 కోట్ల బకాయిలను మాఫీ చేయించాలని ప్రతిపాదించారు. దీనితో ఏకీభవించిన మంత్రులు మాఫీకి హామీ ఇచ్చారు. మిల్లర్లు బకాయిపడిన రూ.1300 కోట్ల మాఫీకి సంబంధించిన ప్రతిపాదనలను వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారికి పంపేలా చక్రం తిప్పారు. ఆ ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేయాలంటూ ఉన్నతాధికారిపై ఒత్తిడి తెచ్చారు. కానీ.. ఆ అధికారి వారి ప్రతిపాదనను తోసిపుచ్చారు. రెండోసారి కూడా ఆ మంత్రుల ప్రతిపాదనను తిరస్కరించారు. రంగంలోకి దిగిన చినబాబు.. వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారి అడ్డం తిరగడంతో పక్షం రోజుల క్రితం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఇద్దరు మంత్రులు భేటీ అయ్యారు. మిల్లర్ల బకాయిల మాఫీపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఆ సమావేశం తర్వాత మిల్లర్ల బకాయిల మాఫీ అంశంపై చర్చించే బాధ్యతను ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కార్మిక మంత్రి అచ్చెన్నాయుడులకు సీఎం అప్పగించారు. బకాయిలు ఏ మేరకు చెల్లించడానికి మిల్లర్లు సిద్ధంగా ఉన్నారో వారినే విచారించి నివేదిక ఇవ్వాలని ఆ మంత్రులకు సీఎం ఆదేశించినట్లు వాణిజ్య శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో బియ్యంపై వ్యాట్ విధించడం లేదని.. ఉమ్మడి రాష్ట్రంలోనూ వ్యాట్ బకాయిలను రద్దు చేశారని.. ఇప్పుడూ అదే రీతిలో రద్దు చేయాలని మంత్రులపై మిల్లర్లు ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చినబాబు రంగంలోకి దిగారు. రూ.200 కోట్లు ముడుపులుగా ఇస్తే మిల్లర్ల వ్యాట్ బకాయిలు మాఫీ చేస్తామంటూ మంత్రులతో ప్రతిపాదించారు. ఇదే ప్రతిపాదనను మంత్రులు మిల్లర్ల ముందు ఉంచారు. బకాయిల రద్దుతోపాటు ఇకపై ఎగుమతి చేసే బియ్యంపై వ్యాట్‌ను రద్దు చేస్తే ఆ మేరకు ముడుపులు ఇవ్వడానికి సిద్ధమంటూ మిల్లర్లు షరతు విధించినట్లు సమాచారం. మిల్లర్ల సూచనల మేరకు చినబాబు ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆ నివేదికపై సీఎం చంద్రబాబు ఆమోదముద్ర వేశారని వాణిజ్య పన్నుల శాఖ కీలక అధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో రూ.1300 కోట్ల వ్యాట్ బకాయిల మాఫీ ఉత్తర్వులు వెలువడనున్నాయి. -
కస్టమ్ మిల్లింగ్‌లో మెలికలు.. అలకలు
ప్రజాప్రతినిధుల జోక్యంతో ఇబ్బందులు ఐకేపీ ధాన్యం కొనబోమని అల్టిమేటం అధికారి దిగిరావడంతో వెనక్కి తగ్గిన వైనం రెండేళ్లుగా ఇదే తరహా తంతు తాడేపల్లిగూడెం : భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ధాన్యం కొనుగోలు నుంచి తప్పుకున్నప్పటి నుంచి జిల్లాలో అనేక చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల అలసత్వం.. మిల్లర్ల అలకలు.. ఉన్నతాధికారుల జోక్యం.. తాత్కాలికంగా సమస్యకు వాణిజ్య ప్రకటనల విరామం మాదిరి గ్యాప్. మళ్లీ నిబంధనల ఉల్లంఘనలు, అలకలు, అల్టిమేటమ్‌లు మామూలే.. రెండేళ్లుగా సాగుతున్న తంతు ఇది. ఐకేపీ ధాన్యం తరలింపు వ్యవహారంలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో ఆ కేంద్రాల నిర్వాహకులు రబ్బర్ స్టాంపుగా మారారు. గతంలో మాదిరి రైతు ధాన్యం ఐకేపీ కేంద్రానికి తీసుకెళ్లడం, తేమ శాతం చూసి, అవసరమైతే అక్కడే ధాన్యం ఒకటిరెండు రోజులు నిల్వ చేసి మిల్లర్లకు పంపించడం వంటివి జరిగే వి. ప్రస్తుతం మార్చిన విధానంలో ల్యాండ్టు మిల్ ప్రాతిపదికన ధాన్యం రైతుల నుంచి ఐకేపీ కేంద్ర నిర్వాహకుల కాగితాల అనుమతి పత్రాల ద్వారా మిల్లులకు వెళుతోంది. అక్కడి నుంచి సీఎంఆర్ ( కస్టమ్ మిల్లింగ్ రైస్) రూపంలో బియ్యం ఎఫ్‌సీఐకి చేరుతున్నాయి. జిల్లాలో సుమారు 400 మిల్లులు ఉన్నాయి. వీటిలో 330 మిల్లులు పనిచేస్తున్నాయి. ఐకేపీ ద్వారా మిల్లులకు సీఎంఆర్ నిమిత్తం ధాన్యం పంపేందుకు ఆయా మిల్లుల మర ఆడింపు స్థాయి. గతంలో వారిచ్చిన సీఎంఆర్‌ను ఆధారంగా చేసుకున్నారు. ఈసారి కూడా ఆయా మిల్లులకు లక్ష్యాలను నిర్ణయించారు. దీనికనుగుణంగా ఆయా మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలను ప్రభుత్వానికి చూపించాలి. ఇటీవలి కాలం వరకు ఈ వ్యవహారం సాఫీగానే సాగింది. ఒక ప్రజాప్రతినిధి స్నేహితునిగా చెబుతున్న ఓ వ్యక్తికి ఏలూరు సమీపంలో ఒక మిల్లు ఉంది. ఆ మిల్లుకు అసోసియేషన్ తరఫున కేటాయించిన సీఎంఆర్ లక్ష్యానికంటే అధికంగా ఐకేపీ నుంచి ధాన్యం తోలే విధంగా ఏర్పాటు జరిగింది. అదనంగా తోలుకొనే ధాన్యానికి ఎలాంటి బ్యాంకు గ్యారంటీ చూపించలేదు. సదరు మిల్లర్ అదనంగా తోలుకున్న ధాన్యం వ్యవహారం ఇప్పుడు తలనొప్పిగా మారడంతో ఐకేపీ కేంద్రాల నుంచి వచ్చే ధాన్యం దింపుకోబోమని మిల్లర్ల ప్రముఖులు అధికారులకు అల్టిమేటం ఇచ్చినట్టు తెలిసింది. వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారి ఒకరు ఏలూరు సమీపంలోని మిల్లుకు కేటాయించిన మేరకే ధాన్యం దింపుకొనేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మిల్లర్లు వెనక్కి తగ్గినట్టు తెలిసింది. సకాలంలో స్పందించి కేంద్ర ఆహార శాఖా మంత్రిని ఒప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో ఎఫ్‌సీఐ లెవీ సేకరణ ప్రక్రియ నుంచి తప్పుకొంది. అప్పటి నుంచి ఇలాంటి అలకలు, సముదాయింపులు షరా మామూలుగా సాగుతున్నాయి. -
రాష్ట్రానికి ‘లెవీ’ గండం..!
⇒ 25 శాతం కొనసాగింపునకు కేంద్రం విముఖం ⇒ ఇప్పటికే పచ్చి బియ్యం సేకరణ నుంచి తప్పుకున్న ఎఫ్‌సీఐ ⇒ క్రమంగా ఉప్పుడు బియ్యం సేకరణ నుంచీ తప్పుకునే యోచన ⇒ ఇక ధాన్యం సేకరణ భారమంతా రాష్ట్రాలపైనే ⇒ పౌర సరఫరాలశాఖపై ఏటా అదనంగా రూ.100 కోట్ల భారం సాక్షి, హైదరాబాద్: మిల్లర్ల నుంచి బియ్యం సేకరించే లెవీ విధానాన్ని పూర్తిగా ఎత్తేస్తూ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం వెనక్కితగ్గేలా లేదు. దీనిపై పునరాలోచించాలని రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం స్పందించట్లేదు. వ్యవసాయ రంగంపైనే ఆధారపడి పెద్ద ఎత్తున ధాన్యాన్ని ఉత్పత్తి చేసే తెలంగాణ రాష్ట్రంపై లెవీ భారం ఎక్కువగా ఉంటుందని, ఈ దృష్ట్యా ప్రస్తుతం అమలు చేస్తున్న 25 శాతం లేవీ విధానాన్ని కొనసాగించాలంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని మోదీకి స్వయంగా లేఖ రాసినా ఇంతవరకు ఏ స్పందన లేదు. దీంతో రైతులకు మద్దతు ధర లభించినా గిట్టుబాటు ధరలు దక్కే అవకాశాలు లేకుండా పోనున్నాయి. గత ఏడాది ఖరీఫ్‌కు ముందు వరకు 75 శాతంగా ఉన్న లెవీని 25 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు కోరినా కేంద్రం వెనక్కి తగ్గలేదు. బియ్యం లెవీని 25 శాతానికి తగ్గించడం వల్ల మిల్లర్లు తమకు ఉన్న నిల్వ సామర్థ్యం మేరకు బియ్యాన్ని కొనుగోలు చేసి మిగతా మొత్తాన్ని కొనేందుకు ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం భారీగా రావడంతో కేంద్రాల సంఖ్యను ప్రభుత్వం 1,500 వరకు పెంచడంతోపాటు మౌలిక వసతుల కల్పనకు అదనంగా రూ.100 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. 25 శాతం లెవీ ఎత్తేస్తే మరింత భారం: ప్రస్తుతమున్న 25 శాతం లెవీనీ కేంద్రం ఎత్తేస్తే రాష్ట్రంపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఉత్పత్తి అయ్యే మొత్తం ధాన్యాన్ని రాష్ట్రమే సేకరించాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తులో ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రంలో ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్లకు పూర్తి స్వేచ్ఛనిస్తే చిన్నకారు రైతులు, నిల్వ సామర్థ్యం లేని వారికి మద్దతు ధర లభించినా గిట్టుబాటు ధర దక్కే అవకాశాలుండవు. లెవీ ఎత్తివేతపై కేంద్రం వెనక్కి తగ్గేది లేదని భావిస్తున్న పౌరసరఫరాలశాఖ పూర్తి బియ్యం సేకరణ లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకుంటోంది. మొత్తంగా రబీలో 15 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందన్న అంచనాపై ఖరీఫ్‌లో ఏర్పాటు చేసిన 1,581 కొనుగోలు కేంద్రాలకు మరో 500 కేంద్రాలు పెంచాలని నిర్ణయించింది. పెరిగిన కేంద్రాలకు అనుగుణంగా గోనె సంచులు, టార్పాలిన్లు, జల్లెడపట్టే యంత్రాలు, మార్కెట్ యార్డుల్లో మరిన్ని వసతులకు కలిపి ప్రభుత్వంపై అదనంగా మరో రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల మేర భారం పడే అవకాశం ఉంది. పూర్తిగా తప్పుకోనున్న ఎఫ్‌సీఐ రాష్ట్రంలో గత ఏడాది మార్చి వరకు కేవలం కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకే పరిమితమైన ధాన్యం సేకరణ వికేంద్రీకరణను ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అన్ని జిల్లాలకు వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం గత అక్టోబర్‌లో నిర్ణయించింది. దీంతో పచ్చి బియ్యం సేకరణ నుంచి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) పూర్తిగా తప్పుకున్నట్లైంది. 2012-13లో 7 లక్షల మెట్రిక్ టన్నుల మేర పచ్చి బియ్యం సేకరణ జరిపిన ఎఫ్‌సీఐ, 2013-14లో కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. 2014-15లో పచ్చి బియ్యం సేకరణ నుంచి పూర్తిగా తప్పుకొని కేవలం ఉప్పుడు బియ్యం సేకరణకే పరిమితమైంది. దీంతో రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం పచ్చి బియ్యాన్ని పౌరసరఫరాలశాఖ సేకరిస్తోంది. ఏ జిల్లాలో సేకరించిన ధాన్యాన్ని అక్కడే బియ్యంగా మార్చి ఆ జిల్లా ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సరఫరా చేస్తున్నారు. దీంతో రాష్ట్రంపై ధాన్యం సేకరణ భారం భారీగా పడింది. ఈ పరిస్థితుల్లో లెవీ పూర్తిగా ఎత్తేస్తే ఉప్పుడు బియ్యం సేకరణ నుంచి కూడా ఎఫ్‌సీఐ వైదొలిగే అవకాశాలున్నాయి. ఇది రాష్ట్రాలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తిఅయ్యే ఉప్పుడు బియ్యాన్ని ఎవరు సేకరించాలన్నది ప్రభుత్వం ముందున్న ప్రశ్న. -
ఎఫ్‌సీఐ తప్పుకుంటే ‘మద్దతు’ ఎలా?
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఆహార భద్రత చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకే ఎన్డీయే ప్రభుత్వం రహస్య ఎజెండాతో ఎఫ్‌సీఐ పునర్ వ్యవస్థీకరణ, ఆహార ధాన్యాల సేకరణ అంశాలపై శాంతకుమార్ కమిటీని నియమించిందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘మోదీ ప్రభుత్వం ఆహార భద్రత చట్టాన్ని, దాని ఉదాత్తమైన ఉద్దేశాన్ని నామరూపాల్లేకుండా చేస్తోంది. చట్టం కింద ఉన్న 67 శాతం లబ్ధిదారులను 40 శాతానికి తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. భూసేకరణ చట్టాన్ని రైతు వ్యతిరేక చట్టంగా మార్చినట్టే, ఆహార భద్రత చట్టాన్ని పేదల వ్యతిరేక చట్టంగా మా ర్చుతున్నారన్నారు. జనతాపరివార్ మాదిరిగా కాంగ్రెస్ పార్టీలో కూడా పునరేకీకరణ జరగాలని దిగ్విజయ్ అన్నారు. వివిధ కారణాలతో కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోయిన నేతలు.. కాంగ్రెస్ నుంచి వేరుపడి ఏర్పడిన ఇతర పార్టీలు అన్నీ తిరిగి కాంగ్రెస్‌లో ఐక్యం కావలసి న అవసరం ఉందని పేర్కొన్నారు. -
రాష్ట్రాల నుంచి ధాన్యం కొనుగోలు కొనసాగింపు
చండీగఢ్: భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) పంజాబ్, హరియాణాలతోపాటు అన్ని రాష్ట్రాల నుంచి ఆహార ధాన్యం కొనుగోలును కొనసాగిస్తుందని కేంద్ర ఆహార మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మంగళవారమిక్కడ చెప్పారు. అభివృద్ధి చెందిన పంజాబ్, హరియాణా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరణ ఆపాలని శాంతకుమార్ కమిటీ ఇదివరకు సిఫార్సు చేసింది. దీంతో హరియాణా, పంజాబ్ ల నుంచి ధాన్యం కొనొద్దని కేంద్రం ఎఫ్‌సీఐని ఇటీవల ఆదేశించింది. దీన్ని అమలు చేయొద్దని పంజాబ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో పాశ్వాన్ హామీ ప్రాధాన్యం సంతరించుకుంది -
ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం సేకరణ ఆపకండి
శాంతకుమార్ కమిటీ సిఫారసులను తిరస్కరించండి ప్రధానమంత్రికి వైఎస్సార్ కాంగ్రెస్ వినతిపత్రం సాక్షి, న్యూఢిల్లీ: ఎఫ్‌సీఐ ద్వారా చేపట్టే ధాన్యం సేకరణను నిలిపివేసే ప్రయత్నలను ఉపసంహరించుకోవాలని.. ఎరువుల సబ్సిడీని పరిమితం చేయరాదని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని వైఎస్సార్ కాంగ్రెస్ కోరింది. పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు సోమవారం ప్రధానిని కలిసి ఈమేరకు ఒక వినతిపత్రం అందించారు. ‘‘ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)ను పునర్వ్యవస్థీకరించేందుకు వీలుగా శాంతకుమార్ కమిటీ చేసిన సిఫారసుల నివేదికను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే వ్యవసాయాధారిత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల రైతులకు ఇది పెద్ద దెబ్బగా పరిణమిస్తుంది. చివరకు దేశ ఆహార భద్రతకు కూడా ముప్పు తెస్తుంది. ఆ సిఫారసులను ఆమోదిస్తే అటు ఆహార భద్రతతో పాటు.. దేశంలో వ్యవసాయరంగంపై ఆధారపడిన 50 శాతం మంది ప్రజల జీవనోపాధి కూడా దెబ్బతింటుంది’’ అని ఆ వినతిపత్రంలో ఆందోళన వ్యక్తంచేశారు. వినతిపత్రంలోని ముఖ్యాంశాలివీ... ఎఫ్‌సీఐ సేకరించకపోతే... ‘‘రైతులు తమ పంటలను మంచి ధర వచ్చేంతవరకు గిడ్డంగుల్లో దాచుకునే పరిస్థితి లేదు. పంట పండిన కొద్ది రోజుల్లోనే వారు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఈ పంటను ఎఫ్‌సీఐ సేకరించలేదంటే తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతయి. ఇది మానవ తప్పితమైన విషాదంగా మారుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితినే చూస్తే 2010-11లో మంచి దిగుబడులు వచ్చాయి. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఎఫ్‌సీఐ కూడా కనీస మద్దతు ధర రైతులకు అందేలా చేయడంలో విఫలమైంది. రైతులు క్వింటాలు ధాన్యాన్ని రూ. 300 ధరకు అమ్ముకునే దుస్థితి ఏర్పడింది. ఇది రైతులను తీవ్రంగా కుంగదీసింది. దీంతో వారు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్‌సీఐ 80 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 35 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించారు. పైగా పంట చేతికి వచ్చిన అక్టోబరు, నవంబరు మాసాల్లో సేకరణ జరగలేదు. దీని కారణంగా రైతులు కనీస మద్దతు ధర కంటే రూ. 150 తక్కువకే అమ్ముకోవాల్సి వచ్చింది. అలాగే సరైన సమయంలో పత్తి పంట సేకరించడంలో సీసీఐ పూర్తిగా విఫలమైంది. రైతులు తక్కువ ధరకే మధ్యవర్తులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎఫ్‌సీఐల విధులను రాష్ట్రాలు నిర్వర్తిస్తాయని కేంద్రం ఎలా నమ్ముతోంది? గడిచిన పదేళ్లలో 75 శాతం ధాన్యాన్ని ఎఫ్‌సీఐ సేకరించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్‌సీఐ బాధ్యతలను స్వీకరించేందుకు ఆర్థిక వనరులెక్కడివి? ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 2015-16 బడ్జెట్లో మార్కెట్ నిర్వహణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని తెలుస్తోంది.’’ స్వామినాథన్ సిఫారసులు అమలుచేయండి ‘‘మద్దతు ధరను నిర్ధారించేందుకు ఎం.ఎస్.స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలుచేయాలని నాడు ఎన్డీయే కూడా కోరింది. కానీ 2014-15 సంవత్సరంలో ఎన్డీయే అతి తక్కువగా కనీస మద్దతు ధరను పెంచింది. పంట ఉత్పత్తికి అయ్యే వ్యయంతోపాటు 50 శాతం లాభదాయకతను దృష్టిలో పెట్టుకుని ఎంఎస్పీని ఖరారుచేయాలని ఆ కమిషన్ సూచించింది. ఉత్పత్తి వ్యయాలు అధికమవుతున్న నేపథ్యంలో 2015-16 ఖరీఫ్ సీజన్లో వరికి కనీసం రూ. 1,700 ఎంఎస్పీగా ఖరారుచేయాల్సిన అవసరముంది. లేదంటే రైతులు దురవస్థలోనే కొనసాగుతారు. మా రాష్ట్రంలో రైతులు వరస తుఫాన్లతో, వరద్లతో గడిచిన నాలుగేళ్లుగా నష్టపోతున్నారు. రాయలసీమ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఒక తుపాను నుంచి కోలుకోకముందే మరో తుపానులో రైతు కొట్టుకుపోతున్నాడు. ఇలా దెబ్బతిన్న రైతుల్లో ఒక శాతం వారినీ రాష్ట్రం ఆదుకోవడం లేదు. ఉదాహరణకు ఇటీవల హుద్‌హుద్ తుపాను సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అంచనాల ప్రకారం రూ. 21 వేల కోట్ల మేర నష్టపోతే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కనీసం దీనిలో 10 శాతం కూడా పునరావాసానికి, సహాయ చర్యలకు ఖర్చుపెట్టలేకపోయాయి.’’ ఎరువుల సబ్సిడీని పరిమితం చేయకండి ‘‘శాంతకుమార్ కమిటీ ప్రస్తుతం ఉన్న పద్ధతిని రద్దు చేసి హెక్టారుకు రూ. 7వేల చొప్పున ఎరువుల సబ్సిడీ ప్రకటించాలని సిఫారసు చేసింది. ఏపీ వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు ఎన్పీకే వినియోగం చాలా ఎక్కువ. హెక్టారుకు రూ. 7 వేలకు పరిమితి విధిస్తే మాలాంటి రాష్ట్రాల్లో ఒక్క పంటకు కూడా సరిపోదు. రెండో పంటకు రైతులు సబ్సిడీ లేకుండా మార్కెట్ ధరకు కొనుక్కోవల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల శాంతకుమార్ నివేదికను తిరస్కరించండి. కనీస మద్దతు ధరను ఖరారు చేసేందుకు స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలుచేయండి.’’ -
లెవీ పోటు
నిబంధనలు మార్చిన ఎఫ్‌సీఐ కొత్త విధానంలో 25 శాతం బియ్యమే స్వీకరణ ధాన్యాన్ని నిల్వ చేయలేమంటున్న మిల్లర్లు రైతులకు గిట్టుబాటు ధర దక్కదన్న ఆందోళన పట్టించుకోని ప్రభుత్వం నెల్లూరు (హరనాథపురం) : ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) తీసుకున్న నిర్ణయం అన్నదాతను పరోక్షంగా దెబ్బతీయనుంది. ఎఫ్‌సీఐ 25 శాతానికి లెవీ కుదిస్తూ తీసుకున్న నిర్ణయం ఈ నెల నుంచి అమల్లోకి వచ్చింది. ఖరీఫ్‌లో పండించిన ధాన్యం మార్కెట్లోకి వచ్చింది. ఎఫ్‌సీఐ తాజాగా మార్చిన లెవీ నిబంధనలతో మిల్లర్లకూ ఇబ్బంది పరిస్థితులున్నా.. రైతులకు మాత్రం పెను శాపంగా మారనుంది. కొత్త లెవీ నిబంధనలతో ఈ సీజన్లో ధాన్యం కొనే నాథుడు లేక ఆరుగాలం కష్టించిన పంటకు కనీస మద్దతు ధర కూడా లభించని పరిస్థితి నెలకొనేటట్లు ఉంది. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడంతో రైతుల పరిస్థితి గందరగోళంగా మారింది. లెవీ 25 శాతమే అయితే.. మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యంలో గత సెప్టెం బర్ వరకు 75 శాతం భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) బియ్యం రూపే ణా సేకరించేది. మిగిలిన 25 శాతంలో రెండొంతులు ఇతర రాష్ట్రాల్లోనూ మూడో వంతు రాష్ట్రంలోని బహిరంగ మార్కెట్లో మిల్లర్లు స్వేచ్ఛగా అమ్ముకునే వీలుండేది. ఎఫ్‌సీఐ నిర్ణయంతో లెవీ విధానం తారుమారైంది. మిల్లర్ల నుంచి కేవలం 25 శాతం మాత్రమే లెవీ తీసుకుంటామని ఎఫ్‌సీఐ గత ఆగస్టులో ప్రకటించింది. ఈ విధానం అక్టోబర్ 1 నుంచే అమలులోకి వచ్చింది. ఎఫ్‌సీఐ తీసుకున్న నిర్ణయం మిల్లర్లు, రైతులపై పెనుప్రభావం చూపనుంది. లెవీ 75 శాతం ఉంటేనే మిగిలిన 25 శాతం బియ్యం అమ్ముకునేందుకు మిల్లర్లు నానా పాట్లు పడేవారు. ఇది పరోక్షంగా రైతులపై ప్రభావం చూపి మద్దతు ధరకన్నా క్వింటాలు ధాన్యాన్ని రూ.100 నుంచి రూ.200 వరకు తక్కువ ధరకు కొనేవారు. మారిన పరిస్థితుల్లో ధాన్యాన్ని ఏ విధంగా కొనుగోలు చేస్తారనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో 75 శాతం బియ్యం అమ్ముకునేందుకు స్వేచ్ఛ ఇవ్వకుండా పర్మిట్ల నిబంధన విధించడంతో బియ్యం కొనుగోలు చేసే నాథుడే లేడని మిల్లర్లు చెబుతున్నారు. నూతన విధానంలో ఇప్పటికే బాయిల్డ్ రైస్ ధర క్వింటాల్‌కు రూ.2,400 నుంచి రూ.2,200, రారైస్ రూ.2,200 నుంచి రూ.2 వేలకు పడిపోయినట్లు మిల్లర్లు వాపోతున్నారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం పూర్తిస్థాయిలో మార్కెట్లోకి వస్తే ఈ ధరలు మరింత దిగజారుతాయనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గత నెల నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కావాలి. గతంలో మిల్లర్లు ఇబ్బడిముబ్బడిగా కొనేవారు. మారిన పరిస్థితుల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ముందుకు రావడంలేదు. లెవీ కుదింపుతో ధాన్యాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచుకునేందుకు, బహిరంగ మార్కెట్లో అమ్ముకునేందుకు అనేక సమస్యలు ఉన్నాయని మిల్లర్లు అంటున్నారు. ప్రభుత్వ ఉదాసీనత రైతు సంక్షేమానికి ప్రమాదం ముంచుకువస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ నిర్ణయంపై ఏ మాత్రం స్పందించలేదు. లెవీ 50 శాతానికి పెంచాలని కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం నిర్మోహమాటంగా తోసిపుచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థను రంగంలోకి దించుతారని భావించినప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అసలే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ డబ్బులు సకాలంలో చెల్లిస్తుందనే గ్యారెంటీ లేదనే భయం మిల్లర్లను వెంటాడుతుంది. ఎఫ్‌సీఐ నిర్ణయంతో అంతిమంగా నష్టపోయేది రైతులేనని మిల్లర్లే చెబుతున్నారు. అమ్ముకునే స్వేచ్ఛను ఇవ్వాలి : ఎఫ్‌సీఐ లెవీ బియ్యం సేకరణ నిబంధన మార్చడం వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం 25 శాతం లెవీ తీసుకున్నప్పటికి మిగిలిన 75 శాతం మిల్లర్లు అమ్ముకునేందుకు స్వేచ్ఛ కల్పించాలి. పర్మిట్ విధానం పెట్టడం వల్ల రాజకీయ నాయకులు, అధికారులు లాభపడుతున్నారు. జిల్లాకు రావాల్సిన ఆదాయం తగ్గిపోతుంది. జిల్లాలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే నిల్వ ఉంచేందుకు గిడ్డంగుల సౌకర్యం ఉంది. - రంగయ్యనాయుడు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా నాయకుడు -
పూర్తికాని లెవీ సేకరణ
మిర్యాలగూడ : ప్రజావసరాల కోసం ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ) ప్రతిఏటా మిల్లర్ల నుంచి సేకరించే లెవీబియ్యం లక్ష్యం నెరవేరలేదు. సేకరణకు గడువు ఇంకా 20 రోజులే ఉన్నా, మొత్తంగా 77శాతం లక్ష్యమే పూర్తయ్యింది. 2013-14వ సంవత్సరానికి గాను గత ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి లెవీబియ్యం సేకరణ ప్రారంభించారు. జిల్లాలో వరిసాగు గణనీయంగా ఉన్నప్పటికీ, మిల్లర్ల పట్ల అధికారులు మెతకవైఖరి అవలంబించడం వల్ల లెవీ సేకరణ లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2012-13లో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యం, 8.09 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ బియ్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించారు. కాగా పచ్చిబియ్యం నూరుశాతం లక్ష్యం పూర్తి చేసినా, బాయిల్డ్ బియ్యం మాత్రం కేవలం 5.86 లక్షలు మెట్రిక్‌టన్నులు మాత్రమే సేకరించి లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయారు. అయినా లెవీబియ్యం ఇవ్వని మిల్లర్లపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. డీఎస్ఓ నాగేశ్వర్రావు మాట్లాడుతూ ఈ నెలాఖరు వరకు గడువు ఉందని, సాధ్యమైనంత త్వరగా టార్గెట్ రీచ్ కావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది నుంచి నూతన లెవీ విధానం? ఈ ఏడాది నుంచి కేంద్రప్రభుత్వం నూతన లెవీవిధానం అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో మిల్లర్లు రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యంలో 75 శాతం లెవీబియ్యం ప్రభుత్వానికి ఇచ్చి, 25 శాతం బయట మార్కెట్లో విక్రయించుకునేవారు. కానీ నూతనవిధానం ద్వారా 25 శాతం లెవీబియ్యం ప్రభుత్వానికి ఇచ్చి, 75 శాతం బయట మార్కెట్లో విక్రయించుకునే అవకాశం ఉంటుంది. కాగా 2014-15లో లెవీబియ్యం సేకరణ లక్ష్యం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. -
విశాఖలో వింత !
విశాఖపట్నం: సాదారణంగా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేక అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తారు. ధర్నాలు చేస్తారు. కానీ విశాఖలో వింతగా అధికారులు నిరసన తెలుపుతున్నారు. అదీ తమ సమస్యల పరిష్కారం కోసం కాదు. పన్నులు చెల్లించనందుకు ఈ నిరసన తెలిపారు. బకాయిలు చెల్లించకపోతే రిలేనిరాహార దీక్ష కూడా చేస్తామని హెచ్చరించారు. లక్ష్మీపురం ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) గోడౌన్ల వద్ద గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ (జివిఎంసి) రెవెన్యూ అధికారులు వినూతన రీతిలో నిరసన తెలిపారు. ఎఫ్‌సిఐ 2 కోట్ల రూపాయల ఆస్తి పన్ను ఎగవేసిందని అధికారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పన్ను బకాయిలు చెల్లించకపోతే త్వరలో రిలే దీక్షలు చేస్తామని జీవీఎంసీ రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. పన్నులు ఎగవేసినందుకు రెవెన్యూ అధికారులు నిరసన తెలపడం, బకాయిల కోసం రిలేదీక్ష చేస్తామని హెచ్చరించడం వింతగాలేదూ! అధికారులు ఈ విధంగా పన్నులు వసూలు చేయడం శుభపరిణామమే. -
ఎగుమతుల వైపు మిల్లర్ల చూపు
తాడేపల్లిగూడెం : లెవీ సేకరణ విషయంలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అనుసరిస్తున్న విధానం అస్తవ్యస్తంగా ఉండటంతో మిల్లర్లు విదేశాల వైపు చూస్తున్నారు. లెవీ కోసం సేకరించిన ధాన్యాన్ని ఆడించగా వచ్చిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వడానికి వారెవరూ ఇష్టపడటం లేదు. ఎఫ్‌సీఐ తీరు పొమ్మనలేక పొగ పెట్టినట్టుగా ఉంది. లెవీ సేకరణ నిబంధనలు మారాయని చెబుతున్న ఎఫ్‌సీఐ అధికారులు ఆ ఉత్తర్వుల వివరాలను గోప్యంగా ఉంచుతూ తమను ఇబ్బందుల పాలు చేస్తున్నారని మిల్లర్లు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితిల్లో బియ్యూన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వ డం కంటే విదేశాలకు ఎగుమతి చేయడమే మంచిదనే ఆలోచనకు వచ్చారు. ఇంచుమించుగా ఎఫ్‌సీఐ ఇస్తున్న ధరకే కొనుగోలు చేసేం దుకు దక్షిణాఫ్రికా నుంచి ఆర్డర్లు రావడంతో ఎగుమతిదారులు ఉభయగోదావరి జిల్లాల్లో మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. కాకినాడ పోర్టులో వీటిని నిల్వచేసి, ఎల్సీలు ఉన్న సరుకును సముద్ర మార్గంలో దక్షిణాఫ్రికాకు ఓడల ద్వారా తరలిస్తున్నారు. కాకినాడ పోర్టుకు చేరా క్వింటాల్ బియ్యానికి రూ.2,400 చొప్పున ధర చెల్లిస్తున్నారు. 25 శాతం నూకలు ఉన్న బియ్యానికి ఈ ధర లభిస్తోంది. 1010 రకం బియ్యం ఎగుమతులు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వాస్తవానికి ఎఫ్‌సీఐ మిల్లర్ల నుంచి 25 శాతం నూకలు ఉన్న బియ్యాన్ని తీసుకోవాలి. కానీ 20 శాతం నూకలు ఉన్నా బియ్యాన్ని తీసుకునేది లేదని, ఒక్కోసారి 18 శాతం, మరోసారి 15 శాతం నూకలు మాత్రమే ఉండాలంటూ ఎఫ్‌సీఐ అధికారులు రోజుకో కొత్త మెలిక పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వెంటనే సొమ్ములు చేతిలో పడే అవకాశం ఉండటంతో ఎగుమతుల వైపు మిల్లర్లు దృష్టి సారించారు. దక్షిణాఫ్రికాకు ఎగుమతి చేసేందుకు ఒక్క పశ్చిమగోదావరి జిల్లానుంచే 10 వేల టన్నుల వరకు బియ్యూన్ని కొనేందుకు ఎగుమతిదారులు ముందుకొచ్చారు. కాకినాడ నుంచి ఎగుమతులు చేసే ఓ కంపెనీ ప్రతినిధులు, భీమవరానికి చెందిన ఇద్దరు ప్రతినిధులు జిల్లాలో జోరుగా బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. మిల్లర్లకు దక్షిణాఫ్రికా తరఫున లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి భారీ స్థాయిలో దక్షిణాఫ్రికాకు బియ్యం ఎగుమతి అవుతున్నాయి. గత లెవీలో సేకరించిన ధాన్యం నిల్వలు మిల్లర్ల వద్ద పుష్కలంగా ఉన్నాయి. లెవీగా సేకరించిన ధాన్యాన్ని ఆడించగా వచ్చిన బియ్యంలో 75 శాతం ఎఫ్‌సీఐకి లెవీగా మిల్లర్లు ఇవ్వాలి. మిగిలిన 25 శాతం బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు విక్రయించుకునే వెసులుబాటు మిల్లర్లకు ఉంది. గత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో సేకరించిన ధాన్యం ఆడించగా వచ్చిన బియ్యంలో 25 శాతం విక్రయించుకునే అవకాశం ఉన్నా, అందులో కేవలం సగం సరుకును విక్రయించుకునేందుకు మాత్రమే మిల్లర్లకు అనుమతులు వచ్చాయి. దీంతో సగం సరుకు మిల్లుల్లోనే ఉండిపోయింది. ఒకపక్క ఎఫ్‌సీఐ అసంబద్ధ విధానాలు, మరోపక్క లెవీ సేకరణ శాతంపై కమ్ముకున్న నీలినీడలు మిల్లర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారుు. ఈ తరుణంలో ఎగుమతికి అనుమతులు లభించడం మిల్లర్లకు ఊరట కలిగిస్తోంది. దీంతో వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు. -
మిల్లర్లకు తీపి కబురు
తాడేపల్లిగూడెం : లెవీ రూపంలో మిల్లర్ల నుంచి బియ్యం సేకరించే విషయంలో నెలకొన్న మీమాంస తొలగిపోయింది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్) కుదింపు ఉండబోదని ఎఫ్‌సీఐ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకూ లెవీ సేకరణను యథాతథంగా జరపాలని నిర్ణయించింది. రాష్ట్ర విభజన ప్రభావం లెవీపై ఉంటుందని, కేఎం ఎస్‌ను కుదిస్తారని ఎఫ్‌సీఐ అధికారులు తొలుత భావించారు. జూన్ 30వ తేదీతో సేకరణను అర్ధాంతరంగా నిలిపివేస్తారని మిల్లర్లు భయపడ్డారు. గడువు కుదింపు లేదని ఎఫ్‌సీఐ ఉన్నతాధికారులు స్పష్టం చేయడంతో వారంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ విషయంపై ఎఫ్‌సీఐ ఏరియా మేనేజర్ కేవీ రాజును సంప్రదించగా.. గడువు కుదింపు లేద ని, గడువు పూర్తయ్యేవరకు మిల్లర్ల నుంచి బియ్యం సేకరిస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన ప్రభావం ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌పై ఉండదన్నారు. జాగా బాగుంది లెవీ కింద జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఎఫ్‌సీఐకి బియ్యం వెళుతున్నారుు. ఎఫ్‌సీఐ నుంచి పౌర పంపిణీ నిమిత్తం ఇతర ప్రాంతాలకు సైతం తరలిస్తున్నారు. జిల్లాలోని గోదాముల్లో జాగా కూడా బాగా ఉండటంతో పూర్తిస్థారుులో బియ్యం సేకరణకు అవకాశం ఉంది. నెలకు 6 చొప్పున స్పెషల్స్ ర్యాక్స్‌ను రైల్వే శాఖ కేటాయిస్తుండటంతో రవాణా సమస్య కూడా తీరింది. ఫలితంగా బియ్యం సేకరణ వేగం పుంజుకుంది. జిల్లాలో లెవీ సేకరణ లక్ష్యం 11 లక్షల 75 వేల మెట్రిక్ టన్నులు కాగా, ఇప్పటివరకు 8 లక్షల 14 వేల మెట్రిక్ టన్నులుసేకరించారు. వీటిలో 7 లక్షల 85 వేల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యం, 28 వేల 500 మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం ఉన్నాయి. -
గోదాములు ఫుల్
నల్లగొండ, న్యూస్‌లైన్ :జిల్లాలో వెల్లువెత్తిన ధాన్యం దిగుబడులు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), పౌరసరఫరాల సంస్థ గుండెల్లో గుబులు రెకేత్తిస్తున్నాయి. అధికార యంత్రాంగం ముందుచూపు లేకపోవడం.. నేడు అనేక సమస్యలను తెచ్చిపెట్టింది. జిల్లాలో 25.84 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు అందుబాటులో ఉన్నా, వాటిల్లో సామర్థ్యానికి మించి బియ్యం, గోధుమల నిల్వలు ఇప్పటికే ఉన్నాయి. దీంతో ప్రస్తుతం కొనుగోలు చేసిన ధాన్యం, ఈ సీజన్లో సేకరించాల్సిన లేవీ బియ్యం దాచేందుకు గోదాముల్లో అంగుళం స్థలం కూడా ఖాళీ లేదు. 2013-14కు గాను మిల్లర్ల నుంచి 8 లక్షల టన్నుల లేవీ బియ్యం సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 4 లక్షల టన్నులు పూర్తయ్యాయి. ఇవిగాక రబీ సీజన్లో పౌర సరఫరాల సంస్థ 3.58 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇంత పెద్దమొత్తంలో ధాన్యం కొనుగోలు చేయడంతో వాటిని నిల్వ ఉంచేం దుకు మిల్లర్ల వద్ద కూడా స్థలం లేకుండా పోయింది. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి మిల్లర్ల నుంచి 2.50లక్షల టన్నుల బియ్యాన్ని కస్టమ్ మిల్లింగ్ ద్వారా సేకరించాల్సి ఉంది. లేవీ, కస్టమ్ మిల్లింగ్ కలిపి మొత్తం 6.50లక్షల టన్నుల బియ్యం మిల్లర్ల నుంచి సేకరించి గోదాముల్లో నిల్వ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికే గోదాముల్లో బియ్యం, గోధుమల నిల్వలుపేరుకుపోవడంతో సివిల్ సప్లయీస్, ఎఫ్‌సీఐ సంస్థలు బిక్కమొహం వేస్తున్నాయి. గోదాముల్లో పరిస్థితి ఇదీ.. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి మొత్తం 16 గోదాములు ఉన్నాయి. వీటిలో 25.84 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యానికిగానూ ఏకంగా 29.47 లక్షల టన్నుల ధాన్యాన్ని, గోధుమలను నిల్వ చేశారు. ఇంకా స్థలం చాలకపోవడంతో గోదాముల వెలుపల 60 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం వరకు ఖాళీ ఉండడంతో ఆ ప్రాంతాల్లో కూడా గోధుములు 34,469 మెట్రిక్ టన్నులు నిల్వ చేశారు. ఇదిలా ఉంటే ప్రతిరోజూ ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి (కస్టమ్ మిల్లింగ్) గోదాములకే తరలిస్తున్నారు. దీంతో రోజుకు 8 నుంచి 9 లక్షల టన్నుల వరకు బియ్యం గోదాములకు వచ్చి చేరుతోంది. రేక్‌ల కోసం ఎదురుచూపులు... జిల్లాలో నిల్వలను తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్రాలకు తరలించేందుకు దక్షిణమధ్య రైల్వే రేక్‌లను అనుకున్న విధంగా కేటాయించడం లేదు. వాస్తవానికి జిల్లాలోని లక్ష టన్నుల బియ్యాన్ని జూన్ మొదటి వారంలోనే పక్క రాష్ట్రాలకు తరలించేందుకు వీలుగా 12 రేక్‌లు కేటాయించారు. కానీ ఇప్పటి వరకు నాలుగు రేక్‌ల ద్వారా కేవలం 13వేల టన్నులు మాత్రమే తరలించారు. అయితే గోదాముల్లో బియ్యం నిల్వలు తరలించేందుకు అదనంగా 20 రేక్‌లు కేటాయించాలని, దాంతోపాటు అదనంగా గోదాములు అద్దెకు తీసుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ ఆమోదంతో పౌరసరఫరాల సంస్థ అధికారులు ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. పై నుంచి రేక్‌లు కేటాయిస్తూ..అప్పటివరకు ప్రైవేటు గోదాములు అద్దెకు తీసుకునేందుకు వీలుగా అనుమతులు వస్తే తప్ప రబీ బియ్యం దాచే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం త్వరగా స్పందిస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. -
బియ్యం ధరలకు విద్యుత్ షాక్
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : బియ్యానికి కరెంటు షాక్ తగిలింది. దీంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. పరిశ్రమలకు విద్యుత్ కోతలు విధించడంతో ఆ ప్రభావం ఉత్పత్తిపై పడింది. ఉత్పత్తి తగ్గడం, మరో పక్క లెవీగా మిల్లర్లు బియ్యాన్ని ఎఫ్‌సీఐకి పంపిస్తూండటంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కరెంటు కోతల విషయంలో ప్రభుత్వం మిల్లర్లతో దోబూచులాడిన నేపధ్యంలో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా రైసు మిల్లులు మూతపడిన సందర్భాలు ఉన్నాయి. తాజా పరిస్థితి చూస్తే కరెంటు సమస్య. ఎఫ్‌సీఐ లెవీ కారణాలతో గత పదిహేను రోజులుగా బియ్యం ధరలు పెరిగిపోయాయి. పరిశ్రమలకు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విద్యుత్ కోత విధించారు. దీంతో రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, కొన్ని సందర్భాల్లో మరో రెండు గంటలపాటు అదనంగా మిల్లులు ఆడుతున్నాయి. పగటి పూట దాదాపుగా రైసు మిల్లుల్లో బియ్యం ఆడటం లేదు. దీంతో బియ్యం ఉత్పత్తి సుమారు 50 శాతం పడిపోయింది. ఆ ప్రభావం బియ్యం ధరలపై పడుతోంది. ఆవిరిపట్టిన(స్టీమ్) స్వర్ణ రకం బియ్యం క్వింటాలు రూ.2వేల 500 నుంచి రూ.2వేల 700 అక్కడి నుంచి రూ.2వేల 800 కు. సోనా విషయానికొస్తే క్వింటాలు రూ.2వేల 800 నుంచి 3వేల 400, బ్రాండ్ల బియ్యం(సూపర్ ఫైన్) క్వింటాలు రూ.4వేల 200 నుంచి రూ.4వేల 800కు చేరుకున్నాయి, పీఎల్ క్వింటాలు రూ.2వేల 600 నుంచి రూ.2వేల 800 చేరింది. ప్రస్తుతం రకాన్ని బట్టి రూ.3వేలు-రూ.3వేల 200 మధ్య ధర ఉంది. మరో పక్క మార్కెట్లో కొన్ని సంస్థల బ్రాండ్లకున్న క్రేజ్ నేపధ్యంలో మార్కెట్లో ఆయా బ్రాండ్ల బియ్యానికి కృత్రిమ కొరతను సృష్టించి సొమ్ములు చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వినియోగదారులు బ్రాండ్లకు అలవాటు పడటం కూడా బియ్యం మార్కెట్లో ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. బియ్యం ధరలకు రెక్కలు రావటానికి విద్యుత్ కోతలు, లెవీ, ప్రభుత్వ మార్పిడి తదితర కారణాలు చెబుతున్నా చివరకు వినియోగదారుల జేబుకు చిల్లు పడుతోంది. బియ్యం ధరలను విపరీతంగా పెంచుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. -
లెవీ ఖరారు
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: ప్రజల అవసరాల కోసం ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ) ప్రతి ఏటా మిల్లర్ల నుంచి సేకరించే లెవీ బియ్యం లక్ష్యాన్ని ఎట్టకేలకు అధికారులు ఖరారు చేశారు. జిల్లాలో లెవీ బియ్యం సేకరణ లక్ష్యం నిర్ధారణ కాగానే మిల్లర్ల నుంచి బియ్యం సేకరణ ప్రారంభించారు. లక్ష్యం నిర్ధారణ కొంత ఆలస్యమైనా ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం 1.43 లక్షల హెక్టార్లలో ఉండడం వల్ల లక్ష్యం పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. 2012-13వ సంవత్సరంలో 1.50లక్షల టన్నుల పచ్చి బియ్యం, 8.09లక్షల టన్నుల బాయిల్ట్ బియ్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. పచ్చిబియ్యం నూరుశాతం లక్ష్యం పూర్తి చేసినా, బాయిల్డ్ బియ్యం మాత్రం కేవలం 5.86 లక్షల టన్నులు మాత్రమే సేకరించి లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయారు. 2013-14లో జిల్లాలో 1.94లక్షల టన్నుల పచ్చిబియ్యం, 7.94 లక్షల బాయిల్డ్ బియ్యాన్ని లెవీగా సేకరించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. అందులో ఇప్పటివరకు 27వేల టన్నుల పచ్చిబియ్యం సేకరించారు. ప్రతి మిల్లు నుంచి 75 శాతం లెవీ జిల్లాలోని ప్రతి రైస్‌మిల్లు నుంచి లెవీ బియ్యాన్ని అధికారులు సేకరిస్తారు. రైతుల నుంచి మిల్లర్లు కోనుగోలు చేసిన ధాన్యంలో 75 శాతం బియ్యాన్ని ఎఫ్‌సీఐకి లెవీగా ఇవ్వాలి. మిల్లర్లు 75 శాతం బియ్యాన్ని ఎఫ్‌సీఐకి లెవీగా ఇస్తేనే మిగతా 25శాతం ఎక్కడైనా ఇతర మార్కెట్లో విక్రయించుకోవడానికి సివిల్ సప్లయిస్ అధికారులు అనుమతినిస్తారు. ఈ సీజన్లో పచ్చిబియ్యం లెవీ సేకరణను ఇప్పటికే ప్రారంభించారు. ఫైన్ ధాన్యం కొనుగోళ్లు నిల్ బీపీటీలో సూపర్ ఫైన్ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సివిల్ సప్లయిస్ ఆధ్వర్యంలో జిల్లాలో ఏడు కేంద్రాలు ప్రారంభించారు. సూపర్ ఫైన్ బీపీటీకి క్వింటాకు రూ.1500 చెల్లించాలని నిర్ణయించారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకెళ్లకపోవడంతో ఇప్పటివరకు ఒక క్వింటా ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. లెవీ సేకరణ ప్రారంభించాం : హరిజవహర్‌లాల్, జాయింట్ కలెక్టర్ లెవీ బియ్యం సేకరణను ప్రారంభించాం. ఇప్పటివరకు 27వేల టన్నుల పచ్చిబియ్యం సేకరించాం. ఈ ఏడాది జిల్లాకు నిర్ణయించిన లక్ష్యం కంటే కాస్త ఎక్కువగానే సేకరించాలని నిర్ణయించుకున్నాం. పచ్చిబియ్యం 2లక్షల టన్నులు, బాయిల్డ్ బియ్యం 8 లక్షల టన్నులు సేకరించాలని నిర్ణయించాం. -
మిల్లర్ల గుప్పిట్లో సర్కారు బియ్యం
సాక్షి, నిజామాబాద్ : కస్టం మిల్లింగ్ కోసం ప్రభుత్వం ఇచ్చి న ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని నిర్ణీత సమయంలో ఎఫ్‌సీఐకి సరఫరా చేయడంలో మిల్లర్లు తీవ్ర జాప్యం చేస్తున్నా రు. లక్షల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని తమ వ్యాపార అవసరాల కోసం వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరాకు ప్రభుత్వం ఇచ్చిన గడువు సెప్టెంబరుతో ముగిసినప్పటికీ మిల్లర్లు స్పందించడం లేదు. ఇంకా సుమారు 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తమ వద్దే ఉంచుకున్నారు. ఒక్కో టన్ను బియ్యం విలు వ సుమారు రూ. 23 వేలు ఉంటుంది. ఈ లెక్కన మిల్లర్ల వద్ద ఉన్న బియ్యం విలువ సుమారు రూ.25 కోట్లకు పైగానే ఉంటుం దని అంచనా. జాప్యం వెనుక ఆంతర్యం రైతుల ధాన్యానికి మద్దతు ధర అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏటా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తుంది. ఇలా సేకరించిన ధాన్యాన్ని జిల్లాలో ఉన్న రైసుమిల్లులలో బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ)కి అప్పగిస్తుంది. ఇలా ధాన్యాన్ని ఆడించినందుకు మిల్లర్లకు క్వింటాలుకు రూ. 15 నుంచి రూ. 25 వరకు మిల్లింగ్ చార్జీలు చెల్లిస్తుంది. దీనితోపాటుగా నిర్వహణ వ్యయం నిమిత్తం స్టోరేజీ చార్జీలు కూడా ఇస్తుంది. ఇలా అన్నీ కలిపి లక్షల రూపాయల చార్జీలను చెల్లిస్తుంది. నిబంధనల ప్రకారం మిల్లర్లు తీసుకున్న ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని 15 రోజులలో ఎఫ్‌సీఐకి అప్పగించాలి. కానీ మిల్లర్లు నెలల తరబడి జాప్యం చేస్తుండడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇదీ పరిస్థితి 2012 సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో సేకరించిన ధాన్యంలో 37,962 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ నిమిత్తం 52 మిల్లులకు కేటాయించారు. ఇందుకుగాను మిల్లర్లు 25,602 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాలి. కానీ మిల్లర్లు 18,759 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. మళ్లీ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా మిల్లరు 6,843 మెట్రిక్ టన్నుల బియ్యం తమ వద్దే ఉంచుకున్నారు. రబీ సీజను రబీ కొనుగోలు సీజన్‌కు సంబంధించి 17,012 మెట్రిక్ టన్నుల ధాన్యం కస్టం మిల్లింగ్ చేసి 11,568 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాలి. కానీ కేవలం 7,341 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. ఇంకా 4,227 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వడంలో సుమారు 20 మంది మిల్లర్లు నెలల తరబడి జాప్యం చేస్తున్నారు. అంటే ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి మొత్తం 11,070 మెట్రిక్ టన్నుల బియ్యం బకాయిపడ్డారు. ఈ కస్టం మిల్లింగ్‌ను పర్యవేక్షించాల్సిన పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ వ్యవహారాన్ని ‘మామూలు’గా తీసుకోవడంతో మిల్లర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మిల్లర్లకు నోటీసులు ఇచ్చాం : శ్రీనివాస్, ఏజీపీఓ కస్టం మిల్లింగ్ బియ్యం బకాయి పడిన రైసుమిల్లర్లపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సివిల్‌సప్లయ్ కార్పొరేషన్ నుంచి నోటీసులు వెళ్లాయి. 15 రోజుల్లో పూర్తి స్థాయిలో బియ్యం రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టాం. ప్రభుత్వం డిసెంబర్ నెలాఖరు వరకు గడువిచ్చింది. తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
రేపు లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
సాక్షి, మంచిర్యాల : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 99వ జయంతి వేడుకలను ఈ నెల 27న ఉదయం 11 గంటలకు మంచిర్యాలలోని ఎఫ్‌సీఐ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు స్థానిక మాజీ ఎమ్మెల్యే గోనె హన్మంతరావు తెలిపారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ జాతిపిత, స్వా తంత్య్ర సమరయోధుడు, సామాజిక స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరిచిపోలేనివని.. ఆయన మన జిల్లాకు చెందిన వారు కావడం జిల్లాప్రజల అదృష్టమన్నారు. ఇలాంటి మహనీయ వ్యక్తి జయంతి వేడుకలు మంచి ర్యాలలో జరుపుకోవడం సంతోషకరమన్నా రు. ఈ వేడుకలను పలు ఎంపీలు, ఎమ్యెల్యేలు, స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ మంత్రులు, వివిధ సం ఘాలు, పార్టీల నేత లను ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రజలూ అధిక సంఖ్య లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నిర్వాహక సభ్యులు రామ్రాజ్, లక్ష్మణ్సేవా సదన్ ప్రధాన కార్యదర్శి బాలాజీ, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి గాదె సత్యం, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ముకేశ్‌గౌడ్, నాయకులు కోసరి రవీంద్రనాధ్, చంద్రశేఖర్ ఉన్నారు.