ఎఫ్‌సీఐ పేపర్‌ లీక్‌ : 50 మంది అరెస్ట్‌ | FCI Exam Paper Leaked in MP.. 48 Candidates, 2 Agents held  | Sakshi
Sakshi News home page

ఎఫ్‌సీఐ పేపర్‌ లీక్‌ : 50 మంది అరెస్ట్‌

Published Mon, Apr 2 2018 10:38 AM | Last Updated on Thu, Oct 4 2018 8:29 PM

FCI Exam Paper Leaked in MP.. 48 Candidates, 2 Agents held  - Sakshi

సాక్షి, భోపాల్‌ : ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పోస్టుల భర్తీకి జరగాల్సిన పరీక్ష పత్రాలు లీక్‌ కావడం కలకలం రేపింది. సీబీఎస్‌ఈ ఎగ్జామ్‌ పేపర్‌ బహిర్గతం కావడం దేశవ్యాప్తంగా దుమారం రేపిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఆదివారం జరగాల్సిన ఎఫ్‌సీఐ పరీక్ష ప్రశ్నాపత్రం ముందుగానే లీక్‌ అయింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు దళారులతో పాటు 48 మంది అభ్యర్థులను మధ్యప్రదేశ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) పోలీసులు అరెస్టు చేశారు.

ప్రశ్నాపత్రాన్ని ఇచ్చినందుకు ఒక్కో అభ్యర్థి నుంచి ఏజెంట్లు రూ 5 లక్షలు డిమాండ్‌ చేసినట్టు అధికారులు వెల్లడించారు. పోస్టుకు ఎంపికైన అనంతరం ఈ మొత్తాన్ని చెల్లించాలని తమను ఏజెంట్లు కోరారని అభ్యర్ధులు విచారణ సందర్భంగా చెప్పినట్టు సమాచారం. కాగా, అరెస్ట్‌ అయిన ఏజెంట్లను ఢిల్లీకి చెందిన అశుతోష్‌ కుమార్‌, హరీష్‌ కుమార్‌లుగా గుర్తించారు. నిందితుల నుంచి చేతిరాతతో కూడిన ప్రశ్నాపత్రం, ఆన్సర్‌ షీట్‌ను ఎస్‌టీఎఫ్‌ స్వాధీనం చేసుకుంది. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement