exam paper leakage
-
‘టీఎస్పీఎస్సీ లీకేజ్’ కేసులో మరో ముగ్గురు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో మరో ముగ్గురు నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం అరెస్టు చేసింది. వీళ్లు ఏఈఈ, డీఏఓ పరీక్ష పత్రాలు ఖరీదు చేసిన అభ్యర్థులని అధికారులు ప్రకటించారు. వీరితో ఇప్పటి వరకు అరెస్టు అయిన వారి సంఖ్య 30కి చేరింది. కమిషన్ కార్యదర్శి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన ప్రవీణ్‌కుమార్ నుంచి ఏఈఈ పేపర్లు వరంగల్, హైదరాబాద్‌లకు చెందిన దళారులు మనోజ్‌కుమార్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డిలకు చేరాయి. వీటిని ఏడుగురికి విక్రయించారు. ఒక్కోక్కరితో రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకుని రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు అడ్వాన్సులు తీసుకుని పేపర్లు అందించారు. మనోజ్, మురళీ విచారణలో వీరి నుంచి పేపర్లు ఖరీదు చేసిన వారి పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో గత వారం నలుగురిని అరెస్టు చేసిన సిట్ మంగళవారం క్రాంతి, శశిధర్‌రెడ్డిలను పట్టుకుంది. ఈ ద్వయం మురళీధర్‌రెడ్డి నుంచి ఏఈఈ పేపర్లు ఖరీదు చేసినట్లు గుర్తించింది. మరోపక్క ప్రవీణ్ కుమార్ రూ.6లక్షలు తీసుకుని ఖమ్మంకి చెందిన భార్యాభర్తలు సాయి సుస్మిత, సాయి లౌకిక్లకు డీఏఓ పేపర్ విక్రయించాడు. వీరిని సిట్ అధికారులు గత నెలలోనే అరెస్టు చేశారు. సాయి లౌకిక్ ఆ పేపర్‌ను తన స్నేహితుడైన రవి తేజకు విక్రయించాడు. దర్యాప్తులో ఈ విషయం గుర్తించిన పోలీసులు మంగళవారం రవితేజను కటకటాల్లోకి పంపారు. మంగళవారం అరెస్టయిన ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం వీరిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది. పేపర్ లీకేజీపై ఈడీకి బీఎస్పీ ఫిర్యాదు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వెనుక ఉన్న అసలైన సూత్రధారులను అరెస్టు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు ఈడీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రాసిన లేఖను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు వెంకటేష్ చౌహాన్, అరుణ, సంజయ్‌లు ఈడీ కార్యాలయంలో సంబంధిత అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్న విచారణ జరపాలని ఈడీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. -
దొంగలను జైల్లో పెట్టాక సజావుగా పరీక్షలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పరీక్ష పేపర్లు లీకు చేసిన దొంగలను అరెస్టు చేసి జైలులో పెట్టాక ఇప్పుడు పరీక్షలన్నీ సజావుగా సాగుతున్నాయని రాష్ట్ర వైద్యా రోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లాలో గురువారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ నేతలు ఎన్నో కుట్రలు చేస్తున్నారని, హిందూ, ముస్లింల మధ్య కొట్లాట పెట్టి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆరో పించారు. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసి విఫలమయ్యారన్నారు. సీఎం కేసీఆర్ బలమైన తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేస్తుంటే బీజేపీ నేతలు సమాధులు తవ్వుతామంటున్నారని ధ్వజమెత్తారు. ఒక్క మెడికల్ కాలేజీకి ఇంత ప్రచారమా.. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనపైనా హరీశ్ విమర్శ లు గుప్పించారు. నాలుగేళ్ల క్రితం మంజూరైన ఒక్క మెడికల్ కాలేజీ ఎయిమ్స్‌కు మోదీ ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం విడ్డురంగా ఉందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం గత ఏడాది ఒకేసారి ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంభించిందని గుర్తు చేశారు. కంటి వెలుగు కార్యక్రమంలో కోటి మందికి కంటి పరీక్షలు పూర్తయిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. కాంగ్రెస్ రోజురోజుకూ బలహీనపడుతోంది కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలహీనపడుతోందని హరీశ్‌రావు అన్నారు. సోనియాని విమర్శిస్తే కనీసం ఖండించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు. లోక్‌సభ నుంచి రాహుల్‌గాం«దీని తీసిపారేస్తే దిక్కు దివాణం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. పదేళ్లు పాలించిన కాంగ్రెస్ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, అలాంటి కాంగ్రెస్ పార్టీని నమ్మితే నష్టపోతారన్నారు. సెక్రటేరియట్‌ను కూలగొడతానని, ప్రగతిభవన్‌కు కాలబెడతానని అంటున్న రేవంత్‌రెడ్డి లాంటి నేతలు కావాలా? తెలంగాణను నిర్మించే కేసీఆర్ కావాలో ఆలోచించుకోవాలన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘పేపర్ లీకేజీల వెనుక బండి సంజయ్ పాత్ర ఉంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ కారణంగా రాష్ట్రంలో మరోసారి పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సంజయ్ అరెస్ట్‌పై జగదీష్ రెడ్డి స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పేపర్ లీకేజీల వెనుక బండి సంజయ్ పాత్ర ఉంది. కుట్రలో భాగంగానే బీజేపీ లీకులు చేస్తోంది. రాజకీయ క్రీడ కోసం విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతోంది. అధికారం కోసం బీజేపీ ఎలాంటి దారుణానికైనా పాల్పడుతుంది. తప్పు చేసిన వాళ్లు ఎక్కడో ఒకచోట దొరికిపోతారు. బండి సంజయ్‌కు చదువు విలువ తెలియదు. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఇలాంటి నేతలకు తెలియదు. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే బీజేపీ కుట్రలు చేస్తోంది. త్వరలోనే పోలీసులు అన్ని విషయాలు బయటపెడతారు’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇంటి దొంగలు ఎందరు? 42 మంది టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్ స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇంటి దొంగల్ని కనిపెట్టడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే కమిషన్ కార్యదర్శి పీఏ ప్రవీణ్‌కుమార్ అరెస్టు కావడం, మాజీ ఉద్యోగి సురేష్ పేరు వెలుగులోకి రావడంతో లోతుగా ఆరా తీస్తోంది. కమిషన్‌కు చెందిన వివిధ స్థాయిల ఉద్యోగులు 42 మందికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించడం ప్రారంభించింది. మరోపక్క తమ కస్టడీలో ఉన్న 9 మంది నిందితులను సిట్ అధికారులు బుధవారం ఏడు గంటల పాటు ప్రశ్నించారు. వీరి కస్టడీ గడువు గురువారంతో ముగియనుండటంతో విచారణ వేగవంతం చేశారు. బుధవారం కమిషన్ కార్యాలయానికి వెళ్లిన సైబర్ క్రైమ్ నిపుణుల బృందం కూడా నిందితులను ప్రశ్నించింది. ఇక టెక్నికల్ టీమ్ వంతు.. టీఎస్పీఎస్సీలో పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు భద్రపరిచే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ మొదలుపెట్టి అన్ని విభాగాల్లోనూ కలిపి దాదాపు 150 కంప్యూటర్లు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా టెక్నికల్ టీమ్ పని చేస్తుంటుంది. నెట్వర్క్ అడ్మిన్‌గా ఉండి, లీకేజ్ కేసులో అరెస్టు అయిన రాజశేఖర్ ఈ టీమ్‌లో కీలకంగా వ్యవహరించాడు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సిట్ అధికారులు అంతర్గత లోపాలు గుర్తించడానికి టెక్నికల్ టీమ్‌ను ప్రశ్నించాలని నిర్ణయించారు. దీంతో పా టు వీరి బంధువులు, స్నేహితుల్లో ఎవరైనా టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలు రాశారా? వారికి ఎన్ని మార్కులు వచ్చాయి? గతంలో వారి ప్రతిభ ఎలా ఉంది? తదితర అంశాలను దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి కోసం గాలింపు గ్రూప్ –1 ప్రిలిమ్స్ పేపర్ లీక్‌లో పాత్ర ఉన్నట్టుగా గుర్తించిన ముగ్గురు అందుబాటులో లేకపోవడంతో, వారిని నిందితులుగా అనుమానిస్తూ సిట్ గాలింపు చేపట్టింది. వీళ్లు కమిషన్ ఉద్యోగులే అని తెలుస్తోంది. 100 కంటే ఎక్కువ మార్కులు సాధించిన పదిమందిలో ఈ ముగ్గురు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నిందితులుగా ఉన్న 9 మందికి అదనంగా మరికొందరి పేర్లు జోడిస్తూ అధికారులు గురువారం కోర్టుకు సమాచారం ఇవ్వనున్నారు. శంకరలక్ష్మిది నిర్లక్ష్యమే..? లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షల పేపర్లను భద్రపరచడంలో శంకరలక్ష్మి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సిట్ భావిస్తోంది. ఈమెకు నోటీసులు జారీ చేసి ఇప్పటికే రెండుసార్లు ప్రశ్నించిన నేపథ్యంలో తదుపరి చర్యలకు సంబంధించి కమిషన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. గ్రూప్–1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ పరీక్షకు ముందే ప్రవీణ్, రాజశేఖర్, సురే ష్ లతో పాటు మరెవరికైనా చేరిందా అనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఏఈ పరీక్ష పేపర్ క్రయవిక్రయాల్లో ప్రవీణ్, రేణుక, నీలేశ్, గోపాల్ మధ్య జరిగిన రూ.14 లక్షల లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు సైబర్ క్రైమ్ నిపుణుల బృందం కమిషన్ కార్యాలయంలో పని చేస్తున్న కీలక ఉద్యోగుల సెల్ఫోన్లు, వాట్సాప్ సంప్రదింపులను విశ్లేషించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కేసులో మరికొన్ని అరెస్టులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రూప్–1లో 10 మంది ఉద్యోగులు పాస్ గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన కమిషన్ ఉద్యోగుల్లో ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో సహా పది మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో కొందరికి ఊహించని విధంగా మార్కులు వచ్చాయని సిట్ గుర్తించింది. ఇప్పటికే ఈ జాబితాను టీఎస్పీఎస్సీ నుంచి సేకరించిన అధికారులు వారికీ నోటీసులు జారీ చేసి విచారణకు సిద్ధమయ్యారు. కస్టోడియన్‌గా వ్యవహరిస్తున్న కమిషన్ ఉద్యోగిని శంకరలక్ష్మి కంప్యూటర్ నుంచే ప్రశ్నపత్రాలు బయటకు వచ్చాయని ఇప్పటికే నిర్ధారణైంది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన అధికారులు తనకు ఉన్న పరిజ్ఞానం వినియోగించిన రాజశేఖర్.. శంకరలక్ష్మి కంప్యూటర్లోకి అక్రమంగా చొరబడి ప్రశ్నపత్రాలు సంగ్రహించాడని తేల్చారు. ఈ విధంగా లీకేజ్ వ్యవహారంలో సైబర్ నేరమూ ఉండటంతో ఇన్ఫర్మేషన్ యాక్ట్‌ను జోడించాలని నిర్ణయించారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరిచే సమయంలో దీనికి సంబంధించి మెమో దాఖలు చేయనున్నారు. -
ప్రశ్నపత్రం ప్రచురణ ఎక్కడనే పరిస్థితి దాపురించింది
కేపీహెచ్‌బీకాలనీ: విద్యార్థులు గతంలో పరీక్షలంటే ఎలా చదవాలని అడిగే వారని.. ప్రస్తుతం ప్రశ్నపత్రం ప్రచురణ ఎక్కడ జరుగుతోందని అడిగే పరిస్థితి దాపురించిందని రాష్ట్ర గవర్నర్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చాన్సలర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించి పరోక్షంగా పోటీ పరీక్షల లీకేజీ అంశాన్ని ప్రస్తావించారు. పదేళ్ల కిందట మెడికల్ కళాశాలలో తాను విద్యార్థులకు క్లాస్ తీసుకుంటుండగా పరీక్షలు రాసేందుకు సర్వ సన్నద్ధమైన ఓ విద్యార్థి తనను ప్రశ్న పత్రాలు ఎక్కడ తయారవుతాయంటూ ప్రశ్నించడం ఆ నాడు జోక్‌గా ఉంటే ప్రస్తుతం అది వాస్తవరూపం దాల్చడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జేఎన్టీయూహెచ్ 11వ స్నాతకోత్సవం శనివారం వర్సిటీ ఆవరణలోని ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా పీహెచ్డీ, ఎంటెక్, ఎం.ఫార్మ్. ఎంబీఏ, ఎంఎస్‌ఐటీ, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంఎస్, ఫార్మ్–డి, ఫార్మ్ డి (పీబీ), పీజీ డిప్లొమా, బీటెక్, ఇంటిగ్రేటెడ్ అండ్ ఎంఓయూ కోర్సులు పూర్తి చేసిన విద్యార్ధులకు పట్టాలతో పాటు పతకాలను ప్రదానం చేశారు. విద్యార్ధులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ గురువుల ద్వారా ఆర్జించిన జ్ఞానాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా సమాజ వికాసానికి పంచినప్పుడే సార్ధకత లభిస్తుందన్నారు. సమాజానికి ఉపయోగపడని విద్యా డిగ్రీలు, పతకాలు ఎన్ని సాధించినా వ్యర్ధమేనని వ్యాఖ్యానించారు. నిత్యం టెక్నాలజీతో సహజీవనం చేస్తున్న ప్రస్తుత రోజుల్లో ఆ సాంకేతికతను సన్మార్గంలో వినియోగించుకున్నప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇంటా, బయటా ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో కొంతమంది విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. ఉద్యోగాలు వెతుక్కునే స్థితి వద్దని, ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉండాలని పిలుపునిచ్చారు. ఎప్పుడూ కరెన్సీ మాత్రమే లెక్కబెట్టడం కాదని, కేలరీస్‌ను కూడా లెక్కించాలని పేర్కొంటూ ఆరోగ్య ప్రాధాన్యతను తెలియజేశారు. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని ఉద్భోదించారు. -
లీకేజ్ నారాయణ ఎక్కడ ??
-
ఎస్ఐ స్కాం: అవును, బ్లూటూత్ వాడాను
బనశంకరి: బ్లూటూత్ పరికరం ఉపయోగించి పరీక్షలో సమాధానాలు రాశాను. ఇందుకోసం రూ. 40 లక్షలను ముట్టజెప్పాను అని ఎస్ఐ పోస్టుల స్కాంలో పట్టుబడిన అభ్యర్థి సునీల్ చెప్పాడు. అతన్ని సీఐడీ అధికారులు విచారించగా అక్రమాలను బయటపెట్టాడు. ఆర్డీ పాటిల్ బ్లూటూత్ పరికరం ద్వారా సమాధానాలు చెప్పాడని, ఇందుకోసం రూ.40 లక్షలు తీసుకున్నాడని సునీల్ చెప్పాడు. ఈ పరీక్షలో సునీల్ ఉత్తీర్ణుడు కావడం గమనార్హం. అదనపు డీజీపీపై బదిలీ వేటు ఎస్ఐ ఉద్యోగాల భర్తీలో భారీ కుంభకోణం ఐపీఎస్‌లకు ఇబ్బందిగా మారింది. పోలీస్ నియామక విభాగం అదనపు డీజీపీ అమృత్‌పౌల్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీచేసింది. ఆంతరిక భద్రత విభాగానికి పంపించింది. ఇందుకు స్కామే కారణమని సమాచారం. త్వరలో మరికొందరు ఐపీఎస్‌లనూ బదిలీ చేయవచ్చని సమాచారం. అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్టు ఇటీవల మైసూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కర్ణాటక విశ్వవిద్యాలయం జియాగ్రఫీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజ్ ను బుధవారం మల్లేశ్వరం పోలీసులు అరెస్ట్‌చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే అరెస్టైన గెస్ట్ లెక్చరర్ సౌమ్య విచారణలో ఇచ్చిన సమాచారంతో నాగరాజ్‌ను అరెస్టుచేశారు. (చదవండి: ఎస్ఐ స్కాంలో అభ్యర్థి అరెస్టు... బ్లూటూత్ ద్వారా పరీక్ష రాసిన వైనం) -
ఎస్ఐ స్కాంలో అభ్యర్థి అరెస్టు... బ్లూటూత్ ద్వారా పరీక్ష రాసిన వైనం
బనశంకరి: ఎస్ఐ పోస్టుల కుంభకోణంలో ఎన్వీ సునీల్‌కుమార్ అనే వ్యక్తిని సీఐడీ అరెస్ట్‌చేసి బెంగళూరుకు తీసుకువచ్చింది. ముఖ్య నిందితుడు రుద్రేగౌడ పాటిల్ ద్వారా బ్లూ టూత్‌లో సమాధానాలు విని సునీల్ పరీక్ష రాశాడు. దివ్యా హగరగి ఆధీనంలో ఉన్న కలబురిగి జ్ఞానజ్యోతి స్కూల్లో అతడు పరీక్షకు హాజరయ్యాడు. ఈ కేసులో ఇప్పటివరకు 16 మంది అరెస్టయ్యారు. డీకేతో నిందితురాలి ఫోటో ఎస్ఐ స్కాంలో పరారీలో ఉన్న నిందితురాలు దివ్యా హగరగి కేపీసీసీ అద్యక్షుడు డీకే.శివకుమార్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందాయి. ఆమె బీజేపీ నాయకురాలని, ఆమె ఇంటికి హోంమంత్రి జ్ఞానేంద్ర వెళ్లి సన్మానం పొందారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తుండగా, ఈ ఫోటోలు రావడం విశేషం. గెస్ట్ లెక్చరర్ విచారణ మరోవైపు అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మైసూరుకు చెందిన గెస్ట్ లెక్చరర్ సౌమ్యను బెంగళూరు మల్లేశ్వరం పోలీసులు విచారిస్తున్నారు. మంగళవారం ఒకటవ ఏసీఎంఎం కోర్టులో ఆమెను హాజరుపరిచారు. గతనెల 14 తేదీన భూగోళ శాస్త్రం పరీక్ష రోజున ఉదయమే పరీక్షా కేంద్రంలోకి వెళ్లిన సౌమ్య మొబైల్ ద్వారా ప్రశ్నాపత్రం ఫోటోలు తీసుకుని లీక్ చేసింది. ఆమె వద్ద ఉన్న ప్రశ్నలు క్రమపద్ధతిలో లేనట్లు తెలిసింది. ఆమె మొబైల్‌ను తనిఖీ చేస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేదానిపై విచారణ సాగుతోంది. పేపర్ లీక్ స్కాంలో మైసూరు వర్సిటీలో జాగ్రఫీ గెస్ట్ లెక్చరర్ సౌమ్యా పైన కఠిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ శివప్ప మంగళవారం తెలిపారు. ఆమెపై పలు ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపిస్తామని చెప్పారు. (చదవండి: హత్యకు కుట్ర, ముగ్గురి అరెస్ట్) -
ఎఫ్‌సీఐ పేపర్ లీక్ : 50 మంది అరెస్ట్
సాక్షి, భోపాల్ : ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పోస్టుల భర్తీకి జరగాల్సిన పరీక్ష పత్రాలు లీక్ కావడం కలకలం రేపింది. సీబీఎస్ఈ ఎగ్జామ్ పేపర్ బహిర్గతం కావడం దేశవ్యాప్తంగా దుమారం రేపిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఆదివారం జరగాల్సిన ఎఫ్‌సీఐ పరీక్ష ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ అయింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు దళారులతో పాటు 48 మంది అభ్యర్థులను మధ్యప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు అరెస్టు చేశారు. ప్రశ్నాపత్రాన్ని ఇచ్చినందుకు ఒక్కో అభ్యర్థి నుంచి ఏజెంట్లు రూ 5 లక్షలు డిమాండ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. పోస్టుకు ఎంపికైన అనంతరం ఈ మొత్తాన్ని చెల్లించాలని తమను ఏజెంట్లు కోరారని అభ్యర్ధులు విచారణ సందర్భంగా చెప్పినట్టు సమాచారం. కాగా, అరెస్ట్ అయిన ఏజెంట్లను ఢిల్లీకి చెందిన అశుతోష్ కుమార్, హరీష్ కుమార్‌లుగా గుర్తించారు. నిందితుల నుంచి చేతిరాతతో కూడిన ప్రశ్నాపత్రం, ఆన్సర్ షీట్‌ను ఎస్టీఎఫ్ స్వాధీనం చేసుకుంది. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. -
సీఆర్పీఎఫ్ పేపర్ లీకేజీ కేసులో ఐదుగురికి జైలు
సాక్షి, హైదరాబాద్: సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టుల పరీక్ష పేపర్ లీకేజీ కేసులో దోషులుగా తేలిన నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బందితోపాటు మరో ప్రైవేటు ఉద్యోగికి శుక్ర వారమిక్కడి సీబీఐ కోర్టు ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష, రూ. 10 వేల చొప్పున జరిమానా విధించింది. 2004 జనవరి 7న జరిగిన ఈ లీకేజీ వ్యవహారంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది మహావీర్ సింగ్ (లాన్స్‌నాయక్), గోపీరాం, సూరజ్‌ఖాన్, ఆనంద్లతోపాటు సన్యాసిరావు అనే ప్రైవేటు ఉద్యోగిని కోర్టు ఈ మేరకు దోషులుగా తేల్చి, శిక్ష విధించింది. ప్రశ్నపత్రాన్ని టైప్ చేసేందుకుగాను సీఆర్పీఎఫ్ ఐజీ నాగరాజు ప్రశ్నలను డిక్టేట్ చేయగా.. స్టెనోగ్రాఫర్ సూరజ్‌ఖాన్ వాటిని లీక్ చేసినట్లు కోర్టు ధ్రువీకరించింది. ప్రశ్నపత్రం లీకేజీ అనేది క్షమించరాని నేరమని, దీనివల్ల అర్హులైన అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురవుతారని తీర్పు సందర్భంగా సీబీఐ జడ్జి ఎంవీ రమేశ్ వ్యాఖ్యానించారు. కాగా పేపర్ లీకేజీ కావడంతో ఆ పరీక్ష రద్దు చేసి మళ్లీ వేరుగా నిర్వహించారు. ఇదిలాఉండగా.. 2007లో కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన జూనియర్ ఇంజనీర్ వీవీవీ ఎన్ఎస్ఎస్ ప్రసాద్‌కు సీబీఐ జడ్జి ఎన్.బాలయోగి ఏడాది జైలుశిక్ష, రూ. 13 వేల జరిమానా విధించారు.