![FCI: Table Tennis Meet Telangana Team Became Runner Up - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/23/telangana.jpg.webp?itok=rLfm8Pr4)
సాక్షి, హైదరాబాద్: భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సౌత్‌జోన్ ఇంటర్ రీజినల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ (టీటీ) స్పోర్ట్స్ మీట్‌లో తెలంగాణ జట్టు రన్నరప్‌గా నిలిచింది. టీటీ మహిళల సింగిల్స్‌లో రత్న స్వప్న (తెలంగాణ) విజేతగా, పరిమళ కిశోరి (తెలంగాణ) రన్నరప్‌గా నిలిచారు. డబుల్స్‌లో రత్న స్వప్న–పరిమళ జంట టైటిల్ సొంతం చేసుకుంది.
ఎఫ్‌సీఐ (రీజియన్) జనరల్ మేనేజర్ దీపక్ శర్మ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో వంశీ కుమార్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్) టైటిల్ గెలిచాడు. పురుషుల డబుల్స్‌లో వంశీ కుమార్ రెడ్డి–చైతన్య (ఆంధ్రప్రదేశ్) జోడీ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు..
Comments
Please login to add a commentAdd a comment