ఎఫ్‌సీఐ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం | Fire Accident Took Place In FCI Godown At Rajapet Yadadri Bhuvanagiri District | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 8 2018 5:16 PM | Last Updated on Sat, Dec 8 2018 5:19 PM

Fire Accident Took Place In FCI Godown At Rajapet Yadadri Bhuvanagiri District - Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజాపేటలో ఉన్న ఎఫ్‌సీఐ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గోదాం పూర్తిగా దగ్ధమైపోయింది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే 2 గంటలు శ్రమించినప్పటికి ఫలితం దక్కలేదు. గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంతో ఆ చుట్టుపక్కల దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో భారీ నష్టం వాటిలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement