హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐఐ) సభ్య కంపెనీలు రూ.9 కోట్ల విరాళం ప్రకటించాయి. ఈ మొత్తంలో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.1.97 కోట్లు అందించాయి. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్స్‌కు రూ.2.44 కోట్లు విరాళం ఇచ్చాయి. పీపీఈ, ఆహార పంపిణీ, అవగాహన కార్యక్రమాలకు మిగిలిన మొత్తాన్ని వెచ్చిస్తున్నాయి. సభ్య కంపెనీలైన మహీకో, రాశి, సింజెంటా, క్రిస్టల్, కోర్టెవా కంపెనీలు ఒక్కొక్కటి రూ.1 కోటి ఖర్చు చేస్తున్నాయి. బీఏఎస్‌ఎఫ్, బేయర్, బయోసీడ్, ఎంజా జేడెన్, హెచ్‌ఎం క్లాస్, ఐఅండ్‌బీ, జేకే, కలాశ్, నిర్మల్, నోబుల్, ర్యాలీస్, రిజ్వాన్, సీడ్‌వర్క్స్, సవాన్నా, టకీ, టకీట కూడా సాయానికి ముందుకు వచ్చాయి. కాగా, మొత్తంగా బేయర్ ఇండియా రూ.7.2 కోట్లు, డీసీఎం శ్రీరామ్ రూ.10 కోట్లు, జేకే గ్రూప్ రూ.10 కోట్లు వెచ్చిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment