
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్.. కేంద్రంపై పోరుకు దిగారు. తెలంగాణ, దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది.
‘‘దేశమంతా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉంది. ధాన్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు. ఎంత అవసరమో అంతే తీసుకుంటాం.. ఎవరిపైనా వివక్ష లేదు. తెలంగాణలో గత ఐదేళ్లలో 7 రెట్ల ధాన్యం సేకరణ చేశాం. ధాన్యం సేకరణ, సంచుల అవసరంపై తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు. పంజాబ్ నుంచి పారా బాయిల్డ్ రైస్ తీసుకోలేదు’’ అని వివరణ ఇచ్చింది.
ఈ సందర్భంగానే ధాన్యం సేకరణలో వివాదం ఏమీ లేదని ఎఫ్‌సీఐ రిజనల్ మేనేజర్ దీపక్ శర్మ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పారా బాయిల్డ్ రైస్‌కి డిమాండ్ లేదన్నారు. రా రైస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం ఉత్పత్తి ఎంత అవుతుంది.? ఎంతమేర ఇస్తారనేది స్పష్టంగా చెప్పలేదన్నారు. ఈ క్రమంలోనే రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటాని క్లారిటీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment