ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకురావొద్దు
అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచన
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకొచ్చే విధంగా వ్యవహరించవద్దని ఆయన అధికారులకు సూచించారు.
ధాన్యం కొను గోళ్ల విషయంలో రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా ఉండేలా చూడాలని ఉద్బోధించారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగో ళ్లపై పౌరసరఫరాల కార్యాలయం నుంచి మంత్రి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కోటి న్నర మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనుగోళ్లు ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసిందని తెలిపారు.
ఇందుకోసం రూ.30 వేల కోట్లు అవసరమ వుతాయని ఆయన తెలిపా రు. ఇప్పటికే రాష్ట్ర ప్ర భుత్వం రూ.20 వేల కోట్లు ధాన్యం కొనుగోళ్ల కోసం కేటా యించిందని, అవసరమైతే అదనపు నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు సృష్టించవద్దని చెప్పారు. ప్రభుత్వం, రైస్ మిల్లర్లు పరస్పరం తోడ్పాటు అందించుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. ధాన్యం కొను గోళ్లలో మిల్లర్ల సహకారం తప్పనిసరిగా ఉండాల న్నారు.
మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలపై ఆందోళన చెందాల్సి న అవసరం లేదని, ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ అప్పగించిన వెంటనే బ్యాంక్ గ్యారంటీలను వాపస్ చేయ నున్నట్లు చెప్పారు. మిల్లర్ల కోరిక మేరకు ధాన్యం మిల్లింగ్ చార్జీలు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ అందిస్తుందని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
అకాల వర్షాలతో రైతులు నష్ట పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కలెక్టర్లు ఎప్పటి కప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డి.యస్ చౌహాన్, కమిషనర్, జాయింట్ సెక్రటరీ ప్రియాంకా అలా, మార్కెటింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
భూదాన్‌పోచంపల్లిలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా
భూదాన్‌పోచంపల్లి: ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నివారిస్తూ ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి పట్టణంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శనివారం రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ...రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి నెల రోజులు గడిచినా తూకం వేయడం లేదన్నారు.
కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం వల్ల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని, రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూదాన్‌పోచంపల్లి పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, నాయకులు, రైతులు రావుల శేఖర్‌రెడ్డి, సామ రవీందర్‌రెడ్డి, బత్తుల శ్రీశైలంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment