procurement
-
కంపెనీలకు ఆర్థిక మోసాల తాకిడి
న్యూఢిల్లీ: కంపెనీలకు ఆర్థిక మోసాల తాకిడి పెరిగిపోయింది. గడిచిన 24 నెలల్లో తాము ఆర్థిక మోసాల బారిన పడినట్టు 59 శాతం భారత కంపెనీలు వెల్లడించాయి. పీడబ్ల్యూసీ నిర్వహించిన ‘గ్లోబల్ ఎకనమిక్ క్రైమ్ సర్వే 2024’ రూపంలో ఈ వివరాలు తెలిశాయి. ప్రపంచవ్యాప్తంగా 2,446 సంస్థల సీఈవోలు, ఎండీలు, బోర్డు సభ్యుల అభిప్రాయాలను ఈ సర్వే తెలుసుకుంది. భారత్ నుంచి 91 కంపెనీలు సర్వేలో పాల్గొన్నాయి. ‘‘సర్వేలో పాలు పంచుకున్న భారత కంపెనీల్లో 59 శాతం గత రెండేళ్లలో ఆర్థిక మోసాల బారిన పడినట్టు చెప్పాయి. అంతర్జాతీయ సగటు 41 శాతంతో పోలి్చతే 18 శాతం ఎక్కువ. 2022 ఎడిషన్ సర్వే ప్రకారం చూసినా భారత్‌లో 7 శాతం పెరుగుదల కనిపిస్తోంది’’అని ఈ సర్వే తెలిపింది. ప్రధానంగా కంపెనీల్లో ప్రొక్యూర్మెంట్ (కొనుగోళ్లు) విభాగంలో ఈ మోసాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్టు పీడబ్ల్యూసీ సర్వే తెలిపింది. తమకు ఇదొక ప్రధాన సమస్యగా 50 శాతం భారత కంపెనీలు తెలిపాయి. అంతర్జాతీయ సగటుతో పోల్చి చూస్తే 21 శాతం ఎక్కువ. ఇక 47 శాతం కంపెనీలకు కస్టమర్ల మోసాలు ఆందోళనకరంగా పరిణమించాయి. సైబర్ నేరాలు తమకు ప్రధాన సమస్య అని అంతర్జాతీయంగా 44 శాతం కంపెనీలు వెల్లడించాయి. ఎప్పటి నుంచో ఉన్నవే.. ‘‘చారిత్రకంగా చూస్తే ప్రొక్యూర్మెంట్ మోసాలు అన్నవి ఎప్పటి నుంచో ఉన్నవే. ఆర్థిక ప్రయోజనం పొందేందుకు కొనుగోళ్లలో (ప్రొక్యూర్మెంట్) అవకతవకలకు పాల్పడడం. ఈ ఏడాది మా సర్వేలో పాల్గొన్న భారత కంపెనీల ప్రతినిధుల్లో సగం మంది ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు’’అని పీడబ్ల్యూసీ ఇండియా ఫోరెన్సిక్ సరీ్వసెస్ పార్ట్నర్ పునీత్ గర్ఖేల్ తెలిపారు. ప్రొక్యూర్మెంట్ మోసాలను నివారించేందుకు భారత కంపెనీలు డేటా అనలైటిక్స్‌ను వినియోగిస్తున్నట్టు ఈ సర్వే తెలిపింది. 33 శాతం ఆర్థిక నేరాలు అవినీతి, లంచాలకు సంబంధించినవేనని, గత రెండేళ్లలో టాప్–3 ప్రధాన ఆర్థిక నేరాల్లో ఇవి కూడా ఉన్నట్టు 26 శాతం భారత కంపెనీలు వెల్లడించాయి. -
పంట దిగుబడిలో దేశంలోనే తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: పంట దిగుబడిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టిస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయ న తన క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. రాష్ట్రంలో ఈసారి 60.80 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారని, 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుందన్నారు. దీంట్లో 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఆస్కారముందని చెప్పారు. ఖరీఫ్ నుంచి సన్నాలకు బోనస్‌గా క్వింటాల్‌కు రూ.500 ప్రకటించిన నేపథ్యంలో రైతులు సన్నాల వైపు మొగ్గుచూపినట్టు తెలిపారు. ఈ మొత్తం ధాన్యం సేకరణకు రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుందని, అందులో ఇప్పటికే రూ.20 వేల కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. 10 నెలల వ్యవధిలోనే పౌరసరఫరాల సంస్థకు ఉన్న రుణంలో రూ.11,537.40 కోట్ల భారాన్ని తగ్గించుకున్నట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో 7,572 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ బియ్యానికి బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో డిమాండ్ ఉందని, ఇతర దేశాలు కూడా తెలంగాణ బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎలాంటి అవాంతరాలు సంభవించినా, అధిగమించేందుకు అధికారులను సన్నద్ధం చేయాలని పౌర సరఫరాలశాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్.చౌహాన్‌ను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. నిబంధనల మేరకే బ్యాంకు గ్యారంటీలను తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా సాగాలి
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకొచ్చే విధంగా వ్యవహరించవద్దని ఆయన అధికారులకు సూచించారు. ధాన్యం కొను గోళ్ల విషయంలో రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా ఉండేలా చూడాలని ఉద్బోధించారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగో ళ్లపై పౌరసరఫరాల కార్యాలయం నుంచి మంత్రి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కోటి న్నర మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనుగోళ్లు ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసిందని తెలిపారు. ఇందుకోసం రూ.30 వేల కోట్లు అవసరమ వుతాయని ఆయన తెలిపా రు. ఇప్పటికే రాష్ట్ర ప్ర భుత్వం రూ.20 వేల కోట్లు ధాన్యం కొనుగోళ్ల కోసం కేటా యించిందని, అవసరమైతే అదనపు నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు సృష్టించవద్దని చెప్పారు. ప్రభుత్వం, రైస్ మిల్లర్లు పరస్పరం తోడ్పాటు అందించుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. ధాన్యం కొను గోళ్లలో మిల్లర్ల సహకారం తప్పనిసరిగా ఉండాల న్నారు. మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలపై ఆందోళన చెందాల్సి న అవసరం లేదని, ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ అప్పగించిన వెంటనే బ్యాంక్ గ్యారంటీలను వాపస్ చేయ నున్నట్లు చెప్పారు. మిల్లర్ల కోరిక మేరకు ధాన్యం మిల్లింగ్ చార్జీలు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ అందిస్తుందని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అకాల వర్షాలతో రైతులు నష్ట పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కలెక్టర్లు ఎప్పటి కప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డి.యస్ చౌహాన్, కమిషనర్, జాయింట్ సెక్రటరీ ప్రియాంకా అలా, మార్కెటింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలిభూదాన్పోచంపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా భూదాన్‌పోచంపల్లి: ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నివారిస్తూ ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ...రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి నెల రోజులు గడిచినా తూకం వేయడం లేదన్నారు. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం వల్ల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని, రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూదాన్‌పోచంపల్లి పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, నాయకులు, రైతులు రావుల శేఖర్‌రెడ్డి, సామ రవీందర్‌రెడ్డి, బత్తుల శ్రీశైలంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్జీ కర్ ఆస్పత్రి మెడిసిన్ కొనుగోళ్లలో భారీ లోపాలు: సీబీఐ
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులు దర్యాప్తు సంస్థ సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. సందీప్ ఘోష్ ప్రన్సిపల్గా ఉన్న సమయంలో ఆస్పత్రిలో పేషెంట్లకు అందించే మెడిసిన్ కొనుగోళ్ల వ్యవస్థలో భారీ లోపాలు ఉన్నాయని సీబీఐ తాజాగా పేర్కొంది. బయటి ఏజెన్సీల నుంచి ఔషధాలను కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా బిడ్డర్లను సాంకేతికంగా పరిశీలన చేసే కీలకమైన అంశాన్ని విస్మరించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. పేషెంట్ల ఆరోగ్యం బిడ్డర్లు సప్లై చేసే నాణ్యమైన మెడిసిన్‌పై అధారపడి ఉంటుంది. అయితే.. ఈ క్రమంలో బిడ్డర్ల సాంకేతిక పరిశీలిన చాలా ముఖ్యమైన అంశం. కానీ.. రెండు దశల్లో పూర్తి చేసుకోవల్సిన సాంకేతిక పరిశీలనను కేవలం ఒక దశ తర్వాతే బిడ్డర్లకు కాంట్రాక్ట్ అప్పగించనట్లు పలు డాక్యుమెంట్లపై దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు వెల్లడించారు. బిడ్డర్లు మొదటి దశ పరిశీలనలో అర్హత సాధించకపోయినా రెండోదశకు అనుమతించి మరీ కాంట్రాక్టు అప్పగించినట్లు సీబీఐ పేర్కొంది. అదే విధంగా ఆస్పత్రిలో రోగులకు ఇచ్చే మెడిసిన్ నాణ్యత విషయంలో పీజీ ట్రైనింగ్ డాక్టర్లు ఎన్నిసార్లు సందీప్ ఘోస్ దృష్టికి తీసుకువెళ్లినా ఆయన పట్టించుకోలేదని సీబీఐ తెలిపింది. మరోవైపు.. కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్లో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన సమాచారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయటంలో నిర్లక్ష్యం కారణంగా సందీప్ ఘోష్ సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక.. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌తో పాటు సందిప్ ఘోష్‌కు కూడా సీబీఐ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే.చదవండి: కోల్‌కతా కేసు: 25 దాకా ‘ఘోష్’ సీబీఐ కస్టడీ పొడిగింపు -
రైతులను మోసం చేస్తే సహించేది లేదు
సాక్షి, హైదరాబాద్/ జనగామ: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఎవరు మోసం చేసేందుకు ప్రయత్నించినా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లలో విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. జనగామ మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన అంశంపై సీఎం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. వ్యవసాయ మార్కెట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అద నపు కలెక్టర్ రోహిత్ సింగ్‌కు నా అభినందనలు. అధికారులందరూ ధాన్యం కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు. ముగ్గురు ట్రేడర్లపై కేసులు జనగామ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు సిండికేట్ అయి ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తు న్నారంటూ రైతులు బుధవారం ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్.. మార్కెట్ కార్యదర్శి భాస్క ర్ను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరణ తీసుకున్నాక కార్యదర్శిపై చర్యలు చేపడతామన్నారు. మరోవైపు జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ నరేంద్ర ఫిర్యాదు మేరకు ముగ్గురు ట్రేడర్లపై కేసు నమోదు చేసినట్టు సీఐ రఘు పతిరెడ్డి తెలిపారు. ప్రైవేటు మార్కెట్లో ధాన్యానికి రూ.1,800కన్నా ఎక్కువ ధర ఇవ్వాలని అధికారులు ఆదేశించినా.. వ్యాపారులు కేవలం రూ.30 పెంచి కొనుగోలు చేస్తున్నట్టు రైతులు ఆరోపించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గురువారం వ్యవసాయ మార్కెట్లో పర్యటించారు. ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేస్తే ఊరు కునేది లేదన్నారు. -
మహీంద్రాతో ఎంబ్రేయర్ భాగస్వామ్యం
ముంబై: భారత వైమానిక దళం కోసం సీ–390 మిలీనియం మల్టీ మిషన్ రవాణా విమానాల కొనుగోళ్లకు సంబంధించిన మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంటీఏ) ప్రాజెక్ట్ కోసం ఎంబ్రేయర్ డిఫెన్స్, సెక్యూరిటీ తాజాగా మహీంద్రా గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలోని బ్రెజి ల్ దౌత్య కార్యాలయంలో ఈ మేరకు ఒప్పందంపై ఇరు సంస్థలు శుక్రవారం సంతకాలు చేశాయి. ఎంటీఏ ప్రాజెక్టులో భాగంగా తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి దేశీయంగా ఉన్న ఏరోస్పేస్ పరిశ్రమతో ఎంబ్రేయర్, మహీంద్రా సంప్రదింపులు జరుపనుంది. సీ–390 విమానాల విషయంలో భవిష్యత్తు కేంద్రంగా భారత్‌ను మార్చగల సామర్థ్యాన్ని ఇరు సంస్థలు అన్వేషిస్తాయి. ‘సీ–390 మిలీనియం మార్కెట్లో అత్యంత అధునాతన మిలిటరీ ఎయిర్‌లిఫ్టర్. ఈ భాగస్వామ్యం ఐఏఎఫ్ కార్యాచరణ నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలతో సజావుగా సరిపోయే సమర్థవంత పారిశ్రామికీకరణ పరిష్కారాన్ని కూడా అందిస్తుందని నమ్ముతున్నాము’ అని మహీంద్రా ఏరోస్పేస్, డిఫెన్స్ బిజినెస్ ప్రెసిడెంట్ వినోద్ సహాయ్ ఈ సందర్భంగా తెలిపారు. కాగా, మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంటీఏ) కొనుగోలు ప్రాజెక్టులో భాగంగా భారత వైమానిక దళం (ఐఏఎఫ్) 40 నుంచి 80 విమానాలను కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం భారత్‌కు సాంకేతిక బదిలీతోపాటు తయారీ వ్యవస్థ ఏర్పాటు కానుంది. 18 నుంచి 30 టన్నుల వరకు బరువు మోయగల విమానాలను ఐఏఎఫ్ సేకరించనుంది. -
పవన విద్యుత్‌లో అడ్డగోలు ఒప్పందాలు
సాక్షి, అమరావతి : పవన విద్యుత్ కొనుగోళ్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలు ఒప్పందాలు చేసుకుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వద్దని ఆ రంగ నిపుణులు మార్చి 1, 2017న అప్పటి టీడీపీ ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా నివేదించినా పవన విద్యుత్ పీపీఏలకు చంద్రబాబు సర్కారు పచ్చజెండా ఊపేసింది. అది కూడా రెట్టింపు కంటే అధిక ధరకు కొనుగోలు చేసేందుకు. గుజరాత్లో తక్కువకే పవన విద్యుత్ దొరుకుతున్నా ఇలా ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి పీపీఏలు ఎందుకు కుదుర్చుకున్నారు? పోనీ రాష్ట్రంలో ఏమన్నా విద్యుత్ కొరత ఉందా అంటే అప్పటికి ఆ పరిస్థితి కూడా లేదు. కేవలం ముడుపుల కోసమే పవన విద్యుత్ పీపీఏలు కుదుర్చుకున్నారు. అప్పట్లో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఏ మాత్రం పెరగలేదు. పైగా కొరతనేదే లేదు. అయినా అధిక ధర చెల్లించి ప్రైవేట్ పవన విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంకావటవల్ల విద్యుత్ సంస్థలపై పెద్దఎత్తున ఆర్థిక భారం పడింది. ఇలాంటి నష్టదాయకమైన పీపీఏల ఫలితంగా థర్మల్ విద్యుత్ యూనిట్ల ఉత్పత్తి వ్యయంతోపాటు అప్పులు కూడా పెరిగాయి. ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. తక్కువకే దొరుకుతున్నా.. టీడీపీ హయాంలో పవన విద్యుత్ ఏడాదికి 6 వేల మిలియన్ యూనిట్లకు పైగా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. పోటీ పెరగడంతో అన్ని రాష్ట్రాల్లో ఈ పవన విద్యుత్ ధరలు తగ్గుతున్నాయి. దీంతో పొరుగు రాష్ట్రాలు నష్టదాయకమైన పీపీఏలకు దూరంగా ఉంటున్నాయి. చౌకగా లభించే చోటే విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. గుజరాత్లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇఫ్ ఇండియా (సెకీ) ఓపెన్ బిడ్డింగ్‌కి పిలవగా పవన విద్యుత్ యూనిట్ రూ.2.48 చొప్పున 500 మెగావాట్లను సరఫరా చేస్తామని ఉత్పత్తిదారులు ముందుకొచ్చారు. స్ప్రింగ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, కేసీ ఎనర్జీ లిమిటెడ్ రూ.1.43కి సరఫరా చేస్తామన్నాయి. అంటే ఆ రేటుకు కొనుగోలు చేసేందుకు మనకూ అవకాశముంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేసేందుకు పీపీఏలలో సిద్ధపడింది. అంటే ఒక్కో యూనిట్‌కు రూ.3.41 చొప్పున అదనంగా ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ తయారైపోయింది. ప్రైవేటుకు దోచిపెట్టింది రూ.11,375 కోట్లు.. పవన విద్యుత్ పీపీఏలను 25 ఏళ్లకు కుదుర్చుకోవాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను నాటి టీడీపీ ప్రభుత్వం ఆదేశించింది. 11 పీపీఏల ద్వారా మొత్తం 840 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి రంగం సిద్ధమైంది. ఒక్కో మెగావాట్‌కు 2.3 మిలియన్ యూనిట్ల విద్యుత్ వస్తుంది. 810 మెగావాట్లకు 1,232 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు డిస్కంలకు ప్రైవేట్ సంస్థలు అంటగట్టాయి. ఇలా ఒక్కో యూనిట్‌కు అదనంగా రూ.3.41 చెల్లించటం ద్వారా 1,372 మిలియన్ యూనిట్లకు ఏటా రూ.455 కోట్లు అప్పనంగా ప్రైవేటు సంస్థలకు ఇవ్వాల్సి వస్తోంది. 25 ఏళ్లకు చెల్లించే అదనపు వ్యయం రూ.11,375 కోట్లు. ఎలాంటి బిడ్డింగు లేకుండా ప్రైవేటు విద్యుత్ సంస్థలకు ఇంత భారీ మొత్తాన్ని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడడానికి కారణం భారీగా ముడుపులు చేతులు మారడమే. పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై తొలుత అభ్యంతరాలు వ్యక్తంచేసిన రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ ఆ తర్వాత ఆమోదం తెలపడం వెనక కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉంది. విద్యుత్ ఉత్పత్తిదారులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన తర్వాత ప్రైవేట్ పవన విద్యుత్ కొనుగోలుకు ఆమోదం లభించిడం ఈ ఆరోపణలకు ఊతమిస్తోంది. అసలు అదనపు విద్యుత్ అవసరమేలేదు.. రాష్ట్రంలో 2017–18లో 57 వేల మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని అందనా వేస్తే వాస్తవ వినియోగం 52 వేల మిలియన్ యూనిట్లు దాటలేదు. 2018–19 కూడా డిస్కంలు ఇదే స్థాయిలో 61 వేల మిలియన్ యూనిట్లు అవసరం ఉంటుందని అంచనా చేశాయి. అయినప్పటికీ ఈ డిమాండ్‌ను తట్టుకునేందుకు ఏపీ జెన్కో థర్మల్, హైడల్ యూనిట్లు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో రోజుకు సగటున 156 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటే థర్మల్ ద్వారా 98 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి అవకాశం ఉంది. కేంద్రం నుంచి చౌకగా మరో 18 మిలియన్ యూనిట్లు అందుతున్నాయి. జల విద్యుత్ ద్వారా 17 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి అవకాశముంది. వీటి ద్వారా యూనిట్ విద్యుత్ సగటున రూ.3.50లోపే లభిస్తుంది. డిమాండ్ కంటే ఇంకా ఐదు మిలియన్ యూనిట్లు మిగులు ఉండే అవకాశముంది. అలాంటప్పుడు డిమాండ్ లేకుండా పవన విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరంలేదు. ఇదీ రాష్ట్రంలో పవన విద్యుత్ పరిస్థితి.. ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి 10,785.51 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. ఈ మొత్తంలో పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం 4,096.65 మెగావాట్లు. గతేడాది దేశవ్యాప్తంగా 8 శాతం పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే మన రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే.. జాతీయ స్థాయిలో వృద్ధి కంటే 1.8 శాతం ఎక్కువగా ఏపీలో పవన విద్యుత్ ఉత్పత్తి పెరుగుదలను నమోదు చేసుకుంది. ప్రభుత్వ చర్యలకు వాతావరణంలో వస్తున్న మార్పులు తోడవ్వడంతో ఏపీలో పవన విద్యుత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయెరాలజీ (పూణే)కి చెందిన పరిశోధకులు వెల్లడించారు. అంతేకాదు.. రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాలపై గాలి సామర్థ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్టు (సీఎంఐపీ) ప్రయోగాల్లో తేలింది. ఇలాంటి అనుకూల పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని, రానున్నాయని ముందే నిపుణులు చెప్పినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వినకుండా పాతికేళ్లకు పీపీఏలు కుదుర్చుకుంది. -
టమాటల కోసం ఏపీ వైపు కేంద్రం చూపు
ఢిల్లీ: సెంచరీతో మొదలైన ధరల పరుగు.. కిందకు దిగి రావడం లేదు. ఎప్పుడో నెల కిందట.. వారం, పదిరోజుల్లో ధరలు నియంత్రణకు వస్తాయని కేంద్రం ప్రకటించింది. సరిగ్గా అదే సమయంలో భారీ వర్షాలు పెద్ద దెబ్బే వేశాయి. ప్రియమైన టమాటతో పాటు ఇతర కూరగాయల రవాణా నిలిచిపోయి.. ధరల మంట ఇంకా రుగులుతోనే ఉంది. ఈ టైంలో ప్రత్యామ్నాయాల వైపు కేంద్రం అడుగులు వేస్తోంది. టమాట ధరల నియంత్రణలో భాగంగా కేంద్రం ఓ ఆలోచన చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి టమాటాలను సేకరించి.. అధిక ధరల ప్రాంతాలకు సరఫరా చేయాలని నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, నేషనల్ కో ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్లను వినియోగదారుల వ్యవహారాల శాఖ కోరింది. మన దేశంలో ప్రతీ రాష్ట్రంలో టమాట పండిస్తారు. డిసెంబర్-ఫిబ్రవరి టమాటకు మాంచి సీజన్‌కాగా.. జులై-ఆగష్టు, అక్టోబర్-నవంబర్ మధ్య పంట ఉత్పత్తి కాస్త తక్కువే ఉంటుంది. అయితే.. దేశం మొత్తం ఉత్పత్తిలో 60 శాతం దక్షిణ, పశ్చిమ భారతం నుంచే అవుతుంటుంది. ఇక్కడి నుంచే ఇతర రాష్ట్రాలకూ ఒక్కోసారి సరఫరా అవుతుంటుంది కూడా. ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి టమాటలు దేశానికి ఎక్కువగా సరఫరా అవుతున్నాయి. ఢిల్లీ.. సమీప ప్రాంతాలకు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక నుంచి సరఫరా అవుతున్నాయి. ఏపీలో మదనపల్లె మార్కెట్ టమాట ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఉంది. అలాగే ఏపీలో ప్రభుత్వ సబ్సిడీ మీద టమాటలు తక్కువ ధరకే లభిస్తున్నాయి. అంతేకాదు.. బ్లాక్ మార్కెట్‌ను కట్టడి చేయడంలోనూ ఏపీ ప్రభుత్వం విజయవంతమవుతోంది. అధిక ధరలతో పాటు వినియోగదారుల ఉత్పత్తిని సైతం పరిగణనలోకి తీసుకుని.. ఆయా కేంద్రాలకు టమాటాలను తరలించాలని ఆయా ఫెడరేషన్లకు వినియోగదారుల వ్యవహారాల శాఖ సూచించింది. ఇక ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో టమాటా ఉత్పత్తులు చేరుకోవడంతో.. శుక్రవారం నుంచి ధరలు అదుపులోకి రానున్నట్లు కేంద్రం అంచనా వేస్తోంది. -
విక్రయాల కోసం ప్రభుత్వంపై ఆధారపడకండి
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాల కోసం ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ (కొనుగోళ్ల)పై ఆధారపడొద్దని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ సూచించారు. దానికి బదులుగా దేశీ మార్కెట్, ఎగుమతులపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన యూత్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ విషయాలు తెలిపారు. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కొనుగోళ్ల ద్వారా స్టార్టప్‌లకు తోడ్పాటు అందించేందుకు సానుకూలంగా కృషి చేస్తున్నాయని, అనేక సందర్భాల్లో పలు మినహాయింపులు కూడా ఇస్తున్నాయని ఆయన చెప్పారు. అంకుర సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ చక్కని రన్‌వేలాంటిదని కాంత్ వివరించారు. ‘అయితే, అంకుర సంస్థల విషయంలో ప్రభుత్వాలు మరీ ఎక్కువగా జోక్యం చేసుకోవడానికి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం. చురుకైన స్టార్టప్‌లు మార్కెట్‌ప్లేస్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ప్రభుత్వ కొనుగోళ్లపై మరీ ఎక్కువగా ఆధారపడిపోకూడదు‘ అని ఆయన చెప్పారు. ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి స్కీముల ద్వారా స్టార్టప్‌లకు పెట్టుబడులు లభించేలా తోడ్పాటు అందించడానికి మాత్రమే ప్రభుత్వ పాత్ర పరిమితం కావాలని కాంత్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, లింగ అసమానతలను రూపుమాపేందుకు, మహిళల జీవన ప్రమా ణాలు మరింత మెరుగుపడేందుకు పురుషుల దృష్టికోణం మారాలని ఆయన చెప్పారు. సాధారణంగా భారత్, దక్షిణాసియాలో ఆస్తిని కుమార్తెలకు కాకుండా కుమారులకే మార్పిడి చేసే సంస్కృతి ఉందని.. అలా కాకుండా కుమార్తెల పేరిట బదిలీ చేసే సంస్కృతి వస్తే దశాబ్ద కాలంలోనే మహిళలు మరింతగా రాణించడాన్ని చూడగలమని కాంత్ చెప్పారు. -
ఏపీలో మరో కీలక చట్టం
-
మిల్లులపై కొరడా! సీఎంఆర్ అక్రమాలపై సర్కారు నజర్
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడే రైస్‌మిల్లుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లాలోని 8 మిల్లుల్లో ‘కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)’ కోసం కేటాయించిన ధాన్యం మాయమైన విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. కొందరు మిల్లర్ల తీరు వల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తప్పుబట్టే పరిస్థితి తలెత్తుతున్న క్రమంలో కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. సదరు మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టి, వాటి నుంచి మాయమైన రూ.138.50 కోట్ల విలువైన ధాన్యానికి సమానమైన బియ్యాన్ని వెంటనే రికవరీ చేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో గత సీజన్లలో రాష్ట్రవ్యాప్తంగా మిల్లులకు సీఎంఆర్ కోసం కేటాయించిన ధాన్యం, మిల్లింగ్ చేశాక తిరిగి ఇచ్చిన బియ్యం, ఇంకా మిగిలిన ధాన్యం లెక్కలు తీయాలని అధికారులను పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. దీనిపై అప్రమత్తమైన అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులు.. మిల్లుల్లో ధాన్యం లెక్కలు తీసే పనిలో పడ్డారు. భారీగా బియ్యం పెండింగ్.. రాష్ట్రంలో రైతుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా పౌరసరఫరాల శాఖ సేకరిస్తుంది. దాన్ని రైస్‌మిల్లులకు పంపుతుంది. మిల్లర్లు ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి వచి్చన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ప్రతి క్వింటాల్ ధాన్యానికి సుమారు 67 కిలోల బియ్యం వస్తుంది. ఇలా ఇచ్చే బియ్యాన్నే ‘కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)’ అంటారు. మిల్లింగ్ చేసి ఇచి్చనందుకు రైస్‌మిల్లర్లకు నిరీ్ణత మొత్తం చార్జీలను చెల్లిస్తారు. ప్రతి సీజన్లో పౌరసరఫరాల శాఖ మిల్లుల సామర్థ్యం, గతంలో సకాలంలో సీఎంఆర్ ఇచి్చన తీరు వంటి అంశాలను బేరీజు వేసుకుని.. ఆయా మిల్లులకు ధాన్యాన్ని కేటాయిస్తుంది. కానీ గత రెండేళ్లుగా కొందరు మిల్లర్లు తమకు కేటాయించిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండగా.. గత సంవత్సరం (2021–22) వానకాలం సీజన్లో మిల్లులకు పంపిన ధాన్యాన్నే ఇంకా పూర్తిగా కస్టమ్ మిల్లింగ్ చేసి ఇవ్వలేదు. ఆ సీజన్‌కు సంబంధించి ఇంకా 14 లక్షల టన్నులకుపైగా బియ్యం ఎఫ్‌సీఐకి అందాల్సి ఉంది. అంటే లెక్కప్రకారం మిల్లుల్లో 20 లక్షల టన్నులకుపైగా ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్టు. కొన్ని జిల్లాల్లో సగమే సీఎంఆర్.. కామారెడ్డి, పెద్దపల్లి, మెదక్, కరీంనగర్, జగిత్యాల, వనపర్తి, సూర్యాపేట, సిరిసిల్ల, యాదాద్రి, నాగర్‌కర్నూల్, మంచిర్యాల జిల్లాల్లో మిల్లర్లు గతేడాది వానాకాలం సీఎంఆర్‌లో 50శాతం కూడా అప్పగించలేదు. వరిసాగు తక్కువగా ఉండే ఆదిలాబాద్, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో మాత్రమే 100 శాతం, మిగతా జిల్లాల్లో 80శాతం వరకు సీఎంఆర్ పూర్తయింది. ఇక గత యాసంగికి సంబంధించి మిల్లులకు కేటాయించిన 50లక్షల టన్నుల ధాన్యం కస్టమ్ మిల్లింగ్ చాలా జిల్లాల్లో మొదలేకాలేదు. ఈ ధాన్యం నుంచి 17 లక్షల టన్నులమేర పారాబాయిల్డ్ (ఉప్పుడు) పోషక బియ్యంగా మార్చేందుకు అనుమతి లభించినా అంతంత మాత్రంగానే మిల్లింగ్ జరుగుతోంది. మరోవైపు ఈ ఏడాది వానకాలం ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే 20 లక్షల టన్నులకుపైగా ధాన్యం మిల్లులకు చేరింది. మరో 80 లక్షల టన్నులు వచ్చే అవకాశముంది. నాణ్యమైనది అమ్ముకుని..! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉప్పుడు బియ్యం, రారైస్ విషయంలో తలెత్తిన వివాదాలను మిల్లర్లు తమకు అనుకూలంగా మలుచుకొని అక్రమాలకు పాల్పడుతున్నట్టు విమర్శలు ఉన్నాయి. కొందరు మిల్లర్లు సీఎంఆర్ కోసం వచి్చన ధాన్యంలో మేలురకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపణలు చాలాకాలం నుంచి ఉన్నాయి. ఇదే సమయంలో రేషన్ బియ్యాన్ని, పాత ముతక బియ్యాన్ని కొని రిసైక్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి అప్పగించడం పెద్దపల్లి, కరీంనగర్, సూర్యాపేట, సిద్దిపేట వంటి పలుజిల్లాల్లో సాధారణమేనని పౌరసరఫరాల శాఖ అధికారులే చెప్తున్నారు. ఈ ఆరోపణలపై గతంలో పెద్దపల్లి, మంచిర్యాల, నల్లగొండ, కరీంనగర్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో పలుమిల్లులపై ఆంక్షలు విధించినా.. రాష్ట్రస్థాయిలో పైరవీలతో తమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఎఫ్‌సీఐ ఆగ్రహించి సీఎంఆర్ ఆపినా.. మిల్లర్లు ఎఫ్‌సీఐకి అప్పగించే సీఎంఆర్ విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ కేంద్రం కొన్ని నెలల కింద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్‌సీఐ విధించిన నిబంధనలను తుంగలో తొక్కి రీసైక్లింగ్ బియ్యం, పాత బియ్యాన్ని సెంట్రల్‌పూల్ కింద ఎఫ్‌సీఐకి ఇవ్వడాన్ని తప్పుబట్టింది. దీనితోపాటు సకాలంలో సీఎంఆర్ ఇవ్వకపోవడంపై ఆగ్రహిస్తూ.. జూలైలో సీఎంఆర్ బియ్యాన్ని తీసుకోబోమని తేలి్చచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కమలాకర్, అధికారులు పలుమార్లు కేంద్రంతో సంప్రదింపులు జరిపాక.. 45 రోజుల తర్వాత తిరిగి సీఎంఆర్‌కు అనుమతిచ్చింది. అయినా మిల్లర్లు సీఎంఆర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికార వర్గాలు చెప్తున్నాయి. కాగా సూర్యాపేట జిల్లాలో రూ.67 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ ఇవ్వాల్సిన రెండు మిల్లులపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మేలురకం అమ్మేసుకోవడంతోనే! రాష్ట్రంలో పెరిగిన ధాన్యం ఉత్పత్తిని కొందరు మిల్లర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు పౌరసరఫరాల శాఖ గతంలోనే గుర్తించింది. మిల్లులు సీఎంఆర్ కోసం అందిన ధాన్యంలో మేలురకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, నాణ్యమైన బియ్యాన్ని అధిక ధరకు అమ్ముకుంటున్నాయని తేల్చింది. తర్వాత నాసిరకం ధాన్యాన్ని రైతుల నుంచి తక్కువ ధరకు కొని ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. ఇందువల్లే సీఎంఆర్ అప్పగించడంలో జాప్యం జరుగుతోందని అంటున్నాయి. ఈ క్రమంలోనే తనిఖీలు, చర్యలకు ప్రభుత్వం నిర్ణయించిందని వివరిస్తున్నాయి. నాలుగు సార్లు గడువు పెంచినా.. వాస్తవానికి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుకు చేరిన 45 రోజుల్లోనే బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించాలి. గత ఏడాది వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు డిసెంబర్లోనే ముగిశాయి. అంటే ఈఏడాది ఫిబ్రవరి 15లోగా బియ్యాన్ని అప్పగించాలి. కానీ మిల్లులు ఇవ్వలేదు. దీంతో ఎఫ్‌సీఐ మార్చి నెలాఖరు వరకు గడువు ఇచి్చంది. అయినా మిల్లర్లు బియ్యాన్ని సకాలంలో ఇవ్వలేకపోవడంతో తర్వాత జూన్ వరకు, మళ్లీ సెపె్టంబర్ వరకు, చివరికి నవంబర్ 30వ తేదీ వరకు గడువు ఇచి్చంది. అయినా ఇంకా 14 లక్షల టన్నులకుపైగా బియ్యం పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఇదీ చదవండి: పసుపురంగు దేవతావస్త్రం! -
అన్నయోజన కింద బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది
-
రైతులు దర్జాగా ధాన్యం అమ్మకం
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులకు ఇబ్బందులు లేకుండా సర్కారే నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ప్రతిపక్ష పార్టీలు పని గట్టుకుని అసత్య ప్రచారాలు చేసినా లక్షల టన్నుల ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తోంది. కొనుగోలు చేయడమే కాకుండా రైతులకు రావాల్సిన నగదును వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ధాన్యం కొనుగోలులోను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాలోని ఉన్నతాధికారులు కూడా ఎక్కడా చిన్న పొరపాటు కూడా లేకుండా ధాన్యం సేకరణ నిర్వహిస్తున్నారు. నెల్లూరు (సెంట్రల్): జిల్లాలో రబీ సీజన్లో దాదాపుగా 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. తద్వారా 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 4.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. రూ.600 కోట్ల వరకు చెల్లింపులు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 246 ఆర్బీకేల ద్వారా ఇప్పటి వరకు 22,202 మంది రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి మొత్తం 948.87 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే రూ.648 కోట్లను ఆయా రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇంకా ఆర్బీకేల ద్వారా ఇంకా భారీ మొత్తంలో మిల్లులకు ధాన్యం సరఫరా చేశారు. అయితే వీటికి సంబంధించి బ్యాంక్ గ్యారెంటీలు రాకపోవడంతో ట్రక్ షీట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఇంకా ఎక్కువ మొత్తంలో ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారిక ధ్రువీకరణ లభిస్తుంది. ఇటీవల కొనుగోలు చేసి వాటికి మాత్రమే మిగిలిన నగదు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. త్వరలో రైతుల ఖాతాల్లో పడే విధంగా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి ఏటా పెరుగుదల రాష్ట్ర సర్కారు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసే ధాన్యం పరిశీలిస్తే ప్రతి ఏటా అధికంగానే కొనుగోలు చేస్తోంది. 2020లో దాదాపు 3.90 లక్షల మెట్రిక్ టన్నులు, 2021లో 4.40 లక్షల మెట్రిక్ టన్నులు, 2022లో ఇప్పటి వరకు 4.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లకు ఏ రైతులు విక్రయం చేయడానికి వచ్చినా కచ్చితంగా కొనుగోలు చేసే విధంగా అధికారులు గట్టి చర్యలు తీసుకోవడంతో ఎక్కడా ఇబ్బందులు లేకుండా నిర్వహించారు. త్వరలోనే ఇస్తాం జిల్లాలోని ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రావాల్సిన నగదును త్వరితగతిన ఇచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతోంది. చాలా మంది రైతుల ఖాతాల్లో నగదు చేయడం జరిగింది. ఇటీవల కొనుగోలు చేసిన రైతులకు మాత్రమే నగదు ఇవ్వాల్సి ఉంది. త్వరలోనే ఇస్తాం. – పద్మ, పౌరసరఫరా శాఖ సంస్థ జిల్లా మేనేజర్ చదవండి: స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రప్రథమం... భూవివాదాలకు చెక్..! -
ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన
పిఠాపురం: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలపై రైతులకు అవగాహన కల్పించాలని పౌర సరఫరాల కార్పొరేషన్ వీసీ, ఎండీ వీరపాండ్యన్ అన్నారు. మండలంలోని జల్లూరులోని రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. రబీ సీజన్లో ధాన్యం సేకరణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలలో తేమ శా«తం, గోనె సంచుల నిల్వ, రైతుల రిజిస్ట్రేషన్ అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన కనీస మద్దతు ధర లభించేలా అధికారులు చొరవ చూపాలన్నారు. కలెక్టర్ కృత్తికా శుక్లా మాట్లాడుతూ ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ అలేఖ్య, పౌరసరఫరాల జెడ్ఎం మేనేజర్ డి.పుష్పామణి, జియం వి.లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు. అధికారులకు జేడీ సూచనలు జగ్గంపేట: రైతు భరోసా కేంద్రాలలో «ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన కలిగించాలని జిల్లా వ్యవసాయ అధికారి జె.విజయకుమార్ సూచించారు. జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటి కార్యాలయంలో గురువారం జగ్గంపేట వ్యవసాయ సబ్ డివిజన్లోని కిర్లంపూడి, ఏలేశ్వరం, జగ్గంపేట,గండేపల్లి మండలాలల అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా ఏర్పడుతున్న సమస్యలను అధికారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వాటికి విజయ్‌కుమార్ పరిష్కారాలను చూపించారు. ప్రతి రైతు భరోసా కేంద్ర పరిధిలో ఒక కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ గ్రూపు ఏర్పాటు చేయాలని ఏడీ చెప్పారు. ప్రభుత్వం 40శాతం సబ్సిడీపై ఇస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను గ్రూపు ద్వారా కొనుగోలు చేయించి అందుబాటులో ఉంచాలన్నారు. భూమిలేని కౌలు రైతులను గుర్తించి కౌలు కార్డులు ఇప్పించాలన్నారు. పొలంబడులు నిర్వహించాలన్నారు. జగ్గంపేట వ్యవసాయ శాఖ ఏడీ బండారు నాగకుమార్, మండల వ్యవసాయ అధికారి ఇంటిగ్రేటెడ్ అగ్రీ ల్యాబ్ అధికారి కరుణాకర్‌రాజు, జగ్గంపేట మండల వ్యవసాయ అధికారి రెడ్ల శ్రీరామ్, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు,రైతు భరోసా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లకు 12 వేల కోట్ల బ్యాంక్ రుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం బ్యాంకుల నుంచి రూ.12 వేల కోట్ల రుణం తీసుకోనుంది. మరోవైపు 6,983 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా కోతలు మొదలైన జిల్లాల్లో ఇప్పటికే 536 కేంద్రాలను ఏర్పాటు చేసి 1,200 టన్నుల మేర ధాన్యం కొనుగోలు చేసింది. అలాగే ధాన్యం కొనుగోలుకు 15 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవగా ఇప్పటివరకు 1.6 కోట్ల గన్నీ బ్యాగులను సేకరించింది. మరో 6.15 కోట్ల బ్యాగుల కోసం ఆర్డర్ ఇవ్వగా ఇంకో 8 కోట్ల బ్యాగులను టెండర్ ద్వారా సేకరించనుంది. అందుబాటులో రూ. 4,350 కోట్లు .. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైతే రైతులకు చెల్లించేందుకు అవసరమైన నిధులను కూడా పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం ఈ శాఖ దగ్గర రూ. 4,350 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తంతో 22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయవచ్చు. కాగా, కేంద్రం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) చెల్లింపులు ప్రతిరోజు రూ.40 కోట్ల వరకే చేసేలా ఫ్రీజింగ్ పెట్టడంతో రాష్ట్రంలో ధాన్యం సేకరణ పరిస్థితిని వివరించి ఒకేరోజు రూ.1,900 కోట్లు విడుదలయ్యేలా మంత్రి గంగుల కమలాకర్ చర్యలు తీసుకున్నారు. కాగా, వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణకు ధాన్యం రాకుండా నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో 51 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు మంత్రి గంగుల తెలిపారు. -
రేపట్నుంచే కొనుగోళ్లు
సాక్షి , హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినప్పటికీ, రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో యాసంగి ధాన్యం కొనుగోలుకు ముందుకొచ్చారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయన్నారు. శుక్రవారం నుంచి కొనుగోళ్ల ప్రక్రియ మొదలుకాబోతుందని తెలిపారు. యాసంగి కొనుగోళ్లపై బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రి.. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించారు. పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అనంతరం అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, డీఎంలు, డీఎస్ఓలు, పోలీస్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను మొదలుపెట్టాలని ఆదేశించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నెలాఖరుకు కోతలు ముమ్మరం ఇప్పటికే వరి కోతలు ప్రారంభమైన నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట వంటి జిల్లాల్లో అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. ఏప్రిల్ చివరి వరకు కోతలు ముమ్మరమవుతాయని, మే 10వ తేదీ తరువాత అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం చేరుకుంటుందని అన్నారు. 60 రోజుల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తామని, ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమచేయడం జరుగుతుందని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన సొమ్ము రూ.15 వేల కోట్ల వరకు బ్యాంక్ గ్యారంటీ ద్వారా సమకూర్చుకోనున్నట్లు చెప్పారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు.. తెలంగాణ చుట్టూ ఉన్న 4 రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చర్యలకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి కమలాకర్ చెప్పారు. రాష్ట్ర సరిహద్దుల్లో పోలీస్ శాఖ ద్వారా 51 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయశాఖ సాగు లెక్కలు, పంట దిగు బడి అంచనాలకు అనుగుణంగా సాగైన 36 లక్షల ఎకరాల నుంచి 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అంచనా వేసినట్లు చెప్పారు. ఎకరాకు 28 క్వింటాళ్లలోపు ధాన్యం మాత్రమే దిగుబడిగా వ్యవసాయ శాఖ ఇచ్చిన లెక్కల మేరకే కొనుగోళ్లు జరుపుతామన్నారు. కేంద్రంలో అమ్మడం వరకే రైతు బాధ్యత.. రైతు ఆధార్ కార్డుతో లింకైన పట్టాదారు పాస్ పుస్తకం ద్వారానే కొనుగోళ్లు సాగుతాయని, డాష్ బోర్డు విధానంలో ఏరోజుకారోజు ధాన్యం సేకరణ లెక్కలు అందుతాయని గంగుల చెప్పారు. రైతుకు మిల్లర్‌తో ఎలాంటి సంబంధం లేకుండా కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మడం వరకే రైతు బాధ్యతగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కొత్తగా 7.50 కోట్ల గన్నీబ్యాగులు కావాలి.. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే 6 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలకు 15 కోట్ల గన్నీబ్యాగులు అవసరమవుతాయన్నారు. ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ వద్ద 1.60 కోట్ల గన్నీబ్యాగులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న పాత బ్యాగులు పోగా, కొత్తగా 7.50 కోట్లు కావాలని అన్నారు. కేంద్రం పారిపోతే కేసీఆర్ ముందుకొచ్చారు ► కేసీఆర్ మెడలు వంచి ధాన్యం కొనేట్లు చేశా మని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పడం సిగ్గుచేటని గంగుల విమర్శించారు. చేతగాని కేంద్రం తన బాధ్యత నుంచి పారిపోతే, మానవత్వంతో కేసీఆర్ రైతుల కోసం వేల కోట్ల నష్టాన్ని భరించి ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ధాన్యం కొనుగోలు విషయంలో అవగాహన లేకుం డా మాట్లాడుతున్నారని విమర్శించారు. -
కేసీఆర్ దమ్ముంటే.. ఢిల్లీలో కాదు, గల్లీలో తేల్చుకుందాం: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ చీఫ్ మినిస్టర్ కాదని.. ‘చీఫ్ మిస్‌లీడర్’(మొత్తం మభ్యపెట్టి తప్పుదోవ పట్టించే) అని పార్లమెంటరీ, విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనాలన్నారు. పంట చేతికొచ్చినా టీఆర్ఎస్ సర్కార్ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తక్కువ ధరకే దళారులకు అమ్ముకుంటూ మోసపోతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వడ్లు కొనాలని లేదా తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ‘కేసీఆర్ వడ్లు కొను లేదా రాజీనామా చెయ్’నినాదంతో రైతు దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు ముఖ్యఅతిథిగా హాజరైన మురళీధరన్ మాట్లాడారు. ‘కేసీఆర్ అంటే... కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాదు, కరప్షన్ రావు, కమీషన్ రావు. రైతుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే మా పార్టీ ఈ దీక్ష నిర్వ హిస్తోంది. రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రం ఎంతో కృషి చేస్తున్నా.. ధాన్యం కొనేందుకు టీఆర్ఎస్ సర్కార్ ఏ ప్రయత్నం చేయట్లేదు. తెలంగాణ రైతుల కోసం ఏడేళ్లలో కేంద్రం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసింది. మిల్లర్లతో టీఆర్ఎస్ నేతలు ఒప్పం దం కుదుర్చుకుని రైతులను మోసం చేస్తు న్నారు. అసలు కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో చెప్పాలి? ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కమీషన్ రావు వాటిని నెరవేర్చారా? ముఖ్యమంత్రి.. ప్రజలను మిస్లీడ్ చేస్తూ ’చీఫ్ మిస్‌లీడర్’ అయ్యారని ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతోంది’అన్నారు. ఢిల్లీలో కాదు, గల్లీలో తేల్చుకుందాం: బండి ‘వడ్ల కొనుగోలు పేరిట సీఎం ఢిల్లీకి పోయి దొంగ దీక్ష చేస్తున్నడు. ఉద్యమ సమయంలోనూ దొంగ దీక్షలు చేసిన చరిత్ర ఆయనది. కేసీఆర్ దమ్ముంటే.. ఢిల్లీలో కాదు, గల్లీలో తేల్చుకుందాం రా. వడ్లు కొనేదాకా నిన్ను వదిలిపెట్టం.. ఉరికిస్తం. కేంద్రం వడ్లు కొనేందుకు సిద్ధం. సేకరించి ఇచ్చే దమ్ము ఉందో.. లేదో.. కేసీఆర్ చెప్పాలి. పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలను చూసి జనం భగ్గుమంటున్నరు. దీని నుంచి దారి మళ్లించేందుకే ఇలా ఢిల్లీలో డ్రామాలాడుతున్నరు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోందని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇప్పుడెందుకు యాసంగి పంట కొనడం లేదో ప్రజలకు జవాబు చెప్పాలి. మోదీని గద్దె దించేంతటి మొనగాడివా? రాష్ట్ర ప్రజలు నిన్ను గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్నరు. ఢిల్లీలో ఉదయం నుంచి సాయంత్రం దాకా దీక్ష చేస్తానన్న కేసీఆర్.. గంటసేపు కూడా కూర్చోలేకపోయాడు’అని ఎద్దేవా చేశారు. ఈ దీక్షలో ఎంపీలు సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, పార్టీ నేతలు డీకే అరుణ, డాక్టర్ కె.లక్ష్మణ్, నల్లు ఇంద్రసేనారెడ్డి, విజయశాంతి, గరికపాటి మోహన్‌రావు, జి.వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎ. చంద్రశేఖర్, సుద్దాల దేవయ్య, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చాడ సురేశ్‌రెడ్డి, రవీంద్రనాయక్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, సీహెచ్.విఠల్, రాణి రుద్రమదేవి, జె.సంగప్ప, పోరెడ్డి కిశోర్ పాల్గొన్నారు. -
ధాన్యంపై కేంద్రం క్లారిటీ.. ఏం చెప్పిందంటే!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ పట్ల ఎలాంటి వివక్ష చూప డం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పంజాబ్‌లో ధాన్యాన్ని కొనుగోలు చేసిన తరహాలోనే దేశమంతటా ఒకే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపింది. దీనికి సంబంధించి టీఆర్ఎస్ ప్రభు త్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే పేర్కొన్నారు. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనాల్సిందేనంటూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఢిల్లీలో దీక్ష చేపట్టిన నేపథ్యంలో సుధాంశుపాండే మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో డీసెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ విధానం (డీసీపీ)లో బియ్యం సేకరిస్తున్నామని.. పంజాబ్ నుంచి నాన్ డీసీపీ విధానంలో సెంట్రల్ పూల్ ద్వారా బియ్యం సేకరించి ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నామని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ నేటిదాకా ఒకే విధానం అమల్లో ఉందని చెప్పారు. తెలంగాణ అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన బియ్యాన్ని సెంట్రల్ పూల్ కింద ఎఫ్‌సీఐకి అప్పగిస్తోందని గుర్తు చేశారు. ఇన్నాళ్లూ ఏటా యాసంగిలో పండిన పంటను బాయిల్డ్ రైస్‌గా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగిస్తోందన్నారు. అదే పంజాబ్ అయితే ఖరీఫ్ సీజన్లో మాత్రమే వరి పండించి బియ్యాన్ని సెంట్రల్ పూల్ కింద ఎఫ్‌సీఐకి అప్పగిస్తుందని.. రబీలో గోధుమలను పండిస్తోందని వివరించారు. పంజాబ్ నుంచి కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోవడం లేదని.. ఆ రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు ధాన్యం సేకరిస్తోందని తెలిపారు. రాష్ట్రం ఒప్పుకున్నాకే.. తెలంగాణతోపాటు దక్షిణ భారతదేశం నుంచి ఎఫ్‌సీఐ సేకరించే బాయిల్డ్ రైస్‌ను సెంట్రల్ పూల్ కింద కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు పంపిస్తామని సుధాంశు పాండే తెలిపారు. తెలంగాణ కూడా పశ్చిమ బెంగాల్, బిహార్‌లకు బాయిల్డ్ రైస్‌ను పంపుతుందన్నారు. తెలంగాణలో బాయిల్డ్ రైస్ వినియోగం లేనందున మొత్తం బియ్యాన్ని ఎఫ్‌సీఐకే పంపిస్తూ వస్తోందన్నారు. దేశంలో ప్రస్తుతం నాలుగేళ్లకు సరిపడా బాయిల్డ్ రైస్ నిల్వలు ఉన్నందున తెలంగాణ నుంచి రా రైస్ మాత్రమే సేకరిస్తామని ముందే చెప్పామని.. రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంగీకరించి ఒప్పందంపై సంతకం కూడా చేసిందని వివరించారు. అంతేగాకుండా 2021–22 యాసంగి ధాన్యం సేకరణ ప్రతిపాదనను తెలంగాణ పంపలేదని చెప్పారు. -
24 గంటల్లో తేల్చాలి.. లేదంటే.. : సీఎం కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: ‘హిట్లర్, నెపోలియన్, ముస్సోలినీ వంటి ఎందరో నియంతలు మట్టిలో కలిశారు..మీరెంత?’ అంటూ కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. నూకలు తినండి... పనీ పాటా లేదా అని మంత్రులతో ఎలా వ్యాఖ్యానిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద మాటలు చెప్పే ప్రధాని, కేంద్ర ప్రభుత్వానికి చిన్న రాష్ట్రమైన తెలంగాణలో పండే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు డబ్బులు లేవా..? లేక నరేంద్రమోదీకి కొనాలన్న మనసు లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఓట్లు, సీట్లు కావాలి కానీ ధాన్యం వద్దా అంటూ మండిపడ్డారు. కేంద్రంతో పోరు మొదలైందని, అంతిమ విజయం సాధించే వరకు ఈ పోరు ఆగదని చెప్పారు. వీలైనంత త్వరగా రైతుల శ్రేయస్సు కోరే రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రుల మద్దతు కూడగట్టి దేశంలో తాము సృష్టించే భూకంపానికి పీయూష్ ‘గోల్మాల్’పరిగెత్తుతూ కనిపించడం తథ్యమని అన్నారు. దేశంలో జరుగబోయే రైతుల మహా సంగ్రామానికి తెలంగాణ ప్రజలు, రైతులు పూర్తి మద్దతు ఇస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలుపై ఢిల్లీ తెలంగాణ భవన్ వేదికగా సోమవారం జరిగిన ప్రజా ప్రతినిధుల నిరసన దీక్షలో కేసీఆర్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. హృదయంలో రగులుతున్న అగ్నిజ్వాల యావత్ దేశ ప్రజల హృదయాల్లో రగులుతున్న అగ్ని జ్వాల మా హృదయంలోనూ రగులుతోంది. ఈ అగ్నిజ్వాల వ్యాపించి బీజేపీని నాశనం చేసేవరకు వదలదు. ధాన్యం కొనుగోలు విషయమై వారాల పాటు కేంద్రమంత్రుల కార్యాలయాల చుట్టూ తిరిగిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలను గంటలపాటు ఎదురుచూసేలా చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం నడిపించే విధానమా? కేంద్రం కుట్రలు ఇకపై సాగవు తెలంగాణ ప్రభుత్వం రైతులను గంగలో ముంచేంత బలహీనమైనది కాదు. మా ప్రాణాలు పోయినా రైతులకు నష్టం రానీయబోం. వారిని కాపాడుకుంటాం. కానీ కేంద్రంలోని బీజేపీ.. రైతులతో ఏవిధంగా వ్యవహరిస్తోందన్నది దేశం మొత్తానికి తెలియాలి. ధాన్యం విషయంలో అన్యాయాన్ని ప్రశ్నిస్తూ గొంతెత్తితే, కుట్రపూరితంగా బీజేపీ నేతలతో హైదరాబాద్‌లో ధర్నా చేయించడం సిగ్గు చేటు. ఇలాంటి కుట్రలు దేశంలో ఇకపై సాగబోవు. ప్రశ్నిస్తే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులేనా..? దేశంలో వ్యవసాయాన్ని కార్పొరేట్ రంగానికి అప్పగించి, రైతులను కూలీలుగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారి ని అవమానిస్తున్నారు. విపక్ష నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారు. బీజేపీలోని నాయకులందరూ సత్యహరిశ్చంద్రులేనా? బీజేపీలో ఒక్క నాయకుడు కూడా అవినీతిపరుడు లేడా? బీజేపీ నాయకులపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరగవు? ఎవరైతే కేంద్రాన్ని ప్రశ్నిస్తారో, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని జైలుకు పంపిస్తామంటూ మాట్లాడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి ముఖ్యమంత్రిని జైలుకి పంపిస్తామంటూ రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. దమ్ముంటే రండి... ఎవరు ఎవరిని పంపిస్తారో చూద్దాం. రాష్ట్రపతి ఎన్నికలపై విపక్షాలతో చర్చిస్తా.. దేశం మొత్తం మీ వైఖరి అర్థమైపోయింది. ఇక దేశం నోర్మూసుకొని కూర్చొనే పరిస్థితి లేదు. తెలంగాణలో ఇప్పటికే చాలా చేశాం.. ఇప్పుడు దేశం కోసం చేయనున్నాం. రాష్ట్రపతి ఎన్నికల గురించి విపక్ష మిత్రులతో కలిసి చర్చించేందుకు త్వరలో మళ్ళీ ఢిల్లీ వస్తా. అప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి వారితో మాట్లాడతా. ఆఖరి రక్తపు బొట్టు వరకు పోరాటం కేంద్ర విధానాల విషయంలో అన్ని పార్టీలను ఏకం చేసి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు రైతులకు రాజ్యాంగబద్ధ రక్షణ కోసం ఆఖరి రక్తపు బొట్టు వరకు పోరాటం కొనసాగుతుంది. దేశంలో రాకేశ్ టికాయత్ చేయబోయే మరో పోరుకు మద్దతిస్తున్నాం. తెలంగాణ రైతులు ఏం పాపం చేశారు? రైతులు కన్నీళ్ళు పెట్టుకొనేలా చేసిన ప్రభుత్వం తప్పనిసరిగా కూలిపోతుంది. గద్దె దించే సత్తా రైతులకు ఉంది. ఇది దేశ రైతుల శక్తి. ప్రపంచంలో ఎక్కడా జరగనట్లుగా 13 నెలలపాటు జరిగిన రైతు ఉద్యమం కారణంగా ప్రధాని రైతులకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ప్రధాని క్షమాపణ కోరుతుంటారు. భవిష్యత్తులోనూ కోరతారు. గుజరాత్ రైతులు రోడ్డున పడ్డారు దేశం మొత్తం గందరగోళంలో ఉంది. దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం ఉంది. గుజరాత్ రాష్ట్ర రైతులు కరెంటు కోసం డిమాండ్ చేస్తూ రోడ్డున పడ్డారు, కేవలం తెలంగాణలో మాత్రమే అన్ని వర్గాల ప్రజ లకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందుతోందని గర్వంగా చెప్తున్నా. కొత్త సాగు విధానం తేవాలి... దేశ రైతులు భిక్షగాళ్లు కాదు. హక్కులు కోరుతున్నారు. దేశంలో కొత్త వ్యవసాయ విధానం రూపొందించకుంటే అధికారం నుంచి దింపడం ఖాయం. తెలంగాణ ప్రజలు పోరుకు బయలుదేరితే విజయం సాధించే వరకు ఆగే ప్రసక్తే లేదు. రైతుల్ని రెచ్చగొట్టిన బీజేపీ నేతలు రాష్ట్రంలో పంటమార్పిడి చేయమని కేంద్రం చెబితే, రాష్ట్రంలో ప్రతి రైతుకూ పంట మార్చాలని చెప్పాం. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలు వరి వేయాలని, ప్రతి గింజా కేంద్రం కొంటుందంటూ రైతులను రెచ్చగొట్టారు. -
యాసంగి ధాన్యమే ఎజెండా!
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. ధాన్యం కొనుగోలుపై 24 గంటల్లో స్పందించాలని ఢిల్లీలో దీక్ష సందర్భంగా కేంద్రానికి గడువు విధించిన కేసీఆర్.. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో ఈ భేటీ జరుగుతుంది. ఢిల్లీలో దీక్ష సందర్భంగా.. కేంద్రం కొనుగోలు చేయకున్నా తెలంగాణ పేదరికంలో లేదని ప్రకటించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేస్తుందనే సంకేతాలు సీఎం ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే కేబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే అంశమే ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశముంది. యాసంగిలో వరిసాగు విస్తీర్ణం, విత్తనాలు, వ్యక్తిగత అవసరాలు, మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యం తదితరాలను మినహాయిస్తే ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన ధాన్యం ఎంత ఉంటుంది? తదితర అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. యాసంగిలో 36 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగ్గా, 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశముందని ఇప్పటికే అంచనా వేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రమే కొనుగోలు చేస్తే ఎంత మేర ఆర్థిక భారం పడుతుందో చర్చించనున్నారు. 15 తర్వాత పార్టీ విస్తృత స్థాయి భేటీ కేంద్రంపై పోరులో అనుసరించాల్సిన ఉద్యమ కార్యాచరణపైనా మంత్రివర్గ భేటీలో చర్చించే అవకాశముంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూనే కేంద్రం వైఖరిని రైతుల్లోకి బలంగా తీసుకెళ్లే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ఈ నెల 15 తర్వాత మళ్లీ పార్టీ విస్తృత స్థాయి భేటీ నిర్వహించి ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశముంది. నెలాఖరులో ఢిల్లీలో కీలక సమావేశం: ఈ నెలాఖరులో ఢిల్లీలో బీజేపీయేతర పార్టీల సీఎంలు, ఇతర నేతలతో సమావేశం నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ భేటీ తర్వాత మే మొదటి వారంలో మహబూబ్‌నగర్ లేదా కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ సభకు రైతు నేత రాకేశ్ టికాయత్ సహా ఇతర రాష్ట్రాల సీఎంలు ఒకరిద్దరు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ధాన్యం దుడ్లు... భరించేదెట్టా..? యాసంగి ధాన్యం కొనుగోళ్లపై నేటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి సారించింది. యాసంగి దిగుబడుల అంచనా ప్రకారం.. ధాన్యం కొనుగోలుకు ఏ మేరకు నిధులు అవసరమవుతాయో అంచనా వేసింది. ధాన్యాన్ని పచ్చి బియ్యంగా మార్చి కేంద్రానికి ఇచ్చాక.. మిగిలే ఉప్పుడు బియ్యంతో రూ. 3 వేల కోట్లకుపైగా రాష్ట్రంపై భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో «ధాన్యం కొనుగోలుకు అవసరమయ్యే నిధులు సమకూర్చుకోవడంతోపాటు ఖజానాపై పడే అదనపు భారం రూ. 3 వేల కోట్లను సర్దుబాటు చేసే అంశంపైనా ప్రణాళిక ప్రకారం ముందుకెళుతున్నామని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయని, కొనుగోలు కేంద్రాలు, ఇతర వసతులు సమకూర్చుకోవాల్సి ఉందన్నారు. -
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్.. కేంద్రంపై పోరుకు దిగారు. తెలంగాణ, దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘దేశమంతా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉంది. ధాన్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు. ఎంత అవసరమో అంతే తీసుకుంటాం.. ఎవరిపైనా వివక్ష లేదు. తెలంగాణలో గత ఐదేళ్లలో 7 రెట్ల ధాన్యం సేకరణ చేశాం. ధాన్యం సేకరణ, సంచుల అవసరంపై తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు. పంజాబ్ నుంచి పారా బాయిల్డ్ రైస్ తీసుకోలేదు’’ అని వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగానే ధాన్యం సేకరణలో వివాదం ఏమీ లేదని ఎఫ్‌సీఐ రిజనల్ మేనేజర్ దీపక్ శర్మ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పారా బాయిల్డ్ రైస్‌కి డిమాండ్ లేదన్నారు. రా రైస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం ఉత్పత్తి ఎంత అవుతుంది.? ఎంతమేర ఇస్తారనేది స్పష్టంగా చెప్పలేదన్నారు. ఈ క్రమంలోనే రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటాని క్లారిటీ ఇచ్చారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.. దేశంలో తొలిసారి
టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందున్న తెలంగాణ సర్కారు మరో అడుగు ముందుకు వేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పట్టణాలకే పరిమితం చేయకుండా పంట పొలాల్లోని ఉత్పత్తులకు ఉపయోగపడేలా కొత్త విధానం అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ప్రవేశపెట్టాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు నగరానికి చెందిన నెబ్యూలా అనే సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా పారదర్శకంగా చేపట్టేందుకు వీలుగా ఏఐని ఉపయోగించనున్నారు. ధాన్యాన్ని నలిపేసి ప్రస్తుతం ధాన్యం కొనుగోలు వ్యవహారం అంతా మాన్యువల్ పద్దతిలోనే జరుగుతుంది. కొనుగోలు అధికారులు మార్కెట్లో రైతుల పండించిన ధాన్యాన్ని చేతిలో తీసుకుని నలపడం ద్వారా అందులో తేమ ఎంత ఉంది. చిన్న సైజువా పెద్ద సైజువా ఇలా అనేక అంశాలను బేరీజు వేసి తుది నిర్ణయానికి వస్తున్నారు. వారు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని అనుసరించి ధాన్యానికి రేటు నిర్థారణ జరుగుతుంది. అయితే ఈ విధానంలో పారదర్శకత లేదనే విమర్శలతో పాటు వేగం కూడా తక్కువగా ఉంది. ఏఐ సాయంతో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఏఐ విధానంలో శాంపిల్ ధాన్యాన్ని ట్రేలో పోసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మెషిన్ ఆ ధాన్యాన్ని పరిశీలిస్తూ 360 డిగ్రీస్‌లో ఫోటోలు తీస్తుంది. అనంతరం ఆ సమాచారన్ని విశ్లేషించి. సదరు ధాన్యంలో ఎంత మోతాదు తేమ ఉంది. పరిణామం, వ్యాకోచం వంటి వివరాలతో పాటు ఆ పంట ఆర్గానిక్ లేదా రసాయనాలు ఉపయోగించి పండించినదా అనే వివరాలను క్షణాల్లో తెలియజేస్తుంది. ఈ విధానంలో వేగం పెరగడంతో పాటు పారదర్శకత కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ముందుగా ఇక్కడే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏఐ వినియోగాన్ని పైలట్ ప్రాజెక్టుగా మూడు కేంద్రాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే నారాయణపేట, కామరెడ్డిలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎంపిక కాగా మరొకదాన్ని ఫైనల్ చేయాల్సి ఉంది. ఈ కొనుగోలు కేంద్రాల్లో కంది, శనగ, వరి ధాన్యాల కొనుగోలు సందర్భంగా ఏఐని వినియోగించాలని నిర్ణయించారు. మిగిలిన వాటికి పైలట్ ప్రాజెక్టు ఫలితాలు సానుకూలంగా వస్తే భవిష్యత్తులో రాష్ట్రంలో ఉన్న అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగించాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. కేవలం ధాన్యం కొనుగోలుకే కాకుండా పండ్లు ఇతర పంట ఉత్పత్తుల కొనుగోలు లోనూ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వినియోగం పెంచాలనే యోచనలో ఉంది. చదవండి: ప్రపంచపు తొలి డ్యూయల్ మోడ్ వాహనం -
వేగంగా వరి కొను‘గోల్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం పంట కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా సాగుతోంది. అన్ని జిల్లాల్లో కలిపి 10.55 లక్షల మంది రైతుల నుంచి ఇప్పటివరకు సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాలశాఖ సేకరించింది. ఇప్పటికే ఏడు జిల్లాల్లో ధాన్యం సేకరణ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 6,950 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి 6,862 కేంద్రాలను తెరిచారు. వాటిలో కొనుగోళ్లు పూర్తయిన 3,382 కేంద్రాలను శుక్రవారం నాటికి మూసివేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,252 కొనుగోలు కేంద్రాలు మాత్రమే నడుస్తున్నాయి. చాలా జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తి.. కోతలు ముందుగా ప్రారంభమైన ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ దాదాపుగా ముగిసింది. ఆలస్యంగా కోతలు జరిగిన సిరిసిల్ల, నిర్మల్ జిల్లాలలోని పదేసి గ్రామాల్లో రైతుల కోరిక మేరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తున్నప్పటికీ త్వరలోనే మూసివేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట, మంచిర్యాల, వరంగల్, జనగాం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, మహబూబ్‌నగర్, మేడ్చల్ జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయిన గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. ప్రైవేటుగానూ అమ్మకాలు.. రాష్ట్రంలో ఈ వానాకాలంలో 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికార యంత్రాంగం అంచనా వేసింది. వ్యక్తిగత అవసరాలు, మిల్లర్లు కొనుగోళ్లు, విత్తనాల ధాన్యం పోగా 1.04 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అనుకున్నారు. అయితే అక్టోబర్ రెండో వారంలో మొదలు కావలసిన వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ఆ నెలాఖరుకు మొదలయ్యాయి. చాలా జిల్లాల్లో నవంబర్ నెలాఖరు వరకు కూడా కొనుగోళ్లు మొదలు కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వడ్ల కొనుగోళ్లపై టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య రాజకీయ దుమారం చెలరేగింది. ఈ పరిస్థితుల్లో ధాన్యం విక్రయించేందుకు రోజుల తరబడి వేచి చూడలేని రైతులు మిల్లర్లకు, ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే ధాన్యాన్ని విక్రయించారు. ఇప్పటికీ వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో నేరుగా మిల్లర్లకే ధాన్యం విక్రయిస్తున్న ఉదంతాలు ఉన్నాయి. దీంతో కోటి మెట్రిక్ టన్నులకుపైగా కొనుగోలు కేంద్రాలకు వస్తుందనుకున్న ధాన్యం ఇప్పటివరకు 60 ఎల్ఎంటీ వరకే వచ్చింది. ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నుంచి ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి అదనంగా మరో 30 లక్షల వరకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి గింజ వరకు సేకరిస్తాం తెలంగాణ రైతాంగంపై కక్ష కట్టిన కేంద్రం యాసంగి పంటను తీసుకోబోమని చెప్పడంతోపాటు వానాకాలం పంటను ఎంత సేకరిస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వరకే సేకరిస్తామని గతంలో పేర్కొనగా ఇప్పటికే ఆ లక్ష్యం దాటింది. ఏడు జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి. మిగతా జిల్లాల నుంచి ఇంకా 30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు వస్తుందని భావిస్తున్నాం. ఎంత ధాన్యం వచ్చినా ఈ వానాకాలం పంటను చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. – మంత్రి గంగుల కమలాకర్ -
పాలమూరు ధాన్యం.. పక్క రాష్ట్రాల్లో విక్రయం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎప్పుడైనా కర్ణాటక నుంచే రైతులు తాము పండించిన ధాన్యాన్ని పాలమూరుకు తీసుకొచ్చి విక్రయించే వారు. ఇది గతేడాది వానాకాలం, ఎండాకాలం సీజన్లలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారా యణపేట, జోగుళాంబ గద్వాలలో స్పష్టమైంది. ఇక్కడ స్థానికంగా ఉంటున్న వారి బంధువులు, స్నేహితుల పేర్లతో అమ్మేవారు. సరిహద్దులో ఉండటం.. అక్కడి కంటే ఇక్కడే మద్దతు ధర ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. అయితే ఈ సారి సీన్ రివర్స్ అయింది. ఉమ్మడి మహబూబ్ నగర్లో పలు ప్రాంతాల్లో ఖరీఫ్‌లో పండించిన ధాన్యం సరిహద్దులు దాటి కర్ణాటకకు తరలు తోంది. పంట చేతికొచ్చినా సకాలంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం.. చేసినా కొర్రీలు, కోతలు భరించలేక జిల్లా రైతులు ఆ రాష్ట్రంలోని రాయచూర్‌కు తీసుకెళ్లి విక్రయిస్తు న్నారు. తెలంగాణలో ప్రభుత్వ మద్దతు ధర కంటే అటుఇటుగా రూ.200 తగ్గినా.. అక్కడే అమ్ముకు నేందుకు మొగ్గుచూపుతున్నారు. పూర్తిగా అందుబాటులోకి రాని కేంద్రాలు.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారా యణపేట జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 7,10,993 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. దీనికను గుణంగా 822 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టు కోగా.. ఇప్పటివరకు 442 కేంద్రాలే అందుబాటు లోకి వచ్చాయి. పలు ప్రాంతాల్లో పంట చేతి కొచ్చినా కేంద్రాలు ప్రారంభం కాక.. ప్రారంభిం చినా కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు వాహనాలు లేక, గన్నీ బ్యాగులు, హమాలీల కొర తతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దాదా పుగా అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. కల్లాల్లో ఆర బోసిన తర్వాత నిల్వ చేసే అవకాశం లేక.. తుపాన్ సూచనలతో జిల్లా రైతులు దళారులను ఆశ్రయిస్తు న్నారు. ఈ క్రమంలో రాష్ట్ర సరిహద్దు నారాయణ పేట జిల్లాలోని కృష్ణ, మాగనూర్, జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు, ధరూర్, కేటీదొడ్డి మండ లాలకు చెందిన అన్నదాతలు కర్ణాటకలోని రాయ చూర్‌కు ధాన్యాన్ని తరలించి విక్రయిస్తున్నారు. అక్కడ క్వింటాల్‌కు రూ.1,740 నుంచి రూ.1,800 వరకు ధర చెల్లిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. వనపర్తి, నాగర్‌కర్నూల్‌లో దళారుల దోపిడీ.. ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకున్న దళారులు దోపిడీకి తెగబడినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతుల శ్రమను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ రకం క్వింటాల్‌కు రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 కాగా.. దళారులు రూ.1,050 నుంచి రూ.1,400 లోపే కొనుగోలు చేస్తున్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టిన కల్లాల వద్దకే వెళ్లి మాయమాటలతో వారిని మోసం చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని సేకరించిన తర్వాత వారు లారీల్లో రాయచూర్‌కు తరలించి విక్రయిస్తు న్నట్లు సమాచారం. కొందరు బడా ప్రైవేట్ వ్యాపారులు మాత్రం తాము కొన్న ధాన్యాన్ని నిల్వ చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో అందు బాటులోకి వచ్చి.. క్రయవిక్రయాలు ముమ్మరమైన తర్వాత వాటిని ప్రభుత్వ ధరకు అమ్మి సొమ్ముచేసుకునేలా వారు ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. రాయచూర్‌లో రూ.1,740 ధర వచ్చింది నేను 35 ఎకరాల్లో వరి సాగు చేశా. 10 ఎకరాలు కోసి వారం రోజులైంది. 2రోజుల్లో మిగతా పొలం కోస్తా. కొనుగోలు కేం ద్రా ల్లో ఇంకా ధాన్యం కొంట లేరు. మంగళ వారం మండలానికి 7,500 గన్నీ బ్యాగులు వస్తే బడాబాబులు ఇద్దరికే ఇచ్చారు. మరో పక్క కొనుగోలు కేంద్రంలో 40 కేజీల బ్యాగుకు 3 నుంచి 6 కిలోల తరుగు తీస్తరు. దీంతో రాయచూరు మార్కెట్లో విక్రయించాం. క్వింటాల్‌కు రూ.1,740 ధర పలికింది. ఇక్కడి కంటే రూ.200 ధర తగ్గినా ట్రాన్స్‌పోర్టు, హమాలీలు అనే అవస్థ లేదు.– సంతోష్, రైతు, గూడెబల్లూర్, కృష్ణ, నారాయణపేట పరిస్థితి వేరేలా ఉండటంతో.. నేను వానాకాలంలో ఎకరంన్నర సాగు చేస్తే 32 బస్తాల ధాన్యం వచ్చింది. కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. నిల్వ చేసుకునే సౌకర్యం లేదు. మరోపక్క నాయకులు ఖరీఫ్‌ను పక్కనబెట్టి యాసంగి గురించే మాట్లాడు తున్నారు. దీంతో కర్ణాటకలోని రాయ చూరు మార్కెట్‌కు వడ్లను తరలించి అమ్ము కున్నాం. క్వింటాల్‌కు రూ.1,870 ధర వచ్చింది. – మహదేవ్, గట్టు, జోగుళాంబ గద్వాల -
ప్రతీ గింజనూ కేంద్రం కొనాల్సిందే: మంత్రి గంగుల
కరీంనగర్: తెలంగాణ రైతులపై వివక్ష చూపకండని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ కేంద్రాన్ని కోరారు. ఇటీవల కేటీఆర్‌తో పాటు తాను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి పంట కొనుగోలు విషయాన్ని సామాజిక కోణంలో చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాల్లో అవసరానికి సరిపడా బియ్యం ఉంచుకొని మిగులు బియ్యం ఎఫ్‌సీఐకి పంపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎంఓయూ జరిగిందని గుర్తు చేశారు. కావున ఇదివరకే 19/20 యాసంగిలో 64 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 20/21లో లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొన్నామని , దాంతో 62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వచ్చిందన్నారు. ఇప్పుడు ఆ బియాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని అడిగితే అవి బాయిల్డ్ రైస్ అని అందులో కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులే తీసుకుంటామని తెలిపడం సమంజసం కాదన్నారు. మిగతా 37 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరూ కొంటారని కేంద్రమే చెప్పాలని ఆవేదని వ్యక్తం చేశారు. బాయిల్డ్ రైస్ తీసుకోకపోతే రైస్ మిల్లులో పేరుకుపోయి కొత్త ధాన్యం ఎక్కడ పెట్టాలని కనుక ఈ అంశంపై బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. ప్రతీ గింజనూ కేంద్రం తప్పకుండా కొనాలని, లేకపోతే నిలదీస్తామన్నారు. పంజాబ్‌లో బాయిల్డ్ రైస్ మొత్తం కొన్న కేంద్రం, తెలంగాణలో మాత్రం ఎందుకు కొనడంలేదని ప్రశ్నించారు. ఇలాంటి సంక్షోభం గతంలో కూడా వస్తే వాజ్‌పేయి ప్రభుత్వం పూర్తిగా ఏడు కోట్ల టన్నులు కొనుగోలు చేసిందని, ఇప్పుడు కూడా మోదీ ప్రభుత్వం పూర్తిగా బియ్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ అంటే వివక్ష ఉండకూడదని, రాష్ట్ర రైతాంగం భవిష్యత్తును నాశనం చేయొద్దని ఆయన కోరారు. చదవండి: రజనీకాంత్ స్టైల్లో డ్యాన్స్ చేసి అదరగొట్టిన మంత్రి హరీశ్‌రావు