న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ఆన్‌లైన్ షాపింగ్ పెద్ద ఎత్తున అధికమైంది. ప్రధానంగా పండుగల సీజన్‌లో గణనీయంగా పెరిగింది. సైబర్ నేరస్తులు ఈ ట్రెండ్‌ను క్యాష్ చేసుకుంటున్నారని సెక్యూరిటీ సొల్యూషన్స్ కంపెనీ మెకాఫీ మంగళవారం వెల్లడించింది. మెకాఫీ అడ్వాన్స్‌డ్ థ్రెట్ రిసర్చ్ టీమ్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో ప్రతి నిముషానికి 419 సైబర్ నేరాలు నమోదయ్యాయి. జనవరి–మార్చితో పోలిస్తే ఇది 12 శాతం అధికం. స్పామ్ మెయిల్స్ ఓపెన్ చేయడంతో కస్టమర్లు సైబర్ నేరస్తుల ఉచ్చులో పడుతున్నారు. నేరస్తుల చేతుల్లోకి కస్టమర్ల వ్యక్తిగత సమాచారం చేరుతోంది. ఆన్‌లైన్ కోనుగోలుదారుల్లో 27.5 శాతం మంది మాత్రమే సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను వినియోగిస్తున్నారు. ఇది సైబర్ నేరస్తులకు వరంగా మారుతోందని మెకాఫీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వెంకట్ కృష్ణపూర్ తెలిపారు. ఆన్‌లైన్ ముప్పుపట్ల కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని ఆయన అంటున్నారు. చదవండి: లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఆర్‌బీఐ కీలక ప్రతిపాదన
Comments
Please login to add a commentAdd a comment