Online Shopping Cyber Crime: బంపరాఫర్.. ఆ తర్వాత ఫోన్‌ స్విచ్‌ ఆఫ్ - Sakshi
Sakshi News home page

బంపరాఫర్.. ఆ తర్వాత ఫోన్‌ స్విచ్‌ ఆఫ్

Published Tue, Feb 16 2021 10:36 AM | Last Updated on Tue, Feb 16 2021 1:24 PM

Fraud In The Name Of Online Shopping - Sakshi

గత నెల 12వ తేదీన ఆన్‌లైన్‌ షాపింగ్‌ కంపెనీ నుంచి ఓ పోస్టల్‌ కవర్‌ వచ్చింది. అందులో ఉన్న హెల్ప్‌లైన్‌ నంబర్‌ 7477752653కు ఫోన్‌ చేయగా ‘మీ పేరు మీద 7 లక్షల నగదు బంపర్‌ ఆఫర్‌ తగిలింది’ అని నమ్మించారు.

అవుకు(కర్నూలు జిల్లా): సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌ షాపింగ్‌ వినియోగదారులను టార్గెట్‌ చేసి దోచుకుంటున్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఎక్కువగా చేసే వారిలో అమాయకులను ఎంచుకుని బురిడీ కొట్టిస్తున్నారు. అవుకు మండలంలో ఓ వ్యక్తిని ఇలాగే మోసం చేయగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగంపేట గ్రామానికి చెందిన చింతా కోటేశ్వరరావుకు గత నెల 12వ తేదీన ఆన్‌లైన్‌ షాపింగ్‌ కంపెనీ నుంచి ఓ పోస్టల్‌ కవర్‌ వచ్చింది. అందులో ఉన్న హెల్ప్‌లైన్‌ నంబర్‌ 7477752653కు ఫోన్‌ చేయగా ‘మీ పేరు మీద 7 లక్షల నగదు బంపర్‌ ఆఫర్‌ తగిలింది’ అని నమ్మించారు.

ముందుగా ఇన్‌కంటాక్స్, జీఎస్టీ, నిఫ్ట్‌ చార్జెస్‌ కింద నగదును ఎస్‌బీఐ: 39797916748 అకౌంట్‌కు జమ చేయాలని చెప్పారు. నిజమేనని నమ్మిన బాధితుడు గత నెల 18, 19, 21, 25 తేదీల్లో ఐదు విడతలుగా రూ.1,41,500 నేరగాళ్ల ఖాతాలో జమ చేశాడు. ఆ మరుసటి రోజు నుంచి సైబర్‌ నేరగాళ్ల ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ కావడంతో బాధితుడు అయోమయంలో పడ్డాడు. వారి నుంచి ఏమైనా సమాచారం వస్తుందని 20 రోజులుగా వేచి చూసినా ఫలితం లేకపోవడంతో సోమవారం అవుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
(చదవండి: విషాదం: దోశ పిండి నీలాగే ఉందనడంతో)
ఊర్మిళ జీవితంలో ‘గుడ్‌ మార్నింగ్‌’ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement