రైలుకింద పడి ప్రేమజంట ఆత్మహత్య | Lovers Commits Suicide In Kurnool District On Railway Track, More Details Inside | Sakshi
Sakshi News home page

రైలుకింద పడి ప్రేమజంట ఆత్మహత్య

Aug 29 2024 12:05 PM | Updated on Aug 29 2024 12:49 PM

Lovers Suicide In Kurnool District

పెద్దలను ఒప్పించే ధైర్యం లేక బలవన్మరణం

 కర్నూలు జిల్లాలో విషాదం

మద్దికెర: ప్రేమించుకుని, కలిసి జీవించాలనుకున్న ఓ జంట... ఇంట్లో పెద్దలను ఒప్పించే ధైర్యం లేక రైలు కిందపడి అర్ధాంతరంగా తనువు చాలించిన ఘటన కర్నూలు జిల్లా, మద్దికెర రైల్వేస్టేషన్‌ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలివీ.. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రతాప్‌సింగ్, ఉమ 20 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా గుంతకల్లుకు చేరుకొని పానీపూరి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె. కుమార్తె మీనూ(18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రతాప్‌సింగ్‌ మధ్యప్రదేశ్‌కే చెందిన కుల్‌దీప్‌ పరిహార్‌ (23) అనే యువకుడిని పనిలో పెట్టుకున్నాడు. 

మీనూ, పరిహార్‌ ఇద్దరూ ప్రేమించుకోవడం, విషయం ఇంట్లో తెలియడంతో పరిహార్‌ను పనిలో నుంచి తొలగించారు. గుంతకల్లులోనే ఆ యువకుడు మరోచోట పానీపూరి బండి పెట్టుకొని సొంతగా వ్యాపారం ప్రారంభించాడు. ఇటు అమ్మాయితో ప్రేమను కొనసాగించాడు. విషయం ఇంట్లో వారికి తెలిసి మరోసారి గట్టిగా మందలించడంతో భయంతో ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి మద్దికెరకు చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న నోట్‌బుక్‌లో తమ చావుకు ఎవరూ కారణం కాదని, తామే చనిపోతున్నామని హిందీలో రాసి సంతకాలు చేశారు. ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement