lovers suicide
-
పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదనే...
మునిపల్లి(అందోల్)/నారాయణఖేడ్: పెళ్లికి పెద్దలు అంగీకరించడం లేదంటూ ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం సింగూరు ప్రాజెక్టు హరిత రిసార్ట్‌లో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం..నిజాంపేటకు చెందిన కరిపే ఉదయ్‌కుమార్ (21), మంగలి రోహిత(19) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలకు చెందినవారు అంగీకరించలేదు.ఈ క్రమంలో గురువారం ఉదయ్, రోహితలు సింగూరు ప్రాజెక్టు సమీపంలోని హరిత రిసార్ట్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఒకే ఫ్యాన్‌కు ఇద్దరూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ప్రేమజంట ఆత్మహత్య విషయం రిసార్ట్ నిర్వాహకులకు శుక్రవారం తెలిసింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ రాసి ఉంచిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ ప్రేమకు తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు అందులో పేర్కొన్నట్టు తెలిసింది. ఉదయ్‌కుమార్‌ది మిర్చి వ్యాపారం కాగా, రోహిత నారాయణఖేడ్‌లోని మోడల్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (బీజెడ్సీ) ఫైనలియర్ చదువుతోంది. గురువారం ఆమె క్లాసులకు హాజరు కాలేదు. శుక్రవారం ఉదయం రోహిత తండ్రి దుర్గేష్ కళాశాలకు ఫోన్ చేసి కూతురు ఆచూకీ గురించి ఆరా తీసినట్టు తెలిసింది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. కాగా ఉదయ్‌కుమార్ తండ్రి బాల్కిషన్ కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హరిత రిసార్ట్ మేనేజర్ సాంబశివరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ రాజేశ్‌నాయక్ తెలిపారు. -
ప్రేమ జంట ఆత్మహత్య
-
కలిసి బతకలేమని.. ప్రేమ ప్రయాణం విషాదాంతం
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను ఆవేదనకు గురిచేసింది. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. దోమకొండ మండలం అంబర్పేట్ గ్రామానికి చెందిన వీణ(23), కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి(24) కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ గురించి చెప్పి.. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ భావించారు. కానీ, వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో, మనస్థాపానికి గురయ్యారు.ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కోనాపూర్‌లో చెట్టుకు ఉరివేసుకుని సాయికుమార్, అంబర్‌పేట్‌లోని తన ఇంట్లో దూలానికి ఉరేసుకుని వీణా ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో, ఇరు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఆత్మహత్యల సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం మృతదేహాలను స్థానిక కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్ని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: జానీ భార్య అయేషా అరెస్ట్‌కు రంగం సిద్ధం! -
రైలుకింద పడి ప్రేమజంట ఆత్మహత్య
మద్దికెర: ప్రేమించుకుని, కలిసి జీవించాలనుకున్న ఓ జంట... ఇంట్లో పెద్దలను ఒప్పించే ధైర్యం లేక రైలు కిందపడి అర్ధాంతరంగా తనువు చాలించిన ఘటన కర్నూలు జిల్లా, మద్దికెర రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలివీ.. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రతాప్‌సింగ్, ఉమ 20 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా గుంతకల్లుకు చేరుకొని పానీపూరి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె. కుమార్తె మీనూ(18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రతాప్‌సింగ్ మధ్యప్రదేశ్‌కే చెందిన కుల్దీప్ పరిహార్ (23) అనే యువకుడిని పనిలో పెట్టుకున్నాడు. మీనూ, పరిహార్ ఇద్దరూ ప్రేమించుకోవడం, విషయం ఇంట్లో తెలియడంతో పరిహార్‌ను పనిలో నుంచి తొలగించారు. గుంతకల్లులోనే ఆ యువకుడు మరోచోట పానీపూరి బండి పెట్టుకొని సొంతగా వ్యాపారం ప్రారంభించాడు. ఇటు అమ్మాయితో ప్రేమను కొనసాగించాడు. విషయం ఇంట్లో వారికి తెలిసి మరోసారి గట్టిగా మందలించడంతో భయంతో ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి మద్దికెరకు చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న నోట్‌బుక్‌లో తమ చావుకు ఎవరూ కారణం కాదని, తామే చనిపోతున్నామని హిందీలో రాసి సంతకాలు చేశారు. ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ప్రేమా.. ఇదినీకు న్యాయమా?
గూడూరు రూరల్ (తిరుపతి జిల్లా): విజయవాడలోని కోచింగ్ సెంటర్లో కుదిరిన స్నేహం విడదీయరాని బంధంగా ఏర్పడింది. పెద్దలు ఎక్కడ తమను కలుసుకోకుండా చేస్తారో అన్న భయంతో ఆ జంట గూడూరుకు సమీపంలో ఆదివారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా శ్రీరుక్మిణీపురానికి చెందిన అన్నంగి పావని (19) హోటల్ మేనేజ్మెంట్ చేసింది. చిల్లకూరు మండలంలోని ఓ హోటల్లో పని చేసేందుకు సొంత ఊరి నుంచి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని రెండు రోజుల క్రితం వచ్చింది. ఇక్కడ నుంచి తనకు గతంలో విజయవాడలోని కోచింగ్ సెంటర్లో చదుకుని ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా, సగిపాడు గ్రామానికి చెందిన దండే రాకేష్(23)ను గూడూరుకు రావాలని ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. దీంతో ఆదివారం గూడూరు వచ్చి ఇద్దరు కలుసుకుని చాలా సేపు భావి జీవితానికి సంబంధించిన విషయాలను మాట్లాడుతుకున్నారు. అనంతరం ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ పెద్దలకు ఇష్టం లేకపోతే ఇద్దరు ఎవరికి వారు దూరం కావాల్సి వస్తుందని భావించిన వారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేక గూడూరు రైల్వే స్టేషన్ నుంచి సుమారు మూడు కి.మీ దూరంలో ఉన్న గాంధీనగర్ ప్రాంతం వరకు ట్రాక్‌పై నడిచి వెళ్ళి అక్కడ రైలు పట్టాలపై పడుకున్నారు. వారిపై నుంచి గూడ్స్ ట్రైన్ వెళ్లడంతో తలలు తెగి వారు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. చిన్న వయస్సులో ప్రేమించుకున్న ప్రేమికులు పుట్టిన ఊరు నుంచి దూరంగా వచ్చి ఆత్మహత్య చేసుకోవడం గూడూరు డివిజన్లో సంచలనం సృషించింది. యువతీ యువకుల మృతదేహాలను గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచార ఇచ్చారు. వారు సోమవారం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుల తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద రోదించడం చూసిన వారు కన్నీటి పర్యంతం అయ్యారు. -
ప్రేమికుల ఆత్మహత్య
వైఎస్సార్: వారంలో అమ్మాయికి వివాహం చేసేలా పెద్దలు నిశ్చయించారు. అంతలోపే అమ్మాయి ప్రేమికుడితో కలిసి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మానేవారిపల్లి పంచాయతీ చిట్టెంవారిపల్లికు చెందిన బొడె కళ్యాణి(17) తిరుపతి సమీపంలోని భాకరాపేట అడవిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. రామసముద్రం మండలం మానేవారిపల్లి పంచాయతీ చిట్టెంవారిపల్లి గ్రామానికి చెందిన రమణ, రజినిల కుమార్తె బి.కల్యాణి(17) చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే అదే కళాశాలలోనే చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం లద్దిగం గ్రామానికి చెందిన యుగంధర్(17) కూడా చదువుతున్నాడు. వారిద్దరూ కలిసి ప్రేమలో పడ్డారు. ఈ నేపథ్యంలో అమ్మాయికి వివాహం చేయాలని కుటుంబీకులు నిశ్చితార్థం చేశారు. ఈ నెల 26న వివాహం జరగాల్సి ఉండగా కల్యాణి శుక్రవారం నుంచి కనిపించకుండా పోయింది. చుట్టు పక్కల, బంధువుల ఊర్లలో విచారణ చేసినా ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు శనివారం రామసముద్రం పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యం అయినట్లు ఫిర్యాదు చేశారు. అయితే ఆదివారం తిరుపతి జిల్లాలోని భాకరాపేట ఘాట్ రోడ్డులోని ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద అడవిలో యుగంధర్, కల్యాణిలు చెట్టుకు ఉరివేసుకొని వేలాడుతుండటం పశువుల కాపరుల కంట పడ్డారు. సమాచారం తెలుసుకున్న అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రగిరి సీఐ రాజశేఖర్, ఇన్చార్జి ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా కల్యాణికి ఇంక వారంలో వివాహం ఉండగా.. ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
విషాదం: అయ్యో బిడ్డా.. ఎంత పనిచేశావు
దుబ్బాకటౌన్: దేవుడా మేమెట్లా బ్రతకాలి..అయ్యో బిడ్డా..ఎంత పనిచేశావు..అంటూ గుండెలు బాదుకుంటూ తల్లిదండ్రులు తమ పిల్లలపై పడి రోదిస్తున్న ఘటన ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించాయి. తన బిడ్డ మృతదేహాన్ని చూసిన నేహా తల్లి ఆసుపత్రి మార్చురి వద్ద స్పృహ తప్పింది. భగీరథ్ తల్లి సైతం విగత జీవిగా మారింది. తన కొడుకును చూసి గుండెలు బాదుకుంటూ రోదించడం అక్కడున్న వారిని కలచివేసింది. ఆసుపత్రితో పాటు వారి ఇండ్లలో కుటుంబీకులు, బంధువుల రోదనలతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. లచ్చపేట, దుబ్బాకలో తీవ్ర విషాదం.. ప్రేమజంట భగీరథ్(17), నేహా(16) బుధవారం తెల్లవారుజామున లచ్చపేటలోని ప్రియడి ఇంట్లో ఒకే దులానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారనే సంఘటనతో దుబ్బాక, లచ్చపేటలో తీవ్ర విషాదం అలుముకుంది. ఉదయంనుంచి సాయంత్రం వరకూ ఎవరిని కదిలించినా ఈ సంఘటనను తలుచుకుంటూ కంట తడిపెట్టడమే కనిపించింది. దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో మైనర్ ప్రేమ జంటకు వైద్యులు పోస్టుమార్టమ్ నిర్వహించి వారి బంధువులకు మృత దేహాలను అప్పగించారు. ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడక ముందు రాసి ఉంచిన సూసైడ్ నోట్లో మా మృతదేహాలను ఒకే దగ్గర అంత్యక్రియలు నిర్వహించాలని రాసి ఉంచారు. ఇందుకు వారి వారి కుటుంబాల వారు ఒప్పుకోకపోవడంతో ఎస్ఐ మహేందర్ ఆధ్వర్యంలో పోలీసులు భగీరథ్, నేహా మృత దేహాలను వేర్వేరుగా వారి బంధువులతో కలిసి అంత్యక్రియలకు తరలించారు. భగీరథ్ మృతదేహానికి లచ్చపేటలో, నేహా మృతదేహానికి దుబ్బాకలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇరువురి అంత్యక్రియల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు.. మైనర్ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ సంఘటనను తెలుసుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావులు వారి కుటుంబాలను పరామర్శించారు. ఎంపీ, ఎమ్మెల్యే భగీరథ్, నేహా అంత్యక్రియల్లో పాల్గొని ఇరు కుటుంబాలను ఓదార్చారు. మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత భూంరెడ్డితో పాటు కౌన్సిలర్లు, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, పెద్ద ఎత్తున హాజరయ్యారు. -
పంచాయితీ పెట్టినా వినలేదు.. ఆమెతో వివాహేతర సంబంధం.. చివరకు
బేతంచెర్ల: వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కాగా, బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన కమలపాటి అశోక్ (28)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికంగా ఆటోనడుపుకుంటూ జీవిస్తున్నాడు. అయితే, అశోక్ వరుసకు వదిన అయిన వివాహిత(27)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో పెద్దలు ఇద్దరికి నచ్చ జెప్పారు. అయినా, వారిలో మార్పు రాలేదు. దీంతో అశోక్‌ను వదిలి నెలరోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మరోవైపు వివాహితను కుటుంబ సభ్యులు మందలించారో మరెమో తెలియదు మంగళవారం ఉదయం ఆమె అశోక్ ఇంటికెళ్లింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. అశోక్ ఉరివేసుకోగా, ఆమె పురుగుల మందు తాగింది. కొద్ది సేపటి తర్వాత ఇంటి పక్కల వారు గమనించి తలుపులు తీయగా ఇద్దరు విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న సీఐ ప్రియతం రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. తర్వాత ఇరువురి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం బనగాన పల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఆరు నెలల క్రితమే పెళ్లి.. పక్కింటి కుర్రాడితో మాట కలిపి..
కొందరు వ్యక్తులు ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా తమ దాంపత్య జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య జరుగుతున్న చిన్న చిన్న కలహాలు, అనుమానాల కారణంగా బయట వ్యక్తులవైపు ఆకర్షితులవుతున్నారు. దీంతో, ఆ అడుగులు వివాహేతర సంబంధానికి దారితీస్తున్నాయి. చివరకు అవే తమ ప్రాణాల తీసుకునేందుకు, హత్య చేసేందుకు ప్రేరేపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. భార్య చేసిన పని.. రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. వివరాల ప్రకారం.. బార్మర్ జిల్లాలోని మోతిసర గ్రామానికి చెందిన విష్ణారం సింధారి అనే వ్యక్తితో బాధితురాలికి ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. ఈ క్రమంలో కొద్దిరోజులు వీరి వివాహ జీవితం సంతోషంగానే సాగింది. అయితే, రోజులు గడుస్తున్న కొద్దీ.. ఆమెకు పక్కింటి వారితో పరిచయాలు పెరిగాయి. ఈ క్రమంలోనే తమ ఇంటి పక్కనే ఉండే జోగారమ్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొత్తలో ఎక్కవ మాట్లాడకపోయిన కాలం గడుస్తున్న కొద్దీ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇదే తరుణంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారిద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. ఇలా వివాహేతర సంబంధం కొద్దిరోజుల పాటు కొనసాగింది. దీంతో, ఆమెకు అతడిపై ప్రేమ మరింతగా పెరిగింది. అతడు లేకుండా ఆమె ఉండలేకపోయింది. దీంతో ఎలాగైన ఆ యువకుడిని సొంతం చేసుకోవాలనే ఆలోచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా నవంబర్ 14 నుంచి ఆ మహిళతో పాటు ఆమె ప్రియుడు కూడా కనిపించకుండాపోయాడు. ఈ క్రమంలో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు ఎంత వెతికినా వారి జాడ కనిపించలేదు. కట్ చేస్తే తాజాగా అదే గ్రామంలోని ఓ బావిలో వీరిద్దరు శవాలై కనిపించారు. వారి మృతితో కుటుంబ సభ్యులు షాకయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. ఇక, వీరిని ఎవరైనా హత్య చేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణం దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
వీడలేని ప్రేమ బంధం.. ప్రాణాలను బలితీసుకుంది
రాయచూరు రూరల్: తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్నాటకలోని మస్కి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై సింధనూరు డీఎస్పీ వెంకటప్ప నాయక్ కథనం మేరకు.. మస్కి తాలూకా కురేకల్లూరుకు చెందిన మేఘన(18), బాగల్‌కోట జిల్లా హునగుంద తాలూకా ఇలకల్ నివాసి ముత్తన్న నాయక్(18) ఆరు నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరు కావడంతో వివాహానికి ఇరుకుటుంబాలవారూ నిరాకరించారు. దీంతో ఆ జంట తీవ్ర మనో వేదనకు గురైంది. ఈక్రమంలో మేఘన బుధవారం రాత్రి మస్కిలోని బావిలో దూకగా, ముత్తన్న నాయక్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మస్కి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రెండేళ్ల క్రితం ఇష్టంలేని పెళ్లి.. ప్రియుడ్ని మరిచిపోలేక..
తిరుపతి క్రైం/కొవ్వూరు: ఇష్టం లేని పెళ్లి చేశారని మనస్తాపానికి గురైన ఓ వివాహిత, ఆమె ప్రియుడు కలిసి తిరుపతిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ శివప్రసాద్‌రెడ్డి కథనం ప్రకారం.. హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతంలోని షాపూర్‌కు చెందిన అనూష(21)కు తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామానికి చెందిన గుడ్ల పోసిబాబుతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కొవ్వూరు ఆంధ్రా షుగర్స్‌లో పని చేస్తున్న పోసిబాబు తన భార్యతో కలిసి కొంతకాలంగా కొవ్వూరులోనే నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. భార్య అనూష కనిపించడం లేదంటూ పోసిబాబు ఈ నెల 5న కొవ్వూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను 4వ తేదీ తెల్లవారుజామున డ్యూటీకి వెళ్లి 5వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటికి వచ్చేసరికి భార్య కనిపించ లేదని పేర్కొన్నారు. పలుచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదని పోలీసులకు తెలిపాడు. పోసిబాబు ఇంట్లో అనూష రాసిన లేఖ లభించింది. ఈ నేపథ్యంలో పట్టణ ఎస్సై బి.దుర్గాప్రసాద్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇక, హైదరాబాద్ షాపూర్ ప్రాంతానికి చెందిన కృష్ణారావు (23) అనే యువకుడు, అనూష గతంలో ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం అనూషకు, పోసిబాబుకు వివాహం చేశారు. కృష్ణారావును మరచిపోలేని ఆమె.. అతడితో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 5న ఇద్దరూ కలిసి తిరుపతి వెళ్లారు. అక్కడి గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని త్రిలోక్ లాడ్జిలో దిగారు. అక్కడే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఉదయం రూము ఖాళీ చేయాల్సిన వీరు ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. లాడ్జిలో లభించిన ఫోన్ ఆధారంగా మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
లాడ్జిలో విగతజీవులుగా ప్రేమ జంట.. ఆమె మెడలో తాళి..
అల్లిపురం (విశాఖ దక్షిణం): వారిద్దరూ ప్రేమించుకున్నారు.. కలకాలం కలిసి జీవించాలనుకున్నారు.. ఇంతలో ఏ కష్టమొచ్చిందో.. లాడ్జిలో విగతజీవులుగా మారారు. గదిలోని కిటికీకి ఉరేసుకుని తనువు చాలించారు. అయితే ఆత్మహత్యకు ముందు వారిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు యువతి మెడలోని తాళి ఆధారంగా పోలీసులు గుర్తించారు. కాగా, రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి ఇన్చార్జి సీఐ, మహారాణిపేట సీఐ జి.సోమశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం, దూసి గ్రామానికి చెందిన దామోదర్, ఆముదాలవలస మండలం బలగాం గ్రామానికి చెందిన సంతోషి కుమారి (18) సోమవారం గొల్లలపాలెందరి అయ్యన్ రెసిడెన్సీలో గది అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి వారు హోటల్ రూమ్ నుంచి బయటకు రాలేదు. మంగళవారం మధ్యాహ్నం వారి బంధువు లాడ్జికి వచ్చి వారి ఫొటో చూపించి ఏ గదిలో ఉన్నారో తెలుసుకున్నారు. రూమ్ దగ్గరకు వెళ్లి పిలిచినా, తలుపులు తట్టినా లోపలి నుంచి ప్రతిస్పందన రాలేదు. సుమారు గంటపాటు వేచి చూసిన తర్వాత వారు లాడ్జి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే లాడ్జి సిబ్బంది తలుపులు తెరిచి చూసేటప్పటికి ప్రేమికులు ఇద్దరూ బాత్రూమ్లో కిటికీకి తాడుతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. దీంతో లాడ్జి సిబ్బంది టూటౌన్ పోలీసులకు సమాచారం అందజేశారు. సీఐ సోమశేఖర్ ఆదేశాల మేరకు ఎస్ఐలు చంద్రశేఖర్, విజయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వారి గదిలో ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు, కొన్ని పత్రాలు లభించగా వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. రజక కులానికి చెందిన వీరిద్దరి మధ్య ఇటీవల పరిచయం పెరిగిందని, దామోదర్ కుల వృత్తి చేసుకుంటుంటుండగా, సంతోషి కుమారి నర్స్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అమ్మాయి మెడలో తాళి కనపడటంతో వారిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత ఉరి వేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వారి బంధువుల ద్వారా ఇద్దరి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. వారు బుధవారం నగరానికి రానున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి వరకు వెళ్లని ప్రేమ..కారణాలు ఎన్నో!
సాక్షి, ఆదిలాబాద్: ప్రేమ నేటి యువతకు పరిచయం అక్కర్లేని పదం. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణో.. ప్రేమో అర్థం చేసుకోలేక ఆలోచించే పరపక్వత లేక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటూ కన్నవారికి కడుపు కోత మిగులుస్తున్నారు. ప్రేమ విషయం పెద్దలకు చెప్పుకోలేక , ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లే ధైర్యం లేక ప్రియుడు లేదా ప్రియురాలు నిరాకరించడంతో అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించి వారిలో స్నేహభావం పెంపొందిస్తేనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మానసిక వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సినిమాల ప్రభావంతో.. సినిమాల ప్రభావం నేటి యువతరం మీద ఎక్కువ ఉంది. ప్రేమ అనే అంశం లేకుండా సినిమాలు ఉండటం లేదు. వీటిని చూసిన యువత ప్రేమ పేరుతో ఆకర్షితులవుతున్నారు. దీనికి తోడు సెల్ఫోన్లు ప్రేమికులను మరింత చేరువ చేస్తున్నాయి. చాటింగ్, వాట్సాప్ కాల్, వీడియో కాల్‌తో ప్రేమికులు నిత్యం కలుసుకునే వీలుగా ఉంటుంది. సోషల్ మీడియా ప్రభావం యువతపై పడుతుంది. తల్లిదండ్రులు స్నేహితులుగా మెలిగితే...: ప్రతి మనిషికి స్నేహితుడి తోడు ఎంతో అవసరం. మంచి, చెడులను వివరించి చెప్పగలిగే స్నేహితుడు దొరికితే వారు చాలా అదృష్టవంతులు. అమ్మా, నాన్నలు తమ పిల్లలను స్నేహితులుగా భావించాలి. వారికి కలిగే చిన్నచిన్న సమస్యలను మొదలుకుని ప్రేమ వ్యవహారాల్లో సైతం స్నేహితుడి పాత్ర పోషించాలి. పెద్దలకు తెలియకుండానే ఏమనుకుంటారనో, ఏమైన చేస్తారనేమో భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొన్ని ఘటనలు: ► బెల్లంపల్లి పట్టణం షంషీర్‌నగర్‌కు చెందిన సోయం తేజశ్రీ నెన్నెల లంబాడితండాకు చెందిన ధరావత్ రాజ్‌కుమార్ కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఏం చేయాలో తోచక తేజశ్రీ దసరా పండుగ రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ►కుశ్నపల్లికి చెందిన జాడి రవి అనే యువకుడు వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామానికి చెందిన సత్యశ్రీ అనే ప్రియురాలి మరణవార్త విని నీవు లేనిదే జీవితం వ్యర్థమని భావించి మనస్థాపం చెంది ఈ ఏడాది ఫిబ్రవరి 9న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ►నెన్నెల మండల కేంద్రానికి చెందిన ఈగం మౌనిక ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని మనస్థాపం చెంది 2021, అక్టోబర్ 19న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ►బెల్లంపల్లి పట్టణానికి చెందిన సాజీద్ యశ్వంతిక ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో 2021 అక్టోబర్ 23న జైపూర్ శివారు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ►భీమిని మండలం మల్లీడి గ్రామానికి చెందిన దొబ్బల కల్పన అనే డిగ్రీ విద్యార్థిని అదే గ్రామానికి చెందిన కోట మల్లేశ్ ప్రేమించుకున్నారు. పెళ్లి విషయం వచ్చేసరికి ప్రియుడు నిరాకరించడంతో మనస్తాపం చెంది 2021 డిసెంబర్ 26న పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. పేరెంట్స్, టీచర్లు గమనిస్తూ ఉండాలి పిల్లల ప్రవర్తనను ఇంట్లో తల్లిదండ్రులు, బ డిలో టీచర్లు గమనిస్తూ ఉండాలి. పిల్ల లు తప్పు చేస్తే కొట్ట డం, తిట్టడం చేయకుండా ఓపికతో మాట్లాడి నచ్చజెప్పాలి. యువత చెడుమార్గం వైపు వెళ్లకుండా చూసుకోవాలి. ఒకవేళ చెడు చేస్తే సా మరస్యంగా సమస్యను పరిష్కరించాలి. ప్రే మించుకున్న యువత మొదట తల్లిదండ్రుల మనస్సు గెలుచుకోవాలి. ప్రేమించడంతోపా టు యోగ్యతను సంపాదించాలి. కులం కన్నా ఆర్థిక స్థిరత్వం ఉంటే తల్లిదండ్రులు ఒప్పుకునే వీలు ఉంటుంది. అనుకున్నది జరగకపోతే తట్టుకునే శక్తి యువతకు ఉండకపోవడంతోనే క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. – డాక్టర్ సునిల్‌కుమార్, మానసిక వైద్య నిపుణులు, మంచిర్యాల చట్టాలను ఉపయోగించుకోవాలి చట్టాన్ని ఉపయోగించుకొని హక్కులను సాధించుకోవాలి. పిరి కితనంతో ఆత్మహత్యలకు పాల్పడవద్దు. ప్రస్తుత కాలంలో పిల్లలు ఆటలకు దూరం కావడం కూడా ఒక కారణం. ఆటలు ఆడటం ద్వారా గెలుపు, ఓటములను తట్టుకునే శక్తి ఉంటుంది. తల్లిదండ్రులు చిన్న నాటి నుంచి గారాబంగా పెంచడం ద్వారా ఏది అడిగిన ఇస్తారులే అనే ఆలోచన ధోరణిలో నేటి యువత ఉంది. ముఖ్యంగా యువత సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి. సమస్యలు ఎదురైతే ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవాలి. బతకడానికి ఎన్నో మార్గాలు, చావడానికి ఒకటే మార్గం. ధైర్యంగా ఉండి ముందుకు నడవాలి. – రాజశేఖర్, ఎస్సై(నెన్నెల) -
ఏడేళ్ల క్రితం వివాహం.. మళ్లీ స్వప్నతో ప్రేమ.. కట్‌చేస్తే..
సాక్షి, ములుగు(గజ్వేల్): తల్లిదండ్రులు తమ ప్రేమను నిరాకరించారని ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలం అడవి మజీద్ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో శనివారం వెలుగు చూసింది. ఎస్ఐ రంగాకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు మండలంలోని మామిడ్యాల ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన గొట్టి మహేశ్(28)కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఇతడి భార్య కృష్ణవేణి గర్భవతి. కాగా మహేశ్ ఆరు నెలలుగా మర్కూక్‌కు చెందిన పదిరి స్వప్న(19)ను ప్రేమిస్తున్నాడు. ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాను స్వప్నను పెళ్లి చేసుకుంటానని మహేశ్ తల్లిదండ్రులకు చెప్పగా వారు నిరాకరించారు. స్వప్న తల్లిదండ్రులు సైతం పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మహేశ్ శనివారం తెల్లవారుజామున తమ బంధువు నవీన్‌కు తాము ఉరేసుకుంటున్న స్థలం లొకేషన్‌ను వాట్సాప్‌లో పంపించాడు. అడవిమజీద్ శివారులోని అటవీ ప్రాంతంలో వేప చెట్టుకు మహేశ్, స్వప్న ఉరేసుకున్నారు. కాగా మృతులకు ములుగు పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు. గజ్వేల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు మృతదేహాలను అప్పగించామని తెలిపారు. చదవండి: (ఒక క్లిక్‌తో డబ్బులు అని ఆశపడితే.. మీ చరిత్ర మొత్తం వారి చేతుల్లోకి..) -
గ్రేట్ లవర్స్.. ఫేస్బుక్ లవ్ మ్యారేజ్ చివరకు ఇలా..
సాక్షి, హైదరాబాద్: క్షణ కాలం ఆవేశం వారి ప్రాణాలను బలిగింది. సికింద్రాబాద్‌లో మైనర్ ఫేస్బుక్ ప్రేమ జంట వివాహం విషాదంతో ముగిసింది. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల ప్రకారం.. శ్రీకాంత్‌కు ఫేస్బుక్లో ఓ యువతికి మధ్య పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే జూన్ 4వ తేదీన ఇంట్లో నుంచి పారిపోయి పెద్దలకు తెలియకుండా పెళ్లిచేసుకున్నారు. అయితే ప్రేమ పెళ్లి చేసుకున్న మైనర్ జంటకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కాగా, యువతిని వారి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువెళ్లడంతో శ్రీకాంత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉన్న శ్రీకాంత్ మనోవేదన చెందాడు. ఈ క్రమంలో తన ప్రేయసి ఆగస్టు 15న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి షాక్‌కు గురయ్యాడు. తాను ప్రేమించిన అమ్మాయి ఇక లేదన్న విషయాన్ని తట్టుకోలేని శ్రీకాంత్.. అమ్ముగూడ రైల్వే ట్రాక్‌పై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి మరణాలతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఇది కూడా చదవండి: సంచలనంగా మారిన తమ్మినేని మర్డర్ కేసు.. -
నెల రోజుల క్రితమే పెళ్లి.. ఫ్యామిలీకి షాకిచ్చిన నవ వధువు
యశవంతపుర: తమ ప్రేమను పెద్దలు భగ్నం చేశారని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట ఆస్పత్రిలో కన్నుమూసింది. ఉత్తర కన్నడ జిల్లా హళియాళలో ఈ విషాద ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. హళియాళకు చెందిన జ్యోతి అంత్రోళకర (19), రికేశ్ సురేష్ మిరాశి (20)లు హళియాళ డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. కాలేజీలో పెరిగిన పరిచయంతో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. కాగా, నెల రోజుల కిందట తల్లిదండ్రులు జ్యోతికి మరో యువకునితో వివాహం చేశారు. అయితే, పెళ్లి అయిన్పటికీ ప్రియుడిని జ్యోతి మరిచిపోలేదు. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన ప్రేమికులు.. తాము ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 15వ తేదీన ముండగోడు రోడ్డులో ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగారు. స్థానికులు గమనించి ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్చారు. నాలుగు రోజులపాటు చావు బతుకుల మధ్య పోరాడి మంగళవారం మరణించారు. ఈ మేరకు హళియాళ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రేమజంట ఆత్మహత్య కలకలం.. ఊరి చివర చెట్టుకు వేలాడుతూ..
తమ పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువజంట.. బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటూ.. ఒకరిని విడిచి మరొకరం ఉండలేమంటూ ప్రాణాలొదిలారు. ఈ విషాద ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. కాగా, సమాచారం అందుకున్న జరడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఐఐసీ అధికారి బాబానంద ప్రధాన్, బాధిత గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బరంపురం నగరానికి సమీపంలోని పత్రపూర్ బ్లాక్ జరడా పోలీసు స్టేషన్ పరిధిలో సమంతరాయ్‌పల్లి గ్రామానికి చెందిన సోను బెహరా(20), సునీత ప్రధాన్(18) గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకు వెళ్లగా.. వారు పెళ్లికి నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన సోను బెహరా గ్రామ శివారులోని మామిడి తోటలో చెట్టుకి సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రేమికురాలు సునీత ప్రధాన్ ఘటనా స్థలానికి చేరుకుంది. అయితే, అక్కడే ఉన్న బాధిత కుంటుంబ సభ్యులు.. సునీతను తీవ్రంగా దూషించారు. దీంతో ఇంటికి వెళ్లిపోయిన ఆమె, కొద్ది సమయం తరువాత తిరిగి వచ్చి, పక్కనే ఉన్న మరో చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న జరడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, ప్రేమజంట మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఐఐసీ బాబానాంద తెలిపారు. -
కారులో పెట్రోల్ పోసుకుని ప్రేమికుల సజీవ దహనం
బనశంకరి: కారులో పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని ప్రేమజంట సజీవ దహనమైన ఘటన కర్ణాటకలో ఉడుపి జిల్లా బ్రహ్మవర పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. బెంగళూరు సుల్తాన్పాళ్యవాసి యశవంత్‌యాదవ్ (23), మనోరాయనపాళ్యవాసి జ్యోతి (23) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. జ్యోతి బీకాం చదివింది. యశవంత్ కంప్యూటర్ కోర్సు చేశాడు. ఈ నెల 18న మధ్యాహ్నం 12 గంటలకు యశవంత్ కంప్యూటర్ క్లాస్‌కు వెళ్తానని ఇంట్లో చెప్పి బైక్‌పై బయటకు వెళ్లాడు. జ్యోతి కూడా పని ఉందని బయటకు వెళ్లింది. రెండురోజులైనా కనిపించకపోవడంతో ఇద్దరి తల్లిదండ్రులూ హెబ్బాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రేమ జంట మంగళూరుకు వెళ్లి తమకు ఉద్యోగం వచ్చిందని చెప్పి ఒక అద్దె ఇంటిని తీసుకున్నారు. అక్కడే హుసేనఖ అనే వ్యక్తి నుంచి స్విఫ్ట్ కారును బాడుగకు తీసుకుని ఉడుపికి వెళ్లారు. ఉడుపిలో వివిధ దేవస్థానాలను సందర్శించి ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. యశవంత్ తన సోదరునికి మెసేజ్ పంపాడు. తరువాత ప్రేమికులు కారులోనే కూర్చుని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. మంటలు చెలరేగి కారులో గ్యాస్ సిలండర్ పేలిపోవడంతో యశవంత్ శరీరం బయటకు ఎగిరిపడింది. జ్యోతి కారులోనే కాలిపోయింది. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. బ్రహ్మవర పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. -
క్షణికావేశం.. కలవరపెడుతున్న ప్రేమికుల ఆత్మహత్యలు
సుల్తానాబాద్ మండలం కనుకులకు చెందిన ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. పెద్దలు నిరాకరించడంతో అబ్బాయి పురుగుల మందు తాగి సోమవారం మృతిచెందగా.. అమ్మాయి మంగళవారం బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. తాను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని గోదావరిఖని ప్రాంతానికి చెందిన 25ఏళ్ల యువకుడు ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయి. సాక్షి, పెద్దపల్లి: ‘తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్ష’ అనే సామెతను మరిచి క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతూ కుటుంబాలను విషాదంలో ముంచుతున్నారు కొందరు. సమస్యను ఇతరులతో పంచుకోకుండా.. పరిష్కారం కనుక్కోకుండా విలువైన ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ప్రేమలో వైఫల్యం, కుటుంబంలో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, సాగులో నష్టం, దీర్ఘకాలిక రోగాలు, క్షణికావేశం, మనస్పర్థలు, మానసిక సమస్యలతో లోకం విడిచి వెళ్లిపోతున్నారు. సమస్యలు అధిగమించలేక రకరకాల కారణాలతో జిల్లాలో ఏదో ఒకచోట ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 15 నుంచి 35 ఏళ్లలోపు యువత, మహిళలలే ఎక్కువగా ఉంటున్నారు. కన్నవారికి గుండెకోత.. సుల్తానాబాద్ రూరల్: మండలంలోని కనుకులకు చెందిన మైనర్లు ఆత్మహత్య చేసుకుని కన్నవారికి గుండెకోత మిగిల్చారు. ఇరుకుటుంబాల్లో తీరని శోకాన్ని కలిగించారు. ఇద్దరిదీ తెలిసీ తెలియని వయసు కావడం.. ప్రేమలో ఉన్నామని భ్రమపడి.. పెద్దలు ఎంత చెప్పినా వినకుండా ప్రాణాలు తీసుకున్నారు. గ్రామానికి చెందిన ఓ అబ్బాయి తొమ్మిదో తరగతి వరకు చదువుకుని ఇంటివద్దనే ఖాళీగా ఉంటున్నాడు. తండ్రి చనిపోవడంతో తల్లి అన్నీతానై పోషిస్తోంది. కూలీ పనులు చేసుకుంటూ కొడుకును అల్లారుముద్దుగా చూసుకుంటోంది. ఇంతలోనే ప్రేమ పేరిట అఘాయిత్యానికి పాల్పడడం ఆమెకు తీరని వేదన కలిగిస్తోంది. అదే గ్రామానికి చెందిన అమ్మాయి కూడా పదో తరగతి వరకు చదువుకుని ఇంటివద్దనే ఉంటోంది. వారి ఇద్దరి ఇళ్లు సమీపంలోనే ఉండడంతో వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని అనుకున్నా.. కులం అడ్డురావడం.. పెద్దలు అంగీకరించకపోవడంతో ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలు తీసుకున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఇలాంటి వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడుతారు ► ఆత్మవిశ్వాసం కోల్పోయిన వ్యక్తులు.. ► చదువులో వెనుకబడి.. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చలేకపోతున్నామనుకునేవారు. ► మత్తుపదార్థాలకు అలవాటుపడిన వ్యక్తులు.. ► సమాజంలో పరువు పోతుందని, ఎదుటివారు తప్పుగా మాట్లాడతారనుకునేవారు. ► కుటుంబం, ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య నమ్మకం లేని వ్యక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటారు. ఈ లక్షణాలుంటే అనుమానించాల్సిందే.. ► ఒకచోట కుదురుగా ఉండకుండా అటూఇటూ తిరుగుతుండటం.. ► ఏ పని మీదా ఆసక్తి చూపకపోవడం.. చేసే పనిమీద ఆసక్తి లేకపోవడం.. ► ప్రతి చిన్న విషయానికీ ఎదుటి వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం.. ► చీకటిలో ఎక్కువ సమయం గడపడం.. దిగాలుగా, దుఃఖంతో ఉండటం.. ► ఎవరిని కలువకుండా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడటం.. అనుకున్నది సాధించలేకపోయామనే నిర్వేదం.. ► జీవించడం ద్వారా ఎవరికీ ఉపయోగం లేదనుకోవడం.. వంటి లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తులను అనుమానించాలి. సంకేతాల్ని గుర్తించాలి ఎవరూ ఎటువంటి సంకేతాలు ఇవ్వకుండా ఆత్మహత్యలకు పాల్పడరు. వారి ప్రవర్తన, మాటల ద్వారా తమ ఆలోచనల్ని వ్యక్తీకరిస్తారు. వీటిని సైకాలజీలో ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలుగా చెబుతారు. ఈ సంకేతాలపై అవగాహన ఉంటే ఆత్మహత్య ఆలోచన ఉన్నవారిని గుర్తించి కాపాడే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యార్థులు వీటిపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. – కె.రామచంద్రం, సైకాలజీ కేయూ సదస్సులు నిర్వహిస్తాం ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. కోపం దరిచేరనివ్వకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే స మస్యలు దూరమవుతాయి. విలువైన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్పితే అర్ధాంతరంగా ముగించడం తగదు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు గ్రామాల్లో మండల లీ గల్ సర్వీస్ అథారటీల ద్వారా న్యాయ, విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తాం. కేసులు రాజీ చేసుకునేలా లోక్ అదాలత్ ద్వారా ప్రోత్సహిస్తున్నాం. – సురేష్‌బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, పెద్దపల్లి ఆత్మహత్యలు పరిష్కారం కాదు సమస్యలకు ఆత్మహత్యలు ప రిష్కారం కాదు. విపరీతమైన ఒ త్తిడి, కోపం, అసహనంలో పుట్టిన నిరాశ, నిస్పృహల ద్వారా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. కు టుంబ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు మెరుగు పర్చుకోవటం ద్వారా జీవితానికి భరోసా కలుగజే యవచ్చు. ఆ దిశగా స్నేహితులు, బంధువులు భరోసా ఇవ్వాలి. – పి.రవీందర్, డీసీపీ ►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రేమలేనిదే జీవించలేమని.. ప్రేమికుల ఆత్మహత్య
సాక్షి, రాజాపేట(నల్లగొండ): పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదని, పెళ్లికి కూడా ఒప్పుకోరని భావించిన ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. రాజాపేట మండలం బూర్గుపల్లికి చెందిన కోటోజు కృష్ణమూర్తి, మాధవి దంపతుల కుమారుడు సాయితేజ(20), అదే గ్రామానికి చెందిన మాడిశెట్టి నర్సింహులు, అనిత కుమార్తె అఖిల(17) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అఖిల ఇంటర్మీడియట్ ఇటీవల పూర్తి చేయగా సాయితేజ ఇంటర్ మధ్యలోనే వదిలేసి గ్రామంలోని పాల సెంటర్లో సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ప్రేమ విషయం తెలియడంతో.. సాయితేజ, అఖిల ప్రేమ వ్యవహారం నెలరోజుల క్రితం పెద్దలకు తెలిసింది. అప్పటి నుంచి నర్సింహులు తన కూతురు అఖిలను సమీప గ్రామం నెమిలలోని బంధువుల వద్ద ఉంచాడు. కాగా, ఆదివారంరాత్రి పాలసెంటర్‌లో విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన సాయితేజ రాత్రి 9 గంటల సమయంలో ఫోన్‌కాల్ రావడంతో బయటికి వెళ్లాడు. మరోవైపు ఆదివారం రాత్రి నుంచే అఖిల కూడా కనిపించడంలేదని తెలిసిన తండ్రి నర్సింహులు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చెట్టుకు ఉరేసుకుని.. సోమవారం సాయంత్రం సాయితేజ తాత శ్రీహరి మేకలు తోలుకుని తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా, అప్పటికే ఇద్దరు ప్రేమికులు చెట్టుకు చున్నీతో ఉరేసుకుని విగతజీవులుగా కనిపించారు. ప్రేమజంట అఘాయిత్యంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
విజయనగరం: ప్రేమజంట మృతదేహాలు లభ్యం
సాక్షి, విజయనగరం: గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజ్‌లోకి దూకి రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట మృతదేహాలు లభ్యమయ్యాయి. తోటపల్లి రిజర్వాయర్ సమీపంలో మృతదేహాలను గుర్తించారు. కాగా సోమవారం నాగావళి నదిలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. విషయం తెలిసిన పోలీసులు ఈతగాళ్ల సాయంతో ప్రేమజంట కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 42 గంటల తరువాత మృతదేహాలు నదిలో తేలాయి. ఒకరినొకరు చున్నీతో కట్టుకొని ప్రేమజంట నదిలో దూకారు. యువకుడు రాకేష్ స్వగ్రామం బొబ్బిలి కాగా.. ప్రియురాలు కురుపాంకు చెందిన బాలికగా పోలీసులు తెలిపారు. చదవండి: బ్యారేజ్‌లోకి దూకి ప్రేమజంట ఆత్మహత్య చదవండి: బ్యారేజ్‌లోకి దూకి ప్రేమజంట ఆత్మహత్య -
ఆమె బీకాం, అతడు డిప్లొమా.. ఇద్దరూ ఉరేసుకున్నారు
సాక్షి, బనశంకరి: కలిసి జీవించడానికి పెద్దలు అడ్డుపడ్డారన్న ఆవేదనతో ప్రేమ జంట తనువు చాలించింది. హావేరి తాలూకా నాగనూరు గ్రామానికి చెందిన విద్యాశ్రీ గాలి (22), ఇర్షాద్ కుడచి (23) ఆత్మహత్య చేసుకున్నారు. మూడేళ్లుగా వీరులో ప్రేమలో మునిగి తేలుతున్నారు. విద్యాశ్రీ బీకాం చదువుతుండగా, ఇర్షాద్ కుడచి డిప్లొమా పూర్తిచేశాడు. ఇటీవల విద్యాశ్రీకి తల్లిదండ్రులు ఓ యువకునితో నిశ్చితార్థం చేశారు. ప్రేమకు దూరం కావడం ఎంతమాత్రం ఇష్టలేని విద్యాశ్రీ, ఇర్షాద్ కలిసి శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: తోటి ఉద్యోగే ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. దీంతో ఆ మహిళ.. -
చెరువుకట్టపై చెప్పులు, యాసిడ్ బాటిళ్లు.. ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, కోదాడ: ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మతాలు వేరు కావడం.. ఇంట్లో తెలిస్తే గొడవలు జరుగుతాయన్న భయం.. పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటారో లేదోనన్న ఆందోళన.. వెరసి వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణ పరిధిలోని లక్ష్మీపురానికి చెందిన చేగొండి రామయ్య, తిరపమ్మ దంపతుల చిన్న కుమారుడు మణికంఠ అలియాస్ సాయి (20) స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సాయి ఇంటి సమీపంలో ఎస్కె.కరీమా కూతురు ఫాతిమా (16), కుమారుడితో కలసి నివాసం ఉంటోంది. కోదాడలోని ఉర్దూ పాఠశాలలో ఫాతిమా ఆలిమ్ కోర్సు చదువుతోంది. కాగా, సాయి, ఫాతిమా ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. రెండు రోజుల క్రితం సాయి రాత్రి ఫోన్లో మాట్లాడుతుండగా.. ఈ సమయంలో ఎవరికి ఫోన్ చేస్తున్నావ్ అంటూ తండ్రి మందలించాడు. దీంతో మరుసటి రోజు నుంచి సాయి కనిపించకుండా పోయాడు. యాసిడ్ తాగి చెరువులో దూకారా? శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు చెరువుకట్టపై చెప్పులు, యాసిడ్ బాటిళ్లు, రెండు గ్లాసులను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గజ ఈతగాళ్లతో చెరువులో గాలించగా.. ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. మృతుల నోట్లో నుంచి నురగలు వచ్చాయి. యాసిడా.. లేదా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: (సహజీవనం చేస్తూ ‘రిచ్’గా బిల్డప్.. పక్కాగా చీటింగ్) -
పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రేమికుల ఆత్మహత్య
సాక్షి, సూర్యాపేట: ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఓ జంట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మనగాల మండలం మొద్దుల చెరువు గ్రామంలో చోటుచేకుంది. చివ్వెంల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన ఓర్సు నవీన్(21), కేశబోయిన మహేశ్వరి(18) గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరివురు పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయాన్ని పెద్దలకు చెప్పడంతో వారు అంగీకరించలేదు. దీంతో మనస్థాపానికి గురైన వారు గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చి మొద్దుల చెరువు గ్రామ శివార్లలో వేప చెట్టుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయాన్నే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: (భర్త మోసం చేశాడని... సవతి పిల్లలను చంపి..) -
జగిత్యాల: హైదర్ పల్లిలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం
-
ప్రేమజంట ఆత్మహత్య, కుళ్లిన శవాలు
సాక్షి, జగిత్యాల: జిల్లాలోని హైదర్ పల్లిలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడి వారానికిపైగా కావడంతో శవాలు కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నాయి. యువకుడిని నలువాల మధుగా పోలీసులు గుర్తించారు. మధుతోపాటు బలవన్మరణానికి పాల్పడిన యువతిని గుర్తించాల్సి ఉంది. మధు తల్లిదండ్రులు 20 ఏళ్ల క్రితం మృతి చెందడంతో జగిత్యాలలో ఓ ఫాస్ట్ పుడ్ సెంటర్ లో పనిచేస్తూ తన పాత ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. నా అనే వారు ఎవరూ లేకపోవడంతో ఒంటరి జీవితం గడుపుతున్న మధు మరో అమ్మాయితో ఉరి వేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. అమ్మాయి ఎవరు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
విషాదం: ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, బల్మూర్(అచ్చంపేట): పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని మనస్థాపానికి గురైన ఓ ప్రేమజంట కలిసి బతకకపోయినా.. కలిసి తనవు చాలించాలని నిర్ణయించుకొని ఉరేసుకొని మృతిచెందారు. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం బిల్లకల్ అటవీ ప్రాంతంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు.. బిల్లకల్‌కు చెందిన రాయ అఖిల(19), చెంచుగూడెంకు చెందిన అనిల్(19) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరువురి కుటుంబాల పెద్దలకు తెలియటంతో పెళ్లికి నిరాకరించి మందలించారు. దీంతో కలిసి చావాలని నిర్ణయించుకొని సోమవారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని రుసుల చెరువు అటవీశాఖ బేస్ క్యాంప్ వద్దకు బైక్‌పై వెళ్లారు. క్యాంప్ వెనుక భాగంలో ఉన్న చెట్టుకు చున్నీతో ఇద్దరూ ఉరేసుకుని మృతిచెందారు. అటుగా వెళ్లిన మేకల కాపరులు గుర్తించి ఇరువురి కుటుంబ»సభ్యులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న సీఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనలో రెండు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. ఎంపీపీ అరుణ, సర్పంచ్ అంజనమ్మ బాధిత కుటుంబాలను పరామర్శించారు. పోక్సో కేసు నమోదు గోపాల్పేట: మండలంలోని తాడిపర్తికి చెందిన సురేశ్‌పై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామగౌడ్ తెలిపారు. గ్రామానికి చెందిన ఓ యువతిని సురేశ్ ప్రేమించి ఆరునెలల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వరకట్నం తీసుకురావాలని సురేశ్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేస్తున్నారని.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వివరించారు. యువకుడి బలవన్మరణం పెబ్బేరు(కొత్తకోట): మండలంలోని తోమాలపల్లిలో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఏఎస్ఐ జయన్న కథనం మేరకు.. గ్రామానికి చెందిన గుడిసె వెంకటేష్ (25) ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు టవల్‌తో ఉరేసుకుని మృతిచెందాడు. పారిశుద్ధ్య పనులకు వెళ్లిన తల్లి ఇంద్రమ్మ ఇంటికి వచ్చి తలుపు తెరిచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అయిదు నెలల క్రితమే వివాహమైందని.. తరచూ భార్యాభర్తలిద్దరూ గొడవ పడుతుండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి ఇంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని ఏఎస్ఐ వివరించారు. -
అడవిలో ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, వైఎస్సార్ కడప: రాపూరు–చిట్వేలి ఘాట్‌రోడ్డులో రాపూరు నుంచి 6వ కిలోమీటరు వద్ద ఉన్న దట్టమైన అడవిలో పుల్లనీళ్ల చెల్ల (రాళ్ల కాలువ) వద్ద గుర్తు తెలియని యువతి, యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం రాత్రి అటవీశాఖ అధికారులు వీరి మృతదేహాలను గుర్తించారు. మృతదేహాల వద్ద బ్యాగ్, కొన్ని దుస్తులతోపాటు పురుగు మందు డబ్బా ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాల స్థితి చూస్తే రెండు.. మూడు రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో వైఎస్సార్ జిల్లా రిజిస్ట్రేషన్ కలిగిన మోటారు బైక్ ఉండడంతో మృతులు వైఎస్సార్ జిల్లాకు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. మృతుల వయస్సు 20 నుంచి 30 ఏళ్ల లోపు ఉంటుంది. అటవీశాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలున్న సమీపంలో కోడేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు చూసేందుకు ప్రజల నిత్యం ఈ ప్రాంతానికి వచ్చి జలకాలాటలు ఆడుతుంటారు. ఈ ప్రదేశం పక్కనే మృతదేహాలు పడి ఉండడం కలకలం రేపుతోంది. (ప్రేమ పేరుతో.. పలుమార్లు అత్యాచారం) ఆ జంట ప్రేమికులుగా గుర్తింపు పెనగలూరు: నెల్లూరు జిల్లా రాపూరు అటవీప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడిన యువతీ, యువకుడిని ప్రేమ జంటగా పోలీసులు గుర్తించారు. వివరాలిలా... నారాయణ నెల్లూరు గ్రామానికి చెందిన మొలకల బాలబాబు(21), అదే గ్రామం ఎస్టీ కులానికి చెందిన అంజలి(17) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వేరువేరు కులాలు కావడంతో వీరి ప్రేమను ఇరు కుటుంబాలు తిరస్కరించినట్లు తెలిసింది. కాగా బాలబాబుకు కడప దగ్గరలోని చిన్నమాచుపల్లికు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయం చేశారు. వచ్చే ఆదివారం వివాహం జరగాల్సి ఉంది. పెద్దలు కుదిర్చిన వివాహం ఇష్టం లేకపోవడంతో ఈనెల 11న అంజలీ, బాలబాబు ఇంటి నుంచి వెళ్లిపోయారు. కాగా రాపూరు సరిహద్దు ప్రాంతంలో పోతుగుంట మడుగు వద్ద పురుగుల మందు తాగి మృతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ఐ చెన్నకేశవ కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం పంపారు. (అందుకే ఆమెను చంపి నేనూ చనిపోవడానికి సిద్ధపడ్డా!) -
చావుకోరిన ప్రేమ
లోకం పోకడ తెలియని రెండు హృదయాలు ప్రేమనో.. ఆకర్షణో.. వీడలేనంత దగ్గరయ్యాయి కన్నవాళ్లు.. కులం.. కట్టుబాట్లు.. అడ్డుతగిలాయి ఆ పసి మనసులు విలవిల్లాడిపోయాయి ఎడబాటును తట్టుకోలేకపోయాయి వీడిపోలేక.. వీడి ఉండలేక... చావులో ఒక్కటవుదామనుకున్నారు భవిష్యత్ తలచుకుని భయాందోళన చెందారు పురుగుల మందునే ప్రేమామృతంగా తాగారుఆస్పత్రికి తీసుకెళ్లినా ఒకరి తర్వాత మరొకరు తనువు చాలించారుశృతి తప్పిన ప్రేమ ప్రకాశించకపోగాకన్నవారికి కడుపుకోత మిగిలింది. బత్తలపల్లి: తమ వివాహానికి కులాలు అడ్డు వస్తుండడంతో మనస్తాపం చెందిన ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ధర్మవరం రూరల్ సీఐ వీసీ పెద్దయ్య తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలం యర్రాయపల్లికి చెందిన గొడ్డుమర్రి చిన్నపోతులయ్య, విజయమ్మ దంపతుల కుమారుడు ఓంప్రకాష్(18), అదే గ్రామానికి చెందిన మనోహర్, సావిత్రి దంపతుల కుమార్తె శ్రుతి(18).. ధర్మవరంలోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. కళాశాలకు వెళ్లి వచ్చే క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ వ్యవహారం ఇటీవల తల్లిదండ్రులకు తెలిసి కులాలు వేరుకావడంతో పెళ్లి చేయడం కుదరదని, ఈ విషయాన్ని ఇంతటితో వదులుకోవాలంటూ మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. బుధవారం వేకువజామున 5.30 గంటలకు యువకుడి తోటలో ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆరు గంటలకు యువకుడి సమీప బంధువులు తోటలో బెండకాయలు కోయడానికి వెళ్లినప్పుడు ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే ఇరువైపుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని ఇద్దరినీ అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ముందు యువకుడు.. ఆ తర్వాత యువతి మృతి చెందారు. ఘటనపై ధర్మవరం రూరల్ సీఐ పెద్దయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
అజయ్, శ్రావణిల ప్రేమ విషాదాంతం
మేడిపల్లి: వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు పెద్దల నిర్ణయాన్ని అడిగారు. వివాహానికి వారు నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన బుధవారం మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పిర్జాదిగూడ చెన్నారెడ్డి ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న బోరెండల్ కిరణ్‌కుమార్ కూతురు శ్రావణి (23) స్థానికంగా ఉన్న బిగ్‌బజార్ సేల్స్ విభాగంలో పని చేస్తోంది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోల్కొండ గ్రామానికి చెందిన తుమ్మల చంద్రయ్య కుమారుడు అజయ్ ఉప్పల్‌లోని బజాజ్ వెహికల్ షోరూంలో పని చేస్తున్నాడు. శ్రావణి, అజయ్‌లకు రెండేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇటీవల వీరు తమ ప్రేమ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.(మేడ్చల్: ఓయో లాడ్జిలో దారుణం!) శ్రావణి కుటుంబికులు ఇందుకు అంగీకరించినా.. అజయ్ తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోలేదని పోలీసులు చెప్పారు. వారిని ఒప్పించేందుకు ప్రేమికులిద్దరూ కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో మంగళవారం ఉదయం మేడిపల్లిలోని ఓ హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ రోజు రాత్రి బాత్రూంలో నీళ్ల చప్పుడు రావడంతో హోటల్ సిబ్బంది డోర్‌ను తట్టారు. అప్పటికే ఇద్దరూ క్రిమిసంహారక మందును తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న అజయ్ డోర్ తీసి కిందపడిపోయాడు. అంతకు ముందే బెడ్‌పై శ్రావణి మృతిచెంది ఉంది. అజయ్‌ను చికిత్స నిమిత్తం ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
ప్రేమజంట ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): ఇబ్రహీంపట్నంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ విఫలం కావడంతో గ్రామ శివారులో పురుగుల మందు తాగి అనంతరం చెట్టుకు ఉరేసుకున్నారు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గుండేటి రమ్య (22), మండలోజి ప్రణీత్‌చారి(22) రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరు వేర్వేరు కులాలకు చెందినవారు. ఇటీవల రమ్యకు పెళ్లి నిశ్చయమైంది. తమ ప్రేమ విఫలం కావడం, మరొకరితో పెళ్లి ఇష్టంలేక రమ్య, ప్రణీత్‌చారి మంగళవారం వేకువజామున ఇంటి నుంచి వెళ్లి గ్రామశివారులో పురుగుల మందు తాగి అనంతరం చెట్టుకు ఉరేసుకోగా రమ్య ఉరితాడు తప్పి కిందపడింది. తన తండ్రి ల క్ష్మణ్‌కు ఫోన్ చేసి పురుగుల మందు తాగానని చెప్పింది. వెంటనే అతడు మెట్‌పల్లిలోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ప్రణీత్‌చారి సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. మృతురాలి తండ్రి లక్ష్మణ్, మృతుడి తల్లి మండలోజు సరోజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. -
ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య
నవాబుపేట: ‘ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నాం.. మా పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. మీనకు ఇష్టం లేని పెళ్లి చేశారు. కలిసి బతకలేమని తెలుసుకున్నాం. కలిసి చావాలని నిర్ణయించుకున్నాం. మా చావుకు ఎవరూ కారణం కాదు. ఎవరూ బాధపడవద్దు’ అని సూసైడ్ నోట్ రాసి ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం ఉదయం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం నారెగూడ(పూలపల్లి)లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన సార్ల కార్తీక్ (21), ఇదే గ్రామానికి చెందిన కటికె రాజారాం కూతురు మీన(21) ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కార్తీక్ ఇంటర్ వరకు చదివి కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మీన 10 వరకు చదివి ఇంటవద్దే ఉంటోంది. ఇరువురి ఇళ్లు పక్కపక్కనే ఉండటంతో ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరి కులాలు వేరు కావడంతో ఇరువురి పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. రోదిస్తున్న మీన తల్లిదండ్రులు అయినా ఫోన్ల ద్వారా తరచూ మాట్లాడుకునేవారు. ఇది గమనించిన మీన తల్లిదండ్రులు నెల రోజుల క్రితం మహేశ్వరం మండలం గట్టుపల్లికి చెందిన ఓ యువకునికి ఇచ్చి అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేశారు. అయినా మీన.. కార్తీక్‌లు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. మంగళవారం మీన అత్తవారింటి నుంచి (గట్టుపల్లి నుంచి) ఎవరికి చెప్పకుండా వచ్చేసింది. అనంతరం కార్తీక్ ఆమెను తీసుకొని తన బైక్(టీఎస్ 07 ఎఫ్‌కే3871)పై నారెగూడకు చేరుకున్నారు. ఎలాగూ కలిసి బతకలేం కాబట్టి కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు. నైలాన్ తాడుతో నారెగూడ(పూలపల్లి) శివారులోని ప్రభుత్వ భూమిలో ఉన్న వేప పెట్టుకు ఉరి వేసుకొని ఆత్యహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు పూలపల్లి గ్రామానికి చెందిన హరిజన మల్లయ్య పొలానికి వెళ్తుండగా ఇరువురూ వేలాడుతూకనిపించారు. విషయాన్ని సర్పంచ్ నర్సింహ్మరెడ్డికి చేరవేయగా అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్ఐ క్రిష్ణ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మృతుడి వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా కార్తిక్.. మీనగా గుర్తించి వారి ఇరువురు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వికారాబాద్ డీఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వీఆర్ఓ సత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రిష్ణ తెలిపారు. (నువ్వులేని లోకం నాకెందుకని..!) పెళ్లి చేసుకొని అనంతరం ఆత్మహత్య.... కార్తిక్.. మీన ఆత్మహత్యకు ముందు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. మీనకు ఇంతకు ముందు పెళ్లి కావడంతో ఆమె ఒంటిపై ఉన్న పుస్తెల తాడు, గాజులు, మెట్టెలు, 4 సెల్ ఫోన్లను తీసి ఒక నల్ల గుడ్డలో కట్టి పక్కన పెట్టారు. కానీ మీన మెడలో నూతన పుస్తె ఉంది. పసుపు కొమ్ముదారంతో పుస్తె ఉండటాన్ని గమనించి వీరు చనిపోవడాకిని ముందు పెళ్లి చేసుకొని ఉంటారని భావిస్తున్నారు. -
నువ్వులేని లోకం నాకెందుకని..!
మంచిర్యాల, జైపూర్(చెన్నూర్): వారిద్దరికి కళాశాలలో పరిచయం అయ్యింది. అదికాస్త ప్రేమగా మారింది. ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలకు చెప్పి పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో ప్రియుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిని జీర్ణించుకోలేని ప్రియురాలు సైతం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. శ్రీరాంపూర్‌కు చెందిన తగరం మణెమ్మ, స్వామి దంపతుల రెండో కూతురు మల్లిక.. రామకృష్ణాపూర్‌లోని అల్లూరిసీతారామరాజునగర్‌కు చెందిన షేరు సంతోష్ మంచిర్యాలలోని ఓ కళాశాలలో చేరారు. ఇంటర్‌లోనే పరిచయం ఏర్పడడంతో డిగ్రీలో అది ప్రేమగా మారింది. ఈ విషయం ఇరు కుటుంబాల్లోనూ తెల్సింది. (కొత్త జంటను క్వారంటైన్ పాలు చేసిన కరోనా! ) వారు కూడా పెద్దగా అడ్డు చెప్పలేదని సమాచారం. సంతోష్ చదువు మానేసి కొద్దికాలంగా ఇంటివద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆన్ లైన్ గేమ్స్ ఆడేవాడని, ఈ నేపథ్యంలో అప్పులు కూడా అయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు మందలించారో..? ఏమోగానీ.. ఈనెల 21న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తెలుసుకున్న మల్లిక.. అప్పటినుంచే మనస్తాపానికి గురికాగా.. కుటుంబ సభ్యులు పెద్దపల్లిలోని వారి బంధువుల ఇంటికి తీసుకెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈనెల 25న ఆటోలో తీసుకెళ్తుండగా.. ఇందారం గోదావరి బ్రిడ్జిపైకి చేరుకోగానే ఆటోలోంచి దూకిన మల్లిక(20).. గోదావరిలో దూకింది. 26న రాత్రివరకు మృతదేహాన్ని పోలీసులు బయటకు తీయించారు. ప్రియుడి లేని లోకంలో తాను ఉండలేననే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు అదనపు ఎస్సై గంగరాజ్‌గౌడ్ తెలిపారు. (ప్రియురాలి వైద్యం కోసం దోపిడీ డ్రామా) -
రెండో పెళ్లికి పెద్దల నిరాకరణ..
వరంగల్ రూరల్,పరకాల / నడికూడ / కమలాపూర్ : పదేళ్ల క్రితం ప్రేమ వ్యవహారం నడిచింది.. అప్పట్లో పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో కుటుంబ సభ్యులు చూసిన సంబంధాలనే పెళ్లి చేసుకున్నారు... ఇంతలోనే మహిళ భర్త అనారోగ్యంతో మరణించగా మళ్లీ ఇద్దరి మధ్య ప్రేమయాణం మొదలైంది. ఈ మేరకు రెండో పెళ్లికి సిద్ధపడగా ఇరు కుటుంబాల నుంచి వ్యతిరేకత రావడంతో చెరువు కుంటలో దూకి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలం ధర్మారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.(ప్రేమ పెళ్లి.. దంపతుల ఆత్మహత్య) వరంగల్ అర్బన్ జిల్లా కమాలాపూర్ మండలం అంబాలకు మంత్రి రమ్య(29), అదే గ్రామానికి చెందిన గండ్రకోట రాజు(30) పదేళ్ల క్రితం ప్రేమించుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. అయితే, పెళ్లికి అడ్డంకులు రావడంతో పోలీసులను ఆశ్రయించగా పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం రమ్యకు వెలగొండకు చెందిన తిరుపతితో వివాహం జరిపించారు. ఆ తర్వాత కొద్ది కాలానికి రమ్య భర్త ఉపాధి కోసం దుబాయ్ వెళ్లగా రమ్య అంబాలలోనే ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. ఇక రాజు వివాహం కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్వాయికి చెందిన మహిళలతో జరగగా వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, పది నెలల క్రితం రమ్య భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంతలోనే హైదరాబాద్‌లో ఉంటున్న రాజు భార్యాపిల్లలతో కలిసి స్వగ్రామంలో ఇల్లు కట్టుకునేందుకు వచ్చాడు. ఇక్కడ మళ్లీ రమ్యతో ప్రేమాయణం మొదలుకాగా, రాజు భార్యతో పాటు రమ్య కుటుంబీకులు మందలించారు. ఈ మేరకు నాలుగు రోజుల క్రితం రమ్య, రాజు ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. దీంతో రాజుపై అనుమానంతో రమ్య కుటుంబీకులు కమలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు విచారణ జరుపుతుండగానే ధర్మారం శివారులోని చెరువుకుంటలో మృతదేహాలు తేలాయి. సమాచారం అందుకున్న పరకాల పోలీసులు చెరువు వద్దకు చేరుకొని మృతదేహాలను తీయించి ఆస్పత్రులకు తరలించారు. కాగా, వీరిద్దరూ ఆటోలో చెరువు వద్దకు వచ్చారని కేసు విచారణ జరుపుతున్నామని పరకాల ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. -
విషాదం: ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరులో శనివారం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతులను అబ్దుల్లా, రేష్మలుగా గుర్తించారు. వీరిద్దరూ కళాశాల నుంచే ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు బ్రాడీపేటలోని రెప్కో హోమ్ ఫైనాన్స్‌లో పనిచేస్తున్నారు. ఈ ప్రేమ జంట బ్యాంక్‌లోనే ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆత్మహత్యకు గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. రేష్మా రెండు రోజులుగా ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పాత గుంటూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె మొబైల్ నెంబర్‌ను ట్రేస్ చేసిన పోలీసులు బ్రాడీపేటలోని బ్యాంక్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి చూసేసరికి యువతి యువకుల మృతదేహాలు కనిపించాయి. దీంతో వారి తల్లి దండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. పెళ్లికి పెద్దలు ఎంత మాత్రం అంగీకరించకపోవడంతో అత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. (‘కలసి బతకలేం.. విడిచి ఉండలేం..’) పెళ్లి వాయిదా; యువతి ఆత్మహత్య మరోవైపు ఆర్థిక సమస్యలతో వివాహం వాయిదా పడిందన్న మనస్తాపంతో యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో కలకలం రేపింది. శాంతి నగర్‌కు చెందిన శంకరయ్య, నారాయణమ్మల కుమార్తె పబ్బతి హేమావతి (25) వివాహం ఈనెల మూడో వారంలో జరగాల్సి ఉండగా కరోనా కారణంగా డబ్బులు చేతికి రాక వాయిదా పడింది. ఈ విషయంలో తల్లికి బరువు అయ్యాను అని కలత చెందిన హేమవతి బాధతో తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ( నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం ) -
పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదని..
సాక్షి, హైదరాబాద్ : తమ ప్రేమను పెద్దలు అంగీకరించరనే భయంలో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గులో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడవేర్గుకు చెందిన తౌట స్వాతి, కోడూరి నవీన్‌లు గత కొద్ది రోజులుగా ప్రేమించుకుటున్నారు. తమ ప్రేమను కుటుంబ పెద్దలు అంగీకరించరనే భయంలో శనివారం ఉదయం ఇంటి నుంచి పారిపోయారు. రాత్రంతా యాదాద్రి జిల్లా భువనగిరి గుట్టపై గడిపారు. ఆదివారం ఉదయం ఇద్దరు పురుగులమందు తాగి భువనగిరిలో ఉంటున్న స్నేహితులకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. దీంతో కంగారుపడ్డ నవీన్ స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్వాతి, నవీన్‌లను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం
నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో ఏమైందో గానీ ముందుగా యువతి.. ఆ తరువాత ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతులిద్దరూ యలమంచిలి వాసులు. ప్రస్తుతం వీరు నగరంలో ఉంటున్నారు. ఆత్మహత్యకు పాల్పడడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. సాక్షి, విశాఖపట్నం: వారిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు... విషయం ఇంట్లో వారికి తెలియడంతో కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేస్తామన్నారు... ఇంతలో ఏం జరిగిందో ముందుగా యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ విషయం తెలియడంతో ఆమె లేని జీవితం ఎందుకని ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలు విశాఖలో కలకలం రేపాయి. గోపాలపట్నం, కంచరపాలెం పోలీస్ స్టేషన్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యలమంచిలి రామ్‌నగర్‌లో తల్లిదండ్రులు, అక్కతో కలిసి నివసించే మక్క శిరీష(20) నాలుగేళ్ల కిందట అక్కడే ఇంటర్ చదువుతూ అదేప్రాంతానికి చెందిన వెంకటేష్(22)ను ప్రేమించింది. ఈ విషయం యువతి ఇంటిలో తెలియడంతో అక్కకు పెళ్లి చేసిన తర్వాత శిరీష పెళ్లి చేస్తామని చెప్పారు. అనంతరం కుటుంబంతో సహా గోపాలపట్నం వచ్చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ రెస్టారెంట్ నడపుతూ, దానిపై ఇంటిలో జీవిస్తున్నారు. అయినప్పటికీ వెంకటేష్‌తో ఫోన్లో శిరీష మాట్లాడుతుండేది. శిరీష, వెంకటేష్ (వెంకటేష్ మృతదేహం) ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం రెస్టారెంట్ కౌంటర్లో శిరీష ఉండగా వెంకటేష్ ఫోన్ చేశాడు. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ వెంకటేష్‌కు మెసేజ్ చేసి మేడపైన గదిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆ మెసేజ్‌ను యువతి అక్కకి వెంకటేష్ పంపించగా... ఆమె అప్రమత్తమై మేడపైకి వెళ్లి చూడగా శిరీష అప్పటికే ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. వెంటనే రెస్టారెంట్ సిబ్బంది సాయంతో యువతిని కిందకు దించి గోపాలపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి కేజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న గోపాలపట్నం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆమె తండ్రి ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నారని పోలీసులు చెప్పారు. ప్రియురాలు లేదని... మరోవైపు ప్రియురాలు చనిపోయిందన్న విషయం ఆమె కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న వెంకటేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి బర్మా క్యాంపు సమీపంలో నివసిస్తున్న అతను అక్కడికి దగ్గరలోని చెట్టుకు బుధవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని చెప్పినప్పటికీ ఎందుకు ఇలా చేసుకున్నారో అర్థం కావడం లేదని యువతి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
కొండపై ప్రేమజంట ఆత్మహత్య!
ఒడిశా, బరంపురం: గంజాం–గజపతి జిల్లా సరిహద్ధులోని కొండపై ప్రేమజంట మృతదేహాలను పోలీసులు ఆదివారం కనుగొన్నారు. ఎస్డీపీఓ అశోక్‌కుమార్ మహంతి తెలిపిన వివారాల మేరకు... ఆర్.ఉదయగిరి పోలీసు స్టేషన్ పరిధి కుమ్మరి వీధి సమీపంలో ఉన్న కొండలపై యువతీ, యువకుల మృతదేహాలు ఉన్నట్లు స్థానికులకు సమాచారం అందించారు. దీనిపై వెళ్లి, వెతకగా.. గుర్తు పట్టలేని విధంగా ఉన్న ఇద్దరి మృత దేహాలను పోలీసులు కనుగొన్నారు. చనిపోయి చాలా రోజులై ఉంటుందని, అటవీ జంతువులు శరీర భాగాలను తీవ్రంగా గాయ పరిచాయని తెలిపారు. ప్రేమజంటగా అనుమానిస్తున్న వారికి సమీపంలో దుస్తుల బ్యాగ్, పాయిజన్ బాటిల్‌ను పోలీసులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అనుమాన్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు దొరికితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఎస్డీపీఓ తెలిపారు. -
‘కలసి బతకలేం.. విడిచి ఉండలేం..’
సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్): ‘ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నాం.. మా పెళ్లిని సమాజం హర్షించదు. కలసి బతకలేం.. విడిచి ఉండలేం..’ అని ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గాంధీనగర్‌లోని ఓ హోటల్లో చోటుచేసుకుంది. ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడు ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గన్నవరం మండలం తెంపల్లికి చెందిన నాగబోయిన గౌతమి (28), వెంట్రప్రగడకు చెందిన లోకేశ్(19) ఇద్దరు సుమారు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. గౌతమి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, లోకేశ్ పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ఇద్దరి మధ్య వయసు తేడా ఉన్నా ప్రేమించుకున్నారు. ఇదిలా ఉండగా క్రిస్మస్కి దుస్తులు కోసమని చెప్పి గురువారం ఉదయం గాంధీనగర్‌లో ఒక హోటల్లో రూం తీసుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో షాపింగ్ వెళతామని హోటల్ నిర్వాహకులకు చెప్పి ఆ సమయంలో కాలింగ్ బెల్ పెట్టాలని కోరారు. రాత్రి అయినా వారు గదిలో నుంచి బయటికి రాకపోవడంతో నిర్వాహకులు అనుమానంతో సత్యనారాయణపురం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ బాలమురళీకృష్ణ, ఎస్ఐలు సత్యనారాయణ, విమల ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు బద్దలకొట్టారు. లోపల వారు మంచంపై గౌతమి విగతాజీవిగా పడిఉండగా, యువకుడు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలం నుంచి యువతిని పోస్టుమార్టానికి తరలించగా లోకేశ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గౌతమి అంత్యక్రియలు పూర్తి తెంపల్లె (గన్నవరం రూరల్): మండలంలోని తెంపల్లెలో శుక్రవారం విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ గ్రామానికి చెందిన నాగబోయిన గౌతమి (28) విజయవాడలోని లాడ్జిలో విషం తీసుకుని మృతి చెందటం గ్రామస్తులను కలచివేసింది. గ్రామానికి చెందిన రైతు నాగనబోయిన వెంకటరావు కుమార్తె గౌతమి చిన్నతనం నుంచి అందరితో ఎంతో మర్యాదగా నడుచుకునేదని స్థానికులు బెబుతున్నారు. ఎంటెక్ చదివి ఉద్యోగం చేసుకుంటూ ఎంతో వినయంగా ఉండే గౌతమి మృతి చెందటాన్ని బంధువులు, గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. వెంకటరావుకు ఇద్దరు సంతానం కాగా గౌతమి కుమార్తె. ఆమెకు అన్నయ్య ఉన్నాడు. గత నవంబరు నెలలో ఆమెకు నిశ్చితార్ధం జరిగింది. వచ్చే నెల వివాహం చేసేందుకు నిర్ణయించారు. ఇంతలో ఈ విధంగా జరగటంతో గ్రామంలో విషాదం నెలకొంది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో గౌతమి విషం తీసుకుని చనిపోయిందని పోలీసుల ద్వారా తెలుసుకున్న గ్రామస్తులు నివ్వెరపోయారు. హుటాహుటిన విజయవాడకు వెళ్లారు. తెంపల్లెకు సమీపంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తోంది. అయితే వివాహం విషయంలో తీసుకున్న నిర్ణయం కుటుంబ సభ్యులకు నచ్చకపోవటమే గౌతమి మృతికి కారణమైందని పోలీసులు భావిస్తున్నారు. గౌతమి మృతదేహానికి శుక్రవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. -
పీజీ అమ్మాయి.. పదో తరగతి అబ్బాయి
ఔను! వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. యువతి ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్ అయితే.. యువకుడు అదే ప్రైవేటు స్కూల్లో బస్ డ్రైవర్.. ఇద్దరి మనసులు కలిశాయి. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే వారి ప్రేమను పెద్దలకు చెప్పలేక.. తీవ్ర మానసిక సంఘర్షణ మధ్య ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి ప్రేమ కథకు వారికి వారే ముగింపు పలుకుతూ.. వారి రెండు కుటుంబాలను విషాదంలోకి నెట్టారు. సాక్షి, మలికిపురం(తూర్పుగోదావరి జిల్లా): మండలంలోని తూర్పుపాలెం గ్రామానికి చెందిన పద్మశాలి సామాజికవర్గానికి చెందిన చిక్క రాముడు, సూర్యకుమారి భార్యాభర్తలు. వీరికి వీరవెంకట నాగ సత్య దుర్గా ప్రశాంతి కుమార్తె, సాయి వీరేంద్ర కుమారుడు. వీరిది నిరుపేద కుటుంబం. చేనేత వృత్తితో ఆదాయం సరిపోక తండ్రి రాముడు తాపీపని చేస్తుంటారు. భర్త చేనేతలో పాలు పంచుకుంటూ భార్య కూడా నేత నేస్తుంది. తమ సంతానం తమ మాదిరిగా కాకుండా ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆ పేదింటి తల్లిదండ్రుల పట్టుదల. అందుకు తగ్గట్టుగానే కుమార్తెను పీజీ వరకు చదివించారు. కుమారుడు కూడా పీజీ పదువుతున్నాడు. పీజీ అనంతరం ప్రశాంతి మండలంలోని గూడపల్లి వెంకటసత్య కాన్సెప్ట్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదుడు వాదోడుగా నిలుస్తూ వచ్చింది. శోక సముద్రంలో ప్రశాంతి తల్లిదండ్రులు తీవ్ర మానసిక సంఘర్షణతో.. రాజోలు మండలంలో కాట్రేనిపాడుకు చెందిన మరో సామాజిక వర్గానికి చెందిన యాలంగి రమేష్‌తో ఆమెకు పరిచయమై అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని ఇద్దరూ భావించారు. పదో తరగతి చదివిన యాలంగి రమేష్ ప్రశాంతి పనిచేసే కాన్వెంట్ స్కూల్ వ్యాన్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరూ ఒకరికొకరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతలో ఈనెల 8న ప్రశాంతికి కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయం చేశారు. అయితే ప్రశాంతి తన ప్రేమ సంగతిని కుటుంబ సభ్యులకు చెప్పలేక, ప్రేమించిన యువకుడిని వదల్లేక తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైంది. అయితే తల్లిదండ్రులు ఆమెకు ముందుగా కుదిర్చిన యువకుడితో ఇటీవల నిశ్చితార్థం జరిపించేశారు. ఆ మరుసటి రోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చదువుకున్న కళాశాల నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని చెప్పి బయల్దేరిన కుమార్తెను ఆ తల్లి ఉదయమే బస్సు ఎక్కించి దగ్గరుండి మరీ సాగనంపింది. అవే ఆ తల్లీ, కుమార్తెలకు కడసారి చూపులు అవుతాయని ఆరోజు వారు అనుకోలేదు. సర్టిఫికెట్ల కోసమని వెళ్లిన కుమార్తె చీకటిపడినా రాకపోవడంతో తల్లిదండ్రులకు కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఈనెల 12న యానాం వద్ద గోదావరిలో కుమార్తె ప్రశాంతి, ఆమె ప్రేమికుడు రమేష్‌ల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. కుమార్తె ప్రేమ వ్యవహారం తమకు తెలియదని తెలిస్తే సహకరించే వారమని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చాలా సున్నితమనస్కురాలైన ప్రశాంతి చదువులో ఎప్పుడూ ఫస్ట్‌లోనే ఉంటానని చెబుతూ అలానే చదువుకుందని, పెద్ద ఉద్యోగం చేసి తమకు కష్టాలు లేకుండా చేస్తానని ఎప్పుడూ చెప్పే చిట్టి తల్లి కళ్లెదుటే కనిపించకుండా పోయిందని ఆ తల్లిదండ్రులు కుమార్తె ఫొటోను చూసుకుంటూ గుండెలవిసేలా రోధిస్తున్నారు. మరో వైపు యాలంగి రమేష్ తల్లిదండ్రులు కృష్ణమూర్తి, సీతలను ఎవరైనా పలకరిస్తే చాలు దుఃఖం పొంగుకువచ్చేస్తోంది. ఆ ప్రేమజంట అర్ధాంతరంగా తనువు చాలించడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. -
దారుణం : వారి ప్రేమకు కులం అడ్డు.. అందుకే
సాక్షి, విజయవాడ : ప్రేమకు కులం అడ్డురావడంతో ఓ జంట బలవన్మరణానికి పాల్పడింది. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం ఆముదాలపల్లి పంచాయితీ శివారు జయపురానికి చెందిన రాహుల్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో ఐటీ రెండోసంవత్సరం చదువుతున్నాడు. ఈక్రమంలో ముదినేపల్లి మండలం అన్నారం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని హారికతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ మైనర్లే, కులాలు కూడా వేరుకావటంతో పెద్దలు విడదీస్తారని భయపడి పారిపోయారు. ఇరు కుటుంబాల సభ్యుల ఫిర్యాదులతో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఎట్టకేలకు వీరి జాడ దొరికింది. ఇద్దరినీ తీసుకొచ్చి పంచాయితీ పెట్టి విడదీశారు. కులం తక్కువ వాడితో వెళతావా అంటూ హరికను మందలించారు. ఒకరినొకరు కలవకుండా ఆంక్షలు విధించారు. అయితే, కొద్దిరోజుల తర్వాత పనిమీద బయటకొచ్చిన రాహుల్ అదృశ్యమయ్యాడు. అదేసమయంలో హారిక కూడా కనిపించకుండా పోయింది. ఇద్దరి కోసం ఎంత ఎంత గాలించినా లాభం లేకపోయింది. మళ్లీ ఎటైనా పారిపోయారేమోనని అందరూ భావించారు. కానీ, ఎడబాటును తట్టుకోలేక పోయిన ఆ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. జయపురంలోని రాహుల్ అమ్మమ్మ ఇంటినుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు ఆదివారం సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు ఇద్దరూ శవాలై కనిపించారు. ఇంట్లోని బెడ్‌పై హారిక మృతదేహం ఉండగా రాహుల్ శవం ఉరికి వేలాడుతూ దర్శనమిచ్చింది. ఘటన జరిగి నాలుగు రోజులలై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే, లోపల ఆత్మహత్యలకు పాల్పడితే బయట తాళం వేసి ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇది పరువు హత్యా, ఆత్మ హత్యా అనేది పోలీసుల విచారణలో తేలనుంది. -
ప్రేమికుల ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: వివాహానికి పెద్దలు నిరాకరించారని ప్రేమికులు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా నగరూరు సమీపంలోని రిసార్ట్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. తమిళనాడు ధర్మపురి హిందూర్ గ్రామం నివాసి శ్రీనివాసన్ (35), కృష్ణగిరికి చెందిన సత్యజ్యోతి (27) ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీనివాసన్ ధర్మపురిలోని ఒక జాతీయ బ్యాంకులో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం అదే బ్యాంకులో క్యాషియర్‌గా చేరిన సత్యజ్యోతితో పరిచయం ఏర్పడి ప్రేమ చిగురించింది. అయితే శ్రీనివాసన్‌కు అప్పటికే వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. దీంతో ఇరువైపుల పెద్దలు వీరి వివాహానికి నిరాకరించారు. బుధవారం బెంగళూరు వచ్చిన వీరు అదేరోజు రాత్రి రిసార్ట్‌లో రూం తీసుకున్నారు. గురువారం చెక్ఔట్ చేస్తామని చెప్పిన ఇద్దరూ చీకటిపడ్డా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన రిసార్ట్ సిబ్బంది నకిలీ కీతో తలుపులుతీసి చూడగా ఇద్దరూ అప్పటికే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంగతి వెలుగుచూసింది. దీంతో రిసార్ట్ వారు పోలీసులకు సమాచారమిచ్చారు. మాదనాయకనహళ్లి పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించగా మృతులు రాసుకున్న డెత్‌నోట్ దొరికింది. తమ ప్రేమను పెద్దలు నిరాకరించినందుకే ఆత్మహత్య చేసుకుంటున్నామని డెత్‌నోట్‌లో ఉంది. మృతదేహాలను విక్టోరియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. -
పెళ్లైన మరుసటి రోజే ఓ ప్రేమజంట..
సాక్షి, జంగారెడ్డిగూడెం (పశ్చిమ గోదావరి): చదువుకున్న రోజుల్లో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది.. ఒకరికొకరం అనుకున్నారు.. కలిసి జీవిద్దామని కలలు కన్నారు.. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు.. ఒకరోజు ముందు దైవ సన్నిధిలో గడిపారు.. మరుసటి రోజు గుళికలు తిని మృత్యుఒడిలోకి చేరిపోయారు.. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపారు.. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలో చోటుచేసుకున్న హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలోని వైట్‌హౌస్ అనే లాడ్జీలో ప్రేమజంట గుళికలు తిని శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నాగంపల్లి శేఖర్ (20) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా తెల్లం పోసమ్మ అనే యువతి జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. బుట్టాయగూడెం మండలం నూతిరామన్నపాలెంకు చెందిన నాగంపల్లి శేఖర్ (20), పోలవరం మండలం సరిపల్లికుంటకు చెందిన తెల్లం పోసమ్మ కొనేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 2017లో కొయ్యలగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శేఖర్, పోసమ్మ ఇంటర్ చదువుతున్న రోజుల్లో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అప్పటినుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం శేఖర్, పోసమ్మ జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. వీరిద్దరూ మద్దిక్షేత్రంలో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో వీటి ఆధారంగా వీరు వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. మద్దిక్షేత్రంలో గడిపిన వీరిద్దరూ గుర్వాయిగూడెంలోని వైట్‌హౌస్ అనే లాడ్జీలో గది అద్దెకు తీసుకున్నారు. శనివారం ఉదయం పోసమ్మ వాంతులు చేసుకోవడాన్ని లాడ్జీలో పనిచేసే వాళ్లు, స్థానికులు గమనించారు. అప్పటికే గదిలో ఉన్న శేఖర్ గుళికలు తిని మృతిచెందాడు. అపస్మారక స్థితిలో ఉన్న పోసమ్మను స్థానికులు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. గతంలో కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసుకు సంబంధించి శేఖర్‌పై కేసు నమోదైంది. లక్కవరం ఎస్సై పరిమి రమేష్ కేసు దర్యాప్తు చేశారు. వీరిద్దరి వివాహానికి పెద్దల అంగీకారం లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్సై చెప్పారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
యువతీయువకుల ఆత్మహత్య
నిజామాబాద్ సిటీ(నిజామాబాద్‌అర్బన్): ప్రేమ జంటగా భావిస్తున్న యువతీయువకులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. నగరంలోని కంఠేశ్వర్ రైల్వే కమాన్ ప్రాంతంలోని సోని ఫంక్షన్‌హాల్ (ఎల్లమ్మగుట్ట) వద్ద మంగళవారం తెల్లవారుజామున రైలు పట్టాలపై యువతి, యువకుడి మృత దేహాలను గుర్తించిన రైలు కో పైలట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ఎస్సై ప్రణయ్‌కుమార్ ఉదయం 4 గంటల ప్రాంతంలో సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. యువకుడికి 23, యువతికి 20 సంవత్సరాలు వయస్సు ఉండొచ్చని ఎస్సై పేర్కొన్నారు. అయితే ఘటన స్థలంలో మృతుల వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాలకు సమీపంలో సెల్‌ఫోన్ పడిఉన్నప్పటికీ అందులో అందులో సిమ్‌కార్డు లేదు. మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతుల ఆచూకీ కోసం ఫొటోలను సివిల్ పోలీసులకు పంపించారు. ఎలాంటి సమాచారం లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులుగా కేసు నమోదు చేశారు. మృతులు ప్రేమజంట అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, వైఎస్సార్ జిల్లా : తమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలం గంగాయపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం వన్‌టౌన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రమేష్.. అదే జిల్లాకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వీరి వివాహానికి రమేష్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. రమేష్‌కు బలవంతంగా వేరే అమ్మాయితో వివాహం కుదుర్చారు. వచ్చే నెలలో పెళ్లి చేయాలని ముహూర్తం పెట్టుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన రమేష్, ప్రియురాలితో కలిసి సోమవారం అర్థరాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
ప్రేమికులూ.. 'ఆత్మహత్యలకు పాల్పడవద్దు’
మన్సూరాబాద్: ఇంట్లో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని లవ్ ఫెయిల్యూర్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ సతీష్‌గౌడ్ సూచించారు. ఎల్బీనగర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ పెళ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదని ఇటీవల ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిందన్నారు. ఆ జంటకు కౌన్సెలింగ్ చేశామని తెలిపారు. వారి ఇంట్లో పెద్దలకు నచ్చజెప్పి ఈ నెల 10న ఆర్య సమాజ్‌లో వివాహం జరిపించినట్లు తెలిపారు. ప్రేమే జీవితం కాదనే సత్యాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఇటీవల ప్రేమజంటల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, వీటిని నిరోధించటానికి అసోసియేషన్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రేమికులు 81065 87621 నంబర్‌ను సంప్రదిస్తే ఇంట్లోని పెద్దలను ఒప్పించి పెళ్లి జరిపిస్తామని ఆయన పేర్కొన్నారు. -
మెదక్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
-
పెళ్లికి నిరాకరిస్తారని లవర్స్ సూసైడ్
సాక్షి, మెదక్: మతాలు వేరుకావటంతో పెద్దలు పెళ్లికి నిరాకరిస్తారన్న ఆందోళనతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి చెందిన బాలేష్(19) అనే యువకుడు రామాయంపేటలోని ఓ వ్యాపార సంస్థలో పని చేసేవాడు. రామాయంపేట మండలం రాయపూర్ గ్రామానికి మహమ్మద్ ప్రవీణ (19) రామాయంపేటలో టైలరింగ్ నేర్చుకోవడానికి వస్తుండగా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమ విషయం రెండు రోజుల క్రితం బాలేష్ ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు అతన్ని పని మానిపించారు. దీంతో బాలేష్, ప్రవీణలు తమ మతాలు వేరుకావటంతో పెద్దలు పెళ్లికి నిరాకరిస్తారని ఆందోళనకు గురయ్యారు. నిన్న ఇంటి నుంచి ఇద్దరూ బయటకు వెళ్ళిపోయారు. అయితే ఈ ఆదివారం ఝాన్సీ లింగాపూర్ శివారులో బాలేష్ బైక్‌ను గుర్తించిన స్థానికులు అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు అడవి ప్రాంతంలో గాలించగా బాలేష్, ప్రవీణలు చెట్టుకి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రియురాలి మరణం తట్టుకోలేక..
వాంకిడి(ఆసిఫాబాద్): ఇంట్లో పెద్దలు ప్రేమకు ఒప్పుకోలేదని తీవ్ర మనస్థాపానికి గురై ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడగా.. అది చూసి ప్రియుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన వాంకిడి మండలంలోని మహాగాంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్సెంగ్ గౌరుబాయి(18) అదే గ్రామానికి చెందిన మడపచ్చి భరత్(22) ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు వరుసకు బావమరుదళ్లు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో గౌరుబాయిని తల్లిదండ్రులు ఇటీవల మందలించారు. అప్పటి నుంచి మనస్థాపానికి గురైన గౌరుబాయి తన ప్రేమకు తల్లిదండ్రులు ఇక ఒప్పుకోరన్న బాధతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. ఇంటి పక్కవారు గమనించి మహారాష్ట్రలోని చికిలి పాటన్ గ్రామానికి చెందిన గౌరుబాయి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో వాంకిడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆసిఫాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో గౌరుబాయి మృతిచెందింది. బహిర్భూమికి వెళ్లి ప్రియుడు.. ప్రియురాలి మరణ వార్త తెలుసుకున్న ప్రియుడు మడపచ్చి భరత్(22) శనివారం ఉదయం బహిర్భూమికి అని వెళ్లి ఇంటి పక్కనే గల చేనులో పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. అప్పటికే భరత్ స్పృహా కోల్పోతున్న భరత్ జరిగిన విషయాన్ని అన్నయ్య తిరుపతికి చెప్పాడు. దీంతో వెంటనే భరత్‌ను వాంకిడి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఆసిఫాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో భరత్ కూడా మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. చిన్న వయసులోనే ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడడంతో గ్రామంలో విషాదచాయలు కమ్ముకున్నాయి. ఇరువైపులా కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. -
తాళి కట్టాకే ఆత్మహత్య ?
తూర్పుగోదావరి, ప్రత్తిపాడు: ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రేమికులు ఆత్మహత్య చేసుకుని, మృతి చెందారు. ఎవరూ లేని సమయంలో గదిలో దూలానికి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్ప డ్డారు. ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ విషాద సంఘటన జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. లంపకలోవ గ్రామానికి చెందిన మాసా ఏసుబాబు, రాణి దంపతుల కుమార్తె నవ్య (17) గత ఏడాది పదో తరగతి పూర్తి చేసి ఇంటివద్దనే ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు జీవనోపాధి కోసం దూర ప్రాంతంలో ఇటుకబట్టీలో పనిచేస్తున్నారు. నవ్య తన నాయనమ్మ మాసా ముసలమ్మతో కలిసి ఉంటోంది. అదే గ్రామానికి చెందిన కింతాడ అంజిబాబు (21) పెయింటింగ్, ఎలక్ట్రీషియన్ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. అంజిబాబు, నవ్యలు ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి అంజిబాబు తల్లిదండ్రులు రాంబాబు, నూకాలమ్మలు అంజిబాబు, నవ్యలకు వివాహం చేయాలని నవ్య తల్లిదండ్రులను కోరారు. కానీ బంధువుల అబ్బాయితో తమ కుమార్తెకు వివాహం చేస్తామంటూ ఏసుబాబు, రాణిలు తిరస్కరించారు. పెద్దలు తమ వివాహానికి అంగీకరించకపోవడంతో నవ్య ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇద్దరూ కలిసి ఈ అఘాయిత్యానికి పాలడ్డారు. మాసా ముసలమ్మ ఇంటికి వచ్చి తలుపు తీసి చూడగా నవ్య మృతదేహం కిందన, దూలానికి వేలాడుతూ అంజిబాబు ఉండడంతో కేకలు పెట్టింది. ఇరుగు పొరుగు ఇచ్చిన సమాచారంతో ప్రత్తిపాడు ఎస్సై ఎం అశోక్ సంఘటనా స్థలానికి చేరుకుని, విచారిస్తున్నారు. రెండు కుటుంబాల్లో విషాదం ప్రేమికుల ఆత్మహత్య రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇరుగు పొరుగుతో సఖ్యతతో ఉండే అంజిబాబు, నవ్యలు మృతి చెందడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. నవ్య నాయనమ్మ ముసలమ్మను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. పిల్లను చేతిలో పెట్టి బతుకు దెరువు కోసం దూరప్రాంతాని వెళ్లిన తన కొడుకు, కోడలికి ఏమి చెప్పాలంటూ బోరున విలపిస్తోంది. ఇక కింతాడ రాంబాబు, నూకాలమ్మ దంపతుల మూడో సంతానమైన అంజిబాబు ఎలక్ట్రికల్, పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. చిన్న కుమారుడు మృతిని వారు తట్టుకోలేకపోతున్నారు. సాయంత్రం వరకు కళ్లముందు ఉన్న కొడుకు విగతజీవుడుగా మారడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాళి కట్టాకే ఆత్మహత్య ? మాసా నవ్య మెడలో పసుపుతాడు ఉండడంతో ఆత్మహత్యకు ముందే ఆ గదిలో వివాహం చేసుకున్నారా? అనే అనుమానం కలుగుతోంది. వారిద్దరి వివాహానికి నవ్య తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని స్థానికులు అనుకుంటున్నారు. ప్రేమ పెళ్లి చేసుకోగలిగామనే సంతృప్తితోనే ఆఖరి క్షణంలో వివాహం చేసుకుని ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఆత్మహత్యల వెనుక ఉన్న కారణం ఏమై ఉంటుందన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సిందే. -
కాటేసిన మైనర్ల ప్రేమ..!
రెండు కుటుంబాలవి పక్క పక్క ఇళ్లే.. తెలిసీ తెలియని వయసులో ఇద్దరు మైనర్లలో ఆకర్షణ మొదలైంది. అది పరిచయానికి దారితీసి ఇద్దరి మనసులు కలిశాయి..కొంతకాలంగా సాగుతున్న వారి ప్రేమ హద్దులు దాటడంతో బాలిక గర్భం దాల్చింది. విషయం బయటికి పొక్కడంతో పెద్దల మధ్య విభేదాలు పొడచూపాయి. తమ ప్రేమను ఒప్పుకోరనో..? విడిచి ఉండలేనని నిర్ణయించుకుందో..? మరో కారణమో తెలియదు కానీ ఆ బాలిక బలవన్మరణానికి ఒడిగట్టింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి (మనుగోడు) : నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామంలో ఇద్దరు మైనర్ల కుటుంబాలు పక్కపక్కనే నివాసముంటున్నాయి. బాలిక తొమ్మిదో తరగతి వరకు చదివి కూలి పనులకు వెళ్తుండగా బాలుడు ఇంటర్మీడియట్ చదువుతూ ఆటో నడుపుతున్న తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో బాలిక పత్తికూలికి ఆ బాలుడి తండ్రి ఆటోలోనే వెళ్లేది. అలా తండ్రి లేని సమయంలో బాలుడు ఆటో నడుపుతుండగా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. హద్దులు దాటి.. గర్భందాల్చి.. ఇద్దరు మైనర్లే కావడం.. జీవితంపై అవగాహన లేకపోవడం.. సినిమాల ప్రభావం వెరసి వారి ప్రేమ కాలక్రమేణా హద్దులు దాటింది. ఇద్దరి మనసులు ఒక్కటి కావడంతో బాలిక గర్భం దాల్చింది. ఆ విషయం ఇంట్లో తెలిస్తే ఎక్కడ తమను వేరు చేస్తారో అన్న భయాందోళనతో బాలిక మిన్నకుండిపోయింది. బాలిక ఇటీవల అనారోగ్యం బారిన పడడంతో ఏడు నెలల గర్భవతి అని తెలియడంతో కుటుంబ సభ్యులు నిలదీయడంతో తమ ప్రేమాయణం బయటపెట్టింది. ప్రేమికుల మధ్య వాగ్వాదం అయితే, శుక్రవారం సాయంత్రం బాలిక కుటుంబాలు ఇంట్లోనే మంతనాలు జరుపుతున్నారు. ఈ సమయంలో బాలుడు వారి ఇంటి ఎదురుగా నుంచి వెళ్తుండగా బాలిక గమనించింది. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. దీంతో సదరు బాలుడు కోపోద్రిక్తుడై బాలికపై చేయి చేసుకున్నాడు. బాలుడి ఇంటి ఎదుట ధర్నా.. బాలిక మృతదేహానికి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బాలిక కుటుంబ సభ్యులు మధ్యాహ్నం బాలుడి ఇంటి ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అప్పటికే బాలుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకుని పోలీసులు గ్రామానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. బాలిక కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాలిక మృతికి కారణమైన సదరు బాలుడితో పాటు అతడి తండ్రిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు నాంపల్లి ఎస్ఐ శివకుమార్ తెలిపారు. అబార్షన్ చేయించమని.. విషయం తెలుసుకుని కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు శుక్రవారం సదరు ప్రేమికుడి ఇంటికి వెళ్లి తల్లిదండ్రిని నిలదీశారు. ఇద్దరూ మైనర్లే కావడంతో విషయం తర్వాత చర్చిద్దామని తొలుత బాలికకు అబార్షన్ చేయించమని బాలుడి తండ్రి సూచిం చాడు. అందుకు రూ.5వేలు కూడా ముట్టజెప్పాడు. అయితే ఆస్పత్రికి వెళ్లిన బాలిక కుటుంబ సభ్యులకు ఏడు నెలల గర్భానికి అబార్షన్ చేయాలంటే రూ. 25వేలు ఖర్చు అవుతుందని తెలిపారు. వెంటనే బాలుడి తండ్రికి ఫోన్ చేయగా స్వీచ్ ఆఫ్ రావడం, తమ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో బాలిక కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగివచ్చారు. పురుగుల మందు తాగి.. వారిద్దరి మధ్య ఏం విషయంలో వాగ్వాదం జరిగిందో, ప్రేమికుడు చేయిచేసుకున్నాడనో.. పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందిందో తెలియదు కానీ వెంటనే ఇంట్లోకి వెళ్లిన బాలిక పురగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు సదరు బాలికను నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అక్కడినుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. -
వివాహేతర సంబంధం..సూసైడ్ నోట్?
సాక్షి, వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ సన్నిధిలో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బూడిదగడ్డ బస్తీకి చెందిన వివాహిత రాచర్ల మౌనిక(26), బెల్లంపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సింగతి విష్ణువర్ధన్( 26) క్రిమిసంహారక మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం బద్ది పోచమ్మ వీధిలోని ఓ ప్రైవేటు లాడ్జీలో వెలుగు చూసింది. వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. సీఐ వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బూడిదగడ్డ బస్తీకి చెందిన మౌనిక, బెల్లంపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన విష్ణువర్ధన్ కలిసి శనివారం వేములవాడ పుణ్యక్షేత్రానికి వచ్చారు. బద్దిపోచమ్మ వీధిలో ఉన్న ఓప్రైవేట్ లాడ్జీలో గది అద్దెకు తీసుకున్నారు. ఒకరోజు కోసం రూమ్ తీసుకున్న ఇద్దరు మరుసటిరోజు ఆదివారం అద్దెను పొడగించుకుని ఆ రూమ్‌లోనే గడిపారు. సోమవారం రూం ఖాళీ చేయాలని లాడ్జీ నిర్వాహకులు ఆదేశించారు. మంగళవారం మొక్కులు చెల్లించుకునేది ఉందని చెప్పి మళ్లీ అద్దె పొడగించుకున్నారు. మంగళవారం రూమ్ ఖాళీ చేయించడానికి లాడ్జీ నిర్వాహకులు రూమ్ వద్దకు వెళ్లి తలుపు తట్టగా లోపలి నుంచి స్పందన రాలేదు. అనుమానం వచ్చి లాడ్జీ సిబ్బంది కిటికీలోంచి చూడగా విష్ణు, మౌనిక మంచంపై విగత జీవులుగా కనిపించారు. ఇద్దరి నోట్లో నుంచి నురగులు వచ్చినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి తీసుకుని గదిలోకి వెళ్లి చూడగా ఇద్దరూ మృతిచెందినట్లు గుర్తించారు. ఘటనాస్థలంలో పోలీసులు సూసైడ్ నోట్, ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా మృతుల అడ్రస్ గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. వివాహేతర సంబంధం..! విష్ణువర్ధన్, మౌనిక కొన్నాళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. కాగా మౌనికకు కరీంనగర్ జిల్లా ఓదెల గ్రామానికి చెందిన రాచర్ల అశోక్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కూతురు అమతవర్షిణీ, నాలుగేళ్ల కుమారుడు ఆర్యన్ ఉన్నారు. మూడేళ్ల క్రితం మౌనికను ఆమె తండ్రి గుండారపు కృష్ణ మూడేళ్ల క్రితం బెల్లంపల్లికి తీసుకొచ్చాడు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌనిక ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు చేస్తోంది. ప్రస్తుతం ఆమె తృతీయ సంవత్సరం చదువుతోంది. అయితే మౌనిక వివాహం చేసుకున్నా చిన్ననాటి స్నేహితుడు లింగాపూర్ గ్రామానికి చెందిన విష్ణుతో ప్రేమాయణం కొనసాగించింది. ఆ విషయాన్ని మృతులు సూసైడ్ నోట్లో రాసినట్లు పోలీసులు గుర్తించారు. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న మౌనిక వివాహేతర బంధం సాగించడంతో కొన్ని నెలల క్రితం ఆ విషయం తెలిసి గొడవలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు చేస్తున్న క్రమంలో ప్రతిరోజు మౌనిక స్థానిక ప్రభుత్వాసుపత్రికి ప్రాక్టీకల్స్ చేయడానికి కాలేజీ నుంచి విష్ణు ఆటోలో వెళ్లేది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య బంధం మరింత బలపడినట్లు సమాచారం. కలిసి జీవించలేక.. విష్ణువర్ధన్, మౌనికల మధ్య ప్రేమ బంధం బలపడినా కలిసి జీవించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆమెకు పెళ్లి కావడం, ఇద్దరు పిల్లలు ఉండడం ఓ కారణమైతే, ఇద్దరి కులాలూ వేరు కావడంతో ఏం చేయాలో పాలు పోని పరిస్థితులు ఎదుర్కొన్నారు. భర్త నుంచి ఆమెకు విడాకులు ఇప్పించినా తన సామాజికవర్గం అంగీకరించదని విష్ణు ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలోనే వేములవాడకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సూసైడ్ నోట్.. ప్రేమ వ్యవహారం ప్రైవేట్ లాడ్జీలో ఆత్మహత్యకు పాల్పడిన విష్ణువర్ధన్, మౌనిక పదో తరగతి నుంచి ప్రేమించుకుంటున్నామని, ఈ క్రమంలో తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని ఆ ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తూనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు సీఐ వెంకటస్వామి తెలిపారు. వివాహేతర బంధం చివరికి ఆ ఇద్దరినీ బలితీసుకోగా.. మౌనిక పిల్లలు తల్లిలేనివారయ్యారు. తరలివచ్చిన కుటుంబ సభ్యులు.. వేములవాడలో ఇద్దరు ప్రేమికులు చనిపోయిన ఘటన తెలియగానే బెల్లంపల్లి నుంచి మౌనిక ,విష్ణు కుటుంబీకులు హుటాహుటీన వచ్చారు. లాడ్జీలో విగత జీవులుగా పడిఉన్న ఇద్దరినీ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. మృతదేహాలను పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టమార్టం చేయించారు. అనంతరం బంధువులకు అప్పగించారు. -
మనస్పర్థలతో ప్రేమికుల ఆత్మహత్య
శంకర్పల్లి: క్షణికావేశం రెండు నిండు జీవితాలను బలిగొంది. మనస్పర్థలు ప్రేమజంట బలవన్మరణాలకు కారణమయ్యాయి. వివరాలు... రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగుటూర్‌కు చెందిన సురగళ్ల సత్తయ్య, ప్రకాశం కుటుంబాలు పక్కపక్కనే నివసిస్తున్నాయి. సత్తయ్య కుమారుడు ఎల్లేశ్(22) ఇంటర్ వరకు చదువుకుని గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ప్రకాశం కూతురు లావణ్య(19) పదో తరగతి వరకు చదువుకుని ఇంటి దగ్గరే ఉంటోంది. ఎల్లేశ్, లావణ్య వరు సకు బావ మరదళ్లు. వీరు చాలారోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో ఎవరికీ తెలియదు. కాగా, గ్రామంలో ఆదివారం రాత్రి స్నేహితులతో సరదాగా గడుపుతూ మధ్యలో లావణ్యకు ఫోన్ చేశాడు. ఏదో విషయమై ఇద్దరూ ఫోన్లో గొడవపడ్డారు. ఆమె ఫోన్ కట్ చేయడంతో ఎల్లేశ్ ఆవేశంగా ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతోనూ గొడవ పడ్డాడు. బయటకు వచ్చి కొంతమందికి ఫోన్ చేసి తాను చనిపోతున్నానని, బతకడం ఇష్టం లేదని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొన్నాడు. విషయం తెలుసుకున్న లావణ్య ఇంట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. మనస్పర్థల వల్లే ప్రేమికులిద్దరు క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం ఇరు కుటుంబాలు వేర్వేరుగా అంత్యక్రియలు నిర్వహించాయి. -
ప్రేమికుల ప్రాణం తీసిన మనస్పర్థలు
సాక్షి, రంగారెడ్డి : మనస్పర్థలు ఓ రెండు నిండు ప్రాణాలను బలికొన్నాయి. రంగారెడ్డి జిల్లాలో మనస్పర్థల కారణంగా ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని టంగుటూరు గ్రామానికి చెందిన యల్లాశ్(22) లావణ్య(19) గత కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. ఆ చిన్న చిన్న గొడవలు కాస్తా మనస్పర్ధలకు దారి తీశాయి. దీంతో ఆవేదనకు గురైన యల్లాశ్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న లావణ్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల్లో తీవ్రగాయాలపాలైన లావణ్య మృత్యువాత పడింది. పోలీసులు పోస్టుమార్టం కోసం వారి శవాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
రంగారెడ్డి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య
-
ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, తెనాలి రూరల్: గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ హోటల్లో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు రోజులుగా గదిలో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది కిటికీ నుంచి చూడగా, గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఉన్నారు. ప్రియుడు విజయవాడకు చెందిన వివాహితుడు కాగా, యువతి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. దీనికి సంబంధించి పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏలూరుకు చెందిన కొత్తలంక సాయిదివ్య (24) బీటెక్ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. బ్యాంకు పరీక్షలకు సంబంధించి విజయవాడలో కోచింగ్ తీసుకునేందుకు ప్రతిరోజు వచ్చి వెళుతుండేది. ఈ క్రమంలో విజయవాడ చిట్టినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ దారా పృధ్వీరాజు (30)తో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. సాయిదివ్య కనబడడం లేదంటూ ఈ నెల 9న ఆమె కుటుంబసభ్యులు ఏలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా... తెనాలి పట్టణం గాంధీచౌక్ సమీపంలోని ఓ హోటల్లో ఈ నెల 12న అద్దెకు దిగిన పృధ్వీరాజ్, సాయిదివ్య అప్పటి నుంచి బయటకు రాలేదు. సాయిదివ్య కోసం గాలిస్తున్న కుటుంబసభ్యులు, ఏలూరు పోలీసులు, ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా తెనాలిలో ఉన్నట్టు గుర్తించారు. వాకబు చేసుకుంటూ రాత్రికి గాంధీచౌక్ సమీపంలోని హోటల్‌కు వచ్చారు. హోటల్ సిబ్బంది, సాయిదివ్య కుటుంబసభ్యులు వెళ్లి తలుపు కొట్టగా సమాధానం లేదు. కిటికీలో నుంచి చూడగా, ఇద్దరూ ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నారు. దీంతో వెంటనే తెనాలి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ నెల 12వ తేదీ రాత్రి 10 గంటల ప్రాంతంలో పృధ్వీరాజ్, సాయిదివ్య హోటల్లో గది తీసుకున్నట్టు రికార్డులను పరిశీలించిన పోలీసులు నిర్ధారించారు. గది తలుపులు పగులగొట్టి, శవ పంచనామా చేసేందుకు వీలు పడకపోవడంతో మృతదేహాలను తరలించలేదు. వన్‌టౌన్ సీఐ ఎం.శ్రీనివాసరావు, సిబ్బంది హోటల్‌కు చేరుకున్నారు. రెండు రోజులుగా ఇద్దరూ బయటకు రాకపోయినా, లాడ్జి సిబ్బంది గమనించకపోవడంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. రెవెన్యూ అధికారులు వచ్చిన అనంతరం శవ పంచనామా నిర్వహించి, పోస్ట్‌మార్టం కోసం తరలిస్తామని పోలీసులు తెలిపారు. పృధ్వీరాజ్‌కు వివాహమైందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని సమాచారం. -
ప్రియుడికి సెల్ఫోన్లో మెసేజ్ పెట్టి..
తిరువళ్లూరు: వివాహితుడైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన యువతిని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోగా, విషయం తెలుసుకుని ప్రియుడు సైతం బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన తిరువళ్లూరు జిల్లా పోలీవాక్కంలో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా పోలీవాక్కంకు చెందిన మురుగన్ కుమారుడు రంజిత్‌కుమార్ (24). ప్రైవేటు కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన సుకన్యతో మూడేళ్ల కిందట వివాహం జరిగింది.రంజిత్‌కుమార్‌కు తన ఇంటి ఎదురుగా ఉన్న మంజుల (18)తో రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయం మంజుల కుటుంబీకులకు తెలియడంతో ఆమెకు సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. తనకు రంజిత్కుమార్తో వివాహం జరిపించాలని మంజుల తల్లిదండ్రులను వేడుకుంది. వివాహమైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె తల్లితండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన మంజుల బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ప్రియుడికి సెల్ఫోన్లో మెసేజ్ పెట్టి ఉరి వేసుకుంది. రంజిత్‌కుమార్ హుటాహుటిన ఆమె ఇంటి వద్దకు వెళ్లి చూడగా మంజుల ఉరి వేసుకుని శవంగా వేలాడుతోంది. మంజుల మృతదేహాన్ని కిందకు దింపిన అనంతరం రంజిత్‌కుమార్ నేరుగా సమీపంలోని మామిడి తోటకు వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వ్యవహారంలో ఇరువురి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనవాలనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమజంట బలవన్మరణం
కొండగట్టు (చొప్పదండి): ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ నరసింహస్వామి గుట్టపై వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్ గ్రామానికి చెందిన గంగన్న, నర్సు దంపతుల కూతురు గౌతమి (20), అదే గ్రామానికి చెందిన భోజన్న, గంగు దంపతుల కుమారుడు ప్రశాంత్ (22) ప్రేమించుకున్నారు. వీరిద్దరి కులాలు వేరు. అయితే.. ప్రేమ విషయం ఇరుకుటుంబాల పెద్దలకు తెలియడంతో మార్చి 23న గౌతమికి అదే గ్రామానికి చెందిన సమీప బంధువుల అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 7న వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్, గౌతమి అదేరోజు ఇంటి నుంచి పారిపోయారు. వారి ఆచూకీ కోసం ఇరువురి కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఫలితం దక్కకపోవడంతో ఏప్రిల్ 10న కమ్మర్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొడిమ్యాల మండలం నల్లగొండ శివారులో చెట్టుకు ఉరివేసుకున్నారు. ఘటనాస్థలంలో లభించిన బ్యాగు, సెల్‌ఫోన్, పర్స్ నుంచి దొరికిన ఆధారాల ప్రకారం.. వారిది నిజామాబాద్ జిల్లా హాసాకొత్తూర్ గ్రామంగా గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో అక్కడే పంచనామా చేశారు. -
ప్రేయసి ఇక లేదని.. రైలు పట్టాలపై తలపెట్టి!
సాక్షి, ఆత్మకూరు: ప్రేయసి ఆత్మహత్య చేసుకుని మృతిచెందడాన్ని తట్టుకోలేని ఓ యువకుడు తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో ఈ ఘటన కలకలం రేపుతోంది. ఆ వివరాలిలా.. విక్రమ్ అనే యువకుడు, సుస్మిత అనే ఇంటర్ విద్యార్థిని గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. అయితే వీరి ప్రేమ విఫలం కావడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు గుళికల మందు తాగి ఆమె బలవన్మరణం చెందింది. నేటి ఉదయం విషయం తెలుసుకున్న విక్రమ్.. ప్రియురాలు లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శనివారం ఆత్మకూరు మండలంలోని శ్రీరామ్ నగర్ రైల్వేస్టేషన్‌కు ఆ యువకుడు రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు తలపైనుంచి వెళ్లడంతో తల, మొండెం వేరయ్యాయి. మృతుడి స్వగ్రామం కొత్తకోట మండలం అప్పరాల గ్రామం. కాగా, విక్రమ్ మృతితో అప్పరాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పెళ్లయినా ప్రేమ చావలేదు.. విషాదాంతం
శ్రీకాకుళం సిటీ/హిరమండలం/ సరుబుజ్జిలి : ఆమె పేరు లలిత. ఇంటర్ పూర్తి చేసుకుంది. త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సి ఉంది. అతడి పేరు కరణం మధుబాబు. పొక్లెయినర్ డ్రైవర్. వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. మధుకు పెళ్లయ్యాక(వేరే యువతితో) కూడా అది కొనసాగింది. ఇంతలో లలితకు వివాహం నిశ్చయమైంది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమన్న ఆలోచన వారిని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించింది. క్షణికావేశంలో పురుగు మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. ఘటనలో లలిత మరణించగా.. మధుబాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం సుభద్రాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మధుబాబు(26)కు గత ఏడాది ఫిబ్రవరి 14న వివాహమైంది. ప్రస్తుతం అతడికి ఆరునెలల బాబు ఉన్నాడు. 13 ఏళ్లుగా అతను ప్రొక్లెయినర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గోత లలిత(19)కు మధుబాబుతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. లలితకు మే నెలాఖరున పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించారు. వివాహ విషయాన్ని మధుబాబు దృష్టికి తీసుకువెళ్లింది. బతికితే నీతోనే అంటూ చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరూ కలసి చనిపోయేందుకు నిర్ణయించుకున్నారు. హిరమండలంలోని మేజర్ పంచాయతీ సులభాయమెట్టు తోట వద్దకు వెళ్లి పురుగు మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని గుర్తించిన స్థానికులు హిరమండలం పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మార్గమధ్యంలోనే లలితమ్మ మృతి చెందగా మధుబాబు ప్రస్తుతం రిమ్స్‌లో వైద్యసేవలు పొందుతున్నాడు. లలితమ్మ మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. అవుట్‌పోస్ట్ పోలీసులు మధుబాబు నుంచి వివరాలు సేకరించారు. హిరమండలం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లికి ముందే పరిచయం మధుబాబుకు తన పెళ్లికి ముందే లలితతో పరిచయం ఉంది. అయితే కుటుంబ ఇబ్బందుల వల్ల మధుబాబుకు వేరొక అమ్మాయితో పెళ్లయింది. పెళ్లయిన తర్వాత కూడా లలితతో ప్రేమాయణం కొనసాగింది. లలిత వెంకట సాయి ప్రైవేటు విద్యాసంస్థలో ఇంటర్ చదివింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఎంపీసీలో 901 మార్కులు సాధించింది. మే నెలాఖరులో పెళ్లి లలితకు పెళ్లి నిశ్చయమైంది. మే నెలలో పెళ్లి నిశ్చయమవడంతో ఉన్న కొద్దిపాటి భూమిని కూడా అమ్మి పెళ్లి ఖర్చులకు కుటుంబ సభ్యులు వినియోగించారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న లలిత ఇలా విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విలపిస్తున్నారు. -
ప్రేమికుల బలవన్మరణం
సాక్షి, కడప: జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పెనగలూరు మండలం, కొత్త శింగనమలకు చెందిన శ్రీనివాస్‌లు(35), లక్ష్మీదేవి(30) కొత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. సోమవారం ఉదయం పొలాల్లో ఉపయోగించే విష గులికలు తిని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య.
-
రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, చీరాల : ప్రకాశం జిల్లా చీరాల సమీపంలో ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. వీరు వేటపాలెం రైల్వే స్టేషన్లో రైలు కింద పడి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. . చీరాలలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో వీరు బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నారు. మృతులను ఇంకొల్లు మండలం తిమ్మసముద్రానికి చెందిన బత్తుల సాయిసందీప్ (24), గుంటూరు జిల్లా మోదుకూరుకు చెందిన భోగిరెడ్డి మోనిక (23)గా పోలీసులు గుర్తించారు. అయితే వీరిద్దరూ మంగళవారం విజయవాడ వెళ్లి పెళ్లి చేసుకుని చీరాల వచ్చి ఇంటికి వెళ్లే ధైర్యం లేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. కాగా చదువుతో పాటు ఎప్పుడు చలాకీగా ఉండే సాయి సందీప్, మోనిక ఆత్మహత్య చేసుకోవటంతో సహ విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
చోడవరం(విశాఖపట్నం జిల్లా): చోడవరం మండలం గంధి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్(26), సునీత(24)లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. చంద్రశేఖర్ ఎంఎస్సీ, సునీత బీఈడీ చదువుకున్నారు. ఒకరు అనకాపల్లి, మరొకరు చోడవరంలో టీచర్లుగా పనిచేస్తున్నారు. జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుందామనుకున్నారు. సునీత ఇంట్లో పెళ్లి సంబంధం చూసి మేనెలలో ముహూర్తాలు పెట్టుకున్నారు. దీంతో ఇద్దరూ చోడవరం వచ్చి ఈ విషయం గురించి చర్చించుకున్నారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించిన ఇద్దరూ తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగారు. ఇది గమనించిన స్థానికులు వారిని వెంటనే చోడవరం ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ శేఖర్ మరణించాడు. సునీత పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. -
ప్రేమజంట ఆత్మహత్య
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి అటవీ ప్రాంతంలో ఓ యువజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. బాపు, లక్ష్మక్కలు వేర్వేరు మండలాలకు చెందిన వారు. వీరిలో ఒకరిది బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి. బంధువులు కావడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దలకు తెలుస్తుందనే ఆందోళనతో అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుపతిలో ప్రేమజంట ఆత్మహత్య
చిత్తూరు జిల్లా : తిరుపతిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలోని ఓ హోటల్లో ఉరివేసుకుని మౌనిక, రంజిత్ ఆత్మహత్య చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు గ్రామానికి చెందిన మౌనిక(21)కు రెండు నెలల క్రితం పెళ్లి అయింది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న మౌనిక వరంగల్ జిల్లా పత్రా మండలం మధుగులగూడెం గ్రామానికి చెందిన రంజిత్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. రంజిత్ అటవీశాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరికీ ఆన్లైన్లో పరిచయం ఏర్పడింది. జనవరి 22న వీరిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ నెల 13న తిరుపతి బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో రూం తీసుకున్నారు. అప్పటి నుంచి రూమ్‌లో ఎలాంటి అలికిడి లేదు. అనుమానం వచ్చిన హోటల్ యాజమాన్యం ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. తలుపులు పగలగొట్టి చూడగా..ఇద్దరూ ఉరికి వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు. రంజిత్‌కు ఇదివరకే పెళ్లి కాగా, భార్య చనిపోయింది. అతనికి ఓ కూతురు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ప్రేమికురాలిని కాపాడబోయి..
భీమవరం: పశ్చిమగోదారి జిల్లా భీమవరం మండలం యనమదుర్రు డ్రెయిన్‌లో సోమవారం ఉదయం ఓ యువకుడి మృతదేహం లభించింది. ఈ మృతదేహం మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోబోతున్న తన ప్రేయసిని కాపాడేందుకు డ్రెయిన్‌లో దూకిన యువకుడిదిగా పోలీసులు గుర్తించారు. వివరాలు.. సుంకర పద్దయ్య వీధికి చెందిన పి. సత్యస్వరూప(18), చిన్నఅప్పారావుతోటకు చెందిన కనిమిరెడ్డి మహేష్(25) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం ఇంట్లో తెలియడంతో అమ్మాయి తరఫు వారు యువకుడిని హెచ్చరించారు. ఈ క్రమంలో కొంత కాలంగా వీరిద్దరి మధ్య మాటలు లేవు. ఈ నేపథ్యంలో గత నెల 31(శనివారం) సాయంత్రం లంకపేట సమీపంలో వీరిద్దరు కలుసుకున్నారు. మాట మాట పెరిగి గొడవ పడ్డారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిన సత్యస్వరూప వంతెన పై నుంచి డ్రెయిన్‌లోకి దూకింది. వెనుకనే బైక్‌పై వచ్చిన మహేష్ ఆమెను రక్షించేందుకు అందులోకి దూకాడు. ఇది గుర్తించిన స్థానికులు ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టిన లాభం లేకపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. సోమవారం ఉదయం మహేష్ మృతదేహం లభించింది. స్వరూప కోసం గాలింపు చర్యలు కొన సాగుతున్నాయి. -
పెళ్లైన ఆర్నెల్లకే.. ప్రేమజంట ఆత్మహత్య
-
పెళ్లైన ఆర్నెల్లకే.. ప్రేమజంట ఆత్మహత్య
డిచ్పల్లి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఆరునెలలు గడవక ముందే ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం అమృతపూర్‌లో సోమవారం ఉదయం వెలుగుచూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిన్న రాత్రి ఇంట్లో గొడవ జరగడంతో.. మనస్తాపానికి గురైన నవదంపతులు ఊరిబయట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. గ్రామానికి చెందిన గంగారాం(22) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన రోజ(19)ను ప్రేమించాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో.. కులాలు వేరు కావడంతో వారు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఈ ఏడాది జూన్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం అదే గ్రామంలో కాపురం పెట్టారు. కాగా.. గత కొన్ని రోజులుగా వీరి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన భార్యభర్తలు గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం చెరువు కట్టపై నుంచి వెళ్తున్న స్థానికులు గంగారాం మృతదేహం తేలి ఉండటాన్ని గుర్తించి బయటకు తీశారు. రోజా మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
జగిత్యాలలో ప్రేమజంట ఆత్మహత్య
-
జగిత్యాలలో ప్రేమజంట ఆత్మహత్య
జగిత్యాల : జగిత్యాల జిల్లాలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. మెట్పల్లి మండలం గాజులపేటలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. సాయిరాజు, మనీషా అనే ప్రేమజంట శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కెనాల్లోకి దూకారు. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కెనాల్ సమీపంలో సూసైడ్ నోట్ దొరికినట్లు తెలుస్తోంది. ఇరువురి కుటుంబ సభ్యులు తమ ప్రేమకు అంగీకరించకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య
తిప్పర్తి: నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మాడుగులపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ తోటలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. మృతులను నిడవనూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన నరేష్, మిర్యాలగూడ మండలం జప్పి వీరప్పగూడెంకు చెందిన నవనీతగా గుర్తించారు. వీరిద్దరూ మిర్యాలగూడలో డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. గత ఏడాదే డిగ్రీ పూర్తి అయింది. నవనీతకు ఈ నెల 2వ తేదీ మరో యువకునితో వివాహమైంది. అయితే తనకు ఇష్టంలేని పెళ్లి చేయడంతో మనస్తాపానికి గురైన నవనీత, తన ప్రియునితో కలిసి ఈ నెల 7వ తేదీ ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తిప్పర్తి మండలం మాడుగులపల్లి సమీపంలోని తోటలో కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగారు. ఇద్దరూ అక్కడే మృతి చెందారు. అయితే మంగళవారం ఉదయం వీరు మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్టుకు ఉరివేసుకుని ప్రేమజంట ఆత్మహత్య
మహబూబ్‌నగర్ జిల్లా: పాలమూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దామరగిద్ద మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన శంకరమ్మ(14) అనే బాలిక శనివారం సాయంత్రం గ్రామసమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న తిరుమల్ప(21) అనే యువకుడు శనివారం అర్ధరాత్రి సమయంలో అదే ప్రాంతంలో మరో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరూ ప్రేమికులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని గ్రామస్తులు చెబుతున్నారు. ఇద్దరి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
ప్రేమజంట మృతదేహాలు లభ్యం
తాడేపల్లి (గుంటూరు) : కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువ జంట మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆదివారం రాత్రి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఈ రోజు మధ్యాహ్నం కొద్దిసేపటి కిందటే మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు విజయవాడ సీతానగరానికి చెందిన జక్కల శివప్రసాద్(19), కృష్ణ లంకలోని రాణిగారితోటకు చెందిన బొందవీటి సుచిత్రాదేవి(17)గా గుర్తించారు. వీరిద్దరు గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించరనే భయంతో వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. -
ప్రేమజంట ఆత్మహత్య
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణ శివారు గంగారం గ్రామంలో ప్రేమికుల జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. భద్రాచలంలోని ముదిరాజ్ బజార్‌కు చెందిన రొయ్యల జగదీష్ (19) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పట్టణానికే చెందిన నైషా (13) ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఈ నెల 4న సాయంత్రం నైషా ట్యూషన్‌కు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లింది. రెండు రోజులైనా నైషా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు సోమవారం రాత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గంగారం ఊరి శివారులో చీరతో ఒకే ఉరికి వేలాడుతున్నజంటను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై మురళి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృత దేహాలను వారి కుటుంబ సభ్యులు గుర్తించారు. మృత దేహాలు కుళ్లిపోయే స్థితిలో ఉండటంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన రాత్రే వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య
మెదక్ : పెద్దలు తమ పెళ్లికి అంగీకరించటం లేదని మనస్థాపానికి గురైన ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా తుప్రాన్ లో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు...తుప్రాన్ మండలం, పడాల్‌పల్లి గ్రామానికి చెందిన మౌనిక(20) స్థానిక ప్రైవేటు డిగ్రి కళాశాలలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతుంది. మేడ్చల్ కు చెందిన నగేష్(24) స్తానికంగా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కలిసి బతకాలని నిర్ణయించుకున్న వీరిద్దరి ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో మౌనికకు ఇటీవల వేరే వ్యక్తితో వివాహం చేయడానికి నిర్ణయించారు. దీంతో మనస్థాపానికి గురైన ప్రేమికులు బుధవారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి బలవన్మారణానికి పాల్పడ్డారు. ఈ ఘటనను స్తానికలు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇరువురి కుటంబ సభ్యులకు సమాచారం అందించి విచారిస్తున్నారు. (తూప్రాన్) -
ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు!
అచ్చంపేట(మహబూబ్‌నగర్ జిల్లా): ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతికి తనే కారణమని పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టడంతో యువకుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నడింపల్లికి చెందిన సరస్వతి (18), మల్లయ్య(21)లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే సరస్వతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. వేరే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని సరస్వతి తల్లిదండ్రులతో ఘర్షణ పడి శుక్రవారం క్రిమిసంహారక మందు తాగింది. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి పరిస్థితి విషమంగా ఉందని చెప్పి మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించింది. ఈ నేపథ్యంలో శనివారం గ్రామానికి చెందిన కొందరు పెద్దలు సరస్వతి మరణానికి కారణమని భావించి మల్లయ్యను పంచాయతీకి పిలిపించారు. పంచాయతీలో మల్లయ్య ఆమె మరణానికి తాను కారణం కాదని చెప్పాడు. అనంతరం ఇంటికి వెళ్లిన మల్లయ్య మధ్యాహ్నం క్రిమిసంహారక మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్‌నగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. -
పెళ్లికి అంగీకరించలేదని...
తడికెలపూడి :పెద్దలు తమ పెళ్లికి అంగీకరించటం లేదని మనస్థాపానికి గురైన ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కామవరపుకోట మండలం తడికెలపూడి గ్రామానికి చెందిన మోలం శైలజ(19), బెర్రు వెంకటేశ్ నాలుగేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వెంకటేశ్ వ్యవసాయం చేసుకుంటుండగా, శైలజ స్థానికంగా ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తోంది. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఈ విషయమై గురువారం ఉదయం వెంకటేశ్‌కు అతని కుటుంబసభ్యులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. దాంతో ఆవేశానికి గురైన వెంకటేశ్ పురుగులమందు తాగాడు. వెంటనే కుటుంబసభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. కాగా ఈ విషయం తెలిసిన శైలజ కూడా విషం తాగింది. అయితే ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. -
ప్రేమ జంట ఆత్మహత్య
నల్గొండ: నల్గొండ జిల్లా చిట్యాలలో ప్రేమ జంట గత అర్థరాత్రి ఆత్మహత్య చేసుకుంది. తమ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించక పోవడంతో ప్రేమ జంట ఈ దారుణానికి ఒడిగటినట్లు సమాచారం. శుక్రవారం తెల్లవారుజామున స్థానికులు గ్రామ శివారులోని మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని.... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను నల్గొండ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతులు గోపులాయపల్లికి చెందిన సంతోష్, రావన్నపేటకు చెందిన సంధ్యగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య
చంద్రగిరి మండలం పాణపాకం సమీపంలో ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. రైలు పట్టాలపై పడి ఉన్న ప్రేమ జంట మృతదేహలను చూసి రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు గడ్డం వారి పల్లెకు చెందిన యువకుడు కాగా, యువతి పూతలపట్టు మండలం మోటకం వారి పల్లెకు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. మృతల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.