నల్గొండ: నల్గొండ జిల్లా చిట్యాలలో ప్రేమ జంట గత అర్థరాత్రి ఆత్మహత్య చేసుకుంది. తమ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించక పోవడంతో ప్రేమ జంట ఈ దారుణానికి ఒడిగటినట్లు సమాచారం. శుక్రవారం తెల్లవారుజామున స్థానికులు గ్రామ శివారులోని మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని.... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను నల్గొండ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతులు గోపులాయపల్లికి చెందిన సంతోష్, రావన్నపేటకు చెందిన సంధ్యగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.