Chityala
-
ఆగం కావొద్దు
చిట్యాల: కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే బలమైన నాయకత్వం కలిగిన బీఆర్ఎస్కు మద్దతివ్వాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చాయంటే జనంలో లేని వాళ్లు, ఇతర రాష్ట్రాల నుంచి ప్రచారానికి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను చూసి ఓటర్లు ఆగమాగం కావొద్దన్నారు. కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల నుంచి విపక్షాల నాయకులు వచ్చి బక్కపల్చగా ఉండే సీఎం కేసీఆర్‌పై దండయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా చిట్యాలలో పార్టీ నకిరేకల్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యతో కలిసి నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ ప్రసంగించారు. బీఆర్ఎస్ విజయం సాధిస్తే కేసీఆర్ మూడోసారి సీఎంగా పనిచేస్తారని, కాంగ్రెస్‌లో మాత్రం కౌన్ బనేగా సీఎం అన్నట్లుగా జిల్లాకో నలుగురు సీఎం అభ్యర్థులున్నారని, వారికి ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్లో సీఎం పేరు వస్తుందని ఎద్దేవా చేశారు. ఒకాయన పిల్లే లేదు కానీ పెళ్లి ముహూర్తం పెట్టుకున్నట్లు పార్టీలో సీఎం సీటు కోసం ముహూర్తం కూడా పెట్టుకున్నాడన్నారు. ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్‌కు ఓటెయ్యాలో ఆ పార్టీ నాయకులను ప్రశ్నించాలన్నారు. మరోసారి గెలిపిస్తే తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, కేసీఆర్ రూ.5 లక్షల బీమా సౌకర్యం, పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.3వేల నగదు అందిస్తామని, ఆసరా పింఛన్లను పెంచుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. డబ్బు పొగరుతో కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీ నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ డబ్బు పొగరుతో పోటీచేస్తున్నారని, వారు ఓడిపోవడం ఖాయమని కేటీఆర్ పేర్కొన్నారు. నల్లగొండలో కంచర్ల భూపాల్‌రెడ్డి, మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వారిద్దరిని ఓడిస్తారని జోస్యం చెప్పారు. రిజర్వుడు నియోజకవర్గమైన నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యపై మీ పెత్తనం ఏందని కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ప్రశ్నించారు. పేదింటి బిడ్డ చిరుమర్తి లింగయ్యను ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రోడ్ షోలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, చెరుకు సుధాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. (బాక్స్) సంపద పెంచాలి.. పేదలకు పంచాలి నాగోలు: రాష్ట్రంలో అన్ని వర్గాలను, అన్ని రంగాలను అన్ని విధాలా ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తమదే అని మంత్రి కేటీఆర్ అన్నారు. సంపద పెంచాలి.. పేదలకు పంచాలి అనేది తమ నినాదమన్నారు. మంగళవారం నాగోల్‌లో రాష్ట్ర హ్యాండ్లూమ్, టెక్స్టైల్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆతీ్మయ సమ్మేళనంలో కేటీఆర్ మాట్లాడారు. మునుగోడులో గతంలో ఫ్లోరోసిస్‌తో ఎంతోమంది ఇబ్బందులు పడ్డారని, కేసీఆర్ మిషన్ భగీరథ పథకానికి రూపకల్పన ఫ్లోరోసిస్‌కు శాశ్వత పరిష్కారం చూపారని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని టెక్స్టైల్ పార్కులు పెట్టుకుందామని చెప్పారు. నేతన్నల బాగు కోసం ఇంకా ఏమైనా చేయాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనేక చేనేత కార్మికుల పథకాలు రద్దు చేసిందన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పద్మశాలీల ఇంట్లో ఉండి చదువుకున్నందున, మన సమస్యలు తెలుసని చెప్పారు. వందకు వంద శాతం పద్మశాలీలు బీఆర్ఎస్ వైపు ఉన్నారని పేర్కొన్నారు. -
2 వేల ఏళ్ల క్రితమే ఇనుము పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: ఇనుము తయారు చేసిన తర్వాత మిగిలిన వ్యర్ధమిది.. దీన్ని చిట్టెంగా పేర్కొంటారు. ఈ చిట్టెం రాళ్ల వయసు దాదాపు 2 వేల ఏళ్లు. శాతవాహనుల కాలంలోనే మన వద్ద ఇనుము పరిశ్రమ విలసిల్లిందనటానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా వనపర్తి జిల్లా చిట్యాల గ్రామ శివారులో ఇలాంటి చిట్టెం నిల్వలను గుర్తించారు. ఈ ప్రాంతం ఒకప్పుడు ఇనుము పరిశ్రమలకు నిలయంగా ఉండేదని, నాటి పరిశ్రమ తాలూకు అవశేషాలుగా ఇప్పుడు ఈ చిట్టెం రాళ్లు వెలుగుచూస్తున్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు. చిట్యాలలో తమ బృందం సభ్యులు బైరోజు చంద్రశేఖర్, డాక్టర్ శ్యాంసుందర్‌లు స్థానిక మూలోని గుట్ట సమీపంలోని తాళ్లగడ్డలో వ్యవసాయ క్షేత్రంలో చిట్టెం రాళ్లను గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంతంలో భూమిని వ్యవసాయయోగ్యంగా మార్చే పనులు చేస్తున్నప్పుడు 20 అడుగుల చుట్టు కొలతగల ఇటుకల కట్టడం ఆనవాళ్లు వెలుగుచూసినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. ఇనుము కరిగించేందుకు వాడే మూసలు, పెద్ద గొట్టాలు, భారీ గాగుల పెంకులు లభించినట్టు పేర్కొన్నారు. బయటపడిన భారీ ఇటుకలు 16 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్న భారీ ఇటుకలు కూడా బయటపడినట్టు వెల్లడిస్తున్నారు. ఇనుము కరిగించగా మిగిలిన బొగ్గు బూడిద కూడా వెలుగు చూస్తోందని పేర్కొంటున్నారు. యుద్ధానికి అవసరమైన ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లు, ఇతర పరికరాలకు ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇనుము పరిశ్రమలు ఉండేవనటానికి ఈ ఆధారాలు, ఇనుము దేవతగా పేర్కొనే మమ్మాయి దేవతారాధన ఆనవాళ్లు స్థానికంగా ఉన్నాయని హరగోపాల్ పేర్కొన్నారు. చిట్టెం పతం నుంచే చిట్యాల ఊరి పేరు వచి్చందని ఆయన వెల్లడించారు. సమీపంలోని పెద్ద మందడి, చిన్న మందడి, అమ్మాయిపల్లి, గణపురం, మానాజిపేటల్లో నాటి చారిత్రక ఆధారాలున్నాయని తెలిపారు. -
జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు దగ్ధం
చిట్యాల: నల్లగొండ జిల్లాలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని వనస్థలిపురం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలకు బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోకి రాగానే బస్సు టైర్ పేలిపోయి మంటలు లేచాయి. ప్రమాద సమయంలో బస్సులోని 25 మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపి, బస్సులోని ప్రయాణికులను లేపటంతో వారంతా లగేజీలతో బస్సులోంచి కిందకు దిగిపోయారు. కొద్దిసేపటికే బస్సు మొత్తం మంటలు వ్యాపించి, పూర్తిగా దగ్ధమైంది. వెంటనే ఫైరింజన్‌కు సమాచారం ఇవ్వటంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. బస్సు దగ్ధమైన సంఘటనపై ఫిర్యాదు అందలేదని చిట్యాల పోలీసులు తెలిపారు. -
6 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్
-
‘స్త్రీలను కాదు.. రోడ్డు చూసి బండి నడుపు’ పోలీసుల హెచ్చరిక వైరల్
సాక్షి, చిట్యాల (నల్గొండ): రోడ్లపై ప్రమాదాలు జరగకుండా, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు పోలీసులు అక్కడక్కడ బారిగేట్లను ఏర్పాటు చేస్తుంటారు. ఈ బారిగేట్లపై ఆగి వెళ్లుము.. చూసి వెళ్లుము, వేగం కన్నా.. ప్రాణం మిన్న వంటి సూక్తులు రాస్తుంటారు. కానీ, చిట్యాలలోని హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన బారిగేట్‌పై పోలీసులు వినూత్న హెచ్చరికను రాయించారు. ‘స్త్రీలను కాదు.. బండి రోడ్డువైపు చూసి నడుపు’ అని బారిగేట్‌పై రాసి ఉంది. దీనిని చూసిన వాహనదారులు ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్తున్నారు. చదవండి: మనసిచ్చిన మేనబావ.. మనువాడుతానని చెప్పి మోసం చదవండి: ‘స్త్రీలను కాదు.. రోడ్డు చూసి బండి నడుపు’ పోలీసుల హెచ్చరిక వైరల్ -
ఆవేశంలో అసలు విషయం చేపిన ఎంపీపీ వినోద
-
కేటుగాళ్లు.. సీసీ కెమెరాలపైకి పొగను పంపి..
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో దొంగలు రెచ్చిపోయారు. జాతీయ రహదా రిని ఆనుకుని ఏర్పాటు చేసిన ఏటీఎం కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న దొంగలు ఆదివారం అర్ధరాత్రి ఓ ఏటీఎంలో చోరీ చేశారు. అందు లోంచి రూ.7.12 లక్షలు ఎత్తుకెళ్లారు. మరో ఏటీఎంలో కూడా చోరీకి విఫలయత్నం చేశా రు. ఎస్ఐ రావుల నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ బస్‌స్టేజీ వద్ద నిలిపి ఉంచిన ఓ కారును దొంగి లించిన దుండగులు పట్టణంలోని ఎస్బీఐ పక్కన ఉన్న ఏటీఎం సెంటర్‌కు చేరుకున్నారు. ఆ ఏటీఎంలోని సీసీ కెమెరాలపైకి పొగను పంపి మెషీన్‌ను ధ్వంసం చేశారు. అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల వాహ నం రావడంతో వారు తమ ప్రయత్నాన్ని విరమించుకుని కారులో పరారయ్యారు. ఏటీఎం లో చోరీకి జరిగిన ప్రయత్నాన్ని గుర్తించిన పో లీసులు వెంటనే తేరుకుని జాతీయ రహదారి వెంట గల ఏటీఎంలను పరిశీలించారు. ఈ సందర్భంగా వెలిమినేడు గ్రామంలో ఇండిక్యాష్ ఏటీఎంలో చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. క్యాష్ ర్యాక్‌లను బయటికి తీసిన దుండగులు అందులోని రూ.7.12 లక్షలను అపహరించారు. వాహనాలు అపహరించి ప్రయాణం.. దుండగులు వాహనాలను అపహరించి అందులో ప్రయాణించారు. మొదట వట్టిమర్తి లో అపహరించిన ఇండికా కారులో వెలిమినేడు వరకు వచ్చిన దుండగులు అక్కడే దానిని వదిలేశారు. అనంతరం వెలిమినేడుకు చెందిన సంగప్ప అనే వ్యక్తి క్వాలిస్ వాహనాన్ని దొంగిలించి పంతంగి టోల్‌ప్లాజా వద్దకు చేరుకుని దానిని కూడా అక్కడే వదిలి పరారయ్యారు. చోరీకి రెండు బృందాలుగా వచ్చి నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
తుపాకీతో మాజీ మంత్రి బెదిరింపులు
-
తుపాకీతో మాజీ మంత్రి బెదిరింపులు
చిట్యాల: కాలువ విస్తరణ పనులు చేస్తున్న ఓ జేసీబీ డ్రైవర్‌ను రాష్ట్ర మాజీ మంత్రి గుత్తా మోహన్‌రెడ్డి తుపాకీతో బెదిరించిన సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని పెద్దకాపర్తి చెరువు మీదుగా ఉరుమడ్ల గ్రామం వరకు పిలాయిపల్లి కాల్వ విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు తమ పొలం మీదుగా జరుగుతున్నాయని తెలుసుకున్న మాజీ మంత్రి అక్కడికి వచ్చి అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన కాల్వ పనులు చేస్తున్న వారిని తన తుపాకీతో బెదిరించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు విచారణ చేపట్టారు. (చదవండి: శ్రీవాణి హత్యకేసును ఛేదించిన పోలీసులు) -
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్, ముగ్గురు మృతి
-
నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం
సాక్షి, చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు... టీవీఎస్ వాహనాన్ని వెనకనుంచి ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామానికి చెందిన వీరు చిట్యాల శివారులోని వివాహా వేడుకకు హాజరయ్యేందుకు వస్తుండగా వెనుక నుండి కొత్తగూడెం నుండి హైదరాబాద్ వెళ్తున్న TS28 Z 0067 సూపర్ లగ్జరీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దండు మల్కాపురం గ్రామానికి చెందిన బిక్షపతి, చెన్నారెడ్డి గూడెంకు చెందిన నరసింహ అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ హాల్‌కు మరికాసేపట్లో చేరుకునే లోపే ఘటన జరగడంతో పెళ్లి మండపంలో విషాదం చోటు చేసుకుంది. సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
కాంగ్రెస్ నాయకుడిపై దాడి!
సాక్షి, చిట్యాల(నల్గొండ): పీఏసీఎస్ డైరెక్టర్ అభ్యర్థిపై దాడి జరిగిన ఘటన మంగళవారం రాత్రి చిట్యాలలో జరిగింది. చిట్యాల ఎస్ఐ ఎ.రాములు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల పీఏసీఏస్ మూడో వార్డు నుంచి కాంగ్రెస్ మద్దతుతో డైరెక్టర్‌గా పోటీ చేస్తున్న గోధుమగడ్డ జలందర్‌రెడ్డి చిట్యాల కాంగ్రెస్ నాయకుడు చెందిన వెల్పూరి నాగిరెడ్డి తండ్రి బీంరెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఐదో రోజు కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం వెళ్లారు. అనంతరం భోజనం చేసిన తర్వాత రాత్రి 11గంటల సమయంలో తన ఇంటికి బైక్‌పై మరో యువకుడితో కలిసి బయలు దేరారు. స్థానిక కెనారా బ్యాంకు సమీపంలోకి రాగానే సర్వీస్ రోడ్డులో దయ్యాల శ్రీకాంత్‌తోపాటు మరో వ్యక్తి బైక్‌పై వచ్చి జలందర్‌రెడ్డి ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టారు. కింద పడడంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. గాయపడిన జలందర్‌రెడ్డిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జడల ఆదిమల్లయ్య అనుచరుడైన దయ్యాల శ్రీకాంత్‌తోపాటు మరికొందరు కలిసి తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పరామర్శ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ నాయకుడు గొధుమగడ్డ జలందర్‌రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. దాడి ఘటన వివరాలను బాధితుడి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ నాయకుడు కంచర్ల వెంకట్‌రెడ్డి తదితరులున్నారు. -
నా తాయెత్తు వల్లే ఎమ్మెల్యే గెలిచాడు
-
నా తాయెత్తు వల్లే ఎమ్మెల్యే గెలిచాడు
సాక్షి, హుజూర్నగర్: ‘ నేను ఇచ్చిన తాయత్తు కట్టుకుంటే కౌన్సిలర్ అవుతావ్. హుజూర్నగర్ ఎమ్మెల్యే కూడా నా తాయత్తు వల్లనే గెలిచాడు’ అంటూ ఓ స్వామిజీ స్థానిక టీఆర్ఎస్ అభ్యర్థితో జరిపిన మంతనాల ఆడియోటేపు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. హుజూర్నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గెలువడానికి తన తాయెత్తే కారణమని సదరు స్వామిజీ చెప్పడం గమనార్హం. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ తొమ్మిదో వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బెల్లి సత్తయ్య ఎన్నికల్లో తన గెలుపు కోసం ఓ స్వామిజీని ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన స్వామిజీతో మాట్లాడిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సత్తయ్య ప్రత్యర్ధులైన కాంగ్రెస్ అభ్యర్ధి ఇబ్రహీం, టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి ఏర్పుల పరమేశ్‌లను కట్టడి చేయడానికి ఒక తాయత్తు ఇస్తానని, ఆ తాయెత్తు ఉంటే గెలుపు తథ్యమని సదరు స్వామిజీ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గెలవడానికి తాను తాయత్తు ఇచ్చానని, ఇప్పటికీ ఆ తాయెత్తు ఆయన వద్ద ఉందని చెప్పారు. తన తాయెత్తుతో గెలిచిన తర్వాత తను అడిగింది ఇవ్వాలని షరతు పెట్టారు. సోషల్ మీడియాలో వైరలైన ఈ ఆడియోటేపుపై స్థానిక ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్ యుగంలోనూ ఈ మూఢనమ్మకాలేంటని ప్రశ్నించారు. ఇలాంటి వాటిని నమ్మే నేతులు ప్రజలకు ఏమి మేలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక, ఈ ఆడియోటేపులో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేరు ప్రస్తావనకు రావడం.. ఆయన మెడలో తాయెత్తు ఉండటం చర్చనీయాంశంగా మారింది. -
చిట్యాలలో పోలీసుల ఓవర్ యాక్షన్
సాక్షి, చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాలలో స్థానిక ఎస్ఐ ఎ. రాములు ఓటర్ల పట్ల దురుసుగా ప్రవర్తించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిట్యాల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించారు. నోటికి వచ్చినట్టు పరుష పదజాలంతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కూడా అత్యుత్సాహం ప్రదర్శించి ఓటర్లపై జులుం ప్రదర్శించారు. ఎన్నికల విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌కు కనీసం బ్యాచ్ నెంబర్, నేమ్ ప్లేట్ లేకపోవడం గమనార్హం. ఒకపక్క ఫెండ్లీ పోలీసింగ్ అని చెబుతూ మరొపక్క సామాన్య జనంతో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు ఇకనైనా స్పందించి రౌడీ పోలీసులకు ముకుతాడు వేయాలని జనం కోరుకుంటున్నారు. దురుసుగా ప్రవర్తించిన చిట్యాల పోలీసులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు స్థానికులు తెలిపారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు షాక్
సాక్షి, నల్గొండ: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చిట్యాలలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు షాక్ తగిలింది. సొంత పార్టీ నేతలే లింగయ్య వర్గానికి వ్యతిరేకంగా రెబల్స్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నకిరేకల్ నుంచి గెలుపొందిన చిరుమర్తి లింగయ్య అనంతర రాజకీయ పరిణామాల్లో టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. అయితే, ఆయన చేతిలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గీయులు రెబల్స్‌గా గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులతో వేముల వర్గం టీఆర్ఎస్ నేతలు భేటీ అయినట్టు సమాచారం ఎమ్మెల్యే చిరుమర్తి వర్గానికి గట్టి పోటీ ఇచ్చేందుకు ఇటు టీఆర్ఎస్ రెబల్స్, అటు కాంగ్రెస్ నేతలు చేతులు కలిపినట్టు సమాచారం. -
మృత్యువులోనూ వీడని స్నేహబంధం
సాక్షి, నకిరేకల్: ఆ.. ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు.. బాల్యం నుంచి యుక్త వయసు వరకు కలిసే పెరిగారు.. ఎంతో కలివిడిగా ఉంటూ ఎక్కడికి వెళ్లినా కలిసే వెళతారు.. వారిని చూసి విధికే కన్నుకుట్టిందేమో.. చివరకు ఇద్దరినీ ఒకేసారి మృత్యుఒడికి చేర్చింది. ఈ విషాదకర ఘటన చిట్యాల వాసులను ఎంతో కలిచివేసింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన చిట్యాల మండలం వట్టిమార్తి శివారులో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల పట్టణానికి చెందిన దేవిరెడ్డి మహేందర్‌రెడ్డి(31), ఊట్కూరి శ్రవణ్‌కుమార్‌రెడ్డి(27)లు స్నేహితులు. వీరిలో మహేందర్‌రెడ్డి చిట్యాలలోనే ఎయిర్‌టేల్ నెట్వర్క్ డిస్ట్రిబ్యూటర్‌గా, శ్రవణ్‌కుమార్‌రెడ్డి ఐడియా డిస్ట్రిబ్యూటర్ వద్ద కలెక్షన్ బాయ్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరూ తమ పనుల నిమిత్తం బైక్‌పై శనివారం నల్లగొండకు వెళ్లారు. అక్కడ పనులు పూర్తి చేసుకుని రాత్రి తిరుగుప్రయానమయ్యారు. మహేందర్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్‌రెడ్డి మృతదేహాలు మార్గమధ్యలో మండలంలోని వట్టిమర్తి గ్రామ పరిధిలో జాతీయ రహదారి పక్కన గల కేఎంసీఎల్ పరిశ్రమ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను సిమెంటు లోడుతో వస్తున్న ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేందర్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్‌రెడ్డిలు ఆ లారీ చక్రాల కింద పడి నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందారు. మృతులిద్దరూ అవివాహితులు. సమాచారం మేరకు స్థానిక ఎస్ఐ రవి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. చేతికి అందివచ్చిన కుమారులు విగతజీవులుగా మారడంతో వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన తీరు చూపరులను కంటతడిపెట్టించింది. ఇద్దరు యువకుడు మృత్యువాత పడడంతో చిట్యాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
స్కూటర్ ఇంజిన్‌తో గుంటుక యంత్రం
సాక్షి, చిట్యాల : అందుబాటులోని పాత స్కూటర్ ఇంజిన్, ఇతర విడి భాగాలను సేకరించిన చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ రాచకొండ లింగస్వామి పత్తి చేలలో గుంటుక తీసేందుకు ఉపయోగించే యంత్రాన్ని తయారు చేశాడు. ఈ యంత్రంతో లీటర్ పెట్రోల్‌తో ఎకరం భూమిలో గుంటుక తీసే పనులు చేస్తున్నాడు. దీంతో అతి తక్కువ ఖర్చుతో పెద్దగా శ్రమ లేకుండా పత్తి చేలలో గుంటుకలు తీయడం సులవుతుందని ఆయన పేర్కొంటున్నాడు. ప్రస్తుతానికి తనకి వ్యవసాయం ఉన్నప్పటికీ సాగుబడి చేయడం లేదని ఆయన తెలిపారు. ఆయన తన స్నేహితుడు గాదరి లింగస్వామి కోరిక మేరకు ఈ గుంటుక యంత్రాన్ని తయారు చేసినట్లు ఆయన వివరించారు. -
22మంది విద్యార్థినుల అస్వస్థత
చిట్యాల: కలుషిత ఆహారం తిని 22మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన మండల పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల, కళాశాలలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...గురుకుల పాఠశాల, కళాశాలలో కేర్ టేకర్ లేకపోవడం, భోజన నిర్వహణపై పర్య వేక్షణ కొరవడింది. దీంతో కాంట్రాక్టర్ కుళ్లిన కూరగాయాలతో కూర, సాంబారు, ఉడికి ఉడకని అన్నం పెట్టాడు. దీంతో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురుయ్యారు. ఉదయం ఆలుగడ్డతో కిచిడీ చేసి అందులో పెరుగు కలిపి ఇవ్వడం వల్ల ఐదుగురు విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. అలాగే సాయంత్రం ఉడికి ఉడకని అన్నం, క్యాబేజీ కూర, కుళ్లిన కూరగాయలతో చేసిన సాంబారుతో అన్నం తిన్న విద్యార్థులు రాత్రంతా వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో ఆదివారం తెల్లవారుజామున టీచర్లు సాహిత్య, శిరీష, సునీతలు విద్యార్థినులను చికిత్స నిమిత్తం స్థానిక సివిల్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న విద్యార్థినులు.. చిట్యాల సివిల్ ఆస్పత్రిలో ప్రస్తుతం 8 మంది విద్యార్థినులు చికిత్సపొందుతున్నారు. అందులో రమ్య, ఝాన్సీ, సౌజన్య, ప్రవళిక, స్నేహ, నందిని, కావ్య, ప్రవళిక ఉన్నారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మిగతా 14 మందిని వైద్యులు డిశ్చార్జీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి అప్పయ్య, ఉప వైద్యాధికారి నాగూర్ల గోపాల్‌రావు, సీఐ శ్రీనివాస్, ఎస్సై అనిల్‌కుమార్ ,రెవెన్యూ అధికారులు ఆస్పత్రిని సందర్శించారు. అలాగే గురుకుల పాఠశా లను సందర్శించి విద్యార్థినుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ జయశ్రీతో పరిస్థితిపై చర్చించారు. బాధ్యులపై చర్య తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ బాలికల గురుకుల పాఠశాలలో ఉడికి ఉడకని అన్నం, కుళ్లిన కూరగాయలతో చేసిన కూర, సాంబారు పెట్టిన బాధ్యులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పసుల వినయ్‌కుమార్, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు బొడ్డు ప్రభాకర్, గుర్రపు రాజేందర్, ఏబీవీపీ మండల నాయకులు గుండా మణికుమార్, తిరుపతి, రాహుల్ డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను వారు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ గురుకుల విద్యాలయంలోని ప్రిన్సిపాల్ జయశ్రీని జిల్లా కోఆర్డినేటర్‌గా నియమించడం వల్ల ఆమె స్థానికంగా ఉండడం లేదన్నారు. గురుకులంలో పరిశుభ్రత లేదని విమర్శించారు. మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని మండి పడ్డారు. పేరుకే సంక్షేమ వసతి గృహమని సకల సమస్యలకు నిలయంగా ఉందని వారు విమర్శించారు. బాధ్యుల పై చర్య తీసుకోకపోతే ఆందోళనలు తప్పవని వారు హెచ్చరించారు. భోజనం చేసిన అరగంటకే కడుపులో నొప్పి.. క్యాబేజీ, సాంబారుతో అన్నం తిన్న అరగంటకే కడుపులో నొప్పి వచ్చిందని బాధిత విద్యార్థినులు సౌమ్య, దివ్య, అఖిల, నవ్య, నిఖిత తెలిపారు. అనంతరం వాంతులు, విరేచనాలు అయ్యాయి. గమనించిన టీచర్లు తొందరగా స్పందించి ఆస్పత్రికి తీసుక వచ్చారు. -
అభ్యర్థుల ప్రచార పదనిసలు
తెలంగాణ అసెంబ్లి ఎన్నికలు సమీపించడంతో అభ్యర్థుల ప్రచారాలు ఊపందుకున్నాయి.నల్గొండ జిల్లాలోని వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. సరదాగా కాసేపు.. కనగల్ : మహిళలతో కోలాటం వేస్తున్న మాజీమంత్రి కోమటిరెడ్డి బిడ్డా.. దేవుడి ఆశీస్సులు నీకే.. నల్లగొండ : టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డిని ఆశీర్వదిస్తున్న చర్చి ఫాదర్ ఆటవిడుపుగా.. సూర్యాపేట : మార్నింగ్ వాకర్స్‌తో షటిల్ ఆడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి గరమ్ చాయ్.. మజాచెయ్ తుంగతుర్తి : కార్యకర్తలకు టీ పోస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్ ఆప్కో అల్లాహ్‌కి దువా.. చిట్యాల : చిరుమర్తి లింగయ్యకు దట్టీ కడుతున్న ముస్లిం మహిళలు -
పొదుపులో మేటి..చిట్యాల ఐకేపీ
చిట్యాల : పొదుపు బాటలో మండలకేంద్రంలోని ఐకేపీ ముందంజలో నిలిచింది. మూతపడే దశకు చేరిన ఐకేపీని పొదుపు పరంగా తీర్చిదిద్ది రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించిందేలా చేశారు అధికారులు. ఐకేపీ ఏపీఎంగా పనిచేస్తున్న పసరగొండ మంజుల ప్రజల్లో పొదుపుపై అవగాహన కల్పించి పొదుపు సంఘాలను ఎంతో బలోపేతం చేశారు. ఈ మేరకు ఏపీఎం మంజుల నాలుగేళ్ల సేవలకు అరుదైన గౌరవం దక్కింది. జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన 72 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి, కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్ చేతుల మీదుగా మంజల జిల్లా ఉత్తమ సేవా పురస్కార్ అవార్డు అందుకున్నారు. బాసటగా నిలిచిన ఏపీఎం మంజుల.. 2015 ఆగస్టు 13న చిట్యాల ఐకేపీ ఏపీఎంగా మంజులనియమితులయ్యారు. ఐకేపీ కార్యాలయంలోని పొదుపు సంఘాల పరిస్థితి అధ్వాన్నంగా ఉండి ఒక దశలో లోబడ్జెట్తో మూసివేసే స్థితిలో ఉండగా మంజుల గ్రామాలలో విస్త్ర ృత సమావేశాలు నిర్వహించారు. శ్రీనిధి, బ్యాంకు లింకేజీపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. గుడుంబా తయారీ ఎక్కువగా జరిగే గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్య పరిచారు. ఐకేపీ పరిధిలో 796 పొదుపు సంఘాలను బలోపేతం చేసి చిట్యాల ఐకేపీని రాష్ట్ర స్థాయిలో అగ్రభాగాన నిలిపారు. దీంతో మండల సమాఖ్యకు రాష్ట్ర స్థాయిలో అవార్డు దక్కింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐకేపీని ప్రథమ స్థానంలో నిలిపిన మంజుల సేవలకు అవార్డు రావడంపై మండల సమాఖ్య అధ్యక్షురాలు విజయ, మాజీ అధ్యక్షురాలు దర్గా, పొదుపుసంఘాల మహిళలు, సీసీలు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన మండల సభలో కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు మంజులను సన్మానించారు. -
ఇంటికి చేరిన బీజానాబీ
చిట్యాల (నకిరేకల్) : ఆసరా పింఛన్ తెచ్చుకునేందుకు వెళ్లి అదృశ్యమైన చిట్యాల పట్టణం శివాజీనగర్‌కు చెందిన బీజానాబీ మంగళవారం ఇంటికి చేరుకుంది. ఈ నెల 16వ తేదీన ఆసరా పింఛన్ తెచ్చుకునేందుకు వెళ్లి బీజానాబీ అదృశ్యమైంది. బీజానాబీ అదృశ్యమైన విషయం సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో నల్లగొండలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సంచరిస్తున్న బీజానాబీని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యుల పోన్ నంబర్‌కు సమాచారం అందిచారు. ఆమెను కుటుంబసభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. సాక్షిలో ప్రచురితమైన కథనం వల్లే బీజానాబీ ఆచూకీ లభించినందుకు ఆమె కుటుంబసభ్యులు ‘సాక్షి పత్రిక’కు కృతజ్ఞతలు తెలిపారు. -
బాపూ... నిన్ను మరువం
సందర్భం – గాంధీ జయంతి గాంధీజీని బాపూజీ అని ప్రేమగా పిలుచుకుంటాం. జాతిపిత అని గౌరవిస్తాం.కూడళ్లలో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. అవన్నీ జయంతి, వర్థంతి రోజుల్లో బాపూజీని తలుచుకుని నివాళులర్పించడానికే పరిమితమవుతున్నాయి. మరి మిగిలిన రోజుల్లో గాంధీజీని తలుచుకోవాలంటే ఎలా? ఒక ప్రశాంతమైన వేదిక కావాలి. అది గుడిని తలపించాలి. అది గాంధీజీ దేశం కోసం ఏమేమి చేశాడో భావి తరాలు నిరంతరం గుర్తు చేస్తూ ఉండాలి... ఇదీ ఆలోచన. దానికి కార్యరూపమే నల్గొండ జిల్లా, చిట్యాల సమీపంలో జాతీయ రహదారి పక్కన వెలసిన గాంధీగుడి. గాంధీకి తొలి ఆలయం! ‘గాంధీజీ కోసం దేశంలో మరెక్కడా గుడి లేదని ఇదే తొలి ఆలయ’మని చెప్తూ అందుకు దారి తీసిన కారణాలను వివరించారు ఆలయ నిర్మాత శ్రీపాల్‌రెడ్డి. మా అన్న భూపాల్‌రెడ్డికి దేశమంటే చాలా ప్రేమ. మా మాటల్లో ఓసారి ‘గాంధీజీని ఏడాదికి రెండు రోజులు స్మరించుకుని మిగిలిన రోజుల్లో మర్చిపోతున్నాం. గాంధీజయంతి రోజు సెలవు ఉంది కాబట్టి పిల్లలు ఆ ఒక్కరోజును గుర్తు పెట్టుకుంటున్నారు. ఇది కాదు. గాంధీజీ కోసం చిరస్థాయిగా ఉండేటట్లు ఏదో ఒకటి చేయాలి’ అనుకున్నాం. మా ఆలోచనలతో కలిసి వచ్చిన వాళ్లందరం కలిసి ట్రస్ట్‌గా ఏర్పడ్డాం. ట్రస్ట్ సభ్యులందరూ గుడి కట్టడానికే ఆసక్తి చూపించారు’ అన్నారాయన. గర్భగుడిలో గాంధీ 2012 అక్టోబర్ 2న గుడి నిర్మాణానికి పునాది పడింది. 2014 సెప్టెంబర్ 15న గాంధీ విగ్రహా ప్రతిష్టాపన జరిగింది. కింది అంతస్థులో ధ్యాన మందిరం, పై అంతస్థులో గాంధీ గుడి ఉంది. గర్భ గుడిలో ఉన్న నల్ల రాతి గాంధీ విగ్రçహాన్ని గుంటూరు జిల్లాలోని దుర్గిలో చేయించారు. «ధ్యాన మందిరంలో పెట్టిన పాలరాతి విగ్రహాన్ని రాజస్థాన్ నుంచి తెప్పించారు. గాంధీ సర్వ మతాల సంక్షేమానికి కృష్టి చేశారని, అందుకు ప్రతీకలుగా విగ్రహం పక్కన శిలువ, స్వస్తిక్, నెలవంక గుర్తులను గంధంతో రాయిస్తున్నారు. గాంధీజీకి అన్ని మతాల శిష్యులు ఉన్నారని, అందరూ ఆరాధించేలా వీటిని పెట్టారు. బుద్ధగయ నుంచి బహుమతిగా వచ్చిన దిల్వార్(కంచుతో చేసిన)లను ఒక్క సారి కొడితే.. ‘ఓం’ కార శబ్ధం తొమ్మిది నిమిషాల పాటు వస్తుంది. ధర్మచక్ర దర్శనం గాంధీజీకి, భారతదేశ స్వాతంత్య్రానికి, జాతీయ పతాకానికి ఉన్న బంధానికి ప్రతీకగా ఆలయం ముందు ధర్మచక్రాన్ని ప్రతిష్ఠించారు. ధర్మ చక్రం మధ్యలో రంధ్రం నుంచి చూస్తే గాంధీ విగ్రహం కనిపిస్తుంది. గుడికి కుడి వైపుల కింద పంచ భూతాలు, ఎడమ వైపుల నవగ్రహాలను ప్రతిష్టించారు. గాంధీ జీవిత చరిత్రలో ముఖ్య ఘట్టాలు, గాంధీ చెప్పిన సూక్తులతో ఉన్న బుక్, గాంధీ టోపీ, పాటల సీడీలు కూడా ఆలయంలో ఉన్నాయి. గాంధీ జననం చరిత్ర, దిన చర్య, మనిషిగా పుట్టిన వారు ఏడు పాపాలు చేయకూడదని వివరిస్తూ గర్భగుడి ఎదురుగా స్తంభాలపై ఫలకాలు పెట్టారు. భక్తులు గాంధీని పూజించిన అనంతరం వెనుదిరిగేటప్పుడు వీటిని చదువుకుని వెళ్తే వారి మీద ఆ ప్రభావం ఉంటుందని, మంచి ప్రవర్తనను అలవర్చుకుంటారని ట్రస్టు నిర్వాహకుల నమ్మకం. పుణ్యక్షేత్రాల మట్టి.. పవిత్రగ్రంథాలు దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించాలనే కోరిక ఉండి, వెళ్లడానికి సాధ్యం కాని వారి కోసం దేశంలోని 27 పుణ్య æక్షేత్రాల మట్టిని తెప్పించి గ్లాస్ డబ్బాల్లో అమర్చారు. హిందూ ఆలయాలతోపాటు హాజీ అలీదర్గా, బో«ద్‌గయ, జైన దిల్వార్, గాంధీ జీవితానికి సంబంధించిన పోరుబందర్, సబర్మతి, వార్ధా, రాజ్ఘాట్ల నుంచి కూడా మట్టిని తీసుకొచ్చారు. జెరుసలెం, మరో రెండు పుణ్యక్షేత్రాల నుంచి మట్టిని త్వరలో తేనున్నట్లు చెప్పారు. గర్భగుడి వెనక గోడకు అద్దాల అరల్లో భగవద్గీత, ఖురాన్, బైబిల్, త్రిపీఠకములు, జైనవాణి, గురుగ్రంథ్, గాంధీ రచించిన ‘సత్యశోధన’ గ్రంథాలను అమర్చారు. ఆ ఆలయం గురించి మన తెలుగు రాష్ట్రాలకే పెద్దగా తెలియదు. కానీ గుజరాత్‌లోని సబర్మతి, మహారాష్ట్రలోని సేవాగ్రామ్ నుంచి పర్యాటకులు ఈ గుడికి వచ్చి గాంధీని దర్శించుకున్నారు. సామాన్యుల కోసం గాంధీ! రోడ్డు కూడళ్లలో ఎన్ని విగ్రహాలు పెట్టినా సామాన్యులు వాటితో కనెక్ట్ కావడం లేదు. కామన్ పీపుల్, ముఖ్యంగా పిల్లలు గాంధీజీని తరచూ తలుచుకోవడానికి, పెద్దవాళ్లు ప్రశాంతంగా సమయం గడపడానికి వీలుగా చక్కటి ప్రదేశంలో గాంధీని ఆవిష్కరించాలనిపించింది. స్థల సేకరణ కోసం తెలిసిన వాళ్లకు చెప్పినప్పుడు హైదరాబాద్ వాసులు ఈ నాలుగెకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. అనుకున్నట్లే గుడి పూర్తయింది. మొదట్లో ఇద్దరు– ముగ్గురు వచ్చేవాళ్లు. ఇప్పుడు రోజుకు దాదాపు వంద మంది వరకు దర్శించుకుంటున్నారు. జయంతి, వర్ధంతి రోజుల్లో పిల్లలకు వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ గాంధీ జయంతికి కొత్త కార్యక్రమం మొదలు పెడుతున్నాం. భక్తులకు వారి జన్మ నక్షత్రాన్ని బట్టి మొక్క నాటాలనే వివరాలతోపాటు మొక్కను కూడా ఇస్తాం. దానిని ఇంట్లో నాటుకోవాలి. ఇలా చేస్తే ప్రతి ఇంట్లో కనీసం మూడు– నాలుగు మొక్కలు పాదుకుంటాయి. పర్యావరణాన్ని పరిరక్షించడానికి కూడా గాంధీ గుడిని కేంద్రంగా చేయాలని మా ఉద్దేశం. – మోర శ్రీపాల్‌రెడ్డి, మేనేజింగ్ ట్రస్టీ, మహాత్మ చారిట్రబుల్ ట్రస్ట్, నర్సరావుపేట, గుంటూరు జిల్లా బొల్లం శ్రీనివాస్, సాక్షిప్రతినిధి, నల్లగొండ -
మైనర్ బాలికపై అత్యాచారం
చిట్యాల: చిట్యాల మండలం చల్లగరిగ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మైనర్ బాలిక(14) పై ఆరు నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా ముగ్గురు మైనర్ యువకులు అత్యాచారం జరిపారు. బాలిక గర్భందాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం 6 నెలల గర్భవతి. విషయం తెలిసిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కళారంగ కనకం మల్లేష్..
- 22 ఏళ్లుగా కళాప్రదర్శనలు - పతకాలు, ప్రశంసాపత్రాలే ఆస్తులు - అందని గుర్తింపు.. కరువైన ప్రొత్సాహం చిట్యాల(భూపాలపల్లి): పేదరికం వెంటాడుతున్నా.. పరిస్థితులు వెక్కిరిస్తున్నా.. పోత్సహం కరువైనా..పట్టువిడవకుండా గత 22 ఏళ్లుగా కళామాతల్లిని నమ్ముకుని జీవిస్తున్నాడు ఆ వ్యక్తి. గ్రామీణ ప్రాంతాలలో కనుమరుగవుతున్న కళారంగానికి జీవం పోస్తూ..ఎన్నో నాటకాలు ప్రదర్శించి ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు భూపాలపల్లి జల్లా చిట్యాల మండలంలోని నైన్పాక గ్రామానికి చెందిన మోతె మల్లేష్. నిరుపేద బుడిగజంగం కులంలో పుట్టిన మల్లేష్ చిన్నప్పటి నుంచి నాటికల పట్ల మక్కువ పెంచుకుని జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చాడు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో కూడా పలు జిల్లాలో ధూంధాం సభలలో పాల్గొని పాటలు, మిమిక్రీ, ఏకపాత్రాభినేయంతో ప్రేక్షకులను ఊర్రూతలూగించాడు. రాజు,రాణిపాత్రలకు కేరాఫ్ మల్లేష్.. నాటకాలలో రాజు, రాణి పాత్రలు నటించడంలో మల్లేష్‌కు ఎవరూ సాటి రారు. పాత్రలో లీనమై రక్తికట్టిస్తాడు. రామాయణం, సత్యహరిచ్చంద్ర, మార్కండేయ, వాలీసుగ్రీవుల వధ, శ్రీకృష్ణార్జునుల యుద్ధం, పాండవుల ఆరణ్య వాసం, సారంగధర, మాయల ఫకీరు లాంటి నాటకాలు ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో రాణించి ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలను అందుకున్నాడు. కరువైన ప్రోత్సాహం కళారంగమే ప్రాణంగా భావిస్తున్న మల్లేష్‌కు ప్రభుత్వం, అధికారుల ప్రోత్సాహం కరువు అవుతోంది. దీంతో కుటుంబపోషణ భారమై ఇటు కళాప్రదర్శనలు నిర్వహిస్తూ సమయం దొరికినప్పుడల్లా గ్రామంలోనే ఆర్ఎంపీ వైద్యుడిగా సేవలందిస్తున్నాడు. కాగా, ప్రభుత్వాస్పత్రులలో మెరుగైన వైద్యం అందడంతో రోగులు తమ వద్దకు రావడం లేదని, దీంతో కుటుంబ పోషణ భారమైందని మల్లేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 22 ఏళ్లుగా కళాకారుడిగా రాణిస్తున్న తనను రాష్ట్ర ప్రభుత్వం ఆదరించి సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారిలను వేడుకుంటున్నాడు.