ప్రజల పక్షాన ఉద్యమిస్తాం : భిక్షమయ్యగౌడ్
ప్రజల పక్షాన ఉద్యమిస్తాం : భిక్షమయ్యగౌడ్
Published Sat, Aug 6 2016 9:48 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
చిట్యాల : టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి గ్రామగ్రామాన ఉద్యమిస్తామని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ పేర్కొన్నారు. చిట్యాలలో శనివారం ఆయన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలను విస్మరించారన్నారు. నేటికీ రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదని, రైతుల ఆత్మహత్యలు ఆగటం లేదని, విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్ అందటం లేదని, ప్రాజెక్టుల నిర్మాణాలు ముందుకు సాగటం లేదని దుయ్యపట్టారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు మెండె సుజాత, జిట్ట పద్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement