వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలి | in mptc,zptc elections ysrcp candidates | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలి

Published Tue, Mar 25 2014 1:09 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

in mptc,zptc  elections ysrcp candidates

 చిట్యాల, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ కో ఆర్టినేటర్ నకిరేకంటి స్వామి కోరారు. చిట్యాలలో సోమవారం ఆయన ఆ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి మాస రమేష్‌ని గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యకర్తలు పార్టీ అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా పనిచేయాలన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకూ ప్రజాదరణ పెరుగుతుందని తెలిపారు.

 పేద ప్రజల సంక్షేమమే వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని చెప్పారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యలను తెలుసుకునే ఏకైక నా యకుడు జగన్మోహన్‌రెడ్డి ఒక్కడే అని అన ా్నరు. అందుకే ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తేనే వైఎస్ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు అవుతాయని చెప్పారు.

ఈ సందర్భంగా చిట్యాలలోని సాయిద్వారకాపురి కాలనీలో, రహదారిపై చిరువ్యాపారులను ఓట్లను వేయాలని అభ్యర్థి రమేష్ కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు యాస యుగేందర్‌రెడ్డి, దోటి సైదులు, కోరబోయిన నర్సింహ, సాగర్ల వెంకటేష్, నర్సింహ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement