ఎమ్మార్వో ఆత్మహత్య | mro suicides in warangal district | Sakshi
Sakshi News home page

ఎమ్మార్వో ఆత్మహత్య

Published Sat, Sep 26 2015 7:09 PM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

ఎమ్మార్వో ఆత్మహత్య

ఎమ్మార్వో ఆత్మహత్య

చిట్యాల: వరంగల్ జిల్లా చిట్యాల మండలం తహశీల్దార్ మచ్చికట్ల శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాస్ గత గ్రూప్స్ పరీక్షలో ఎమ్మార్వో ఉద్యోగం సాధించాడు. అంతకుముందు పోలీస్ డిపార్టుమెంటులో విధులు నిర్వహించాడు. హన్మకొండలోని ప్రగతినగర్లో శ్రీనివాస్ నివాసం ఉంటూ చిట్యాల మండల ఎమ్మార్వోగా విధులు నిర్వహించేవాడు.

శ్రీనివాస్కు భార్య, కుమార్తె ఉన్నారు. రెండు రోజుల క్రితమే కుమార్తెకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. శ్రీనివాస్కు ఎమ్మార్వోగా చిట్యాల మండలంలో మంచిపేరు ఉంది. కుటుంబపరమైన సమస్యలు ఉన్నాయని తరచూ చెప్పేవారని సన్నిహితులు తెలిపారు. కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణం అయి ఉంటాయని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement