Published
Sun, Sep 11 2016 8:03 PM
| Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
సభను జయప్రదం చేయాలి
చిట్యాల : అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా ఈ నెల20వ తేదీన నల్లగొండలోని ఎన్‌జీ కాలేజి గ్రౌండ్‌లో నిర్వహించనున్న బహిరంగసభను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి, జాతీయ కౌన్సిల్ సమావేశాల ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం చిట్యాల సీపీఎం కార్యాలయంలో జరిగిన సీపీఎం డివిజన్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై బహిరంగసభ ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ బహిరంగసభకు ప్రధానవక్తగా త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ హాజరవుతారన్నారు. ఈ కౌన్సిల్ సమావేశాలు ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి ఎం.డి.జహంగీర్, నారిఅయిలయ్య, మామిడి సర్వయ్య, అవిశెట్టి శంకరయ్య, బండ శ్రీశైలం, కందాటి ప్రమీల, బోళ్ల నర్సింహారెడ్డి, మేక అశోక్‌రెడ్డి, జిట్ట నగేష్, పామనగుళ్ళ అచ్చాలు, ఐతరాజు నర్సింహ, కత్తుల లింగస్వామి పాల్గొన్నారు.