దివీస్‌ పరిశ్రమను తరలించాలి | divis factory issue | Sakshi
Sakshi News home page

దివీస్‌ పరిశ్రమను తరలించాలి

Published Mon, Oct 31 2016 9:43 PM | Last Updated on Fri, Sep 28 2018 4:30 PM

divis factory issue

కాకినాడ సిటీ : 
పర్యావరణానికి ముప్పు వాటిల్లేవిధంగా ఉన్న దివీస్‌ పరిశ్రమను తరలించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్‌ చేశారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం కోస్టల్‌ కారిడార్‌ మత్స్యకారుల సమావేశం జరిగింది. ముందుగా మధు మాట్లాడుతూ నవంబర్‌ 3న చలో దివిస్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వామపక్షాలతో పాటు అన్ని రాజకీయపార్టీలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. దివిస్‌ పరిశ్రమ వలన వేలాది మంది మత్స్యకారులు రోడ్డున పడతారని, మరొకసారి ప్రజాభిసేకరణ జరగాలన్నారు. ఈ నెల 9న సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేష¯ŒS కల్పించాలని కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని మధు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు నక్కా కిషోర్, నాయకులు తోకల ప్రసాద్, అంజిబాబు, మాదవస్వామి, సూరయ్య పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement