దానవాయిపేటలో ఉద్రిక్తత
Published Thu, Nov 3 2016 4:20 PM | Last Updated on Fri, Sep 28 2018 4:30 PM
తొండంగి : తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్వహిస్తోన్న సీపీఎం సభను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం నేత మధుతో పాటు పలువురి అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులుకు, సీపీఎం కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొందరు పోలీసులపై ఇసుక చల్లడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు.
Advertisement
Advertisement