దివీస్ ల్యాబొరేటరీకి వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు వెళుతున్న వామపక్షాల నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీపీఎం నేతల అరెస్ట్
Published Tue, Sep 6 2016 11:32 AM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పంపాజిపేట గ్రామం వద్ద నిర్మిస్తున్న దివీస్ ల్యాబొరేటరీకి వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు వెళుతున్న వామపక్షాల నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం బహిరంగసభకు వెళుతుండగా సీపీఎం జిల్లా కార్యదర్శి టి. మధు, జిల్లా నేతలు, కార్యకర్తలను కొత్తపల్లి మండలం ఉప్పాడ వద్ద పోలీసులు అరెస్టుచేసి అన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తుని ఎమ్మెల్యే రాజా కూడా బహిరంగసభకు వెళుతున్నారని భావించిన వారు ఆయన కారును అడ్డుకున్నారు. అయితే తాను హైదరాబాద్ వెళుతున్నానని రాజా చెప్పడంతో రాజమండ్రి వరకూ పోలీసులు ఎస్కార్ట్‌గా వెళ్లి వదిలివచ్చారు.
Advertisement
Advertisement