తూర్పుగోదావరి జిల్లాలో దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు చేస్తున్న ఉద్యమానికి సీపీఎం మద్దతు తెలిపింది.
ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హాజరయ్యారు. మధుతో పాటు 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీఎం నేత మధుతో పాటు 9 మందిని అన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దివీస్‌కు వ్యతిరేకంగా నిర్వాసితులు చేస్తున్న ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని , పోలీసులు చేసిన అరెస్టులు అన్యాయమని సీపీఎం నేతలు పేర్కొన్నారు.