వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్
సీపీఎం బహిరంగ సభను అడ్డుకునేందుకు ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ముందస్తు చర్యలో భాగంగా సభకు మద్దతు తెలిపారన్న కారణాలతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, పలువురు సీపీఎం నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. దివీస్ భూసేకరణను వ్యతిరేకిస్తూ సీపీఎం పార్టీ బహిరంగసభ నిర్వహించనుంది.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ బహిరంగసభకు వైఎస్ఆర్ సీపీ, సీపీఐ, కొన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. బహిరంగసభను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం పంపాదిపేట, తాటాకుపాలెం, కొత్తపాకుల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. రైతులు తమ భూములను ఇచ్చేందుకు అంగీకరించారని సర్కారు చెబుతున్నా.. అందులో వాస్తవం లేదని, రైతులు ఈ భూసేకరణపై అయిష్టత చూపుతున్నారని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు.