divis laboratories
-
అంచనాలను మించిన దివీస్ లాభం
ముంబై: ఫార్మా కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్ సెప్టెంబర్ త్రైమాసికంలో అంచనాలకు మించి రాణించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ నికరలాభం రూ.510 కోట్లుగా నమోదైంది. 2023–24 ఇదే త్రైమాసిక లాభం రూ.348 కోట్లతో పోలిస్తే ఇది 46% అధికం.మొత్తం ఆదాయం రూ.1,909 కోట్ల నుంచి 22.5% పెరిగి రూ.2,338 కోట్లకు చేరింది. పన్నుకు ముందు లాభం (పీబీటీ) 54% వృద్ధి చెంది రూ.469 కోట్ల నుంచి రూ.722 కోట్లకు చేరింది. మార్జిన్లు 25% నుంచి 31 శాతానికి పెరిగాయి. ఈ క్యూ2లో విదేశీ మారక ద్రవ్య లాభం (ఫారెక్స్ గెయిన్) రూ.29 కోట్లుగా ఉంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగం (ఏప్రిల్–సెప్టెంబర్)లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.4,640 కోట్లు ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో మొత్తం ఆదాయం రూ.3,854 కోట్లుగా ఉంది. నికర లాభం రూ.704 కోట్ల నుంచి 33% అధికమై రూ.940 కోట్లకు చేరింది. -
హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంపన్నుల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. దేశంలో ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన దివీస్ లేబొరేటరీస్ వ్యవస్థాపకుడు మురళి దివి కుమార్తె నీలిమా ప్రసాద్ దివి ఇటీవల హైదరాబాద్‌లో రూ .80 కోట్లకు రెండు లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు.జూబ్లీహిల్స్ పరిసరాల్లో ఆమె కొన్న మొదటి ప్రాపర్టీ 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 200 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాని కలిగి ఉంది. ఈ ప్రాపర్టీని ఆమె రూ.40 కోట్లకు కొనుగోలు చేశారు. జాప్కీ షేర్ చేసిన సేల్ డీడ్ డాక్యుమెంట్ల ప్రకారం.. 12,000 చదరపు అడుగుల రెండో ప్రాపర్టీని కూడా అంతే మొత్తానికి నీలిమా దివి కొనుగోలు చేశారు.సంపన్నులకు పేరుగాంచిన జూబ్లీహిల్స్ ప్రాంతంలో చదరపు అడుగుకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు ప్రాపర్టీ ధరలు ఉంటుంన్నాయి. వాణిజ్య పరంగా, రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు హైదరాబాద్ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఇటీవలి సంవత్సరాలలో హైదరాబాద్ హై-ఎండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై వ్యాపార ప్రముఖులు, నటులు, పరిశ్రమ ప్రమోటర్లతో సహా సూపర్-రిచ్ వ్యక్తులు గణనీయమైన ఆసక్తిని చూపుతున్నారు. -
ఎవరీ నీలిమ మోటపర్తి? ఈమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Divis Laboratories Nilima Motaparti: భారతదేశంలో ఉన్న అత్యంత ధనిక మహిళలో ఒకరైన 'నీలిమ మోటపర్తి' (Nilima Motapatri) గురించి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ 'దివిస్ లాబొరేటరీస్' గురించి తప్పకుండా వినే ఉంటారు. ప్రస్తుతం ఈ కంపెనీ బాధ్యతలు చేపడుతూ వరుస లాభాల్లో పయనిస్తున్న నీలిమా గురించి ఇక్కడ తెలుసుకుందాం. దివిస్ లాబొరేటరీస్ సంస్థను స్థాపించిన మురళీ కృష్ణ దివి కుమార్తె నీలిమ మోటపర్తి. ఈమె గ్లాస్లో యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ ఫైనాన్స్‌లో పూర్తి చేసి, ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన మెటీరియల్ సోర్సింగ్, ప్రొక్యూర్మెంట్, కార్పొరేట్ ఫైనాన్స్, ఇన్వెస్టర్ రిలేషన్స్ వంటి అన్ని కార్యకలాపాలను చూసుకుంటోంది. 2021లో ఈమె ఆదాయం సుమారు 51 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. (ఇదీ చదవండి: రూ. 1.30 కోట్ల ప్యాకేజీ, నెలకు 20 రోజులు సెలవు - ఇది కదా ఉద్యోగమంటే..!!) నిజానికి దివిస్ లాబొరేటరీస్ స్థాపించిన మురళీ కృష్ణ దివి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. మురళీ కృష్ణ కుటుంబం ఒకప్పుడు తన తండ్రికి వచ్చే పెన్షన్ మీద ఆధారపడి బ్రతికింది. జీవితంలో ఎన్నెన్నో కష్టాలు చూసిన మురళీ కృష్ణ తన 25 సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్లి ఫార్మసిస్ట్‌గా పనిచేశారు. అప్పట్లో తన వద్ద కేవలం 500 రూపాయలు మాత్రమే ఉన్నాయని ఫోర్బ్స్ ఇండియా గతంలో వెల్లడించినట్లు సమాచారం. దివిస్ లాబొరేటరీస్ ఆవిర్భావం.. అమెరికా వెళ్లిన తరువాత నిరంతర శ్రమతో కస్టపడి అతి తక్కువ కాలంలోనే భారతదేశంలో దివీస్ లాబొరేటరీస్ 5.8 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ ధనిక శాస్త్రవేత్తల్లో ఒకరిగా నిలిచారు. దివీస్ లేబొరేటరీస్ 1990లో దివీస్ రీసెర్చ్ సెంటర్‌గా స్థాపించారు, ఆ తరువాత క్రమంగా అభివృద్ధి చెందటం ప్రారంభమైంది. 1994 నాటికి దివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్‌గా స్థిరపడింది. (ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!) తండ్రి స్థాపించిన సంస్థలో నీలిమ మోటపత్రి 2012లో చేరి, అప్పటి నుంచి ఈ కంపెనీ అభివృద్ధికి దోహదపడుతోంది. ఉద్యోగంలో చేరకముందే ఈమెకు మెటీరియల్ రిక్వైర్మెంట్, ఫైనాన్సింగ్ అండ్ ఆసీకాంటింగ్ వంటి వాటిలో సుమారు ఐదు సంవత్సరాల అనుభవం ఉంది. మొత్తం మీద నీలిమా తండ్రికి తగ్గ తనయురాలిగా కంపెనీ బాధ్యతలు చేపట్టి విజయ మార్గంలో పయనిస్తోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలు, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఇంటర్ ఫెయిల్, రూ.500తో అమెరికాకి పయనం.. కట్ చేస్తే 47 వేల కోట్లకు అధిపతి!
ఏదో సాధించాలనే తపన..ఏమీ సాధించలేదేనన్న నిరాశ.. ఇంకేమీ సాధించలేమోనన్న నిస్పృహ.. ఇలాంటి స్థితిలోనే ఎంతోమంది నిండు జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి ఎన్నో ఉన్నత శిఖరాల ఎత్తు ఎదగాల్సిన విద్యార్థులు పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని,ఫెయిల్ అయ్యామని మరొకరు ఇలా.. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడుతుంటుంటారు. అలాంటి వారు ఆత్మహత్యలకు పాల్పడే ముందు ఒక్క క్షణం ఆగి, తమను తాము ప్రశ్నించుకుంటే ఎన్నో జీవితాలు నిలబడతాయి. తిరిగి పచ్చగా కళకళలాడతాయని అంటున్నారు మురళి దివి. నాడు ఇంటర్ రెండు సార్లు ఫెయిల్ అయ్యారు. చేతిలో రూ. 500తో అమెరికాకు వెళ్లారు. కట్ చేస్తే నేడు వేల కోట్ల అధిపతిగా ఎదిగారు. ఇంతకీ ఆయన ఎవరని అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు దివిస్ లేబరేటరీస్ అధినేత దివి మురళి కృష్ణ ప్రసాద్. చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో? మురళి దివి ఎవరు? ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం మురళి దివి స్వస్థలం. ఆయన తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. తనకు వచ్చే 10 వేల రూపాయల పెన్షన్‌తో 13 మంది పిల్లల్ని పోషించేవారు. అయినప్పటికీ తన కష్టాన్ని పిల్లలకు తెలియనీయకుండా పెంచారు. వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని శ్రమించారు. కానీ మురళి దివికి ఇంగ్లీష్ అంటే చాలా భయం. ఆ భయమే ఆయనను ఇంటర్మీడియట్లో రెండు సార్లు ఫెయిల్ అయ్యేలా చేసింది. వృద్దిలోకి వస్తారనుకున్న కొడుకు ఇలా ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పుడే శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందనే సూక్తిని గట్టిగా నమ్మారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని కుంగిపోలేదు. ప్రయత్నించారు. చివరికి విజయమే మురళి దివికి బానిసైంది. అందరూ సంపన్నులే.. కానీ తాను మాత్రం ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అప్పటికే మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న తన సోదరుడి వద్దకు పంపారు. అదే ఆయన జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కోర్సులో చేరారు. అంతర్జాతీయ యూనివర్శిటీ కావడంతో దేశ, విదేశీ విద్యార్ధులు అందులోనూ సంపన్నులు. కానీ తన కుటుంబ నేపథ్యం అందుకు విభిన్నం. ఉన్నత చదువుల కోసం నాన్న, తోబుట్టువులు చేసిన మేలు మరిచిపోలేదని ఓ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎలాగైనా వారి కష్టానికి ప్రతిఫలంగా ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని అప్పుడే నిశ్చయించుకున్నారు. రేయింబవళ్లు శ్రమించారు. అలా బ్యాచిలర్ డిగ్రీలో యూనివర్సిటీలోనే గోల్డ్ మెడలిస్ట్ సంపాదించారు. అదే యూనివర్సిటీలో బెస్ట్ స్డూడెంట్‌గా గోల్డెన్ అవార్డ్స్‌తో మాస్టర్స్‌ను పూర్తి చేశారు. జీతం రూ.250లే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు. వార్నర్స్ హిందుస్థాన్ కంపెనీలో రూ. 250 జీతంతో కెరీర్ ప్రారంభించారు. ఆ సమయంలో, అమెరికాలో ఫార్మసిస్ట్‌లకు మంచి డిమాండ్ ఉంది. రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్‌లు అమెరికా వీసా పొందడం సులభం. అలా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించారు. యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ కావడంతో వీసా దొరికింది. వెంటనే గ్రీన్ కార్డ్ సంపాదించారు. చదవండి👉 దేశంలోని ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్న కంపెనీలు! చలో అమెరికా కానీ వీసా ఆమోదం తర్వాత మురళికి అమెరికా వెళ్లడానికి 9 నెలలు పట్టింది. 1976-77 సమయంలో తన భార్య, కుమారుడితో కలిసి చేతిలో రూ.500లతో అమెరికాకు పయనమయ్యారు. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో సైంటిస్ట్‌గా పనిచేశారు. తర్వాత కాస్మోటిక్ ఫార్మాస్యూటికల్ ప్లాంట్ సూపరింటెండెంట్ అయ్యారు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతు ఆ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా, డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. జీతం నెలకు రూ.నాలుగున్నర లక్షలకు పెరిగింది. జీవిత భాగస్వామి అంగీకారంతో అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో మురళికి ఓ ఆలోచన వచ్చింది. నేను నా కుటుంబ సభ్యులకు, నన్ను కన్న నా దేశానికి దూరంగా ఉంటూ ఇక్కడే ఎందుకు పనిచేయాలి? అని తనని తాను ప్రశ్నించుకున్నారు. వెంటనే భారత్‌కు వచ్చేయాలని అనుకున్నారు. చివరికి జీవిత భాగస్వామి అంగీకారంతో మురళి భారత్‌కు వచ్చారు. చదవండి👉 ఇద్దరు ఉద్యోగుల కోసం.. యాపిల్, గూగుల్ సీఈవోల పోటీ.. చివరికి ఎవరు గెలిచారంటే? డాక్టర్ అంజిరెడ్డితో పాటు తిరిగి వచ్చిన తర్వాత, ఏం చేయాలో తెలియదు. వ్యాపారం ప్రారంభించాలంటే అంత డబ్బు కూడా లేదు. అమెరికాలో సైంటిస్ట్‌గా సంపాదించిన అనుభవాన్నే ఆస్తిగా మరల్చుకున్నారు. డాక్టర్ రెడ్డీస్ వ్యవస్థాపకులు డాక్టర్ అంజి రెడ్డిని సంప్రదించారు. తాను భారత్‌లో ఓ కంపెనీని పెట్టాలని అనుకుంటున్నట్లు తన ఐడియాను వివరించారు. ఆ ఆలోచనకు అంజిరెడ్డి సైతం అకర్షితులయ్యారు. అతని సహకారంతో 'కెమినార్' అనే కంపెనీని కొనుగోలు చేశారు. దేశంలోని ప్రముఖ ఫార్మా తయారీ కంపెనీలలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు పెట్టుబడులు భారీగా పెట్టారు. కానీ ప్రయాణం అంత సులభం కాదు. అయితే, ధైర్యం, 'సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్' (బలవంతులదే మనుగడ) నినాదంతో ముందుకు సాగారు. చేసి చూపించారు. ఆ సమయంలో ప్రముఖ వ్యాపార వేత్తలలో ఒకరిగా నిలిచారు. దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతూ దేశంలోని డిమాండ్లను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంట్లను ప్రారంభించారు. ఆ అనుభవంతో, సొంతంగా కంపెనీ పెట్టాలనే కోరికతో 1990లో హైదరాబాద్‌లో ‘దివీస్ లేబొరేటరీస్’ ప్రారంభించారు. ఏఐపీఐలు, ఇంటర్మీడియట్ల తయారీకి, వ్యాపారానికి అనుగుణంగా అభివృద్ది చేయడం ప్రారంభించారు. అలా 1995లో మురళి దివి తెలంగాణలోని చౌటుప్పల్‌లోని తన తొలి తయారీ కేంద్రాన్ని, 2002లో విశాఖ సమీపంలో రెండో యూనిట్ ప్రారంభించారు. బిలియనీర్‌గా ఎదిగారు.. దివీస్ ల్యాబ్స్ స్థాపించిన 23 సంవత్సరాల తరువాత, 2013లో మురళి బిలియనీర్ అయ్యారు. 2018-19లో అతను భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్‌గా నిలిచారు. దివీస్ ల్యాబ్స్ స్టాక్ విలువ భారీగా పెరిగింది. అలానే కేంద్రం ప్రారంభించిన ఆత్మ నిర్భర్ అభియాన్, మేక్ ఇన్ ఇండియా మద్దతు.. కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఫార్మా ఉత్పత్తుల అవసరం పెరగడంతో దివిస్ ల్యాబ్స్ మరింత ఎదిగింది. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం, మురళీ దివి నికర సంపద 5.9 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని 448వ ధనవంతులుగా నిలిచారు. చదవండి👉 యాపిల్ కంపెనీలో వందల కోట్ల మోసం.. భారతీయ ఉద్యోగికి 3 ఏళ్ల జైలు శిక్ష! -
దివీస్ ల్యాబొరేటరీస్‌కు షాక్.. ఈ సారి తగ్గింది!
ఔషధ కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్ సెప్టెంబర్ క్వార్టర్లో నికరలాభం 18.6 శాతం తగ్గి రూ.493 కోట్లు దక్కించుకుంది. ఈపీఎస్ 18.56 శాతం తగ్గి రూ.18.6 నమోదైంది. టర్నోవర్ 3.6 శాతం పెరిగి రూ.1,934 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్–సెప్టెంబర్‌లో టర్నోవర్ 7 శాతం పెరిగి రూ.4,277 కోట్లు, నికరలాభం 2.75 శాతం అధికమై రూ.1,195 కోట్లు దక్కించుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే దివీస్ షేరు ధర బీఎస్ఈలో సోమవారం 8.85 శాతం తగ్గి రూ.3,413.70 వద్ద స్థిరపడింది. చదవండి: Dropout Chaiwala: విదేశాలలో చదువు మానేసి.. కాఫీలు, టీలు అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నాడు! -
7 దిగ్గజ కంపెనీలకు అప్పులు అసలే లేవు, ఆదాయం మాత్రం లక్షల కోట్లలోనే!
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తూ దేశ ఆర్ధిక వృద్ది కోసం ఆర్బీఐ స్వల్ప కాలానికి తక్కువ వడ్డీ రేట్లను అమలు చేసింది. క్రమేపీ ఆ వడ్డీ రేట్లను పెంచింది. ఈ తరుణంలో ఆర్బీఐ అమలు చేసిన తక్కువ ఇంట్రస్ట్ రేట్లతో పెద్ద పెద్ద కంపెనీలు వ్యాపార కార్యకలాపాల కోసం భారీ ఎత్తున రుణాలు తీసుకున్నాయి. అయితే రుణాలు తీసుకొని, అనుకున్న ఫలితాలు రాబట్టలేక, పెరిగిపోతున్న ఖర్చుల కారణంగా కొన్ని సంస్థలు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నాయి. అయితే దేశీయ స్టాక్ మార్కెట్ నిఫ్టీ-50లో నమోదైన మొత్తం 7దిగ్గజ కంపెనీలు సున్నా రుణం లేని సంస్థలుగా అవతరించాయి. ఈ ఏడు నిఫ్టీ 50 కంపెనీలు కలిపి రూ.31 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటల్‌ను కలిగి ఉన్నాయి. ఒక్కసారి ఆ సంస్థల ఆర్ధిక స్థితి గతుల్ని పరిశీలిస్తే.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సున్నా రుణంతో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా నమోదైంది. 12లక్షల మార్కెట్ వాటాను కలిగి ఉండగా.. ఆర్ధిక సంవత్సరం 2022లో 26బిలియన్లకు పైగా ఆదాయం గడించింది. 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నికర లాభంతో కొనసాగుతుంది. ఇన్ఫోసిస్ మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 6 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో టీసీఎస్‌తో పోటీ పడుతుంది. ఆర్ధిక సంవత్సరం 2022లో దాని ఆదాయం 16 బిలియన్లకు పైగా ఉండగా నికర లాభం దాదాపు 3 బిలియన్లుగా ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ దేశీయ అతిపెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్తాన్ యూనిలివర్ సంస్థ మార్కెట్ క్యాపిటల్ వ్యాల్యూ రూ.5లక్షల కోట్లకు పైగా ఉంది. 14 విభాగాల్లో దాదాపూ 44 బ్రాండ్లతో మార్కెట్‌ను శాసిస్తున్న హెచ్‌యూఎల్ ఫైనాన్షియల్ ఇయర్ 2022లో దాని ఆదాయం దాదాపు 2.4 నుంచి 6.5 బిలియన్ డాలర్ల వృద్దిని సాధించింది. ఐటీసీ టుబాకో-టు-పేపర్ దిగ్గజం ఐటీసీ 3 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉంది. కాగితం, పొగాకు, హోటళ్లు, సాఫ్ట్‌వేర్‌తో పాటు ఇతర రంగాల్లో రాణిస్తుంది. కంపెనీ ఆర్ధిక సంవత్సరం 2022లో ఆదాయం 8.4 బిలియన్గా ఉంది. నికర లాభం దాదాపు 2 బిలియన్లకు చేరింది. మారుతీ సుజుకి ఇండియా దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి సున్నా రుణం లేని సంస్థల జాబితాలో చోటు దక్కించుకుంది. టాటా మోటార్స్‌తో పోటీ పడుతూ 2.6 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో.. మారుతి సుజుకి ఆర్ధిక సంవత్సరం 11 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది.దాని లాభం 497 మిలియన్లకు చేరుకుంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎస్బీఐ దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం.ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ 1.08 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉంది. ఆర్ధిక సంవత్సరం ఆదాయం 10.6 బిలియన్లు కాగా, నికర ఆదాయం 193 మిలియన్లుగా ఉంది. దివీస్ లాబొరేటరీస్ రూ.96వేల కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఫార్మా రంగం నుండి రుణ రహిత సంస్థగా దివిస్ లాబొరేటరీస్ అవతరించింది. జెనరిక్స్, న్యూట్రాస్యూటికల్ తయారీ కంపెనీ దివీస్ ఆదాయం1.2 బిలియన్లు కాగా నికర లాభం 378 మిలియన్లుగా ఉంది. చదవండి👉బీచ్‌లో ఎంజాయ్ చేసేందుకే..రూ.5లక్షల కోట్ల కంపెనీకి సీఈవో రాజీనామా! కానీ.. -
ఇంటర్ 2 సార్లు ఫెయిల్.. ఇప్పుడు రూ.72వేల కోట్లకు అధిపతి
జీవితం అంటేనే సంతోషం, బాధ, గెలుపు, ఓటమి వీటన్నింటి కలయిక. ఈ రోజు మనం ఎదుర్కొనే అతి పెద్ద సమస్య.. కొన్ని రోజుల తర్వాత చాలా చిన్నగా అనిపిస్తుంది. అందుకే ఓడిపోయినప్పుడు.. కుంగిపోకూడదు. ధైర్యంగా ముందడుగు వేయాలి.. విజయం తప్పక వరిస్తుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచారు మురళి దివి. ఇంటర్ రెండు సార్లు ఫెయిలైన మురళి దివి.. నేడు 72వేలకు కోట్లకు అధిపతిగా నిలిచారు. ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ వివరాలు.. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం మురళి దివి స్వస్థలం. ఆయన తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. మురళి దివికి 12 మంది తోబుట్టువులున్నారు. మురళి తండ్రికి వచ్చే 10 వేల రూపాయల పెన్షనే వారికి జీవినాధారం. సరిపడా ఆదాయం లేనప్పటికి పిల్లల్ని చదువుకు దూరం చేయలేదు మురళి దివి తండ్రి. ఇంటర్‌కు వచ్చే వరకు కూడా కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి మురళి పెద్దగా పట్టించుకోలేదు. (చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలు ఇవే..! టాప్-10 లో ఇండియన్ ఫ్యామిలీ..!) మలుపు తిప్పిన సంఘటన ఇలా ఉండగా.. మురళి ఇంటర్ రెండు సార్లు ఫెయిలయ్యాడు. ఈ సంఘటన మురళి జీవితం మీద చాలా ప్రభావం చూపింది. తనను చదివించడం ఆర్థికంగా భారమైనప్పటికి తండ్రి అవేం పట్టించుకోలేదు. కానీ తాను మాత్రం రెండు సార్లు ఫెయిలయ్యాననే బాధ మురళిని పీడించసాగింది. ఆ తర్వాత నుంచి మురళి మరింత కష్టపడి చదివాడు.. అమెరికాలో ఉద్యోగం సంపాదించాడు. ఇంటర్లో ఫెయిలవ్వడం గురించి మురళి అంతర్జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘చదువు విషయంలో నేను చాలా నిజాయతీగా ఉండేవాడిని. చాలా కష్టపడేవాడిని. కానీ నాకు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల రెండు సార్లు ఫెయిల్ అయ్యాను. అప్పుడే నాకు మా కుంటుంబ ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల గురించి అర్థం అయ్యింది. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. బాగా చదివి.. మంచి ఉద్యోగం సాధించి.. కుటుంబాన్ని ఆదుకోవాలని భావించాను. కష్టపడి చదివి.. అమెరికాలో ఉద్యోగం సాధించాను’’ అని తెలిపాడు. (చదవండి: ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్) అమెరికా ప్రయాణం.. మురళి దివి తన అన్నల మాదిరిగానే కెమిస్ట్‌గా మారే మార్గంలో ఉన్నాడు. కానీ విధి రాత మరోలా ఉంది. ఈ క్రమంలో మురళి గ్రీన్ కార్డ్ పొంది 1976 లో అమెరికా వెళ్లాడు. ఫార్మసిస్ట్‌గా జీవితం ప్రారంభించాడు. అమెరికాలోని వివిధ కంపెనీలలో పని చేశాడు. చివరకు ఏడాదికి 65 వేల డాలర్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు. కానీ ఇంటి మీద బెంగ, మాతృభూమి నుంచి వచ్చిన పిలుపు మురళీ దివిని భారతదేశానికి తిరిగి తీసుకువచ్చింది. ఇండియాకు తిరిగి వచ్చాడు. కానీ ఇక్కడ ఏం చేయాలి.. అనే దాని గురించి ఏం ఆలోచించుకోలేదు మురళి. అప్పుడే అనగా 1984లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ప్రారంభం అయ్యింది. దానిలో చేరాడు మురళి. ఆరేళ్ల తర్వాత రెడ్డీస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా దివిస్ లాబొరేటరీస్‌ని ప్రారంభించాడు. (చదవండి: ఆ దీవిలో జరిగేవన్నీ దాదాపుగా రాక్షస వివాహాలే.. ఎందుకంటే!) బిలియనీర్‌గా ఎదిగాడు.. దివీస్ ల్యాబ్స్ స్థాపించిన 23 సంవత్సరాల తరువాత, అనగా 2013లో మురళి బిలియనీర్ అయ్యాడు. 2018-19లో, అతను భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్‌గా నిలిచాడు. దివీస్ ల్యాబ్స్ స్టాక్ విలువ గత 3 సంవత్సరాలలో 400% కంటే ఎక్కువ పెరిగింది. అలానే కేంద్రం ప్రారంభించిన ఆత్మ-నిర్భర్ అభియాన్, మేక్ ఇన్ ఇండియా మద్దతు.. కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఫార్మా ఉత్పత్తుల అవసరం పెరగడంతో దివిస్ ల్యాబ్స్ మరింత ఎదిగింది. ఫోర్బ్స్ ప్రకారం, మురళీ దివి, అతడి కుటుంబం రూ .72,000 కోట్ల (9.9 బిలియన్ డాలర్లు) నికర సంపదతో ప్రపంచంలోని 384 వ ధనవంతులుగా నిలిచారు. చదవండి: ఈ ఏడాది ఎక్కువ నష్టపోయిన వ్యక్తి.. ఏకంగా రూ. 1.98 లక్షల కోట్లు -
చంద్రబాబుతో ఉన్నప్పుడు సిద్ధాంతాలు ఏమయ్యాయి?
తుని రూరల్: ‘టీడీపీ అధినేత చంద్రబాబుతో మీరు ఐదేళ్లు పార్టనర్‌గా ఉన్నప్పుడే దివీస్ పరిశ్రమకు 560 ఎకరాలు కేటాయించారు. ఇప్పుడు మీరు చెబుతున్న సిద్ధాంతాలన్నీ అప్పుడేమయ్యాయి?’ అని పవన్‌ను తూర్పు గోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. ఎస్.అన్నవరంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. తొండంగి మండలంలో జరిగిన సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. దివీస్‌కు భూములు కట్టబెట్టిందే కాకుండా అన్ని అనుమతులనూ నాటి టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దివీస్‌కు వ్యతిరేకంగా గతంలో జరిగిన పోరాటానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. డబుల్ స్టాండ్ తీసుకునేది పవనేనని విమర్శించారు. సీఎం జగన్ ప్రజల పక్షాన పని చేస్తున్నారన్నారు. ప్రజలకు, రైతులకు, యువతకు నష్టం కలిగే పనులు చేయరని చెప్పారు. జీరో పొల్యూషన్‌తో ప్రకృతికి నష్టం వాటిల్లకుండా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడమే తమ ప్రభుత్వ విధానమన్నారు. -
‘దివీస్' యాజమాన్యంతో మంత్రి గౌతమ్‌రెడ్డి భేటీ
సాక్షి, అమరావతి: ప్రజల అభ్యంతరాలు, సందేహాల నివృత్తి జరిగే వరకూ 'దివీస్' ఒక్క ఇటుక కూడా కదపకూడదని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతులు, మత్స్యకారులు, స్థానికుల ఆందోళనకు గల కారణాలపై 'దివీస్' యాజమాన్యంతో ఆయన చర్చించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయి పంచాయతీ పరిధిలో నిర్మించే దివీస్ పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకంగా రైతులు, స్థానిక ప్రజలు, మత్స్యకారులు ఆందోళనలు చేస్తున్నారు. దివీస్ ఫార్మా పరిశ్రమ చుట్టూ అలుముకున్న సున్నిత అంశాల పరిష్కారానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. దివీస్ పరిశ్రమ స్థాపిస్తే వచ్చే ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంటూ ఆ యాజమాన్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. (చదవండి: ఏపీలో మరో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్) కాలుష్య నివారణకు చర్యలు, ఉద్యోగాల్లో స్థానికులకు పెద్దపీట, ఆందోళనకారులపై మోపిన కేసుల ఉపసంహరణ వంటి అనేక సున్నిత అంశాలలో ప్రజాక్షేమం కోసం ప్రతిపాదనలు చెబుతూ ప్రభుత్వం దివీస్‌తో శనివారం చర్చలు జరిపింది. వీడియో కాన్ఫరెన్స్ కు పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్ ప్రవీణ్ రెడ్డి, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ అద్నాన్ నమీ, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ఎండీ వివేక్ యాదవ్, తూర్పుగోదావరి జిల్లా పీసీబీ, పరిశ్రమల జనరల్, జోనల్ మేనేజర్లు హాజరయ్యారు. (చదవండి: సీఎం జగన్ లక్ష్యాన్ని సాధించారు’) దివీస్ యాజమాన్యం ముందుంచిన ప్రభుత్వ ప్రతిపాదనలు: ♦దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై తక్షణమే మోపిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలి ♦కాలుష్యం విషయంలో మత్స్యకారుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని, వారితో సమావేశమై దివీస్ యాజమాన్యం చర్చలు జరపాలి. మత్స్యకారులకు అవగాహన కలిగించి, వారి స్పష్టమైన అంగీకారం వచ్చేలా సమస్యలను పరిష్కరించాలి. ♦దివీస్ విడుదల చేసే కాలుష్యం వల్ల వాతావరణ సమస్య, స్థానిక మత్స్యకారుల ఆరోగ్యానికి హాని కలగని పటిష్ట చర్యలకు హామీ ఇవ్వాలి. ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో జరిగే విధంగా పీసీబీ ఎండీకి మంత్రి ఆదేశాలు ♦దివీస్ పరిశ్రమలో తప్పనిసరిగా స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి ♦సీఎస్ఆర్ నిధులతో పాటు సమాజహితం కోసం, స్థానిక ప్రజల క్షేమం కోసం చొరవ చూపి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి ♦దివీస్ పరిశ్రమలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలందించడంలో ప్రభుత్వం తరపున 'నైపుణ్య' సహకారం, అవసరమైతే దివీస్ కు ప్రత్యేకంగా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం ప్రభుత్వ ప్రతిపాదనలకు దివీస్ యాజమాన్యం సానుకూలం.. ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలకు సానుకూలమని దివీస్ పరిశ్రమ డైరెక్టర్ కిరణ్ దివి మంత్రికి వెల్లడించారు. సీఎస్ఆర్ నిధులను ఇప్పటికే ఖర్చు చేస్తున్నామని, ముఖ్యమంత్రి, మంత్రి ఆదేశాల ప్రకారం గుడ్ ఫెయిత్ కింద మరింత సాయమందించేందుకు సిద్ధమన్నారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగాలిస్తామన్నారు. నిరసన వ్యక్తం చేసిన రైతులు, మత్స్యకారులపైన పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటామని కిరణ్ దివి వెల్లడించారు. -
దివీస్ ల్యాబ్ వద్ద ఉద్రిక్త వాతావరణం
సాక్షి, తొండంగి: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం సంపాదిపేట దివీస్ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ నిర్మాణం వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఉదయం ఆకస్మికంగా వెయ్యిమంది ఉద్యమకారులు దివీస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిర్మాణం వైపు దూసుకువెళ్లారు. ఉద్యమకారులు ఫ్యాక్టరీ అక్కడ ఉన్నజనరేటర్‌ను తగులబెట్టి గోడలను కూల్చేశారు. ఒక్కసారిగా వందల మంది ఉద్యమకారులు లోపలకు చొచ్చుకు రావడంతో అక్కడ ఏమి జరుగుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఉద్యమం పెల్లుబికింది. వందల మంది ఉద్యమకారులను పోలీసులు నిర్బంధించారు. దీంతో సుమారుగా ఎనిమిది వందలు మంది దివీస్ గేటు వద్ద , బైఠాయించి, లోపల నిర్బంధించిన తమ వాళ్లను వదలకపోతే కదిలేది లేదంటూ బైఠాయించారు. పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. కాగా దివీస్ ల్యాబరేటరీస్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానిక రైతులు, వామపక్షలు గత కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నాయి. పరిశ్రమ మెయిన్ గేట్ ఎదురుగా నిరసన శిబిరం ఏర్పాటు చేసి తమ నిరసన తెలుపుతున్నారు. కాలుష్యకారక పరిశ్రమ నిర్మాణం చేపట్టవద్దంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడ 144 సెక్షన్ అమలులో ఉంది. -
జూబిలెంట్ నుంచి బిర్యానీ- దివీస్ కొత్త రికార్డ్
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు రికార్డుల బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సక్స్ 117 పాయింట్లు పెరిగి 46,784కు చేరింది. నిఫ్టీ సైతం 35 పాయింట్లు బలపడి 13,717 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా ఫాస్ట్ ఫుడ్ చైన్ కంపెనీ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, ఫార్మా రంగ దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్ కౌంటర్లకు డిమాండ్ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. (బర్గర్‌కింగ్- 3 రోజుల్లో 3 రెట్లు లాభం) జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఏకదమ్! పేరుతో బిర్యానీల బిజినెస్‌ను ప్రారంభించింది. తద్వారా విభిన్న రుచుల బిర్యానీలను అందుబాటులో ఉంచినట్లు కంపెనీ తెలియజేసింది. 20 రకాల బిర్యానీల నుంచి కస్టమర్లు ఎంపిక చేసుకోవచ్చని వివరించింది. ఇవి అందుబాటు ధరల్లో అంటే రూ. 99 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. గుర్గావ్లోని రెస్టారెంట్లో వీటిని ప్రారంభించినట్లు తెలియజేసింది. తదుపరి ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు పేర్కొంది. కంపెనీ డోమినోస్ పిజ్జా, డంకన్ డోనట్స్ బ్రాండ్లతో రెస్టారెంట్లను నిర్వహించే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూబిలెంట్ ఫుడ్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతం జంప్‌చేసి రూ. 2,885ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 7.3 శాతం లాభంతో రూ. 2,873 వద్ద ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లో ఈ కౌంటర్ 12 శాతం లాభపడటం గమనార్హం! (పీఎన్బీకి క్విప్ దెబ్బ- ఎంఅండ్ఎం స్పీడ్) దివీస్ ల్యాబొరేటరీస్ పటిష్ట పనితీరును చూపడం ద్వారా ఈ కేలండర్ ఏడాది(2020)లో ర్యాలీ బాటలో సాగుతున్న హైదరాబాద్ దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్ కౌంటర్ మరోసారి జోరు చూపుతోంది. తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 3,854ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 3,825 వద్ద ట్రేడవుతోంది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ తాజాగా రూ. లక్ష కోట్ల మార్క్‌ను తాకింది. వెరసి మార్కెట్ క్యాప్ ర్యాంకులో 30వ పొజిషన్‌కు చేరుకోవడంతోపాటు.. సన్ ఫార్మా తదుపరి నిలుస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. 2020లో ఇప్పటివరకూ దివీస్ ల్యాబ్స్ షేరు 109 శాతం దూసుకెళ్లడం విశేషం! కాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమామిడి గ్రామపరిసరాల్లో యూనిట్-3 నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ఈ నెల మొదట్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 1,500 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే తెలియజేసింది. 12-18 నెలల్లోగా ఈ ప్లాంటు కార్యకలాపాలు ప్రారంభంకాగలవని అంచనా వేస్తోంది. -
వహ్వా.. దివీస్ ల్యాబ్- అబాట్ ఇండియా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో దేశీ ఫార్మా రంగ దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్, గ్లోబల్ కంపెనీ అబాట్ ఇండియా ఆకర్షణీయ ఫలితాలు సాధించాయి. వారాంతాన ఈ రెండు కంపెనీలూ ఫలితాలు విడుదల చేయడంతో నేటి ట్రేడింగ్‌లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. దివీస్ ల్యాబ్ 15 శాతం అప్పర్ సర్క్యూట్‌ను సైతం తాకడం విశేషం! ఇతర వివరాలు చూద్దాం.. దివీస్ ల్యాబొరేటరీస్ ఎన్ఎస్ఈలో తొలుత దివీస్ ల్యాబ్ షేరు 15 శాతం దూసుకెళ్లింది. రూ. 3,293ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 14 శాతం జంప్‌చేసి రూ. 3,170 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో దివీస్ ల్యాబ్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. నికర లాభం దాదాపు 81 శాతం దూసుకెళ్లి రూ. 492 కోట్లను తాకింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 272 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 1193 కోట్ల నుంచి రూ. 1748 కోట్లకు ఎగసింది. ఇది 46 శాతం వృద్ధికాగా.. కోవిడ్-19 కాలంలోనూ దాదాపు సాధారణ స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించగలిగినట్లు ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ తెలియజేసింది. అబాట్ ఇండియా ఎన్ఎస్ఈలో తొలుత అబాట్ ఇండియా షేరు 7 శాతం దూసుకెళ్లింది. రూ. 17,350 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 4.4 శాతం జంప్‌చేసి రూ. 16,901 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో అబాట్ ఇండియా ఆసక్తికర ఫలితాలు సాధించింది. నికర లాభం 54 శాతం జంప్‌చేసి రూ. 180 కోట్లను అధిగమించింది. గతేడాది(2019-20) క్యూ1లో ఆర్జన రూ. 117 కోట్లు మాత్రమే. ఇదే కాలంలో మొత్తం ఆదాయం సైతం రూ. 999 కోట్ల నుంచి రూ. 1064 కోట్లకు పెరిగింది. -
దివీస్ ల్యాబ్- అబాట్ ఇండియా- క్యూ1 భళా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో దేశీ ఫార్మా రంగ దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్, గ్లోబల్ కంపెనీ అబాట్ ఇండియా ఆకర్షణీయ ఫలితాలు సాధించాయి. ఈ రెండు కంపెనీల ఫలితాలు తాజాగా వెల్లడికావడంతో సోమవారం ట్రేడింగ్‌లో అటు దివీస్ ల్యాబ్, ఇటు అబాట్ ఇండియా కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకునే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇతర వివరాలు చూద్దాం.. దివీస్ ల్యాబొరేటరీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో దివీస్ ల్యాబ్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. నికర లాభం దాదాపు 81 శాతం దూసుకెళ్లి రూ. 492 కోట్లను తాకింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 272 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 1193 కోట్ల నుంచి రూ. 1748 కోట్లకు ఎగసింది. ఇది 46 శాతం వృద్ధికాగా.. కోవిడ్-19 కాలంలోనూ దాదాపు సాధారణ స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించగలిగినట్లు ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ తెలియజేసింది. శుక్రవారం ఎన్ఎస్ఈలో దివీస్ ల్యాబ్ షేరు 2.3 శాతం బలపడి రూ. 2800 వద్ద ముగిసింది. అబాట్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో అబాట్ ఇండియా ఆసక్తికర ఫలితాలు సాధించింది. నికర లాభం 54 శాతం జంప్‌చేసి రూ. 180 కోట్లను అధిగమించింది. గతేడాది(2019-20) క్యూ1లో ఆర్జన రూ. 117 కోట్లు మాత్రమే. ఇదే కాలంలో మొత్తం ఆదాయం సైతం రూ. 999 కోట్ల నుంచి రూ. 1064 కోట్లకు పెరిగింది. శుక్రవారం ఎన్ఎస్ఈలో అబాట్ ఇండియా షేరు స్వల్పంగా 0.6 శాతం లాభపడి రూ. 16,254 వద్ద ముగిసింది. -
దివీస్‌లో ఇన్సైడర్ ట్రేడింగ్!
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగంపై దివీస్ ల్యాబొరేటరీస్ సీఎఫ్‌వోతోపాటు ఇతరులకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రూ.96 లక్షలకుపైగా జరిమానా విధించింది. సీఎఫ్‌వో ఎల్.కిశోర్‌బాబు, ఆయన కుమారుడు, సన్నిహితులు 2017లో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని సెబీ వెల్లడించింది. సీఎఫ్‌వోతోపాటు ప్రవీణ్ లింగమనేని, నగేశ్ లింగమనేని, శ్రీలక్ష్మి లింగమనేని, డి.శ్రీనివాస రావు, రాధిక ద్రోణవల్లి, గోపీచంద్ లింగమనేని, పుష్పలత దేవి ఇన్సైడర్లుగా సెబీ గుర్తించింది. వీరు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని సెబి తన ఆదేశాల్లో తెలిపింది. విశాఖ యూనిట్–2పై ఉన్న ఇంపోర్ట్ అలర్ట్‌ను యూఎస్ఎఫ్డీఏ ఎత్తివేయనుందంటూ దివీస్ 2017 జూలై 10న మార్కెట్ సమయంలో ప్రకటించింది. స్టాక్స్‌పై ప్రభావం చూపే ఈ విషయాన్ని కిశోర్ బాబు ముందే లీక్ చేసి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని సెబీ చెబుతోంది. జూలై 7–10 మధ్య జరిగిన ట్రేడింగ్‌పై సెబీ విచారణ జరిపింది. జూలై 7న దివీస్ షేరు ధర రూ.680 నమోదైంది. జూలై 10న ఇది రూ.734కి చేరింది. ప్రొహిబిషన్ ఆఫ్ ఇన్సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్స్ ప్రకారం షేర్ల కొనుగోళ్లకు కావాల్సిన ప్రి–క్లియరెన్స్ కోసం సీఎఫ్‌వో, ఆయన కుమారుడు ప్రవీణ్ లింగమనేని దరఖాస్తు చేయలేదని విచారణలో తేలింది. ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను వీరు అతిక్రమించారని సెబీ విచారణలో తేలింది. ఈ ఎనిమిది మంది 30 రోజుల్లో స్పందించాలని సెబి ఆదేశించింది. ఈ మొత్తం మేరకు వీరి ఖాతాలను స్తంభింపజేయాలని బ్యాంకులను ఆదేశించింది. విచారణ పూర్తి అయ్యే వరకు వీరు ఆస్తులను విక్రయించరాదని స్పష్టం చేసింది. -
దివీస్ ఫార్మా కంపెనీకి ఎన్జీటీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : దివీస్ ఫార్మా కంపెనీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. కాలుష్యాన్ని వెదజల్లుతూ పర్యావరణానికి నష్టం కలిగిస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన కాలుష్య పరిరక్షణ సమితి ఎన్జీటిని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన జరిపిన జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ఎన్జీటీ కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సహా దివీస్ ఫార్మా కంపెనీకి నోటీసులు జారీ చేసింది. (ఎమ్మెల్యేలతో పాటు సీనియర్లు కూడా..) అలాగే ఫార్మా కాలుష్యంపై విచారణ జరిపేందుకు ఎన్జీటీ చౌటుప్పల్‌లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా కేంద్ర పర్యావరణ శాఖ ఫార్మా వ్యవహారాల విభాగం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ శాఖ, యాదాద్రి జిల్లా కలెక్టర్‌ను చేర్చింది. చౌటుప్పల్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఫార్మా కంపెనీలు వ్యవహరిస్తూ కాలుష్యానికి కారణమైతే తీసుకోవాల్సిన చర్యలను నివేదించాలని పేర్కొంది. తదుపరి విచారణను ఆగష్టు 21కి వాయిదా వేసింది. (వారికి వైఎస్ జగనే కరెక్ట్ : నాగబాబు) -
దివీస్ షేర్‌కు మరోసారి నష్టాలు
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మ దిగ్గజం దివీస్ లాబ్స్‌కు మరోసారి చిక్కులు తప్పలేదు. యూఎస్ఎఫ్డీఏ తాజా అబ్జరేషన్స్ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో దివీస్ లేబ్స్ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. ఈ నెలలో తనిఖీలు నిర్వహించిన తనిఖీల్లో ఆరు లోపాలను(అబ్జర్వేషన్స్) నమోదు చేసినట్లు వెల్లడికావడంతో దివీస్ షేర్ 9 శాతానికిపైగా నష్టపోయింది. మార్చి 21 తరువాత ఇదే అతిపెద్ద ఇంట్రా డే పతనాన్నినమోదు చేసింది. మంగళవారం నాటి ముగింపుతో గత 12నెలల్లో 28 శాతం పడిపోయింది. వైజాగ్‌లోని యూనిట్-2లో యూఎస్ఎఫ్డీఏ నిర్వహించిన తుది ఏపీఐల ఇండివిడ్యుయల్ పరీక్షలలో దివీస్ విఫలమైనట్లు తెలుస్తోంది. తయారీ, పరికరాల పరిశుభ్రత వంటి అంశాలలోనూ లోపాలు గుర్తించినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే తాజా నివేదికలపై దివీస్ ఇంకా స్పందించలేదు. కాగా అమెరికా రెగ్యులేటరీ నుంచి ఆరు అబ్జర్వేషన్స్ తమకు అందాయని దివీస్ గతవారం తెలిపింది. ఇది సాధారణమేనని పేర్కొంది. -
దివీస్ యూనిట్లో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా కంపెనీ దివిస్ ల్యాబొరేటరీస్‌కు చెందిన యూనిట్–2లో యూఎస్ఎఫ్డీఏ సెప్టెంబరు 11–19 మధ్య తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా ఆరు లోపాలను ఎఫ్‌డీఏ లేవనెత్తిందని కంపెనీ వెల్లడించింది. ఇవన్నీ కూడా విధానపరమైనవేనని, నిర్దేశిత సమయంలోగా లోపాలను సరిదిద్దుకుంటామని తెలిపింది. ఎఫ్‌డీఏ జారీ చేసిన ఫామ్–483 ప్రకారం ఏ కంపెనీ అయినా 15 రోజుల్లోగా లోపాలను సరిదిద్దుకోవాలి. ఎఫ్‌డీఏ తిరిగి విశ్లేషించి తగు నిర్ణయం తీసుకుంటుంది. విశాఖలోని ఈ యూనిట్ నుంచి ఔషధాల దిగుమతిని నిషేధిస్తూ 2017 మార్చిలో యూఎస్ఎఫ్డీఏ ఇంపోర్ట్ అలర్ట్ విధించింది. అలాగే మే నెలలో వార్నింగ్ లెటర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, బీఎస్ఈలో బుధవారం దివిస్ షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 9.13 శాతం వృద్ధితో రూ.942.75 వద్ధ స్థిరపడింది. -
వారంలో పెళ్లి.. అంతలోనే అఘాయిత్యం
తగరపువలస: విశాఖ జిల్లా భీమిలి మండలం దివీస్ ల్యాబరేటరీ ఉద్యోగి సీహెచ్ వేణు(27) బుధవారం సాయంత్రం చెరకుపల్లి అవంతి కళాశాల సమీపంలో తుప్పుల్లో విగతజీవిగా కనిపించాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఇక్కడకు చేరుకున్న భీమిలి పోలీసులకు మృతదేహం పక్కన శీతల పానీయం, పురుగుమందు బాటిళ్లు కనిపించాయి. మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండటంతో మంగళవారమే మృతుడు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి స్వస్థలం గుంటూరు జిల్లా ఐపూర్ మండలం కొచ్చెర్లగా అతని జేబులో దొరికిన ఈఎస్ఐ గుర్తింపు కార్డు ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 14న వివాహం జరగాల్సి ఉండగా బలవన్మరణానికి పాల్పడటాన్ని బట్టి చూస్తే ప్రేమవ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
దివిస్ ల్యాబ్స్‌కు అమెరికా వార్నింగ్
► లోపాలను సవరించకుంటే తీవ్ర పరిణామాలు: యూఎస్ఎఫ్డీఏ ► కొత్త ఉత్పత్తుల నమోదు నిలిపివేస్తాం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్‌ను యూఎస్ఎఫ్డీఏ హెచ్చరించింది. విశాఖపట్నం యూనిట్–2 ల్యాబ్‌లో ఎలక్ట్రానిక్ రూపంలో నిక్షిప్తమై ఉన్న సమాచారం మార్పు, తొలగింపును అడ్డుకునే కనీస నియంత్రణలు లేవన్న విషయం తమ తనిఖీల్లో తేలినట్లు కంపెనీకి పంపిన వార్నింగ్ లెటర్లో ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. భద్రమైన, ప్రభావవంతమైన, నాణ్యతకు మద్ధతు తెలిపే ఖచ్చితమైన, సమగ్రమైన సమాచార వ్యవస్థ కంపెనీ వద్ద లేదని వెల్లడించింది. కంపెనీ అనుసరించిన తీరు అత్యుత్తమ తయారీ విధానానికి అనుగుణంగా లేదని, ప్లాంటులో యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్లలో కల్తీకి ఆస్కారం ఉందని ఆక్షేపించింది. పరీక్షా విధానం నిర్దేశిత నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టుగా సాంకేతికంగా పటిష్టంగా ఉందనడానికి ఆస్కారం లేదని తెలిపింది. తనిఖీల సమయంలో ఎఫ్‌డీఏ అధికారులకు కంపెనీ పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదని, ఇది నిబంధనలను అతిక్రమించడమేనని తన లేఖలో వివరించింది. అడ్డుకట్ట వేస్తాం... సమగ్ర నివేదిక ఇవ్వాలని ఈ మేరకు కంపెనీని యూఎస్ఎఫ్డీఏ ఆదేశించింది. ఔషధాల నాణ్యతపై లోపాల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలపాలని సూచించింది. సమాచార సమగ్రత లోపించిన ఔషధాలతో రోగులపై ఎటువంటి ముప్పు ఉంటుందో కూడా తెలపాలని ఆదేశించింది. లోపాల సవరణకు కంపెనీ యాజమాన్యం చేపట్టబోయే వ్యూహం ఏమిటో వెల్లడించాలని తెలిపింది. లోపాల సవరణ పూర్తి అయి, నాణ్యత ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని నిర్ధారించేంత వరకు కొత్త దరఖాస్తులు, సప్లిమెంట్ నమోదును ఎఫ్‌డీఏ నిలిపివేస్తుందని స్పష్టం చేసింది. లోపాలను సవరించుకోనట్టయితే యూనిట్–2లో తయారైన ఉత్పత్తుల నమోదును అడ్డుకుంటామని హెచ్చరించింది. యూనిట్–2లో 2016 నవంబరు 29–డిసెంబరు 6 మధ్య యూఎస్ఎఫ్డీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. -
దివీస్‌కు మరోసారి అమెరికా షాక్
⇒ వైజాగ్ యూనిట్‌పై యూఎస్ఎఫ్డీఏ ఇంపోర్ట్ అలర్ట్ ⇒ ఒకేరోజు 20 శాతం పడిన షేరు ధర హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్‌కు యునైటెడ్ స్టేట్స్ ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) షాకిచ్చింది. విశాఖపట్నంలోని తయారీ యూనిట్‌పై ఇంపోర్ట్ అలర్ట్ విధించింది. దీని ప్రకారం ఈ ప్లాంటులో తయారైన ఉత్పత్తులను యూఎస్ విపణికి ఎగుమతి చేయడానికి వీల్లేదు. కొన్ని ఔషధాలకు యూఎస్ఎఫ్డీఏ మినహాయింపు ఇచ్చినట్టు కంపెనీ బీఎస్ఈకి వెల్లడించింది. వీటిలో లెవెటిరాసెటమ్, గాబాపెంటిన్, లామోట్రిజిన్, కాపెసిటబిన్, నాప్రోక్సెన్, రాల్టెగ్రావిర్, అటోవాక్వోన్ తదితర 10 రకాల యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. నిషేధం ఉన్న ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ఫార్మా రంగ నిపుణుడొకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. యూనిట్‌పైనే ఇంపోర్ట్ అలర్ట్ విధించడం కంపెనీకి ఊహించని పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. వైజాగ్ యూనిట్ కీలకం.. కంపెనీకి హైదరాబాద్‌తోపాటు విశాఖపట్నంలో యూనిట్ ఉంది. దివీస్ విక్రయాల్లో ఈ యూనిట్ 60–65 శాతం సమకూరుస్తోందని తెలుస్తోంది. అలాగే యూఎస్ అమ్మకాల్లో 20 శాతం అందిస్తోంది. 2016 నవంబర్ 29–డిసెంబర్ 6 మధ్య వైజాగ్ యూనిట్లో యూఎస్ఎఫ్డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ఎఫ్‌డీఏ పలు లోపాలను ఎత్తిచూపింది. ఎఫ్‌డీఏ లేవనెత్తిన లోపాలను సరిదిద్దేందుకు స్వతంత్ర నిపుణులతో కలసి పనిచేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కాగా, ఇంపోర్ట్ అలర్ట్ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో దివీస్ షేరు ధర మంగళవారం 20 శాతం పడింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఒక్కో షేరు రూ.156 నష్టపోయి రూ.634.35 వద్ద ముగిసింది. -
నిర్బంధాలతో ఉద్యమం ఆగదు
దివీస్‌పై అఖిలపక్ష నాయకులు కాకినాడ సిటీ : తొండంగి మండలంలో నిర్మించతలపెట్టిన దివీస్ కంపెనీ విషయంలో ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా ఉద్యమం కొనసాగుతుందని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. శనివారం స్థానిక సుందరయ్యభవన్‌లో అఖిలపక్ష నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఆరు నెలలుగా తొండంగి మండలంలో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ దౌర్జన్యంగా దివీస్ నిర్మాణం ఎందుకు సాగించాల్సి వస్తోందని, ప్రజలు ప్రశ్నించే చోటల్లా 144 సెక్షన్ విధించడం ఏమీ ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. ప్రజలను వారి భూముల్లోకి వెళ్లనీయకుండా దౌర్జన్యంగా అడ్డగించడం దారుణమన్నారు. దివీస్ యాజమాన్యం దౌర్జన్యంగా ఆక్రమించి గోడ నిర్మిస్తోందని రైతులు రెవెన్యూ, పోలీసు అధికారులకు వినతులు ఇచ్చినా పట్టించుకోకుండా ఆక్రమణదారులవైపే ఎందుకు ఉండాల్సి వస్తుందో బహిరంగ పర్చాలన్నారు. డ్రోన్ కెమెరాలను ఉద్యమాలను అణచడానికి ఉపయోగించడం హాస్యాస్పదమన్నారు. ఆరు నెలలుగా పోలీస్ పికెట్ నడుపుతున్నా పాలకులు ఒక్కసారి కూడా ప్రాంత ప్రజల గోడు వినకపోవడంతో వారు ఎటువైపు ఉన్నారో అర్థమవుతోందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్ నాగేశ్వరరావు, కేవీపీఎస్ నగర అధ్యక్షుడు మోతా కృష్ణమూర్తి, ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్ రమణి, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వ శేషుబాబ్జి, ఐఎన్టీయూసీ నాయకులు రోకళ్ళ సత్తిరాజు, సీపీఎం నగర కార్యదర్శి పలివెల వీరబాబు పాల్గొన్నారు. 25కెకెడి151: అఖిలపక్ష నాయకుల సమావేశం -
దివీస్‌పై ఆగని పోరు
-
దివీస్‌పై ఆగని పోరు
బీచ్ రోడ్డుపై సీపీఎం, బాధిత గ్రామాల ప్రజల భారీ ర్యాలీ అణచివేతకు పోలీసుల వ్యూహం... ఆందోళనకారుల ప్రతిఘటన ప్రహరీ వద్ద బైఠాయించి నిరసన 85 మంది అరెస్టు పోలీసుల దమనకాండపై ఎమ్మెల్యే రాజా ఆగ్రహం ఓ రోజు ముందు నుంచే దివీస్ బాధిత గ్రామాల్లో పోలీసులు మోహరించారు. నిఘా కెమెరాలతో హడావుడి ... బూట్ల శబ్దాలు ... లాఠీల ఝళిపింపులు ... పోలీసు వ్యాన్ల హారన్లు ...ముందుకు వస్తే ఖబడ్దారంటూ హెచ్చరికలతో హోరెత్తించారు. బయటకు వస్తే చాలు అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్లకు తరలించి ఆందోళనపై ఉక్కుపాదం మోపి భయోత్పాతం సృష్టించారు. అయినా బాధితుల ఆగ్రహం ఆగలేదు ...కట్టలు తెంచుకొని రోడ్డెక్కింది. సేకరించిన భూముల దరిదాపుల్లోకి రానీయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా ఛేదించుకొని దూసుకువచ్చి బైఠాయించారు. ఇంకానా ఇకపై చెల్లదంటూ పిడికిలి బిగించారు. తొండంగి : కోన ప్రాంతంలో రైతులు సాగులో ఉన్న భూములతోపాటు హైకోర్టు స్టేటస్కో భూముల్లోకి వెళ్లేందుకు మార్గం లేకుండా దివీస్ యాజమాన్యం ప్రహరీ నిర్మాణాలు చేపట్టడంతో సీపీఎం ఆధ్వర్యంలో గురువారం బాధిత గ్రామాల ప్రజలు తమ భూముల్లోకి ప్రవేశించేందుకు ఉప్పెనలా ఎగిసిపడ్డారు. ఇప్పటివరకూ జరిగింది చాలు ఇకపై మీ ఆటలు సాగనివ్వమంటూ ఆగ్రహించారు. దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా బాధిత గ్రామాలైన పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం, నర్శిపేట తదితర గ్రామాల ప్రజలు కొంతకాలం నుంచి ఉద్యమిస్తున్నారు. దివీస్‌ను ల్యాబొరేటరీస్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ, ఈ ప్రాంతంలో దీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న భూములను ఖాళీ చేసేది లేదంటూ కొంత మంది రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో స్టేటస్కో పొందారు. మరికొంత మంది ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం తీసుకోకుండా గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాల ప్రకారం భూములను సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రాంతంలో దివీస్ యాజమాన్యం బలవంతంగా ప్రహరీ నిర్మాణాన్ని ప్రారంభించింది. స్టేటస్కో, సాగు భూముల్లో ఏవిధంగా నిర్మాణాలు ప్రారంభిస్తారని బాధితులు దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్వంలో రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఎటువంటి చర్యలు లేకపోవడంతో దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు వారం రోజులపాటు కొత్తపాకల గ్రామంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష ప్రారంభించిన రెండు రోజుల తర్వాత రెవెన్యూ అధికారులు వచ్చి భూములను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే విచారణ పూర్తయిందని, అక్రమ నిర్మాణాలు లేవని తెలిపారు. దీంతో అధికారులంతా దివీస్‌కు వత్తాసు పలుకుతున్నారని, తమకు న్యాయం జరగలేదని భావించడంతో సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి, సీఐటీయూ జిల్లా నాయకుడు వేణుగోపాల్, దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు కలిసి 23వ తేదీలోపు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోతే గురువారం భూముల్లోకి వెళ్తామని పిలుపునిచ్చారు. నడుం బిగించిన మహిళలు... దివీస్ ప్రాంతంలోకి వెళ్లే రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నప్పటికీ మహిళలు పోలీసులను లెక్కచేయకుండా పరుగులు పెడుతూ దివీస్ నిర్మించిన ప్రహరీ గోడ భూముల్లోకి ప్రవేశించారు. పంపాదిపేట ఐద్వా సంఘం అధ్యక్షురాలు అంగుళూరి నాగ కృష్ణవేణి, కొత్తపాకలకు చెందిన ఐద్వా సంఘం ప్రెసిడెంట్ అంగుళూరి సుశీల, అంగుళూరి బేబి, సత్యవతి, సంధ్య, వీరలక్షి్మలతోపాటు మరికొంత మంది ఆ ప్రహరీ వద్ద బైఠాయించారు. ‘మా భూముల్లోకి మార్గం కల్పించకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం అన్యాయమంటూ నినాదాలు చేశారు. గోడను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు, మహిళలకు మధ్య వాగ్వివాదం జరిగింది. అక్కడే బైఠాయించిన మహిళలను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి వాహనంలోకి ఎక్కించారు. సొమ్మసిల్లిన మహిళలు... ఈడ్చుకువెళ్తున్న సమయంలో సంధ్య అనే మహిళ సొమ్మసిల్లిపోయింది. అయినా సరే పోలీసులు వ్యాన్ వద్దకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా వీరలక్ష్మి అనే మరో మహిళ పోలీసులను ప్రతిఘటించి వాగ్వాదానికి దిగారు. 108కు సమాచారం అందించి, ఆసుపత్రికి తీసుకువెళ్లాలని డిమాండ్ చేసింది. అయినా పోలీసులు లెక్కచేయకుండా మినీ వ్యాన్‌లో ఎక్కించి యు.కొత్తపల్లి పోలీస్‌స్టేçÙ¯ŒSకు తరలించారు. వ్యూహాత్మకంగా అడుగులు... పంపాదిపేట గ్రామంలో దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుడు మట్ల ముసలయ్యను అరెస్టు చేయడం గ్రామ ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో వారంతా సరుగుడు తోటలు వెంబడి కొత్తపాకల గ్రామానికి చేరుకున్నారు. అక్కడ వారంతా ఒకేచోట ఉన్నారని పోలీసులకు సమాచారం అందడంతో కొత్తపాకల గ్రామ శివారు సరుగుడు తోటల వద్దకు పోలీసులంతా వెళ్లారు. ఇది తెలుసుకున్న సీపీఎం నాయకులు శేషుబాబ్జి, వేణుగోపాల్, బాధిత గ్రామాల ప్రజలంతా కొత్తపాకల గ్రామం నడిబొడ్డు నుంచి ర్యాలీగా బయలుదేరి బీచ్ రోడ్డుపైకి వచ్చారు. కొత్తపాకల శివారులో ఉండిపోయిన పోలీసులు మెయిన్ సెంటర్‌కు వచ్చే సరికి ప్రజలంతా రోడ్డుపై పాదయాత్ర నిర్వహిం చారు. దివీస్ ప్రతిపాదిత ప్రాంతానికి ‘దివీస్ మాకొద్దంటూ’ నినాదాలు చేస్తూ తరలివెళ్లారు. కాలినడకను వెళ్తున్న వారిని పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అరెస్టు అయిన వారిపై కేసులు... బాధిత గ్రామాల ప్రజలను పోలీసులు అరెస్టు చేసి పలు కేసులు నమోదు చేశారు. అయితే డ్రోన్ కెమేరా, ఇతర వీడియో చిత్రీకరణ, ఫొటోల ఆధారంగా మరికొంత మందిపై కేసులు పెట్టేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం. చుట్టుముట్టి నిర్బంధం.. దివీస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న కమిటీ సభ్యుడు మట్ల ముసలయ్య గురువారం ఉదయం టీ తాగేందుకు ఇంటి సమీపంలో ఉన్న హోటల్‌కు వస్తుండగా సుమారు రెండు వందల మంది పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేశారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించిన మరో వ్యక్తిని కూడా జీపులో ఎక్కించి కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పంపాదిపేట ప్రధాన సెంటర్ కమ్యూనిటీ హాలు, ఇతర ప్రాంతాల్లో భారీగా పోలీసులు పహారా కాసి బయటకు వస్తే అరెస్టు చేస్తామని పరోక్షంగా హెచ్చరించారు. పోలీసుల మోహరింపు.. దివీస్ ప్రతిపాదిత ప్రాంతంలోని భూముల్లోకి వెళ్తామని రైతులు ప్రకటించిన నేపథ్యంలో అడ్డుకునేందుకు పోలీసులు బుధవారం నుంచి తీర ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పంపాదిపేట, తాటియాకులపాలెం, నర్శిపేట, కొత్తపాకల తదితర ప్రాంతాలను పోలీసులు మోహరించారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్‌ను అమలు చేశారు. గుంపులుగా కనిపిస్తే కేసులు పెడతామని ఆటో ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డ్రోన్ కెమేరాలతో నిఘా... ఉద్యమంపై పూర్తి స్థాయిలో నిఘా వేసేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నారు. అడిషనల్ ఎస్పీ దామోధర్, పెద్దాపురం డీఎస్పీ రాజశేఖర్, తుని, తుని రూరల్, ప్రత్తిపాడు సీఐలతోపాటు ఎస్సైలు పంపాదిపేట చేరుకున్నారు. అక్కడ గ్రామస్తుల కదలికలను గమనించేందుకు డ్రోన్ కెమేరాను ఆకాశంలోకి పంపి ఏరియల్ వ్యూ చిత్రీకరించారు. అయినప్పటికీ పోలీసుల కంటపడకుండా పంపాదిపేట ప్రజలు కొత్తపాకల గ్రామానికి చేరుకున్నారు. సీపీఎం, ఇతర నాయకుల అరెస్టు... ర్యాలీగా వెళ్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శి శేషుబాబ్జి, సీఐటీయూ నాయకుడు ఎన్.వేణుగోపాల్, ఇతర నాయకులు సింహాచలం, అప్పారెడ్డి, దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు గంపల దండు, అంగుళూరి శ్రీను తదితరులతోపాటు మరో 85 మందిని పోలీసులు అరెస్టు చేసి వ్యాన్లలో అన్నవరం పోలీస్‌స్టేషన్ కు తరలించారు. ఉద్యమ నాయకులను చొక్కాలు పట్టుకొని పోలీసులు లాక్కెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. -
తొండంగిలో మళ్లీ 144 సెక్షన్
కాకినాడ: తొండంగి మండలంలో పోలీసులు మళ్లీ 144 సెక్షన్ విధించారు. దివీస్ ఫ్యార్మాస్యూటికల్స్ కంపెనీకి వ్యతిరేకంగా కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. గ్రామస్ధులు కంపెనీ స్ధాపనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. కాగా, దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు ముసలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దివీస్ ఫ్యాక్టరీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీపీఎం నేతలతో పాటు మరో 200 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మళ్లీ ఉత్కంఠ
దివీస్ బాధిత గ్రామాల్లో ఈ నెల 28 వరకూ 144 సెక్షన్ అమలు నేడు భూముల్లోకి వెళ్లేందుకు రైతుల సన్నద్ధం సీపీఎం ఆధ్వర్యంలో రెఢీ పోలీసుల మోహరింపు... తొండంగి: కోన తీరంలో దివీస్ లేబరేటరీస్‌కు ప్రభుత్వం కేటాయించిన రైతుల భూముల్లోకి బాధిత గ్రామాల ప్రజలు వెళ్లేందుకు గురువారం ప్రయత్నించనున్న నేపథ్యంలో తీరప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దివీస్‌కు ప్రభుత్వం దానవాయిపేట, కోదాడ గ్రామల పంచాయతీల పరిధిలో కొత్తపాకలు, పంపాదిపేట, తాటియాకులపాలెం తదితర ప్రాంతాల్లో సుమారు 671 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి విదితమే. సుమారు పది నెలల నుంచి రైతులు దివీస్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమానికి వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, ఇతర వామపక్ష పార్టీలు, విప్లవ సంఘాలు మద్దతు పలకడంతో పలు దఫాలుగా ఉద్యమంలో భాగంగా రోడ్‌షోలు, నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు. రైతుల స్వాధీనంలో ఉన్న భూముల్లోనూ, హైకోర్టు స్టేటస్కో ఇచ్చిన భూముల్లోనూ దివీస్ యాజమాన్యం ప్రహరీ గోడ, ఇతర నిర్మాణాలను చేపట్టడం ప్రారంభించింది. దివీస్ యాజమాన్యం చేపట్టిన అక్రమ నిర్మాణాలను నిరసిస్తూ బాధిత గ్రామాల రైతులు రెవెన్యూ, పోలీసు ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులపాటు దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. రెవెన్యూ అధికారులు మొక్కుబడిగా సర్వే, విచారణలు చేపట్టి ఎటువంటి అక్రమ నిర్మాణాలు జరగలేదని ప్రకటించడంతో ప్రభుత్వాధికారుల తీరుపై ఆ ప్రాంత ప్రజలు మరింత మండిపడుతున్నారు. దీంతో బాధిత గ్రామాల రైతులు సీపీఎం ఆధ్వర్యంలో గురువారం తమ భూముల్లోకి ప్రవేశించి సాగు చేసుకునేందుకు సన్నద్ధమవడంతో ప్రభుత్వం భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎనిమిది రోజులపాటు 144 సెక్షన్... కోన ప్రాంతంలో రైతులు దివీస్ ప్రతిపాదిత ప్రాంతంలో తమ భూముల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించనున్న నేపధ్యంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా తీరప్రాంతంలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్టు ఒంటిమామిడి పోలీస్‌స్టేన్ హెచ్‌సీ మాణిక్యం తెలిపారు. బాధిత గ్రామాల్లోనూ, బీచ్‌రోడ్డులోనూ సుమారు 300 మంది