దివీస్ వ్యతిరేకులపై దాడి
దివీస్ వ్యతిరేకులపై దాడి
Published Wed, Nov 9 2016 11:42 PM | Last Updated on Fri, Sep 28 2018 4:30 PM
ఇద్దరు మహిళలకు గాయాలు
పోలీస్‌స్టేషన్‌లో మాజీ జెడ్పీటీసీ
దంపతులను నిర్బంధించే యత్నం
తుని రూరల్ : ఇంటిపేరుతో దూషిస్తూ తమపై ముగ్గురు టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని కత్తపాకలకు చెందిన అంగులూరి స్వర్ణ, అంగులూరి లోవతల్లి వాపోయారు. బుధవారం రాత్రి తుని ఏరియా ఆస్పత్రిలో బాధితులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టీడీపీకి చెందిన బత్తుల విజయ్‌కుమార్ తమ ఇళ్ల వద్దకు కారత్రో వచ్చి ఇంటి పేరుతో దూషిస్తుండగా నా భర్త లోవరాజు నిలదీశాడని లోవతల్లి తెలిపారు. నిలదీసిన నా భర్తపై దౌర్జన్యం చేస్తుండగా అడ్డుకున్న నన్నూ, మా తోటికోడలను కరత్రో దాడి చేశాడని విరించారు. ఈ దాడిలో బత్తుల విజయ్‌కుమార్‌తోపాటు గారా రాంబాబు, బత్తుల శ్రీను ఉన్నారన్నారు. దీనిపై ఒంటిమామిడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, వైద్యుం కోసం తుని ఏరియా ఆస్పత్రికి వచ్చామని లోవతల్లి, స్వర్ణ వివరించారు. కాగా ఇదే విషయంపై వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన తమపై ఒంటిమామిడి పోలీస్‌స్టేషన్‌లో టైపిస్టు, కానిస్టేబుల్ దౌర్జన్యం చేసి స్టేషన్లో కుర్చుండ బెట్టారని మాజీ జడ్పీటీసీ అంగులూరి అరుణ్‌కుమార్, అతని భార్య సుశీలరాణీ తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు ఫిర్యాదు చేయగా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీస్టేషన్ నుంచి వదిలినట్టు అరుణ్‌కుమార్ వివరించారు. ఎస్‌సై కృష్ణమాచార్యులు సమక్షంలోనే ఈ సంఘటన జరిగినట్టు ఆయన తెలిపారు. దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుండడం, ఈనెల 17న వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌జగన్మోçßæన్ రెడ్డి రాకకు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఏర్పాట్లు చేస్తుండడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఈవిధంగా దాడులకు పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. ఎటువంటి దాడులకు పాల్పడినా దివీస్‌ను ఏర్పాటు చేయబోనీయమని, అడ్డుకుంటామని పేర్కొన్నారు. కాగా స్వర్ణ, లోవతల్లి ఎడమ చేతులకు తీవ్రగాయాలవడంతో ప్రాధమిక చికిత్స చేసిన ఏరియా ఆస్పత్రి వైద్యులు ఎక్స్‌రే తీసిన తర్వాత పూర్తిస్థాయి వైద్యసేవలు అందించనున్నట్టు తెలిపారు.
Advertisement
Advertisement