జిల్లాను సస్యశ్యామలం చేస్తా
జిల్లాను సస్యశ్యామలం చేస్తా
Published Tue, Aug 15 2017 11:16 PM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM
ప్రతి ఏకరాకు నీరు ఇస్తాం
ఈ ఏడాది జూన్‌లోనే నీరు ఇచ్చాం
జగ్గంపేట సభలో సీఎం చంద్రబాబు
సాక్షి, రాజమహేంద్రవరం/ జగ్గంపేట: జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చి, జల్లాను సస్యశ్యామలం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం గం.2:25 నిమిషాలకు పురుషోత్తపట్పం ఎత్తిపోతల పథకాన్ని ఒక మోటారు ఆన్ చేసి ప్రారంభించిన సీఎం అక్కడ విలేకర్లతో మాట్లాడిన అనంతరం 3:41 గంటలకు జగ్గంపేట చేరుకున్నారు. ఈ సందర్భంగా జగ్గంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ జల్లాలో 31,02,852 భూమి ఉండగా అందులో 13,67,362 వ్యవసాయ భూమి ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది 12,07,960 ఎకరాలకు సాగునీరు ఇచ్చామని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఖరీఫ్‌కు జూన్‌లోనే నీరు ఇచ్చామన్నారు. ఈ ఏడాది రెండు పంటలకు నీరు ఇస్తామన్నారు. ఫలితంగా తుపాన్ల బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చాన్నారు. జిల్లాలో ఎత్తిపోతల పథకాలను తానే ప్రారంభించి పూర్తి చేశానని, పురుషోత్తపట్నం ద్వారా జిల్లాలో 2.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. వీలైనంత వరకు ఈ ఏడాది చివరికి పురుషోత్తపట్నంలో 10 పంపులు ఏర్పాటు చేసి ఏలేరు నీరు ఇవ్వాలని అధికారులను ఆదేశించానన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడంలో అధికారులు సెలవులు తీసుకోకుండా కష్టపడ్డారని అభినందించారు.
Advertisement