dhadi
-
రవీంద్రనాథ్ ఠాగూర్ భావాలతో...
శ్రీరామ్, జీవన్, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దాడి’. మధు శోభ.టి దర్శకత్వంలో శంకర్. ఎ నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందే కొంతభాగం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం చివరి షెడ్యూల్ ఆగస్ట్ మొదటి వారంలో ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా శంకర్.ఎ మాట్లాడుతూ– ‘‘విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ భావాలతో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా విడుదల చేసిన మా ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. మధుశోభ మేకింగ్ చాలా బాగుంది. మణిశర్మగారి సంగీతం, కాసర్ల శ్యామ్, భాష్యశ్రీల సాహిత్యం మా సినిమాకు ప్లస్ అవుతాయి’’ అన్నారు. -
విశ్వకవి జయంతి: ‘దాడి’ ఫస్ట్‌లుక్ రిలీజ్
శ్రీరామ్, జీవన్, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దాడి’. మధు శోభ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శంకర్.ఏ నిర్మిస్తున్నారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. గీతాంజలి కావ్యాన్ని, జాతీయ గీతాన్ని రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ భావాలతో ఒక వ్యవస్థను కథగా రాసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కస్తున్నామని చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా దర్శకుడు మధు శోభ.టి మాట్లాడుతూ.. ‘సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా దాడి చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. నిర్మాత శంకర్.ఏ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా బాగా వస్తోంది, త్వరలో ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు తెలియజేస్తాం’ అని అన్నారు. గణేష్ వెంకట రమణ, ముఖేష్ ఋషి, చరణ్ రాజ్, అజయ్ , అజయ్ రత్నం, నాగినీడు, అజయ్ ఘోష్, మధు, అలోక్, రాజా రవీంద్ర, సలీమ్ పాండ, దిల్ రమేష్, సితార తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. రాజు సుందరం, శివశంకర్, శేఖర్ మాస్టర్లు డ్యాన్స్ కొరియాగ్రాఫర్స్గా పనిచేస్తున్నారు. కనల్ కన్నన్, వెంకట్ ఫైట్ మాస్టర్లు. కాసర్ల శ్యామ్, భాష్య శ్రీ సాహిత్యం అందించారు. -
జర్నలిస్ట్ ఏం చేశాడు?
‘‘అమెరికా నుంచి ఏడాది తర్వాత తిరిగి వచ్చాక విన్న కథల్లో ‘దాడి’ నచ్చింది. గోకుల్ చాట్ బాంబు దాడిలో కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తి పాత్రలో కనిపిస్తా. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న అలాంటి పరిణామాల వెనక అసలు నిజాన్ని రాబట్టడానికి జర్నలిస్ట్‌గా మారి ఏం చేశానన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమా తర్వాత చంద్రమహేశ్‌గారి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా’’ అని వరుణ్ సందేశ్ అన్నారు. జీవన్, చెరిష్మా శ్రీకర్, కారుణ్య చౌదరి ముఖ్య తారలుగా వరుణ్ సందేశ్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దాడి’. మధు శోభ.టి దర్శకత్వంలో శంకర్ ఆరా, జయరాజు.టి నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఏడిద శ్రీరామ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, శివాజీ రాజా క్లాప్ ఇచ్చారు. మధు శోభ.టి మాట్లాడుతూ– ‘‘యూత్‌కు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. సమాజంలో జరుగుతున్న పరిణామాల వెనకున్న చీకటి కోణాలను వెలికి తీసే జర్నలిస్ట్ కథ ఇది’’ అన్నారు. ‘‘మధు చెప్పిన కథ నచ్చడంతో నిర్మాతగా మారా. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం’’ అని శంకర్ ఆరా అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: ప్రసాద్ ఈదర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్. -
దివీస్ వ్యతిరేకులపై దాడి
ఇద్దరు మహిళలకు గాయాలు పోలీస్‌స్టేషన్‌లో మాజీ జెడ్పీటీసీ దంపతులను నిర్బంధించే యత్నం తుని రూరల్ : ఇంటిపేరుతో దూషిస్తూ తమపై ముగ్గురు టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని కత్తపాకలకు చెందిన అంగులూరి స్వర్ణ, అంగులూరి లోవతల్లి వాపోయారు. బుధవారం రాత్రి తుని ఏరియా ఆస్పత్రిలో బాధితులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టీడీపీకి చెందిన బత్తుల విజయ్‌కుమార్ తమ ఇళ్ల వద్దకు కారత్రో వచ్చి ఇంటి పేరుతో దూషిస్తుండగా నా భర్త లోవరాజు నిలదీశాడని లోవతల్లి తెలిపారు. నిలదీసిన నా భర్తపై దౌర్జన్యం చేస్తుండగా అడ్డుకున్న నన్నూ, మా తోటికోడలను కరత్రో దాడి చేశాడని విరించారు. ఈ దాడిలో బత్తుల విజయ్‌కుమార్‌తోపాటు గారా రాంబాబు, బత్తుల శ్రీను ఉన్నారన్నారు. దీనిపై ఒంటిమామిడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, వైద్యుం కోసం తుని ఏరియా ఆస్పత్రికి వచ్చామని లోవతల్లి, స్వర్ణ వివరించారు. కాగా ఇదే విషయంపై వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన తమపై ఒంటిమామిడి పోలీస్‌స్టేషన్‌లో టైపిస్టు, కానిస్టేబుల్ దౌర్జన్యం చేసి స్టేషన్లో కుర్చుండ బెట్టారని మాజీ జడ్పీటీసీ అంగులూరి అరుణ్‌కుమార్, అతని భార్య సుశీలరాణీ తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు ఫిర్యాదు చేయగా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీస్టేషన్ నుంచి వదిలినట్టు అరుణ్‌కుమార్ వివరించారు. ఎస్సై కృష్ణమాచార్యులు సమక్షంలోనే ఈ సంఘటన జరిగినట్టు ఆయన తెలిపారు. దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుండడం, ఈనెల 17న వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్జగన్మోçßæన్ రెడ్డి రాకకు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఏర్పాట్లు చేస్తుండడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఈవిధంగా దాడులకు పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. ఎటువంటి దాడులకు పాల్పడినా దివీస్‌ను ఏర్పాటు చేయబోనీయమని, అడ్డుకుంటామని పేర్కొన్నారు. కాగా స్వర్ణ, లోవతల్లి ఎడమ చేతులకు తీవ్రగాయాలవడంతో ప్రాధమిక చికిత్స చేసిన ఏరియా ఆస్పత్రి వైద్యులు ఎక్స్‌రే తీసిన తర్వాత పూర్తిస్థాయి వైద్యసేవలు అందించనున్నట్టు తెలిపారు.