విశ్వకవి జయంతి: ‘దాడి’ ఫస్ట్‌లుక్ రిలీజ్‌ | Action Thriller Dhadi Telugu Movie First Look Is Unveiled | Sakshi
Sakshi News home page

రవీంద్రుడి భావాలతో ‘దాడి’ చిత్రం

Published Fri, May 8 2020 8:31 AM | Last Updated on Fri, May 8 2020 8:49 AM

Action Thriller Dhadi Telugu Movie First Look Is Unveiled - Sakshi

శ్రీరామ్‌, జీవన్‌, కమల్‌ కామరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దాడి’. మధు శోభ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శంకర్‌.ఏ నిర్మిస్తున్నారు. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. గీతాంజలి కావ్యాన్ని, జాతీయ గీతాన్ని రచించిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ భావాలతో ఒక వ్యవస్థను కథగా రాసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కస్తున్నామని చిత్ర బృందం తెలిపింది. 
 
ఈ సందర్భంగా దర్శకుడు మధు శోభ.టి మాట్లాడుతూ.. ‘సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా దాడి చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. నిర్మాత శంకర్.ఏ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా బాగా వస్తోంది, త్వరలో ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు తెలియజేస్తాం’ అని అన్నారు. 

గణేష్ వెంకట రమణ, ముఖేష్ ఋషి, చరణ్ రాజ్, అజయ్ , అజయ్ రత్నం, నాగినీడు, అజయ్ ఘోష్, మధు, అలోక్, రాజా రవీంద్ర, సలీమ్ పాండ, దిల్ రమేష్, సితార తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. రాజు సుందరం, శివశంకర్‌, శేఖర్‌ మాస్టర్లు డ్యాన్స్‌ కొరియాగ్రాఫర్స్‌గా పనిచేస్తున్నారు. కనల్ కన్నన్, వెంకట్ ఫైట్ మాస్టర్లు. కాసర్ల శ్యామ్, భాష్య శ్రీ సాహిత్యం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement