![Dhadi movie shooting start after lockdown - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/3/Dhadi.jpg.webp?itok=MbSXJ8SR)
జీవన్‌కుమార్, మీనాక్షి
శ్రీరామ్, జీవన్, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దాడి’. మధు శోభ.టి దర్శకత్వంలో శంకర్. ఎ నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందే కొంతభాగం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం చివరి షెడ్యూల్ ఆగస్ట్ మొదటి వారంలో ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా శంకర్.ఎ మాట్లాడుతూ– ‘‘విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ భావాలతో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా విడుదల చేసిన మా ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. మధుశోభ మేకింగ్ చాలా బాగుంది. మణిశర్మగారి సంగీతం, కాసర్ల శ్యామ్, భాష్యశ్రీల సాహిత్యం మా సినిమాకు ప్లస్ అవుతాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment