Kamal Kamaraju
-
ఫ్యామిలీ డ్రామా
కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో రఘుపతి రెడ్డి గుండా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సోదర సోదరీమణులారా...’. 9 ఈఎమ్ ఎంటర్టైన్మెంట్స్, ఐఆర్ మూవీస్ పతాకాలపై విజయ్ కుమార్ పైండ్ల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన మా చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ‘కాలకేయ’ ప్రభాకర్, పృథ్వీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు నేపథ్య సంగీతం: వర్ధన్, కెమెరా: మోహన్ చారి. -
పొద్దు పొద్దున్నే పోలీసులకు దొరికిపోయిన నటుడు కమల్! ట్వీట్ వైరల్
నటుడు కమల్ కామరాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆవకాయ్ బిర్యానీ మూవీతో వెండితెరకు హీరోగా పరిచయమైన ఆయన గోదావరి వంటి చిత్రాల్లో సహానటుడి పాత్రలు పోషించాడు. ఆయన ఎక్కువగా బయట కనిపించరనే విషయం తెలిసిందే. వెండితెరపై తప్పా మూవీ ఈవెంట్స్‌లో, ప్రిరిలీజ్ ఫంక్షన్స్‌లో పెద్దగా కనిపించడు. సోషల్ మీడియాలో కూడా చాలా అరుదుగా కనిపిస్తున్నాడు. తన వ్యక్తిగత విషయాన్ని మీడియాకు దూరంగా గడుపుతాడు కమల్. చదవండి: సావిత్రి గారి వల్లే నేను సక్సెస్ అయ్యాను: లలితా జువెల్లర్స్ ఎండీ ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన ఓ ట్వీట్ నెట్టింట చర్చనీయాంశమైంది. పోలీసులకు దొరికపోయానంటు ట్వీట్ చేసి వార్తల్లో నిలిచాడు. దీంతో నెటిజన్లు ఆయన పోలీసులకు దొరకడం ఏంటీ! ఏం చేశాడు! ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే. తాజాగా కమల్ రాజు బైకి వెళ్తున్న ఫొటో షేర్ చేశాడు తన ట్విటర్లో షేర్ చేశాడు. తాజాగా కమల్ కామరాజు తాను పోలీసులకు దొరికిపోయానంటూ ట్వీట్ చేసి షాకిచ్చాడు. చదవండి: యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం ‘‘అందరికీ చెప్తాను. ఇవాళ నా బైక్ స్పీడు పెంచి దొరికిపోయాను. పొద్దున్నే ఖాళీ రోడ్ చూసి ఆత్రుత ఆపుకోలేక 60లో వెళ్లాల్సిన వాడిని 80లో వెళ్లాను. ఇంత పొద్దున్న సమయంలో కూడా నేను స్పీడుగా వెళ్లడాన్ని పట్టుకుని నాకు చలాన్ పంపిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల పని తీరు, అభివృద్ధి చేసిన పద్ధతులు చూసి నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది. వారు అభివృద్ధి చేసిన పద్ధతులకు ధన్యవాదాలు’ తెలిపాడు. అంతేకాదు, తాను బైక్ మీద వేగంగా వెళ్తున్న ఫొటోను కూడా షేర్ చేశాడు. పోలీసులు ఏర్పాటు చేసిన కెమరాలో.. ఈ ఫొటో క్యాప్చర్ అయ్యింది అని తెలిపాడు. అందరికి చెప్తా... ఇవ్వాళా నా బైక్ స్పీడ్ పెంచి దొరికిపోయా . పోదున్నే కాళీ రోడ్ చూసి excite అయ్యి 60 లొ వవెళ్ళాలి 80 లొ వెళ్ళా. kudos to hyderabad traffic police and their advanced methods for capturing and sending me a challan even at such early hours. @hydcitypolice @HYDTP pic.twitter.com/KSuP5rvkVM — kamal kamaraju ~k k (@kamalkamaraju) January 19, 2023 -
ఈ పాట రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది: బాలకృష్ణ
Natyam Movie Song: ‘‘నాట్యం’లోని ‘నమః శివాయ’ అనే పాటను నేను రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. అన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్న ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు బాలకృష్ణ. ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా, కొరియోగ్రాఫర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా పరిచయమవుతున్న చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ‘నమః శివాయ’ అంటూ సాగే తొలి పాటను బాలకృష్ణ విడుదల చేశారు. ‘‘లేపాక్షి ఆలయంలో ఈ పాటను 40 డిగ్రీల ఎండలో చిత్రీకరించాం. జగద్గురు ఆది శంకరాచార్య వారి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పాటగా మలిచాం. శ్రవణ్ భరద్వాజ్ ఈ పాటను క్లాసిక్, ఫోక్ స్లైల్లో ఆధ్యాత్మికంగా మలిచారు. కాల భైరవ, లలిత కావ్య ఈ పాటను పాడారు. ఈ చిత్రంలో కమల్ కామరాజు క్లాసికల్ డ్యాన్సర్‌గా కనిపిస్తారు. ఈ పాత్ర కోసం సంధ్యా రాజు వద్ద ఆయన ఏడాదిపాటు కూచిపూడిలో శిక్షణ తీసుకున్నారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. -
క్యా కమల్ హై !
-
ఇంట్లో ఆరుగురికి పాజిటివ్.. అయినా ఆదుర్దా పడలేదు : హీరో
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వచ్చిందని బెంబేలెత్తిపోవద్దు. ఎర్లీ డిటెక్షన్, ఇమ్మీడియట్ మెడికేషన్‌తో పాటు సానుకూల దృక్పథం (పాజిటివ్ ఆటిట్యూడ్)తో మహమ్మారిని ఎదుర్కొందాం అంటున్నారు సినీనటుడు కమల్ కామరాజ్. గత నెలలో కుటుంబ సమేతంగా కోవిడ్ బారిన పడి కోలుకున్న ఆయన.. ‘సాక్షి’తో తన అనుభవాలు పంచుకున్నారు.. ‘షూటింగ్ కోసం డెహ్రాడూన్, చెన్నై వెళ్లొచ్చా. కోవిడ్ టెస్ట్ చేసుకుంటే నెగెటివ్ వచ్చింది. సెకండ్ వేవ్ కారణంగా భోపాల్‌లో పరిస్థితి బాగోకపోవడంతో మా అత్తా మామల్ని హైదరాబాద్ తీసుకువచ్చాం. మా మామగారికి 75 ఏళ్లు, అత్తయ్యకు 70 వరకూ ఉంటాయి. బీపీ, షుగర్ ఉన్నాయి. ఎందుకైనా మంచిదని లక్షణాలు లేకపోయినా వారు రాకముందే మరోసారి టెస్ట్‌కు శాంపిల్ ఇచ్చా. మా అత్తామామలు ఇంటికి వచ్చిన రోజే నా రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది. ఆ మరుసటి రోజే ఎవరికీ ఎలాంటి లక్షణాలు లేకపోయినా నా తల్లిదండ్రులు, నా భార్య, అత్తా, మామ, పని వాళ్లిద్దరికీ కూడా టెస్ట్ చేయించాను. మా పేరెంట్స్‌కి తప్ప అందరికీ పాజిటివ్. లక్షణాల్లేవని నిర్లక్ష్యం చేయలేదు డాక్టర్ని సంప్రదించి అందరికీ మందులు తెప్పించేశా. ఎర్లీ డిటెక్షన్.. ఇమ్మీడియట్ మెడికేషన్ మాకు చాలా హెల్ప్ అయింది. వాస్తవానికి మా ఇంట్లోవాళ్ల పరీక్ష నివేదిక రాకముందే మందులు ప్రారంభించాం. ఆందోళన పడకుండా మంచి ఆహారం తీసుకున్నాం. నాకు 2 రోజుల పాటు స్వల్ప జ్వరం తప్ప మరేమీ ఇబ్బంది కలగలేదు. లక్షణాలు పెద్దగా లేకున్నా కోర్సు ప్రకారం చికిత్స తీసుకున్నాం. మా అత్తామామ వ్యాక్సిన్ తీసుకుని ఉండటంతో వారు కూడా ఇబ్బంది పడకుండానే బయటపడ్డారు. నా అనుభవం ప్రకారం చెప్పేదేమిటంటే..పాజిటివ్ వచ్చిందంటే వెంటనే మన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా పరీక్షలు చేయించి మందులు ప్రారంభించాలి. సోషల్ మీడియాలో వచ్చే వాటితో ప్రయోగాలు చేయకూడదు. కరోనాను సీరియస్‌గా తీసుకుని, కేర్ ఫుల్‌గా ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయిపోతుంది. -
అందులో నేను అంధురాలిని: హీరోయిన్
‘ప్రేమ కావాలి, పూలరంగడు’ ఫేమ్ ఇషా చావ్లా లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘అగోచర’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కబీర్ లాల్ ఈ చిత్రంతో దర్శకునిగా మారారు. ఇషా చావ్లా భర్త పాత్రలో నటుడు కమల్ కామరాజు నటిస్తున్నారు. లవ్లీ వరల్డ్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం డెహ్రాడూన్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఇషా చావ్లా మాట్లాడుతూ– ‘‘కబీర్ లాల్ చాలా కాలంగా నాకు తెలుసు. ఆయన చెప్పిన కథ ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో వెంటనే ఈ సినిమా చేస్తానని చెప్పేశాను. ఇందులో అంధురాలి పాత్ర చేస్తున్నాను. ఇలాంటి పాత్ర కోసమే ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నాను. ఈ పాత్ర చేయడం మానసికంగానే కాకుండా ఎమోషనల్‌గా కూడా ఛాలెంజింగ్‌గా ఉంది’’ అన్నారు. కబీర్ లాల్ మాట్లాడుతూ– ‘‘మర్డర్ మిస్టరీగా రూపొందుతోన్న చిత్రం ‘అగోచర’. ఒక ఘటనతో జీవితాలు ఎలా మారిపోయాయి? అనేది ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ చిత్రంలో ఇషా చావ్లా ఒక భిన్నమైన పవర్ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఆమెకు మద్దతు ఇచ్చే భర్త సైకాలజిస్ట్ పాత్రలో కమల్ కామరాజు నటిస్తున్నారు. జూన్‌లో సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు. బ్రహ్మానందం, సునీల్ వర్మ, అజయ్ కుమార్ సింగ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చదవండి: స్టోరీ టెల్లింగ్ అద్భుతంగా ఉంది: చిరంజీవి ∙ఇషా చావ్లా -
టీజర్: కథను కళ్లకు చూపిస్తే ‘నాట్యం’
ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘నాట్యం’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ‘ప్రముఖ నృత్యకారిణి సంధ్యారాజు, నాట్యం చిత్రబృందానికి శుభాకాంక్షలు’ అని చెబుతూ బుధవారం ఎన్టీఆర్ టీజర్‌ను లాంచ్ చేశారు. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నాట్యం ప్రధానాంశంగా రూపుదిద్దుకుంటోంది. ‘ఏం చేస్తున్నావ్ అని చిన్నారి అడగ్గా ఒక కథ తయారు చేస్తున్నా’ అని ఆదిత్య మీనన్ చెప్తాడు. ‘మనం కథను వింటాం కదా.. అదే కథను మన కళ్లకు చూపిస్తే దాన్ని నాట్యం అంటాం’ అంటూ ఆదిత్యమీనన్ నాట్యం ప్రాధాన్యం ఆ చిన్నారికి వివరిస్తూ టీజర్ ఉంది. కూచిపూడి నృత్యం నేపథ్యంలో ‘కాదంబరి’ అనే పాత్ర చుట్టూ ఈ సినిమా ఉండనుందని టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. సంధ్యా రాజ్, కమల్ కామరాజ్ ప్రధాన పాత్రలుగా నిశ్రుంకుల ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. రోహిత్ బెహల్, భానుప్రియ, శుభలేఖ సుధాకర్, జబర్దస్త్ దీవెన, హైపర్ ఆది తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. -
రవీంద్రనాథ్ ఠాగూర్ భావాలతో...
శ్రీరామ్, జీవన్, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దాడి’. మధు శోభ.టి దర్శకత్వంలో శంకర్. ఎ నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందే కొంతభాగం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం చివరి షెడ్యూల్ ఆగస్ట్ మొదటి వారంలో ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా శంకర్.ఎ మాట్లాడుతూ– ‘‘విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ భావాలతో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా విడుదల చేసిన మా ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. మధుశోభ మేకింగ్ చాలా బాగుంది. మణిశర్మగారి సంగీతం, కాసర్ల శ్యామ్, భాష్యశ్రీల సాహిత్యం మా సినిమాకు ప్లస్ అవుతాయి’’ అన్నారు. -
హారర్.. సెంటిమెంట్
సీహెచ్ సుమన్‌బాబు నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’. శ్రీరామ్, కారుణ్య, కమల్ కామరాజు, భానుశ్రీ, అజయ్, ఉత్తేజ్, మహేష్, సురేష్ కొండేటి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న రాజేంద్రప్రసాద్ మనవరాలు, ‘మహానటి’ ఫేమ్ సాయి తుషిత టైటిల్ లోగో ఆవిష్కరించారు. దర్శక–నిర్మాత సుమన్‌బాబు మాట్లాడుతూ– ‘‘మదర్ సెంటిమెంట్, హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. కన్నడలో రెండు చిత్రాలు చేసిన నేను తెలుగులో తొలిసారి నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాను. కారుణ్య డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఇందులో ఓ ప్రత్యేక పాత్రను పోషించడానికి సరైన వ్యక్తిగా సురేష్ కొండేటిని అనుకున్నాం. త్వరలో ఆయనపై చిత్రీకరణ చేయనున్నాం’’ అన్నారు. ‘‘మా తాతగారితో ‘మహానటి’లో నటించాను. ఆ చిత్రం ఎంతో పేరు తెచ్చింది. ఈ సినిమాలోనూ మంచి పాత్ర చేస్తున్నా’’ అని సాయి తుషిత చెప్పింది. ‘‘ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది’’ అన్నారు కారుణ్య. నటుడు భద్రం, రచయిత గోపీవిమలపుత్ర, కెమెరా చందు, ఎడిటర్ వెంకట్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
లాకి కొత్త అర్థం చెప్పారు
‘‘లా’ టైటిల్ చాలా బాగుంది. ‘లా’కి ‘లవ్ అండ్ వార్’ అని కొత్త అర్థం చెప్పారు గగన్ గోపాల్. ఈ చిత్రంతో కమల్ కామరాజు, మౌర్యాణిలకు మంచి పేరు వస్తుందని నమ్ముతున్నా. ‘లా’ సినిమా హిట్ అవుతుంది. 4 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఏపీలో సినిమా తీస్తే పన్నులన్నీ రద్దు చేస్తాం. లొకేషన్లు ఫ్రీగా ఇస్తాం’’ అని ఆంధ్రప్రదేశ్ ఎఫ్.డి.సి. చైర్మన్ అంబికా కృష్ణ అన్నారు. కమల్ కామరాజు, మౌర్యాణి, పూజా రామచంద్రన్ ముఖ్య తారలుగా గగన్ గోపాల్ ముల్కా డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ‘లా’ (లవ్ అండ్ వార్). రమేష్ బాబు మున్నా, మద్దిపాటి శివ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. సత్య కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను విజయవాడలో విడుదల చేశారు. కమల్ కామరాజు మట్లాడుతూ– ‘‘గగన్ రాసిన స్క్రీన్ ప్లే మా సినిమాకు ప్రధాన బలం. నేను ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం కథే. ఈ చిత్రానికి కథే హీరో. మంచి ట్విస్టులు ఉంటాయి. రమేష్ బాబు మున్నా, మద్దిపాటి శివ లేకపోతే ఈ సినిమా లేదు’’ అన్నారు. ‘‘లా’ సినిమా కథను అందరు ఆర్టిస్టులు ఒకే సిట్టింగ్‌లో ఓకే చేశారు. కమల్ కామరాజు, మౌర్యాణి, పూజ చాలా సహకరించారు’’ అని గగన్ గోపాల్ అన్నారు. రమేష్ బాబు, మౌర్యాణి, పూజా రామచంద్రన్, సత్య కశ్యప్, నటి మంజు భార్గవి తదితరులు పాల్గొన్నారు. -
నలుగురు తమ్ముళ్లు.. ఓ అన్నయ్య... సూపర్ సెల్ఫీ
మెగా బ్రదర్స్ ముగ్గురిలో చిన్నోడు పవన్‌కల్యాణ్. రియల్ లైఫ్‌లోనే ఆయన తమ్ముడు. కొత్త సినిమాలో పెద్దన్న పాత్రను పోషిస్తున్నారు. పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘కాటమరాయుడు’. కిశోర్ పార్ధసాని (డాలీ) దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా నటిస్తున్నారు పవన్. నలభై రోజులుగా పొల్లాచ్చిలో జరుగుతోన్న షూటింగ్ చివరికి వచ్చేసిందట! పొల్లాచ్చి షెడ్యూల్లో పవన్ తమ్ముళ్లుగా నటిస్తున్న శివబాలాజీ, అజయ్, చైతన్యకృష్ణ, కమల్ కామరాజులు కూడా పాల్గొంటున్నారు. మంగళవారం లంచ్ టైమ్‌లో తమ్ముళ్లతో కలసి ఓ సెల్ఫీ తీసుకున్నారు పవన్. ఫొటోలో మీరు చూస్తున్నది ఆ సెల్ఫీనే. ‘‘పవన్ చూపించే ప్రేమ, ఆప్యాయతలకు హ్యాట్సాఫ్. ఆయన్ను కలసిన తర్వాత అభిమానించకుండా ఉండలేం. నలభై రోజులుగా ఆయనతో కలసి షూటింగ్ చేయడం ఆనందంగా ఉంది’’ అని ఈ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చైతన్యకృష్ణ పేర్కొన్నారు. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ స్వరకర్త. -
పవన్ సోదరుడిగా కమల్ కామరాజు
చాలా రోజులుగా ఊరిస్తూ వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కాటమరాయుడు సెట్స్ మీదకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు రీమేక్‌గా తెరకెక్కుతోంది. అయితే పూర్తిగా రీమేక్‌లా కాకుండా మూల కథను మాత్రమే తీసుకొని పవన్ ఇమేజ్‌కు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేశారు. తాజాగా ఈ సినిమాలో పవన్ తమ్ముడిగా నటిస్తున్న కమల్ కామరాజు ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు. కాటమరాయుడులో తనది కీలక పాత్ర అన్న కమల్, తను పవన్ కళ్యాణ్ చిన్న తమ్ముడిగా నటిస్తున్నట్టుగా తెలిపాడు. అంతేకాదు సినిమాలో తనకు లవ్ స్టోరి కూడా ఉంటుందని, తన గర్ల్ ఫ్రెండ్‌గా మానస నటిస్తోందని తెలిపాడు. గతంలో పవన్‌తో కలిసి జల్సా సినిమాలో చిన్న పాత్రలో నటించిన పవన్ మరోసారి పవన్ స్టార్‌తో తెరను పంచుకోవటం ఆనందంగా ఉందన్నాడు. -
తారల బిజీనెస్
రంగులలోకంలో రాజాలై, ‘రాణి’ంచాలని... తెరకెక్కుతున్న తారలు ఆ కలలు కల్లలైతే... ఏం కావాలి? ఓ వైపు ఈ ప్రశ్న ‘ఉదయి’ంచే సంఘటనలు అప్పుడప్పుడూ చోటుచేసుకుంటుంటే... మరోవైపు ‘మాకు రెస్టారెంట్ ఉంది.. రియల్ఎస్టేట్ ఉంది.. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది’ అంటూ పలువురు నటీనటులు తమకున్న విభిన్న రకాల వ్యాపకాలతో దీనికి సమాధానం చెప్పకనే చెబుతున్నారు. అవకాశాల దీపం వెలుగుతూ ఉండగానే కొత్త కెరీర్లను వెతుక్కుంటున్నారు. సినీ వినీలాకాశంలో వెలిగే తారలు కాలేకపోయినా... ఆర్థిక స్థిరత్వానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. యువనటుడు ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య ఉదంతం వెండితెర తారల జీవితాలపై రేపిన ప్రశ్నలెన్నో. అందులో ప్రధానమైనది... సినిమా నటుల ఆర్థిక పరిస్థితి. కెరీర్ బాగున్నప్పుడు సరే గానీ... కాస్త అటూ ఇటూ అయినా ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా... కొందరు ముందస్తు ప్రణాళికలతో కొత్త కొత్త వ్యాపకాలతో సినిమా రంగానికి ఆవల సరికొత్త వ్యాపకాలను విస్తరించుకుంటున్నారు. ప్లస్.. సెలబ్రిటీ స్టేటస్ తమకున్న సెలబ్రిటీ స్టేటస్‌నే పెట్టుబడిగా.. నటులు వ్యాపారవేత్తలుగా అవతరిస్తున్నారు. నగరానికి చెందిన పలువురు వ్యాపారులు వీరిని భాగస్వాములుగా కలుపుకునేందుకు ఉవ్విళ్లూరుతుండడంతో వీరి పని మరింత సులువుగా మారుతోంది. తమ ముందస్తు ప్రణాళికలో భాగంగా ఫ్యాషన్ రంగంతో పాటు స్పాలు, జిమ్‌లు, క్లబ్‌లు, పబ్‌లు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు... ఇలా విభిన్న రంగాలను సినీనటులు ఎంచుకుంటున్నారు. కాదేదీ.. కాలిడేందుకు అనర్హం... తమకు వ్యాపారం లేదా వ్యాపకం ఉన్న విషయం తెలిస్తే సినీ అవకాశాలు దూరమవుతాయనే కారణంతో వీటి వివరాలు కొందరు నటీ నటులు వెల్లడించడానికి ఇష్టపడనప్పటికీ.. నగరంలో వీరి ‘బిజీ’నెస్‌లు చాలా మందికి తెల్సినవే. * హీరో శర్వానంద్‌ను తీసుకుంటే ఆయన సినిమాలకు ప్రత్యామ్నాయ కెరీర్‌గా హోటల్ రంగాన్ని ఎంచుకున్నట్టు కనబడుతోంది. తన స్నేహితుల, కుటుంబీకుల సహకారంతో జూబ్లీహిల్స్‌లో ఆయన ‘బీన్జ్’ పేరుతో ఓ కాఫీ షాప్, రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. * స్లిమ్‌గా మారి మళ్లీ చిన్నితెర, వెండితెరలపై త‘లుక్’మంటున్న రాశి... మణికొండలో ఓ ప్లే స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. * నటి భూమిక ‘మాయాబజార్’ అనే మేగజైన్‌ను ప్రారంభించి అనంతరం ఒక మినరల్ వాటర్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. భర్త భరత్ ఠాకూర్‌కు యోగా శిక్షకుడిగా ఉన్న ప్రాచుర్యాన్ని ఉపయోగించుకునేందుకు భారీస్థాయిలో యోగా శిక్షణా స్కూల్ నిర్వహణలోనూ ఆమె పాలుపంచుకుంటున్నారు. * పలు చిత్రాల్లో హీరోగా, ప్రధాన పాత్రల్లోనూ నటిస్తూ టాలీవుడ్లో తనదైన గుర్తింపు పొందిన నటుడు నవదీప్ మరో స్నేహితుడ్ని పార్ట్నర్గా చేసుకుని ఇటీవలే ‘రా ప్రొడక్షన్ హౌస్’ పేరుతో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని స్థాపించారు. సుష్మితాసేన్ సమర్పించిన ‘ఐయామ్ షి’ ఈవెంట్‌ను ఆయన సంస్థ విజయవంతంగా నిర్వహించింది. * వారసత్వంగా లభించిన స్థలంలో కొందరు మిత్రులతో కలిసి కార్ఖానా, వాసవీనగర్‌లో ‘మాయాబజార్’ పేరిట ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు నటుడు శశాంక్. ‘ఐతే’తో అరంగేట్రం చేసిన ఈ నటుడు తాజా సినిమా‘ఎవడు’లోనూ మంచి పాత్ర పోషించారు. * కమల్ కామరాజ్ అటు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు చిత్రకారుడిగానూ నిరూపించుకుంటున్నారు. ఒడిదుడుకులు తట్టుకునేందుకు.. సినీరంగంలో ఒడిదుడుకులు తీవ్రంగానే ఉంటాయి. వీటిని తట్టుకునేందుకు ఆర్థిక స్వావలంబన అవసరం. అందుకే మాయాబజార్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశాను. షూటింగ్‌లు లేని సమయాల్లో వీలైనంత ఎక్కువ సమయాన్ని దీని నిర్వహణకే కేటాయిస్తున్నా. వ్యాపార భాగస్వాములైన మిత్రుల సహకారంతో రెస్టారెంట్‌ను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నా. - శశాంక్, నటుడు ‘రియల్ ఎస్టేట్’లోకి వస్తున్నా మొదటి నుంచీ సినిమారంగంతో పాటు నన్ను నేను నిరూపించుకునేందుకు పలు రంగాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నాను. త్వరలో ‘ది విలేజ్’ పేరుతో ఓ సరికొత్త రియల్ ఎస్టేట్ వెంచర్‌ను సైతం ప్రారంభిస్తున్నాను. నా సినిమా షూటింగ్‌లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ వ్యాపకాలన్నింటిలో సన్నిహితులను భాగస్వాములుగా చేసుకుంటున్నాను. - నవదీప్, నటుడు -
కమల్ కామరాజు నిశ్చితార్థం
గోదావరి, ఆవకాయ్ బిర్యానీ, కలవరమాయె మదిలో తదితర చిత్రాల్లో నటించిన కమల్ కామరాజు త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు. తను ప్రేమించిన బెంగాలీ అమ్మాయి సుప్రియ బిశ్వాస్‌తో ఈ కుర్రహీరో నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లోని కమల్ కామరాజ్ స్వగృహంలో ఆదివారం జరిగిన నిశ్చితార్థానికి దర్శకులు శేఖర్ కమ్ముల, కమల్ కామరాజ్ బంధువు ,బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల... తదితరులు హాజరయ్యారు. తన కాబోయే భార్య భోపాల్‌కు చెందిన అమ్మాయని, ప్రైవేట్ ఉద్యోగం చేస్తోందని కమల్ ఈ సందర్భంగా చెప్పారు. డిసెంబరు 13న హైదరాబాద్‌లో పెళ్లి జరుగనుందని కమల్ తెలియజేశారు.