
కారుణ్య, తుషిత, సుమన్
సీహెచ్ సుమన్‌బాబు నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’. శ్రీరామ్, కారుణ్య, కమల్ కామరాజు, భానుశ్రీ, అజయ్, ఉత్తేజ్, మహేష్, సురేష్ కొండేటి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న రాజేంద్రప్రసాద్ మనవరాలు, ‘మహానటి’ ఫేమ్ సాయి తుషిత టైటిల్ లోగో ఆవిష్కరించారు. దర్శక–నిర్మాత సుమన్‌బాబు మాట్లాడుతూ– ‘‘మదర్ సెంటిమెంట్, హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. కన్నడలో రెండు చిత్రాలు చేసిన నేను తెలుగులో తొలిసారి నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాను.
కారుణ్య డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఇందులో ఓ ప్రత్యేక పాత్రను పోషించడానికి సరైన వ్యక్తిగా సురేష్ కొండేటిని అనుకున్నాం. త్వరలో ఆయనపై చిత్రీకరణ చేయనున్నాం’’ అన్నారు. ‘‘మా తాతగారితో ‘మహానటి’లో నటించాను. ఆ చిత్రం ఎంతో పేరు తెచ్చింది. ఈ సినిమాలోనూ మంచి పాత్ర చేస్తున్నా’’ అని సాయి తుషిత చెప్పింది. ‘‘ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది’’ అన్నారు కారుణ్య. నటుడు భద్రం, రచయిత గోపీవిమలపుత్ర, కెమెరా చందు, ఎడిటర్ వెంకట్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment