bhanusri
-
ఈఎమ్ఐ నేపథ్యంలో...
నోయల్, భానుశ్రీ జంటగా దొంతు రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈఎమ్ఐ’. దొంతు బుచ్చయ్య, సంగీత బమ్మిడి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని నిర్మాతలు ప్రతాని రామకృష్ణగౌడ్, ప్రసన్నకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దొంతు రమేష్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ఇది. బ్యాంకాక్‌లో కొన్ని పాటలు చిత్రీకరించనున్నాం. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మా సినిమా చూసిన తర్వాత నచ్చలేదు అనే వాళ్ల ఈఎమ్ఐ నేను చెల్లిస్తాను’’ అన్నారు. ‘‘నెలవారీ వాయిదాలు చెల్లించలేక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది’’ అన్నారు భానుశ్రీ. ‘‘ప్రస్తుతం ఈఎమ్ఐ అంటే తెలియనివారుండరు. ఆ నేపథ్యంలో వినోదాత్మకంగా సాగే కథ ఇది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని దొంతు బుచ్చయ్య, సంగీత బమ్మిడి అన్నారు. -
హారర్.. సెంటిమెంట్
సీహెచ్ సుమన్‌బాబు నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’. శ్రీరామ్, కారుణ్య, కమల్ కామరాజు, భానుశ్రీ, అజయ్, ఉత్తేజ్, మహేష్, సురేష్ కొండేటి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న రాజేంద్రప్రసాద్ మనవరాలు, ‘మహానటి’ ఫేమ్ సాయి తుషిత టైటిల్ లోగో ఆవిష్కరించారు. దర్శక–నిర్మాత సుమన్‌బాబు మాట్లాడుతూ– ‘‘మదర్ సెంటిమెంట్, హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. కన్నడలో రెండు చిత్రాలు చేసిన నేను తెలుగులో తొలిసారి నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాను. కారుణ్య డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఇందులో ఓ ప్రత్యేక పాత్రను పోషించడానికి సరైన వ్యక్తిగా సురేష్ కొండేటిని అనుకున్నాం. త్వరలో ఆయనపై చిత్రీకరణ చేయనున్నాం’’ అన్నారు. ‘‘మా తాతగారితో ‘మహానటి’లో నటించాను. ఆ చిత్రం ఎంతో పేరు తెచ్చింది. ఈ సినిమాలోనూ మంచి పాత్ర చేస్తున్నా’’ అని సాయి తుషిత చెప్పింది. ‘‘ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది’’ అన్నారు కారుణ్య. నటుడు భద్రం, రచయిత గోపీవిమలపుత్ర, కెమెరా చందు, ఎడిటర్ వెంకట్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
పురుషులకూ ‘మీటూ’
అభిషేక్ రెడ్డి, ‘బిగ్ బాస్’ ఫేం భానుశ్రీ, ఆయేషా సింగ్, ‘నగరం’ సునీల్ ముఖ్య తార లుగా శామ్ జె. చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఏడు చేపల కథ’. డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జీవీఎన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పురుషులపై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. వాటికి ఆధారాలు లేకపోయినా నమ్ముతున్నాం. కానీ, పురుషులపై మహిళలు చేసే అఘాయిత్యాలను ఆధారాలతో సహా అరిచి చెప్పినా నమ్మ రు. అందుకే.. పురుషుల తరఫున ‘మీటూ’ అంటూ టెమ్ట్ రవి అనే ప్రయోగాత్మక పాత్రను ఈ చిత్రంతో పరిచయం చేస్తున్నాం. అడల్డ్ కామెడీ జోనర్లో సాగే చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: గుండ్ర లక్ష్మిరెడ్డి, సంగీతం: కవి శంకర్, కెమెరా: ఆర్లీ. -
మొనగాడొస్తున్నాడు
కన్నడ హీరో యోగి ఫల్గుణ్ ‘మొనగాడు’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. భానుశ్రీ హీరోయిన్. ఎం.ఎం. వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ రాగ క్రియేషన్స్, సామి అసోసియేట్స్ పతాకాలపై పోషం మట్టారెడ్డి, టి.పి.సిద్దరాజు, కె.నారాయణమూర్తి నిర్మిస్తున్న ‘మొనగాడు’ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి జంబూద్వీప శక్తి పీఠాధిపతి ఆదిదండి శక్తిశ్రీ జగద్గురు భగవతీ మహరాజ్ స్వామీజీ క్లాప్ ఇచ్చారు. ‘‘తెలుగు సినిమాల్లో నటించాలన్న కోరిక ‘మొనగాడు’ లాంటి సినిమా ద్వారా నెరవేరుతున్నందుకు హ్యాపీ’’ అన్నారు యోగి ఫల్గుణ్. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్. సి.హెచ్, సంగీతం: వినోద్ యాజమాన్య, సహ నిర్మాతలు: నాగరాణి రమాదేవి, యలమెల్లి బాలకృష్ణ. -
సైంటిఫిక్ థ్రిల్లర్
డిఫరెంట్ జానర్లో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘మౌనం’. మురళీకృష్ణ, భానుశ్రీ ముఖ్యతారలుగా కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్, సంధ్యా రవి నిర్మించిన ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. నిర్మాతలు మాట్లాడుతూ-‘‘ఈ చిత్రానికి శ్రీలేఖ మంచి పాటలతో పాటు చక్కని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది. త్వరలో కొలంబోలో పాటలను చిత్రీకరించనున్నాం’’ అని తెలిపారు, ఈ చిత్రానికి కథ: అనిల్.కె.నాని, కథనం-మాటలు-కూర్పు: శివ శర్వాణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బలుసు రామారావు.