
ఆయేషా సింగ్
అభిషేక్ రెడ్డి, ‘బిగ్ బాస్’ ఫేం భానుశ్రీ, ఆయేషా సింగ్, ‘నగరం’ సునీల్ ముఖ్య తార లుగా శామ్ జె. చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఏడు చేపల కథ’. డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జీవీఎన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పురుషులపై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. వాటికి ఆధారాలు లేకపోయినా నమ్ముతున్నాం. కానీ, పురుషులపై మహిళలు చేసే అఘాయిత్యాలను ఆధారాలతో సహా అరిచి చెప్పినా నమ్మ రు. అందుకే.. పురుషుల తరఫున ‘మీటూ’ అంటూ టెమ్ట్ రవి అనే ప్రయోగాత్మక పాత్రను ఈ చిత్రంతో పరిచయం చేస్తున్నాం. అడల్డ్ కామెడీ జోనర్‌లో సాగే చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: గుండ్ర లక్ష్మిరెడ్డి, సంగీతం: కవి శంకర్, కెమెరా: ఆర్లీ.
Comments
Please login to add a commentAdd a comment