Abhishek reddy
-
VIDAR Vs AP: నిరాశపరిచిన కేఎస్ భరత్.. ఆంధ్ర జట్టు ఓటమి
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నీ సీజన్‌ను ఆంధ్ర జట్టు ఓటమితో ఆరంభించింది. మాజీ చాంపియన్ విదర్భ జట్టుతో సోమవారం ముగిసిన గ్రూప్ ‘బి’ తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 74 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.కాగా 318 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 86.4 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 79/1తో చివరి రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టు ఒకదశలో ఒక వికెట్ నష్టానికి 177 పరుగులతో పటిష్టంగా కనిపించింది. అయితే ఓపెనర్ అభిషేక్ రెడ్డి (78; 5 ఫోర్లు, 1 సిక్స్), షేక్ రషీద్ (74; 7 ఫోర్లు) 12 పరుగుల వ్యవధిలో అవుటవ్వడంతో ఆంధ్ర జట్టు పతనం మొదలైంది.శశికాంత్ కాస్త పోరాడినావీరిద్దరు పెవిలియన్ చేరుకున్నాక వచ్చిన ఇతర బ్యాటర్లెవరూ క్రీజులో కుదురుకోలేకపోయారు. కెప్టెన్ రికీ భుయ్ (26; 1 ఫోర్, 1 సిక్స్), శశికాంత్ (25; 2 ఫోర్లు, 1 సిక్స్) కాస్త పోరాడినా... కేఎస్ భరత్ (2), అశ్విన్ హెబర్ (3) నిరాశపరిచారు. విజయ్ (0), లలిత్ మోహన్ (0), సత్యనారాయణ రాజు (0) డకౌట్ అయ్యారు.చివరి వికెట్‌గా శశికాంత్ వెనుదిరిగాడు. విదర్భ జట్టు బౌలర్లు ఆదిత్య థాకరే (4/47), హర్ష్ దూబే (4/69), అక్షయ్ వాఖరే (2/71) ఆంధ్ర జట్టు పతనాన్ని శాసించారు. ఈ గెలుపుతో విదర్భ జట్టుకు ఆరు పాయింట్లు లభించాయి. ఈనెల 18 నుంచి జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ జట్టుతో ఆంధ్ర జట్టు ఆడుతుంది.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే! -
ఎఫ్ఐఎం ఇ–ఎక్స్ప్లోరర్లో భారత జట్టు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మోటార్ సైక్లింగ్ సమాఖ్య (ఎఫ్ఐఎం) నిర్వహించే ప్రతిష్టాత్మక ఇ–ఎక్స్‌ప్లోరర్ ఈవెంట్లో తొలిసారి భారత జట్టు ప్రాతినిధ్యం వహించనుంది. 2024 సీజన్లో భారత్‌కు చెందిన ‘ఇండి రేసింగ్’ టీమ్ బరిలోకి దిగుతుంది. అధికారికంగా ఎఫ్ఐఎం అనుమతించిన రేసింగ్ పోటీల్లో పాల్గొనే తొలి టీమ్ ‘ఇండి రేసింగ్’ అవుతుంది. ఈ జట్టు యజమాని కంకణాల అభిశేక్ రెడ్డి ఈ విషయాలు వెల్లడించారు. తాజా సీజన్ రేస్‌లు జపాన్‌లో వచ్చే ఫిబ్రవరిలో మొదలవుతాయి. నవంబర్‌లో హైదరాబాద్‌లోనే రేసింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఇండి రేసింగ్ టీమ్ తరఫున ఐశ్వర్య పిస్సే, స్పెన్సర్ విల్టన్, సాండ్రా గోమెజ్ పోటీ పడతారు. భారత్‌లో మోటార్ స్పోర్ట్స్‌పై ఆసక్తి ఇటీవల చాలా పెరిగిందని, అయితే పోటీల్లోకి వచ్చేసరికి మన టీమ్‌కు ప్రాతినిధ్యం లేదని కంకణాల స్పోర్ట్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు అభిశేక్ రెడ్డి అన్నారు. ఇప్పుడు తమ జట్టు ఇండి రేసింగ్ ఆ అవకాశం కలి్పస్తుందని, ఎక్కువ మంది దీనివైపు మళ్లేలా తమ ప్రయత్నం ఉపకరిస్తుందని ఆయన చెప్పారు. -
‘గ్లోబల్ టీమ్‌ను తయారు చేస్తాం’
సాక్షి, హైదరాబాద్: భారత క్రీడల్లో గత కొన్నేళ్లుగా వేర్వేరు లీగ్‌లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ క్రీడాంశాల్లో సాగుతున్న ఈ లీగ్‌లపై అటు ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తుండగా, ఇటు పలు వ్యాపార వర్గాలు లీగ్‌లతో జత కట్టి తమ ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇదే కోవలో ఇప్పుడు ‘ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్’ నడుస్తోంది. జైపూర్ వేదికగా ఈ నెల 8న ప్రారంభమైన టోర్నీ 25 వరకు సాగనుంది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ‘తెలుగు టాలన్స్’ జట్టుకు కంకణాల అభిషేక్ రెడ్డి యజమానిగా ఉన్నారు. అభిషేక్‌కే చెందిన ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్’ టీమ్ ఇప్పటికే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో ఆడుతోంది. అంతకుముందే ఆయన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌తో పాటు బాక్సింగ్ లీగ్‌లో కూడా భాగస్వామిగా ఉన్నారు. క్రీడలపై అభిరుచితో పాటు ఎక్కువ మందికి ఆయా క్రీడాంశాలకు మరింత ప్రాచుర్యం కల్పించే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తున్నట్లు అభిషేక్ రెడ్డి చెప్పారు. ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్, అందులో తన టీమ్ తెలుగు టాలన్స్ పాత్రకు సంబంధించి వివిధ అంశాలపై అభిషేక్ ‘సాక్షి’తో మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే... వరుసగా లీగ్‌లలో జట్లను కొనడంపై... మొదటి నుంచి నాకు క్రీడలపై అమితాసక్తి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని పెద్ద ఈవెంట్లను అనుసరించేవాడిని. విదేశాల్లో ఉన్నప్పుడు అక్కడి పోటీలకు ప్రత్యక్షంగా తిలకిస్తున్న సమయంలో అక్కడి అభిమానులు చూపించే ఆసక్తి, ఆట పట్ల అక్కడ ఉండే క్రేజ్ నన్ను ఆశ్చర్యపర్చాయి. మన దేశంలో క్రికెటేతర క్రీడల్లో మనం ఇలాంటిది చాలా తక్కువగా చూస్తాం. అయితే లీగ్‌లు రంగప్రవేశం చేశాక ఫ్యాన్స్ కూడా సదరు ఆటవైపు ఆకర్షితులవుతున్నారు. నా ప్రవృత్తి క్రీడలు. అందుకే ఏదో రూపంలో వాటితో జత కట్టాలని భావించాను. వాలీబాల్ లీగ్‌కు వచ్చిన బ్రహ్మాండమైన స్పందన చూసి ఇప్పుడు హ్యాండ్‌బాల్ వైపు వచ్చాం. హ్యాండ్‌బాల్‌లో లీగ్ అవసరం గురించి... మన దగ్గర కూడా హ్యాండ్‌బాల్ పోటీలను రెగ్యులర్‌గా చూసే అభిమానులు ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తూ చాలా చోట్ల అది అవుట్డోర్ గేమ్‌గా, మట్టి కోర్టులలో కనిపిస్తుంది. కానీ ఆధునిక యూరోపియన్ శైలిలో ఇండోర్ హ్యాండ్‌బాల్ బాగా పాపులర్. అలాంటి ఆటను ఇప్పుడు లీగ్ ద్వారా అందరికీ చేరువ చేస్తున్నాం. తెలుగు టాలన్స్ ప్రదర్శనపై... చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే సెమీఫైనల్లోకి అడుగు పెట్టాం. తొలి లీగ్ విజేతగా కూడా నిలుస్తామనే నమ్మకం ఉంది. లీగ్‌లోని ఆరు జట్లలోనూ మా ఒక్క టీమ్‌కే విదేశీ కోచ్ (ఫెర్నాండో న్యూనెస్–పోర్చుగల్) ఉన్నాడు. ఆయన నేతృత్వంలో టీమ్ చాలా బాగా ఆడటమే కాదు, లీగ్‌లో ఒక టీమ్‌ను, ఆటగాళ్లను ఎలా తీర్చిదిద్దాలో కూడా దిశానిర్దేశం చేసేలా కోచింగ్ సాగింది. తెలుగు రాష్ట్రాల్లో ఆటగాళ్ల గురించి... ఈ విషయంలో కొంత నిరాశ ఉన్న మాట వాస్తవం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కొందరు చక్కటి హ్యాండ్‌బాల్ ఆటగాళ్లు ఉన్నా... మా లీగ్‌కు తగినట్లుగా కొన్ని ప్రమాణాల ప్రకారం మాకు తగిన ఆటగాళ్లు లభించలేదు. అయితే రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మారడం ఖాయం. లీగ్ కూడా అందుకు సహకరిస్తుంది. ఈసారి జట్టులో హైదరాబాద్‌లో ఆర్మీలో పని చేస్తున్న ఏడుగురు ఏఓసీ ఆటగాళ్లను మాత్రం తీసుకున్నాం. టీమ్ యజమానిగా ఆర్థిక అంశాలపై... లీగ్లలోకి అడుగు పెట్టేటప్పుడే నాకు దానిపై స్పష్టమైన అవగాహన ఉంది. ఇవి ఇతర వ్యాపారాల్లాగా ఇప్పటికిప్పుడు లాభాలు తెచ్చిపెట్టేవి కావు. మా ఉత్సాహం మాత్రమే టీమ్‌ను నడిపిస్తుంది. అయితే లాభం గురించి బెంగ లేదు. లీగ్‌తో పాటు సదరు క్రీడ కూడా పైస్థాయికి ఎదగడం ముఖ్యం. స్పాన్సర్లు ముందుకు రావడం కూడా సానుకూల పరిణామం. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో తలపడే గ్లోబల్ టీమ్‌ను తయారు చేయడమే మా లక్ష్యం. -
పట్నా హైకోర్టుకు జస్టిస్ అభిషేక్‌రెడ్డి బదిలీ
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిని పట్నా హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సిఫార్సుపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. జస్టిస్ అభిషేక్‌రెడ్డి 2019, ఆగస్టు 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ అభిషేక్‌రెడ్డి బదిలీని ఆపాల్సిందే: హెచ్‌సీఏఏ జస్టిస్ అభిషేక్‌రెడ్డి బదిలీ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్(హెచ్‌సీఏఏ) ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. బదిలీ ప్రతిపాదనను విరమించుకునే వరకు విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. విధి నిర్వహణలో నిజాయితీగా .. నిక్కచ్చిగా వ్యవహరించే జస్టిస్ అభిషేక్‌రెడ్డిని పట్నా కోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేయడాన్ని తప్పుబడుతూ న్యాయవాదులు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌సీఏఏ అధ్యక్షుడు వి.రఘునాథ్ మాట్లాడుతూ.. కొలీజియం నిర్ణయం అన్యామని, న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా ఉందన్నారు. ఏ మార్గదర్శకాలతో జస్టిస్ అభిషేక్‌రెడ్డి బదిలీ చేయనున్నారో పేర్కొనకపోవడాన్ని కూడా తప్పుబట్టారు. సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అప్పటివరకు న్యాయవాదులంతా విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఒక్క హైకోర్టులోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లలోని న్యాయవాదులంతా విధులు బహిష్కరించి నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు కొలీజియం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు వెనుకడుగు వేయొద్దన్నారు. అంతకు ముందు బదిలీని ఆపాలంటూ హెచ్సీఏఏలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం హైకోర్టు ఎదురుగా రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. ‘అక్రమ బదిలీలకు వ్యతిరేకంగా పోరాడుతాం.. వియ్ వాంట్ జస్టిస్’.. అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏఏ కార్యదర్శి గడిపల్లి మల్లారెడ్డి, న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, రాపోలు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు ఆటగాళ్ల సెంచరీల మోత.. ఒకే రోజు ముగ్గురు శతక్కొట్టుడు
బెంగళూరు: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర తొలి విజయం నమోదు చేసింది. గ్రూప్ ‘సి’లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 261 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. అభిషేక్ రెడ్డి (133 బంతుల్లో 136; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు), కోన శ్రీకర్ భరత్ (84 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్ 38 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. కమ్ష(18)దే అత్యధిక స్కోరు. అయ్యప్ప 3 వికెట్లు పడగొట్టగా... షోయబ్, హరిశంకర్, ఆశిష్ తలా 2 వికెట్లు తీశారు. పరుగుల పరంగా ఈ టోర్నీ చరిత్రలో ఆంధ్రకిదే పెద్ద విజయం. తన్మయ్ అగర్వాల్ శతకం... న్యూఢిల్లీ: సౌరాష్ట్రతో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా సౌరాష్ట్ర 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ (120 బంతుల్లో 102; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకం సాధించాడు. సంకేత్ 4 వికెట్లు పడగొట్టగా, అనికేత్ రెడ్డికి 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత హైదరాబాద్ 48.5 ఓవర్లలో 5 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (119 బంతుల్లో 124; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్ రాయుడు (97 బంతుల్లో 83; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 214 పరుగులు జోడించి హైదరాబాద్ విజయాన్ని సులువుగా మార్చగా, తిలక్ వర్మ (45; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించాడు. -
PVL: ఐటీ రంగంలో వ్యాపారాలు.. అయినా ఆటలపై మక్కువతోనే ఇలా: అభిషేక్ రెడ్డి
Prime Volleyball League- Hyderabad Black Hawks: ‘ప్రైమ్ వాలీబాల్ లీగ్’లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టుకు కంకణాల అభిషేక్ రెడ్డి యజమానిగా ఉన్నారు. ఇప్పటికే బ్యాడ్మింటన్, బాక్సింగ్ లీగ్‌లలో కూడా భాగస్వామ్యం ఉన్న ఆయన ఈ సారి వాలీబాల్ క్రీడకు ప్రాచుర్యం కల్పించాలని లీగ్‌లో భాగమయ్యేందుకు సిద్ధపడ్డారు. వాలీబాల్ లీగ్ ద్వారా లాభాలు ఆశించడం లేదని, ఆటలపై ఉన్న ఆసక్తితోనే ముందుకు వచ్చానని ఆయన వెల్లడించారు. ‘ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో రెండేళ్లు వరుసగా చాంపియన్‌గా నిలిచిన బెంగళూరు రాప్టర్స్ జట్టు కూడా మాదే. ఆ తర్వాత ఒక సీజన్లో బాక్సింగ్ లీగ్‌లో కూడా జట్టును తీసుకున్నాం. ఐటీ తదితర రంగాల్లో వ్యాపారాలు నా వృత్తి అయినా క్రీడలు ప్రవృత్తి. అందుకే వాలీబాల్ లీగ్‌లోనూ భాగస్వామిని కావాలని నిర్ణయించుకున్నా. టీవీల్లో ప్రసారాల ద్వారా దిగువ స్థాయి వరకు ఆటలకు ప్రచారం లభిస్తుందనేది నా నమ్మకం. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ఇష్టపడే వాలీబాల్‌ను కూడా ఇప్పుడు వారికి మరింత చేరువ చేయడమే మా లీగ్ లక్ష్యం. ఆర్థికపరంగా లీగ్ లాభదాయకం కాదని తెలిసినా కనీసం రాబోయే ఐదేళ్లు దేనికైనా సిద్ధపడే ఇందులోకి వచ్చాను. ఫ్రాంచైజీ జట్లే లీగ్ సమష్టి నిర్వాహకులు కాబట్టి పెద్ద సమస్య లేదు. మా హైదరాబాద్ టీమ్ అన్ని రకాలుగా పటిష్టంగా ఉంది. అత్యుత్తమ కోచ్ నేత్వత్వంలో టైటిల్ సాధిస్తామనే నమ్మకం ఉంది. మేం ఆశించిన స్థాయిలో ఈసారి స్థానికంగా ప్రతిభ గల ఆటగాళ్లు లభించకపోయినా వచ్చే ఏడాది మా టీమ్‌లో ఎక్కువ మందికి అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నాం’ అని ‘సాక్షి’తో మాట్లాడుతూ అభిషేక్ వివరించారు. కాగా ఫిబ్రవరి 5 నుంచి వాలీబాల్ క్రీడలో లీగ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ‘రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్’ పేరుతో జరగనున్న ఈ టోర్నీని మొత్తం హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నారు. చదవండి: PSL 2022: ఇంత దరిద్రమైన ఎంట్రీ ఎప్పుడు చూడలేదు.. అఫ్రిదిపై ట్రోల్స్ వర్షం -
ప్రతి సీన్లో నవ్వు
‘ఏడు చేపల కథ’ ఫేమ్ అభిషేక్ రెడ్డి, సాక్షి నిదియా జంటగా ‘అంతం’ ఫేమ్ జి.ఎస్.ఎస్.పి. కళ్యాణ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైఫై’. లక్ష్మీ చరిత ఆర్ట్స్, జీఎస్ఎస్పికే స్టూడియోస్ పతాకంపై జి. చరితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని దర్శకుడు వీరభద్రం, నిర్మాత సురేష్ కొండేటి విడుదల చేశారు. అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఏడు చేపల కథ’ నటుడిగా నాకు మంచి పేరు తీసుకురావడంతో పాటు 4 కోట్ల గ్రాస్ వచ్చింది. ‘వైఫై’ ఎవర్నీ నిరాశ పర్చదు. ప్రతీ సీన్లో నవ్వించే ప్రయత్నం చేశాం’’ అన్నారు. ‘‘సమయం కూడా తెలియకుండా సినిమా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు’’ అన్నారు జి.ఎస్.ఎస్.పి కళ్యాణ్. ‘‘ఇలాంటి కథలు ఈ జనరేషన్లో రావాలి.. అందరూ చూడాలి’’ అన్నారు చరితారెడ్డి. -
ఈ ప్రాంతాభివృద్ధికి సహకరిస్తా
మంచాల (ఇబ్రహీంపట్నం): చాలారోజుల తర్వాత తన స్వగ్రామానికి రావటం సంతోషంగా ఉందని, ఇబ్రహీంపట్నం ప్రాంతాభివృద్ధికి తాను సహకారం అందిస్తానని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డి పేర్కొన్నారు. జస్టిస్ అభిషేక్‌రెడ్డి స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా మంచాల మండ లం లింగంపల్లిలో ఆయనకు శనివారం గ్రామస్తులు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ కుటుంబం హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ వేసవి సెలవుల్లో తాను ఇక్కడికి వచ్చేవాడినని, అప్పుడు నీటివనరులు బాగా ఉండేవని గుర్తు చేసుకున్నారు. నాడు ఇబ్రహీంపట్నం పచ్చని పొలాలతో కళకళలాడుతుండేదని, ఇప్పుడా పంటలు, నీటి జాడలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొని వస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు జస్టిస్ అభిషేక్‌రెడ్డిని గజమాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. గ్రామస్తులతో పాటు రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ వంగేటి లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీలక్ష్మీ, చీరాల రమేశ్, జంగారెడ్డి, అంజిరెడ్డి తదితరులు జస్టిస్ అభిషేక్‌రెడ్డిని కలసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వినోద, ఉపసర్పంచ్ స్వాతి, నాయకులు అనిరెడ్డి శ్రీలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు. -
భార్య కంటే కత్తి మంచిది
‘ఏడుచేపల కథ’ చిత్రంలో టెంప్ట్ రవిగా క్రేజ్ సంపాదించుకున్న అభిషేక్ రెడ్డి, గుంజన్ జంటగా నటించిన చిత్రం ‘వైఫ్,ఐ’. ‘నైఫ్ బెటర్ దెన్ వైఫ్’(భార్య కంటే కత్తి మంచిది) అన్నది ఉపశీర్షిక. ‘అంతం’ ఫేమ్ జి.ఎస్.ఎస్.పి.కల్యాణ్ దర్శకత్వంలో లక్ష్మి చరిత ఆర్ట్స్– జిఎస్ఎస్పికె స్టూడియోస్ పతాకాలపై జి.చరితా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. జి.ఎస్.ఎస్.పి కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘నా గత చిత్రం ‘అంతం’ కమర్షియల్‌గా చాలా మంచి విజయాన్ని సాధించింది. మంచి కథ కోసమే ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. సమాజంలో జరుగుతున్న ఒక మంచి పాయింట్‌ని ‘వైఫ్, ఐ’ చిత్రంలో చాలా వినోదాత్మకంగా చూపించాం. భార్యాభర్తల మధ్య ఉండే అన్ని బంధాలు ఇందులో ఉంటాయి. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన మా చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలువుతాయి’’ అన్నారు. జి.చరితా రెడ్డి మాట్లాడుతూ– ‘‘కల్యాణ్ చెప్పిన కథ విన్నవెంటనే ఓకే చేశాను. ఎందుకంటే.. ఇలాంటి కథలు ఈ జెనరేషన్లోనే రావాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ పోయి అసూయ పెరుగుతోంది.. వైవాహిక జీవితాలు నాశనం అయిపోతున్నాయి. వీటికి కారణం ఏంటని తెలుసుకోలేకపోతున్నారు. మా చిత్రంలో ఆ విషయాన్నే ప్రస్తావించాం. ప్రతి మనిషీ తప్పులు చేస్తారు.. ఆ తప్పు ఏంటో తెలుసుకున్న నాడు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని చూపిస్తున్నాం’’ అన్నారు. కావ్య, సునీల్ నగరం, సూర్య ఆకోండి, మహేష్ విట్ట, అపర్ణ నటించిన ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య. -
భార్య భయపెడితే?
భార్యాభర్తల మధ్య ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న ప్రేమ, అసూయ, ద్వేషాలు, ఎప్పటికో కనిపించే ప్రేమ. దానిలో నుంచి పొంగుకొచ్చే రొమాన్స్... ఇవన్నీ మించితే వారి జీవితాలు ఎలా ఉంటాయి అనే పాయింట్‌తో ‘వైఫ్.ఐ’ చిత్రాన్ని తెరకెక్కించాం అని చిత్రబృందం తెలిపింది. ‘ఏడు చేపల కథ’ సినిమాతో టెంప్ట్ రవిగా ఫేమస్ అయిన అభిషేక్ రెడ్డి, సాక్షి నిదియా జంటగా నటించిన చిత్రం ‘వైఫ్.ఐ’. జి.ఎస్.ఎస్.పి కల్యాణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జి.చరితా రెడ్డి నిర్మాత. ‘‘మనిషి అనే ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. ఆ తప్పు ఏంటో తెలుసుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మా సినిమా ఫస్ట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. సినిమా విజయంపై యూనిట్ ధీమాగా ఉన్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం:వినోద్ యాజమాన్య. -
పురుషులకూ ‘మీటూ’
అభిషేక్ రెడ్డి, ‘బిగ్ బాస్’ ఫేం భానుశ్రీ, ఆయేషా సింగ్, ‘నగరం’ సునీల్ ముఖ్య తార లుగా శామ్ జె. చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఏడు చేపల కథ’. డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జీవీఎన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పురుషులపై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. వాటికి ఆధారాలు లేకపోయినా నమ్ముతున్నాం. కానీ, పురుషులపై మహిళలు చేసే అఘాయిత్యాలను ఆధారాలతో సహా అరిచి చెప్పినా నమ్మ రు. అందుకే.. పురుషుల తరఫున ‘మీటూ’ అంటూ టెమ్ట్ రవి అనే ప్రయోగాత్మక పాత్రను ఈ చిత్రంతో పరిచయం చేస్తున్నాం. అడల్డ్ కామెడీ జోనర్లో సాగే చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: గుండ్ర లక్ష్మిరెడ్డి, సంగీతం: కవి శంకర్, కెమెరా: ఆర్లీ. -
వదిలేస్తానంటే చనిపోతానంటుంది....
సాక్షి, పంజాగుట్ట : ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన మనోహర్ రెడ్డి, చంద్రకళ దంపతులు చాలా ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి ఖైరతాబాద్ రాజ్‌నగర్‌లో ఉంటున్నారు. వీరి కుమారుడు అభిషేక్ రెడ్డి (16) ఇంటర్ పూర్తి చేసి సీపీటీ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఆదివారం సాయంత్రం తండ్రితో పాటు బయటికి వెళ్లివచ్చిన అతను ఆకలిగా లేదని చెప్పి గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. సోమవారం ఉదయం అతని తండ్రి మనోహర్ రెడ్డి కుమారుడిని నిద్ర లేపేందుకు ప్రయత్నించగా తలుపులు తీయలేదు. దీంతో తలుపు సందులోనుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో అతను పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా అభిషేక్ రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘అందులో అమ్మ, నాన్నా మీరంటే నాకు చాలా ఇష్టం. అమ్మను ఎంత ప్రేమించానో ఆ అమ్మాయినీ అంతే ప్రేమించాను. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. ఆ పిల్లను వదిలేస్తానంటే నెయిల్ పాలీష్ తాగి చనిపోతాను అంటుంది. నేను ఎంతో స్ట్రగల్ అవుతున్నాను. నన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు. నాకు ఈ లైఫ్ వద్దు. నావల్ల ఎవ్వరూ బాధపడవద్దు, నా సెర్మనీకి అందరూ రావాలి’ అని రాసి ఉంది. -
ఈ అభి'శోకం' తీరనిది..!
మునుగోడు: ఉన్నత చదువులు చదివి తమకు చేదోడుగా ఉంటాడనుకున్న కొడుకు అకాలమరణంతో ఆ కుటుంబం శోకసముద్రంలో ముని గిపోయింది. దేశంకాని దేశంలో విగత జీవుడైన కుమారుడిని కడసారి చూసుకునేందుకు ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్కి చెందిన పులిమామిడి నర్సింహారెడ్డి, పద్మల కుమారుడు అభిషేక్‌రెడ్డి(26) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం మరణిం చిన విషయం తెలిసిందే. చిన్నప్పటి నుంచి అభిషేక్‌రెడ్డి చదువులో చురుగ్గా ఉండేవాడు. నల్లగొండలోని దేవరకొండ రోడ్డులో గల సెయింట్ ఆల్ఫోన్సన్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి వరకు చదివించాడు. ఆ తరువాత 9,10 తరగతులను హైదరాబాద్‌లోని బ్రిలి యంట్ పాఠశాలలో చదివించాడు. ఇంటర్ నల్లగొండ అరవిందో జూనియర్ కళాశాలలో చదివాడు. రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్‌మెట్ వద్ద ఉన్న అవంతి కళాశాలలో 2012లో బీటెక్ పూర్తి చేశాడు. ఉన్న ఏడు ఎకరాల భూమిని విక్రయించి.. తన కుమారుడి విదేశాలకు పంపేందుకు డబ్బులు లేకపోవడంతో నర్సింహారెడ్డి కొరటికల్‌లో ఉన్న ఏడు ఎకరాల భూమిని అమ్మి 2013 ఆగస్టు మాసంలో ఎంఎస్ చదివించేందుకు ఆమెరికాలోని కాలిఫోర్నియాకు పంపాడు. ఈ నెల 29న ఆ కళాశాల నుంచి ఎంఎస్ సర్టిఫికెట్ తీసుకొని తిరిగి హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. ఈ లోపు అక్కడి టూరిజం ప్రాంతాలను చూసేందుకు తన స్నేహితులతో కలసి ఈ నెల 2న కారులో బయలుదేరాడు. ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ విధి వక్రించింది. అతను ఉన్నత విద్య సర్టిఫికెట్ తీసుకొని స్వదేశానికి రాక ముందే అక్కడే పరలోకానికి వెళ్లాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 19న మృతదేహం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు ఉన్నత చదువులకు అమెరికా వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మా కుమారుడి మృతదేహాన్ని మాకు అప్పగిస్తే సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరుపుకుంటామని జిల్లా మంత్రి జి.జగదీశ్‌రెడ్డిని వేడుకున్నాం. మా విన్నపాన్ని సావధానంగా విన్న ఆయన సీఎం పేషీలోని పెలైట్ అధికారులను మృతదేహం అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వారు ఈ నెల 19 వరకు మా కుమారుడి మృతదేహాన్ని అప్పగిస్తామని హామీ ఇచ్చారు. కొండంత ఆశతో నా కుమారుడు ఉన్నత చదువులు చదివి అందరికంటే గొప్పగా జీవిస్తాడని, మాకు వృద్ధాప్యంలో అండగా ఉంటాడని ఆశపడ్డాను. అందుకోసం నాకు ఉన్న 7 ఎకరాల భూమిని సైతం అమ్ముకున్నాను. కానీ మమ్మల్ని శాశ్వతంగా వదిలి వెళ్తాడని అనుకోలేదు. నేను కన్న కలలు అన్నీ కల్లలయ్యాయి. - పులిమామిడి నర్సింహారెడ్డి, అభిషేక్ తండ్రి -
యూఎస్‌లో తెలుగు విద్యార్థి దుర్మరణం
-
యూఎస్‌లో తెలుగు విద్యార్థి దుర్మరణం
నల్లగొండ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన అభిషేక్ రెడ్డి (27) దుర్మరణం చెందాడు. శుక్రవారం రాత్రి కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అభిషేక్ రెడ్డి మరణించాడని ఆతడి కుటుంబ సభ్యులు శనివారం వెల్లడించారు. తమ కుమారుడు అభిషేక్‌రెడ్డి (27) అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎమ్మెస్సీ చేస్తున్నాడని అతడి తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, పద్మజా శనివారం తెలిపారు. అభిషేక్ తన సోదరి ప్రియాంకతో కలసి కాలిఫోర్నియాలో నివసిస్తున్నాడని చెప్పారు. మరో 10 రోజుల్లో అతడి చదువు పూర్తి కానుందని... సెప్టెంబర్‌లో ఉద్యోగంలో చేరవలసి ఉందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇంతలో ఈ ఘోరం జరిగిందని వారు కన్నీరుమున్నీరయ్యారు. నర్సింహరెడ్డి, పద్మజా దంపతుల స్వగ్రామం నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామం. అయితే వారు వ్యాపార రీత్యా హైదరాబాద్‌లోని సాగర్రోడ్డులోని గాయత్రి చౌరస్తా సమీపంలో వారు నివసిస్తున్నారు.