
కేఎస్ భరత్(ఫైల్ ఫొటో)
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నీ సీజన్‌ను ఆంధ్ర జట్టు ఓటమితో ఆరంభించింది. మాజీ చాంపియన్ విదర్భ జట్టుతో సోమవారం ముగిసిన గ్రూప్ ‘బి’ తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 74 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
కాగా 318 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 86.4 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 79/1తో చివరి రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టు ఒకదశలో ఒక వికెట్ నష్టానికి 177 పరుగులతో పటిష్టంగా కనిపించింది. అయితే ఓపెనర్ అభిషేక్ రెడ్డి (78; 5 ఫోర్లు, 1 సిక్స్), షేక్ రషీద్ (74; 7 ఫోర్లు) 12 పరుగుల వ్యవధిలో అవుటవ్వడంతో ఆంధ్ర జట్టు పతనం మొదలైంది.
శశికాంత్ కాస్త పోరాడినా
వీరిద్దరు పెవిలియన్ చేరుకున్నాక వచ్చిన ఇతర బ్యాటర్లెవరూ క్రీజులో కుదురుకోలేకపోయారు. కెప్టెన్ రికీ భుయ్ (26; 1 ఫోర్, 1 సిక్స్), శశికాంత్ (25; 2 ఫోర్లు, 1 సిక్స్) కాస్త పోరాడినా... కేఎస్ భరత్ (2), అశ్విన్ హెబర్ (3) నిరాశపరిచారు. విజయ్ (0), లలిత్ మోహన్ (0), సత్యనారాయణ రాజు (0) డకౌట్ అయ్యారు.
చివరి వికెట్‌గా శశికాంత్ వెనుదిరిగాడు. విదర్భ జట్టు బౌలర్లు ఆదిత్య థాకరే (4/47), హర్ష్ దూబే (4/69), అక్షయ్ వాఖరే (2/71) ఆంధ్ర జట్టు పతనాన్ని శాసించారు. ఈ గెలుపుతో విదర్భ జట్టుకు ఆరు పాయింట్లు లభించాయి. ఈనెల 18 నుంచి జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ జట్టుతో ఆంధ్ర జట్టు ఆడుతుంది.
చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే!
Comments
Please login to add a commentAdd a comment