ks bharat
-
రికీ భుయ్, కేఎస్ భరత్ మెరుపులు.. గోవాపై ఆంధ్ర ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: కెప్టెన్ రికీ భుయ్ (38 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (38 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధశతకాలతో మెరిశారు. ఫలితంగా సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్ ‘ఈ’లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 8 వికెట్ల తేడాతో గోవాను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గోవా నిరీ్ణత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ప్రభుదేశాయ్ (51 బంతుల్లో 71 నాటౌట్; 9 ఫోర్లు) హాఫ్‌సెంచరీతో ఆకట్టుకోగా... అర్జున్ టెండూల్కర్ 9 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్, శశికాంత్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు 15.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. రికీ భుయ్, శ్రీకర్ భరత్ ధనాధన్ షాట్లతో కట్టిపడేశారు. అశ్విన్ హెబర్ (13), షేక్ రషీద్ (8) విఫలం కాగా... భరత్, భుయ్ మూడో వికెట్‌కు 98 పరుగులు జోడించారు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఆంధ్ర జట్టు 8 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం మహారాష్ట్రతో ఆంధ్ర ఆడుతుంది. -
VIDAR Vs AP: నిరాశపరిచిన కేఎస్ భరత్.. ఆంధ్ర జట్టు ఓటమి
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నీ సీజన్‌ను ఆంధ్ర జట్టు ఓటమితో ఆరంభించింది. మాజీ చాంపియన్ విదర్భ జట్టుతో సోమవారం ముగిసిన గ్రూప్ ‘బి’ తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 74 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.కాగా 318 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 86.4 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 79/1తో చివరి రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టు ఒకదశలో ఒక వికెట్ నష్టానికి 177 పరుగులతో పటిష్టంగా కనిపించింది. అయితే ఓపెనర్ అభిషేక్ రెడ్డి (78; 5 ఫోర్లు, 1 సిక్స్), షేక్ రషీద్ (74; 7 ఫోర్లు) 12 పరుగుల వ్యవధిలో అవుటవ్వడంతో ఆంధ్ర జట్టు పతనం మొదలైంది.శశికాంత్ కాస్త పోరాడినావీరిద్దరు పెవిలియన్ చేరుకున్నాక వచ్చిన ఇతర బ్యాటర్లెవరూ క్రీజులో కుదురుకోలేకపోయారు. కెప్టెన్ రికీ భుయ్ (26; 1 ఫోర్, 1 సిక్స్), శశికాంత్ (25; 2 ఫోర్లు, 1 సిక్స్) కాస్త పోరాడినా... కేఎస్ భరత్ (2), అశ్విన్ హెబర్ (3) నిరాశపరిచారు. విజయ్ (0), లలిత్ మోహన్ (0), సత్యనారాయణ రాజు (0) డకౌట్ అయ్యారు.చివరి వికెట్‌గా శశికాంత్ వెనుదిరిగాడు. విదర్భ జట్టు బౌలర్లు ఆదిత్య థాకరే (4/47), హర్ష్ దూబే (4/69), అక్షయ్ వాఖరే (2/71) ఆంధ్ర జట్టు పతనాన్ని శాసించారు. ఈ గెలుపుతో విదర్భ జట్టుకు ఆరు పాయింట్లు లభించాయి. ఈనెల 18 నుంచి జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ జట్టుతో ఆంధ్ర జట్టు ఆడుతుంది.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే! -
పంత్ వారసుడు దొరికేశాడు.. అరంగేట్రంలోనే అదుర్స్!?
ప్రస్తుతం తరంలో భారత టెస్టు వికెట్ కీపర్ బ్యాటర్లంటే మనకు టక్కున గుర్తు వచ్చేది డాషింగ్ ఆటగాడు రిషబ్ పంత్‌నే. ఒంటి చేత్తో భారత్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. ప్రత్యర్ధి బౌలర్ ఎంత మొనగాడైనా ఊచకోత కోయడమే అతడి నైజం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపై మూడు చెరువుల నీరు తాగించిన ఘనత ఈ ఢిల్లీ చిచ్చర పిడుగుది. కానీ ఇదంతా 2022 ఏడాదికి ముందు. ఆ తర్వాత కథ వేరు. 2022 ఏడాదిలో రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత పంత్ మెరుపులను టీమిండియా మిస్స్ అయ్యింది. ఎంతమంది వికెట్ల కీపర్లను మార్చినా అతడి లోటును ఎవరూ తీర్చలేకపోయారు. పంత్ రీ ఎంట్రీ వెయ్యికళ్లుతో ఎదురుచూస్తున్న తరుణంలో అతడినే మైమరిపించేలా ఒక యువ సంచలనం ఎంట్రీ ఇచ్చాడు. అతడే ఉత్తర్ ప్రదేశ్ యువ వికెట్ కీపర్ బ్యాటర్ దృవ్ జురల్ అరంగేట్రంలోనే అదుర్స్.. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లో 23 ఏళ్ల దృవ్ జురల్ అడుగుపెట్టాడు. తన కంటే సీనియర్ అయిన శ్రీకర్ భరత్‌ను కాదని జురల్‌కు మేనెజ్మెంట్ అవకాశమిచ్చింది. మేనెజ్మెంట్ నమ్మకాన్ని దృవ్ వమ్ముచేయలేదు. తన అరంగేట్ర మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో అకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో 46 పరుగులు చేసిన ఈ యూపీ ఆటగాడు. వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో అందరిని మంత్రముగ్ధులను చేశాడు. ముఖ్యంగా సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ సెంచరీ హీరో బెన్ డకెట్‌ను దృవ్ రనౌట్ చేసిన విధానం కోసం ఎంత చెప్పుకున్న తక్కువే. అదే విధంగా కుల్దీప్, అశ్విన్, జడ్డూ వంటి వరల్డ్‌క్లాస్ స్పిన్నర్ల బౌలింగ్‌ను వికెట్ల వెనుక అతడు ఎదుర్కొన్న విధానం అద్బుతం. ఈ క్రమంలో రిషబ్ పంత్ వారసుడు దొరికేశాని అభిమానులు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు. పంత్ ప్రస్తుతం శరవేగంతో కోలుకుంటున్నప్పటికీ భారత జట్టులోకి రీ ఎంట్రీకి మరి కొంత సమయం పడుతుంది. ఒక వేళ వచ్చినా గానీ వికెట్ కీపింగ్ చేయగలడన్నది అనుమానమే. భరత్ కథ ముగిసినట్లేనా..? శ్రీకర్ భరత్.. రిషబ్ పంత్ వారసుడిగా భారత టెస్టుక్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఎన్నో అంచనాలతో జట్టులోకి వచ్చిన ఇప్పటివరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. వరుసగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఈ ఆంధ్ర ఆటగాడు విఫలమయ్యాడు. ఇప్పటివరకు తన కెరీర్లో 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భరత్‌కు 12 సార్లు బ్యాటింగ్ చేసే ఛాన్స్ లభించింది. అతడి ఇన్నింగ్స్‌లో 20 సగటుతో మొత్తంగా 221 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ఈ క్రమంలో జురల్ తన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టడంతో భరత్‌కు ఇకపై జట్టులో చోటు కష్టమేనని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
Ind vs Eng 3rd Test: భరత్‌నే ఆడించండి.. అతడు వద్దు!
India vs England, 3rd Test: ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో శ్రీకర్ భరత్‌నే టీమిండియా వికెట్ కీపర్‌గా కొనసాగించాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. బ్యాటింగ్ విషయాన్ని పక్కనపెడితే.. కీపర్‌గా భరత్ రాణిస్తున్న విషయాన్ని మర్చిపోవద్దని గుర్తుచేశాడు. పిచ్‌లు కఠినంగా ఉన్న కారణంగానే కేఎల్ రాహుల్‌ను వికెట్ కీపర్‌గా కాకుండా బ్యాటర్‌గా ఆడిస్తున్నారన్న ఆకాశ్ చోప్రా.. కాబట్టి భరత్ బ్యాటింగ్ వైఫల్యాన్ని భూతద్దంతో చూడద్దని విజ్ఞప్తి చేశాడు. కాగా సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ కిషన్ మధ్యలోనే నిష్క్రమించడంతో మరోసారి ఆంధ్ర క్రికెటర్ టీమిండియాలో భాగమయ్యాడు. ప్రొటిస్‌తో టెస్టుల తర్వాత ఇంగ్లండ్‌తో స్వదేశంలో ఆడుతున్న సిరీస్‌లోనూ కీపర్‌గా భరత్‌కు అవకాశం వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో అతడు 69 పరుగులు చేశాడు. అయితే, సొంతమైదానం విశాఖపట్నంలో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం భరత్ పూర్తిగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 23 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో ధ్రువ్ జురెల్ అరంగేట్రానికి మేనేజ్మెంట్ సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. భరత్ స్థానంలో వికెట్ కీపర్‌గా అతడికి ఛాన్స్ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాత్రం భరత్‌నే కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ‘‘ధ్రువ్ జురెల్ అరంగేట్రం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నా అభిప్రాయం ప్రకారం.. భరత్‌నే కొనసాగించడం మంచిది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది రెండే టెస్టులు. అతడు వికెట్ కీపింగ్ బాగానే చేస్తున్నాడు. కానీ అందరూ అతడి బ్యాటింగ్ వైఫల్యాన్నే ఎత్తి చూపుతున్నారు. పిచ్‌లు కఠినంగా ఉంటాయనే కారణంగానే రాహుల్‌ను ప్యూర్ బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దించారు కదా. మరి భరత్‌ను స్పెషలిస్టు కీపర్‌గానే చూడాలి కదా. హైదరాబాద్ టెస్టులో అతడు బ్యాటింగ్ కూడా బాగానే చేశాడు. అయినా కూడా.. బ్యాటర్‌గానే అతడి సేవలు కావాలనుకుంటే.. కనీసం మరొక్క మ్యాచ్‌లోనైనా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడే తొందరపడకూడదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కాగా ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: వదినమ్మ అంటూనే వెకిలి కామెంట్.. పో.. ఇక్కడి నుంచి! -
Adudam Andhra: మహత్తర క్రీడా యజ్ఞం.. తొలి అడుగు విజయవంతం
గ్రామస్థాయి నుంచి యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతూనే.. ఆరోగ్య విషయంలో ఆటలు ఎంత కీలకమో వివరిస్తూ.. ఆటలను జీవన శైలిలో భాగంగా మారుస్తూ.. గ్రామ, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మట్టిలో మాణిక్యాలను వెలికితీయడం... ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడం.. అంతటికే పరిమితంగాక.. వారిని జాతీయ, అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు జగనన్న ప్రభుత్వం చేపట్టిన బృహత్తర క్రీడా యజ్ఞం.. ‘‘ఆడుదాం ఆంధ్రా’’. ఈ మహా క్రీడా సంబరంలో భాగంగా గ్రామ,వార్డు సచివాలయ స్థాయిలో మొత్తం 3.30 లక్షలు, మండలస్థాయిలో 1.24 లక్షలు, నియోజకవర్గస్థాయిలో 7,346, జిల్లాస్థాయిలో 1,731, రాష్ట్రస్థాయిలో 260 మ్యాచ్‌లు నిర్వహించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. క్రీడాకారులకు దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లు అందించడమే గాకుండా.. రూ.12.21 కోట్ల మేర నగదు బహుమతులు.. మరెన్నో ఆకర్షణీయమైన బహుమతులను అందించేందుకు ప్రణాళికలు రచించింది. టాలెంట్ హంట్ రాష్ట్రస్థాయికే పరిమితం కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు రాణించేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తో పాటు వివిధ క్రీడా విభాగాలకు సంబంధించిన అసోసియేషన్లు, ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్ వాలీబాల్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వంటి ఫ్రాంచైజీలను టాలెంట్ హంట్‌కు ఆహ్వానించింది. తద్వారా ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసి, వారికి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చి, జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేలా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. మొదటి ప్రయత్నంలోనే విజయవంతం ఇలా ఆడుదాం ఆంధ్రా ద్వారా.. వ్యాయామ ఆవశ్యకత, ఆరోగ్యపరంగా అది ఎంత కీలకమో గ్రామస్థాయి నుంచి చైతన్యం కల్పిస్తూ. మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువ క్రీడాకారుల ప్రతిభకు సానపట్టి, క్రీడా ఆణిముత్యాలను దేశానికి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న జగనన్న ప్రభుత్వం.. మొదటి ప్రయత్నంలోనే విజయవంతమైందని చెప్పవచ్చు. నిదర్శనం ఇదే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25,40,972 మంది క్రీడాకారులు ఈ క్రీడా యజ్ఞంలో భాగం కావడమే ఇందుకు నిదర్శనం. ఈ పోటీలను 80 లక్షల మంది వీక్షించడం ఆడుదాం ఆంధ్రాకు దక్కిన ఆదరణకు తార్కాణం. మేటి ఆటగాళ్లు తాము సైతం అంటూ రాష్ట్రం నుంచి టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెటర్ కోన శ్రీకర్ భరత్, టెన్నిస్ స్టార్ సాకేత్ మైనేని, బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయిరాజ్, ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు వంటి మేటి ప్లేయర్లు కూడా ఈ కార్యక్రమం ప్రాధాన్యతను వివరించడంలో భాగం కావడం విశేషం. ఇక మొత్తంగా 17,59,263 మంది పురుష, 7,81,709 మంది మహిళా ప్లేయర్లు ఈ క్రీడా సంబరంలో పాలుపంచుకున్నారు. కాగా ఆడుదాం ఆంధ్రా మొదటి సీజన్ విజయవంతంగా పూర్తవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఈ మెగా టోర్నీని నిర్వహించాలని నిర్ణయించింది. మట్టిలో మాణిక్యాలను వెలికితీసే ఈ బృహత్తర కార్యక్రమం కొనసాగేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది కూడా! 50 రోజుల పండుగ.. విశాఖలో ముగింపు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 రోజుల పాటు నిర్వహించిన ఈ ఆటల పండుగ తుది అంకానికి చేరుకుంది. విశాఖపట్నంలో ఈ మెగా టోర్నీ ముగింపు వేడుకలు మంగళవారం జరుగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పీఎం పాలెంలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియానికి వెళ్లి క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌ను ఆయన వీక్షిస్తారు. ఆ తర్వాత క్రీడాకారులు, క్రీడల ఆవశ్యకతను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. ఇలా ఈ క్రీడా సంబరంలోని తొలి ఎడిషన్ పూర్తికానుంది. చదవండి: ఆడుదాం ఆంధ్రా విజేతలు వీరే -
ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. భరత్‌పై వేటు! సర్ఫరాజ్, దృవ్ అరంగేట్రం?
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు పర్యాటక జట్టుతో మరో కీలక పోరుకు సిద్దమైంది. ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్టులో ఇంగ్లండ్‌తో అమీతుమీ తెల్చుకోనుంది. ఈమ్యాచ్‌లో గెలిచి సిరీస ఆధిక్యాన్ని పెంచుకోవాలని రోహిత్ సేన భావిస్తుంటే.. మరోవైపు ఇంగ్లండ్ సైతం తమ ఆస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఇప్పటికే భారత జట్టు రాజ్‌కోట్‌కు చేరుకోగా.. దుబాయ్‌లో ఉన్న ఇంగ్లీష్ జట్టు మంగళవారం రాజ్‌కోట్‌కు రానుంది. అయితే చివరి మూడు టెస్టులకు తాజాగా భారత జట్టును ప్రకటించిన సెలక్టర్లు కొన్ని అనూహ్య మార్పులు చేశారు. శ్రేయస్ అయ్యర్, అవేష్ ఖాన్‌ను జట్టు నుంచి తప్పించిన సెలక్టర్లు.. ఆకాష్ దీప్‌ను తొలిసారి టెస్టు జట్టుకు ఎంపిక చేశారు. అదే విధంగా రెండో టెస్టుకు గాయం కారణంగా దూరమైన స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే వారిద్దరూ మూడో టెస్టుకు అందుబాటులో ఉండేది అనుమానమే. ఈ తుది జట్టు సెలక్షన్‌కు ముందు వారిద్దరూ తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. మరోవైపు రెండో టెస్టుకు భారత జట్టులో కలిసిన సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్‌లను ఆఖరి మ్యాచ్‌ల దృవ్, సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం ఇక రాజ్‌కోట్ టెస్టుతో వికెట్ కీపర్ బ్యాటర్ దృవ్ జురల్, సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. వరుసగా విఫలమవుతున్న ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్‌పై వేటు వేసి, దృవ్ జురల్‌ను జట్టులోకి తీసుకోవాలని మేన్‌జ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. తొలి రెండు టెస్టుల్లో భరత్ నిరాశపరిచాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో భరత్.. 41, 28, 17, 6 చేసిన స్కోర్లు ఇవి. ఇప్పటివరకు తన కెరీర్లో 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భరత్‌కు 12 సార్లు బ్యాటింగ్ చేసే ఛాన్స్ లభించింది. అతడి ఇన్నింగ్స్‌లో 20 సగటుతో మొత్తంగా 221 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. మరోవైపు వైజాగ్ టెస్టుతో అరంగేట్రం చేసిన రజిత్ పాటిదార్‌ను కూడా పక్కన పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో అరంగేట్రం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కు తుది జట్టులో చోటు దక్కనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదేవిధంగా రెండో టెస్టుకు దూరమైన పేసర్ సిరాజ్ కూడా తుది జట్టులోకి రానున్నాడు. ఈ క్రమంలో ముఖేష్ కుమార్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ -
భరత్‌కే పెద్దపీట.. అంతేగానీ అతడిని ఇప్పట్లో ఆడించరు!
టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పునరాగమనంపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో వికెట్ కీపర్‌గా ప్రస్తుతం కేఎస్ భరత్‌కే మేనేజ్మెంట్ పెద్దపీట వేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఒకవేళ ఏదేని కారణాల చేత భరత్ జట్టుకు దూరమైతే.. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ లేదంటే జగదీశన్ వంటి వాళ్లకు ఛాన్స్ ఇస్తారని అభిప్రాయపడ్డాడు. అంతేగానీ.. ఇషాన్ కిషన్‌కు మాత్రం రీఎంట్రీ అంత సులువుకాదని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. బ్రేక్ తీసుకున్న ఇషాన్ కాగా మానసికంగా అలసిపోయానంటూ సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ కిషన్ మధ్యలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబంతో సమయం గడుపుతూనే.. వర్కౌట్లతో బిజీ అయ్యాడు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్తో ఇషాన్ కిషన్‌కు విభేదాలు తలెత్తాయన్న వార్తల నడుమ.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే ఇషాన్ తిరిగి జట్టులోకి వస్తాడని పేర్కొన్నాడు. అయితే, రంజీ ట్రోఫీ-2024 రూపంలో అవకాశం ఉన్నా.. ఇషాన్ మాత్రం దానిని పక్కనపెట్టాడు. భరత్‌కు అవకాశం జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్వాగతం పలికినా జట్టుతో చేరలేదు. ఇదిలా ఉంటే.. ఇషాన్ తిరిగి వచ్చిన తర్వాత సౌతాఫ్రికాతో టెస్టుల్లో అతడి స్థానాన్ని భర్తీ చేసిన ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టుల్లోనూ ఆడుతున్నాడు. అయితే, వికెట్ కీపింగ్ పరంగా అతడికి మంచి మార్కులే పడుతున్నా.. బ్యాటర్‌గా ఆకట్టుకోలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇషాన్ కిషన్ మేనేజ్మెంట్ను అడిగి మరీ విరామం తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు. తన బ్రేక్‌ను పొడిగిస్తూనే ఉన్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ కనిపించడం లేదు. మానసికంగా అలసిపోయానంటూ అతడు సెలవు తీసుకున్నాడు. తను బాగుండాలని కోరుకుంటున్నా. అయితే, ఇప్పట్లో అతడు నేరుగా టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు. కేఎస్ భరత్ వికెట్ కీపర్‌గా జట్టులో ఉన్నాడు. అతడి గైర్హాజరీలో ధ్రువ్ జురెల్ లేదంటే.. జగదీశన్ కూడా జట్టులోకి వస్తారేమో కూడా తెలియదు. కానీ.. ఇషాన్ కిషన్‌కు మాత్రం పిలుపునివ్వరు. అతడు దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే మళ్లీ జాతీయ జట్టుకు సెలక్ట్ చేస్తారు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఆ విషయంలో కోహ్లితో పోల్చవద్దు ఈ సందర్భంగా.. ‘‘విరాట్ కోహ్లి కూడా కాంపిటేటివ్ క్రికెట్ ఆడటం లేదు కదా అంటూ ప్రశ్నలు వేయద్దు. ఎందుకంటే.. కోహ్లి, ఇషాన్‌ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి.. దయచేసి ఇద్దరినీ పోల్చే ప్రయత్నం చేయొద్దు’’ అంటూ ట్రోల్ చేసే వాళ్లకు చురకలు అంటించాడు ఆకాశ్ చోప్రా. చదవండి: Virat Kohli: అంతా అబద్ధం.. కోహ్లి విషయంలో మాట మార్చిన డివిలియర్స్ -
IND vs ENG: భరత్‌కు బైబై?.. యువ వికెట్ కీపర్ అరంగేట్రం పక్కా!?
వికెట్ కీపింగ్.. టెస్టు క్రికెట్లో టీమిండియాను వేదుస్తున్న ప్రధాన సమస్యలలో ఒకటి. రిషబ్ పంత్ కారు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైనప్పటి నుంచి టీమిండియాలో తన లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. లోయర్డర్లో వచ్చి మెరుపులు మెరిపించే పంత్ స్ధానాన్ని ఇప్పటివరకు ఎవరూ భర్తీ చేయలేకపోయారు. భరత్ అట్టర్ ప్లాప్ రిషబ్ పంత్ స్ధానంలో జట్టులోకి వచ్చిన ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్.. వరుసగా విఫలమవుతున్నాడు. వికెట్ కీపింగ్ పరంగా కాస్త పర్వాలేదనప్పిస్తున్నప్పటికీ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవతున్నాడు. కీలక సమయాల్లో బ్యాటింగ్‌కు వస్తున్న భరత్ ఒత్తడిని తట్టుకోలేక త్వరగా పెవిలియన్‌కు చేరుతున్నాడు. ఇటీవలే తన హోం గ్రౌండ్లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులోనూ అదే ఆటతీరును భరత్ కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 23 పరుగులు మాత్రమే చేశాడు. కాగా ఇప్పటివరకు తన కెరీర్లో 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భరత్‌కు 12 సార్లు బ్యాటింగ్ చేసే ఛాన్స్ లభించింది. అతడి ఇన్నింగ్స్‌లో 20 సగటుతో మొత్తంగా 221 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దృవ్ జురల్ అరంగేట్రం!? అతడి స్ధానంలో యవ వికెట్ కీపర్ దృవ్ జురల్‌కు అవకాశమివ్వాలని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నాడు. జురల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లోయార్డర్‌లో వచ్చి బ్యాటింగ్ చేసే సత్తా దృవ్కు ఉంది. జురల్ 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 790 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఇక ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ -
ఎంత పనిచేశావు భరత్.. ఈజీ స్టంపౌట్ మిస్! రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్
విశాఖపట్నం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 396 పరుగులు చేయగా.. అనంతరం ఇంగ్లండ్ కూడా దీటుగా బదులిస్తోంది. 25 ఓవర్లకు ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో ఓలీ పోప్(21), బెయిర్ స్టో(0) పరుగులతో ఉన్నారు. అయితే ఇంగ్లండ్ స్టారర్ బ్యాటర్ ఓలీ పోప్ తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియా వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ స్టంపౌట్ ఛాన్స్‌ను మిస్ చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 11 ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ రెండో బంతికి డకెట్‌ను ఔట్ చేశాడు. అనంతరం పోప్ క్రీజులోకి వచ్చాడు. అయితే తన ఎదుర్కొన్న తొలి బంతినే అద్బుతమైన డెలవరీగా కుల్దీప్ సంధించాడు. ఆ బంతిని అంచనా వేయడంలో పోప్ విఫలమయ్యాడు. బంతి పోప్ బ్యాట్‌ను మిస్ అయ్యి వికెట్ కీపర్ చేతికి వేళ్లింది. వికెట్ కీపర్ భరత్ సైతం బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఒకవేళ బంతిని అందుకుని బెయిల్స్‌ను పడగొట్టి ఉంటే పోప్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చెరేవాడు. రిప్లేలో క్లియర్‌గా పోప్ క్రీజుకు బయట ఉన్నట్లు కన్పించింది. వెంటనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత పనిచేశావు భరత్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. కాగా తొలి టెస్టులో కూడా పోప్‌కు అవకాశాలు ఇవ్వడంతో భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. ఇప్పుడు మరోసారి ఛాన్స్ రావడంతో అందుకు టీమిండియా ఎంత మూల్యం చెల్లించుకుంటుందో వేచి చూడాలి. Early reprieve for Ollie Pope as KS Bharat missed a stumping chance! 👀#CricketTwitter #INDvENG #India #England #KSBharat pic.twitter.com/Z7dYmLHXTv — CRICKETNMORE (@cricketnmore) February 3, 2024 -
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. శ్రీకర్ భరత్‌ను సన్మానించనున్న ఏసీఏ
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, ఆంధ్ర కెప్టెన్‌గా రాణించిన శ్రీకర్ భరత్.. తన హోం గ్రౌండ్లో తొలి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో సత్తాచాటాలని భరత్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ క్రమంలో సొంత గడ్డపై తొలి మ్యాచ్ ఆడుతున్న భరత్‌ను ఘనంగా సన్మానించాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించుకుంది. "వైజాగ్ నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన శ్రీకర్ భరత్‌ను ఘనంగా సన్మానించనున్నాం. ఈ కార్యక్రమం గురువారం స్టేడియంలో నిర్వహించనున్నాం. ఇది అతడి విజయానికి దగ్గిన గౌరవం" అని న్యూస్ 18తో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. బాల్ బాయ్ నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా.. కేఎస్ భరత్ క్రికెట్ జర్నీ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంతోనే ప్రారంభమైంది. 2005లో బాల్ బాయ్‌గా ఎక్కడైతే పనిచేశాడో.. అదే స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. తద్వారా సొంతగడ్డపై టెస్టులో ఆడనున్న రెండో ఆంధ్ర ఆటగాడిగా భరత్ నిలవనున్నాడు. ఈ జాబితాలో భరత్ కంటే ముందు ఆంధ్ర దిగ్గజ ప్లేయర్ సీకే నాయుడు మొదటి ఆటగాడిగా ఉన్నారు. ఎమ్ఎస్కె ప్రసాద్, హనుమ విహారి భారత్ తరపున టెస్టుల్లో ఆడినప్పటికీ.. సొంతగడ్డపై ఆడే ఛాన్స్ రాలేదు. -
ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు సూపర్ సెంచరీ.. తుది జట్టులో చోటు ఖాయమేనా?
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఓ ప్రాక్టీస్ మ్యాచ్, మూడు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల కోసం ఇంగ్లండ్ లయన్స్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్‌లో శ్రీకర్ భరత్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆజేయ శతకం సాధించాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన భరత్.. 165 బంతుల్లో 15 ఫోర్లతో 116 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్‌ను 553/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం భారత్-ఏ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రజిత్ పాటిదార్(151) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో భారత్-ఎ జట్టు పుంజుకుంది. డ్రాగా ముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇండియా-ఎ జట్టు 5 వికెట్ల నష్టానికి 426 పరుగులు చేసింది. భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో భరత్‌తో పాటు సాయిసుదర్శన్(97), మనవ్ సుతార్(89) సత్తాచాటారు. తుది జట్టులో చోటు ఖాయమేనా? ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఇదివరకే ప్రకటించిన తొలి రెండు టెస్టుల సిరీస్‌లో స్పెషలిస్టు వికెట్ కీపర్ కోటాలో భరత్ చోటు దక్కించుకున్నాడు. అతడితో పాటు యువ వికెట్ కీపర్ దృవ్ జురల్‌కు కూడా జట్టులో ఛాన్స్ లభించింది. అయితే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు వికెట్ కీపర్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్.. ఈ సిరీస్‌లో కేవలం స్పెషలిస్టు బ్యాటర్‌గానే ఆడనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అనాధికారిక టెస్టులో సెంచరీతో చెలరేగిన భరత్‌కు వికెట్ కీపర్‌గా తుది జట్టులో చోటు దక్కడం ఖాయమని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. -
INDA Vs ENGA: శతక్కొట్టిన పాటిదార్.. పాపం సర్ఫరాజ్!
India A vs England Lions, 2-day Practice Match: ఇంగ్లండ్ లయన్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓపెనర్ రజత్ పాటిదార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. లయన్స్ బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ శతక్కొట్టాడు. మొత్తంగా 141 బంతులు ఎదుర్కొన్న ఈ మధ్యప్రదేశ్ బ్యాటర్... 18 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 111 పరుగులు సాధించాడు. సర్ఫరాజ్ సెంచరీ మిస్ పాటిదార్‌కు తోడు సర్ఫరాజ్ ఖాన్ కూడా రాణించాడు. అయితే, సెంచరీకి చేరువయ్యే క్రమంలో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి 96 పరుగుల వద్దే నిలిచిపోయాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు భారత్-ఏ, ఇంగ్లండ్-ఏ(లయన్స్) జట్లు అనధికారిక టెస్టు ఆడనున్నాయి. 223 ఇంగ్లండ్ ఆలౌట్ ఇందులో భాగంగా అహ్మదబాద్ వేదికగా రెండు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాయి. శుక్రవారం మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో... భారత బౌలర్లు మెరుగ్గా రాణించి 233 పరుగులకే ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేశారు. మానవ్ సుతార్ మూడు, ఆకాశ్ దీప్ రెండు- తుషార్ దేశ్‌పాండే, విద్వత్ కావేరప్ప, పులకిత్ నారంగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 32 పరుగులు చేయగా.. రజత్ సెంచరీ(111) సాధించాడు. భరత్, ధ్రువ్ ఫిఫ్టీలు మిగిలిన వాళ్లలో సర్ఫరాజ్ ఖాన్ (96), శ్రీకర్ భరత్(64), ధ్రువ్ జురెల్ (50) అర్ధ శతకాలతో దుమ్ములేపారు. దీంతో శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి 91ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి భారత్-ఏ జట్టు 462 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసిపోయింది. ఇక భారత్-ఏ- ఇంగ్లండ్-ఏ జట్ల మధ్య జనవరి 17 నుంచి నాలుగు రోజుల అనధికారిక టెస్టు ఆరంభం కానుంది. సర్ఫరాజ్‌ను ఇకనైనా టీమిండియాలోకి? మరోవైపు.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 5 నుంచి ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. ఇక ఇప్పటికే ఇందుకు సంబంధించి రెండు మ్యాచ్‌ల కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే, మిగిలిన మ్యాచ్‌లకు జట్టును ఎంపిక చేసేటపుడైనా సర్ఫరాజ్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశవాళీ, భారత్- ఏ జట్ల తరఫున ఇంత మంచి ప్రదర్శనలు ఇస్తున్నా అతడిని పక్కనపెట్టడం సరికాదని సెలక్టర్లకు హితవు పలుకుతున్నారు. చదవండి: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. బంగారు గొలుసు అమ్మిన తల్లి త్యాగం! టీమిండియాలో ఎంట్రీ.. -
రాహుల్‌కు కఠిన సవాలు.. ఏం చేస్తాడో చూడాలి! మరి భరత్?
Ind vs SA 2023 Test Series: కేఎల్ రాహుల్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో ఓపెనర్‌గా పాతుకుపోయిన ఈ కర్ణాటక ఆటగాడు గత కొన్నేళ్లుగా మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా.. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీ శుబ్‌మన్ గిల్ మూడు ఫార్మాట్లలో స్థానం సుస్థిరం చేసుకోవడంతో.. అవసరాన్ని బట్టి నాలుగు లేదంటే ఐదు స్థానాల్లో బరిలోకి దిగుతున్నాడు. అంతేకాదు.. గతానికి భిన్నంగా ఇటీవలి కాలంలో వన్డే, టీ20 ఫార్మాట్లలో టీమిండియాకు వికెట్ కీపింగ్ ఆప్షన్లలో మొదటి ప్రాధాన్యంగా మారాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో బ్యాటింగ్‌తో పాటు, అద్భుతమైన కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుని జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. పంత్ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అయితే, టెస్టుల్లో మాత్రం వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కు మెరుగైన రికార్డు లేదు. ముఖ్యంగా రిషభ్ పంత్ జట్టులో ఉంటే అతడికి జట్టులో అసలు స్థానమే కరువయ్యే పరిస్థితి. కానీ.. రోడ్డు ప్రమాదం కారణంగా పంత్ సుదీర్ఘకాలంగా ఆటకు దూరమైన నేపథ్యంలో వికెట్ కీపర్‌గా కాకపోయినా.. స్పెషలిస్టు బ్యాటర్‌గానైనా రాహుల్ జట్టులో చోటు సంపాదిస్తున్నాడు. ఆసీస్‌తో సిరీస్ నుంచి భరత్ వికెట్ కీపర్ పంత్ గైర్హాజరీలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(ఆసీస్ వర్సెస్ ఇండియా) నుంచి ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ టెస్టుల్లో టీమిండియా వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భరత్‌ను కాదని కేఎల్ రాహుల్‌కే కీపర్‌గా బాధ్యతలు అప్పజెప్పనున్నారు. ఈ విషయాన్ని టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ధ్రువీకరించాడు. ఇషాన్ ఇంకా నిరూపించుకోనే లేదు ఇషాన్ కిషన్ జట్టుతో లేడు కాబట్టి వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ మాత్రమే తమకు మిగిలి ఉన్న ఆప్షన్ అని పేర్కొన్నాడు. గత ఐదారు నెలలుగా రాహుల్ కీపింగ్ నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకున్నాడన్న ద్రవిడ్.. సౌతాఫ్రికాలో అతడికి గట్టి సవాలు ఎదురుకానుందని పేర్కొన్నాడు. రాహుల్ వైపే మొగ్గు చూపిన ద్రవిడ్ అయితే, ఇక్కడ పెద్దగా స్పిన్ బౌలింగ్‌కు ఆస్కారం లేదు కాబట్టి.. కేఎల్ రాహుల్ మెరుగ్గానే కీపింగ్ చేస్తాడని భావిస్తున్నట్లు ద్రవిడ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. రాహుల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడనే నమ్మకం ఉందని తెలిపాడు. తప్పుబట్టిన మాజీ వికెట్ కీపర్ ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. కేఎల్ రాహుల్‌ను టెస్టుల్లో కీపర్‌గా ఆడించడం సరికాదని పేర్కొన్నాడు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్) వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు. india’s test match wicketkeeper should be someone who is keeping regularly in ranji trophy or first class cricket….#imho #INDvSA #IndianCricket — parthiv patel (@parthiv9) December 24, 2023 భరత్‌కు పరోక్ష మద్దతు ‘‘రంజీ ట్రోఫీ లేదంటే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తరచుగా కీపింగ్ చేసే ఆటగాడినే టీమిండియా టెస్టు మ్యాచ్ వికెట్ కీపర్‌గా తీసుకోవాలి’’ అని పార్థివ్ పటేల్ పరోక్షంగా కేఎస్ భరత్‌కు మద్దతునిచ్చాడు. అయితే, కేఎల్ రాహుల్ అభిమానులకు మాత్రం పార్థివ్ ఆలోచన నచ్చడం లేదు. రాహుల్- భరత్ బ్యాటింగ్ గణాంకాలు పోలుస్తూ అతడిని ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. రాహుల్ ఏం చేస్తాడో? పేసర్ల బౌలింగ్‌లో అద్భుతంగా కీపింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్.. రవీంద్ర జడేజా లేదంటే రవిచంద్రన్ అశ్విన్ వంటి స్పిన్నర్ల బౌలింగ్ విషయంలో ఏ మేరకు ఆకట్టుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక పేస్, బౌన్సీ పిచ్‌లు ఉన్న సఫారీ గడ్డపై ఒక్కసారి కూడా టీమిండియా టెస్టు సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి ప్రయోగాలు ఎంతవరకు మేలు చేస్తాయో చూడాలి! ఇషాన్ స్థానంలో భరత్ సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన ఇషాన్ కిషన్.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో అతడి స్థానాన్ని కేఎస్ భరత్‌తో భర్తీ చేశారు టీమిండియా సెలక్టర్లు. సౌతాఫ్రికా-ఏ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత-ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న భరత్‌ను ప్రధాన జట్టుకు ఎంపిక చేశారు. చదవండి: Ind vs SA: షమీ ఉన్నా.. లేకపోయినా పెద్దగా తేడా ఉండదు: సౌతాఫ్రికా కెప్టెన్ -
ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం! ఆటకు దూరం.. కారణం?
Ishan Kishan- Mental Fatigue: టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మానసికంగా అలసిపోయానంటూ 25 ఏళ్ల ఈ లెఫ్టాండ్ బ్యాటర్ కొన్నాళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా 2021లో టీ20ల ద్వారా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ జార్ఖండ్ బ్యాటర్.. అదే ఏడాది వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్‌గా పలు అవకాశాలు దక్కించుకున్న ఇషాన్ ఖాతాలో ఇప్పటి వరకు ఓ సెంచరీ, ఓ డబుల్ సెంచరీ ఉంది. ఆరంభంలో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్నప్పటికీ సహచర ఆటగాడు, తన స్నేహితుడు శుబ్‌మన్ గిల్ నుంచి ఎదురైన పోటీలో ఇషాన్ వెనుకబడిపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్‌గా గిల్ తన స్థానం సుస్థిరం చేసుకోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు మాత్రం అవకాశాలు సన్నగిల్లాయి. గిల్ సూపర్‌స్టార్‌గా ఎదుగుతున్నాడు.. ఇషాన్ మాత్రం కేఎల్ రాహుల్ రూపంలో మరో వికెట్ కీపర్ అందుబాటులో ఉండటంతో అతడికి ప్రాధాన్యం తగ్గింది. ఈ క్రమంలో సీనియర్ల గైర్హాజరీలో మిడిలార్డర్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఇషాన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మరోవైపు.. గిల్ మూడు ఫార్మాట్లలో సూపర్‌స్టార్‌గా ఎదుగుతుండగా.. ఇషాన్‌కు ఇంత వరకు టెస్టుల్లో తనను తాను నిరూపించుకునే అవకాశం రాలేదు. యశస్వి జైశ్వాల్ నుంచి గట్టిపోటీ కూడా ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో గతేడాది కాలంగా జట్టుతో పాటే ప్రయాణిస్తున్నా.. తుదిజట్టులో పెద్దగా ఛాన్సులు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైనప్పటికీ ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా రెండు మ్యాచ్‌ల సిరీస్ నుంచి విరామం తీసుకున్నాడు. దీంతో అతడి స్థానంలో ఆంధ్ర క్రికెటర్, వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ టీమిండియాతో కలవనున్నాడు. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్‌కు సంబంధించిన కీలక వార్త తెరమీదకు వచ్చింది. మానసిక ఒత్తిడి తట్టుకోలేకనే అతడు స్వదేశానికి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ‘‘మానసికంగా అలసిపోయానని.. తనకు క్రికెట్ నుంచి కొన్నాళ్ల పాటు విరామం కావాలంటూ ఇషాన్ కిషన్ యాజమాన్యంతో చెప్పాడు. మేనేజ్మెంట్ కూడా ఇందుకు అంగీకరించింది’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. గతేడాది కాలంగా విరామం లేకుండా జట్టుతో ప్రయాణించిన ఇషాన్ ప్రస్తుతం విశ్రాంతి కోరుకుంటున్నట్లు తెలిపింది. వన్డేల్లో దుమ్ములేపినా.. ఇక ఈ ఏడాది ఇషాన్ కిషన్ రెండు టెస్టులు, 17 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. వెస్టిండీస్ పర్యటన సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఇషాన్ 52 పరగులు చేయగా.. 17 వన్డేల్లో కలిపి 456 పరుగులు సాధించాడు. టీ20లలో ఈ ఏడాది 207 రన్స్ తీశాడు. కాగా గతంలోనూ గ్లెన్ మాక్స్వెల్ వంటి చాలా మంది క్రికెటర్లు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఆటకు విరామిచ్చిన విషయం తెలిసిందే. ఇషాన్ కూడా అలాగే కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో తిరిగి రావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Sanju Samson: వాళ్ల గురించి ఫిర్యాదు చేయను.. అనేక ఒత్తిళ్ల నడుమ: సంజూ -
క్రికెట్ అంటే చిన్ననాటి నుంచే మక్కువ! ఆంధ్ర క్రికెటర్ల కోసం రాష్ట్రంలో..
పాఠశాల స్థాయి నుంచే జగన్‌కు క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువ.. ముఖ్యంగా క్రికెట్ అంటే మరీ ఇష్టం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నిహితులు చెప్పే మాట ఇది! హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించిన వైఎస్ జగన్.. క్రికెట్‌తో పాటు బాస్కెల్ బాల్ వంటి ఇతర క్రీడల్లోనూ భాగమయ్యే వారు. ఆ సమయంలో వైఎస్ కుటుంబం బంజారాహిల్స్‌లో నివాసం ఉండేవారు. కేవలం పాఠశాలలోనే కాకుండా.. ఇంటి దగ్గర కూడా స్నేహ బృందం ఏర్పాటు చేసుకున్న జగన్.. వారితో కలిసి క్రికెట్ ఆడుతూ ఉండేవారు. స్కూలైనా.. బయట అయినా ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో నాయకుడిగా ఉండేందుకే ఇష్టపడే జగన్.. హెచ్‌పీఎస్‌లో హౌజ్ కెప్టెన్‌గా అరుదైన ఘనత దక్కించుకున్నారు. పన్నెండవ తరగతిలో ఉన్నపుడు.. మిగితా మూడు హౌజ్‌ల జట్లను ఓడించి రెడ్ హౌజ్‌కు ఆల్‌రౌండర్ చాంపియన్‌షిప్ అందించారు జగన్. కేవలం ఆటలే కాకుండా వ్యాసరచన వంటి పోటీలలోనూ తమ టీమ్ ముందుండేలా చేసి తన నాయకత్వ పటిమతో టైటిల్ సాధించారు. ఈ విషయాలను యువకెరటం పుస్తకంలో ఎఎస్ఆర్ మూర్తి, బుర్రా విజయశేఖర్ వెల్లడించారు. ఏపీఎల్‌తో ఆంధ్ర క్రికెటర్లకు మరింత ప్రోత్సాహం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడా రంగంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న క్రికెట్లో ఆంధ్ర క్రీడాకారుల సంఖ్య పెరిగేలా చొరవ తీసుకుంటోంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. సీఎస్కే ముందుకు వచ్చేలా చర్యలు ఇందులో భాగంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు కావాల్సినంత ప్రోత్సాహం అందిస్తోంది. అంతేకాదు.. విశాఖపట్నంలో మరో అత్యాధునిక క్రికెట్ స్టేడియం నిర్మించే దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది. విశాఖలో ఉన్న వైఎస్సార్ స్టేడియంను క్రీడలకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉంది. అంతేకాదు రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చేలా చర్యలు చేపట్టింది. ఇక వైఎస్ జగన్ హయాంలోనే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పేరిట ఏసీఏ సరికొత్త క్రికెట్ టోర్నీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2022లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ టీ20 లీగ్‌లో రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్, వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ పేరిట ఆరు జట్లు బరిలోకి దిగాయి. విజయవంతంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండు సీజన్లు అరంగేట్ర ఎడిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఏసీఏ.. తాజాగా రెండో సీజన్‌ను కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేసింది. ఏపీఎల్ తొలి సీజన్లో కోస్టల్ రైడర్స్ విజేతగా నిలవగా.. ఈ ఏడాది రాయలసీమ కింగ్స్ టైటిల్ సాధించింది. కాగా దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ రాణించిన ఆటగాళ్లకే ఇటీవలి కాలంలో బీసీసీఐ సెలక్టర్లు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఔత్సాహిక ఆంధ్ర క్రికెటర్లు కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడేలా ఏసీఏ ఇలా ఏపీఎల్ పేరిట తమ వంతు ప్రయత్నం చేస్తోంది. క్రికెట్ దిగ్గజాలను ఆహ్వానిస్తూ 1983 వరల్డ్‌కప్ విజేత క్రిష్ణమాచారి శ్రీకాంత్ సహా టీమిండియా క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ తదితరులను ఈ ఈవెంట్లకు ఆహ్వానించడం ద్వారా జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక.. కొత్త ప్రభుత్వ హయాంలో ఏపీ క్రీడల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందంటూ బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా పనిచేసిన ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం విశేషం. ఏపీ సీఎం కప్, ఆడుదాం ఆంధ్రా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్ ప్రభుత్వం.. ఏపీ సీఎం కప్ పేరిట క్రికెట్‌తో పాటు క్రికెటేతర క్రీడల్ని కూడా ప్రోత్సహిస్తోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల క్రీడా ఆణిముత్యాలను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్రా పేరిట క్రీడా సంబరానికి శ్రీకారం చుట్టింది. అంబాసిడర్‌గా అంబటి రాయుడు ఈ ఈవెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్లో అరుదైన ఘనతలు సాధించిన అంబటి రాయుడిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి ఖ్యాతి తీసుకువచ్చిన పీవీ సింధు(బ్యాడ్మింటన్), జ్యోతి సురేఖ వెన్నం(ఆర్చరీ), కేఎస్ భరత్(క్రికెటర్) తదితరులను సమున్నతరీతిలో సత్కరించింది. -
ఐపీఎల్ 2024 వేలంలో అదృష్టం పరీక్షించుకోనున్న తెలుగు ఆటగాళ్లు వీరే..!
దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో రేపు (డిసెంబర్ 19) జరుగబోయే ఐపీఎల్ 2024 వేలంలో 11 మంది తెలుగు క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో హనుమ విహారి, కేఎస్ భరత్, పృథ్వీరాజ్ యర్రాలకు గతంలో ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. విహారి 24, కేఎస్ భరత్ 10, పృథ్వీరాజ్ యర్రా 2 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడారు. హనుమ విహారి (30) (కాకినాడ, బ్యాటింగ్ ఆల్‌రౌండర్, 24 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 284 పరుగులు) కేఎస్ భరత్ (30) (వైజాగ్, వికెట్‌కీపర్ బ్యాటర్, 10 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 199 పరుగులు, ఓ హాఫ్ సెంచరీ) పృథ్వీరాజ్ యర్రా (25) (గుంటూరు, లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్, 2 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో (కేకేఆర్) ఓ వికెట్) రోహిత్ రాయుడు (29) (గుంటూరు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్) అనికేత్ రెడ్డి (23) (నిజామాబాద్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్) రవి తేజ (29) (హైదరాబాద్, ఆల్‌రౌండర్) మనీశ్ రెడ్డి (24) (హైదరాబాద్, ఆల్‌రౌండర్) మురుగన్ అభిషేక్ (19) (హైదరాబాద్, స్పిన్ బౌలర్) ఎర్రవల్లి అవనీశ్ రావ్ (19) (హైదరాబాద్, బ్యాటర్) రక్షణ్ రెడ్డి (23) (హైదరాబాద్, మీడియ పేసర్) రాహుల్ బుద్ది (26) (హైదరాబాద్, బ్యాటర్, 2022లో ముంబై ఇండియన్స్ సభ్యుడు) ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023 సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం) ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ) డిజిటల్: జియో సినిమా మొత్తం స్లాట్లు: 77 వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333 భారతీయ ఆటగాళ్లు: 214 విదేశీ ఆటగాళ్లు: 119 -
SA Tour: ఉన్న పళంగా స్వదేశానికి బయల్దేరిన ఇషాన్ కిషన్
దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా యంగ్ వికెట్‌కీపింగ్ బ్యాటర్, పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ ఉన్న పలంగా స్వదేశానికి బయల్దేరాడు. వ్యక్తిగత కారణాల చేత ఇషాన్ ఇండియాకు బయల్దేరాడని బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత టెస్ట్ జట్టులో ఇషాన్ స్థానాన్ని కేఎస్ భరత్ భర్తీ చేస్తాడని బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుతం సౌతాఫ్రికాలోనే ఉన్న భరత్.. భారత టెస్ట్ జట్టుతో త్వరలోనే కలుస్తాడని పేర్కొంది. కాగా, సౌతాఫ్రికా పర్యటనలో టీ20, టెస్ట్ సిరీస్‌ల కోసం భారత సెలెక్టర్లు ఇషాన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. టీ20ల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కని ఇషాన్.. టెస్ట్ సిరీస్‌పై ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఉన్నట్లుండి అతను ఇంటి వెళ్లిపోవడంతో అనూహ్యంగా కేఎస్ భరత్‌కు సెలెక్టర్ల నుంచి పిలుపు అందింది. భరత్.. కేఎల్ రాహుల్ తర్వాత రెండో వికెట్‌కీపర్ ఛాయిస్‌గా టీమిండియాలో చేరతాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్టుల కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్ భరత్ (వికెట్‌కీపర్) భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26-30 మధ్యలో జరుగనుండగా.. రెండో టెస్ట్ కేప్‌టౌన్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 3-7 మధ్యలో జరుగుతుంది. -
టెస్టు మ్యాచ్‌లోనూ భారత జట్టును వదలని వర్షం! ఎట్టకేలకు..
South Africa A vs India A, 1st unofficial Test: భారత్ ‘ఎ’- దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరగాల్సిన తొలి అనధికారిక టెస్టుకూ వర్షం అడ్డుపడింది. ఎడతెరిపిలేని వాన కారణంగా సోమవారం నాటి తొలి రోజు ఆట రద్దయింది. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా ఇప్పటికే అక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే. సఫారీ గడ్డపై మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు భారత ప్రధాన జట్టు అక్కడ అడుగుపెట్టింది. ఈ క్రమంలో డిసెంబరు 10 నాటి తొలి టీ20 వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైపోయింది. ఇదిలా ఉంటే.. టీమిండియాతో పాటు భారత- ‘ఎ’ జట్టు కూడా సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లింది. ఇందులో భాగంగా.. ఆంధ్ర క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ సారథ్యంలో మూడు అనధికారిక టెస్టులు ఆడనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ టెస్టు మ్యాచ్‌లలో మొదటిది డిసెంబరు 11న బ్లూమ్ఫౌంటేన్ వేదికగా మొదలైంది. తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత-ఎ జట్టు కెప్టెన్ శ్రీకర్ భరత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో భారత్- సౌతాఫ్రికా జట్లు మైదానంలో దిగేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వరుణ దేవుడు స్వాగతం పలికాడు. ఈ క్రమంలో వర్షం ఎంతసేపటికీ తగ్గకపోవడంతో తొలి రోజు ఆటను రద్దు చేశారు. ఇక మంగళవారం నాటి రెండో రోజు ఆటకైనా వర్షం అడ్డుపడకుంటే బాగుండునని ఆటగాళ్లతో సహా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆశించినట్లుగానే వాన జాడ లేకపోవడంతో మధ్యాహ్నం 1.30 నిమిషాలకు రెండో రోజు ఆట మొదలైంది. మరోవైపు.. ఈరోజే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా పోర్ట్ ఎలిజబెత్ వేదికగా రెండో టీ20 ఆడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. సౌతాఫ్రికా-ఎ జట్టుతో భారత- ఎ జట్టు తొలి అనధికారిక టెస్టు.. తుది జట్లు ఇవే భారత్: సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ప్రదోష్ పాల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, శార్దూల్ ఠాకూర్, సౌరభ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, ప్రసిధ్ కృష్ణ, విద్వత్ కావేరప్ప. సౌతాఫ్రికా: కామెరాన్ షెక్లెటన్, యాసీన్ వల్లి, రూబిన్ హెర్మన్, జీన్ డుప్లెసిస్, బ్రైస్ పార్సన్స్ (కెప్టెన్), కానర్ ఎస్టెర్హుయిసెన్ (వికెట్ కీపర్), ఇవాన్ జోన్స్, ఎథాన్ బాష్, కర్ట్లిన్ మానికమ్, సియా ప్లాట్జీ, ఒడిరిల్ మోడిమోకోనే. -
IPL 2024 Auction: ఫ్రాంఛైజీల కళ్లన్నీ అతడిపైనే! హాట్‌కేకుల్లా ఆ ఇద్దరు!
IPL 2024 Auction: ఐపీఎల్–2024 సీజన్ కోసం ఆటగాళ్ల వేలానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 19న దుబాయ్‌లో వేలం కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 1166 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఫ్రాంచైజీలతో సంప్రదించాక ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 333 మందితో సోమవారం తుది జాబితాను ప్రకటించింది. ఇందులో 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఫ్రాంచైజీల కళ్లన్నీ అతడిపైనే ఇక వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాను విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్ హెడ్‌పై ఫ్రాంచైజీలన్నీ కన్నేశాయి. కమిన్స్, మిచెల్ స్టార్క్‌లు కూడా ఆసీస్ తరఫున హాట్ కేక్‌లు కానున్నారు. ప్రపంచకప్‌లో సెమీఫైనలిస్టుగా నిలిచిన న్యూజిలాండ్ తరఫున మెరిసిన రచిన్ రవీంద్రపై కూడా కోట్లు కురిసే అవకాశాలున్నాయి. 77 స్థానాలు.. కేకేఆర్‌కు అత్యధికంగా అదే విధంగా.. ఫ్రాంచైజీల విషయానికొస్తే మొత్తం 10 జట్లకు కావాల్సింది 77 మంది ఆటగాళ్లయితే ఇందులో 30 విదేశీ బెర్తులున్నాయి. ఇందుకోసం రూ. 262.95 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఖాళీల పరంగా చూస్తే అత్యధికంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ 12 మందిని కొనుక్కోవాల్సి ఉండగా... ఆ జట్టు చేతిలో రూ. 32.70 కోట్లు అందుబాటులో ఉన్నాయి. టైటాన్స్ వద్ద రూ.38.15 కోట్లు ఇక అత్యధిక మొత్తం రూ.38.15 కోట్లు గుజరాత్ వద్ద ఉంటే వారికి 8 మంది ఆటగాళ్లు కావాలి. కనిష్ట మొత్తం రూ. 13.15 కోట్లు లక్నో సూపర్ జెయింట్స్ ఖాతాలో ఉండగా... వారు ఆరు బెర్తుల్ని భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. బరిలో ఉన్న తెలుగు క్రికెటర్లు వీరే! మరోవైపు.. ధోని టీమ్ చెన్నై ఖాతాలో రూ. 31.40 కోట్లు, కోహ్లి జట్టు బెంగళూరు ఖాతాలో రూ. 23.25 కోట్లు అందుబాటులో ఉండగా ఇరుజట్లకు ఆరుగురు చొప్పున ఖాళీలున్నాయి. ఇక హైదరాబాద్ నుంచి అభిషేక్ మురుగన్, రాహుల్ బుద్ధి, రోహిత్ రాయుడు, అనికేత్ రెడ్డి, రవితేజ, తనయ్ త్యాగరాజన్, అరవెల్లి అవినాశ్రావు, రక్షణ్ రెడ్డి, మనీశ్ రెడ్డి... ఆంధ్ర నుంచి కోన శ్రీకర్ భరత్, రికీ భుయ్, హనుమ విహారి, పృథ్వీరాజ్ వేలంలో ఉన్నారు. జట్టు- ఖాళీల సంఖ్య - మిగిలిన మొత్తం ►చెన్నై- 6- రూ. 31.4 కోట్లు ►ఢిల్లీ- 9 - రూ. 28.95 కోట్లు ►గుజరాత్- 8- రూ. 38.15 కోట్లు ►కోల్‌కతా - 12- రూ. 32.7 కోట్లు ►లక్నో- 6 - రూ. 13.15 కోట్లు ►ముంబై - 8 - రూ. 17.75 కోట్లు ►పంజాబ్- 8- రూ. 29.1 కోట్లు ►బెంగళూరు- 6 - రూ. 23.25 కోట్లు ►రాజస్తాన్ - 8- రూ. 14.5 కోట్లు ►హైదరాబాద్- 6- రూ. 34 కోట్లు ►మొత్తం- 77- రూ. 262.95 కోట్లు -
దక్షిణాఫ్రికా పర్యటన.. భారత-ఏ జట్టు కెప్టెన్‌గా కేఎస్ భరత్
3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం భారత క్రికెట్ జట్టు డిసెంబర్ 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటన కోసం భారత సెలెక్టర్లు నిన్ననే (నవంబర్ 30) మూడు వేర్వేరు జట్లను ప్రకటించారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు సీనియర్లు రోహిత్, విరాట్ దూరంగా ఉండనుండగా.. చాలా మంది యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్, టెస్ట్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ పర్యటన టీ20 సిరీస్‌తో మొదలుకానుంది. కాగా, భారత సీనియర్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుండగానే భారత-ఏ జట్టు కూడా పర్యటనలో భాగం కానుంది. ఈ పర్యటనలో భారత-ఏ జట్టు సౌతాఫ్రికా ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. అలాగే సీనియర్ జట్టుతో ఓ ఇన్ట్రా స్క్వాడ్ మ్యాచ్ కూడా ఆడుతుంది. భారత ఏ జట్టుకు ఆంధ్ర వికెట్‌కీపర్ కేఎస్ భరత్ నాయకత్వం వహించనున్నాడు. సెంచూరియన్ వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత-ఏ జట్టు తొలి నాలుగు రోజుల మ్యాచ్ ఆడనుంది. అనంతరం భారత్ ఆడబోయే రెండో టెస్ట్‌కు ముందు రెండో మ్యాచ్ జరుగనుంది. తొలి మ్యాచ్ కోసం ఎంపిక చేసిన భారత ఏ జట్టులో దేశవాలీ స్టార్ బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, దేవ్‌దత్ పడిక్కల్,సాయి సుదర్శన్లకు చోటు లభించింది. రెండో మ్యాచ్ కోసం ఎంపిక చేసిన భారత ఏ జట్టులో జాతీయ జట్టు ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీలకు అవకాశం లభించింది. తొలి నాలుగు రోజుల మ్యాచ్ కోసం భారత ఏ జట్టు: సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, ప్రదోష్ రంజన్ పాల్, సర్ఫరాజ్ ఖాన్, కేఎస్ భరత్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్, శార్దూల్ ఠాకూర్, పుల్కిత్ నారంగ్, సౌరభ్ కుమార్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, విధ్వత్ కావరప్ప, తుషార్ దేశ్‌పాండే రెండో నాలుగు రోజుల మ్యాచ్‌కు భారత ఏ జట్టు: సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎస్ భరత్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, ఆకాష్ దీప్, విధ్వత్ కావరప్ప, నవదీప్ సైనీ మూడు రోజుల ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, ప్రదోష్ రంజన్ పాల్, కేఎస్ భరత్ , ధ్రువ్ జురెల్ , ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, పుల్కిత్ నారంగ్, హర్షిత్ రాణా, శార్దూల్ ఠాకూర్, సౌరభ్ కుమార్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, విధ్వత్ కావరప్ప, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ, నవదీప్ సైనీ దక్క్షిణాఫ్రికాతో టీ20లకు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ , అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్. టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ. వన్డేలకు భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయస్ లియర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్. సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా షెడ్యూల్.. టీ20 సిరీస్.. డిసెంబర్ 10: తొలి టీ20 (డర్బన్) డిసెంబర్ 12: రెండో టీ20 (పోర్ట్ ఎలిజబెత్) డిసెంబర్ 14: మూడో టీ20 (జోహనెస్బర్గ్) వన్డే సిరీస్.. డిసెంబర్ 17: తొలి వన్డే (జోహనెస్బర్గ్) డిసెంబర్ 19: రెండో వన్డే (పోర్ట్ ఎలిజబెత్) డిసెంబర్ 21: మూడో వన్డే (పార్ల్) టెస్ట్ సిరీస్.. డిసెంబర్ 26 నుంచి 30: తొలి టెస్ట్ (సెంచూరియన్) 2024 జనవరి 3 నుంచి 7: రెండో టెస్ట్ (కేప్‌టౌన్) -
SMAT 2023: మూడో పరాజయం.. క్వార్టర్ ఫైనల్ అవకాశాలు లేనట్లే!
SMAT- 2023- Andhra vs Saurashtra- రాంచీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టు మూడో పరాజయం చవిచూసింది. సౌరాష్ట్ర జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా ఆంధ్ర జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులు చేసింది. షేక్ రషీద్ (39 బంతుల్లో 62; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్ కోన శ్రీకర్ భరత్ (16 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు), అశ్విన్ హెబ్బర్ (24 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. సౌరాష్ట్ర బౌలర్లు జైదేవ్ ఉనాద్కట్ (2/35), చిరాగ్ జానీ (2/35), ధర్మేంద్ర సింగ్ జడేజా (3/14) ఆంధ్ర జట్టును కట్టడి చేశారు. క్వార్టర్ అవకాశాలు గల్లంతు అనంతరం సౌరాష్ట్ర జట్టు 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 156 పరుగులు చేసి గెలిచింది. హార్విక్ దేశాయ్ (51 బంతుల్లో 81; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), తరుణ్ (23 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. గ్రూప్ ‘సి’లో ఆంధ్ర జట్టు 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. రైల్వేస్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు గెలిచినా క్వార్టర్ ఫైనల్ చేరుకునే అవకాశం లేదు. చదవండి: BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా రాజస్తాన్ రాయల్స్ మాజీ కోచ్ -
‘ఏపీలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను’
సాక్షి, విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ పేర్కొన్నారు. తనను తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించడంతో పాటు ఏసీఏ(ఆంధ్రక్రికెట్ అసోసియేషన్) మంచి సహాయ సహకారాలు అందించిన కారణంగానే దేశం తరఫున ఆడే అవకాశం దక్కిందన్నాడు. శుక్రవారం విశాఖలో క్రికెటర్ భరత్‌ను మంత్రి గుడివాడ్ అమర్నాథ్, వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డిలు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు మాట్లాడిన శ్రీకర్ భరత్.. ‘నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒకరికి ధన్యవాదాలు. నా తల్లి దండ్రులు ఎంతగానో నన్ను ప్రోత్సహించారు. ఏసీఏ మంచి సహాయ సహకారాలు అందించింది. నా ఎదుగుదలలో ఏసీఏది కీలక పాత్ర. ఏసీఏ సహాయ సహకారాలు మర్చిపోలేనిది. పట్టుదలతో విజయం సాధించవచ్చు. దేశానికి ఆడడం గర్వంగా భావిస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను. సీఎం జగన్ సార్ ను కలిశాను. సీఎం జగన్ సార్ ఎంతగానో ప్రోత్సహించారు. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఆడుదాం ఆంధ్ర అనేది మంచి కార్యక్రమం’ అని భరత్ స్పష్టం చేశాడు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘దేశానికి గర్వకారణం భరత్. 140 కోట్ల మంది ప్రజల్లో భారత్ క్రికెట్ జట్టుకు భరత్ ఎంపిక కావడం సంతోషం. అడుదాం ఆంధ్ర పేరుతో క్రీడలను సీఎం వైఎస్ జగన్ ప్రోత్సహిస్తున్నారు. వత భరత్, రాయుడును ఆదర్శంగా తీసుకోవాలని సీఎం చెప్పారు. గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యోగం, 1000 చదరపు గజాల స్థలం ఇవ్వడానికి సీఎం జగన్ నిర్ణయించారు. భరత్ అకాడమీ పెడితే సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ధోనీలా భరత్‌కు మంచి భవిష్యత్ ఉంది. క్రికెట్ ఆడే యువతకు భరత్ ఆదర్శం’ అని తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి పాయింట్స్ మాట్లాడుతూ.. ‘పట్టుదలతో శ్రీకర్ భరత్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు.దేశం గర్వించదగ్గ బిడ్డను మనకు భరత్ తల్లి దండ్రులు అందించారు.పట్టుదలతో వరల్డ్ టెస్ట్ మ్యాచ్ లో స్థానం సంపాదించారు.రానున్న రోజుల్లో మంచి భవిష్యత్ భరత్‌కు ఉంది. యువకుల్లో క్రీడా స్ఫూర్తి పెంచడానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము.ఈ కార్యక్రమం ద్వారా అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తారు. ఏసీఏ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు..త్వరలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. అన్ని రకాల క్రీడలను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారు. -
ఇషాన్‌కు టాలెంట్ ఉంది.. వరుస అవకాశాలు ఇస్తూనే ఉంటాం: రోహిత్
Ind vs WI 2nd Test: టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు. వికెట్ కీపర్‌గా తుది జట్టులో స్థానం దక్కించుకున్న అతడికి పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇషాన్‌తో పాటు ఈ మ్యాచ్‌తో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన యశస్వి జైశ్వాల్ సెంచరీతో చెలరేగడం, మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ శతకం బాదడం టీమిండియాకు కలిసి వచ్చింది. విరాట్ కోహ్లి సైతం అర్ధ శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా 421-5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అప్పటికి క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ 20 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు తీసి అంతర్జాతీయ టెస్టు రన్స్ ఖాతా తెరిచాడు. ఇక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాయాజాలంతో విండీస్ కుప్పకూలడంతో భారత్ ఏకంగా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇషాన్ వెరీ టాలెంటెడ్ ఈ మ్యాచ్‌లో ఇషాన్ బ్యాటర్‌గా ఆకట్టుకోలేకపోయినా వికెట్ కీపర్‌గా ఫర్వాలేదనిపించాడు. అయితే, జూలై 20న ఆరంభం కానున్న రెండో టెస్టులో అతడిని కొనసాగిస్తారా లేదంటే ఆంధ్ర క్రికెటర్ కేఎస్ భరత్‌కు అవకాశమిస్తారా అన్న చర్చ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్ కిషన్‌ను ఉద్దేశించి.. ‘‘ఇషాన్ ప్రతిభావంతుడైన ఆటగాడు. టీమిండియా తరఫున ఏడాదిన్నర కెరీర్లో పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్బుతంగా రాణించాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఇలాంటి టాలెంట్ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించడం మన బాధ్యత. అతడికి మేము కచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి. ముఖ్యంగా లెఫ్టాండ్ బ్యాటర్.. కాబట్టి అతడి వైపు మొగ్గుచూపాల్సి వస్తోంది. అతడికి దూకుడుగా ఆడటం ఇష్టం. అయితే, మేనేజ్మెంట్ తను ఎలా ఆడాలని కోరుకుంటుందో స్పష్టంగా వివరించాను. అలా అని అతడికి స్వేచ్ఛ హరించుకుపోదు. రాణించగల సత్తా ఉన్నవాడు. వరుస అవకాశాలు అతడికి కాస్త ఫ్రీడం ఇచ్చి.. వరుస అవకాశాలు ఇస్తే తనను తాను నిరూపించుకుంటాడు. విండీస్‌తో తొలి టెస్టులో అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యాలు నన్ను ఆకట్టుకున్నాయి’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నట్లు హిందుస్తాన్ టైమ్స్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రెండో టెస్టులోనూ ఇషాన్‌ను కొనసాగిస్తామని కెప్టెన్ స్పష్టం చేశాడని, వరుస అవకాశాలు ఇస్తామని చెప్పాడంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి వాళ్లు? ఇషాన్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ సా, సర్ఫరాజ్ ఖాన్, భరత్ వంటి ఎంతో మంది ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నారని.. అయినా ఇషాన్వైపే మొగ్గు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ తిరిగి వచ్చిన తర్వాత వికెట్ కీపర్‌గా ఎవరు ఉంటారంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు పంచుకుంటున్నారు. కాగా ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా టీమిండియా విండీస్‌తో రెండో టెస్టులో తలపడనుంది. -
Ind Vs WI: ఇషాన్ అరంగేట్రం.. అందుకే భరత్‌పై వేటు! కానీ పాపం..
West Indies vs India, 1st Test: ఎట్టకేలకు ఇషాన్ కిషన్ టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్ సందర్భంగా జట్టుకు ఎంపికైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో పర్యటన నేపథ్యంలో టెస్టు జట్టులో చోటిచ్చారు సెలక్టర్లు. ఇక జూలై 12న టీమిండియా- విండీస్ మధ్య ఆరంభమైన తొలి మ్యాచ్ సందర్భంగా 24 ఏళ్ల ఇషాన్.. విరాట్ కోహ్లి చేతుల మీదుగా టీమిండియా టెస్టు క్యాప్ అందుకున్నాడు. అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పినట్లుగానే మరో యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ కూడా అరంగేట్రం చేశాడు. రోహిత్ శర్మ చేతుల మీదుగా క్యాప్ అందుకున్న అతడు.. కెప్టెన్‌కు జోడీగా ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. అందుకే భరత్‌పై వేటు కాగా వికెట్ కీపర్‌గా ఇషాన్ జట్టులోకి రావడంతో ఆంధ్ర క్రికెటర్ కేఎస్ భరత్‌పై వేటు పడింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ఇద్దరు లెఫ్టాండ్ బ్యాటర్లు యశస్వి, ఇషాన్‌లకు అభినందనలు తెలుపుతూనే.. భరత్‌కు మరొక్క అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సందర్భంగా భరత్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. పటిష్ట ఆసీస్‌తో మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా రాణించినప్పటికీ.. బ్యాటర్‌గా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అదే విధంగా ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లోనూ తన మార్కు చూపలేకపోయాడు. అయితే, రెండు సందర్భాల్లోనూ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తంగా 28 పరుగులు చేయగలిగాడు. అయితే, రెండు సందర్భాల్లోనూ శ్రీకర్ భరత్ ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టును ఎదుర్కోవడం విశేషం. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ సారథి అంజుమ్ చోప్రా తదితరులు భరత్‌కు అండగా నిలిచారు. వికెట్ కీపర్‌గా తన వంతు బాధ్యతలు సక్రమంగానే నెరవేరుస్తున్న భరత్‌ను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కాస్త వీక్‌గా ఉన్న విండీస్‌తో ఆడే అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కానీ భరత్‌పై వేటు వేసిన యాజమాన్యం ఇషాన్‌కు ఛాన్స్ ఇచ్చింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఈ జార్ఖండ్ బ్యాటర్ తనను తాను నిరూపించుకుంటే భరత్ స్థానానికి ఎసరు తప్పదు! పంత్ స్థానంలో అప్పుడు ఇక యాక్సిడెంట్ కారణంగా ప్రధాన వికెట్ కీపర్ రిషభ్ పంత్ దూరం కావడంతో అతడి స్థానాన్ని భరత్‌తో భర్తీ చేశారు. పంత్ త్వరగా కోలుకుని తిరిగి వస్తే ఇషాన్ కిషన్, భరత్‌లలో ఎవరో ఒకరికి మాత్రమే బ్యాకప్‌గా జట్టులో స్థానం లభిస్తుంది. మరోవైపు.. మరో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కాగా భరత్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 5 టెస్టులాడి 129 పరుగులు సాధించాడు. చదవండి: మార్కు చూపించిన తిలక్ వర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విహారి! ఫైనల్లో జట్టును.. Good 11, considering the squad. Slightly harsh on Bharat, but he did get 5 Tests and didn't really look convincing. No harm in trying out Kishan to see what he's got. Just hoping Pant will get fit by the SA series, because he'll be our most important batter there.#WIvIND https://t.co/xoeuzOuqjA — Shaan Waseem (@shaanwaseem2) July 12, 2023 Happy For them , Go Well Lads !#WIvIND #WTC pic.twitter.com/XjQXYZooxP — vinith (@CricVinith) July 12, 2023 Watch 📹📹- Proud moment for the two youngsters as they receive their Test caps from Captain Rohit Sharma and Virat Kohli.#WIvIND pic.twitter.com/D9QXRQvX35 — BCCI (@BCCI) July 12, 2023 -
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్.. ఇషాన్ కిషన్ అరంగేట్రం! ఆంధ్ర ఆటగాడికి నో ఛాన్స్
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా అన్ని విధాల సిద్దమవుతోంది. ఇప్పటికే విండీస్ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ సేన తమ ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టేసింది. జూలై 12 నుంచి డొమెనికా వేదికగా భారత్-విండీస్ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియా స్ధానిక జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ రెండు రోజులు(జూలై 5, 6) పాటు జరగనుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. విండీస్ తొలి టెస్టుకు తుది జట్టును ఎంపిక చేయడం భారత జట్టుకు పెద్ద సవాలుగా మారింది. ఎందకంటే ఈ సిరీస్‌కు వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారాను పక్కన పెట్టడంతో ఆ స్ధానాన్ని ఎవరితో భర్తీ చేయాలో ఆర్ధంకాక మెనెజ్‌మెంట్ తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. ఆ స్ధానంలో యువ ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్ లేదా రుత్‌రాజ్ గైక్వాడ్‌కు అవకాశం ఇవ్వాలో తెలియక సందిగ్థంలో పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ దేశావాళీ క్రికెట్లో ఓపెనర్లగా ఆడిన అనుభవం ఉంది గానీ టాపర్డర్‌లో అంతగా ఎక్స్పీరియన్స్ లేదు. కానీ వీరిద్దరూలో ఎవరో ఒకరు విండీస్ తొలి టెస్టుతో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం ఖాయం. అది ఎవరన్నది తొలి టెస్టు వరకు వేచి చూడక తప్పదు కిషన్ అరంగేట్రం.. ఇక విండీస్‌తో తొలి టెస్టుతో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ టెస్టుల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. మరో యువ వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ విండీస్ టెస్టులకు ఎంపికైనప్పటికీ.. తుది జట్టులో మాత్రం చోటు దక్కడం అనుమానమే. భరత్ వికెట్లు వెనుక అద్భుతంగా ఉన్నప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన భరత్.. ఆ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన కేవలం 101 పరుగులు చేశాడు. దీంతో పాటు ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కూడా కేఎస్ భరత్‌కి ఫైనల్లో అవకాశం లభించింది. అక్కడ కూడా బ్యాట్‌తో విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో అతడిని పక్కన పెట్టి కిషన్‌కు ఓ అవకాశం ఇచ్చి చూడాలని జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. చదవండి: Kohli And Rohit Sharma: ‘అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాతే ఆ కీలక ప్రకటన! ఇక కోహ్లి, రోహిత్..’