కేఎస్ భరత్
టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పునరాగమనంపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో వికెట్ కీపర్‌గా ప్రస్తుతం కేఎస్ భరత్‌కే మేనేజ్‌మెంట్ పెద్దపీట వేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
ఒకవేళ ఏదేని కారణాల చేత భరత్ జట్టుకు దూరమైతే.. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ లేదంటే జగదీశన్ వంటి వాళ్లకు ఛాన్స్ ఇస్తారని అభిప్రాయపడ్డాడు. అంతేగానీ.. ఇషాన్ కిషన్‌కు మాత్రం రీఎంట్రీ అంత సులువుకాదని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
బ్రేక్ తీసుకున్న ఇషాన్
కాగా మానసికంగా అలసిపోయానంటూ సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ కిషన్ మధ్యలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబంతో సమయం గడుపుతూనే.. వర్కౌట్లతో బిజీ అయ్యాడు.
ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్‌తో ఇషాన్ కిషన్‌కు విభేదాలు తలెత్తాయన్న వార్తల నడుమ.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే ఇషాన్ తిరిగి జట్టులోకి వస్తాడని పేర్కొన్నాడు. అయితే, రంజీ ట్రోఫీ-2024 రూపంలో అవకాశం ఉన్నా.. ఇషాన్ మాత్రం దానిని పక్కనపెట్టాడు.
భరత్‌కు అవకాశం
జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్వాగతం పలికినా జట్టుతో చేరలేదు. ఇదిలా ఉంటే.. ఇషాన్ తిరిగి వచ్చిన తర్వాత సౌతాఫ్రికాతో టెస్టుల్లో అతడి స్థానాన్ని భర్తీ చేసిన ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టుల్లోనూ ఆడుతున్నాడు.
అయితే, వికెట్ కీపింగ్ పరంగా అతడికి మంచి మార్కులే పడుతున్నా.. బ్యాటర్‌గా ఆకట్టుకోలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఇషాన్ కిషన్ మేనేజ్‌మెంట్‌ను అడిగి మరీ విరామం తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు. తన బ్రేక్‌ను పొడిగిస్తూనే ఉన్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోనూ కనిపించడం లేదు.
మానసికంగా అలసిపోయానంటూ అతడు సెలవు తీసుకున్నాడు. తను బాగుండాలని కోరుకుంటున్నా. అయితే, ఇప్పట్లో అతడు నేరుగా టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు. కేఎస్ భరత్ వికెట్ కీపర్‌గా జట్టులో ఉన్నాడు.
అతడి గైర్హాజరీలో ధ్రువ్ జురెల్ లేదంటే.. జగదీశన్ కూడా జట్టులోకి వస్తారేమో కూడా తెలియదు. కానీ.. ఇషాన్ కిషన్‌కు మాత్రం పిలుపునివ్వరు. అతడు దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే మళ్లీ జాతీయ జట్టుకు సెలక్ట్ చేస్తారు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
ఆ విషయంలో కోహ్లితో పోల్చవద్దు
ఈ సందర్భంగా.. ‘‘విరాట్ కోహ్లి కూడా కాంపిటేటివ్ క్రికెట్ ఆడటం లేదు కదా అంటూ ప్రశ్నలు వేయద్దు. ఎందుకంటే.. కోహ్లి, ఇషాన్‌ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి.. దయచేసి ఇద్దరినీ పోల్చే ప్రయత్నం చేయొద్దు’’ అంటూ ట్రోల్ చేసే వాళ్లకు చురకలు అంటించాడు ఆకాశ్ చోప్రా.
చదవండి: Virat Kohli: అంతా అబద్ధం.. కోహ్లి విషయంలో మాట మార్చిన డివిలియర్స్
Comments
Please login to add a commentAdd a comment