ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ తీవ్ర నిరాశపరిచాడు. పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన భరత్.. వికెట్ కీపింగ్ పరంగా పర్వాలేదనిపించినప్పటికీ, బ్యాటింగ్‌లో మాత్రం అకట్టుకోలేకపోయాడు. మూడో రోజు ఆటలో అజింక్య రహానేకు భరత్ సపోర్ట్‌గా నిలుస్తాడని అంతా భావించారు. కానీ ఆటప్రారంభమైన కొద్దిసేపటికే భరత్ 5 పరుగులు చేసి స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
భరత్‌ను అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో బోలాండ్ బోల్తా కొట్టించాడు. బోలాండ్ వేసిన డెలివరీకి భరత్ ఢిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అద్బుతంగా టర్న్ అయ్యి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో భరత్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని కొనసాగుతోంది. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్ (41 పరుగులు), కామెరూన్ గ్రీన్ (7 పరుగులు) ఉన్నారు.
అంతకముందు భారత తమ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. అజింక్య రహానే, (89 పరుగులు), ఆల్‍రౌండర్ శార్దూల్ ఠాకూర్ (51 పరుగులు) రాణించడంతో భారత్ ఈ మాత్రం స్కోర్‌నైనా అందుకుంది. ఇక మొత్తంగా ఆస్ట్రేలియా 296 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
చదవండి: WTC Final: బాలయ్య డైలాగులు చెప్పిన స్టీవ్ స్మిత్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment