scott boland
-
టీమిండియాతో తలపడబోయే ప్రైమ్ మినిస్టర్ జట్టు ఇదే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ మధ్యలో (తొలి టెస్ట్ అనంతరం) భారత్ ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. కాన్బెర్రా వేదికగా ఈ మ్యాచ్ నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో జరుగనుంది. ఈ మ్యాచ్ పింక్ బాల్‌తో జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ (నవంబర్ 22) ప్రకటించింది. ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌లో ప్రస్తుత ఆసీస్ జట్టులోని సభ్యుడు స్కాట్ బోలాండ్ ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌కు ఆసీస్ మాజీ వికెట్‌కీపర్ టిమ్ పైన్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనుండగా.. జాక్ ఎడ్వర్డ్స్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. ఈ జట్టు ఆస్ట్రేలియా అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ హీరోలతో నిండి ఉంది. ఈ జట్టులో స్కాట్ బోలాండ్, మ్యాట్ రెన్షాలకు జాతీయ జట్టుకు ఆడిన అనుభవం ఉంది. మిగతా ఆటగాళ్లంతా అన్క్యాప్డ్ ప్లేయర్లే. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్ట్ పింక్ బాల్ టెస్ట్ కావడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. గడిచిన మూడేళ్లలో భారత్ పింక్ బాల్ మ్యాచ్ ఆడటం ఇదే మొదటిసారి.టీమిండియా విషయానికొస్తే.. ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌తో మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడు. తాను ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే విషయాన్ని హిట్‌మ్యాన్ బీసీసీఐకి ఇదివరకే తెలిపాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెగ్యులర్ జట్టు మొత్తం పాల్గొంటుంది. రెండో టెస్ట్ పింక్ బాల్‌తో ఆడే టెస్ట్ కాబట్టి టీమిండియాకు ఈ మ్యాచ్ చాలా ఉపయెగపడుతుంది.ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ XI స్క్వాడ్..జాక్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), చార్లీ ఆండర్సన్, మహ్లీ బియర్డ్‌మన్, స్కాట్ బోలాండ్, జాక్ క్లేటన్, ఐడాన్ ఓ'కానర్, ఒల్లీ డేవిస్, జేడెన్ గుడ్విన్, సామ్ హార్పర్, హన్నో జాకబ్స్, సామ్ కాన్స్టాస్, లాయిడ్ పోప్, మాథ్యూ రెన్షా, జెమ్ ర్యాన్.ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా ఇవాళ (నవంబర్ 22) తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లు పేట్రేగిపోవడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. భారత ఇన్నింగ్స్ 98/6 స్కోర్ వద్ద కొనసాగుతుంది. భారత ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ 0, కేఎల్ రాహుల్ 26, దేవ్‌దత్ పడిక్కల్ 0, విరాట్ కోహ్లి 5, ధృవ్ జురెల్ 11, వాషింగ్టన్ సుందర్ 4 పరుగులకు ఔటయ్యారు. రిషబ్ పంత్ (27), నితీశ్ కుమార్ రెడ్డి (15) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. -
Ashes Series: నాలుగో టెస్ట్‌కు ముందు ఆస్ట్రేలియా సాహసోపేతమైన నిర్ణయం
మాంచెస్టర్ వేదికగా ఇవాల్టి నుంచి (జులై 19) ప్రారంభం కానున్న నాలుగో యాషెస్ టెస్ట్‌కు ముందు ఆస్ట్రేలియా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ కూడా లేకుండా, ఏకంగా ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా మిచెల్ మార్ష్, కెమరూన్ గ్రీన్‌లను ఎంపిక చేసుకున్న ఆసీస్ మేనేజ్మెంట్.. స్పెషలిస్ట్ పేసర్లుగా మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్‌లను బరిలోకి దించుతుంది. మూడో టెస్ట్‌లో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా టాడ్ మర్ఫీ బరిలో నిలువగా.. నాలుగో టెస్ట్‌కు ప్రకటించిన తుది జట్టులో అతనికి చోటు లభించలేదు. మర్ఫీ స్థానంలో గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న కెమరూన్ గ్రీన్ తుది జట్టులోకి రాగా.. మూడో టెస్ట్‌లో అంతగా ప్రభావం చూపని స్కాట్ బోలండ్ స్థానాన్ని హాజిల్‌వుడ్ భర్తీ చేశాడు. మూడో టెస్ట్ ఆడిన జట్టులో ఆసీస్ ఈ రెండు మార్పులు చేసింది. గత మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై కెప్టెన్ కమిన్స్ సహా మేనేజ్మెంట్ కూడా నమ్మకముంచింది. మాంచెస్టర్ పిచ్‌పై స్పిన్నర్లకు పెద్దగా సహకారం లభించదని భావించిన ఆసీస్.. ఒక్క రెగ్యులర్ స్పిన్నర్ కూడా లేకుండా బరిలోకి దిగుతూ పెద్ద సాహసమే చేస్తుంది. పార్ట్ టైమ్ స్పిన్నర్లుగా స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, లబూషేన్ సేవలను వినియోగించుకోవాలని ఆసీస్ యాజమాన్యం భావిస్తుంది. మరోవైపు ఇంగ్లండ్.. ఆసీస్ కంటే ముందే తమ తుది జట్టును ప్రకటించింది. మూడో టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించిన ఇంగ్లండ్.. కేవలం ఒక్క మార్పు చేసింది. గాయం కారణంగా మూడో టెస్ట్‌లో బౌలింగ్ చేయలేకపోయిన ఓలీ రాబిన్సన్ స్థానంలో వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల ఈ యాషెస్ సిరీస్‌లో పర్యాటక ఆసీస్ ప్రస్తుతానికి 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్ గెలువగా.. హోరాహోరీగా సాగిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. బజ్‌బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ తొలి రెండు టెస్ట్‌లో బొక్కబోర్లా పడటంతో మూడో టెస్ట్‌లో కాస్త జాగ్రత్తగా ఆడి విజయం సాధించింది. ఇంగ్లండ్: బెన్ డకెట్, జాక్ క్రాలే,మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోనాథన్ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా, లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ -
Ashes 4th Test: వార్నర్‌కు కెప్టెన్ మద్దతు.. ఆసీస్ జట్టులో ఓ మార్పు
మాంచెస్టర్ వేదికగా జులై 19 నుంచి ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తుది జట్టును ఇదివరకే ప్రకటించింది. అయితే తుది జట్టును ప్రకటించే విషయంలో ఆసీస్ మేనేజ్మెంట్ మాత్రం వేచి చూచే ధోరణిని ప్రదర్శిస్తుంది. మరికొద్ది గంటల్లో మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉండగా.. ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ కేవలం లీకులు ఇచ్చాడు. తుది జట్టును మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. తొలి 3 టెస్ట్‌ల్లో విఫలమైన వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు కమిన్స్ అండగా నిలిచాడు. వార్నర్ కీలకమైన నాలుగో టెస్ట్‌లో ఆడతాడని చెప్పకనే చెప్పాడు. వార్నర్ గతంలో చాలా సందర్భాల్లో కీలక సమయాల్లో ఫామ్‌ను అందుకని తమను గెలిపించాడని ప్రీ మ్యాచ్ మీడియా కాన్ఫరెన్స్‌లో ప్రస్తావించాడు. దీన్ని బట్టి చూస్తే నాలుగో టెస్ట్ కోసం వార్నర్‌కు లైన్ క్లియర్ అయ్యిందన్న విషయం అర్ధమవుతుంది. తుది జట్టులో ఓ మార్పు విషయంపై కూడా కమిన్స్ నోరు విప్పాడు. మూడో టెస్ట్‌లో ఆశించినంత ప్రభావం చూపని స్కాట్ బోలండ్ స్థానాన్ని అనుభవజ్ఞుడైన హాజిల్‌వుడ్ భర్తీ చేస్తాడని తెలిపాడు. తుది జట్టులో మరేమైనా మార్పులుంటాయన్న ప్రశ్నకు కమిన్స్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. తుది జట్టు ప్రకటనపై తొందరేం లేదని, మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు ఆ ప్రకటన ఉంటుందని కాన్ఫరెన్స్‌ను కంక్లూడ్ చేశాడు. మరి కమిన్స్ చెప్పినట్లుగా వార్నర్ కొనసాగుతాడో లేదో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. మరో పక్క ఇంగ్లండ్ మాత్రం తమ తుది జట్టును నిన్ననే ప్రకటించింది. ఓపెనర్లుగా బెన్ డకెట్, జాక్ క్రాలే, వన్‌డౌన్‌లో మొయిన్ అలీ, నాలుగో ప్లేస్‌లో జో రూట్, ఆతర్వాత హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోనాథన్ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ వరుస స్థానాల్లో ఉంటారని తెలిపింది. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల ఈ యాషెస్ సిరీస్‌లో పర్యాటక ఆసీస్ ప్రస్తుతానికి 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్ గెలువగా.. హోరాహోరీగా సాగిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. బజ్‌బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ తొలి రెండు టెస్ట్‌లో బొక్కబోర్లా పడటంతో మూడో టెస్ట్‌లో కాస్త జాగ్రత్తగా ఆడి విజయం సాధించింది. -
Ashes 2nd Test: అతడిని పక్కన పెట్టి స్టార్క్‌ను తీసుకు రండి: ఆసీస్ మాజీ కెప్టెన్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో కూడా అదే జోరును కొనసాగించాలని ఆసీస్ జట్టు భావిస్తోంది. అయితే తొలి టెస్టులో ఆసీస్ విజయం సాధించినప్పటికీ.. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను బయట కూర్చోని పెట్టడం అందరనీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో రెండో టెస్టుకు మిచెల్ స్టార్క్‌ను తుది జట్టులోకి తీసుకురావాలని ఆసీస్ మాజీ కెప్టెన్ టీమ్ పైన్ సూచించాడు. స్కాట్ బోలాండ్కు విశ్రాంతినిచ్చి అతడి స్ధానంలో స్టార్క్‌కు అవకాశం ఇవ్వాలని పైన్ అభిప్రాయపడ్డాడు. "ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడుతున్నప్పుడు తుది జట్టును ఎంపిక చేయడం చాలా కష్టం. మేము డబ్ల్యూటీసీ ఫైనల్‌తో కలపి వరుసగా ఆరు వారాల్లో ఆరు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతున్నాము. కాబట్టి ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు రొటేట్ అవుతారనడంలో సందేహం లేదు. లార్డ్స్ టెస్టుకు బోలాండ్‌ను పక్కన పెట్టి స్టార్క్‌ను తీసుకురావాలి. అయితే బోలాండ్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కానీ టెస్టుల్లో ఫాస్ట్ బౌలర్ల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. వారు బాగా అలిసిపోతారు. కాబట్టి వారికి తగినంత విశ్రాంతి అవసరం. ఈ క్రమంలో బెంచ్ బలాన్ని కూడా పరీక్షంచాలి. కానీ ఈ ఐదు టెస్టుల్లో కొనసాగే ఏకైక ఫాస్ట్ బౌలర్ మా కెప్టెన్ పాట్ కమిన్సే అని" వాట్లే సేన్ పోడ్కాస్ట్లో పైన్ పేర్కొన్నాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సంజయ్ దత్.. -
WTC Final 2023: 21వ శతాబ్దం మొత్తంలో ఈ ఆసీస్ బౌలర్‌ను మించినోడే లేడు
ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలండ్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో 5 వికెట్లతో ఇరగదీసిన ఈ వెటరన్ ఫాస్ట్ బౌలర్.. ఈ శతాబ్దంలోనే (21) టెస్ట్‌ల్లో అత్యుత్తమ బౌలింగ్ యావరేజ్(కనీసం 30 వికెట్లు తీసిన బౌలర్లలో) కలిగిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బోలండ్ తానాడిన 8 మ్యాచ్‌ల్లో 14.57 సగటున 33 వికెట్లు పడగొట్టాడు. ఈ శతాబ్దంలో గడిచిన 22 ఏళ్లలో ఇంత తక్కువ బౌలింగ్ యావరేజ్ కలిగిన బౌలర్ ఎవరూ లేరు. కాగా, డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో బోలండ్ టీమిండియా పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్, శ్రీకర్ భరత్‌లను క్లీన్ బౌల్డ్ చేసిన బోలండ్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింత రెచ్చిపోయి మరోసారి గిల్ వికెట్‌ను, కీలకమైన విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా వికెట్లను దక్కించుకున్నాడు. 34 ఏళ్ల బోలండ్ ఇప్పటివరకు ఆడిన 8 టెస్ట్‌ల్లో ఆసీస్ పాలిట ట్రంప్ కార్డుగా నిలిచాడు. నిప్పులు చెరిగే వేగంతో బౌలింగ్ చేసే ఇతను ముఖ్యంగా సొంత దేశంలో పిచ్‌లపై చెలరేగిపోతాడు. ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాపై ఆస్ట్రేలియా 209 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 444 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 234 పరుగులకే ఆలౌటై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 469 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 270/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా... భారత్ 234 పరుగులకు ఆలౌటైంది. -జాన్‌పాల్, సాక్షి వెబ్‌డెస్క్ చదవండి: WTC Final 2023: ఐపీఎల్ నుంచి నేరుగా వచ్చి ఆడితే ఇలాగే ఉంటది..! -
ఆసీస్ పేసర్ సూపర్ డెలివరీ.. భరత్‌కు దిమ్మతిరిగిపోయింది! వీడియో వైరల్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ తీవ్ర నిరాశపరిచాడు. పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన భరత్.. వికెట్ కీపింగ్ పరంగా పర్వాలేదనిపించినప్పటికీ, బ్యాటింగ్‌లో మాత్రం అకట్టుకోలేకపోయాడు. మూడో రోజు ఆటలో అజింక్య రహానేకు భరత్ సపోర్ట్‌గా నిలుస్తాడని అంతా భావించారు. కానీ ఆటప్రారంభమైన కొద్దిసేపటికే భరత్ 5 పరుగులు చేసి స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. భరత్‌ను అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో బోలాండ్ బోల్తా కొట్టించాడు. బోలాండ్ వేసిన డెలివరీకి భరత్ ఢిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అద్బుతంగా టర్న్ అయ్యి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో భరత్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని కొనసాగుతోంది. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్ (41 పరుగులు), కామెరూన్ గ్రీన్ (7 పరుగులు) ఉన్నారు. అంతకముందు భారత తమ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. అజింక్య రహానే, (89 పరుగులు), ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (51 పరుగులు) రాణించడంతో భారత్ ఈ మాత్రం స్కోర్‌నైనా అందుకుంది. ఇక మొత్తంగా ఆస్ట్రేలియా 296 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: WTC Final: బాలయ్య డైలాగులు చెప్పిన స్టీవ్ స్మిత్.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
ఆసీస్ బౌలర్ సూపర్ డెలివరీ.. దెబ్బకు గిల్‌కు ప్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
ఓవల్ వేదికగా స్ట్రేలియాతో జరగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 13 పరగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఆస్ట్రేలియా బౌలర్ స్కాట్ బోలాండ్ ఓ అద్భుతమైన బంతితో గిల్‌ను బోల్తా కొట్టించాడు. భారత ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో బోలాండ్ వేసిన ఇన్‌స్వింగ్ డెలివరీకి గిల్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. బంతి ఆఫ్ సైడ్ పడి ఒక్కసారిగా టర్న్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో గిల్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానే(29), కేఎస్ భరత్(5) పరుగులతో ఉన్నారు. ఇక టాప్ ఆర్డర్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ (15), శుభ్‌మన్ గిల్ (13), చతేశ్వర్ పుజారా (14), విరాట్ కోహ్లి (14) దారుణంగా నిరాశపరిచారు. జట్టును గట్టుక్కించే బాధ్యత మొత్తం ప్రస్తుతం రహానే పైనే ఉంది. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైంది. చదవండి: WTC FINAL 2023: పీకల్లోతు కష్టాల్లో భారత్.. భారం మొత్తం అతడిపైనే! లేదంటే అంతే సంగతి View this post on Instagram A post shared by ICC (@icc) -
WTC Final 2023: హాజల్‌వుడ్ స్థానంలో బోలండ్.. ఆసీస్ తుది జట్టు ఇదే!
లండన్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాతో తలపడేందుకు ఆస్ట్రేలియా జట్టు సిద్దమైంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా ఉన్న ఆసీస్.. భారత జట్టు ఎలాగైనా ఓడించి విశ్వవిజేతగా నిలవాలని భావిస్తోంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ఆ జట్టు స్టార్ పేసర్ హాజల్‌వుడ్ గాయం కారణంగా దూరం కావడం ఆసీస్‌కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఈ ఫైనల్ మ్యాచ్ బుధవారం(జూన్ 7) నుంచి జూన్ 11వరకు జరగనుంది. హాజల్‌వుడ్ స్థానంలో బోలండ్... ఇక భారత్‌తో పోలిస్తే ఆ్రస్టేలియాకు తమ తుది జట్టు విషయంలో పూర్తి స్పష్టత ఉంది. వార్నర్ పునరాగమనంతో హ్యాండ్స్‌కోంబ్‌ను తప్పించగా, గాయ పడిన హాజల్‌వుడ్ స్థానంలో మరో పేసర్ బోలండ్కు స్థానం దక్కింది. ముగ్గురు రెగ్యులర్ పేసర్లతో పాటు కామెరాన్ గ్రీన్ రూపంలో మరో మీడియం పేసర్ అందుబాటులో ఉన్నాడు. ఐపీఎల్ ఆడిన వార్నర్, గ్రీన్ మినహా మిగతావారంతా టెస్టు స్పెష లిస్ట్‌లుగా ఈ మ్యాచ్ కోసం ఆసీస్ గడ్డపై పూర్తి స్థాయి లో సిద్ధమయ్యారు. ఓవల్ పరిస్థితులు తమ దేశంలోలాగే ఉండటం ఆ జట్టుకు సానుకూలాంశం. ఆస్ట్రేలియా తుది జట్టు(అంచనా): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్) స్కాట్ బోలాండ్, నాథన్ లియోన్ చదవండి: Odisha Train Accident: రైలు ప్రమాద బాధితులకు ధోనీ రూ.60 కోట్ల సాయం.. ఈ వార్తల్లో నిజమెంత? -
WTC Final: ఆస్ట్రేలియా తుది జట్టులో నిప్పులు చెరిగే ఫాస్ట్ బౌలర్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో ఆస్ట్రేలియా ముగ్గురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతుందని ఆ జట్టు సారధి ప్యాట్ కమిన్స్ ప్రకటించాడు. తను, మిచెల్ స్టార్క్‌తో పాటు మరో పేసర్ స్కాట్ బోలండ్ తుది జట్టులో ఉంటాడని స్పష్టం చేశాడు. జోష్ హాజిల్‌వుడ్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మైఖేల్ నెసర్‌ను తుది జట్టులో ఆడిస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే కమిన్స్ క్లారిటీ ఇచ్చాడు. మూడో పేసర్‌గా బోలండ్ ఉంటాడని కన్ఫర్మ్ చేశాడు. నెసర్తో పోలిస్తే బోలండ్ బౌలింగ్‌లో వైవిధ్యం ఉంటుందని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకునే మేనేజ్మెంట్ అతనికి ఓటు వేసిందని తెలిపాడు. గుడ్ లెంగ్త్ సీమ్ బౌలర్ అయిన బోలండ్.. హాజిల్‌వుడ్ కంటే కాస్త భిన్నమైన బౌలర్ అని, అతని బౌలింగ్‌లోని వైవిధ్యానికి టీమిండియా బ్యాటర్లు తప్పక ఇబ్బంది పడతారని ధీమా వ్యక్తం చేశాడు. తమ ఫాస్ట్ బౌలింగ్ త్రయం దెబ్బకు టీమిండియా విలవిలలాడక తప్పదని, గ్రీన్ రూపంలో తమకు మరో ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ ఉందని అన్నాడు. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే, తమ తరుపు ముక్క నాథన్ లియోన్ పని కానిచ్చేస్తాడని తెలిపాడు. మొత్తంగా డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశాడు. కాగా, రేపటి (జూన్ 7) నుంచి జూన్ 11 వరకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బరిలోకి దించబోయే తుది జట్టుపై సారధి ప్యాట్ కమిన్స్ ప్రీ మ్యాచ్ ప్రెస్ మీట్లో క్లారిటీ ఇచ్చాడు. టీమిండియా సైతం మరికొద్ది గంటల్లో తుది జట్టులో ఎవరెవరు ఉంటారో ప్రకటించవచ్చు. వికెట్‌కీపర్ ఎంపిక విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ తర్జనభర్జన పడుతుంది. కేఎస్ భరత్‌ను ఎంపిక చేయాలా లేక ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వాలా అని ఆలోచిస్తుంది. అలాగే బౌలర్ల విషయంలో కూడా యాజమాన్యానికి క్లారిటీ లేదు. ముగ్గురు ఫాస్ట్ బౌలర్ల ఆడించాలని అనుకుంటున్నప్పటికీ, వారు ఎవరనే దానిపై స్పష్టత లేదు. తుది జట్లు (అంచనా).. ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), పాట్ కమిన్స్, నాథన్ లియోన్, స్కాట్ బోలండ్, మిచెల్ స్టార్క్ టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్ చదవండి: వివాదంలో గుజరాత్ టైటాన్స్ క్రికెటర్ యష్ దయాల్ -
WTC Points Table: యాషెస్ సిరీస్ ఆసీస్ కైవసం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం
WTC 2021 23 Points Table Update After Aus Win Ashes Series: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడో టెస్టులో ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా చిత్తుగా ఓడించింది. ఇన్నింగ్స్ మీద 14 పరుగుల తేడాతో పర్యాటక జట్టును మట్టికరిపించి ట్రోఫీని దక్కించుకుంది. అరంగేట్ర ఆటగాడు స్కాట్ బోలాండ్ సంచలన బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్ల ఆటకట్టించడంతో మూడో రోజే ఆటకు ముగింపు పడింది. ఈ క్రమంలో 3-0 తేడాతో కంగారూలు యాషెస్ సిరీస్‌ను సొంతం చేసుకున్నారు. తద్వారా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్నారు. కాగా 2021-23 ఏడాదిలో ఆసీస్‌కు ఇదే తొలి టెస్టు సిరీస్. ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడు ఏకపక్ష విజయాలతో 36 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ఇక ఒక సిరీస్ పూర్తిచేసుకున్న శ్రీలంక రెండు విజయాల(24 పాయింట్లు)తో రెండో స్థానంలో ఉండగా... రెండు సిరీస్‌లు ఆడిన పాకిస్తాన్ మూడు విజయాలతో మూడో స్థానంలో ఉంది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో స్వదేశంలో ఒకటి, ఇంగ్లండ్‌తో మరొక సిరీస్ ఆడిన టీమిండియా 3 విజయాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం కోహ్లి సేన దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. యాషెస్ సిరీస్- మూడో టెస్టులో ఆసీస్ ఘన విజయం- స్కోర్లు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 267 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 185 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్- 68 ఆలౌట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: స్కాట్ బోలాండ్(మొత్తంగా 7 వికెట్లు) చదవండి: Ind v Sa 1st Test: లంచ్ మెనూ ఫొటో వైరల్.. ఆట రద్దైందని మేము బాధపడుతుంటే.. ఇదంతా అవసరమా? Who's writing Scott Boland's script!? 😱 The England captain snicks off and Boland has four! 🤯 #Ashes pic.twitter.com/tjFrwDHLte — cricket.com.au (@cricketcomau) December 28, 2021 Australia on 🔝 Here's how the #WTC23 table is taking shape after the third #Ashes Test in Melbourne 🔢 pic.twitter.com/Nc2RcwluJz — ICC (@ICC) December 28, 2021 -
అరంగేట్ర మ్యాచ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆసీస్ బౌలర్!
టెస్ట్ క్రికెట్లో ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ రికార్డు సృష్టించాడు. అత్యంత వేగవంతగా 5వికెట్ల ఘనతను సాధించిన మూడో బౌలర్‌గా రికార్డుల కెక్కాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టెస్ట్‌లో 5వికెట్లు పడగొట్టి బోలాండ్ ఈ ఘనతను సాధించాడు. కాగా అరంగేట్ర మ్యాచ్‌లోనే బోలాండ్ ఈ అరుదైన ఘనత సాధించడం విశేషం. దీంతో ఇంగ్లండ్ బౌలర్లు ఎర్నీ తోషాక్, స్టువర్ట్ బ్రాడ్ రికార్డులను అతడు సమం చేశాడు. 1947లో భారత జట్టుపై తోషాక్ ఈ ఘనత సాధించగా,2015లో ఆసీస్‌పై బ్రాడ్ ఫాస్టెస్ట్ 5వికెట్ల రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో బోలాండ్ 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 15పరుగల తేడాతో ఘన విజయం సాదించింది. దీంతో యాషెస్ సిరీస్‌ను 3-0 తేడాతో ఆసీస్ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 68 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో స్కాట్ బోలాండ్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. చదవండి: Sourav Ganguly Covid Positive: ఆస్పత్రిలో చేరిన గంగూలీ... INSANE! Scott Boland takes two in the over! #OhWhatAFeeling #Ashes | @Toyota_Aus pic.twitter.com/Uhk046VGG6 — cricket.com.au (@cricketcomau) December 27, 2021