ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో కూడా అదే జోరును కొనసాగించాలని ఆసీస్ జట్టు భావిస్తోంది. అయితే తొలి టెస్టులో ఆసీస్ విజయం సాధించినప్పటికీ.. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను బయట కూర్చోని పెట్టడం అందరనీ ఆశ్చర్యపరిచింది.
ఈ క్రమంలో రెండో టెస్టుకు మిచెల్ స్టార్క్‌ను తుది జట్టులోకి తీసుకురావాలని ఆసీస్ మాజీ కెప్టెన్ టీమ్ పైన్ సూచించాడు. స్కాట్ బోలాండ్‌కు విశ్రాంతినిచ్చి అతడి స్ధానంలో స్టార్క్‌కు అవకాశం ఇవ్వాలని పైన్ అభిప్రాయపడ్డాడు.
"ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడుతున్నప్పుడు తుది జట్టును ఎంపిక చేయడం చాలా కష్టం. మేము డబ్ల్యూటీసీ ఫైనల్‌తో కలపి వరుసగా ఆరు వారాల్లో ఆరు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతున్నాము. కాబట్టి ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు రొటేట్ అవుతారనడంలో సందేహం లేదు. లార్డ్స్ టెస్టుకు బోలాండ్‌ను పక్కన పెట్టి స్టార్క్‌ను తీసుకురావాలి. అయితే బోలాండ్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
కానీ టెస్టుల్లో ఫాస్ట్ బౌలర్ల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. వారు బాగా అలిసిపోతారు. కాబట్టి వారికి తగినంత విశ్రాంతి అవసరం. ఈ క్రమంలో బెంచ్ బలాన్ని కూడా పరీక్షంచాలి. కానీ ఈ ఐదు టెస్టుల్లో కొనసాగే ఏకైక ఫాస్ట్ బౌలర్ మా కెప్టెన్ పాట్ కమిన్సే అని" వాట్లే సేన్ పోడ్‌కాస్ట్‌లో పైన్ పేర్కొన్నాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సంజయ్ దత్..
Comments
Please login to add a commentAdd a comment