
అరంగేట్ర మ్యాచ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆసీస్ బౌలర్
టెస్ట్ క్రికెట్‌లో ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ రికార్డు సృష్టించాడు. అత్యంత వేగవంతగా 5వికెట్ల ఘనతను సాధించిన మూడో బౌలర్‌గా రికార్డుల కెక్కాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టెస్ట్‌లో 5వికెట్లు పడగొట్టి బోలాండ్ ఈ ఘనతను సాధించాడు. కాగా అరంగేట్ర మ్యాచ్‌లోనే బోలాండ్ ఈ అరుదైన ఘనత సాధించడం విశేషం. దీంతో ఇంగ్లండ్ బౌలర్లు ఎర్నీ తోషాక్, స్టువర్ట్ బ్రాడ్ రికార్డులను అతడు సమం చేశాడు. 1947లో భారత జట్టుపై తోషాక్ ఈ ఘనత సాధించగా,2015లో ఆసీస్‌పై బ్రాడ్ ఫాస్టెస్ట్ 5వికెట్ల రికార్డును సాధించాడు.
ఈ మ్యాచ్‌లో బోలాండ్ 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 15పరుగల తేడాతో ఘన విజయం సాదించింది. దీంతో యాషెస్ సిరీస్‌ను 3-0 తేడాతో ఆసీస్ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 68 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో స్కాట్ బోలాండ్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
చదవండి: Sourav Ganguly Covid Positive: ఆస్పత్రిలో చేరిన గంగూలీ...
INSANE! Scott Boland takes two in the over! #OhWhatAFeeling #Ashes | @Toyota_Aus pic.twitter.com/Uhk046VGG6
— cricket.com.au (@cricketcomau) December 27, 2021