
40 రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన యాషెస్ సిరీస్‌కు ఎండ్ కార్డ్ పడింది. లండన్ వేదికగా జరిగిన యాషెస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమమైంది. అయితే గత సిరీస్‌ను గెలిచిన ఆసీస్ వద్దే ‘యాషెస్’ ఉండిపోనుంది. ఇక ఆఖరి రోజు 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్ స్కోరు 135/0తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా 94.4 ఓవర్లలో 334 పరుగుల వద్ద ఆలౌటైంది.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఉస్మాన్ ఖ్వాజా(72), డేవిడ్ వార్నర్(60), స్టీవ్ స్మిత్(54) పరుగులతో రాణించినప్పటికీ.. ఓటమి మాత్రం తప్పలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. మొయిన్ అలీ మూడు, బ్రాడ్ రెండు వికెట్లు సాధించారు.
కెరీర్‌లో చివరి వికెట్
ఇక ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తన టెస్టు కెరీర్‌కు చిరస్మణీయ ముగింపు పలికాడు. తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన బ్రాడ్.. రెండు కీలక వికెట్లు పడగొట్టి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. క్రీజులో పాతుకుపోయిన ఆసీస్ బ్యాటర్ అలెక్స్ క్యారీని ఔట్ చేసి.. చారిత్రత్మక యాషెస్ సిరీస్‌ను సమం చేశాడు. ఆస్ట్రేలియా ఆఖరి రెండు వికెట్లు కూడా బ్రాడ్ సాధించినవే కావడం గమానార్హం.
కాగా బ్రాడ్ ఫేర్‌వెల్ మ్యాచ్ చూడటానికి అతడి కుటంబ సభ్యులు స్టేడియంకి వచ్చారు. బ్రాడ్ తన కెరీర్ చివరి వికెట్ సాధించిగానే.. స్టాండ్స్‌లో ఉన్న అతడి కుటంబ సభ్యులు ఆనందంలో మునిగి తెలిపోయారు. కాగా అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 80 ఓవర్‌లోఆఖరి బంతిని బ్రాడ్ అద్భుతమైన సిక్సర్ మలిచాడు. అదే అతడి కెరీర్‌లో చివరి బంతి కావడం గమానర్హం. అదే విధంగా బౌలింగ్‌లో కూడా ఆఖరి బంతిని వికెట్‌తోనే ముగించడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రికార్డుల రారాజు..
కెరీర్‌లో 167 టెస్ట్‌లు, 121, వన్డేలు, 56 టీ20లు ఆడిన బ్రాడ్ ఎన్నో రికార్డులను నమోదు చేశాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు (604) తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన బ్రాడ్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ పలు రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్‌ల్లో బ్రాడ్ 244 ఇన్నింగ్స్‌లు ఆడి 3662 పరుగులు చేశాడు. ఇతని ఖాతాలో సెంచరీ (169), 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: ENG vs AUS: ఆఖరి మజిలీలో ఇంగ్లండ్‌దే విక్టరీ.. విజయంతో బ్రాడ్ విడ్కోలు
A fairytale ending for a legend of the game.
— England Cricket (@englandcricket) July 31, 2023
Broady, thank you ❤️ #EnglandCricket | #Ashes pic.twitter.com/RUC5vdKj7p