దిగ్గజ ఫాస్ట్ బౌలర్, ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేట్ స్టువర్ట్ బ్రాడ్ తన కెరీర్‌లో చివరాఖరి మ్యాచ్‌లో ఓ రికార్డు నమోదు చేశాడు. 37 ఏళ్ల బ్రాడీ అంతర్జాతీయ కెరీర్‌లో తానెదుర్కొన్న ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచి రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో బ్రాడ్ టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకాడు. కెరీర్‌లో 167 టెస్ట్‌లు ఆడిన బ్రాడ్ 55 సిక్సర్లు బాది బెన్ స్టోక్స్ (124), కెవిన్ పీటర్సన్ (81), ఆండ్రూ ఫ్లింటాఫ్ (78), ఇయాన్ బోథమ్ (67) తర్వాతి స్థానాల్లో నిలిచాడు.
Most sixes for England in Tests:
— CricTracker (@Cricketracker) July 30, 2023
124* - Ben Stokes
81 - K Pietersen
78 - A Flintoff
67 - I Botham
55 - Stuart Broad@StuartBroad8 ends his Test career with fifth-most sixes for Englandpic.twitter.com/xLrFzLqIcd
ఆఖరి టెస్ట్ కావడంతో బ్యాటింగ్‌కు దిగే ముందు ఆసీస్ ఆటగాళ్ల నుంచి గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్న బ్రాడ్.. అభిమానుల కేరింతలు, చప్పట్ల ధ్వనుల మధ్య క్రీజ్‌లోకి వచ్చాడు. వచ్చీ రాగానే (నాలుగో రోజు తొలి ఓవర్ ఆఖరి బంతి) స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్ బాది స్టేడియంలో ఉన్నవారిని ఉర్రూతలూగించాడు.
Australia wins hearts with their gesture.pic.twitter.com/5ewxALuy44
— CricTracker (@Cricketracker) July 30, 2023
అనంతరం మర్ఫీ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో ఆండర్సన్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 395 పరుగుల వద్ద ముగిసింది. కెరీర్‌లో ఆఖరి ఇన్నింగ్స్‌లో బ్రాడ్ (8, సిక్స్) నాటౌట్‌గా మిగిలాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ సాధించిన స్వల్ప లీడ్‌ను తీసేస్తే ఆ జట్టు టార్గెట్ 384 పరుగులైంది.
ఛేదనకు దిగిన ఆసీస్.. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి 24 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (39), డేవిడ్ వార్నర్ (30) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ విజయానికి 309 పరుగులు, ఇంగ్లండ్ గెలుపుకు 10 వికెట్లు కావాలి.
కాగా, కెరీర్‌లో 167 టెస్ట్‌లు, 121, వన్డేలు, 56 టీ20లు ఆడిన బ్రాడ్ ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు (602) తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన బ్రాడ్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ పలు రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్‌ల్లో బ్రాడ్ 244 ఇన్నింగ్స్‌లు ఆడి 3662 పరుగులు చేశాడు. ఇతని ఖాతాలో సెంచరీ (169), 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment