లండన్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియాతో తలపడేందుకు ఆస్ట్రేలియా జట్టు సిద్దమైంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా ఉన్న ఆసీస్.. భారత జట్టు ఎలాగైనా ఓడించి విశ్వవిజేతగా నిలవాలని భావిస్తోంది.
అయితే ఈ కీలక మ్యాచ్‌కు ఆ జట్టు స్టార్ పేసర్ హాజల్‌వుడ్ గాయం కారణంగా దూరం కావడం ఆసీస్‌కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఈ ఫైనల్ మ్యాచ్ బుధవారం(జూన్ 7) నుంచి జూన్ 11వరకు జరగనుంది.
హాజల్‌వుడ్ స్థానంలో బోలండ్...
ఇక భారత్‌తో పోలిస్తే ఆ్రస్టేలియాకు తమ తుది జట్టు విషయంలో పూర్తి స్పష్టత ఉంది. వార్నర్ పునరాగమనంతో హ్యాండ్స్‌కోంబ్‌ను తప్పించగా, గాయ పడిన హాజల్‌వుడ్ స్థానంలో మరో పేసర్ బోలండ్‌కు స్థానం దక్కింది. ముగ్గురు రెగ్యులర్ పేసర్లతో పాటు కామెరాన్ గ్రీన్ రూపంలో మరో మీడియం పేసర్ అందుబాటులో ఉన్నాడు.
ఐపీఎల్ ఆడిన వార్నర్, గ్రీన్ మినహా మిగతావారంతా టెస్టు స్పెష లిస్ట్‌లుగా ఈ మ్యాచ్ కోసం ఆసీస్ గడ్డపై పూర్తి స్థాయి లో సిద్ధమయ్యారు. ఓవల్ పరిస్థితులు తమ దేశంలోలాగే ఉండటం ఆ జట్టుకు సానుకూలాంశం.
ఆస్ట్రేలియా తుది జట్టు(అంచనా): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్) స్కాట్ బోలాండ్, నాథన్ లియోన్
చదవండి: Odisha Train Accident: రైలు ప్రమాద బాధితులకు ధోనీ రూ.60 కోట్ల సాయం.. ఈ వార్తల్లో నిజమెంత?
Comments
Please login to add a commentAdd a comment