WTC 2021 23 Points Table Update After Aus Win Ashes Series: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడో టెస్టులో ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా చిత్తుగా ఓడించింది. ఇన్నింగ్స్ మీద 14 పరుగుల తేడాతో పర్యాటక జట్టును మట్టికరిపించి ట్రోఫీని దక్కించుకుంది. అరంగేట్ర ఆటగాడు స్కాట్ బోలాండ్ సంచలన బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్ల ఆటకట్టించడంతో మూడో రోజే ఆటకు ముగింపు పడింది. ఈ క్రమంలో 3-0 తేడాతో కంగారూలు యాషెస్ సిరీస్‌ను సొంతం చేసుకున్నారు.
తద్వారా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్నారు. కాగా 2021-23 ఏడాదిలో ఆసీస్‌కు ఇదే తొలి టెస్టు సిరీస్. ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడు ఏకపక్ష విజయాలతో 36 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ఇక ఒక సిరీస్ పూర్తిచేసుకున్న శ్రీలంక రెండు విజయాల(24 పాయింట్లు)తో రెండో స్థానంలో ఉండగా... రెండు సిరీస్‌లు ఆడిన పాకిస్తాన్ మూడు విజయాలతో మూడో స్థానంలో ఉంది.
ఇప్పటికే న్యూజిలాండ్‌తో స్వదేశంలో ఒకటి, ఇంగ్లండ్‌తో మరొక సిరీస్ ఆడిన టీమిండియా 3 విజయాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం కోహ్లి సేన దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే.
యాషెస్ సిరీస్- మూడో టెస్టులో ఆసీస్ ఘన విజయం- స్కోర్లు:
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 267 ఆలౌట్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 185 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్- 68 ఆలౌట్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: స్కాట్ బోలాండ్(మొత్తంగా 7 వికెట్లు)
చదవండి: Ind v Sa 1st Test: లంచ్ మెనూ ఫొటో వైరల్.. ఆట రద్దైందని మేము బాధపడుతుంటే.. ఇదంతా అవసరమా?
Who's writing Scott Boland's script!? 😱
— cricket.com.au (@cricketcomau) December 28, 2021
The England captain snicks off and Boland has four! 🤯 #Ashes pic.twitter.com/tjFrwDHLte
Australia on 🔝
— ICC (@ICC) December 28, 2021
Here's how the #WTC23 table is taking shape after the third #Ashes Test in Melbourne 🔢 pic.twitter.com/Nc2RcwluJz
Comments
Please login to add a commentAdd a comment